ప్రతి వెయ్యి మందికి వందకోట్ల డాలర్లు: అమెరికా

ఆఫ్గనిస్థాన్ దేశంలో నెలకొన్న శాంతిభద్రతల సమస్యను ఓ కొలిక్కి తెచ్చేందుకుగాను అమెరికా తన సైనిక బలగాలను అక్కడికి పంపించింది. దీంతో ప్రతి వెయ్యి మందికి ఏడాదికి అయ్యే ఖర్చు వంద కోట్ల డాలర్లౌతుందని వైట్‌హౌస్ ప్రతినిధి రాబర్ట్ గిబ్స్ తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 9 Oct 2009 | 8:48 am

నష్టాల్లో కూరుకుపోతున్న స్టాక్ మార్కెట్

స్టాక్ మార్కెట్ ప్రస్తుతం నష్టాల్లో కూరుకుపోతుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 176 పాయింట్లు కోల్పోయి 16,667 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 48 పాయింట్లు నష్టపోయి 4,954 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 1.05 శాతం, నిఫ్టీ 0.96 శాతం మేరకు క్షీణించాయి. బీఎస్ఈ మధ్య తరహా కంపెనీల ఇండెక్స్ 0.14 శాతం క్షీణించగా.. బీఎస్ఈ చిన్న తరహా కంపెనీల ఇండెక్స్ 0.14 శాతం మేరకు లాభపడింది.
Source: Yahoo! Telugu: News | 9 Oct 2009 | 8:31 am

మహారాష్ట్రలో నక్సల్స్‌పై పోరాటానికి ఆపరేషన్

నక్సల్స్ ఏరివేత కార్యక్రమానికి మహారాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఛత్తీస్‌గఢ్‌తో కలిసి రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో నక్సల్స్‌కు వ్యతిరేకంగా మహారాష్ట్ర ప్రభుత్వం కొత్త ఆపరేషన్‌ను చేపట్టింది. గురువారం.. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో నక్సల్స్ దాడిలో సుమారు 17 నుంచి 20 మంది పోలీసులు మృతిచెందిన విషయం తెలిసిందే.
Source: Yahoo! Telugu: News | 9 Oct 2009 | 8:24 am

నష్టాల్లోనే కొనసాగుతున్న స్టాక్ మార్కెట్

స్టాక్ మార్కెట్ ప్రస్తుతం నష్టాల్లోనే కొనసాగుతుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 88 పాయింట్లు కోల్పోయి 16,755 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 25 పాయింట్లు నష్టపోయి 4,977 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.52 శాతం, నిఫ్టీ 0.51 శాతం చొప్పున క్షీణించాయి.
Source: Yahoo! Telugu: News | 9 Oct 2009 | 7:51 am

కాంగ్రెస్‌లో తెరాస విలీనానికి కేసీఆర్ అడుగులు!

ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర నినాదంతో ఆవిర్భవించిన పార్టీ తెలంగాణా రాష్ట్ర సమితి (తెరాస). ఆ పార్టీ వ్యవస్థాపకుడు కె.చంద్రశేఖర రావుకు రాజకీయ భిక్షను ప్రసాదించి, తనకంటూ ఓ గుర్తింపు తెచ్చి పెట్టింది. ఆరంభశూరత్వం అన్న చందంగా ఆదరగొట్టిన తెరాస.. క్రమంగా ఆ పార్టీ ప్రజల్లో ఆదరణ కోల్పోయింది.
Source: Yahoo! Telugu: News | 9 Oct 2009 | 7:47 am

పాక్‌లోని పేషావర్‌లో పేలుళ్ళు : 15మంది మృతి

పాక్‌లోని వాయువ్యప్రాంతమైన పేషావర్‌లో జనసమర్ధమైన ఖైబర్ బజారులో ఓ బస్సువద్ద కారుబాంబు పేలింది. దీంతో 15 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 14 మంది తీవ్రగాయాల పాలైనారు.
Source: Yahoo! Telugu: News | 9 Oct 2009 | 7:22 am

"ఎక్సలెన్స్ అవార్డ్" పొందిన రిలయన్స్ టెక్నాలజీ

రిలయన్స్ ధీరూభాయ్ అంబానీ సంస్థలకు చెందిన వెంచర్ క్యాపిటల్ కంపెనీ అయిన రిలయన్స్ టెక్నాలజీ వెంచర్ ఎక్సలెన్స్ అవార్డును సొంతం చేసుకుంది.
Source: Yahoo! Telugu: News | 9 Oct 2009 | 7:05 am

ఇండో-బంగ్లా ఫెన్సింగ్ నిర్మాణం 2010 నాటికి పూర్తి

భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో జరుగుతున్న ఫెన్సింగ్ (కంచె) నిర్మాణం వచ్చే యేడాది మార్చి నాటికి పూర్తవుతుందని ప్రభుత్వ అధికారులు శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Source: Yahoo! Telugu: News | 9 Oct 2009 | 6:42 am

షారుక్ సరసన నేను నటించను: అసిన్

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ సరసన ఛాన్స్ వస్తే ఏ హీరోయినైనా వదులుకుంటుందా...? ఎగిరి గంతేయదూ...? కానీ సెక్సీ లిప్స్ బ్యూటీ అసిన్ మాత్రం షారుక్ జోడీగా నటించనని తెగేసి చెప్పిందట. "హ్యాపీ న్యూ ఇయర్" పేరుతో ఫరాఖాన్ రూపొందించనున్న చిత్రంలో షారుక్ సరసన నటించే అవకాశాన్ని ఇస్తామంటే అసిన్ తిరస్కరించిందట. అసిన్ తిరస్కారం వెనుక సల్మాన్ ఖాన్ హస్తం ఉందని బాలీవుడ్ సినీజనం అనుకుంటున్నారు. సల్మాన్ ఎంత చెపితే అంత అన్నట్లుగా అసిన్ వ్యవహారశైలి ఉంటోందన్న వార్తలు అప్పట్లో వినిపించాయి కూడా. సల్మాన్ ఖాన్‌తో "లండన్ డ్రీమ్స్" చిత్రం చేస్తుండంతో డేట్స్ సమస్య వచ్చి షారుక్ సరసన నటించేందుకు తిరస్కరించినట్లు కొందరు చెపుతున్నారు. ఏదేమైనా అసిన్- సల్మాన్ ఫ్రెండ్‌షిప్ చాలా దృఢంగా మారిందని బాలీవుడ్ సినీజనం అంటున్నారు. ఈ స్నేహం ఎంతవరకు వెళుతుందో చూడాలి.
Source: Yahoo! Telugu: Entertainment | 9 Oct 2009 | 6:42 am

అమెరికా, ఆసియా స్టాక్ మార్కెట్లు

అమెరికా స్టాక్ మార్కెట్... డౌ జోన్స్ ఇండస్ట్రియల్ ఇండెక్స్- 0.6 శాతంతో 61 పాయింట్లు పుంజుకుని 9,786 వద్దకు చేరుకుంది. నాస్‌డాక్ కంపోజిట్ ఇండెక్స్- 0.6 శాతంతో 13 పాయింట్లు లాభపడి 1,065 వద్దకు చేరుకుంది. స్టాండార్డ్ అండ్ పూర్స్ 500 ఇండెక్స్- 0.7 శాతంతో 7.9 పాయింట్లు బలపడి 1,065 వద్దకు చేరుకుంది. ఆసియా స్టాక్ మార్కెట్లు... హాంగ్ సెంగ్- 0.1 శాతంతో 26 పాయింట్లు పుంజుకుని 21,519 వద్దకు చేరుకుంది. నిక్కీ- 0.6 శాతంతో 59 పాయింట్లు లాభపడి 9,891 వద్దకు చేరుకుంది. సియోల్ కంపోజిట్- 1.4 శాతంతో 23 పాయింట్లు బలపడి 1,638 వద్దకు చేరుకుంది. షాంఘై కంపోజిట్- 3.1 శాతంతో 86 పాయింట్లు పెరిగి 2,865 వద్దకు చేరుకుంది.
Source: Yahoo! Telugu: News | 9 Oct 2009 | 6:41 am

చంద్రునిపై ఈరోజు దీపావళి: నాసా ఖగోళ శాస్త్రజ్ఞులు

అమెరికా అంతరిక్ష ఏజెన్సీ నాసా చంద్రునిపై నీటికోసం వెతికేందుకుగాను శుక్రవారం తన వద్దనున్న సేన్సింగ్ స్యాటిలైట్ అల్క్రాస్ చంద్రుడిని ఢీకొట్టనుంది. అల్క్రాస్ ఢీ కొట్టడంతో చంద్రునిపై ఫుట్‌బాల్ మైదానంలోని మూడోవంతు భాగంలో ఎంతమాత్రం గుంత ఏర్పడనుందో పరిశీలించనుంది
Source: Yahoo! Telugu: News | 9 Oct 2009 | 6:35 am

హీరోయిన్‌గా మంచి బ్రేక్ కోసం "అంజలీ పాప" కసరత్తు!

"అంజలి" సినిమా ద్వారా బాలనటిగా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన షామిలి.. తాజాగా కథానాయికగా మార్కులు కొట్టేయాలని భావిస్తోంది. ప్రముఖ నటి షాలిని సోదరి, కోలీవుడ్ అల్టిమేట్ స్టార్ అజిత్ మరదలైన షామిలీ "నువ్వొస్తానంటే.. నేనొద్దాంటానా" ఫేమ్ సిద్ధార్థతో "ఓయ్" చిత్రం ద్వారా హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా షామిలికి మంచి ఓపెనింగ్ ఇచ్చినా.. మంచి బ్రేక్ కోసం అంజలి పాప బోలెడు కథలు వింటుందని ఫిలిమ్ నగర్ వర్గాల సమాచారం. టాలీవుడ్ మాత్రమే గాకుండా.. కోలీవుడ్‌లోనూ కథానాయికగా రంగప్రవేశం చేసేందుకు షామిలీ సన్నాహాలు చేస్తోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 9 Oct 2009 | 6:27 am

మహారాష్ట్రలో నక్సల్స్‌పై పోరాటానికి ఆపరేషన్

నక్సల్స్ ఏరివేత కార్యక్రమానికి మహారాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఛత్తీస్‌గఢ్‌తో కలిసి రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో నక్సల్స్‌కు వ్యతిరేకంగా మహారాష్ట్ర ప్రభుత్వం కొత్త ఆపరేషన్‌ను చేపట్టింది. గురువారం.. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో నక్సల్స్ దాడిలో సుమారు 17 నుంచి 20 మంది పోలీసులు మృతిచెందిన విషయం తెలిసిందే.
Source: జాతీయ | 9 Oct 2009 | 2:55 am

కాంగ్రెస్‌లో తెరాస విలీనానికి కేసీఆర్ అడుగులు!

ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర నినాదంతో ఆవిర్భవించిన పార్టీ తెలంగాణా రాష్ట్ర సమితి (తెరాస). ఆ పార్టీ వ్యవస్థాపకుడు కె.చంద్రశేఖర రావుకు రాజకీయ భిక్షను ప్రసాదించి, తనకంటూ ఓ గుర్తింపు తెచ్చి పెట్టింది. ఆరంభశూరత్వం అన్న చందంగా ఆదరగొట్టిన తెరాస.. క్రమంగా ఆ పార్టీ ప్రజల్లో ఆదరణ కోల్పోయింది.
Source: ఏపీ న్యూస్ | 9 Oct 2009 | 2:19 am

ఇండో-బంగ్లా ఫెన్సింగ్ నిర్మాణం 2010 నాటికి పూర్తి

భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో జరుగుతున్న ఫెన్సింగ్ (కంచె) నిర్మాణం వచ్చే యేడాది మార్చి నాటికి పూర్తవుతుందని ప్రభుత్వ అధికారులు శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Source: జాతీయ | 9 Oct 2009 | 1:13 am

ప్రధాని బస ఏర్పాట్లను సమీక్షించిన ముఖ్యమంత్రి

రాష్ట్ర ముఖ్యమంత్రి కె.రోశయ్య ప్రధాని బస ఏర్పాట్లను సమీక్షించారు. వరద బాధిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించేందుకు ప్రధాని మన్మోహన్ సింగ్ శుక్రవారం మధ్యాహ్నం రాష్ట్రానికి వస్తున్న విషయం తెల్సిందే. రెండు రోజుల పాటు సాగే రాష్ట్ర పర్యటనలో భాగంగా, శుక్రవారం రాత్రి ఆయన హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో బస చేస్తారు.
Source: ఏపీ న్యూస్ | 9 Oct 2009 | 12:53 am

తీవ్రవాద సంస్థలపై పాక్ చర్య తీసుకోవాల్సిందే: థరూర్

ముంబై దాడుల్లో సంబంధం ఉన్న తీవ్రవాద గ్రూపులపై పాకిస్థాన్ కఠిన చర్యలను తీసుకోవాలని కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి శశి థరూర్ డిమాండ్ చేశారు. భారత తీవ్రవాద బాధిత దేశమని ఆయన ప్రకటించారు.
Source: జాతీయ | 9 Oct 2009 | 12:17 am

పంజాగుట్ట శ్మశానంలో బాలగోపాల్ అంత్యక్రియలు

గుండెపోటుతో మరణించిన పౌర హక్కుల సంఘం నేత, ప్రముఖ న్యాయవాది డాక్టర్ కె.బాలగోపాల్ అంత్యక్రియలు శుక్రవారం జరుగనున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌, పంజాగట్టలో హిందూ శ్మశానవాటికలో జరుగుతాయని వారి కుటుంబ సభ్యులు వెల్లడించారు.
Source: ఏపీ న్యూస్ | 9 Oct 2009 | 12:00 am

వరద బాధిత ప్రాంతాల్లో ప్రధాని నేడు ఏరియల్ సర్వే

వరద బాధిత ప్రాంతాల్లో ప్రధాని మన్మోహన్ సింగ్ ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆయన ప్రత్యేక విమానంలో శుక్రవారం రాష్ట్రానికి రానున్నారు. ఆయన రెండు రోజుల పాటు రాష్ట్రంలోనే ఉండి పరిస్థితిని సమీక్షిస్తారు.
Source: ఏపీ న్యూస్ | 8 Oct 2009 | 11:48 pm

పౌరహక్కుల నేత బాలగోపాల్ హఠాన్మరణం

రాజ్యహింసకు వ్యతిరేకంగా దశాబ్దాలపాటు అవిశ్రాంత పోరాటం చేసిన ప్రముఖ పౌరహక్కుల ఉద్యమనేత ప్రొఫెసర్ కె. బాలగోపాల్(58) గురువారం రాత్రి గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. రాష్ట్ర మానవ హక్కుల వేదిక ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్న ఆయన.. హైకోర్టు న్యాయవాదిగా పనిచేస్తున్నారు. కాగా.. ఈయనకు భార్య వసంతలక్ష్మి, ఒక కుమారుడు ఉన్నారు.
Source: ఏపీ న్యూస్ | 8 Oct 2009 | 11:35 pm

ఆయుధాలు అప్పగించే ప్రసక్తే లేదు: మావోయిస్టు నేత

కేంద్ర హోం మంత్రి చిదంబరం విజ్ఞప్తి చేసినట్టుగా ఆయుధాలను అప్పగించి, ప్రజాజీవితంలోకి వచ్చే ప్రసక్తే లేదని మావోయిస్టు అగ్రనేత కిసెంజీ స్పష్టం చేశారు. తమ ఏరివేతకు పారామిలిటరీ, ఐఏఎఫ్‌లను ఉపయోగిస్తే వాటిని కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటామని ఆయన తెలిపారు.
Source: జాతీయ | 8 Oct 2009 | 10:22 pm

"ఉపాధి హామీ" యూపీఏ సాధించిన విజయం: రాహుల్

ఉపాధి హామీ పథకం కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం సాధించిన గొప్ప విజయంగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు. ఈ పథకాన్ని ప్రారంభించినపుడు అన్ని ప్రతిపక్ష రాజకీయ పార్టీలు తమను హేళన చేశాయని గుర్తు చేశారు.
Source: జాతీయ | 8 Oct 2009 | 10:09 pm

నటుడు పద్మనాభంకు రామినేని ఫౌండేషన్ సత్కారం

విద్య, వైజ్ఞానిక, కళలు, సాంస్కృతిక రంగాల్లో విశేష కృషి చేసిన వారికి ప్రతి ఏడాది ఇచ్చే పురస్కారాలను డాక్టర్. రావినేని ఫౌండేషన్ ఈ ఏడాదికూడా కళాసేవకులకు అందజేయనుంది. మూడు విశిష్ట పురస్కారాల కేటగిరీలో నటుడు పద్మనాభం, నాట్యకారిణి పద్మశ్రీ శోభారాణి, మహిళా వెయిట్ లిఫ్టర్లను తీర్చిదిద్దిన నీలంశెట్టి అప్పన్నలను ఎంపికచేశారు.
Source: Yahoo! Telugu: Entertainment | 8 Oct 2009 | 12:20 pm

దక్షిణాది సూపర్‌స్టార్‌లచే "సౌత్‌స్కోప్" ఆవిష్కరణ

దక్షిణ భారత చలనచత్ర రంగానికి చెందిన విశేషాలను అందించే సినిమా మాసపత్రిక "సౌత్‌స్కోప్"ను ఇటీవల చెన్నైలో పద్మభూషణ్ కమల్‌హాసన్, రజినీకాంత్, మమ్ముట్టి, మోహన్‌లాల్, వెంకటేష్, శరత్‌కుమార్ చేతులమీదుగా లాంఛనంగా విడుదలైంది.
Source: Yahoo! Telugu: Entertainment | 8 Oct 2009 | 12:04 pm

డిసెంబరులో వస్తోన్న ఎన్టీఆర్-నయనల చిత్రం!

నందమూరి యంగ్‌టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న క్రేజీ మూవీ చివరి షెడ్యూల్‌ హైదరాబాదులో జరుగుతోంది.కొడాలి నాని సమర్పణలో వల్లభనేని వంశీమోహన్ వైష్ణవి ఆర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రం గురించి వి.వి.వినాయక్ మాట్లాడుతూ.. తారక్‌తో తాను చేస్తున్న మూడో చిత్రమిదన్నారు. తారక్ ఇమేజ్‌కు తగినట్లుగా ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలిపారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబరులో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 8 Oct 2009 | 11:47 am

"గాంధీ" అంటే ఇందిరమ్మ ఇంటిపేరు కాదు: కృష్ణవంశీ

శ్రీకాంత్‌కు ప్రతిష్టాత్మకంగా "మహాత్మా"వందో చిత్రం కావడం విశేషం. శ్రీకాంత్, భావన హీరోహీరోయిన్లుగా నటించిన "మహాత్మా" సినిమా ఈ నెల 9న విడుదలకానుంది. ఈ సందర్భంగా ఆ సినిమా కృష్ణవంశీ పలువిషయాలను తెలియజేశారు. ప్రశ్న: "మహాత్మా" అనే పేరుతో తీసిన సినిమా గురించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు?జ: నేను చేసే ప్రతి సినిమాకు ముందుగా కొంత పరిశోధన చేయడం అలవాటు. మహాత్మాగాంధీకి సంబంధించిన సినిమా అనగానే మరింత ఎక్కువగా పుస్తకాలను అధ్యయనం చేశాను. ప్రశ్న: శ్రీకాంత్‌ను మహాత్మగా చూపిస్తున్నారా?జ: ఓ వీధి రౌడీ. అకస్మాత్తుగా మహాత్మాగాంధీలా శాంతిమూర్తి ఎలా అయ్యాడన్నదే పాయింట్. ఈ పాత్రకు శ్రీకాంత్ సరిపోయాడు. ప్రశ్న: సెన్సార్‌పరంగాపలు కట్స్ పడ్డాయని తెలిసింది?జ: "ఇందిరమ్మ ఇంటిపేరు కాదురా గాంధీ.." అంటే అన్న పాటలోని ఇందిరమ్మ అనే పదాన్ని తొలగించారు. ఇలా చిన్నపాటి కటింగ్స్ ఉన్నాయి. ప్రశ్న: మీ చిత్రాల్లో ఎక్స్‌పోజింగ్ ఎక్కువుంటుందనే విమర్శ ఉంది? జ: శృంగారం లేని జీవితం ఉండదు. సినిమాలో కూడా ఒక జీవితం ఉంటుంది. అందులో భాగంగానే శృంగారాన్ని చూపిస్తాను. దాన్ని బూతు అనుకోవడం తప్పిదమే.. అంటూ ముగించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 8 Oct 2009 | 11:21 am

ఎన్టీఆర్‌ది పెద్ద మనసు: అశ్వనీదత్

వరద బాధితుల సహాయార్థం సి.ఎం రిలీఫ్ ఫండ్‌కు 20 లక్షల రూపాయలను ముఖ్యమంత్రి రోశయ్యకు, మరో 20 లక్షల రూపాయలను ఎన్టీఆర్ ట్రస్ట్‌కు విరాళాలుగా అందించిన కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్‌ను అగ్రనిర్మాత, వైజయంతీ మూవీస్ అధినేత అభినందించారు. ఈ సందర్భంగా అశ్వనీదత్ మాట్లాడుతూ... ప్రజలకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా వారిని ఆదుకోవడానికి ఆనాడు మహానటుడు ఎన్టీరామారావుగారు ముందుకు వచ్చేవారు. తాతగారి అడుగు జాడల్లోనే ఈ ఎన్టీఆర్ సేవా కార్యక్రమాలు చేయడం ఎంతైనా అభినందనీయం. వరద బాధితుల సహాయార్థం 40 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చి తన పెద్ద మనసును, ప్రజల పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్న కళాకారుడు ఎన్టీఆర్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ప్రజాసేవ చేయడంలో తాతగారి బాటలో పయనిస్తున్న ఎన్టీఆర్ ఇలాగే ముందు ముందు కూడా ప్రజాహిత కార్యక్రమాలకు సాయం అందిస్తారని ఆశిస్తున్నాను. ఎన్టీఆర్ కీపిటప్" అన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 8 Oct 2009 | 11:04 am

ప్రభుదేవా లవర్ నయనతారనా? నేనెందుకు కాకూడదు..?

ప్రభుదేవా లవర్ ఎవరని అడిగితే సినీ ప్రియులంతా ఒక్కసారిగా సెక్సీతార నయనతార పేరునే చెప్పేస్తారు. ఎందుకంటే..? ఇటీవల ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్ అయిన ప్రభుదేవా-నయనతారతో ప్రేమాయణం సాగిస్తున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. నయనతార ప్రభుదేవా.. లవ్వారా? నేనెందుకు కాకూడదని భూమిక ముందుకొచ్చిందట.. ఇదేదో నిజంగా భూమిక ప్రభుదేవాను ప్రేమిస్తుందా? అనుకుంటే పప్పులో కాలిసినట్టే..!. మళ్లీ నటుడిగా ప్రేక్షకుల మార్కులు కొట్టేయాలని ప్రభు భావిస్తున్నారట. దీనికోసం వైవిధ్యమైన ప్రేమకథాంశాన్ని ప్రభుదేవా ఎంచుకుని తానే హీరోగా నటిస్తున్నట్లు తెలిసింది. ఈ చిత్రంలో ప్రభుదేవా ప్రేయసిగా నటించేందుకు అందాల తార భూమికా చావ్లా అంగీకరించినట్లు సమాచారం. కోలీవుడ్‌లో రూపుదిద్దుకోనున్న ఈ సినిమాను ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు తంగర్ బచ్చన్ రూపొందింస్తున్నట్లు తెలిసింది.
Source: Yahoo! Telugu: Entertainment | 8 Oct 2009 | 10:39 am

మరోవివాదంలో చిక్కుకున్న "మహాత్మా" చిత్రం

శ్రీకాంత్ వందో చిత్రం "మహాత్మా" చిత్రాన్ని వివాదాలు వెంటాడుతున్నాయి. తాను రాసిన "నీలాపురి గాజులు" అనే పాటను మహాత్మా చిత్రంలో అనుమతి లేకుండా వాడుకున్నారని రచయిత లక్ష్మణ్ ఆరోపిస్తున్నారు. దీంతోపాటు "మహాత్మా" చిత్రం విడుదలను ఆపాలంటూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను రాసిన ఆ పాటను చిత్రం నుంచి తొలగించాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు.
Source: Yahoo! Telugu: Entertainment | 8 Oct 2009 | 10:18 am

మడోన్నాను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నా: గైరిచీ

పాప్ రారాణి మడోన్నాను తానింకా ప్రేమిస్తూనే ఉన్నానని ఆమె మాజీ భర్త గైరిచీ మ్యాగజైన్ ఎస్క్వేర్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు. 41 ఏళ్ల ఈ బ్రిటిష్ డైరక్టర్ గైరిచీ తన భార్య మడోన్నాతో ఉన్న వివాహ బంధాన్ని గత ఏడాది విడాకులతో తెగతెంపులు చేసుకున్న సంగతి తెలిసిందే. మడోన్నా కెరీర్ కోసం ఎంతో శ్రమపడ్డానని గైరిచీ చెప్పారు. ఇప్పటికీ.. ఎప్పటికీ మడోన్నాను ప్రేమిస్తూనే ఉంటాను. కానీ మడోన్నాకే తనపై ప్రేమ మందగించిందని గైరిచీ ఆ ఇంటర్వ్యూలో వాపోయారు.
Source: Yahoo! Telugu: Entertainment | 8 Oct 2009 | 9:40 am

వరద ప్రాంత బాధితులకు అమెరికా సాయం: తిమోతి

భారతదేశంలో ఇటీవల సంభవించిన వరదల కారణంగా నష్టపోయిన వారిని ఆదుకునేందుకు అమెరికా ప్రభుత్వం లక్షడాలర్ల సహాయాన్ని ప్రకటించింది.
Source: జాతీయ | 8 Oct 2009 | 8:20 am

మహారాష్ట్రలో పెట్రేగిన నక్సల్స్: 17 మంది పోలీసుల హతం

మహారాష్ట్రలో నక్సల్స్ మరోమారు పెట్రోగిపోయారు. నాగ్‌పూర్ సమీపంలోని గడ్‌చిరోలి అనే ప్రాంతంలో గురువారం నక్సలైట్లు జరిపిన దాడిలో 17 మంది పోలీసులు హతమయ్యారు. ఈజిల్లాలోని భమ్‌రగడ్ తాలూకా లాహిరి ఏరియాలోని పోలీసు పోస్టుపై దాడికి పాల్పడి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.
Source: జాతీయ | 8 Oct 2009 | 7:58 am

ఆరోపణలు చేయడం కేసీఆర్ నైజం: వీరప్ప మొయిలీ

మనస్సు మారినపుడల్లా సంచలన ఆరోపణలు చేయడం తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు అలవాటని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీ అన్నారు.
Source: ఏపీ న్యూస్ | 8 Oct 2009 | 6:56 am

డిసెంబరులో వస్తోన్న ఎన్టీఆర్-నయనల చిత్రం!

నందమూరి యంగ్‌టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న క్రేజీ మూవీ చివరి షెడ్యూల్‌ హైదరాబాదులో జరుగుతోంది. కొడాలి నాని సమర్పణలో వల్లభనేని వంశీమోహన్ వైష్ణవి ఆర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రం గురించి వి.వి.వినాయక్ మాట్లాడుతూ.. తారక్‌తో తాను చేస్తున్న మూడో చిత్రమిదన్నారు. తారక్ ఇమేజ్‌కు తగినట్లుగా ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని..
Source: వినోదం | 8 Oct 2009 | 6:52 am

గోవాలో రేవ్ పార్టీలకు చెల్లుచీటి: హోం మంత్రి రవి

దేశంలోనే కాకుండా ప్రపంచ ప్రఖ్యాత బీచ్‌లలో గోవా తీరం ఒకటి. మన దేశంలోని బీచ్‌లలో విదేశీ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఇలాంటి బీచ్‌లో ఇకపై రేవ్ పార్టీలను అనుమతించబోమని ఆ రాష్ట్ర హోం శాఖామంత్రి రవి నాయక్ తెలిపారు.
Source: జాతీయ | 8 Oct 2009 | 6:43 am

రాహుల్‌ గాంధీని ప్రధానిగా చూడాలని వుంది: జయప్రద

కాంగ్రెస్ పార్టీ యువరాజు రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని బలంగా ఆకాంక్షిస్తున్న వారి జాబితాలో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ, సినీ నటి జయప్రద కూడా చేరిపోయారు. దేశ ప్రధానిగా రాహుల్ గాంధీని చూడాలనే ఆకాంక్ష ఉన్నట్టు ఆమె చెప్పారు.
Source: జాతీయ | 8 Oct 2009 | 6:40 am

ఎన్టీఆర్‌ది పెద్ద మనసు: అశ్వనీదత్

వరద బాధితుల సహాయార్థం సి.ఎం రిలీఫ్ ఫండ్‌కు 20 లక్షల రూపాయలను ముఖ్యమంత్రి రోశయ్యకు, మరో 20 లక్షల రూపాయలను ఎన్టీఆర్ ట్రస్ట్‌కు విరాళాలుగా అందించిన కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్‌ను అగ్రనిర్మాత, వైజయంతీ మూవీస్ అధినేత అభినందించారు. ఈ సందర్భంగా అశ్వనీదత్ మాట్లాడుతూ... ప్రజలకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా వారిని ఆదుకోవడానికి ఆనాడు మహానటుడు ఎన్టీరామారావుగారు ముందుకు వచ్చేవారు. తాతగారి అడుగు జాడల్లోనే ఈ ఎన్టీఆర్ సేవా కార్యక్రమాలు చేయడం ఎంతైనా అభినందనీయం. వరద బాధితుల సహాయార్థం 40 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చి తన పెద్ద మనసును, ప్రజల పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్న కళాకారుడు ఎన్టీఆర్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ప్రజాసేవ చేయడంలో తాతగారి బాటలో పయనిస్తున్న ఎన్టీఆర్ ఇలాగే ముందు ముందు కూడా ప్రజాహిత కార్యక్రమాలకు సాయం అందిస్తారని ఆశిస్తున్నాను. ఎన్టీఆర్ కీపిటప్" అన్నారు.
Source: వినోదం | 8 Oct 2009 | 5:36 am

ప్రభుదేవా లవర్ నయనతారనా? నేనెందుకు కాకూడదు..?

ప్రభుదేవా లవర్ ఎవరని అడిగితే సినీ ప్రియులంతా ఒక్కసారిగా సెక్సీతార నయనతార పేరునే చెప్పేస్తారు. ఎందుకంటే..? ఇటీవల ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్ అయిన ప్రభుదేవా-నయనతారతో ప్రేమాయణం సాగిస్తున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. నయనతార ప్రభుదేవా.. లవ్వారా? నేనెందుకు కాకూడదని భూమిక ముందుకొచ్చిందట.. ఇదేదో నిజంగా భూమిక ప్రభుదేవాను ప్రేమిస్తుందా? అనుకుంటే పప్పులో కాలిసినట్టే..!. మళ్లీ నటుడిగా ప్రేక్షకుల మార్కులు కొట్టేయాలని ప్రభు భావిస్తున్నారట. దీనికోసం వైవిధ్యమైన ప్రేమకథాంశాన్ని ప్రభుదేవా ఎంచుకుని తానే హీరోగా నటిస్తున్నట్లు తెలిసింది. ఈ చిత్రంలో ప్రభుదేవా ప్రేయసిగా నటించేందుకు అందాల తార భూమికా చావ్లా అంగీకరించినట్లు సమాచారం. కోలీవుడ్‌లో రూపుదిద్దుకోనున్న ఈ సినిమాను ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు తంగర్ బచ్చన్ రూపొందింస్తున్నట్లు తెలిసింది.
Source: వినోదం | 8 Oct 2009 | 5:13 am

సాహస, సంభ్రమాల సమ్మేళనం "ఎవరెస్ట్ బేస్‌క్యాంప్"

సరదా ప్రయాణాలను ఇష్టపడేవారు కొందరయితే, సాహసాలు చేస్తూ ముందుకు ఉరికేవారు మరికొంతమంది. ఇక హిమాలయాల్లో ట్రెక్కింగ్ అంటే బోలెడంత సరదా, అంతే స్థాయిలో సాహసం.. కలగలసి ఉంటాయి. ఇక కొండలు ఎక్కి దిగుతూ గడిపేందుకు ఇష్టపడేవాళ్లు జీవితంలో ఒక్కసారయినా "ఎవరెస్ట్ బేస్‌క్యాంప్‌"కు వెళ్లి రావాలని కలలు కంటుంటారు. అయితే సముద్ర మట్టానికి 17,500 అడుగుల ఎత్తులో ఉండే ఎవరెస్ట్ బేస్‌క్యాంప్‌కు...
Source: వినోదం | 8 Oct 2009 | 4:50 am

మరోవివాదంలో చిక్కుకున్న "మహాత్మా" చిత్రం

శ్రీకాంత్ వందో చిత్రం "మహాత్మా" చిత్రాన్ని వివాదాలు వెంటాడుతున్నాయి. తాను రాసిన "నీలాపురి గాజులు" అనే పాటను మహాత్మా చిత్రంలో అనుమతి లేకుండా వాడుకున్నారని రచయిత లక్ష్మణ్ ఆరోపిస్తున్నారు. దీంతోపాటు "మహాత్మా" చిత్రం విడుదలను ఆపాలంటూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను రాసిన ఆ పాటను చిత్రం నుంచి తొలగించాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు.
Source: వినోదం | 8 Oct 2009 | 4:49 am

వరద బాధితులను ఆందుకుందాం.. రండి: సత్యాదేవి

రాష్ట్రంలో సంభవించిన వరదలతో సర్వం కోల్పోయి సాయం కోసం ఎదురుచూస్తున్న బాధితులను ఆదుకునేందుకు చెన్నయ్‌లో నివశిస్తున్న ప్రతి తెలుగువారు ముందుకు రావాలని తమిళనాడు తెలుగు ఫెడరేషన్ మహిళా విభాగం అధ్యక్షురాలు లయన్ ఆర్.సత్యాదేవి పిలుపునిచ్చారు.
Source: ఏపీ న్యూస్ | 8 Oct 2009 | 4:46 am

మడోన్నాను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నా: గైరిచీ

పాప్ రారాణి మడోన్నాను తానింకా ప్రేమిస్తూనే ఉన్నానని ఆమె మాజీ భర్త గైరిచీ మ్యాగజైన్ ఎస్క్వేర్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు. 41 ఏళ్ల ఈ బ్రిటిష్ డైరక్టర్ గైరిచీ తన భార్య మడోన్నాతో ఉన్న వివాహ బంధాన్ని గత ఏడాది విడాకులతో తెగతెంపులు చేసుకున్న సంగతి తెలిసిందే. మడోన్నా కెరీర్ కోసం ఎంతో శ్రమపడ్డానని గైరిచీ చెప్పారు. ఇప్పటికీ.. ఎప్పటికీ మడోన్నాను ప్రేమిస్తూనే ఉంటాను. కానీ మడోన్నాకే తనపై ప్రేమ మందగించిందని గైరిచీ ఆ ఇంటర్వ్యూలో వాపోయారు.
Source: వినోదం | 8 Oct 2009 | 4:10 am

ఆ వ్యాఖ్యలు కేసీఆర్ మూర్ఖత్వానికి నిదర్శనం: జీవన్

రాష్ట్రంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు చేసిన వ్యాఖ్యలు ఆయన మూర్ఖత్వానికి నిదర్శనమని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత టి.జీవన్ రెడ్డి ఆరోపించారు.
Source: ఏపీ న్యూస్ | 8 Oct 2009 | 3:39 am

రోడ్ల మరమ్మతులకు రూ.167 కోట్ల కేటాయింపు: అరుణ

రాష్ట్రాన్ని ముంచెత్తిన వరదలతో దెబ్బతిన్న రాష్ట్ర రహదారుల తాత్కాలిక మరమ్మతుల కోసం రూ. 167 కోట్లు కేటాయించినట్లు రోడ్లు, భవనాల శాఖమంత్రి గల్లా అరుణకుమారి తెలిపారు. గురువారం మంత్రి సచివాలయంలో రహదారుల పరిస్థితిపై మీడియాతో మాట్లాడుతూ.. వరదల కారణంగా రాష్ట్రంలో 13 జిల్లాల్లో రహదారులు దెబ్బతిన్నాయని, దీనివల్ల రూ. 109 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు.
Source: ఏపీ న్యూస్ | 8 Oct 2009 | 2:42 am