దీపావళి పండుగతో ఊపందుకున్న సెన్సెక్స్

దీపావళి పండుగ ప్రభావం బాంబే స్టాక్ మార్కెట్‌పై కూడా పడింది. శుక్రవారం ప్రారంభం నుంచి లాభాల్లో పయనిస్తోన్న బాంబే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్.. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో 107 పాయింట్లు వృద్ధి చెంది, 17,302 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 39 పాయింట్ల మేర బలపడి, 5, 148 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది.
Source: Yahoo! Telugu: News | 16 Oct 2009 | 9:35 am

అది... రాజకీయ మూర్ఖులకు అర్థం కాదు: కేసీఆర్

గత ఎన్నికల్లో మహాకూటమి ప్రయోగం సక్సెస్ అయింది. ఈ విషయం రాజకీయ మూర్ఖులకు అర్థం కాదు. రాష్ట్ర రాజకీయాలపై లోతైన అవగాహన నాలాంటి వారికే ఇది అర్థం అవుతుందని తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్ రావు అభిప్రాయపడ్డారు.
Source: Yahoo! Telugu: News | 16 Oct 2009 | 9:26 am

లాభాల బాటలో గూగుల్ సెర్చ్ఇంజన్

అగ్రగామిగానున్న వెబ్ సెర్చ్ ఇంజన్ గూగుల్ సెప్టెంబర్ 30తో ముగిసిన త్రైమాసికాంతానికి తన లాభాలు 27 శాతం పెరిగాయి. దీంతో కంపెనీ నికర లాభాలు 1.64 వందల కోట్ల డాలర్లకు చేరుకుందని సంస్థ ప్రధాన కార్యనిర్వహణాధికారి ఎరిక్ ఈ స్కమిట్ తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 16 Oct 2009 | 8:37 am

సక్సెక్ "కిక్"లో ఇలియానా: "రెచ్చిపో"తున్న పారితోషికం

తెలుగువారు తనకు కావలసినంత పారితోషికాన్ని అడగక ముందే పెంచేస్తున్నారనీ, టాలీవుడ్ ప్రేక్షకుల అభిమానం తను వదులుకోలేననీ బక్కపలచని భామ ఇలియానా అంటోంది. బాలీవుడ్, కోలీవుడ్ సినీ పరిశ్రమల నుంచి అవకాశాలు వస్తున్నా.. వాటిని నిరాకరిస్తున్నాని చెపుతోందీ పర్ఫెక్ట్ బ్యూటీ. శరీరానికి అంటుకుపోయే బిగుతు దుస్తులు ధరిస్తూ, ఎద పొంగులను అలవోకగా ప్రదర్శిస్తూ టాలీవుడ్ కుర్రకారు హృదయాలలో గిలిగింతలు పెట్టే ఈ భామ సూపర్‌స్టార్ రజనీకాంత్ సరసన నటించే అవకాశాన్ని సైతం తిరస్కరించిందట. దీంతో తమిళ నిర్మాతలు ఇలియానాకు పొగరు కాస్త ఎక్కువ అని వారిలో వారు అనుకుంటున్నారట.
Source: Yahoo! Telugu: Entertainment | 16 Oct 2009 | 8:12 am

లాభాల బాటలో పయనిస్తోన్న సెన్సెక్స్

శుక్రవారం ట్రేడింగ్ ప్రారంభం నుంచే లాభాలను నమోదు చేసుకున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ మధ్యాహ్నం రెండు గంట ప్రాంతంలోనూ యధావిధిగా వృద్ధి బాటలో పయనిస్తోంది. దీంతో సెన్సెక్స్ 139 పాయింట్లు లాభపడి, 17, 332 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 36 పాయింట్ల వృద్ధితో 5, 144 పాయింట్ల వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 16 Oct 2009 | 8:08 am

ఆంధ్రప్రదేశ్‌కు 320 మిలియన్ల ప్రపంచ బ్యాంకు రుణం

రాష్ట్రానికి ప్రపంచ బ్యాంకు 320 మిలియన్ డాలర్ల రుణాన్ని మంజూరు చేసింది. ఈ మొత్తాన్ని రాష్ట్రంలో సురక్షితమైన రోడ్లు, నాణ్యత తదితర అంశాల అభివృద్ధికి ఖర్చు చేయాల్సి ఉంటుంది.
Source: Yahoo! Telugu: News | 16 Oct 2009 | 7:52 am

ఆర్తీ అగర్వాల్ "గాఢ చుంబన" ఫలితం... విడాకులు

నీలవేణిలో హీరో ముకుల్‌దేవ్‌కు గాఢ చుంబనం రుచి ఏమిటో చూపించింది బబ్లీ బ్యూటీ ఆర్తీ అగర్వాల్. ఈ ముద్దు సన్నివేశాన్ని చూసిన ఆర్తీ అమెరికా భర్త ఊగిపోయాడట. తక్షణమే ఆర్తీని వదిలించుకోవాలనుకుని, అందుకు తగిన విధంగా చర్యలు తీసుకోవడం ప్రారంభించాడట. అయితే అంతకంటే ముందే ఆర్తీ ఒక అడుగు ముందుకేసి తన భర్త నుంచి విడాకులు కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. అప్పట్లో యువనటుడు తరుణ్ తో ప్రేమ వ్యవహారం విఫలమై చివరికి ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఆర్తీ, ఆ తర్వాత టాలీవుడ్ ముఖం చూడకూడదని నిర్ణయించుకుని అమెరికా అబ్బాయిని ఏరికోరి చేసుకుంది. అయితే ఆ తర్వాత తిరిగి సినిమాలలో నటిస్తానని భర్త వద్ద మారాం చేసేదట. దానికతను ఒప్పుకోకపోవడంతో కొన్నాళ్లు తన నిర్ణయాన్ని వాయిదా వేసుకుందట. ఇటీవల టాలీవుడ్ కు ల్యాండ్ అయిన తర్వాత వరుసగా సినిమాలు చేసేందుకు సంతకాలు చేస్తూ బిజీ అయిపోయింది. ఈ క్రమంలో ఇటీవల ఆమె నటించిన నీలవేణిలో గాఢ చుంబన సన్నివేశంలో నటించడంతో ఆర్తీ- అమెరికా అబ్బాయి వివాహ బంధానికి బీటలు వారినట్లు ఫిలిమ్ నగర్ సినీజనం అనుకుంటున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 16 Oct 2009 | 7:38 am

చైనా భారీ ప్రాజెక్టుపై వివరాల సేకరణ: విదేశాంగ శాఖ

బ్రహ్మపుత్ర నదిపై చైనా ప్రభుత్వం నిర్మిస్తున్న భారీ ప్రాజెక్టు వివరాలను తెలుసుకునేందుకు అన్నిరకాలుగా పరిశీలిస్తున్నట్టు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపారు. ఈ అంశంలో నిజాలను తెలుసుకునేందుకు నివేదిక కోసం ఎదురుచూస్తున్నట్టు చెప్పారు.
Source: Yahoo! Telugu: News | 16 Oct 2009 | 7:35 am

పేషావర్‌లో ఆత్మాహుతి దాడి: ఆరుగురి మృతి

పాకిస్థాన్‌లో నానాటికీ ఆత్మాహుతి దాడులు పెరిగిపోతున్నాయి. తాజాగా శుక్రవారం పేషావర్‌లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఇందులో ఆరుగురు మృతి చెందగా పలువురికి తీవ్రగాయాలైనాయి.
Source: Yahoo! Telugu: News | 16 Oct 2009 | 7:23 am

ఊపందుకున్న బ్యాకింగ్ వాటాల కొనుగోళ్లు: సెన్సెక్స్ వృద్ధి

బ్యాకింగ్ వాటాల కొనుగోళ్లు పుంజుకోవడంతో బాంబే స్టాక్ మార్కెట్ లాభాల్లో పయనిస్తోంది. శుక్రవారం ప్రారంభం నుంచే లాభదాయకంగా ప్రారంభమైన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో 143 పాయింట్లు పుంజుకుని, 17,342 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 39 పాయింట్లు వృద్ధి చెంది 5, 147 పాయింట్ల వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 16 Oct 2009 | 7:18 am

లేజర్ కొనుగోలుకు సిద్ధమైన పొలారిస్

దేశంలోని బ్యాంకులకు సాఫ్ట్‌వేర్ సేవలను అందించే లేజర్ సాఫ్ట్‌వేర్ సంస్థను పొలారిస్ సాఫ్ట్‌వేర్ ల్యాబ్ సొంతం చేసుకోనుంది. దీనికోసం పొలారిస్ సాఫ్ట్‌‍వేర్ ల్యాబ్ సంస్థ రూ.52 కోట్ల నిధులను చెల్లించనుంది
Source: Yahoo! Telugu: News | 16 Oct 2009 | 7:01 am

ట్రేడింగ్ ఆశాజనకం: వృద్ధిబాటలో సెనెక్స్ పయనం

బాంబే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ పుంజుకోవడంతో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ లాభాలను నమోదు చేసుకుంటోంది. దీంతో శుక్రవారం ప్రారంభం నుంచి వృద్ధి చెందిన సెన్సెక్స్ మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో 122 పాయింట్లు వృద్ధి చెంది, 17, 317 పాయింట్ల వద్ద పయనిస్తోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 31 పాయింట్లు బలపడి, 5, 140 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది.
Source: Yahoo! Telugu: News | 16 Oct 2009 | 6:49 am

అది... రాజకీయ మూర్ఖులకు అర్థం కాదు: కేసీఆర్

గత ఎన్నికల్లో మహాకూటమి ప్రయోగం సక్సెస్ అయింది. ఈ విషయం రాజకీయ మూర్ఖులకు అర్థం కాదు. రాష్ట్ర రాజకీయాలపై లోతైన అవగాహన నాలాంటి వారికే ఇది అర్థం అవుతుందని తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్ రావు అభిప్రాయపడ్డారు.
Source: ఏపీ న్యూస్ | 16 Oct 2009 | 3:59 am

ఆంధ్రప్రదేశ్‌కు 320 మిలియన్ల ప్రపంచ బ్యాంకు రుణం

రాష్ట్రానికి ప్రపంచ బ్యాంకు 320 మిలియన్ డాలర్ల రుణాన్ని మంజూరు చేసింది. ఈ మొత్తాన్ని రాష్ట్రంలో సురక్షితమైన రోడ్లు, నాణ్యత తదితర అంశాల అభివృద్ధికి ఖర్చు చేయాల్సి ఉంటుంది.
Source: ఏపీ న్యూస్ | 16 Oct 2009 | 2:23 am

చైనా భారీ ప్రాజెక్టుపై వివరాల సేకరణ: విదేశాంగ శాఖ

బ్రహ్మపుత్ర నదిపై చైనా ప్రభుత్వం నిర్మిస్తున్న భారీ ప్రాజెక్టు వివరాలను తెలుసుకునేందుకు అన్నిరకాలుగా పరిశీలిస్తున్నట్టు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపారు. ఈ అంశంలో నిజాలను తెలుసుకునేందుకు నివేదిక కోసం ఎదురుచూస్తున్నట్టు చెప్పారు.
Source: జాతీయ | 16 Oct 2009 | 2:06 am

స్వైన్ ఫ్లూ మహ్మారి: మృతుల సంఖ్య 400

దేశంలో స్వైన్ ఫ్లూ వ్యాధి మృతుల సంఖ్య 400కు చేరుకుంది. తాజాగా మహారాష్ట్రంలో మరో మూడు కొత్త కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకుంటే 400కు చేరినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి.
Source: జాతీయ | 16 Oct 2009 | 1:36 am

నల్లపురెడ్డి సభ్యత్వాన్ని రద్దు చేయండి: తెదేపా

తిరుగుబాటు ఎమ్మెల్యే నల్లపురెడ్డి శ్రీనివాసుల రెడ్డి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు, స్పీకర్ ఎం.కిరణ్ కుమార్ రెడ్డికి తెదేపా చీఫ్ విఫ్ ధూలిపాల నరేంద్ర కుమార్ ఓ వినతి పత్రం సమర్పించారు.
Source: ఏపీ న్యూస్ | 16 Oct 2009 | 12:59 am

ఉప ముఖ్యమంత్రి పదవికి వైఎస్.జగన్ సమ్మతం!

ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసిన కడప పార్లమెంట్ సభ్యుడు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి తనయుడు ఉప ముఖ్యమంత్రి పదవితో సరిపుచ్చుకునేందుకు సమ్మతించినట్టు సమాచారం. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఆయనకు సంకేతాలు వచ్చినట్టు వినికిడి.
Source: ఏపీ న్యూస్ | 15 Oct 2009 | 11:48 pm

విధులకు జస్టీస్ దినకరన్ దూరంగా ఉండాలి: సొరాబ్జీ

ఆదాయానికి మంచి ఆస్తుల సంపాదించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పి.డి.దినకరన్ విధులకు దూరంగా ఉండాలని మాజీ అటార్నీ జనరల్ సోలీ జె.సొరాబ్జీ అభిప్రాయపడ్డారు.
Source: జాతీయ | 15 Oct 2009 | 10:30 pm

రూ.500 కోట్ల కుంభకోణం: అమర్ సింగ్‌పై ఎఫ్ఐఆర్

సమాజ్‌వాదీ పార్టీ ప్రధాన కార్యదర్శి అమర్‌సింగ్‌పై ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 500 కోట్ల రూపాయల ఆర్థిక కుంభకోణానికి అమర్‌సింగ్‌తో పాటు.. ఆయన భార్య పంకజా కుమారి పాల్పడినట్టు అందులో పేర్కొన్నారు.
Source: జాతీయ | 15 Oct 2009 | 10:22 pm

23న ప్రేక్షకుల ముందుకు వస్తోన్న పూరి "బంపర్ ఆఫర్"

డాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ సోదరుడు సాయిరామ్ శంకర్ హీరోగా నటిస్తోన్న చిత్రం "బంపర్ ఆఫర్". సొంత పతాకం వైష్ణో అకాడమీపై శిష్యుడు జయరవీంద్ర దర్శకత్వంలో పూరీ నిర్మించిన "బంపర్ ఆఫర్" సినిమా ఈ నెల 23వ తేదీన తెరపైకి రానుంది. ఈ సినిమా గురించి ఎగ్జిక్యూటివ్ నిర్మాత, పూరి సోదరుడు శంకర్ గణేష్ మాట్లాడుతూ.. అక్టోబర్ 23వ తేదీన బంపర్ ఆఫర్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేశామన్నారు. సాయిరామ్‌శంకర్ ఈ చిత్రంలో న్యూ లుక్‌తో కనిపించడమే గాకుండా అద్భుతమైన నటనను ప్రదర్శించాడని చెప్పారు.
Source: Yahoo! Telugu: Entertainment | 15 Oct 2009 | 11:26 am

"అన్నయ్య" చేసిన హితోపదేశం మరువలేనిది: శ్రీకాంత్

ఉషాకిరణ్‌మూవీస్ "పీపుల్స్ ఎన్‌కౌంటర్" నుంచి అంచెలంచెలుగా ఎదిగిన విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టు, హీరో అయిన శ్రీకాంత్ "మహాత్మా"తో వంద చిత్రాలను పూర్తిచేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనపై ఓ పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్‌‌తో జరిపిన ఇంటర్వ్యూ..ప్రశ్న: వంద సినిమాల కెరీర్‌ను ఒక్కసారి వెనక్కు తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది?జ: చిన్నపాత్రనుంచి విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా ఎదిగాను. నా సినీ కెరీర్‌లో చిరంజీవితో నటించేటప్పుడు పొందిన ఆనందం అంతా ఇంతాకాదు. ఒకప్పుడు ఎన్టీఆర్ సినిమాలు చూసేందుకు ఎగబడేవాడిని. ఆ తర్వాత చిరంజీవి సినిమాలు చూసేవాడిని. అటువంటి నటుడితో కలిసి శంకర్‌దాదా జిందాబాద్ నటిస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. ప్రశ్న: మీ కెరీర్‌లో ఫలానా దర్శకుల దగ్గర చేయలేదనే ఫీలింగ్ ఉందా?జ: రాజమౌళి, పూరీ, వినాయక్‌లతో చేయగలనా? అనే సందేహం ఉంది. అయితే చేయగలను అనే నమ్మకమూ ఉంది.ప్రశ్న: మీ ఫ్యామిలీ గురించి..?జ: నాకు ముగ్గురు పిల్లలు. నాకన్నా వాళ్ళమ్మతో బాగా సన్నిహితంగా ఉంటారు. అయితే పెద్దాడు రోషన్‌కు మాత్రం నేనంటే కొంచెం క్రేజీగా ఉంటాడు.
Source: Yahoo! Telugu: Entertainment | 15 Oct 2009 | 11:05 am

ఫ్రీజోన్ తీర్పుపై సుప్రీం పరిశీలించాలి: రోశయ్య

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఫ్రీ జోన్‌ అంశంపై అక్టోబర్ 19 సోమవారం సాయంత్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్భంగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కొణజేటి రోశయ్య మాట్లాడుతూ... ఫ్రీ జోన్ విషయంపై సుప్రీం ఇటీవల ఇచ్చిన తీర్పును పరిశీలించాలని, స్టే ఇవ్వాలని ప్రభుత్వం కోరనుందని ఆయన అన్నారు.
Source: ఏపీ న్యూస్ | 15 Oct 2009 | 9:39 am

తెలంగాణా కోసం మిలిటెంట్ పోరాటం చేస్తాం: కేసీఆర్

"నిజమే మా వ్యూహం మారింది... రేపటి నుంచి తెలంగాణా సాధనకు కొత్త తరహా యుద్ధాన్ని ప్రారంభిస్తాం. అవసరమైతే మిలిటెంట్ పోరాటం చేసైనా ప్రత్యేక తెలంగాణాను సాధిస్తా"మంటూ కె. చంద్రశేఖరరావు వెల్లడించారు.
Source: ఏపీ న్యూస్ | 15 Oct 2009 | 8:00 am

"డాన్ శ్రీను"గా మారబోతున్న దుబాయ్ శ్రీను!?

అందాలతార నయనతారతో జతకట్టి "దుబాయ్‌శ్రీను"గా పేరుతెచ్చుకున్న మాస్ హీరో రవితేజ.. తాజాగా "డాన్ శ్రీను"గా మారబోతున్నాడు. ప్రముఖ దర్శకుడు శ్రీనువైట్ల తెరకెక్కించిన దుబాయ్‌శీను తరహాలోనే ఆర్.ఆర్. మూవీ మేకర్స్ మళ్లీ రవితేజతో ఓ చిత్రాన్ని రూపొందించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమాలో అరుంధతి తార బొమ్మాళీ అనుష్క హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం ద్వారా గోపిచంద్ మలినేని దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కాగా.. ఈ చిత్రంలో రియల్ స్టార్, డాక్టర్. శ్రీహరి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 15 Oct 2009 | 7:09 am

యూత్ ఓరియెంటెడ్ మూవీగా వస్తోన్న "జోరు"

అరవింద్ కుమార్, ఆకర్ష హీరోహీరోయిన్లుగా నూతన నిర్మాత ఎస్. మల్లేశం నిర్మించిన యూత్ ఓరియెంటెడ్ చిత్రం "జోరు". సినిమా టాకీస్ పతాకంపై నూతన నటీనటులు హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్న ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ మరియు ఎడిటింగ్ కార్యక్రమాలు ఇటీవలే పూర్తయ్యాయి. ప్రస్తుతం "జోరు" సినిమా డి.టి.ఎస్. మిక్సింగ్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఎస్. మల్లేశం మాట్లాడుతూ.. ఎమోషనల్ యూత్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో యువతకు చక్కటి సందేశం ఇవ్వడం జరిగిందన్నారు. అలాగే చక్రి సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని నిర్మాత వెల్లడించారు. ఈ సినిమా ఆడియోను ఈ నెల మూడోవారంలో విడుదల చేసి, సినిమాను నవంబర్‌లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 15 Oct 2009 | 6:14 am

ఐఓసీ గోడౌన్‌లో అగ్నిప్రమాదం

ప్రకాశం జిల్లాలోని జాతీయ రహదారి సంఖ్య 5కు ఆనుకుని ఉన్న సూరారెడ్డి పాలెంలోని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ గోడౌన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Source: ఏపీ న్యూస్ | 15 Oct 2009 | 6:01 am

"తకిట తకిట" స్పెషల్ సాంగ్‌లో బొమ్మాళీ స్టెప్పులు!

ప్రముఖ హీరోయిన్ భూమిక భర్త భరత్ ఠాకూర్ నిర్మాతగా డౌన్‌టౌన్ ఫిలిమ్స్ పతాకంపై శ్రీహరి నాను దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం "తకిట తకిట". నూతన తారాగణంతో నిర్మిస్తోన్న ఈ చిత్రంలో సెక్సీతార అరుంధతి అనుష్క ఓ స్పెషల్ సాంగ్‌లో కన్పించనున్నారు. ఈ నేపథ్యంలో "తకిట తకిట" నిర్మాత భరత్‌ఠాకూర్ మాట్లాడుతూ.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పెషల్ సాంగ్‌లో నటిస్తున్నట్లు, కింగ్ నాగార్జున గెస్ట్‌రోల్ చేస్తున్నట్లు వచ్చిన వార్తలన్నీ పుకార్లు మాత్రమేనని కొట్టిపారేశారు. అయితే అనుష్క స్పెషల్ సాంగ్‌లో నటించడం మాత్రం నిజమేనని, అందరూ కొత్తవారితో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి సంబంధించిన మిగిలిన వివరాలన్నీ త్వరలోనే తెలియజేస్తామన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 15 Oct 2009 | 5:54 am

ప్రియురాలి మెడలో "తాళి"కి బదులు చేతికి "రాఖీ"

ఉత్తరప్రదేశ్‌లోని కుక్రా గ్రామంలో పింటూ శర్మా, అతని 28 ఏళ్ల ప్రేమికురాలిని అక్కా తమ్మునిగా మార్చేశారు ఆ ఊరి పెద్దలు. ప్రియురాలితో ప్రియుని చేతికి రాఖీ కట్టించి ఇద్దరిని ఆ ఊరి నుంచి బహిష్కరించారు.
Source: జాతీయ | 15 Oct 2009 | 5:46 am

"అన్నయ్య" చేసిన హితోపదేశం మరువలేనిది: శ్రీకాంత్

ఉషాకిరణ్‌మూవీస్ "పీపుల్స్ ఎన్‌కౌంటర్" నుంచి అంచెలంచెలుగా ఎదిగిన విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టు, హీరో అయిన శ్రీకాంత్ "మహాత్మా"తో వంద చిత్రాలను పూర్తిచేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనపై ఓ పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్‌‌తో జరిపిన ఇంటర్వ్యూ.. ప్రశ్న: వంద సినిమాల కెరీర్‌ను ఒక్కసారి వెనక్కు తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది? జ: చిన్నపాత్రనుంచి విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా ఎదిగాను...
Source: వినోదం | 15 Oct 2009 | 5:38 am

చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం "నెల్లూరు"

ఒకప్పుడు శాతవాహనులు, పల్లవులు, చోళులు, పశ్చిమ చాళుక్యులు, కాకతీయులు, రెడ్డిరాజులు, విజయనగర రాజులు, గోల్గొండ, ఆర్కాట్ నవాబుల పాలనలో దేదీప్యమానంగా వెలిగిన ప్రదేశమే "నెల్లూరు". "నెల్లు" అంటే తమిళంలో "వరి" అని అర్థం కాగా... తమిళనాడును ఆనుకుని ఉన్నందువల్ల నెల్లు అనేది క్రమంగా నెల్లూరుగా మారిందని పెద్దలు చెబుతుంటారు. ప్రస్తుతం దీన్నే "శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా"గా సంబోధిస్తున్నారు.
Source: వినోదం | 15 Oct 2009 | 5:26 am

ముఖ్యమంత్రి రోశయ్యపై అవిశ్వాస తీర్మానం!

ముఖ్యమంత్రి రోశయ్యపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని వైఎస్ జగన్ వర్గం భావిస్తోంది. తమ ప్రియతమ నేత వైఎస్ దుర్మణం అనంతరం పార్టీ అధినాయకత్వం అనుసరిస్తున్న వైఖరితో ఆయన వర్గం విసిగిపోయింది.
Source: ఏపీ న్యూస్ | 15 Oct 2009 | 5:00 am

ఉపకులపతిపై దాడి కేసు: ఎంపీకి అరెస్టు వారెంట్ జారీ

విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వకళా పరిషత్ ఉపకులపతిపై దాడి చేసిన కేసుకు సంబంధించి అమలాపురం లోక్‌సభ సభ్యుడు హర్షకుమార్‌పై స్థానిక కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 2006వ సంవత్సరంలో ఈ దాడి జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఎంపీ కోర్టుకు హాజరుకాలేదు.
Source: ఏపీ న్యూస్ | 15 Oct 2009 | 4:32 am

ఫ్రీజోన్‌పై అఖిలపక్షం ఏర్పాటు చేయాలి: ప్రరాపా

హైదరాబాద్ నగరాన్ని ఫ్రీజోన్‌గా చేయాలనే అంశంపై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ప్రజారాజ్యం పార్టీ డిమాండ్ చేసింది. ఈ ఫ్రీజోన్‌కు తమ పార్టీ పూర్తిగా వ్యతిరేకమని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నారగోని స్పష్టం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 15 Oct 2009 | 4:11 am

చైనా మరో సాహసం: బ్రహ్మపుత్రపై అతిపెద్ద ప్రాజెక్టు!

చైనా దుస్సాహసాలు రోజురోజుకూ ఎక్కువ అవుతున్నాయి. భారత్‌తో కయ్యానికి దూకుతోంది. అరుణాచల్ ప్రదేశ్‌లో ప్రధాని మన్మోహన్ సింగ్ పర్యటనపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన చైనా.. తాజాగా బ్రహ్మపుత్ర నదిపై అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది.
Source: జాతీయ | 15 Oct 2009 | 3:51 am

శంకర రామన్ హత్యకేసు నవంబరు 27కు వాయిదా

కంచి వరదరాజపెరుమాళ్ ఆలయ మేనేజర్ శంకర రామన్ హత్య కేసు విచారణ మరోమారు వాయిదా పడింది. ఈ కేసును విచారణ జరుపుతున్న పుదుచ్చేరి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్టు న్యాయవాదులు కోర్టు విధులను బాయ్‌కట్ చేయడంతో కేసును నవంబరు 27వ తేదీకి మేజిస్ట్రేట్ వాయిదా వేశారు.
Source: జాతీయ | 15 Oct 2009 | 3:02 am