|
కొలంబోకు చేరుకున్న తమిళనాడు ఎంపీల బృందంశ్రీలంక తమిళుల జీవన స్థితిగతులు, వారు నివశిస్తున్న ప్రాంతాల్లోని పరిస్థితులను పరిశీలించేందుకు తమిళనాడుకు చెందిన పార్లమెంట్ సభ్యుల బృందం ఒకటి ఆ దేశ రాజధాని కొలంబోకు చేరుకుంది. తమిళనాడు ప్రభుత్వం అనుమతి మేరకు ఈ బృందం అక్కడ పర్యటిస్తోంది.Source: Yahoo! Telugu: News | 11 Oct 2009 | 9:43 am టైర్ల ధరలు 4 శాతం పెంచిన జేకే టైర్, సియట్టైర్ల తయారీ దిగ్గజాలు జేకే టైర్ మరియు సియట్ లిమిటెడ్ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను రెండు నుంచి నాలుగు శాతం మేరకు పెంచాయి. అక్టోబర్ 1వ తేదీ నుంచే ఈ పెంచిన ధరలను అమలులోకి తెచ్చినట్లు తెలిపాయి. గత ఆరు నెలల కాలంలో ముడి పదార్థమైన రబ్బరు ధరలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాయి.Source: Yahoo! Telugu: News | 11 Oct 2009 | 9:41 am నేటి బులియన్ మార్కెట్ ధరలునేటి బులియన్ మార్కెట్‌లో బంగారు, వెండి ధరలు ఇలా ఉన్నాయి... హైదరాబాద్ 24 క్యారెట్ - రూ. 16,150, వెండి కిలో - రూ. 27,700. చెన్నై 24 క్యారెట్ - రూ. 15,890 - రూ. 15,895, వెండి కిలో - రూ. 28,550 - రూ. 28,375. విజయవాడ - రూ. 16,040 - రూ. 16,025, వెండి కిలో - రూ. 27,900 - రూ. 28,000.Source: Yahoo! Telugu: News | 11 Oct 2009 | 9:23 am నక్సల్స్ హింసాత్మక చర్యలు: 2600 మంది మృత్యువాతగత మూడు సంవత్సరాల కాలంలో నక్సల్ జరిపిన హింసాత్మక చర్యల్లో దాదాపు 2600 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో సాధారణ పౌరులు సైతం ఉన్నారు. నక్సల్స్ ప్రాబల్య రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్, బీహార్, జార్ఖండ్, ఒరిస్సా రాష్ట్రాల్లో ఈ నష్టం వాటిల్లింది.Source: Yahoo! Telugu: News | 11 Oct 2009 | 9:04 am ప్రథమార్థంలో ఎల్ఐసీ.. రూ. 90వేల కోట్లు పెట్టుబడ్డిప్రభుత్వ రంగ లైఫ్ ఇన్సూరెన్స్ దిగ్గజం ఎల్ఐసీ... ఈ ఆర్థిక సంవత్సరం తొలి ప్రథమార్థంలో మార్కెట్లో రూ. 90వేల కోట్లు పెట్టుబడులు చేసినట్లు కంపెనీకి చెందిన ఉన్నతాధికారి వెల్లడించారు. సెప్టెంబర్ ఆఖరు నాటికి మార్కెట్లలోని వివిధ విభాగాల్లో ఈ పెట్టుబడులు చేసినట్లు తెలిపారు.Source: Yahoo! Telugu: News | 11 Oct 2009 | 7:29 am నేడు వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించనున్న రోశయ్యముఖ్యమంత్రి కె.రోశయ్య వరద బాధిత ప్రాంతాల్లో మరో దఫా పర్యటించనున్నారు. మహబూబ్ నగర్ జిల్లా నుంచి సాగే ఈ వరద పర్యటన మూడు రోజుల పాటు సాగుతుందని ఆయన తెలిపారు.Source: Yahoo! Telugu: News | 11 Oct 2009 | 7:09 am మహా ఎన్నికల సమరం: శివసేన అభ్యర్థి కాల్చివేతమహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న శివసేన అభ్యర్థి అజయ్ భోంస్లేను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి వేశారు. ఆదివారం ఉదయం ఆ సంఘటన పూణెలో చోటు చేసుకుంది.Source: Yahoo! Telugu: News | 11 Oct 2009 | 6:52 am త్వరలో కొత్త ద్రవ్యపరపతి విధానం: ప్రణబ్రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)తో చర్చించిన మీదట కొత్త ద్రవ్యపరపతి విధానాన్ని త్వరలోనే ప్రకటిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ వెల్లడించారు. త్వరలో పండుగ సందర్భంగా ఆర్‌బీఐ గవర్నర్‌తో తాము సమావేశం కానున్నట్లు తెలిపారు.Source: Yahoo! Telugu: News | 11 Oct 2009 | 6:32 am కాబూల్‌లో తీవ్రవాదుల దాడి: ఐఎస్ఐ హస్తంఆఫ్గనిస్థాన్ దేశ రాజధాని కాబూల్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయంపై ఇటీవల జరిగిన ఆత్మాహుతి దాడిపై పాకిస్థాన్ గూఢాచర్య సంస్థ (ఐఎస్ఐ) హస్తం ఉందని ఆఫ్గనిస్థాన్ ఆరోపించారు. ఇదే సందేహాన్ని కేంద్ర విదేశాంగ కార్యదర్శి నిరుపమారావు కూడా వ్యక్తం చేశారు.Source: Yahoo! Telugu: News | 11 Oct 2009 | 6:08 am సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతిని నిరూపిస్తా: కేసీఆర్రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల్లో భారీగా అవినీతి చోటు చేసుకుందని, దీన్ని సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తాని తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వంపై యుద్ధం ప్రారంభించానని, దీన్ని ఆపే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు.Source: Yahoo! Telugu: News | 11 Oct 2009 | 5:37 am నక్సల్స్ హింసాత్మక చర్యలు: 2600 మంది మృత్యువాతగత మూడు సంవత్సరాల కాలంలో నక్సల్ జరిపిన హింసాత్మక చర్యల్లో దాదాపు 2600 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో సాధారణ పౌరులు సైతం ఉన్నారు. నక్సల్స్ ప్రాబల్య రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్, బీహార్, జార్ఖండ్, ఒరిస్సా రాష్ట్రాల్లో ఈ నష్టం వాటిల్లింది.Source: జాతీయ | 11 Oct 2009 | 4:01 am నేడు వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించనున్న రోశయ్యముఖ్యమంత్రి కె.రోశయ్య వరద బాధిత ప్రాంతాల్లో మరో దఫా పర్యటించనున్నారు. మహబూబ్ నగర్ జిల్లా నుంచి సాగే ఈ వరద పర్యటన మూడు రోజుల పాటు సాగుతుందని ఆయన తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 11 Oct 2009 | 1:42 am మహా ఎన్నికల సమరం: శివసేన అభ్యర్థి కాల్చివేతమహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న శివసేన అభ్యర్థి అజయ్ భోంస్లేను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి వేశారు. ఆదివారం ఉదయం ఆ సంఘటన పూణెలో చోటు చేసుకుంది.Source: జాతీయ | 11 Oct 2009 | 1:24 am సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతిని నిరూపిస్తా: కేసీఆర్రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల్లో భారీగా అవినీతి చోటు చేసుకుందని, దీన్ని సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తాని తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వంపై యుద్ధం ప్రారంభించానని, దీన్ని ఆపే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 11 Oct 2009 | 12:13 am నేటితో మూడు రాష్ట్రాల ఎన్నికల ప్రచారం సమాప్తం!ఈనెల 13వ తేదీన జరుగనున్న మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఆదివారం సాయంత్రం ఐదు గంటలతో తెరపడనుంది. దీంతో అన్ని రాజకీయ పార్టీల నేతలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు.Source: జాతీయ | 11 Oct 2009 | 12:13 am మంత్రి చిదంబరం పనితీరు ప్రశంసనీయం: ఆర్.ఎస్.ఎస్దేశ అంతర్గత భద్రతకు పెను సవాల్ విసురుతున్న నక్సలైట్ సమస్యను రూపుమాపేందుకు కేంద్ర హోంమంత్రి పి.చిదంబరం చేపడుతున్న చర్యలు, కనపరుస్తున్న శ్రద్ధను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్.ఎస్.ఎస్) ప్రశంసించింది.Source: జాతీయ | 10 Oct 2009 | 11:17 pm వరద ముప్పుకు మానవతప్పిదమే కారణం: చిరంజీవిరాష్ట్రంలో ఐదు జిల్లాల్లో సంభవించిన వరద ముప్పునకు మానవ తప్పిదమే ప్రధాన కారణమని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ఆరోపించారు. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని, తద్వారా రాష్ట్రానికి వరద ముప్పు పొంచివుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించినా అధికార యంత్రాంగం సరిగా స్పందించలేదని ఆయన విమర్శించారు.Source: ఏపీ న్యూస్ | 10 Oct 2009 | 11:10 pm ఎన్నికల తర్వాత ఎంఎన్ఎస్‌తో జత కట్టేది లేదుమహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత రాజ్‌థాక్‌రే నేతృత్వంలోని ఎంఎన్ఎస్‌కు మద్ధతు ఇవ్వబోమని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) స్పష్టం చేసింది. దీంతో ఎన్నికల అనంతరం ఎంఎన్ఎస్, ఎన్‌సీపీలు పొత్తు పెట్టుకునే అవకాశం ముందని వస్తున్న వార్తలకు తెరవేసినట్లయింది.Source: జాతీయ | 10 Oct 2009 | 10:17 pm "అదుర్స్"గా ఎన్టీఆర్, నయనతారల కొత్త చిత్రం!?నందమూరి యంగ్‌టైగర్ జూనియర్ ఎన్టీఆర్, ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ కాంబినేషన్‌లో వస్తోన్న క్రేజీ మూవీకి టైటిల్ పరిశీలనలో ఉంది. సెక్సీతార నయనతార, షీలా జోడీగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని వల్లభనేని వంశీమోహన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అదుర్స్, లవకుశ, వాడేవీడు అనే మూడు టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయని తెలిసింది. ఐతే ఇందులో "అదుర్స్"కు మంచి స్పందన వచ్చిందని, అభిమానులు, శ్రేయోభిలాషులు దీన్నీ ఖరారు చేయాలని ఫోన్లు చేస్తున్నారని సమాచారం. తమిళ "బిల్లా"లో కోలీవుడ్ అల్టిమేట్ స్టార్ అజిత్ సరసన నటిస్తూ.. బికినీలో దర్శనమిచ్చిన అందాల తార నయన, ఎన్టీఆర్ చిత్రంలోనూ కురుచ దుస్తులో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోనుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో నయనతార ఆరబోసే అందాలతో బొమ్మాళీ అనుష్క, త్రిష, ప్రియమణిలనే మించిపోతుందని టాలీవుడ్ వర్గాల సమాచారం.Source: Yahoo! Telugu: Entertainment | 10 Oct 2009 | 12:46 pm "ధనుష్" సినిమా నుంచి వాకౌట్ చేసిన త్రిష?తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ అల్లుడు ధనుష్, అందాలతార, పొడవుకాళ్ల సుందరి త్రిష జంటగా "ఆడుకలమ్" అనే కోలీవుడ్ చిత్రం రూపొందుతోంది. దీన్ని తెలుగులో డబ్బింగ్ చేయనున్నారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు వినిపించాయి. కానీ కొన్ని కారణాలవల్ల ఈ చిత్రం చేయనని త్రిష వాకౌట్ చేసిందని సమాచారం. దీంతో త్రిష స్థానంలో ఢిల్లీకి చెందిన "తపసి" అనే అమ్మాయిని హీరోయిన్‌గా ఎన్నుకున్నారట. పలు వ్యాపార సంస్థలకు మోడల్‌గా వ్యవహరించిన తపసికి ఇదే ప్రథమ చిత్రం. ఇందులో కథానాయిక ఆంగ్లో ఇండియన్‌గా ఉండాలని.. అందుకే తపసిని ఎంపికచేశామని దర్శకుడు వెట్రిమారన్ తెలిపారు.Source: Yahoo! Telugu: Entertainment | 10 Oct 2009 | 10:28 am ఆనిస్టన్‌ను ఎందుకు కలుసుకున్నానో తెలుసా..?: బ్రాడ్ పిట్హాలీవుడ్ సూపర్ స్టార్ బ్రాడ్‌పిట్ తన మాజీ భార్య, సెక్సీతార జెన్నీఫర్ ఆనిస్టన్‌ను రహస్యంగా కలుసుకుంటున్నాడని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్. అయితే ఏంజెలీనా జోలీతో తనకున్న సంబంధాన్ని గురించి జెన్నీతో చర్చించేందుకే ఆమెను కలుసుకున్నట్లు బ్రాడ్ పిట్ గ్రాజియా మ్యాగజైన్‌కు తెలిపాడు. గత 2005లో జెన్నీఫర్‌తో తన వివాహ సంబంధాన్ని తెగతెంపులు చేసుకున్న బ్రాడ్‌పిట్.. తాజాగా న్యూయార్క్‌లోని ఓ హోటల్‌లో ఒక గంటపాటు ఆనిస్టన్‌తో గడిపాడని గ్రాజియా మ్యాగజైన్ తన ప్రచురణలో వెల్లడించింది. ఈ విషయంపై బ్రాడ్ పిట్ స్పందిస్తూ.. ఆనిస్టన్‌తో తనకున్న సంబంధంపై తన భార్య, హాలీవుడ్ తార ఏంజెలీనాతో తనకు వివాదాలు తలెత్తున్నాయని చెప్పాడు. ఈ అంశంపై మాట్లాడేందుకు మాత్రమే ఆనిస్టన్‌ను కలిశానని బ్రాడ్ పిట్ దాటవేశాడు.Source: Yahoo! Telugu: Entertainment | 10 Oct 2009 | 7:49 am నావి "పుల్ల విరుపుడు" మాటల్లా ఉంటాయి: కేసీఆర్తనకు తెలుగు సాహిత్యమంటే చాలా ఇష్టమని, అందుకే తన మాటలు పదునుగా, వ్యంగ్యంగా ఉంటాయని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె. చంద్రశేఖర రావు అన్నారు. శనివారం తెలంగాణ భవన్‌లో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య విమర్శలకు ప్రతి విమర్శలు చేశారు. పొన్నాల విమర్శలను చదివి వినిపించి ఖండించారు.Source: ఏపీ న్యూస్ | 10 Oct 2009 | 7:44 am అయోధ్యలో రామాలయంపై కలలు కంటున్నా: అద్వానీహిందూత్వ నినాదంతో ప్రజలకు ముందుకు వచ్చిన భారతీయ జనతాపార్టీ గత లోక్‌సభ ఎన్నికలలో ఘోర పరాజయం పాలైంది. అయినప్పటికీ భాజపా అయోధ్యలో రామాలయ నిర్మాణానికి కట్టుబడి ఉన్నదని ఆ పార్టీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ ప్రకటించారు.Source: జాతీయ | 10 Oct 2009 | 7:12 am "పంచాక్షరి"గా వస్తోన్న "అరుంధతి" బొమ్మాళీ!"అరుంధతి" చిత్రం ద్వారా ప్రేక్షకులను మెప్పించిన అందాల తార, సొట్టబుగ్గల చిన్నది అనుష్క.. మళ్లీ లేడిఓరియెంటెడ్ పాత్రలో నటించబోతోందని సమాచారం. నాగార్జున పర్సనల్ మేకప్‌మెన్ చందు ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. సాయిరత్న క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్లు తెలిసింది. ప్రముఖ దర్శకుడు సముద్ర డైరక్షన్‌లో డిసెంబర్ 11న ఈ చిత్రాన్ని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇంకా ఈ సినిమాకు "పంచాక్షరి" అనే టైటిల్ పరిశీలనలో ఉంది.Source: Yahoo! Telugu: Entertainment | 10 Oct 2009 | 6:04 am కేసీఆరూ.. "వరద" రాజకీయాలు మానుకోండి: శోభానాగిరెడ్డిరాష్ట్రంలోని కర్నూలు, మహబూబ్‌నగర్, గుంటూరు, కృష్ణా జిల్లాలు వరదలతో అతలాకుతలమైన ప్రస్తుత పరిస్థితుల్లో తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ ప్రాజెక్టులపై చేసిన విమర్శలు చేయడం సబబు కాదని ప్రజారాజ్యం పార్టీ ఆళ్లగడ్డ శాసనసభ్యురాలు హితవు పలికారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 854 అడుగులు ఉండవచ్చునని ప్రాజెక్టు నిర్మాణం అప్పుడే నిర్ణయించారని తెలిపారు. ఇప్పుడు కేసీఆర్ మాట్లాడుతున్న అక్రమ ప్రాజెక్టులన్నీ తెలుగుదేశం పార్టీ హయాంలోనివని శోభానాగిరెడ్డి గుర్తుచేశారుSource: ఏపీ న్యూస్ | 10 Oct 2009 | 4:58 am మావోల అణచివేతకు సైన్యాన్ని ఉపయోగించం: ప్రధానిదేశంలో మావోయిస్టుల ఆగడాలను ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొంటుందని ప్రధాని మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు. అయితే మావోల అణచివేతకు సైనిక దళాలను ఉపయోగించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.Source: జాతీయ | 10 Oct 2009 | 4:36 am కర్ణాటకకు వరద సహాయనిధిగా మరో వెయ్యికోట్లు: ప్రధానికర్ణాటక రాష్ట్రానికి వరద తక్షణ సహాయనిధిగా వెయ్యికోట్ల రూపాయలు అందిస్తామని దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కర్ణాటకలోని వరద బాధిత ప్రాంతాలను శనివారం ఏరియల్ సర్వే ప్రధాని వీక్షించారు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సహాయ కార్యక్రమాలను కూడా సమీక్షించిన ప్రధాని అనంతరం మీడియాతో మాట్లాడారు.Source: జాతీయ | 10 Oct 2009 | 4:20 am మధ్యంతర ఎన్నికలు ఎపుడైనా రావచ్చు: హరీష్ రావుమధ్యంతర ఎన్నికలు ఎపుడైనా రావచ్చని.. ఇందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని తెలంగాణా రాష్ట్ర సమితి నేత హరీష్ రావు వెల్లడించారు. తెలంగాణా హక్కుల కోసం రాజ్యాంగాన్నైనా సవరించాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్‌ను ఫ్రీ జోన్‌గా ప్రకటించడం సబబు కాదని హరీష్ రావు అభిప్రాయపడ్డారు.Source: ఏపీ న్యూస్ | 10 Oct 2009 | 3:09 am
|