దేశంలో పదివేల ఐటిఐల ఏర్పాటు: మంత్రి

రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా పది వేల ఐటిఐలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికా సంఘం ఆమోదం తెలిపిందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖామంత్రి నారాయణస్వామి న్యూఢిల్లీలో తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 19 Oct 2009 | 9:38 am

ఇరాన్‌‍ దాడుల్లో మా ప్రమేయం లేదు: పాక్

ఇరాన్‌లో ఆదివారం జరిగిన ఆత్మాహుతి దాడుల్లో పాకిస్థాన్ భద్రతా దళాలకు చెందిన ఏజెంట్ల ప్రమేయం ఉన్నట్లు ఇరాన్ అధ్యక్షుడు ఆరోపించడంతో పాక్ విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి అబ్దుల్ బసీన్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాకిస్థాన్ ప్రభుత్వానికి ఎలాంటి ఉగ్రవాద సంస్థలతో సంబంధం లేదని, ఆదివారం ఇరాన్‌లో జరిగిన ఆత్మాహుతి దాడులకు పాకిస్థాన్‌కు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.
Source: Yahoo! Telugu: News | 19 Oct 2009 | 8:54 am

సత్యం కేసును విచారించేందుకు కొత్త కమిటీ

సత్యం కంప్యూటర్స్ సంస్థలో జరిగిన వేలాది కోట్ల రూపాయల కుంభకోణానికి సంబంధిచిన విచారణను మరింత వేగవంతం చేయాలని మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ, సిబిఐతో సహా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ల నుంచి కూడా పలుమార్లు అభ్యర్థనలు రావటంతో కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త కమిటీని ఏర్పాటు చేసింది.
Source: Yahoo! Telugu: News | 19 Oct 2009 | 8:33 am

జగన్‌ను అధిష్టానం పిలిచింది: సత్యవతి

వైఎస్.జగన్‌కు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. ఈనెల 23వ తేదీన జగన్‌‌ ఢిల్లీ రావాలని, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అపాయింట్‌మెంట్ ఇచ్చినట్లు ఎమ్మల్యే సత్యవతి తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 19 Oct 2009 | 7:44 am

థాయ్‌‌లాండ్‌లో బాంబు దాడులు: పలువురికి గాయాలు

దక్షిణ థాయ్‌లాండ్‌లోని యాలా పట్టణంలోనున్న జనసమర్థంగానున్న బజారులో సోమవారం ఉదయం గం.7.30లకు ఓ మోటార్ బైక్‌లోనున్న బాంబు పేలడంతో 24 మందికి తీవ్ర గాయాలైనాయని పోలీలు తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 19 Oct 2009 | 7:23 am

తాలిబన్లను ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధం: ఆంటోని

తాలిబన్లను తాము ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని భారత రక్షణ శాఖామంత్రి ఎ.కే.ఆంటోని అన్నారు. ఉగ్రవాదులు కల్పించే ఎలాంటి పరిస్థితినైనా తాము ఎదుర్కొనేందుకు సిద్ధమని ఆయన వెల్లడించారు
Source: Yahoo! Telugu: News | 19 Oct 2009 | 6:55 am

నేటి బులియన్ మార్కెట్ ధరలు

నేటి బులియన్ మార్కెట్‌లో బంగారు, వెండి ధరలు ఇలా ఉన్నాయి... హైదరాబాద్ 24 క్యారెట్ - రూ. 16,270 - రూ. 16,300, వెండి కిలో - రూ. 27,500 - రూ. 27,800. చెన్నై 24 క్యారెట్ - రూ. 16,050 - రూ. 16,050, వెండి కిలో - రూ. 28,655 - రూ. 28,715. విజయవాడ - రూ. 16,240 - రూ. 16,240, వెండి కిలో - రూ. 28,000 - రూ. 28,000.
Source: Yahoo! Telugu: News | 19 Oct 2009 | 6:50 am

నేటి ఫారంగేట్ మార్కెట్ ధరలు

నేటి ఫారంగేట్ మార్కెట్ ధరలు ఇలా ఉన్నాయి... హైదరాబాద్ (ఒక గుడ్డు) - రూ. 2.40 (వంద గుడ్లు) - రూ. 220 విజయవాడ - రూ. 219 విశాఖపట్నం - రూ. 224 చెన్నై - 232 నమక్కల్ - రూ. 233
Source: Yahoo! Telugu: News | 19 Oct 2009 | 6:36 am

స్వైన్‌ఫ్లూతో మరో ఐదుమంది మృతి

దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆదివారం నాడు స్వైన్‌ఫ్లూ మహమ్మారి బారినపడి ఐదు మంది మృతి చెందారు. దీంతో దేశవ్యాప్తంగా మహమ్మారి బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 413కు చేరుకుంది.
Source: Yahoo! Telugu: News | 19 Oct 2009 | 5:59 am

కృష్ణా జిల్లాలో మాజీ సర్పంచ్ దారుణ హత్య

కృష్ణా జిల్లాలోని పెనుగంచిప్రోలు మండలం నవాబుపేటకు చెందిన మాజీ సర్పంచ్, కాంగ్రెస్‌నాయకుడు గింజుపల్లి వీరయ్యచౌదరిని సోమవారం ఉదయం ఆయన ప్రత్యర్థులు దారుణంగా నరికి చంపారు. స్థానికంగానున్న శివాలయంలో పడివున్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. నెలరోజుల క్రితం తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడు ఆలూరి బుచ్చయ్య చౌదరి అనుమానాస్పదంగా హత్యకు గురయ్యారు.
Source: Yahoo! Telugu: News | 19 Oct 2009 | 5:39 am

దేశంలో పదివేల ఐటిఐల ఏర్పాటు: మంత్రి

రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా పది వేల ఐటిఐలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికా సంఘం ఆమోదం తెలిపిందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖామంత్రి నారాయణస్వామి న్యూఢిల్లీలో తెలిపారు.
Source: జాతీయ | 19 Oct 2009 | 4:09 am

జగన్‌ను అధిష్టానం పిలిచింది: సత్యవతి

వైఎస్.జగన్‌కు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. ఈనెల 23వ తేదీన జగన్‌‌ ఢిల్లీ రావాలని, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అపాయింట్‌మెంట్ ఇచ్చినట్లు ఎమ్మల్యే సత్యవతి తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 19 Oct 2009 | 2:15 am

కృష్ణా జిల్లాలో మాజీ సర్పంచ్ దారుణ హత్య

కృష్ణా జిల్లాలోని పెనుగంచిప్రోలు మండలం నవాబుపేటకు చెందిన మాజీ సర్పంచ్, కాంగ్రెస్‌నాయకుడు గింజుపల్లి వీరయ్యచౌదరిని సోమవారం ఉదయం ఆయన ప్రత్యర్థులు దారుణంగా నరికి చంపారు. స్థానికంగానున్న శివాలయంలో పడివున్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. నెలరోజుల క్రితం తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడు ఆలూరి బుచ్చయ్య చౌదరి అనుమానాస్పదంగా హత్యకు గురయ్యారు.
Source: ఏపీ న్యూస్ | 19 Oct 2009 | 1:39 am

తాలిబన్లను ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధం: ఆంటోని

తాలిబన్లను తాము ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని భారత రక్షణ శాఖామంత్రి ఎ.కే.ఆంటోని అన్నారు. ఉగ్రవాదులు కల్పించే ఎలాంటి పరిస్థితినైనా తాము ఎదుర్కొనేందుకు సిద్ధమని ఆయన వెల్లడించారు
Source: జాతీయ | 19 Oct 2009 | 1:32 am

స్వైన్‌ఫ్లూతో మరో ఐదుమంది మృతి

దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆదివారం నాడు స్వైన్‌ఫ్లూ మహమ్మారి బారినపడి ఐదు మంది మృతి చెందారు. దీంతో దేశవ్యాప్తంగా మహమ్మారి బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 413కు చేరుకుంది.
Source: జాతీయ | 19 Oct 2009 | 12:30 am

నేడు ప్రారంభం కానున్న పివి ఎక్స్‌ప్రెస్‌ ఫ్లైఓవర్ వే

దేశంలోనే అత్యంత పొడవైన ప్లై ఓవర్‌గా గుర్తింపు పొందిన పి.వి.నర్సింహారావు ఎలివేటెడ్‌ ఎక్ప్‌ప్రెస్‌ వే సోమవారం సాయంత్రం ప్రారంభానికి నోచుకోనుంది. హెచ్‌ఎండిఏ చేపట్టిన ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులో ఒకటిగా నిలిచిన పివి కారిడార్‌ను పూర్తి చేసేందుకు హమ్డా అన్ని జాగ్రత్తలు తీసుకుంది.
Source: ఏపీ న్యూస్ | 18 Oct 2009 | 11:52 pm

పీఎఫ్ కుంభకోణం కేసు: ప్రధాన నిందితుని మృతి

కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే భవిష్య నిధి (ప్రావిడెంట్ ఫండ్) కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడైన అశుతోష్ అస్తానా.. అనుమానస్పద రీతిలో మృతి చెందారు. దీంతో ఆయన మృతికి సంబంధించి సీబీఐ విచారణ చేయించాల్సింది అశుతోష్ కుటంబ సభ్యులు డిమాండ్ చేశారు.
Source: జాతీయ | 18 Oct 2009 | 10:08 pm

కిరాయి హీరో.. తండ్రిని చంపి "ఘటికుడు" అవుతాడా?

నటీనటులు: సూర్య, నయనతార, భరత్ మురళీ, డిస్కో ఆనంద్, బి. సరోజాదేవి తదితరులు దర్శకత్వం: కె.ఎస్. రవికుమార్,నిర్మాత: చందన రమేష్.సినిమాకు టైటిల్ ప్రధానం. టైటిల్‌ను బట్టే ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అందులో ఎంత పెద్ద హీరో లేదా గ్లామర్ హీరోయిన్ ఉన్నప్పటికి.. కథకు సరిపడా టైటిల్ ఉంటే చూడ్డానికి, వినడానికి బాగుంటుంది. కొన్ని సినిమాలకు టైటిల్సే అతకవు. అసలు పొంతనే ఉండదు. అలాంటి కోవలోనే సూర్య నటించిన "ఘటికుడు" సినిమాను చెప్పుకోవచ్చు. తమిళంలో తీసిన "ఆదవన్" చిత్రాన్ని తెలుగులో ఘటికుడుగా అనువదించారు. దీపావళికి ఈ సినిమా విడుదలైంది. ముందునుంచి అత్యంత భారీ చిత్రంగా దీన్ని తీర్చిదిద్దామని ప్రకటనలు గుప్పించి, సూర్యను హైస్కూల్ చదివే విద్యార్థిగా వాడినందుకు గ్రాఫిక్స్‌కు అధికంగా ఖర్చయిందని ఎన్ని కబుర్లు చెప్పినా.. కథలో పెద్దగా ట్విస్ట్‌లేకపోవడం, సాదాసీదాగా సాగే గమనంతో ఎంతో ఊహించుకుని వచ్చిన ప్రేక్షకులను ఘటికుడు నిరుత్సాహపరుస్తాడనే చెప్పాలి.
Source: Yahoo! Telugu: Entertainment | 18 Oct 2009 | 10:25 am

రాష్ట్రంలో ప్రారంభమైన అత్తల సంఘం

రాష్ట్రంలో కోడళ్ళతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న అత్తలు కలిసి ఆంధ్రప్రదేశ్ మదర్-ఇన్-లాస్ ప్రొటెక్షన్ అసోసియేషన్ సంస్థను స్థాపించారు.
Source: ఏపీ న్యూస్ | 18 Oct 2009 | 6:44 am

అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం: కేసీఆర్

హైదరాబాద్ ఫ్రీజోన్ అంశంపై రాష్ట్ర అసెంబ్లీలో తమ పార్టీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతుందని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు అన్నారు.
Source: ఏపీ న్యూస్ | 18 Oct 2009 | 5:11 am

ముంబైలో అమెరికా సైనిక విమానం

అమెరికాకు చెందిన సైనిక రవాణ విమానాన్ని భారత వాయు సేన అత్యవసరంగా ముంబై విమానాశ్రయంలో దించివేసింది. తాము దింపివేసిన విమానం ముందస్తు అనుమతి లేకుండా ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు తమ గగనతలంలోకి ప్రవేశించిందని ముంబై విమానాశ్రయాధికారులు తెలిపారు.
Source: జాతీయ | 18 Oct 2009 | 4:48 am

సముద్రంలో గల్లంతైన కాకుల ప్రియుడు!

కాకి పేరు వింటేనే ఆమడ దూరం పరుగులెత్తుతాం. అదే కాకి తలపై కొట్టి వెళ్ళినా లేదా మనపై రెట్ట వేసినా వెంటనే తలస్నానం చేసి, గుడికి వెళ్ళి అర్చన చేసుకుంటాం. ఇలా అందరూ చీదరించునే కాకులను ఆదరిస్తూ వాటికి ఆహారం పెడుతూ విశాఖపట్నం వాసులకు కాకుల శ్రీనివాసరావుగా పరిచితుడైన వ్యక్తి సముద్రంలో గల్లంతయ్యాడు.
Source: ఏపీ న్యూస్ | 18 Oct 2009 | 4:15 am

పళ్లిపట్టు బాధితులకు లక్షరూపాయల నష్ట పరిహారం: సీఎం

పళ్లిపట్టు బాధితులకు లక్షరూపాయల నష్ట పరిహారాన్ని అందజేయనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్య ప్రకటించారు. బాణసంచా గోడౌన్‌లో సంభవించిన అగ్నిప్రమాదంలో మరణించిన ఆంధ్రుల కుటుంబాలకు ఈ నష్టపరిహారం చెల్లించాలని సీఎం ఉత్తర్వులు జారీ చేశారు.
Source: ఏపీ న్యూస్ | 18 Oct 2009 | 3:37 am

రాజేశ్వరి మృతిలో నాకెలాంటి సంబంధం లేదు: ఎమ్మెల్యే

దేవరకద్ర వ్యవసాయాధికారి రాజేశ్వరి మృతిలో తనకెలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే సీతా దయాకర రెడ్డి అన్నారు. రాజేశ్వరి తన మరణవాంగ్మూలంలో ఎమ్మెల్యే సీతాదయారకర రెడ్డి వేధింపులే తన ఆత్మహత్యకు కారణమని పేర్కొన్నారు. అయితే ఈ సంఘటనలో తనెకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఈ విషయానికి సంబంధించి ఎలాంటి విచారణకైనా తాను సిద్ధంగా ఉన్నట్లు ఎమ్మెల్యే స్పష్టం చేశారు. తనపై వస్తోన్న ఆరోపణలు వారి కుటుంబ సభ్యుల విజ్ఞతకే వదిలేస్తున్నానని ఆయన చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 18 Oct 2009 | 3:26 am

ఫ్రీజోన్ విషయంలో న్యాయపోరాటం: కేసీఆర్

ఇటీవల సుప్రీంకోర్టు హైదరాబాద్‌ను ఫ్రీజోన్‌గా ప్రకటించిన నేపథ్యంలో సుప్రీంకోర్టుతో న్యాయపోరాటం చేస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావుఅన్నారు.
Source: ఏపీ న్యూస్ | 18 Oct 2009 | 3:16 am