భారతీయులపై మళ్ళీ దాడులు

శుక్రవారం రాత్రి మెల్‌బోర్న్ నగరంలో ముగ్గురు భారతీయ విద్యార్థులపై అజ్ఞాత వ్యక్తులు దాడులకు పాల్పడి వారి వద్దనున్న సొమ్మును దోచుకున్నారు.
Source: Yahoo! Telugu: News | 17 Oct 2009 | 9:37 am

రాష్ట్రపతితో భేటీ అయిన ప్రధాని మన్మోహన్

భారతప్రధాని మన్మోహన్ సింగ్ న్యూఢిల్లీలో శనివారం నాడు రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌తో బేటీ అయ్యారు. ఈ సందర్భంగా దేశ అంతరంగిక భద్రత, పలు అంతర్జాతీయ అంశాలపై ఇరువురి మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి.
Source: Yahoo! Telugu: News | 17 Oct 2009 | 9:12 am

ఫ్రీ జోన్‌పై నోరు మెదపని తెదేపా

హైదరాబాద్‌ను ఫ్రీజోన్‌గా ప్రకటిస్తూ సుప్రీం కోర్టు తీసుకున్న నిర్ణయంపై ప్రస్తుతం రాష్ట్రంలో ఫ్రీజోన్ విషయంగా పలుపార్టీలు చర్చలు లేవనెత్తాయి. కాని ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ మాత్రం ఏం మాట్లాడితే ఏం జరుగుతుందోననేది వారిలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 17 Oct 2009 | 8:48 am

బీహార్లో నాయకుల పేర్లతో టపాసులు

దేశవ్యాప్తంగా ప్రజలు దీపావళి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. పిల్లలు, పెద్దలు తమ తమ ఇళ్ళల్లో హడావుడి సందడి నెలకొంది. కాని బీహార్ టపాకాయల మార్కెట్లో రాజకీయ నాయకుల పేర్లతో కూడుకున్న టపాసులు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.
Source: Yahoo! Telugu: News | 17 Oct 2009 | 7:15 am

మొబైల్ బ్యాంకింగ్‌కు శ్రీకారం చుట్టిన ఎస్‌బీహెచ్

ప్రస్తుతం ఆన్‌లైన్ బ్యాంకింగ్‌కు తోడుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్‌బీహెచ్) మొబైల్ బ్యాంకింగ్ సేవలకు శ్రీకారం చుట్టింది. ఇలాంటి సేవలకు స్టేట్ బ్యాంక్ ఫ్రీడమ్ పేరును ఖరారు చేసిందని బ్యాంక్ తెలిపింది.
Source: Yahoo! Telugu: News | 17 Oct 2009 | 6:48 am

దీపావళి శుభాకాంక్షలు తెలిపిన రోశయ్య

ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కొణేటి రోశయ్య రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. వరద భీభత్సాన్ని దృష్టిలో ఉంచుకుని పండుగను నిరాడంబరంగా జరుపుకోవాలని ఆయన ప్రజలను కోరారు.
Source: Yahoo! Telugu: News | 17 Oct 2009 | 6:24 am

వాహనాల రద్దీ నుంచి విద్యుదుత్పత్తి

రోడ్లపై వాహనాల రద్దీ నుంచి విద్యుదుత్పత్తిని చేసేందుకు ఇజ్రాయిల్ దేశానికి చెందిన ఇనోవాటెక్‌ అనే కంపెనీ ప్రణాళికలు రూపొందించింది.
Source: Yahoo! Telugu: News | 17 Oct 2009 | 6:00 am

విదేశీ కరెన్సీ రేట్లు

విదేశీ కరెన్సీ రేట్లు ఈ విధంగా ఉన్నాయిఅమెరికా డాలరు కొనుగోలు రేటు (థామస్ కుక్) 43.50 అమ్మకపు రేటు (రూ.లలో) రూ. 48.65యూరో కరెన్సీ కొనుగోలు రేటు (థామస్ కుక్) 68.80 అమ్మకపు రేటు (రూ.లలో) రూ. 72.30జపాన్ యెన్ కొనుగోలు రేటు (థామస్ కుక్) 47.60 అమ్మకపు రేటు (రూ.లలో) రూ. 53.00సింగపూర్ డాలర్ కొనుగోలు రేటు (థామస్ కుక్) 30.45 అమ్మకపు రేటు రూ. 35.70.
Source: Yahoo! Telugu: News | 17 Oct 2009 | 5:45 am

నేటి బులియన్ మార్కెట్ ధరలు

నేటి బులియన్ మార్కెట్‌లో బంగారు, వెండి ధరలు ఇలా ఉన్నాయి.ముంబై మార్కెట్‌లో 99.9 రకం బంగారం 10 గ్రాములు ధర 15,905 నుంచి 15,880కి తగ్గింది. అలాగే 99.5 రకం బంగారం ధర రూ.16,170 నుంచి 16,050కి తగ్గింది. కిలో వెండి ధర రూ.27,800-27,475కి తగ్గింది.హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం (24 క్యారెట్లు) రూ. 16,150గా ఉంది. అలాగే ఆర్నమెంట్ బంగారం ధర రూ. 16,000గా ఉంది. కిలో వెండి ధర రూ.27,600గా ఉంది.చెన్నై మార్కెట్‌లో 24 క్యారెట్లు బంగారం ధర 15,890 నుంచి రూ.15,840కి పడిపోయింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.15,820 నుంచి 15,800కి తగ్గింది. కిలో వెండి ధర రూ.27,800-27,475కి తగ్గింది. కిలో వెండి ధర రూ.28,300 నుంచి 27,780 రూపాయలుగా ఉంది.
Source: Yahoo! Telugu: News | 17 Oct 2009 | 5:45 am

పెట్రోలు ధరలు పెంచేయోచన లేదు: మంత్రి

ముడి చమురు ధరలు అంతర్జాతీయ స్థాయిలో మార్పులు చెందడంతో దేశంలో పెట్రోలు, డీజల్ ధరలను పెంచేయోచనేదీ లేదని కేంద్ర పెట్రోలియం శాఖామంత్రి మురళీ దేవరా అన్నారు
Source: Yahoo! Telugu: News | 17 Oct 2009 | 5:33 am

జగన్‌కు అంత సీను లేదు: హర్షకుమార్

వైఎస్ జగన్మోహనరెడ్డికి ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదని ఎంపి. హర్షకుమార్ అన్నారు. అతనికున్నదల్లా ఒక్కటే అర్హత అని, అదికూడా అతను వైఎస్ కుమారుడవ్వడమేనని ఆయన శనివారం విలేకరులతో అన్నారు.
Source: ఏపీ న్యూస్ | 17 Oct 2009 | 4:35 am

రాష్ట్రపతితో భేటీ అయిన ప్రధాని మన్మోహన్

భారతప్రధాని మన్మోహన్ సింగ్ న్యూఢిల్లీలో శనివారం నాడు రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌తో బేటీ అయ్యారు. ఈ సందర్భంగా దేశ అంతరంగిక భద్రత, పలు అంతర్జాతీయ అంశాలపై ఇరువురి మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి.
Source: జాతీయ | 17 Oct 2009 | 3:51 am

ఫ్రీ జోన్‌పై నోరు మెదపని తెదేపా

హైదరాబాద్‌ను ఫ్రీజోన్‌గా ప్రకటిస్తూ సుప్రీం కోర్టు తీసుకున్న నిర్ణయంపై ప్రస్తుతం రాష్ట్రంలో ఫ్రీజోన్ విషయంగా పలుపార్టీలు చర్చలు లేవనెత్తాయి. కాని ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ మాత్రం ఏం మాట్లాడితే ఏం జరుగుతుందోననేది వారిలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది.
Source: ఏపీ న్యూస్ | 17 Oct 2009 | 3:20 am

బీహార్లో నాయకుల పేర్లతో టపాసులు

దేశవ్యాప్తంగా ప్రజలు దీపావళి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. పిల్లలు, పెద్దలు తమ తమ ఇళ్ళల్లో హడావుడి సందడి నెలకొంది. కాని బీహార్ టపాకాయల మార్కెట్లో రాజకీయ నాయకుల పేర్లతో కూడుకున్న టపాసులు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.
Source: జాతీయ | 17 Oct 2009 | 1:46 am

దీపావళి శుభాకాంక్షలు తెలిపిన రోశయ్య

ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కొణేటి రోశయ్య రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. వరద భీభత్సాన్ని దృష్టిలో ఉంచుకుని పండుగను నిరాడంబరంగా జరుపుకోవాలని ఆయన ప్రజలను కోరారు.
Source: ఏపీ న్యూస్ | 17 Oct 2009 | 12:55 am

పళ్ళిపట్టులో మళ్ళీ పేలుళ్ళు, తప్పిన ప్రమాదం

తమిళనాడులోని తిరువళ్ళూరు జిల్లాలోనున్న పళ్ళిపట్టులో శనివారం ఉదయం మళ్ళీ పేలుళ్ళు జరిగాయి. పళ్ళిపట్టులోని బాణసంచా గోడౌన్‌లో శనివారం ఉదయం మళ్ళీ పేలుళ్ళు సంభవించాయి. దీంతో స్థానిక ప్రజలు బెంబేలెత్తారు. పోలీసులు గోడౌన్ షట్టర్ మూసేసి స్థానికులను చెదరగొట్టారు
Source: జాతీయ | 16 Oct 2009 | 11:38 pm

రాష్ట్రానికి సాయమందించనున్న కేరళ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇటీవల సంభవించిన వరద బీభత్సం భారీ నష్టాన్ని మిగిల్చింది. దీంతో కేరళ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కోటి రూపాయల ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి పంపనున్నట్లు ప్రకటించింది.
Source: ఏపీ న్యూస్ | 16 Oct 2009 | 10:57 pm

అందరికీ శుభం జరగాలి: రాష్టప్రతి, ప్రధాని శుభాకాంక్షలు

భారతదేశం వ్యాప్తంగా ఈ రోజు జరుపుకుంటున్న దీపావళి పండుగ సందర్భంగా భారత రాష్టప్రతి ప్రతిభా పాటిల్‌, ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌ శుక్రవారం ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
Source: జాతీయ | 16 Oct 2009 | 9:50 pm

పేలుళ్ళతో హోరెత్తిన పళ్ళిపట్టు

తమిళనాడు రాష్ట్రానికి చెందిన పళ్ళిపట్టు పట్టణం రాధానగర్‌లోని ఓ బాణాసంచా గోడౌన్‌లో శుక్రవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 42 మంది వరకు మృతి చెందినట్టు సమాచారం. ఆస్తి నష్టం పదిలక్షలపై మేరకే ఉండొచ్చని ప్రాథమిక అంచనా. మృతుల్లో దాదాపు 27 మందికిపైగా చిత్తూరు జిల్లాకు చెందినవారేనని అధికారులు తెలిపారు.
Source: జాతీయ | 16 Oct 2009 | 9:35 pm

వర్మ "రక్త చరిత్ర" ఎలా తీస్తాడో చూస్తాం: ఫ్యాక్షన్ లీడర్స్

పరిటాల రవి, సూరి వర్గాల మధ్య బుసలుగొట్టిన ఫ్యాక్షన్ తగాదాల యధార్థ గాధను తెరకెక్కించేందుకు రామ్ గోపాల్ వర్మ పూనుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వర్మకు పలు బెదిరింపులు వస్తున్నట్లు తెలుస్తోంది. తమకు సంబంధించిన సంఘటనలను వక్రీకరించి చూపిస్తే ఊరుకోబోమని అనంతపురం ఫ్యాక్షన్ లీడర్స్ హెచ్చరిస్తున్నారు. అసలు వర్మ అనంతపురంలో "రక్త చరిత్ర" షూటింగ్ ఎలా చేస్తాడో చూస్తామంటున్నారు. మరోవైపు పరిటాల రవి అర్థాంగి పరిటాల సునీత మాట్లాడుతూ... రక్త చరిత్ర చిత్రాన్ని వర్మ ఫ్యాక్షన్ రాజకీయాలు విడనాడాలనే కోణంలో తీస్తారని అనుకుంటున్నట్లు వెల్లడించారు. అలాకాక ప్రోత్సహించే విధంగా ఉన్నట్లు తెలిస్తే, తానుకూడా ఆ చిత్ర షూటింగ్‌ను అడ్డుకుంటానని చెప్పారు.
Source: Yahoo! Telugu: Entertainment | 16 Oct 2009 | 3:02 pm

23న కళ్యాణ్‌రామ్, హన్సికల "జయీభవ"

ఎనర్జిటిక్ నందమూరి కళ్యాణ్‌రామ్ హీరోగా నటిస్తూ.. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తోన్న "జయీభవ" చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా హీరో, నిర్మాత నందమూరి కళ్యాణ్‌రామ్ మాట్లాడుతూ.. జయీభవ ఆడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందన్నారు. థమస్ ఎస్ అందించిన సంగీతంతో ఆడియోను హిట్ చేసిన శ్రోతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. అక్టోబర్ 23న జయీభవ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని వెల్లడించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 16 Oct 2009 | 11:28 am

పాటల చిత్రీకరణలో బాలయ్య "సింహా"

బొబ్బిలిసింహం, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, లక్ష్మీనరసింహా వంటి సెన్సేషనల్ హిట్ చిత్రాల కథానాయకుడు యువరత్న బాలకృష్ణ హీరోగా, భద్ర, తులసి వంటి సూపర్‌హిట్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్నంలో రూపుదిద్దుకుంటోన్న భారీ చిత్రం "సింహా". యునైటెడ్ మూవీస్ పతాకంపై పరుచూరి కిరీటి నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి సంబంధించిన పాటల చిత్రీకరణ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 16 Oct 2009 | 11:03 am

విక్రమ్, కలర్స్‌స్వాతి హీరోహీరోయిన్లుగా భారీ చిత్రం!

అపరిచితుడు, శివపుత్రుడు, మల్లన్న వంటి సూపర్‌హిట్ చిత్రాల కథానాయకుడు విక్రమ్ హీరోగా, 7జి బృందావన్‌కాలనీ, ఆడవాళ్ళ మాటలకు అర్థాలు వేరులే వంటి బంపర్‌హిట్ చిత్రాల దర్శకుడు శ్రీ రాఘవ రూపొందిస్తోన్న భారీ చిత్రం షూటింగ్ అక్టోబర్ 18న ప్రారంభం కానుంది. ఇంకా కనకరత్న మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శింగనమల రమేష్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం.
Source: Yahoo! Telugu: Entertainment | 16 Oct 2009 | 10:50 am

పళ్ళిపట్టులో బాణసంచా దుకాణంలో పేలుళ్ళు: నలుగురి మృతి

చిత్తూరు జిల్లాలోని పళ్ళిపట్టులో బాణసంచా దుకాణంలో శుక్రవారం పేలుళ్ళు జరిగాయి. ఈ పేలుళ్ళ కారణంగా నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా పలువురు తీవ్రగాయాలపాలైనారు.
Source: ఏపీ న్యూస్ | 16 Oct 2009 | 9:35 am

సక్సెక్ "కిక్"లో ఇలియానా: "రెచ్చిపో"తున్న పారితోషికం

తెలుగువారు తనకు కావలసినంత పారితోషికాన్ని అడగక ముందే పెంచేస్తున్నారనీ, టాలీవుడ్ ప్రేక్షకుల అభిమానం తను వదులుకోలేననీ బక్కపలచని భామ ఇలియానా అంటోంది. బాలీవుడ్, కోలీవుడ్ సినీ పరిశ్రమల నుంచి అవకాశాలు వస్తున్నా.. వాటిని నిరాకరిస్తున్నాని చెపుతోందీ పర్ఫెక్ట్ బ్యూటీ. శరీరానికి అంటుకుపోయే బిగుతు దుస్తులు ధరిస్తూ, ఎద పొంగులను అలవోకగా ప్రదర్శిస్తూ టాలీవుడ్ కుర్రకారు హృదయాలలో గిలిగింతలు పెట్టే ఈ భామ సూపర్‌స్టార్ రజనీకాంత్ సరసన నటించే అవకాశాన్ని సైతం తిరస్కరించిందట. దీంతో తమిళ నిర్మాతలు ఇలియానాకు పొగరు కాస్త ఎక్కువ అని వారిలో వారు అనుకుంటున్నారట.
Source: Yahoo! Telugu: Entertainment | 16 Oct 2009 | 8:12 am

ఆర్తీ అగర్వాల్ "గాఢ చుంబన" ఫలితం... విడాకులు

నీలవేణిలో హీరో ముకుల్‌దేవ్‌కు గాఢ చుంబనం రుచి ఏమిటో చూపించింది బబ్లీ బ్యూటీ ఆర్తీ అగర్వాల్. ఈ ముద్దు సన్నివేశాన్ని చూసిన ఆర్తీ అమెరికా భర్త ఊగిపోయాడట. తక్షణమే ఆర్తీని వదిలించుకోవాలనుకుని, అందుకు తగిన విధంగా చర్యలు తీసుకోవడం ప్రారంభించాడట. అయితే అంతకంటే ముందే ఆర్తీ ఒక అడుగు ముందుకేసి తన భర్త నుంచి విడాకులు కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. అప్పట్లో యువనటుడు తరుణ్ తో ప్రేమ వ్యవహారం విఫలమై చివరికి ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఆర్తీ, ఆ తర్వాత టాలీవుడ్ ముఖం చూడకూడదని నిర్ణయించుకుని అమెరికా అబ్బాయిని ఏరికోరి చేసుకుంది. అయితే ఆ తర్వాత తిరిగి సినిమాలలో నటిస్తానని భర్త వద్ద మారాం చేసేదట. దానికతను ఒప్పుకోకపోవడంతో కొన్నాళ్లు తన నిర్ణయాన్ని వాయిదా వేసుకుందట. ఇటీవల టాలీవుడ్ కు ల్యాండ్ అయిన తర్వాత వరుసగా సినిమాలు చేసేందుకు సంతకాలు చేస్తూ బిజీ అయిపోయింది. ఈ క్రమంలో ఇటీవల ఆమె నటించిన నీలవేణిలో గాఢ చుంబన సన్నివేశంలో నటించడంతో ఆర్తీ- అమెరికా అబ్బాయి వివాహ బంధానికి బీటలు వారినట్లు ఫిలిమ్ నగర్ సినీజనం అనుకుంటున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 16 Oct 2009 | 7:38 am

మెజారిటీ ఎమ్మెల్యేల అభీష్టం అదే: మంత్రి రఘువీరా

వైఎస్.రాజశేఖర్ రెడ్డి తనయుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నది మెజారిటీ ఎమ్మెల్యేల కోరిక అని రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి ఎన్.రఘువీరా రెడ్డి అన్నారు. ఆయన హైదరాబాద్‌లో మాట్లాడాతూ.. ప్రజల అభిప్రాయాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Source: ఏపీ న్యూస్ | 16 Oct 2009 | 6:58 am

భారత్‌లో దాడులు జరగవచ్చు: ఆస్ట్రేలియా హెచ్చరిక

పండగల సీజన్‌లో ఉన్న రద్దీని ఆసరాగా తీసుకుని తీవ్రవాదులు భారత్‌లోని ముఖ్య నగరాల్లో దాడులకు తెగబడవచ్చని ఆస్ట్రేలియా, ఇజ్రాయేల్ నిఘా సంస్థలు హెచ్చరించాయి.
Source: జాతీయ | 16 Oct 2009 | 6:48 am

నేను మారాను.. ప్రజలే మారలేదు: చిరంజీవి

తాను సినీ స్టార్ హోదా నుంచి రాజకీయ నేతగా మారానని, కానీ ప్రజలు మాత్రం మారడం లేదని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి అభిప్రాయపడ్డారు. మూడు దశాబ్దాల పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నందు వల్ల ప్రజలు ఇంకా ఆ కోణంలోనే తనను చూస్తున్నారని ఆయన అన్నారు.
Source: ఏపీ న్యూస్ | 16 Oct 2009 | 6:29 am

ప్రపంచంలోనే ఇవి అత్యంత సుందరమైనవట...!

సాయం సంధ్య వేళల్లో అస్తమించే సూర్యుడిని చూస్తూ.. పట్టుకుంటే సుతారంగా జారిపోయే సముద్రపు ఇసుకతో ఆడుకుంటూ.. కడలి అందాలను కళ్లతో జుర్రుకుంటూ.. అమాంతం చిన్నపిల్లలైపోవాలని ప్రతి ఒక్కరూ అనుకోవటం తప్పుకాదు. ఎందుకంటే, ఈ అనుభూతి చిన్నా, పెద్దా ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అందుకే కుటుంబంతో కలిసి ఆనందంగా విహరించే స్థలాల్లో సముద్ర తీరాలకు చాలామంది మొదటి స్థానాన్నిస్తుంటారు.
Source: వినోదం | 16 Oct 2009 | 6:16 am

హైదరాబాద్ ఫ్రీజోన్: 19న అఖిపలక్ష సమావేశం

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను ఫ్రీజోన్‌గా ప్రకటిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటీషన్ దాఖలు చేయాలా వద్దా అనే అంశంపై ప్రభుత్వం ఈనెల 19వ తేదీన అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయనుంది.
Source: ఏపీ న్యూస్ | 16 Oct 2009 | 5:36 am

ఛత్తీస్‌గఢ్‌లో 9 మంది మావోయిస్టుల అరెస్టు

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో తొమ్మిది మంది మావోయిస్టు గెరిల్లాలను పోలీసులు అరెస్టు చేశారు. బస్తర్ రీజియన్‌లో వీరిని అరెస్టు చేసినట్టు శుక్రవారం పోలీసులు వెల్లడించారు.
Source: జాతీయ | 16 Oct 2009 | 5:28 am

చిటికేస్తే కోట్లు వచ్చి పడుతాయ్: తెరాస చీఫ్ కెసీఆర్

కోట్లు కోసం టిక్కెట్లు అమ్ముకోవాల్సిన అగత్యం తనకు పట్టలేదు. చిటికేస్తే కోట్లాది రూపాయలు ముందు వచ్చి పడతాయని తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్ రావు అన్నారు. రూ.కోట్లు, ఆస్తులు సంపాదించాలనే ఏకైక లక్ష్యంతో తెలంగాణా ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయాల్లోకి రాలేదని ఆయన గుర్తు చేశారు.
Source: ఏపీ న్యూస్ | 16 Oct 2009 | 4:40 am

జగన్ స్థాయికి కేంద్రమంత్రి పదవి చాలు: హర్ష కుమార్

వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసునిగా ఆయన తనయుడు వైఎస్ జగన్‌ను ఎంపిక చేయాల్సిన అవసరం లేదని అమలాపురం ఎంపీ కె.హర్షకుమార్ అభిప్రాయపడ్డారు. అతని స్థాయికి కేంద్ర మంత్రి పదవి చాలని మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Source: ఏపీ న్యూస్ | 16 Oct 2009 | 4:21 am

సక్సెక్ "కిక్"లో ఇలియానా: "రెచ్చిపో"తున్న పారితోషికం

తెలుగువారు తనకు కావలసినంత పారితోషికాన్ని అడగక ముందే పెంచేస్తున్నారనీ, టాలీవుడ్ ప్రేక్షకుల అభిమానం తను వదులుకోలేననీ బక్కపలచని భామ ఇలియానా అంటోంది. బాలీవుడ్, కోలీవుడ్ సినీ పరిశ్రమల నుంచి అవకాశాలు వస్తున్నా.. వాటిని నిరాకరిస్తున్నాని చెపుతోందీ పర్ఫెక్ట్ బ్యూటీ. శరీరానికి అంటుకుపోయే బిగుతు దుస్తులు ధరిస్తూ, ఎద పొంగులను అలవోకగా ప్రదర్శిస్తూ టాలీవుడ్ కుర్రకారు హృదయాలలో గిలిగింతలు పెట్టే ఈ భామ...
Source: వినోదం | 16 Oct 2009 | 2:44 am