ఉద్యోగులను తొలగించనున్న డెల్

కంప్యూటర్ పరికరాల తయారీలో అగ్రగామిగానున్న సంస్థ డెల్ ఉద్యోగులను తొలగించనుంది. ఈ నెలలో తొలుత 905 మందిని తొలగించి వచ్చే నెలలో మిగిలిన 600 మందిని తొలగించనున్ననట్లు కంపెనీ తెలిపింది.
Source: Yahoo! Telugu: News | 8 Oct 2009 | 9:45 am

24 పాయింట్ల లాభంతో సెన్సెక్స్

స్టాక్ మార్కెట్ ప్రస్తుతం 24 పాయింట్లు పుంజుకోవడంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 16,831 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 7 పాయింట్లు లాభపడి 4,993 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్, నిఫ్టీ 0.14 శాతం చొప్పున బలపడ్డాయి.
Source: Yahoo! Telugu: News | 8 Oct 2009 | 9:41 am

మడోన్నాను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నా: గైరిచీ

పాప్ రారాణి మడోన్నాను తానింకా ప్రేమిస్తూనే ఉన్నానని ఆమె మాజీ భర్త గైరిచీ మ్యాగజైన్ ఎస్క్వేర్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు. 41 ఏళ్ల ఈ బ్రిటిష్ డైరక్టర్ గైరిచీ తన భార్య మడోన్నాతో ఉన్న వివాహ బంధాన్ని గత ఏడాది విడాకులతో తెగతెంపులు చేసుకున్న సంగతి తెలిసిందే. మడోన్నా కెరీర్ కోసం ఎంతో శ్రమపడ్డానని గైరిచీ చెప్పారు. ఇప్పటికీ.. ఎప్పటికీ మడోన్నాను ప్రేమిస్తూనే ఉంటాను. కానీ మడోన్నాకే తనపై ప్రేమ మందగించిందని గైరిచీ ఆ ఇంటర్వ్యూలో వాపోయారు.
Source: Yahoo! Telugu: Entertainment | 8 Oct 2009 | 9:40 am

ఆ వ్యాఖ్యలు కేసీఆర్ మూర్ఖత్వానికి నిదర్శనం: జీవన్

రాష్ట్రంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు చేసిన వ్యాఖ్యలు ఆయన మూర్ఖత్వానికి నిదర్శనమని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత టి.జీవన్ రెడ్డి ఆరోపించారు.
Source: Yahoo! Telugu: News | 8 Oct 2009 | 9:08 am

లాభాల్లోనే కొనసాగుతున్న స్టాక్ మార్కెట్

స్టాక్ మార్కెట్ ప్రస్తుతం లాభాల్లోనే కొనసాగుతుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 122 పాయింట్లు పుంజుకుని 16,929 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 39 పాయింట్లు లాభపడి 5,025 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.73 శాతం, నిఫ్టీ 0.78 శాతం చొప్పున వృద్ధి చెందాయి.
Source: Yahoo! Telugu: News | 8 Oct 2009 | 8:27 am

కాబుల్ పేలుళ్ళు అతి క్రూరమైనవి: హమీద్ కర్జయీ

ఆఫ్గనిస్థాన్ రాజధాని కాబుల్‌లోని భారతదేశపు దౌత్యకార్యాలయం వద్ద గురువారం ఉదయం జరిగిన పేలుళ్ళు అతి క్రూరమైనవని, ఇది తీవ్రవాదుల పిరికిపంద చర్యగా ఆ దేశాధ్యక్షుడు హమీద్ కర్జయీ అభివర్ణించారు
Source: Yahoo! Telugu: News | 8 Oct 2009 | 8:16 am

నక్సల్ ప్రభావిత రాష్ట్రాలకు ఐఏఎఫ్ హెలికాఫ్టర్లు: నాయక్

ఐఏఎఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ పీ.వీ.నాయక్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. నక్సల్ ప్రభావిత రాష్ట్రాలకు కమాండో యూనిట్స్‌తో పాటు.. హెలికాఫ్టర్లను పంపనున్నట్టు సూయన ప్రాయంగా వెల్లడించారు.
Source: Yahoo! Telugu: News | 8 Oct 2009 | 8:09 am

బీహార్లో పట్టాలు తప్పిన రైలు: పలువురికి గాయాలు

బీహార్‌లోని భాగల్పూర్ జిల్లాలో బుధవారం అర్థరాత్రి ఓ రైలు పట్టాలు తప్పి ప్రమాదానికి గురయ్యింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా దాదాపు 50 మందికి పైగా తీవ్ర గాయాల పాలైనారు.
Source: Yahoo! Telugu: News | 8 Oct 2009 | 7:47 am

రోడ్ల మరమ్మతులకు రూ.167 కోట్ల కేటాయింపు: అరుణ

రాష్ట్రాన్ని ముంచెత్తిన వరదలతో దెబ్బతిన్న రాష్ట్ర రహదారుల తాత్కాలిక మరమ్మతుల కోసం రూ. 167 కోట్లు కేటాయించినట్లు రోడ్లు, భవనాల శాఖమంత్రి గల్లా అరుణకుమారి తెలిపారు. గురువారం మంత్రి సచివాలయంలో రహదారుల పరిస్థితిపై మీడియాతో మాట్లాడుతూ.. వరదల కారణంగా రాష్ట్రంలో 13 జిల్లాల్లో రహదారులు దెబ్బతిన్నాయని, దీనివల్ల రూ. 109 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు.
Source: Yahoo! Telugu: News | 8 Oct 2009 | 7:39 am

కళకళలాడుతున్న వెండి !

దేశంలో పసిడి ఒక్కటే కాదు, బులియన్ మార్కెట్‌లో వెండి కూడా కళకళలాడుతోంది. ఇదివరకటి గరిష్ఠాలను అధిగమించి వెండి ప్రతి కిలో రూ.27,375 పలికి చారిత్రాత్మకమైన మార్పుకు నాంది పలికింది.
Source: Yahoo! Telugu: News | 8 Oct 2009 | 7:33 am

లాభాలతో పుంజుకుంటున్న స్టాక్ మార్కెట్

స్టాక్ మార్కెట్ ప్రస్తుతం లాభాలతో పుంజుకుంటుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 172 పాయింట్లు బలపడి 16,979 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 55 పాయింట్లు లాభపడి 5,041 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 1.02 శాతం, నిఫ్టీ 1.11 శాతం మేరకు వృద్ధి చెందాయి.
Source: Yahoo! Telugu: News | 8 Oct 2009 | 7:22 am

"నన్ను ముట్టుకున్నా.. ప్రేమించినా.. అది సినిమా వరకే..!"

"గజినీ" బాలీవుడ్ అరంగేట్రం చేసిన అసిన్‌పై ఈ మధ్య రకరకాలుగా గాసిప్స్ వస్తున్నాయి. తాజాగా కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌ సరసన "లండన్ డ్రీమ్స్‌"లో అసిన్ నటిస్తోంది. ఈ నేపథ్యంలో అసిన్‌కు సల్మాన్ ఖాన్ ఇల్లుకూడా కట్టించాడనే వార్త ఫిలిమ్ నగర్ వర్గాల్లో షికార్లు చేస్తోంది.ఈ విషయమై అసిన్ స్పందిస్తూ... "నేను షూటింగ్‌లో ఉండగా ఆ గాలి వార్త వచ్చింది. అప్పుడే సల్మాన్ ఖాన్ వచ్చి "ఎలా ఉంది నీ కొత్త ఇల్లు..?" అంటూ తమాషాగా అడిగారు. పక్కనే ఉన్న అజయ్‌దేవ్‌గన్, విపుల్‌షాలు మాత్రం నవ్వుకున్నారు. ఆ తర్వాత వార్త నిజమేనంటూ.. పలు వెబ్‌సైట్లు గాసిప్స్ రాసేశాయి. అలాగే నాకు పెళ్లికూడా అయిపోయినట్లు వార్తలొచ్చాయి. అమీర్‌ఖాన్‌కు నాకు మధ్య మీరనుకున్న సంబంధంలేదు. మా ఇద్దరి మధ్య కేవలం వృత్తిపరమైన సంబంధం మాత్రమే ఉందని" అసిన్ చెప్పుకొచ్చింది.అంతేకాదు.. మేమిద్దరం మంచి స్నేహితులం. నన్ను ముట్టుకున్నా.. ప్రేమించినా అది సినిమా వరకే.. అంటూ అసిన్ స్పష్టం చేసింది.
Source: Yahoo! Telugu: Entertainment | 8 Oct 2009 | 5:42 am

ఆ వ్యాఖ్యలు కేసీఆర్ మూర్ఖత్వానికి నిదర్శనం: జీవన్

రాష్ట్రంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు చేసిన వ్యాఖ్యలు ఆయన మూర్ఖత్వానికి నిదర్శనమని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత టి.జీవన్ రెడ్డి ఆరోపించారు.
Source: ఏపీ న్యూస్ | 8 Oct 2009 | 3:39 am

రోడ్ల మరమ్మతులకు రూ.167 కోట్ల కేటాయింపు: అరుణ

రాష్ట్రాన్ని ముంచెత్తిన వరదలతో దెబ్బతిన్న రాష్ట్ర రహదారుల తాత్కాలిక మరమ్మతుల కోసం రూ. 167 కోట్లు కేటాయించినట్లు రోడ్లు, భవనాల శాఖమంత్రి గల్లా అరుణకుమారి తెలిపారు. గురువారం మంత్రి సచివాలయంలో రహదారుల పరిస్థితిపై మీడియాతో మాట్లాడుతూ.. వరదల కారణంగా రాష్ట్రంలో 13 జిల్లాల్లో రహదారులు దెబ్బతిన్నాయని, దీనివల్ల రూ. 109 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు.
Source: ఏపీ న్యూస్ | 8 Oct 2009 | 2:42 am

బీహార్లో పట్టాలు తప్పిన రైలు: పలువురికి గాయాలు

బీహార్‌లోని భాగల్పూర్ జిల్లాలో బుధవారం అర్థరాత్రి ఓ రైలు పట్టాలు తప్పి ప్రమాదానికి గురయ్యింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా దాదాపు 50 మందికి పైగా తీవ్ర గాయాల పాలైనారు.
Source: జాతీయ | 8 Oct 2009 | 2:41 am

నక్సల్ ప్రభావిత రాష్ట్రాలకు ఐఏఎఫ్ హెలికాఫ్టర్లు: నాయక్

ఐఏఎఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ పీ.వీ.నాయక్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. నక్సల్ ప్రభావిత రాష్ట్రాలకు కమాండో యూనిట్స్‌తో పాటు.. హెలికాఫ్టర్లను పంపనున్నట్టు సూయన ప్రాయంగా వెల్లడించారు.
Source: జాతీయ | 8 Oct 2009 | 2:40 am

ముఖ్యమంత్రి రోశయ్య పాలన భేష్: జానారెడ్డి

రాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్య పాలన బాగుందని మాజీ హోం మంత్రి జానారెడ్డి కితాబిచ్చారు. ముఖ్యమంత్రి అందరిని కలుపుకుని సంయమనంతో ముందుకు దూసుకెళుతున్నారని మంత్రి ప్రశంసించారు. వరదలతో రాష్ట్రం అతలాకుతలం అవుతుంటే మంత్రివర్గ విస్తరణపై మాట్లాడటం సబబు కాదని జానారెడ్డి అన్నారు.
Source: ఏపీ న్యూస్ | 8 Oct 2009 | 2:05 am

వైఎస్.జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్ పంగనామాలు!

దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి తనయుడు, కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం మొండిచేయి చూపడం ఖాయమని తేలింది. ఆ దిశగా పావులు కదుపుతోంది.
Source: ఏపీ న్యూస్ | 8 Oct 2009 | 12:30 am

2014 ఎన్నికల పోటీకి అద్వానీ దూరం: వెంకయ్య నాయుడు

2014 సంవత్సరంలో జరుగనున్న సాధారణ ఎన్నికల్లో తమ పార్టీ అగ్రనేత ఎల్కే.అద్వానీ పోటీ చేయబోరని ఆ పార్టీ జాతీయ మాజీ అధ్యక్షుడు ముప్పవరపు వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. ముఖ్యంగా, 2014 ఎన్నికలకు అద్వానీ నాయకత్వం వహించబోరని ఆయన వెల్లడించారు.
Source: జాతీయ | 8 Oct 2009 | 12:08 am

వరద పరిస్థితిపై అధికారులతో మన్మోహన్ సమీక్ష

రాష్ట్రంలో అపార నష్టం కలిగించిన వరద తాకిడిపై ప్రధాని మన్మోహన్ సింగ్ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఏరియల్ సర్వే పూర్తి చేసిన తర్వాత ఆయన హైదారాబాద్‌లో ఈ సమీక్షా సమావేశం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
Source: ఏపీ న్యూస్ | 7 Oct 2009 | 11:42 pm

వరద సహాయక చర్యల్లో సర్కారు విఫలం: చంద్రబాబు

వరద బాధితులను ఆదుకోవడంలోనూ, సహాయ చర్యలు చేపట్టడంలోనూ రాష్ట్ర సర్కారు పూర్తిగా విఫలమైందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. వరద జిల్లాల్లో చేపట్టిన పర్యటన రెండో రోజుకు చేరుకుంది.
Source: ఏపీ న్యూస్ | 7 Oct 2009 | 11:29 pm

చొరబాట్లను అరికట్టేందుకు పాక్ అయిష్టత: మంత్రి ఆంటోనీ

దేశ వాణిజ్య రాజధాని ముంబైపై తీవ్రవాదులు దాడులు జరిపిన తర్వాత కూడా సరిహద్దుల్లో చొరబాట్లను అరికట్టేందుకు పాకిస్థాన్ సిద్ధపడటం లేదని కేంద్ర రక్షణ శాఖామంత్రి ఏకే.ఆంటోనీ ఆరోపించారు.
Source: జాతీయ | 7 Oct 2009 | 10:21 pm

హింసను వీడితో నక్సల్స్‌తో చర్చలు: మంత్రి చిదంబరం

అంతర్గత భద్రతకు విఘాతం కల్పిస్తూ హింసకు పాల్పడుతున్న నక్సలైట్లపై పోరు కొనసాగుతుందని కేంద్ర హోంమంత్రి చిదంబరం తేల్చి చెప్పారు. అదేసమయంలో హింసను వీడి రాజీమార్గంలోకి వస్తే మాత్రం వారితో చర్చలు జరిపేందుకు తాము సిద్ధమేనని ఆయన చెప్పారు.
Source: జాతీయ | 7 Oct 2009 | 10:10 pm

బి.వి.ఎం. ప్రొడక్షన్స్‌పై కొత్త చిత్రం ప్రారంభం

బి.వి.ఎం. ప్రొడక్షన్స్ పతాకంపై రాజా ఎస్. తాన్ దర్శకత్వంలో మునిరత్నం రెడ్డి నిర్మిస్తోన్న కొత్త చిత్రం షూటింగ్ సారథి స్టూడియోలో బుధవారం లాంఛనంగా ప్రారంభమైంది. హీరోలు దివేష్, మధులపై తొలిషాట్ చిత్రీకరించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 7 Oct 2009 | 1:11 pm

9న ప్రేక్షకుల ముందుకు "నిజంగా నువ్వే గుర్తొస్తున్నావు"

విశాల్, సమీక్ష జంటగా లక్ష్మీ అన్నపూర్ణేశ్వరి పిక్చర్స్ పతాకంపై నిర్మించిన చిత్రం "నిజంగా నువ్వే గుర్తొస్తున్నావు". సి.హెచ్. సత్యనారాయణ నిర్మించిన ఈ చిత్రానికి మంజూర్ దర్శకుడు. ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ.. ఇదొక అపూర్వ ప్రేమకథా చిత్రమన్నారు. ప్రేమించిన అమ్మాయి కోసం తపనపడే వారు కొందరైతే, ఆ అమ్మాయి ప్రేమ తనకే దక్కాలనుకునే ప్రేమరోగులు మరికొందరు. ఇటీవల కాలంలో ప్రేమకు సంబంధించిన అనేక సంఘటనలను చూస్తున్నాం. వింటున్నాం. ఈ సంఘటనలో ఒక విషయాన్ని తీసుకుని హాట్‌లవ్‌గా రూపొందిస్తోన్న చిత్రమిదని నిర్మాత వెల్లడించారు. థ్రిల్లింగ్ లవ్‌స్టోరీగా ఈ చిత్రాన్ని ఈ నెల 9న విడుదల చేస్తున్నామని ఆయన తెలిపారు.
Source: Yahoo! Telugu: Entertainment | 7 Oct 2009 | 12:59 pm

శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న "వీడు మనవాడే"

"కిక్" శ్యామ్ హీరోగా మల్లికాకపూర్ హీరోయిన్‌గా "వీడు మనవాడే" చిత్రం రూపొందుతోంది. అన్నం ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నేతాజీ దర్శకత్వంలో సి. విజయకుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ సారథి స్టూడియోలో జరుగుతోంది. తాజా షెడ్యూల్‌ను ఈ నెలాఖరు వరకు జరుపుతామని దర్శకుడు నేతాజీ చెప్పారు.
Source: Yahoo! Telugu: Entertainment | 7 Oct 2009 | 12:47 pm

డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డిగా రాజశేఖర్ నటించట్లేదు

దివంగత మహానేత వైఎస్సార్ పాత్రను తాను పోషిస్తున్నట్లు "కిక్"లో పోలీస్ ఆఫీసర్‌గా నటించిన శ్యామ్ అంగీకరించారు. ఇందుకు సంబంధించిన చర్చలు ఇటీవలే పూరీ జగన్నాథ్‌తో జరిగాయని శ్యామ్ బుధవారం నాడు ప్రకటించారు. అయితే సినిమా షూటింగ్ ఎప్పుడు ఎలా జరుగుతుందనే విషయాలను ఇంకా తెలియజేయలేదని శ్యామ్ అన్నారు. వైఎస్ పాత్ర పోషించడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని శ్యామ్ పేర్కొన్నారు. అలాగే తాజాగా తేజ దర్శకత్వంలో, డి. సురేష్‌బాబు సమర్పణలో నిర్మించనున్న కొత్త చిత్రంలోనూ శ్యామ్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 7 Oct 2009 | 12:08 pm

"ఖడ్గం" బ్యూటీ సంగీత పర్సనల్ టచ్

"ఖడ్గం" చిత్రం ద్వారా అద్భుతమైన నటనతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన బ్యూటీ క్వీన్ సంగీత. 'ఈ అబ్బాయి చాలా మంచోడు', 'పెళ్లాం ఊరెళితే', 'శివపుత్రుడు' వంటి సినిమాల్లో నటించిన సంగీత.. ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటో తేదీన నేపథ్య గాయకుడు క్రిష్‌ను వివాహమాడింది. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో సుమారు 20 చిత్రాలకు పైగా నటించిన సంగీత.. గాయనిగా, రసికగా అందరికి తెలిసే ఉంటుంది. ఇకపోతే ఈమె అసలు పేరు: సంగీత జన్మస్థలం: తమిళనాడుఇతర పేర్లు: రసిక, సంగీత క్రిష్, తొలి తెలుగు చిత్రం: ఖడ్గంప్రస్తుతం షూటింగ్‌లో ఉన్న చిత్రాలు: శ్రీమతి కళ్యాణం, దుర్గ.
Source: Yahoo! Telugu: Entertainment | 7 Oct 2009 | 10:11 am

క్యాట్‌వాక్‌కు గుడ్‌బై చెప్పిన క్లాడియా!

జర్మనీ సూపర్ మోడల్ క్లాడియా షెఫెర్ క్యాట్ వాక్‌కు గుడ్ బై చెప్పేస్తానంటోంది. దాదాపు 20 ఏళ్ల పాటు మోడలింగ్‌లో తన క్యాట్‌వాక్‌తో ప్రేక్షకుల మదిని దోచిన క్లాడియా ఇక మోడలింగ్ చేసేది లేదని స్పష్టం చేసింది. అంతేకాదు.. నటీమణిగా కొనసాగుతూ.. నవోమి క్యాంప్‌బెల్ వంటి తారల్లా మోడలింగ్ చేసి వారి బాటలో నడిచేందుకు తాను సిద్ధంగా లేనని క్లాడియా తేల్చిచెప్పేసింది.
Source: Yahoo! Telugu: Entertainment | 7 Oct 2009 | 9:57 am

కాశ్మీరీ యువతి రుక్సానాకు బ్రేవరీ అవార్డు

జమ్మూ కాశ్మీర్‌కు చెందిన రుక్సానా కౌసర్‌కు భారతదేశం అందించే అత్యంత ప్రతిష్టాత్మకమైన బ్రేవరీ అవార్డును ఇవ్వనున్నామని కేంద్ర హోం శాఖామంత్రి పి. చిదంబరం ముంబైలో బుధవారం ప్రకటించారు.
Source: జాతీయ | 7 Oct 2009 | 9:01 am

మనసున్న మా యమ్మ.. సోనియమ్మ: కేసీఆర్

తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మనస్సు మార్చుకున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై పొగడ్తల వర్షం గుప్పించారు. మనస్సున్న సోనియా అభివర్ణించారు. దివంగత నేత వైఎస్.రాజశేఖర రెడ్డి అడ్డుకట్ట వల్లే ఆమె ప్రత్యేక తెలంగాణా రాష్ట్రాన్ని ఇవ్వలేక పోయారన్నారు.
Source: ఏపీ న్యూస్ | 7 Oct 2009 | 8:46 am

ధోనీ ఫస్ట్... షారుఖ్ సెకండ్... ఐశ్వర్యారాయ్ థర్డ్!!

ప్రతి ఏటా ఏ సెలబ్రిటీకి ఎంత జనాదరణ ఉన్నదో తెలుసుకునేందుకు సర్వేలు నిర్వహించడం మామూలే. ఈసారి హన్సా రీసెర్చ్‌లో టాప్ సెలబ్రిటీ లిస్టులో అనూహ్యంగా ధోనీ ప్రథమ స్థానంలో నిలిచాడు. ద్వితీయ స్థానాన్ని బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ఆక్రమించగా తృతీయ స్థానంలో మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ నిలిచారు.
Source: జాతీయ | 7 Oct 2009 | 8:16 am

వరద బాధితులకు సినీ ప్రముఖుల విరాళాలు

రాష్ట్రంలోని వరద బాధితులను ఆదుకునేందుకు అన్ని వర్గాలకు చెందిన ప్రజలు ముందుకు వస్తున్నారు. తమ వంతు సాయం చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అలాగే, వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల సైతం ఏదో రకంగా సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు.
Source: ఏపీ న్యూస్ | 7 Oct 2009 | 6:55 am

మీటింగ్‌లో కోడిగుడ్లు విసిరిన "వైఎస్సార్"ను ఎలా ప్రమోట్ చేస్తారు..?

దివంగత మహానేత, కాంగ్రెస్ నాయకుడు వై.ఎస్. రాజశేఖర రెడ్డి జీవిత చరిత్రను సినిమాగా రూపొందించనున్నట్లు ఇటీవలే పూరీజగన్నాథ్, హీరో రాజశేఖర్ దంపతులు ప్రకటించారు. దానికోసం 3 నెలలు కృషి చేయాలని, అందుకు సంబంధించిన విషయాలను సేకరించాలని నిర్ణయించామని చెప్పారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ చిత్రం తెరపైకి వచ్చే సూచనలు కన్పించడంలేదు. ఆదిలోనే హంసపాదులా.. ఈ చిత్రానికి పూరీ దర్శకుల శాఖలోని వారు మాత్రం సహకరిచడం లేదు. ఈ చిత్రాన్ని తీస్తే.. అంతా ఒకముద్ర ఏర్పడుతుందని, దానితో మిగిలిన సినిమాలకు పనిచేసే అవకాశాలు చేజారిపోతాయని పూరీతో దర్శకులు వెల్లడించినట్లు తెలిసింది. అలాగే వై.ఎస్. పేదప్రజలకు చేసింది ఒక ఎత్తయితే ఆయనది మరో ఫ్యాక్షన్ కోణం. ఆ కోణంలో ఆయన్ని ఎలా చూపించాలో తర్జనభర్జనలు పడుతున్నారు. స్వర్గీయ పి.వి. నరసింహారావు మీటింగ్ పెడితే.. ఆయనపై చెప్పులు, టమోటాలు, కోడిగుడ్లు విసిరిన వై.ఎస్.ను మీరెలా ప్రమోట్‌చేస్తారని విలేకరులు అడిగితే.. అటువంటి కోణాలను కూడా ఆలోచిస్తున్నామని పూరి అస్పష్టమైన సమాచారం చెప్పారు.
Source: Yahoo! Telugu: Entertainment | 7 Oct 2009 | 6:50 am

రెండు రాష్ట్రాల్లో వరదలు: 269కు పెరిగిన మృతులు

కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సంభవించిన భారీ వరదలకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 269కు చేరుకుంది. కృష్ణా నది కరకట్టకు భారీ గండిపడింది. దీంతో గుంటూరు జిల్లాలోని అనేక గ్రామాలు నీట మునిగే ప్రమాదం ఉంది.
Source: జాతీయ | 7 Oct 2009 | 6:34 am

"తరుణ్" ఛాన్సును కొట్టేసిన నచ్చావులే "తనీష్"!

తెలుగు సినిమా రంగంలో ఈ మధ్య కుర్రహీరోలకే పోటీ పెరిగింది. ఒకరి చిత్రాల్లో మరొకరు చొరబడటం మామూలైపోయింది. సక్సెస్ ఉంటేనే చుట్టూ తిరిగే ఇండస్ట్రీలో తరుణ్‌కు ఓ ఛాన్సు మిస్సైందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి. తరుణ్‌కు ఈ మధ్య సక్సెస్‌లు లేకపోవడంతో.. ఓ కొత్త సినిమా కాల్షీట్‌ను యంగ్ హీరో తనీష్ దక్కించుకున్నాడని తెలిసింది. "నచ్చావులే" హీరోగా మంచిపేరు తెచ్చుకున్న తనీష్ ఆ తర్వాత "రైడ్" చిత్రంలో నటించాడు. అదీ నిర్మాతకు మంచి సక్సెస్ ఇవ్వడంతో మిగిలిన నిర్మాతలందరూ తనీష్ చుట్టూ తిరుగుతున్నట్లు సమాచారం.
Source: Yahoo! Telugu: Entertainment | 7 Oct 2009 | 6:20 am

9న రాష్ట్ర పర్యటనకు ప్రధాని మన్మోహన్ సింగ్

రాష్ట్రంలో వరద ముంపుకు గురైన కృష్ణా, గుంటూరు, కర్నాలు, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లో ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ పర్యటించనున్నారు. ఈ నెల 9వ తేదీన మన్మోహన్ సింగ్ రాష్ట్ర పర్యటన ఖరారైంది. ఆ రోజు ఉదయం 8.55 గంటలకు దేశ రాజధాని నగరం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి, 11.20 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి వరద ముంచెత్తిన గుంటూరు, కృష్ణా, కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లాల్లో పర్యటిస్తారు. తర్వాత 12.45కి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని 12.50 నుంచి 1.50 వరకు రాష్ట్రంలో వరద ముంపు పరిస్థితిపై అధికారులతో సమీక్షా సమావేశం జరుపుతారు.
Source: ఏపీ న్యూస్ | 7 Oct 2009 | 5:25 am

ఆ స్వర్గమే దిగివచ్చి.. "అండమాన్"లా మురిపించి..!!

అందమైన ప్రకృతిని కొంగున ముడి వేసుకున్న ఈ ప్రాంతంలో తెల్లవారుఝాము 5 గంటలకల్లా తెలతెలవారుతుంటుంది. అలాగే సాయంత్రం 5 గంటలకల్లా చీకటి పడిపోతుంటుంది. ఈ ప్రాంతం పేరే "అండమాన్". మన స్వాతంత్ర్య సమరయోధులు చెరసాలల్లో మగ్గిపోయింది ఈ ద్వీపంలోనే. సముద్రాన్ని నిలువెల్లా తాగేయాలనీ, ఆకాశాన్నంతటినీ గుప్పిట్లో బంధించేయాలని, ప్రకృతి ఒడిలో ఆదమరచి సేదతీరాలని భావించే ప్రకృతి ప్రేమికులు తప్పకుండా చూడాల్సిన ప్రదేశమే అందాల అండమాన్.
Source: వినోదం | 7 Oct 2009 | 4:57 am

అది రాజకీయ ఎత్తుగడ కాదు: రాహుల్ స్పష్టీకరణ

తన పర్యటనల్లో భాగంగా దళితుల ఇళ్ళలో బస చేయడం రాజకీయ ఎత్తుగడ కాదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఈ అంశంలో బీఎస్పీ అధినేత్రి మాయావతితో పాటు.. ఇతర పార్టీలు చేస్తున్న విమర్శలను రాహుల్ తోసిపుచ్చారు.
Source: జాతీయ | 7 Oct 2009 | 3:29 am

ఆహార ధాన్యాల నష్టం రూ.860 కోట్లు: మంత్రి రఘువీర

వరద బారిన పడిన జిల్లాల్లో సుమారు 860 కోట్ల రూపాయల మేరకు ఆహార ధాన్యాల నష్టం వాటిల్లిందని రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి ఎన్.రఘువీరా రెడ్డి తెలిపారు. అలాగే, భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆయన తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 7 Oct 2009 | 2:52 am