సమయానుకూలంగా ఉద్ధీపనలను కొనసాగిస్తాం: ప్రధాని

సమయానుకూలంగా ఉద్ధీపన ప్యాకేజీలను కొనసాగిస్తామని ప్రధాని మన్మోహన్ సింగ్ వెల్లడించారు. గత ఏడాదిలో ఆర్థిక మాంద్యం కారణంగా ఆర్థిక ఉద్ధీపన ప్యాకేజీలను ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ.. దాని సామర్థ్య పరిమితులను అందుకునే వరకు.. పూర్తి సామర్థ్యంతో నిర్వహించడంపై తాము దృష్టి పెట్టమన్నారు.
Source: Yahoo! Telugu: News | 10 Oct 2009 | 10:01 am

కర్ణాటకకు వరద సహాయనిధిగా మరో వెయ్యికోట్లు: ప్రధాని

కర్ణాటక రాష్ట్రానికి వరద తక్షణ సహాయనిధిగా వెయ్యికోట్ల రూపాయలు అందిస్తామని దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కర్ణాటకలోని వరద బాధిత ప్రాంతాలను శనివారం ఏరియల్ సర్వే ప్రధాని వీక్షించారు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సహాయ కార్యక్రమాలను కూడా సమీక్షించిన ప్రధాని అనంతరం మీడియాతో మాట్లాడారు.
Source: Yahoo! Telugu: News | 10 Oct 2009 | 9:49 am

అఫ్గాన్‌లో జరిగిన దాడిలో ఐఎస్ఐ ప్రమేయం!

ఆఫ్గనిస్థాన్ రాజధాని కాబూల్‌లోని భారత దౌత్య కార్యాలయంపై శుక్రవారం జరిగిన ఆత్మాహుతిదాడిలో పాక్ నిఘా సంస్థ ఇంటర్‌ సర్వీసెస్ ఇంటలిజెన్స్ (ఐఎస్ఐ) హస్తముందని ఆఫ్గన్ రాయబారి అమెరికాలో తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 10 Oct 2009 | 9:08 am

మధ్యంతర ఎన్నికలు ఎపుడైనా రావచ్చు: హరీష్ రావు

మధ్యంతర ఎన్నికలు ఎపుడైనా రావచ్చని.. ఇందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని తెలంగాణా రాష్ట్ర సమితి నేత హరీష్ రావు వెల్లడించారు. తెలంగాణా హక్కుల కోసం రాజ్యాంగాన్నైనా సవరించాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్‌ను ఫ్రీ జోన్‌గా ప్రకటించడం సబబు కాదని హరీష్ రావు అభిప్రాయపడ్డారు.
Source: Yahoo! Telugu: News | 10 Oct 2009 | 8:37 am

విమర్శలు మాని.. బాధితులను ఆదుకోండి: మొయిలీ

కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలపై విపక్షాలు చేస్తోన్న విమర్శలు మాని.. వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావాలని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్, కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ పిలుపు నిచ్చారు. రాష్ట్రంలోని కర్నూలు, గుంటూరు, కృష్ణా వంటి జిల్లాలను వరదలు ముంచెత్తిన ఈ సమయంలో ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సబబు కాదని మొయిలీ హితవు పలికారు.
Source: Yahoo! Telugu: News | 10 Oct 2009 | 8:07 am

వాషింగ్టన్ నుంచి ఎయిర్ ఇండియా డైలీ సర్వీసు

ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా అమెరికాలో తన కార్యకలాపాలను విస్తరించే దిశగా... వాషింగ్టన్ నుంచి కోల్‌కతాకు డైలీ సర్వీసును ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. డిసెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ సర్వీసు.. వాషింగ్టన్ నుంచి కోల్‌కతాల మధ్య ప్రయాణిస్తూ.. న్యూయార్క్, న్యూఢిల్లీలోను ఆగుతుందని.. ఎయిర్ ఇండియా (ఏఐ) తెలిపింది.
Source: Yahoo! Telugu: News | 10 Oct 2009 | 8:02 am

ఆనిస్టన్‌ను ఎందుకు కలుసుకున్నానో తెలుసా..?: బ్రాడ్‌ పిట్

హాలీవుడ్ సూపర్ స్టార్ బ్రాడ్‌పిట్ తన మాజీ భార్య, సెక్సీతార జెన్నీఫర్ ఆనిస్టన్‌ను రహస్యంగా కలుసుకుంటున్నాడని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్. అయితే ఏంజెలీనా జోలీతో తనకున్న సంబంధాన్ని గురించి జెన్నీతో చర్చించేందుకే ఆమెను కలుసుకున్నట్లు బ్రాడ్ పిట్ గ్రాజియా మ్యాగజైన్‌కు తెలిపాడు. గత 2005లో జెన్నీఫర్‌తో తన వివాహ సంబంధాన్ని తెగతెంపులు చేసుకున్న బ్రాడ్‌పిట్.. తాజాగా న్యూయార్క్‌లోని ఓ హోటల్‌లో ఒక గంటపాటు ఆనిస్టన్‌తో గడిపాడని గ్రాజియా మ్యాగజైన్ తన ప్రచురణలో వెల్లడించింది. ఈ విషయంపై బ్రాడ్ పిట్ స్పందిస్తూ.. ఆనిస్టన్‌తో తనకున్న సంబంధంపై తన భార్య, హాలీవుడ్ తార ఏంజెలీనాతో తనకు వివాదాలు తలెత్తున్నాయని చెప్పాడు. ఈ అంశంపై మాట్లాడేందుకు మాత్రమే ఆనిస్టన్‌ను కలిశానని బ్రాడ్ పిట్ దాటవేశాడు.
Source: Yahoo! Telugu: Entertainment | 10 Oct 2009 | 7:49 am

ముగిసిన ఏరియల్ సర్వే: హస్తినకు పయనమైన ప్రధాని

రాష్ట్రంలో వరద ముంపుకు గురైన కర్నూలు, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ చేసిన ఏరియల్ సర్వే శనివారంతో ముగిసింది. రెండు రోజుల పర్యటన ముగించుకుని ప్రధాని శనివారం దేశ రాజధాని నగరం న్యూఢిల్లీకి పయనమయ్యారు. అలాగే శనివారం కర్ణాటకలోని వరద బాధిత ప్రాంతాల్లో కూడా ప్రధానమంత్రి ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం శంషాబాద్ విమానాశ్రయం చేరుకుని ప్రత్యేక విమానంలో హస్తినకు బయలుదేరారు.
Source: Yahoo! Telugu: News | 10 Oct 2009 | 7:34 am

తమిళనాడుకు పైప్‌లైన్ ద్వారా వంటగ్యాస్: అళగిరి

తమిళనాడు రాష్ట్రానికి పైప్‌లైన్ ద్వారా వంటగ్యాస్ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని అళగిరి తెలిపారు. చెన్నై నగరంలో జరిగిన దక్షిణ వాణిజ్య సదస్సుకు కేంద్ర రసాయన శాఖా మంత్రి అళగిరి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పలు శాఖల్లో రాణించిన విద్యార్థులకు మంత్రి అవార్డులను అందజేశారు. అనంతరం ఈ సభలో మంత్రి మాట్లాడుతూ.. పైప్‌లైన్ ద్వారా కర్ణాటకకు అందజేస్తోన్న వంటగ్యాస్‌ను తమిళనాడులోని తూత్తుకుడి వరకు తెచ్చేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి కేంద్రాన్నికోరారు.
Source: Yahoo! Telugu: News | 10 Oct 2009 | 7:21 am

లాభాల్లో అమెరికా మార్కెట్లు: భారత్‌కు నిరాశే

అమెరికా స్టాక్ మార్కెట్లు గ్రీన్ మార్కులో ముగియగా.. భారత ఏడీఆర్‌లకు మాత్రం నిరాశే మిగిలింది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ ఇండెక్స్ 78 పాయింట్లు పుంజుకుని 9,865 వద్దకు చేరుకోగా.. నాస్‌డాక్ కంపోజిట్ ఇండెక్స్ 15 పాయింట్లు లాభపడి 2,139 వద్ద ముగిసింది.
Source: Yahoo! Telugu: News | 10 Oct 2009 | 7:06 am

రాజకీయాలంటేనే రోత పుట్టింది: జస్వంత్

జిన్నాపై వ్యాఖ్యలు చేసి బహిష్కారానికి గురైన భాజపా నేత జస్వంత్ సింగ్ శనివారం హైదరాబాద్ విచ్చేశారు. ఈ సందర్భంగా బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో విలేకరులతో మాట్లాడుతూ... తనపై భాజపా సస్పెన్షన్ ఎత్తివేసినా తిరిగి ఆ పార్టీలో చేరే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
Source: Yahoo! Telugu: News | 10 Oct 2009 | 7:02 am

"పంచాక్షరి"గా వస్తోన్న "అరుంధతి" బొమ్మాళీ!

"అరుంధతి" చిత్రం ద్వారా ప్రేక్షకులను మెప్పించిన అందాల తార, సొట్టబుగ్గల చిన్నది అనుష్క.. మళ్లీ లేడిఓరియెంటెడ్ పాత్రలో నటించబోతోందని సమాచారం. నాగార్జున పర్సనల్ మేకప్‌మెన్ చందు ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. సాయిరత్న క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్లు తెలిసింది. ప్రముఖ దర్శకుడు సముద్ర డైరక్షన్‌లో డిసెంబర్ 11న ఈ చిత్రాన్ని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇంకా ఈ సినిమాకు "పంచాక్షరి" అనే టైటిల్ పరిశీలనలో ఉంది.
Source: Yahoo! Telugu: Entertainment | 10 Oct 2009 | 6:04 am

మావోల అణచివేతకు సైన్యాన్ని ఉపయోగించం: ప్రధాని

దేశంలో మావోయిస్టుల ఆగడాలను ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొంటుందని ప్రధాని మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు. అయితే మావోల అణచివేతకు సైనిక దళాలను ఉపయోగించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
Source: జాతీయ | 10 Oct 2009 | 4:36 am

కర్ణాటకకు వరద సహాయనిధిగా మరో వెయ్యికోట్లు: ప్రధాని

కర్ణాటక రాష్ట్రానికి వరద తక్షణ సహాయనిధిగా వెయ్యికోట్ల రూపాయలు అందిస్తామని దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కర్ణాటకలోని వరద బాధిత ప్రాంతాలను శనివారం ఏరియల్ సర్వే ప్రధాని వీక్షించారు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సహాయ కార్యక్రమాలను కూడా సమీక్షించిన ప్రధాని అనంతరం మీడియాతో మాట్లాడారు.
Source: జాతీయ | 10 Oct 2009 | 4:20 am

మధ్యంతర ఎన్నికలు ఎపుడైనా రావచ్చు: హరీష్ రావు

మధ్యంతర ఎన్నికలు ఎపుడైనా రావచ్చని.. ఇందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని తెలంగాణా రాష్ట్ర సమితి నేత హరీష్ రావు వెల్లడించారు. తెలంగాణా హక్కుల కోసం రాజ్యాంగాన్నైనా సవరించాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్‌ను ఫ్రీ జోన్‌గా ప్రకటించడం సబబు కాదని హరీష్ రావు అభిప్రాయపడ్డారు.
Source: ఏపీ న్యూస్ | 10 Oct 2009 | 3:09 am

విమర్శలు మాని.. బాధితులను ఆదుకోండి: మొయిలీ

కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలపై విపక్షాలు చేస్తోన్న విమర్శలు మాని.. వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావాలని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్, కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ పిలుపు నిచ్చారు. రాష్ట్రంలోని కర్నూలు, గుంటూరు, కృష్ణా వంటి జిల్లాలను వరదలు ముంచెత్తిన ఈ సమయంలో ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సబబు కాదని మొయిలీ హితవు పలికారు.
Source: ఏపీ న్యూస్ | 10 Oct 2009 | 2:39 am

ముగిసిన ఏరియల్ సర్వే: హస్తినకు పయనమైన ప్రధాని

రాష్ట్రంలో వరద ముంపుకు గురైన కర్నూలు, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ చేసిన ఏరియల్ సర్వే శనివారంతో ముగిసింది. రెండు రోజుల పర్యటన ముగించుకుని ప్రధాని శనివారం దేశ రాజధాని నగరం న్యూఢిల్లీకి పయనమయ్యారు. అలాగే శనివారం కర్ణాటకలోని వరద బాధిత ప్రాంతాల్లో కూడా ప్రధానమంత్రి ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం శంషాబాద్ విమానాశ్రయం చేరుకుని ప్రత్యేక విమానంలో హస్తినకు బయలుదేరారు.
Source: ఏపీ న్యూస్ | 10 Oct 2009 | 2:05 am

తమిళనాడుకు పైప్‌లైన్ ద్వారా వంటగ్యాస్: అళగిరి

తమిళనాడు రాష్ట్రానికి పైప్‌లైన్ ద్వారా వంటగ్యాస్ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని అళగిరి తెలిపారు. చెన్నై నగరంలో జరిగిన దక్షిణ వాణిజ్య సదస్సుకు కేంద్ర రసాయన శాఖా మంత్రి అళగిరి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పలు శాఖల్లో రాణించిన విద్యార్థులకు మంత్రి అవార్డులను అందజేశారు. అనంతరం ఈ సభలో మంత్రి మాట్లాడుతూ.. పైప్‌లైన్ ద్వారా కర్ణాటకకు అందజేస్తోన్న వంటగ్యాస్‌ను తమిళనాడులోని తూత్తుకుడి వరకు తెచ్చేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి కేంద్రాన్నికోరారు.
Source: జాతీయ | 10 Oct 2009 | 1:52 am

రాజకీయాలంటేనే రోత పుట్టింది: జస్వంత్

జిన్నాపై వ్యాఖ్యలు చేసి బహిష్కారానికి గురైన భాజపా నేత జస్వంత్ సింగ్ శనివారం హైదరాబాద్ విచ్చేశారు. ఈ సందర్భంగా బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో విలేకరులతో మాట్లాడుతూ... తనపై భాజపా సస్పెన్షన్ ఎత్తివేసినా తిరిగి ఆ పార్టీలో చేరే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
Source: జాతీయ | 10 Oct 2009 | 1:36 am

మంత్రి పదవికి పొన్నాల అనర్హుడు: చంద్రబాబు

రాష్ట్ర నీటిపారుదల శాఖమంత్రిగా పొన్నాల లక్ష్మయ్య అనర్హుడని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. సీడబ్ల్యూసీ హెచ్చరికలను లెక్కచేయకపోవడం వల్లే కర్నూలుకు వరద నష్టం ఎక్కువైందని బాబు చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 10 Oct 2009 | 1:12 am

రాహుల్ గాంధీ గ్రామాల సందర్శనలో తప్పేముంది: ఆర్ఎస్ఎస్

కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ దేశంలోని గ్రామగ్రామానికి వెళ్లి అక్కడి ప్రజల స్థితిగతులను తెలుసుకోవడం చాలా మెచ్చుకోదగ్గ విషయమని ఆర్ఎస్ఎస్ వ్యాఖ్యానించింది. దేశంలో 67 శాతం ప్రజలు గ్రామాలలోనే నివశిస్తున్నారు కనుక వారి జీవన స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది.
Source: జాతీయ | 10 Oct 2009 | 12:47 am

జాతీయ విపత్తే.. తక్షణ సాయం వెయ్యి కోట్లు: ప్రధాని

రాష్ట్రంలోని వరదలు ముంచెత్తిన కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లాలతో పాటు కర్ణాటకలోని వరద ముంపు ప్రాంతాలను పరిశీలించేందుకు దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ శనివారం బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరారు. శుక్రవారం వరద నష్టాలను పరిశీలించిన ప్రధాని మన్మోహన్ సింగ్ రూ. వెయ్యి కోట్ల తక్షణ సాయాన్ని ప్రకటించారు. శుక్రవారం ప్రధాని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వరద ముంపు ప్రాంతాలను ఆకాశ మార్గం ద్వారా పరిశీలించారు. సాయంత్రం రాజ్‌భవన్‌లో ముఖ్యమంత్రి రోశయ్య, ఇతర మంత్రివర్గ సహచరులు అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో వరద బీభత్సం జాతీయ విపత్తేనని ఈ సందర్భంగా ప్రధాని అన్నారు.
Source: ఏపీ న్యూస్ | 10 Oct 2009 | 12:12 am

వరదముంపు ప్రాంతాల్లో పర్యటించనున్న చిరంజీవి

వరద ముంపు ప్రాంతాల్లో ప్రజారాజ్యం అధినేత చిరంజీవి శని, ఆదివారాల్లో పర్యటించనున్నారు. వరదలు ముంచెత్తిన కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని గ్రామాలను పరిశీలించేందుకు శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం విజయవాడ బయలుదేరి వెళతారు.
Source: ఏపీ న్యూస్ | 9 Oct 2009 | 11:41 pm

ప్రజల విశ్వాసం కోసమే కేసీఆర్ డ్రామా: తులసిరెడ్డి

గత ఎన్నికల్లో నష్టపోయిన తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావు ప్రజల విశ్వాసాన్ని పొందేందుకు అసందర్భపు వ్యాఖ్యలు చేస్తున్నారని పీసీసీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి అన్నారు. మొత్తానికి కేసీఆర్ రాజకీయ డ్రామా ఆడుతున్నారని తులసిరెడ్డి ధ్వజమెత్తారు.
Source: ఏపీ న్యూస్ | 9 Oct 2009 | 11:26 pm

అక్రమ ఆస్తులు కలిగివున్నందుకు మధుకోడాపై కేసు

తన రాజకీయ జీవితంలో అక్రమంగా ఆస్తులు సంపాదించారని, రాష్ట్రానికి చెందిన నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధుకోడాపై కేసు నమోదైంది.
Source: జాతీయ | 9 Oct 2009 | 10:20 pm

బీహార్‌, జార్ఖండ్‌‌లలో బంద్‌: మావోయిస్టులు పిలుపు

బీహార్‌, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో రెండు రోజుల పాటు బంద్‌ నిర్వహించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. కేంద్రప్రభుత్వం పారా మిలిటరీ బలగాలతో తమకు వ్యతిరేకంగా కేంద్రం చర్యలకు దిగడాన్ని వ్యతిరేకిస్తూ 12నుంచి బంద్‌ నిర్వహించాలని తాము నిర్ణయించినట్లు బీహార్‌, జార్ఖండ్‌, ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల ప్రత్యేక కమిటీ అధికార ప్రతినిధి గోపాల్‌ ఒక ప్రకటన విడుదల చేశారు.
Source: జాతీయ | 9 Oct 2009 | 9:54 pm

వీధి రౌడీని "మహాత్మా" అడుగు జాడల్లో నడిపించిన కృష్ణవంశీ

కృష్ణవంశీ చిత్రాలంటే ఒక గులాబి, శశిరేఖా పరిణయం, ఖడ్గం వంటివే కాకుండా నేటి రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేయాలంటే ఏం చేయాలనేదానిపైనా గురి పెట్టడం జరుగుతుంటుంది. ఆ కోవలోనిదే మహాత్మా. ఏం చేస్తే మహాత్మాగాంధీ ఆశయాలను నెరవేరుస్తామనేదానిపై టార్గెట్‌పెట్టి చెప్పదలచుకున్న విషయాన్ని స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేసిన చిత్రమే మహాత్మా.
Source: Yahoo! Telugu: Entertainment | 9 Oct 2009 | 12:16 pm

యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న "జాయ్"

అవితేజ్, త్రినాథ్‌లను హీరోలుగా, పార్వతి, వైనవిలను హీరోయిన్లుగా పరిచయం చేస్తూ.. ఇ.వి.కుమార్ సమర్పణలో "జాయ్" అనే చిత్రం రూపుదిద్దుకుంటోంది. అరుణై పిక్చర్స్ ప్రొడక్షన్ నెం.3గా ఇ.వి.వి. కంభన్ నిర్మిస్తోన్న "జాయ్" యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుంది.
Source: Yahoo! Telugu: Entertainment | 9 Oct 2009 | 10:50 am

ఆసుపత్రి పరిసరాల్లో 125 పాములు

తిరునల్వేలిలో ఓ వైద్యకళాశాలకు చెందిన ఆసుపత్రి పరిసరప్రాంతంలో దాదాపు 125 పాములను పట్టుకున్నామని వైద్యకళాశాల మరియు ఆసుపత్రి స్థానిక వైద్యాధికారి ఎస్. కనాగ్‌రాజ్ తెలిపారు.
Source: జాతీయ | 9 Oct 2009 | 8:41 am

వీధి రౌడీని "మహాత్మా" అడుగు జాడల్లో నడిపించిన కృష్ణవంశీ

కృష్ణవంశీ చిత్రాలంటే ఒక గులాబి, శశిరేఖా పరిణయం, ఖడ్గం వంటివే కాకుండా నేటి రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేయాలంటే ఏం చేయాలనేదానిపైనా గురి పెట్టడం జరుగుతుంటుంది. ఆ కోవలోనిదే మహాత్మా. ఏం చేస్తే మహాత్మాగాంధీ ఆశయాలను నెరవేరుస్తామనేదానిపై టార్గెట్‌పెట్టి చెప్పదలచుకున్న విషయాన్ని స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేసిన చిత్రమే మహాత్మా.
Source: వినోదం | 9 Oct 2009 | 6:51 am

షారుక్ సరసన నేను నటించను: అసిన్

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ సరసన ఛాన్స్ వస్తే ఏ హీరోయినైనా వదులుకుంటుందా...? ఎగిరి గంతేయదూ...? కానీ సెక్సీ లిప్స్ బ్యూటీ అసిన్ మాత్రం షారుక్ జోడీగా నటించనని తెగేసి చెప్పిందట. "హ్యాపీ న్యూ ఇయర్" పేరుతో ఫరాఖాన్ రూపొందించనున్న చిత్రంలో షారుక్ సరసన నటించే అవకాశాన్ని ఇస్తామంటే అసిన్ తిరస్కరించిందట. అసిన్ తిరస్కారం వెనుక సల్మాన్ ఖాన్ హస్తం ఉందని బాలీవుడ్ సినీజనం అనుకుంటున్నారు. సల్మాన్ ఎంత చెపితే అంత అన్నట్లుగా అసిన్ వ్యవహారశైలి ఉంటోందన్న వార్తలు అప్పట్లో వినిపించాయి కూడా. సల్మాన్ ఖాన్‌తో "లండన్ డ్రీమ్స్" చిత్రం చేస్తుండంతో డేట్స్ సమస్య వచ్చి షారుక్ సరసన నటించేందుకు తిరస్కరించినట్లు కొందరు చెపుతున్నారు. ఏదేమైనా అసిన్- సల్మాన్ ఫ్రెండ్‌షిప్ చాలా దృఢంగా మారిందని బాలీవుడ్ సినీజనం అంటున్నారు. ఈ స్నేహం ఎంతవరకు వెళుతుందో చూడాలి.
Source: Yahoo! Telugu: Entertainment | 9 Oct 2009 | 6:42 am

హీరోయిన్‌గా మంచి బ్రేక్ కోసం "అంజలీ పాప" కసరత్తు!

"అంజలి" సినిమా ద్వారా బాలనటిగా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన షామిలి.. తాజాగా కథానాయికగా మార్కులు కొట్టేయాలని భావిస్తోంది. ప్రముఖ నటి షాలిని సోదరి, కోలీవుడ్ అల్టిమేట్ స్టార్ అజిత్ మరదలైన షామిలీ "నువ్వొస్తానంటే.. నేనొద్దాంటానా" ఫేమ్ సిద్ధార్థతో "ఓయ్" చిత్రం ద్వారా హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా షామిలికి మంచి ఓపెనింగ్ ఇచ్చినా.. మంచి బ్రేక్ కోసం అంజలి పాప బోలెడు కథలు వింటుందని ఫిలిమ్ నగర్ వర్గాల సమాచారం. టాలీవుడ్ మాత్రమే గాకుండా.. కోలీవుడ్‌లోనూ కథానాయికగా రంగప్రవేశం చేసేందుకు షామిలీ సన్నాహాలు చేస్తోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 9 Oct 2009 | 6:27 am

నోయిడా పార్కు నిర్మాణానికి సుప్రీం కోర్టు బ్రేక్!

ఉత్తరప్రదేశ్‌లోని మాయావతి సర్కారుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మాయా సర్కారు నోయిడాలో చేపట్టిన అంబేద్కర్ పార్కు నిర్మాణాన్ని తక్షణం నిలిపి వేయాల్సిందిగా సుప్రీం కోర్టు శుక్రవారం ఆదేశించింది.
Source: జాతీయ | 9 Oct 2009 | 6:05 am

ఆహ్లాదం, ఆధ్యాత్మికతల మేలికలయిక "మెదక్"

అత్యద్భుతమైన ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని కళ్లముందు ఆవిష్కరించే కట్టడాలు, మానసికానందాన్ని పంచే మనోహర ప్రదేశాలు, చారిత్రక ప్రాధాన్యాన్ని తెలిపే కోటలు, పచ్చని ప్రకృతితో మైమరిపించే కొండలు, కోనలు, లోయలు, వాగులు, వంకలు, పక్షుల కిలకిలా రావాలు.. ఇలా ఒకటేమిటి ఎన్నో అపురూప ప్రదేశాలను కొంగున ముడి వేసుకున్న అందాల తెలుగింటి జిల్లా "మెదక్". ఈ జిల్లాలో ఆహ్లాదం, ఆధ్యాత్మికత మేలి కలయికతో.. ప్రకృతి ఆరాధకులకు...
Source: వినోదం | 9 Oct 2009 | 5:20 am

కేంద్రం చేసే సహాయం మరువలేనిది: రోశయ్య

రాష్ట్రాన్ని ముంచెత్తిన వరదలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయం మరువలేనిదని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్య అన్నారు. రాష్ట్రంలో వచ్చిన వరద పరిస్థితిని జాతీయ విపత్తుగా ప్రకటించాలని దేశ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ను కోరతానని సీఎం తెలిపారు. వరదల విషయంలో రాష్ట్రాన్ని కేంద్రం అన్నివిధాలా ఆదుకుందని ముఖ్యమంత్రి అన్నారు.
Source: ఏపీ న్యూస్ | 9 Oct 2009 | 4:47 am

బంజారా హిల్స్ బంగళా అమ్మి ఇళ్లు కట్టిస్తా: కేసీఆర్

వరద ముంపునకు గురైన మహబూబ్ నగర్ జిల్లాల్లో గూడు కోల్పోయిన వారికి ప్రభుత్వంతో ఇల్లు కట్టిస్తానని తెలంగాణా రాష్ట్ర సమితి (తెరాస) అధినేత కె.చంద్రశేఖర రావు తెలిపారు. ఈ పని ప్రభుత్వం చేయలేక పోతే హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తన బంగళా అమ్మి గృహాలు కట్టిస్తామని ఆయన ప్రకటించారు.
Source: ఏపీ న్యూస్ | 9 Oct 2009 | 4:46 am

పాకిస్థాన్‌తో చర్చలకు భాజపా సుముఖం: ఎల్కే.అద్వానీ

స్నేహ సంబంధాల పునరుద్ధరణలో భాగంగా దాయాది దేశం పాకిస్థాన్‌‌‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపేందుకు భారతీయ జనతా పార్టీ కూడా సముఖంగానే ఉందని ఆ పార్టీ అగ్రనేత ఎల్కే.అద్వానీ స్పష్టం చేశారు. అయితే, తీవ్రవాదులపై పాక్ కఠిన చర్యలు తీసుకున్నపుడే ఇది సాధ్యమని ఆయన తేల్చి చెప్పారు.
Source: జాతీయ | 9 Oct 2009 | 4:03 am