|
ప్రారంభ ట్రేడ్‌లో సాధారణ లాభాలతో సెన్సెక్స్స్టాక్ మార్కెట్ ప్రారంభ ట్రేడ్‌లో సాధారణ లాభాలతో ప్రారంభమైంది. దీంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 40 పాయింట్లు పుంజుకుని 17,271 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 6 పాయింట్లు లాభపడి 5,124 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.23 శాతం, నిఫ్టీ 0.11 శాతం మేరకు వృద్ధి చెందాయి.Source: Yahoo! Telugu: News | 15 Oct 2009 | 4:23 am ఆర్మీ చీఫ్‌ను మార్చే ఉద్దేశం లేదు: పాక్ ప్రభుత్వంతమ దేశ ఆర్మీ చీఫ్ అష్ఫాక్ పర్వేజ్ ఖియానీని మార్చే ఉద్దేశం లేదని పాకిస్థాన్ ప్రభుత్వం తేల్చి చెప్పింది. అమెరికా చేసిన 7.5 బిలియన్ డాలర్ల రుణసాయం అందజేసేందుకు అమెరికా షరతు విధించింది.Source: Yahoo! Telugu: News | 15 Oct 2009 | 4:19 am ఫ్రీజోన్‌పై అఖిలపక్షం ఏర్పాటు చేయాలి: ప్రరాపాహైదరాబాద్ నగరాన్ని ఫ్రీజోన్‌గా చేయాలనే అంశంపై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ప్రజారాజ్యం పార్టీ డిమాండ్ చేసింది. ఈ ఫ్రీజోన్‌కు తమ పార్టీ పూర్తిగా వ్యతిరేకమని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నారగోని స్పష్టం చేశారు.Source: ఏపీ న్యూస్ | 15 Oct 2009 | 4:11 am ఆర్‌బీఐ కార్యాలయంలో రూ. 1 లక్ష నకిలీ నోట్లున్యూఢిల్లీలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కార్యాలయంలో రూ. 1 లక్ష వరకు నకిలీ నోట్లను తాము స్వాధీనం చేసుకున్న పోలీసులు వెల్లడించారు. తాము లెక్కించిన వివిధ నోట్ల కట్లల్లో సుమారు 296కు పైగా నకిలీ నోట్లు ఉన్నట్లు గుర్తించామని గత నెలలో ఆర్‌బీఐకి చెందిన ఓ సీనియర్ అధికారి పోలీసులకు ఫిర్యాధు చేశారు.Source: Yahoo! Telugu: News | 15 Oct 2009 | 4:11 am వరదల మృతుల సంఖ్య 90: మంత్రివర్గం వెల్లడిరాష్ట్రంలో ఐదు జిల్లాలను ముంచెత్తిన వరదల వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 90గా రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. వీరి కుటుంబాలకు అన్ని విధాలుగా ప్రభుత్వ సాయం చేయనుంది. ముఖ్యమంత్రి రోశయ్య నేతృత్వంలో గురువారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది.Source: ఏపీ న్యూస్ | 15 Oct 2009 | 4:00 am 26/11 దాడుల సూత్రధారులను ప్రాసిక్యూట్ చేయండి: అమెరికాభారత వాణిజ్య రాజధాని ముంబైపై జరిగిన తీవ్రవాద దాడులకు సూత్రధారులుగా భావిస్తున్న వారిని ప్రాసిక్యూట్ చేయాలని పాకిస్థాన్‌కు అమెరికా మరోమారు కోరింది.Source: Yahoo! Telugu: News | 15 Oct 2009 | 3:57 am చైనా మరో సాహసం: బ్రహ్మపుత్రపై అతిపెద్ద ప్రాజెక్టు!చైనా దుస్సాహసాలు రోజురోజుకూ ఎక్కువ అవుతున్నాయి. భారత్‌తో కయ్యానికి దూకుతోంది. అరుణాచల్ ప్రదేశ్‌లో ప్రధాని మన్మోహన్ సింగ్ పర్యటనపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన చైనా.. తాజాగా బ్రహ్మపుత్ర నదిపై అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది.Source: జాతీయ | 15 Oct 2009 | 3:51 am నేటి బులియన్ మార్కెట్ ధరలునేటి బులియన్ మార్కెట్‌లో బంగారు, వెండి ధరలు ఇలా ఉన్నాయి... హైదరాబాద్ 24 క్యారెట్ - రూ. 16,270 - రూ. 16,300, వెండి కిలో - రూ. 27,500 - రూ. 27,800. చెన్నై 24 క్యారెట్ - రూ. 16,050 - రూ. 16,050, వెండి కిలో - రూ. 28,655 - రూ. 28,715. విజయవాడ - రూ. 16,240 - రూ. 16,240, వెండి కిలో - రూ. 28,000 - రూ. 28,000.Source: Yahoo! Telugu: News | 15 Oct 2009 | 3:40 am నక్సల్స్ అణిచివేతకు హెలికాఫ్టర్లను వినియోగించం: పీసీదేశ అంతర్గత భద్రతకు పెను సవాల్‌గా పరిణమించిన నక్సల్స్ కార్యకలాపాలను అణిచి వేసేందుకు ఆర్మీ హెలికాఫ్టర్లను వినియోగించబోమని కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం తెలిపారు. అదేసమయంలో మావోయిస్టులు ఆయుధాలను వీడి ప్రభుత్వంతో చర్చలకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.Source: Yahoo! Telugu: News | 15 Oct 2009 | 3:39 am అణు ఒప్పందంపై సంతకాలు చేసిన భారత్-అర్జెంటీనాతన భవిష్యత్ ఇంధన అవసరాలను పరిష్కరించుకునేందుకు అమెరికాతో కుదుర్చుకున్న పౌర అణు ఒప్పందం తరహా ఒప్పందాలను భారత్ మరికొన్ని దేశాలతో కుదుర్చుకుంటోంది. ఇందులోభాగంగా తాజాగా అర్జెంటీనా దేశంలో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.Source: Yahoo! Telugu: News | 15 Oct 2009 | 3:30 am చిరంజీవీ... "అసెంబ్లీ రౌడీ" సినిమా చూడు: మోహన్ బాబుఎమ్మెల్యే అంటే అర్థమేమిటో తాను నటించిన "అసెంబ్లీ రౌడీ" చిత్రాన్ని చూసి ప్రజారాజ్యం పార్టీ అధినేత, తిరుపతి శాసనసభ్యుడు, సహచర నటుడు చిరంజీవి తెలుసుకోవాలని సినీ నటుడు మోహన్ బాబు సూచించారు. తాను మాటల మనిషిని కాదని, చేతల మనిషిని అని స్పష్టం చేశారు.Source: ఏపీ న్యూస్ | 15 Oct 2009 | 3:24 am శంకర రామన్ హత్యకేసు నవంబరు 27కు వాయిదాకంచి వరదరాజపెరుమాళ్ ఆలయ మేనేజర్ శంకర రామన్ హత్య కేసు విచారణ మరోమారు వాయిదా పడింది. ఈ కేసును విచారణ జరుపుతున్న పుదుచ్చేరి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్టు న్యాయవాదులు కోర్టు విధులను బాయ్‌కట్ చేయడంతో కేసును నవంబరు 27వ తేదీకి మేజిస్ట్రేట్ వాయిదా వేశారు.Source: జాతీయ | 15 Oct 2009 | 3:02 am విదేశీ కరెన్సీ రేట్లువిదేశీ కరెన్సీ రేట్లు ఈ విధంగా ఉన్నాయి... అమెరికా డాలరు కొనుగోలు రేటు (థామస్ కుక్) 43.80 అమ్మకపు రేటు (రూ.లలో) రూ. 48.95 యూరో కరెన్సీ కొనుగోలు రేటు (థామస్ కుక్) 64.25 అమ్మకపు రేటు (రూ.లలో) రూ. 71.65 జపాన్ యెన్ కొనుగోలు రేటు (థామస్ కుక్) 48.25 అమ్మకపు రేటు (రూ.లలో) రూ. 53.70 బ్రిటన్ పౌండ్ కొనుగోలు రేటు (థామస్ కుక్) 69.60 అమ్మకపు రేటు రూ. 77.25Source: Yahoo! Telugu: News | 15 Oct 2009 | 2:46 am నేటి ఫారంగేట్ మార్కెట్ ధరలునేటి ఫారంగేట్ మార్కెట్ ధరలు ఇలా ఉన్నాయి... హైదరాబాద్ (ఒక గుడ్డు) - రూ. 2.40 (వంద గుడ్లు) - రూ. 220 విజయవాడ - రూ. 219 విశాఖపట్నం - రూ. 224 చెన్నై - 232 నమక్కల్ - రూ. 233Source: Yahoo! Telugu: News | 15 Oct 2009 | 2:45 am అరుణాచల్ ప్రదేశ్ మనదేశ అంతర్భాగమే: రాహుల్ప్రధాని మన్మోహన్ సింగ్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించడాన్ని తప్పుబట్టిన చైనా వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. అరుణాచల్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమని తేల్చి చెప్పారు.Source: జాతీయ | 15 Oct 2009 | 2:29 am వైఎస్.జగన్ వద్దు.. రోశయ్యే ముద్దు: గంగా భవానీముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టిన కొణిజేటి రోశయ్య చాలా సమర్థవంతంగా పని చేస్తున్నారని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మహిళా విభాగం అధ్యక్షురాలు గంగా భవానీ అభిప్రాయపడ్డారు. అందువల్ల ముఖ్యమంత్రిగా రోశయ్యనే కొనసాగించాలని ఆమె అధిష్టానాన్ని కోరనున్నట్టు చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 15 Oct 2009 | 1:42 am గవర్నర్‌కు లేఖ రాయనున్న యువ ఎమ్మెల్యేలు!రాష్ట్ర గవర్నర్ నారాయణ్ దత్ తివారీకి యువ ఎమ్మెల్యేలు లేఖలు రాసేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కె.రోశయ్య తాత్కాలికమేనని, అందువల్ల ఆయన సభలో బలాన్ని నిరూపించుకోవాలని కోరుతూ ఈ లేఖలో పేర్కొననున్నారు.Source: ఏపీ న్యూస్ | 15 Oct 2009 | 1:32 am ముఖ్యమంత్రి రోశయ్యపై అవిశ్వాస తీర్మానం!ముఖ్యమంత్రి రోశయ్యపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని వైఎస్ జగన్ వర్గం భావిస్తోంది. తమ ప్రియతమ నేత వైఎస్ దుర్మణం అనంతరం పార్టీ అధినాయకత్వం అనుసరిస్తున్న వైఖరితో ఆయన వర్గం విసిగిపోయింది.Source: ఏపీ న్యూస్ | 15 Oct 2009 | 1:18 am 16న నక్సల్స్ ప్రభావిత జిల్లాల ఎస్పీలతో డీజీపీ సమీక్షఈనెల 16వ తేదీన శుక్రవారం నక్సల్స్ ప్రభావిత జిల్లాల ఎస్పీలతో కొత్త డీజీపీ గిరీష్ కుమార్ కీలక భేటీ నిర్వహించనున్నారు. రాష్ట్ర సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఒరిస్సా, బీహార్, ఛత్తీస్‌గఢ్‌లలో మావోయిస్టులు విధ్వంసం సృష్టిస్తున్న విషయం తెల్సిందే.Source: ఏపీ న్యూస్ | 15 Oct 2009 | 12:34 am చైనా అభ్యంతరం ఓ సమస్య కాదు: తేల్చిచెప్పిన కాంగ్రెస్చైనా సరిహద్దు రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్‌లో అనేక మంది దేశ ప్రధానులు పర్యటనలు నిర్వహించారని, తాజాగా ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ రాష్ట్రంలో పర్యటన జరపడం పట్ల చైనా వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలు ఓ సమస్య కాదని కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడింది.Source: జాతీయ | 15 Oct 2009 | 12:27 am ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వరద సాయం: చంద్రబాబుఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఐదు జిల్లాల్లోని వరద బాధితులకు సాయం అందజేయనున్నట్టు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ సాయాన్ని తెదేపా శ్రేణులే స్వయంగా ఆయా ప్రాంతాల్లో బాధితుల ఇంటికి వెళ్లి అందజేస్తాయని తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 15 Oct 2009 | 12:00 am శిలాఫలకాల ధ్వంసం: గుడివాడ ఎమ్మెల్యే నాని అరెస్టుగుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తూ మంత్రి పార్థసారథి వేసిన శిలాఫలకాలను ధ్వంసం చేసిన కేసులో స్థానిక ఎమ్మెల్యే కొడాలి వెంకటేశ్వరరావు అలియాస్ నానిని పోలీసులు అరెస్టు చేశారు.Source: ఏపీ న్యూస్ | 14 Oct 2009 | 11:53 pm నక్సల్స్ అణిచివేతకు హెలికాఫ్టర్లను వినియోగించం: పీసీదేశ అంతర్గత భద్రతకు పెను సవాల్‌గా పరిణమించిన నక్సల్స్ కార్యకలాపాలను అణిచి వేసేందుకు ఆర్మీ హెలికాఫ్టర్లను వినియోగించబోమని కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం తెలిపారు. అదేసమయంలో మావోయిస్టులు ఆయుధాలను వీడి ప్రభుత్వంతో చర్చలకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.Source: జాతీయ | 14 Oct 2009 | 10:09 pm అణు ఒప్పందంపై సంతకాలు చేసిన భారత్-అర్జెంటీనాతన భవిష్యత్ ఇంధన అవసరాలను పరిష్కరించుకునేందుకు అమెరికాతో కుదుర్చుకున్న పౌర అణు ఒప్పందం తరహా ఒప్పందాలను భారత్ మరికొన్ని దేశాలతో కుదుర్చుకుంటోంది. ఇందులోభాగంగా తాజాగా అర్జెంటీనా దేశంలో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.Source: జాతీయ | 14 Oct 2009 | 10:01 pm ముషారఫ్ నమోదైన హత్య కేసు !పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌పై హత్య కేసు నమోదైంది. 2006లో సైనిక చర్య ద్వారా బలూచిస్థాన్ గిరిజన నాయకుడు నవాబ్ అక్బర్ బగ్తీని చంపించాడని పోలీసులు ఆయనపై మంగళవారం అభియోగాలు నమోదు చేశారు.Source: Yahoo! Telugu: News | 14 Oct 2009 | 3:27 pm మళ్లీ ఆడ వేషంలో నరేష్కార్తీకమాస ప్రాముఖ్యాన్ని వివరిస్తూ పంచారామ క్షేత్రాల నేపధ్యంలో కార్తీకమాసం చిత్రం రూపొందింది. ఓ పక్క దైవభక్తికి సంబంధించిన అంశాలతోపాటు కుటుంబ బంధాలు, భావోద్వేగాలకు పెద్దపీట వేయడం జరిగిందనీ, ఇందులో ఆరు పాటలున్నాయనీ నిర్మాత అనపర్తి శివరామకృష్ణ చెప్పారు. నరేష్ లేడీ గెటప్ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందన్నారు. నటుడు తనికెళ్ల భరణి పాడిన "భాగ్యలక్ష్మీ రావే..." అనే పాట చిత్రానికే ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందన్నారు. చిత్ర సమర్పకుడు గనిశెట్టి రామయ్యనాయుడు మాట్లాడుతూ, ఈ నెల 19 నుంచి కార్తీకమాస పుణ్యకాలం ప్రారంభమవుతుందనీ, అందువల్ల అదే మాసంలో చిత్రాన్ని విడుదల చేస్తామని చెప్పారు.Source: Yahoo! Telugu: Entertainment | 14 Oct 2009 | 3:22 pm "మా" బంధం దృఢమైనదేనా...?మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనే సంస్థ గొడుగు కింద ఉన్న తెలుగు చలనచిత్ర రంగంలో అడుగడుగునా గ్రూపులు.. గ్రూపు రాజకీయాలు... ఒకరంటే ఒకరికి గిట్టని దౌర్భాగ్యం నేడు తెలుగు సినీ పరిశ్రమలో దాపురించిందని సీనియర్ తెలుగు నటులు వాపోతున్నారు. ఆయా అగ్రశ్రేణి నటుల మధ్య ఉన్న భేదాభిప్రాయాల వల్ల చిన్న నటులు ఏదో ఒక గ్రూపులోకి వెళ్లాల్సిన అగత్యం. ఎవరి కార్యక్రమానికి హాజరవ్వాలో ఎవరి కార్యక్రమానికి వెళ్లకూడదోనన్న గందరగోళంలో నూతన నటులు ఉంన్నట్లు సమాచారం.Source: Yahoo! Telugu: Entertainment | 14 Oct 2009 | 6:44 am కుర్ర హీరోలపై మోజు పడుతున్న సెక్సీ ఆంటీలు!సాధారణంగా చిత్ర పరిశ్రమ అంటేనే ఎంజాయ్‌మెంట్‌కు ప్రతీక. ఇందులోకి అడుగుపెట్టే హీరో హీరోయిన్లు శృంగారాన్ని రుచి చూడాల్సిందే. ముఖ్యంగా.. సినిమాల్లో తమ శరీర అందచందాలతో అభిమానులను మత్తెక్కించే సెక్సీ భామలు...Source: Yahoo! Telugu: Entertainment | 14 Oct 2009 | 6:01 am కేంద్ర ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం: మిర్వాజ్ ఉమెర్వివాదాస్పద కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం అన్ని వర్గాల ప్రజలతో చర్చలు జరుపాలని కేంద్ర ప్రభుత్వం భావించడాన్ని హురియత్ కాన్ఫరెన్స్ ఆహ్వానించింది. దీనిపై ఆ పార్టీ ఛైర్మన్ మిర్వాజ్ ఉమెర్ ఫరూక్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కాశ్మీర్ వివాదం ఓ రాజకీయ సమస్య. దీని పరిష్కారం కోసం చర్చలో ఏకైక మార్గం అని అన్నారు.Source: జాతీయ | 14 Oct 2009 | 5:43 am రాష్ట్ర సీఎల్పీ నేతగా సోనియా గాంధీ అనుచరుడు!రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షం నేతగా పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి అడుగులు మడుగులొత్తే నాయకుడినే సీఎల్పీ నేతగా ఎన్నుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇదే అర్థం స్ఫురించేలా రాష్ట్ర మునిసిపల్ వ్యవహారాల శాఖామంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 14 Oct 2009 | 4:20 am భారత్-చైనాల మధ్య పెరుగుతున్న మాటల యుద్ధం!భారత్ చైనా దేశాల మధ్య మాటల యుద్ధ రోజురోజుకూ పెరుగుతోంది. అరుణాచల్ ప్రదేశ్‌లో ప్రధాని మన్మోహన్ సింగ్ పర్యటించడం పట్ల చైనా ఆక్షేపించడాన్ని భారత్ తీవ్రంగా తప్పుబట్టింది. ఈ నేపథ్యంలో.. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో చైనా కార్యక్రమాలు తక్షణం నిలిపి వేయాలని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ డిమాండ్ చేసింది.Source: జాతీయ | 14 Oct 2009 | 3:12 am
|