|
స్టాక్ మార్కెట్లో మళ్లీ విస్తరిస్తున్న నష్టాలుస్టాక్ మార్కెట్లో మళ్లీ నష్టాలు విస్తరిస్తుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 120 పాయింట్లు కోల్పోయి 16,839 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 32 పాయింట్లు నష్టపోయి 4,995 వద్ద పయనిస్తోంది.Source: Yahoo! Telugu: News | 7 Oct 2009 | 9:22 am బొగ్గును దిగుమతి చేసుకోనున్న ఎస్ఏఐఎల్ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వంటకు ఉపయోగించే బొగ్గును విదేశాలనుంచి దిగుమతి చేసుకోనున్నట్లు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తెలిపింది.Source: Yahoo! Telugu: News | 7 Oct 2009 | 9:14 am అది రాజకీయ ఎత్తుగడ కాదు: రాహుల్ స్పష్టీకరణతన పర్యటనల్లో భాగంగా దళితుల ఇళ్ళలో బస చేయడం రాజకీయ ఎత్తుగడ కాదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఈ అంశంలో బీఎస్పీ అధినేత్రి మాయావతితో పాటు.. ఇతర పార్టీలు చేస్తున్న విమర్శలను రాహుల్ తోసిపుచ్చారు.Source: Yahoo! Telugu: News | 7 Oct 2009 | 8:57 am తగ్గిన నష్టాలు: రికవరీ దిశగా సెన్సెక్స్స్టాక్ మార్కెట్లో నష్టాలు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం సెన్సెక్స్ రికవరీ దిశగా పయనిస్తోంది. దీంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 7 పాయింట్లు కోల్పోయి 16,952 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 5 పాయింట్లు నష్టపోయి 5,022 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.44 శాతం, నిఫ్టీ 0.11 శాతం మేరకు క్షీణించాయి.Source: Yahoo! Telugu: News | 7 Oct 2009 | 8:22 am ఆహార ధాన్యాల నష్టం రూ.860 కోట్లు: మంత్రి రఘువీరవరద బారిన పడిన జిల్లాల్లో సుమారు 860 కోట్ల రూపాయల మేరకు ఆహార ధాన్యాల నష్టం వాటిల్లిందని రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి ఎన్.రఘువీరా రెడ్డి తెలిపారు. అలాగే, భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆయన తెలిపారు.Source: Yahoo! Telugu: News | 7 Oct 2009 | 8:21 am లాడెన్ పాకిస్థాన్‌లోనే ఉన్నాడు: అమెరికాఅల్ఖైదా తీవ్రవాద సంస్థకు చెందిన చీఫ్ ఒసామా బిన్ లాడెన్ పాకిస్థాన్‌లో తలదాచుకుని ఉన్నాడని, ఇది అతనికి ఎంతో సురక్షితమైన ప్రదేశమని కూడా అమెరికా భావిస్తోంది.Source: Yahoo! Telugu: News | 7 Oct 2009 | 8:18 am 1800 కోట్ల పెట్టుబడి పెట్టనున్న అపోలోఅపోలో గ్రూప్ సంస్థ రానున్న రెండు సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా తన వైద్య సేవలను విస్తరించే నేపథ్యంలో దాదాపు 18 వందల కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టనుంది. ఇందులో భాగంగా రెండు వేల పడకలను ఏర్పాటు చేయనున్నట్లు అపోలో గ్రూప్ ఛైర్మెన్ ప్రతాప్.సి.రెడ్డి తెలిపారు.Source: Yahoo! Telugu: News | 7 Oct 2009 | 8:12 am రాష్ట్ర డీజీపీపై వేటు: కొత్త చీఫ్‌గా గిరీష్ కుమార్రాష్ట్ర డీజీపీ ఎస్.ఎస్.పి.యాదవ్‌పై ప్రభుత్వం ఎట్టకేలకు వేటు వేసింది. పోలీసు డైరక్టర్ జనరల్ కొత్త అధిపతిగా గిరీష్ కుమార్‌ను ప్రభుత్వం నియమించింది. అలాగే, మరో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులపై కూడా బదిలీ వేటు వేసింది.Source: Yahoo! Telugu: News | 7 Oct 2009 | 8:09 am నష్టాల్లో స్టాక్ మార్కెట్: బలహీనపడిన సెన్సెక్స్స్టాక్ మార్కెట్ ప్రస్తుతం నష్టాల్లో పయనిస్తుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 46 పాయింట్లు కోల్పోయి 16,913 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ 14 పాయింట్లు నష్టపోయి 5,013 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.27 శాతం, నిఫ్టీ 0.28 శాతం మేరకు క్షీణించాయి.Source: Yahoo! Telugu: News | 7 Oct 2009 | 7:31 am మహారాష్ట్ర సమరం: నేరచరిత అభ్యర్థుల్లో ఎంఎన్ఎస్ టాప్మహారాష్ట్ర అసెంబ్లీకి ఈనెల 13వ తేదీన జరుగనున్న ఎన్నికల్లో అన్ని పార్టీలు నేర చరిత్ర కలిగిన అభ్యర్థులను బరిలోకి దించాయి. ఇలాంటి పార్టీల్లో మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) అగ్రస్థానంలో ఉంది. ఈ పార్టీ తరపున 14 మంది క్రిమినల్స్ బరిలో ఉన్నారు.Source: Yahoo! Telugu: News | 7 Oct 2009 | 7:26 am మీటింగ్‌లో కోడిగుడ్లు విసిరిన "వైఎస్సార్"ను ఎలా ప్రమోట్ చేస్తారు..?దివంగత మహానేత, కాంగ్రెస్ నాయకుడు వై.ఎస్. రాజశేఖర రెడ్డి జీవిత చరిత్రను సినిమాగా రూపొందించనున్నట్లు ఇటీవలే పూరీజగన్నాథ్, హీరో రాజశేఖర్ దంపతులు ప్రకటించారు. దానికోసం 3 నెలలు కృషి చేయాలని, అందుకు సంబంధించిన విషయాలను సేకరించాలని నిర్ణయించామని చెప్పారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ చిత్రం తెరపైకి వచ్చే సూచనలు కన్పించడంలేదు. ఆదిలోనే హంసపాదులా.. ఈ చిత్రానికి పూరీ దర్శకుల శాఖలోని వారు మాత్రం సహకరిచడం లేదు. ఈ చిత్రాన్ని తీస్తే.. అంతా ఒకముద్ర ఏర్పడుతుందని, దానితో మిగిలిన సినిమాలకు పనిచేసే అవకాశాలు చేజారిపోతాయని పూరీతో దర్శకులు వెల్లడించినట్లు తెలిసింది. అలాగే వై.ఎస్. పేదప్రజలకు చేసింది ఒక ఎత్తయితే ఆయనది మరో ఫ్యాక్షన్ కోణం. ఆ కోణంలో ఆయన్ని ఎలా చూపించాలో తర్జనభర్జనలు పడుతున్నారు. స్వర్గీయ పి.వి. నరసింహారావు మీటింగ్ పెడితే.. ఆయనపై చెప్పులు, టమోటాలు, కోడిగుడ్లు విసిరిన వై.ఎస్.ను మీరెలా ప్రమోట్‌చేస్తారని విలేకరులు అడిగితే.. అటువంటి కోణాలను కూడా ఆలోచిస్తున్నామని పూరి అస్పష్టమైన సమాచారం చెప్పారు.Source: Yahoo! Telugu: Entertainment | 7 Oct 2009 | 6:50 am "తరుణ్" ఛాన్సును కొట్టేసిన నచ్చావులే "తనీష్"!తెలుగు సినిమా రంగంలో ఈ మధ్య కుర్రహీరోలకే పోటీ పెరిగింది. ఒకరి చిత్రాల్లో మరొకరు చొరబడటం మామూలైపోయింది. సక్సెస్ ఉంటేనే చుట్టూ తిరిగే ఇండస్ట్రీలో తరుణ్‌కు ఓ ఛాన్సు మిస్సైందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి. తరుణ్‌కు ఈ మధ్య సక్సెస్‌లు లేకపోవడంతో.. ఓ కొత్త సినిమా కాల్షీట్‌ను యంగ్ హీరో తనీష్ దక్కించుకున్నాడని తెలిసింది. "నచ్చావులే" హీరోగా మంచిపేరు తెచ్చుకున్న తనీష్ ఆ తర్వాత "రైడ్" చిత్రంలో నటించాడు. అదీ నిర్మాతకు మంచి సక్సెస్ ఇవ్వడంతో మిగిలిన నిర్మాతలందరూ తనీష్ చుట్టూ తిరుగుతున్నట్లు సమాచారం.Source: Yahoo! Telugu: Entertainment | 7 Oct 2009 | 6:20 am టీవీ యాంకర్‌గా అవతారమెత్తిన బొమ్మరిల్లు జెనీలియా!అష్టాచమ్మా ఫేమ్ కలర్స్ స్వాతి వంటి టీవీ యాంకర్లు నటీనటులుగా తమ ప్రతిభను నిరూపించుకుంటుంటే.. హీరోయిన్లు టీవీ యాంకర్లుగా అవతారమెత్తనున్నారు. పలు టీవీషోల్లో కథానాయికలు జడ్జిలుగా కన్పిస్తున్న నేపథ్యంలో.. తాజాగా బొమ్మరిల్లు జెనీలియా టీవీ యాంకర్‌గా అవతారమెత్తింది. ఓ టీవీ ఛానెల్‌లో రియాల్టీ షో కోసం ఇటీవలే నిర్వాహకుల్ని కలిసింది. ఇప్పటికే కొంతభాగం షూటింగ్‌లో కూడా పాల్గొంది. రెండు వారాలపాటు ఈ కార్యక్రమం జరిగింది. మురికివాడల్లో ఈ చిత్రీకరణ సాగుతోంది. అక్కడి నివసించే చిన్నారులతో కలిసి సేవాకార్యక్రమాల్లో చిలిపినవ్వుల జెనీలియా పాల్గొననుంది.Source: Yahoo! Telugu: Entertainment | 7 Oct 2009 | 5:37 am అది రాజకీయ ఎత్తుగడ కాదు: రాహుల్ స్పష్టీకరణతన పర్యటనల్లో భాగంగా దళితుల ఇళ్ళలో బస చేయడం రాజకీయ ఎత్తుగడ కాదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఈ అంశంలో బీఎస్పీ అధినేత్రి మాయావతితో పాటు.. ఇతర పార్టీలు చేస్తున్న విమర్శలను రాహుల్ తోసిపుచ్చారు.Source: జాతీయ | 7 Oct 2009 | 3:29 am ఆహార ధాన్యాల నష్టం రూ.860 కోట్లు: మంత్రి రఘువీరవరద బారిన పడిన జిల్లాల్లో సుమారు 860 కోట్ల రూపాయల మేరకు ఆహార ధాన్యాల నష్టం వాటిల్లిందని రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి ఎన్.రఘువీరా రెడ్డి తెలిపారు. అలాగే, భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆయన తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 7 Oct 2009 | 2:52 am రాష్ట్ర డీజీపీపై వేటు: కొత్త చీఫ్‌గా గిరీష్ కుమార్రాష్ట్ర డీజీపీ ఎస్.ఎస్.పి.యాదవ్‌పై ప్రభుత్వం ఎట్టకేలకు వేటు వేసింది. పోలీసు డైరక్టర్ జనరల్ కొత్త అధిపతిగా గిరీష్ కుమార్‌ను ప్రభుత్వం నియమించింది. అలాగే, మరో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులపై కూడా బదిలీ వేటు వేసింది.Source: ఏపీ న్యూస్ | 7 Oct 2009 | 2:39 am మహారాష్ట్ర సమరం: నేరచరిత అభ్యర్థుల్లో ఎంఎన్ఎస్ టాప్మహారాష్ట్ర అసెంబ్లీకి ఈనెల 13వ తేదీన జరుగనున్న ఎన్నికల్లో అన్ని పార్టీలు నేర చరిత్ర కలిగిన అభ్యర్థులను బరిలోకి దించాయి. ఇలాంటి పార్టీల్లో మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) అగ్రస్థానంలో ఉంది. ఈ పార్టీ తరపున 14 మంది క్రిమినల్స్ బరిలో ఉన్నారు.Source: జాతీయ | 7 Oct 2009 | 1:57 am రాష్ట్ర ఆర్థిక మంత్రిగా స్పీకర్ ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి!?రాష్ట్ర ఆర్థిక మంత్రి బాధ్యతల నుంచి ముఖ్యమంత్రి కె.రోశయ్య తప్పుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే ఒక వైపు వయోభారం, మరోవైపు ముఖ్యమంత్రి విధుల భారంతో సతమతమవుతున్న రోశయ్య.. తనపై ఉన్న బరువును ఇతరులపై మోపేందుకు కృషి చేస్తున్నారు.Source: ఏపీ న్యూస్ | 7 Oct 2009 | 12:54 am ఆంధ్ర-కర్ణాటకలో వరదలు: 197కు చేరుకున్న మృతులుఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో సంభవించిన వరదల వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 250కు చేరుకుంది. ఒక్క కర్ణాటక రాష్ట్రంలోనే మృతుల సంఖ్య 197గా ఉన్నట్టు ఆ రాష్ట్ర అధికార వర్గాలు వెల్లడించాయి.Source: జాతీయ | 7 Oct 2009 | 12:42 am ఆంధ్ర, కర్ణాటక వరదలు జాతీయ విపత్తే: వెంకయ్య నాయుడుఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో సంభవించిన వరదలు జాతీయ విపత్తేనని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఎం.వెంకయ్య నాయుడు అన్నారు. అందువల్ల ఈ రెండు రాష్ట్రాలకు తక్షణ సాయంగా ఐదు వేల కోట్ల రూపాయలు చొప్పున ప్రత్యేక ప్యాకేజీని విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.Source: ఏపీ న్యూస్ | 7 Oct 2009 | 12:31 am వరద నష్టం అంచనా ఇపుడే సాధ్యం కాదు: మంత్రి ధర్మానవరద బారిన పడిన జిల్లాల్లో బురద మేటలు ఉన్నందున నష్టం అంచనా వేయడం ఇపుడే సాధ్యం కాదని రాష్ట్ర రెవెన్యూ శాఖామంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. అంతేకాకుండా, కృష్ణా నదికి వచ్చే వరద ఉద్ధృతి కూడా తగ్గుముఖం పట్టిందని, అందువల్ల గుంటూరు, కృష్ణా జిల్లాలకు కూడా పెద్ద గండం తప్పినట్టేనని ఆయన అభిప్రాయపడ్డారుSource: ఏపీ న్యూస్ | 6 Oct 2009 | 11:49 pm మరో 24 గంటలు అప్రమత్తంగా ఉండాలి: కృష్ణా కలెక్టర్ప్రకాశం బ్యారేజీకి వచ్చే వరద నీటి ఉద్ధృతి తగ్గుముఖం పట్టినప్పటికీ మరో 24 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని కృష్ణా జిల్లా కలెక్టర్ అధికారులను కోరారు. ముఖ్యంగా కృష్ణానది కరకట్టలు పలు చోట్ల బలహీనంగా ఉన్నందున ఆయా ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండేలా చూడాలని కోరారు.Source: ఏపీ న్యూస్ | 6 Oct 2009 | 11:37 pm భావోద్వేగాలతో ఆడుకుంటున్న విపక్షాలు: సోనియాగాంధీదేశంలోని కొన్ని రాజకీయ పార్టీలు ప్రజల భావోద్వేగాలతో ఆడుకుంటున్నాయని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆరోపించారు. అలాగే, కొన్ని రాజకీయ పార్టీలు ఛత్రపతి శివాజీ పేరును కూడా తమ రాజకీయ స్వలాభాల కోసం వాడుకుంటున్నాయని ఆమె విమర్శించారు.Source: జాతీయ | 6 Oct 2009 | 11:30 pm తాలిబన్‌లను భారత్‌పై ప్రేరేపిస్తున్న పాక్ ఐఎస్ఐపాకిస్థాన్ సైనికులు అరెస్టు చేసిన తాలిబన్ తీవ్రవాదులను భారత్‌పైకి ప్రేరేపించేందుకు ఐఎస్ఐ ప్రయత్నిస్తోంది. ఈ మేరకు నిఘా వర్గాలకు సమాచారం అందింది. పాక్ భూభాగంలోని తాలిబన్ తీవ్రవాద స్థావరాలను ధ్వంసం చేసే పనిలో పాక్ సైన్యం నిమగ్నమై ఉన్న విషయం తెల్సిందే.Source: జాతీయ | 6 Oct 2009 | 11:16 pm నదుల అనుసంధానంతో పెను ముప్పు: మంత్రి జైరామ్దేశంలోని నదులను అనుసంధానం చేయడం వల్ల పెను ముప్పు ఏర్పడే అవకాశం ఉందని కేంద్ర పర్యావరణ, అటవీశాఖామంత్రి జైరామ్ రమేష్ అభిప్రాయపడ్డారు. ఈ ప్రాజెక్టు కాగితాలపై చూపేందుకు బ్రహ్మాండంగానే ఉండవచ్చని, కార్యరూపం దాల్చితే మాత్రం పెద్ద ఎత్తున నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.Source: జాతీయ | 6 Oct 2009 | 9:47 pm నా మనసును ఓ హీరో దొంగలించాడు: హన్సిక"ఏదైనా డబ్బులు పెట్టి కొనుక్కుని తింటే అంత రుచిగా ఉండదు. దొంగలించి తింటే ఆ రుచేవేరుగా ఉంటుందనే సూత్రాన్ని తెల్లపిల్ల, దేశముదురు భామ హన్సిక వల్లెవేస్తోంది. అలా అని మీరంతా ఆ పని చేయకండి.. అసలుకే మోసం వస్తుంది. నేనేదో చిన్నప్పుడు పక్కపినీసులు, ఇంట్లో వక్కపొడి దొంగలించేదాన్ని. అలాగే స్నేహితులతో కలిసి రెస్టారెంట్‌కు వెళితే.. వారు తింటున్న రుచికరమైన ఐటంను వారిని మాటల్లో పెట్టి తినేసేదాన్ని.. అలా దొంగలించి తినేవి మహారుచిగా ఉంటాయని" హన్సిక చెప్పుకొచ్చింది. అయితే నా నుంచి ఒకటి దొంగలించబడిందని హన్సిక తెలివిగా సమాధానమిచ్చింది. అదేమిటంటే..? నా మనసును హీరో దొంగలించాడు. అది ఎట్లా అనేది జయీభవ సినిమాలో చూసి థ్రిల్ కావాల్సిందేనని హన్సిక ట్విస్ట్ పెట్టింది.Source: Yahoo! Telugu: Entertainment | 6 Oct 2009 | 12:08 pm కృష్ణ..కృష్ణ..ప్రమాదం తప్పినట్లేః ధర్మానరాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రెవెన్యూ శాఖామంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ... గత కొద్ది రోజులుగా కురిసిన వర్షాల కారణంగా పలు జిల్లాల్లో వరద ఉధృతి తగ్గుముఖం పట్టిందని, కృష్ణా, గుంటూరు జిల్లాలకు ప్రమాద పరిస్థితి తప్పినట్లేనని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.Source: ఏపీ న్యూస్ | 6 Oct 2009 | 9:35 am యమస్పీడ్‌గా "యంగ్ ఇండియా" షూటింగ్ సన్నాహాలుశతాధిక చిత్ర దర్శకులు దర్శకరత్న డా. దాసరి నారాయణరావు దర్శకత్వం వహిస్తోన్న 149వ చిత్రం "యంగ్ ఇండియా"కు నూతన నటీనటుల ఎంపిక ప్రక్రియ దాదాపు పూర్తి కావచ్చింది. అందరూ కొత్త వాళ్లతో రూపొందుతోన్న ఈ చిత్రం కోసం "నూతన నటీనటులు కావలెను" అంటూ విడుదల చేసిన పత్రికా ప్రకటనలకు విశేష స్పందన లభించింది. ఇప్పటికే ఈ చిత్రం కోసం కీరవాణి సంగీత సారధ్యంలో ఆరు పాటలకు రికార్డింగ్ పూర్తయింది. స్క్రిప్ట్ వర్క్ కూడా ముగిసింది. త్వరలో షూటింగ్ కార్యక్రమాలను ప్రారంభిస్తున్నామని నిర్మాత రామకృష్ణ ప్రసాద్ తెలిపారు.Source: Yahoo! Telugu: Entertainment | 6 Oct 2009 | 9:16 am వరద బాధిత కుటుంబాలకు రూ.లక్ష: ప్రధానిగత కొద్ది రోజులుగా భారీ వర్షాల కారణంగా దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో వరదముంపుకు గురైన బాధిత కుటుంబాలకు లక్షరూపాయలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు ప్రధాని ప్రకటించారు.Source: జాతీయ | 6 Oct 2009 | 8:58 am 21న రామ్‌చరణ్, జెనీలియా కొత్త చిత్రం ప్రారంభం!ప్రముఖ నిర్మాణ సంస్థ అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌తేజ హీరోగా, బొమ్మరిల్లు కథానాయికగా జెనీలియా హీరోయిన్‌గా రూపొందించనున్న మెగా మూవీ ఈ నెల 21న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం కానుంది. కె. వెంకట్రావు సమర్పణలో మెగాబ్రదర్ కె. నాగేంద్రబాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించడం విశేషం. ప్రెస్టీజియస్ అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.7గా ఈ క్రేజీ మూవీ రూపొందుతోంది.Source: Yahoo! Telugu: Entertainment | 6 Oct 2009 | 8:56 am నమితా.. నగ్నంగా నటిస్తావా..?: హిందీ నిర్మాతలుదక్షిణాది సెక్సీ తారల్లో నమితకు ప్రత్యేక స్థానం ఉన్నది. ఆమె సినిమాలంటే టీనేజ్ కుర్రకారు ఎగబడతారు. ఈ విషయాన్ని గమనించిన బాలీవుడ్ హిందీ నిర్మాతలు కొందరు నమితకు తాము నిర్మించబోయే చిత్రంలో అవకాశమిస్తామన్నారట. దాంతో ఒక్క గెంతేసి... పట్టరాని ఆనందంలో తేలియాడుతూ... ఆ సినిమాలో తన పాత్ర ఏమిటని అడిగిందట నమిత. ఆ ప్రశ్నకు హిందీ నిర్మాతల నుంచి వచ్చిన సమాధానాన్ని విని దిమ్మెరపోయిందట. రాజారవివర్మ జీవితాన్ని తాము తెరకెక్కిస్తున్నామనీ, ఈ ప్రయత్నంలో భాగంగా ఆయన చిత్రించిన కొన్ని నగ్న చిత్రాలకు ప్రతిరూపంగా నటించాల్సి ఉంటుందని నమితకు చెప్పారట. దీంతో చిర్రెత్తిన నమిత ఫోన్ కట్ చేసిందట. ఆ ఆఫర్ విషయాన్ని తన చెవికేసిన వ్యక్తిపై ఇంతెత్తు ఎగిరిందట. ఎలాగూ అందాలు చూపిస్తుంది కదా... అరకొరగా మిగిలిన అందాలను కూడా వెండితెరపై ఆరబోస్తుందేమో అడగమంటే అడిగానని సదరు వ్యక్తి గొణుక్కుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడట. అన్నట్లు ఈ సినిమాలో నందనాసేన్ అలా నటించడానికి అంగీకరించినట్లు భోగట్టా. ఇందులో నిజమెంతో సినిమా వచ్చిన తర్వాత కానీ తెలియదు.Source: Yahoo! Telugu: Entertainment | 6 Oct 2009 | 8:35 am మధురై సమీపంలో పేలుడు: ముగ్గురి మృతితమిళనాడులోని మధురై ప్రాంతానికి సమీపంలోనున్న చోళవందన్ రైల్వే స్టేషన్‌లో మంగళవారం సాయంత్రం భారీ విస్ఫోటనం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా పలువురు తీవ్రగాయాలపాలైనారు.Source: జాతీయ | 6 Oct 2009 | 8:30 am "అరుంధతి" సినిమాను నేనింకా చూడలేదు: త్రిషమనం ఏ రంగంలో పనిచేస్తున్నామో.. ఆ ఫీల్డు గురించి బాగా తెలుసుకోవడం సహజం. ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో ఉన్నవారికి ఆ రంగంపై పూర్తి అవగాహన ఉండటం అవసరమని పొడవుకాళ్ల సుందరి, సొట్ట బుగ్గల చిన్నది త్రిష అంటోంది. పక్కాహీరో సినిమా సక్సెస్ అయితే అది ఎందుకు సక్సెస్ అయిందో చూడటం పరిపాటే. అయితే లేడిఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ సినిమా "అరుంధతి" చిత్రాన్ని తానింకా చూడనేలేదని త్రిష చెబుతోంది. పైగా మహిళా ప్రాధాన్యతగల చిత్రాలు చేయాలని ఉంది. కానీ అవకాశాలు రావడం లేదని త్రిష అంటోంది. మంచి కథ, మంచి దర్శకుడు దొరికితే చాలు. లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేస్తానని ప్రకటించేసింది.Source: Yahoo! Telugu: Entertainment | 6 Oct 2009 | 7:55 am రాష్ట్రంలో భారీ వరదలతో 64మంది మృతి: ధర్మానరాష్ట్రంలో సంభవించిన భారీ వరదలతో ఇప్పటివరకు 64మంది మృతులను గుర్తించినట్లు రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు మంగళవారం ప్రకటించారు. ఇందులో భాగంగా.. కర్నూలు జిల్లాలో 39మంది, మహబూబ్‌నగర్‌లో 20 మంది, నల్గొండలో ముగ్గురు, గుంటూరు, కృష్ణాజిల్లాలలో ఒకరి చొప్పున మరణించినట్లు ఆయన తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 6 Oct 2009 | 7:15 am వరద బాధితులను రేషన్ కార్డులడిగితే ఎలా..?రాష్ట్రంలో భీభత్సం సృష్టించిన వరదలతో నిరాశ్రయులైన మంత్రాలయం బాధితులకు సహాయ కార్యక్రమాలు అందించేందుకుగానూ రేషన్ కార్డులు అడగడం హాస్యాస్పదమని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎర్రన్నాయుడు అన్నారు. వరదలకు సామానులతో పాటు ఇళ్లు కూడా కొట్టుకుపోతే.. బాధితులు రేషన్ కార్డులు ఎక్కడ నుంచి తీసుకువస్తారని ఎర్రన్నాయుడు ప్రశ్నించారు.Source: ఏపీ న్యూస్ | 6 Oct 2009 | 6:58 am నక్సల్స్ వైపు నుంచి డిమాండ్ లేదు: మంత్రి చిదంబరంచెరలో ఉన్న స్పెషల్ బ్రాంచ్ పోలీసు ఇన్‌స్పెక్టర్‌ను ప్రాణాలతో వదిలి పెట్టేందుకు నక్సలైట్లు ఎలాంటి డిమాండ్లు చేయలేదని కేంద్ర హోంమంత్రి పి.చిదంబరం స్పష్టం చేశారు. అలాంటిదేమీ లేకుండా కిడ్నాప్ చేసిన ఇన్‌స్పెక్టర్‌ను అతి కిరాతకంగా హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు.Source: జాతీయ | 6 Oct 2009 | 5:55 am సెన్సార్ సిగ్నల్ కోసం వేచివున్న "పదహారేళ్ల వయసు..!"ఇద్దరి జీవితాల్లో పదహారేళ్ల ప్రాయం సృష్టించిన అలజడిని ఇతివృత్తంగా తీసుకుని రూపొందుతున్న చిత్రమే 'పదహారేళ్ల వయసు'. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఎడిటింగ్ కార్యక్రమాల్లో ఉన్న పదహారేళ్ల వయసు సినిమాకు సెన్సార్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉందని చిత్ర యూనిట్ వెల్లడించింది. భూషణ్, ఆర్య ఓరా జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీసూర్య దర్శకుడు. డెరెక్టర్స్ మూవీ పతాకంపై కిలారి హరిప్రసాద్, యాడవల్లి నర్సింగరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సందేశంతో కూడిన యూత్ ఎంటర్‌టైనర్ ఇదని నిర్మాతలు తెలిపారు.Source: Yahoo! Telugu: Entertainment | 6 Oct 2009 | 5:45 am పక్షుల కిలకిలా రావాల "కొత్త బంగారు లోకం"ప్రకృతి అందాలకు, అరుదైన వలస పక్షులకు ఆలవాలం "కొల్లేటి సరస్సు". కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలలో వ్యాపించి ఉన్న సహజ సిద్ధమైన ఈ మంచినీటి సరస్సు.. లక్షకు పైగా ఎకరాలలో వ్యాపించి ఉంది. మనోహరమైన ప్రకృతి సౌందర్యాన్ని తనలో ఇముడ్చుకున్న ఈ సరస్సు.. ఎన్నో రకాల చేపలకు కూడా నిలయమే. ముఖ్యంగా అనేక విదేశీ పక్షులకు ఇది మెట్టినిల్లుగా పేరు సంపాదించుకుంది.Source: వినోదం | 6 Oct 2009 | 5:36 am వరద బాధిత ప్రాంతాల్లో అంటువ్యాధుల ముప్పు: చిరువరద బాధిత ప్రాంతాల్లో అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ఆందోళన వ్యక్తం చేశారు. వరద ముంపునకు గురైన కర్నూలు జిల్లాలో ఆయన మంగళవారం పర్యటించి, బాధితులను పరామర్శించారు.Source: ఏపీ న్యూస్ | 6 Oct 2009 | 4:41 am శ్రీనగర్‌లో గ్రెనేడ్ దాడి: ఇద్దరు జవాన్లకు గాయాలుశ్రీనగర్లో మిలిటెంట్లు మరోమారు ఘాతుకానికి పాల్పడ్డారు. నగరంలో భద్రతలో నిమగ్నమైవున్న జవాన్లపై గ్రెనేడ్లతో దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. శ్రీనగర్ పట్టణంలోని నడిబొడ్డున ఉన్న లాల్ చౌక్ అనే ప్రాంతంలో ఈ దాడి జరిగిందని పోలీసులు వెల్లడించారు.Source: జాతీయ | 6 Oct 2009 | 4:00 am యమస్పీడ్‌గా "యంగ్ ఇండియా" షూటింగ్ సన్నాహాలుశతాధిక చిత్ర దర్శకులు దర్శకరత్న డా. దాసరి నారాయణరావు దర్శకత్వం వహిస్తోన్న 149వ చిత్రం "యంగ్ ఇండియా"కు నూతన నటీనటుల ఎంపిక ప్రక్రియ దాదాపు పూర్తి కావచ్చింది. అందరూ కొత్త వాళ్లతో రూపొందుతోన్న ఈ చిత్రం కోసం "నూతన నటీనటులు కావలెను" అంటూ విడుదల చేసిన పత్రికా ప్రకటనలకు విశేష స్పందన లభించింది. ఇప్పటికే ఈ చిత్రం కోసం కీరవాణి సంగీత సారధ్యంలో ఆరు పాటలకు రికార్డింగ్ పూర్తయింది. స్క్రిప్ట్ వర్క్ కూడా ముగిసింది. త్వరలో షూటింగ్ కార్యక్రమాలను ప్రారంభిస్తున్నామని నిర్మాత రామకృష్ణ ప్రసాద్ తెలిపారు.Source: వినోదం | 6 Oct 2009 | 3:51 am
|