శ్రీనగర్‌లో గ్రెనేడ్ దాడి: ఇద్దరు జవాన్లకు గాయాలు

శ్రీనగర్‌లో మిలిటెంట్లు మరోమారు ఘాతుకానికి పాల్పడ్డారు. నగరంలో భద్రతలో నిమగ్నమైవున్న జవాన్లపై గ్రెనేడ్లతో దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. శ్రీనగర్ పట్టణంలోని నడిబొడ్డున ఉన్న లాల్ చౌక్ అనే ప్రాంతంలో ఈ దాడి జరిగిందని పోలీసులు వెల్లడించారు.
Source: Yahoo! Telugu: News | 6 Oct 2009 | 9:30 am

నష్టాల నుంచి గట్టెక్కి లాభాల్లోకి స్టాక్ మార్కెట్

స్టాక్ మార్కెట్ నష్టాల్లోంచి గట్టెక్కి లాభాల్లోకి ప్రవేశించింది. దీంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 101 పాయింట్లు పుంజుకుని 16,967 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 24 పాయింట్లు లాభపడి 5,027 వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 6 Oct 2009 | 9:29 am

యమస్పీడ్‌గా "యంగ్ ఇండియా" షూటింగ్‌ సన్నాహాలు

శతాధిక చిత్ర దర్శకులు దర్శకరత్న డా. దాసరి నారాయణరావు దర్శకత్వం వహిస్తోన్న 149వ చిత్రం "యంగ్ ఇండియా"కు నూతన నటీనటుల ఎంపిక ప్రక్రియ దాదాపు పూర్తి కావచ్చింది. అందరూ కొత్త వాళ్లతో రూపొందుతోన్న ఈ చిత్రం కోసం "నూతన నటీనటులు కావలెను" అంటూ విడుదల చేసిన పత్రికా ప్రకటనలకు విశేష స్పందన లభించింది. ఇప్పటికే ఈ చిత్రం కోసం కీరవాణి సంగీత సారధ్యంలో ఆరు పాటలకు రికార్డింగ్ పూర్తయింది. స్క్రిప్ట్ వర్క్ కూడా ముగిసింది. త్వరలో షూటింగ్ కార్యక్రమాలను ప్రారంభిస్తున్నామని నిర్మాత రామకృష్ణ ప్రసాద్ తెలిపారు.
Source: Yahoo! Telugu: Entertainment | 6 Oct 2009 | 9:16 am

గృహరుణాలు ఇవ్వనున్న జీఐసీ

రియల్ఎస్టేట్ రంగాన్ని ఆదుకునేందుకుగాను గృహనిర్మాణానికి తాము రూ. 750 కోట్ల రుణాలని ఇవ్వనున్నట్లు జనరల్ ఇన్స్యూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ తెలిపింది.
Source: Yahoo! Telugu: News | 6 Oct 2009 | 9:02 am

21న రామ్‌చరణ్, జెనీలియా కొత్త చిత్రం ప్రారంభం!

ప్రముఖ నిర్మాణ సంస్థ అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌తేజ హీరోగా, బొమ్మరిల్లు కథానాయికగా జెనీలియా హీరోయిన్‌గా రూపొందించనున్న మెగా మూవీ ఈ నెల 21న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం కానుంది. కె. వెంకట్రావు సమర్పణలో మెగాబ్రదర్ కె. నాగేంద్రబాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించడం విశేషం. ప్రెస్టీజియస్ అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.7గా ఈ క్రేజీ మూవీ రూపొందుతోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 6 Oct 2009 | 8:56 am

రోశయ్యను వ్యతిరేకించే ఎమ్మెల్యేల పేర్లివ్వండి: హైకోర్టు

ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన ఆర్థిక మంత్రి రోశయ్యను వ్యతిరేకించే మంత్రులు, ఎమ్మెల్యేల పేర్లను వెల్లడించాలని రాష్ట్ర హైకోర్టు ధర్మాసనం కోరింది. ప్రముఖ న్యాయవాది రవికుమార్ దాఖలు చేసిన పిటీషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏఆర్.దవే, జస్టీస్ సీవీ.నాగార్జున రెడ్డిలతో కూడిన ధర్మాసనం పై విధంగా కోరింది.
Source: Yahoo! Telugu: News | 6 Oct 2009 | 8:52 am

నమితా.. నగ్నంగా నటిస్తావా..?: హిందీ నిర్మాతలు

దక్షిణాది సెక్సీ తారల్లో నమితకు ప్రత్యేక స్థానం ఉన్నది. ఆమె సినిమాలంటే టీనేజ్ కుర్రకారు ఎగబడతారు. ఈ విషయాన్ని గమనించిన బాలీవుడ్ హిందీ నిర్మాతలు కొందరు నమితకు తాము నిర్మించబోయే చిత్రంలో అవకాశమిస్తామన్నారట. దాంతో ఒక్క గెంతేసి... పట్టరాని ఆనందంలో తేలియాడుతూ... ఆ సినిమాలో తన పాత్ర ఏమిటని అడిగిందట నమిత. ఆ ప్రశ్నకు హిందీ నిర్మాతల నుంచి వచ్చిన సమాధానాన్ని విని దిమ్మెరపోయిందట. రాజారవివర్మ జీవితాన్ని తాము తెరకెక్కిస్తున్నామనీ, ఈ ప్రయత్నంలో భాగంగా ఆయన చిత్రించిన కొన్ని నగ్న చిత్రాలకు ప్రతిరూపంగా నటించాల్సి ఉంటుందని నమితకు చెప్పారట. దీంతో చిర్రెత్తిన నమిత ఫోన్ కట్ చేసిందట. ఆ ఆఫర్ విషయాన్ని తన చెవికేసిన వ్యక్తిపై ఇంతెత్తు ఎగిరిందట. ఎలాగూ అందాలు చూపిస్తుంది కదా... అరకొరగా మిగిలిన అందాలను కూడా వెండితెరపై ఆరబోస్తుందేమో అడగమంటే అడిగానని సదరు వ్యక్తి గొణుక్కుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడట. అన్నట్లు ఈ సినిమాలో నందనాసేన్ అలా నటించడానికి అంగీకరించినట్లు భోగట్టా. ఇందులో నిజమెంతో సినిమా వచ్చిన తర్వాత కానీ తెలియదు.
Source: Yahoo! Telugu: Entertainment | 6 Oct 2009 | 8:35 am

వరద సహాయ చర్యలపై శ్రద్ధ చూపని మంత్రులు: బాబు

వరద సహాయ చర్యలపై రాష్ట్ర మంత్రులు ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. రాష్ట్రంలో సంభవించిన వరదతో సర్వస్వం కోల్పోయి దిక్కులేని పక్షుల్లా ప్రజలు అల్లాడుతున్న మంత్రులు పట్టించుకోవడం లేదని ఆయన దుయ్యబట్టారు.
Source: Yahoo! Telugu: News | 6 Oct 2009 | 8:34 am

కనిష్ఠ స్థాయిల నుంచి సెన్సెక్స్ రికవరీ

స్టాక్ మార్కెట్ కనిష్ఠ స్థాయిల నుంచి రికవరీ దిశగా పయనిస్తోంది. దీంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 63 పాయింట్లు కోల్పోయి 16,803 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 21 పాయింట్లు నష్టపోయి 4,982 వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 6 Oct 2009 | 8:23 am

రాజ్‌థాక్రే అరెస్టుకు వారెంట్ జారీ చేసిన బీహార్ కోర్టు

బీహార్ ప్రజలను కించపరిచేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్‌థాక్రే అరెస్టుకు బీహార్ రాష్ట్రంలోని ముజఫర్‌పూర్ కోర్టు వారెంట్ జారీ చేసింది. వచ్చే నెల రెండో తేదీన రాజ్‌థాక్రేను కోర్టులో హాజరుపరచాల్సిందిగా ముంబై పోలీసు కమిషనర్‌ను కోర్టు ఆదేశించింది.
Source: Yahoo! Telugu: News | 6 Oct 2009 | 8:22 am

ఆర్‌కామ్ కొత్త టారిఫ్: 'నిమిషానికి 50పైస'ల పథకం

శరవేగంగా అభివృద్ధి చెందుతన్న భారత టెలికాం మార్కెట్లో టారిఫ్‌ల పోరు కూడా అంతకుఅంత పెరుగుతూ వస్తోంది. మార్కెట్లో ఉన్న పోటీకి ధీటుగా.. అనిల్ అంబానీ గ్రూపు సంస్థ అయిన రిలయన్స్ కమ్యూనికేషన్స్.. నిమిషానికి.. 50 పైసలతోనే కాల్స్ చేసేలా కొత్త పథకాన్ని రూపొందించింది.
Source: Yahoo! Telugu: News | 6 Oct 2009 | 8:18 am

"అరుంధతి" సినిమాను నేనింకా చూడలేదు: త్రిష

మనం ఏ రంగంలో పనిచేస్తున్నామో.. ఆ ఫీల్డు గురించి బాగా తెలుసుకోవడం సహజం. ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో ఉన్నవారికి ఆ రంగంపై పూర్తి అవగాహన ఉండటం అవసరమని పొడవుకాళ్ల సుందరి, సొట్ట బుగ్గల చిన్నది త్రిష అంటోంది. పక్కాహీరో సినిమా సక్సెస్ అయితే అది ఎందుకు సక్సెస్ అయిందో చూడటం పరిపాటే. అయితే లేడిఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ సినిమా "అరుంధతి" చిత్రాన్ని తానింకా చూడనేలేదని త్రిష చెబుతోంది. పైగా మహిళా ప్రాధాన్యతగల చిత్రాలు చేయాలని ఉంది. కానీ అవకాశాలు రావడం లేదని త్రిష అంటోంది. మంచి కథ, మంచి దర్శకుడు దొరికితే చాలు. లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేస్తానని ప్రకటించేసింది.
Source: Yahoo! Telugu: Entertainment | 6 Oct 2009 | 7:55 am

నిమిషానికి 50 పైసలే చెల్లించండి: ఆర్‌కామ్

దేశంలో ప్రైవేట్ టెలికాం రంగంలో అగ్రగామిగానున్న రిలయన్స్ కమ్యూనికేషన్స్ సంస్థ తన వినియోగదాలకు ప్రీ-పెయిడ్‌తో పాటు, పోస్ట్-పెయిడ్ విభాగానికి చెందిన వినియోదారులందరూ కూడా దేశ వ్యాప్తంగా ప్రతి నిమిషానికి 50 పైసలే చెల్లించే విధంగా ఒకే ధర ప్లాన్‌ను అమలులోకి తెచ్చింది.
Source: Yahoo! Telugu: News | 6 Oct 2009 | 7:53 am

స్టాక్ మార్కెట్లో విస్తరిస్తున్న నష్టాలు

స్టాక్ మార్కెట్లో నష్టాలు విస్తరిస్తున్నాయి. దీంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 145 పాయింట్లు కోల్పోయి.. 16,721 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 56 పాయింట్లు నష్టపోయి 4,947 వద్ద పయనిస్తోంది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ అత్యధికంగా నష్టాల్లో పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 6 Oct 2009 | 7:34 am

సెన్సార్ సిగ్నల్ కోసం వేచివున్న "పదహారేళ్ల వయసు..!"

ఇద్దరి జీవితాల్లో పదహారేళ్ల ప్రాయం సృష్టించిన అలజడిని ఇతివృత్తంగా తీసుకుని రూపొందుతున్న చిత్రమే 'పదహారేళ్ల వయసు'. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఎడిటింగ్ కార్యక్రమాల్లో ఉన్న పదహారేళ్ల వయసు సినిమాకు సెన్సార్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉందని చిత్ర యూనిట్ వెల్లడించింది. భూషణ్, ఆర్య ఓరా జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీసూర్య దర్శకుడు. డెరెక్టర్స్ మూవీ పతాకంపై కిలారి హరిప్రసాద్, యాడవల్లి నర్సింగరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సందేశంతో కూడిన యూత్ ఎంటర్‌టైనర్ ఇదని నిర్మాతలు తెలిపారు.
Source: Yahoo! Telugu: Entertainment | 6 Oct 2009 | 5:45 am

రోశయ్యను వ్యతిరేకించే ఎమ్మెల్యేల పేర్లివ్వండి: హైకోర్టు

ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన ఆర్థిక మంత్రి రోశయ్యను వ్యతిరేకించే మంత్రులు, ఎమ్మెల్యేల పేర్లను వెల్లడించాలని రాష్ట్ర హైకోర్టు ధర్మాసనం కోరింది. ప్రముఖ న్యాయవాది రవికుమార్ దాఖలు చేసిన పిటీషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏఆర్.దవే, జస్టీస్ సీవీ.నాగార్జున రెడ్డిలతో కూడిన ధర్మాసనం పై విధంగా కోరింది.
Source: ఏపీ న్యూస్ | 6 Oct 2009 | 4:18 am

శ్రీనగర్‌లో గ్రెనేడ్ దాడి: ఇద్దరు జవాన్లకు గాయాలు

శ్రీనగర్‌లో మిలిటెంట్లు మరోమారు ఘాతుకానికి పాల్పడ్డారు. నగరంలో భద్రతలో నిమగ్నమైవున్న జవాన్లపై గ్రెనేడ్లతో దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. శ్రీనగర్ పట్టణంలోని నడిబొడ్డున ఉన్న లాల్ చౌక్ అనే ప్రాంతంలో ఈ దాడి జరిగిందని పోలీసులు వెల్లడించారు.
Source: జాతీయ | 6 Oct 2009 | 4:00 am

వరద సహాయ చర్యలపై శ్రద్ధ చూపని మంత్రులు: బాబు

వరద సహాయ చర్యలపై రాష్ట్ర మంత్రులు ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. రాష్ట్రంలో సంభవించిన వరదతో సర్వస్వం కోల్పోయి దిక్కులేని పక్షుల్లా ప్రజలు అల్లాడుతున్న మంత్రులు పట్టించుకోవడం లేదని ఆయన దుయ్యబట్టారు.
Source: ఏపీ న్యూస్ | 6 Oct 2009 | 3:05 am

రాజ్‌థాక్రే అరెస్టుకు వారెంట్ జారీ చేసిన బీహార్ కోర్టు

బీహార్ ప్రజలను కించపరిచేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్‌థాక్రే అరెస్టుకు బీహార్ రాష్ట్రంలోని ముజఫర్‌పూర్ కోర్టు వారెంట్ జారీ చేసింది. వచ్చే నెల రెండో తేదీన రాజ్‌థాక్రేను కోర్టులో హాజరుపరచాల్సిందిగా ముంబై పోలీసు కమిషనర్‌ను కోర్టు ఆదేశించింది.
Source: జాతీయ | 6 Oct 2009 | 2:53 am

భాజపా నేత ఖండేల్‌వాల్ గుండెపోటుతో మృతి

ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు ప్యారేలాల్ ఖండేల్‌వాల్ కన్నుమూశారు. ఆయన మంగళవారం ఉదయం గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు.
Source: జాతీయ | 6 Oct 2009 | 1:34 am

కర్ణాటక రాష్ట్రంలో వందకు చేరిన స్వైన్ ఫ్లూ మృతులు

కర్ణాటక రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ మృతులు వందకు చేరుకున్నాయి. మంగళవారం ఉదయం మరో మహిళ ప్రాణాలు కోల్పోయారని, ఈ కేసుతో కలుపుకుని ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 100గా నమోదైందని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.
Source: జాతీయ | 6 Oct 2009 | 12:40 am

తగ్గుతున్న వరద ఉధృతి: ముఖ్యమంత్రి రోశయ్య

రాష్ట్రంలో వరద ఉధృతి క్రమంగా తగ్గుముఖం పడుతోందని ముఖ్యమంత్రి కె.రోశయ్య తెలిపారు. అలాగే, వరద బాధిత జిల్లాల్లో కూడా పరిస్థితి క్రమంగా మెరుగవుతోందన్నారు. దీనిపై ఆయన మీడియాతో మాట్లాడుతూ... రిజర్వాయర్లకు వచ్చే వరద నీరు కూడా తగ్గుతోందని, ఫలితంగా, వరద బాధిత ప్రాంతాల్లో నీరు కూడా తగ్గుతోందన్నారు.
Source: ఏపీ న్యూస్ | 6 Oct 2009 | 12:25 am

దక్షిణాదిలో వరదలు: 250 మంది మృత్యువాత

దక్షిణ భారతదేశంలో సంభవించిన వరదలకు ఇప్పటి వరకు కనీసం 250 మంది మృత్యువాత పడినట్టు కేంద్ర ప్రభుత్వ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మృతుల సంఖ్య ఎక్కువగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్నట్టు వారు పేర్కొన్నారు.
Source: జాతీయ | 5 Oct 2009 | 11:55 pm

వరదలకు.. బ్రహ్మంగారి కాలజ్ఞానానికి లింకు!

శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి వందేళ్ళ క్రితమే రాసిన కాలజ్ఞానానికి ప్రస్తుతం రాష్ట్రంలో సంభవించిన వరదలకు లింకు ఉన్నట్టు పలువురు బ్రహ్మంగారి భక్తులు అభిప్రాయపడుతున్నారు. కాలజ్ఞానంలో పేర్కొన్నట్టుగా అనేక విషయాలు జరుగుతూ వస్తున్నాయని వారు గుర్తు చేశారు.
Source: ఏపీ న్యూస్ | 5 Oct 2009 | 11:35 pm

ముందు అంచనా లేకే ఈ విపత్తు: చంద్రబాబు నాయుడు

ఎగుర రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తోందని తెలిసినప్పటికీ మన ప్రభుత్వ యంత్రాంగం మేల్కొనలేదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఈ భారీ వర్షాల వల్ల మన రాష్ట్రంలో వరద ప్రమాదం ఏర్పడుతుందని తెలిసినా..
Source: ఏపీ న్యూస్ | 5 Oct 2009 | 11:15 pm

వరద బీభత్సాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలి: చిరు

వరద బీభత్సాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాన్ని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి డిమాండ్ చేశారు. వరద బాధిత ప్రాంతాల్లో పర్యటనలో భాగంగా ఆయన మంగళవారం కర్నూలు జిల్లాలో పర్యటించారు.
Source: ఏపీ న్యూస్ | 5 Oct 2009 | 11:07 pm

అన్ని రాష్ట్రాలకు సమానంగా వరద సహాయం: హోంశాఖ

వరదల బారిన పడిన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు సమానంగా సహాయ, పునరావాస సౌకర్యాలను కల్పిస్తున్నట్టు కేంద్ర హోంశాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. వరద బాధితులను ఆదుకోవడంలో ఎలాంటి పక్షపాతం చూపడం లేదని ఆ శాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.
Source: జాతీయ | 5 Oct 2009 | 10:14 pm

చీఫ్ జస్టీస్ కార్యాలయం ఆర్టీఐ పరిధిలోకి రాదు: సుప్రీం

దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కిందకు రాదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. ఈ అంశంపై ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టి వేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
Source: జాతీయ | 5 Oct 2009 | 9:47 pm

"మగధీర" రామ్‌చరణ్‌తో "బొమ్మరిల్లు" జెనీలీయా

సుప్రసిద్ధ సంస్థ అంజనా ప్రొడక్షన్స్ "మగధీర" రామ్‌చరణ్‌తో ఓ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ చిత్రంలో చరణ్ సరసన నటింపజేసేందుకు ఎందరో హీరోయిన్లను చూశారట. కానీ "పంచదార చిలక"లాంటి జెనీలియా కరెక్టుగా సబ్జెక్టుకు తగినట్లు అతికినట్లు ఉండటంతో ఆమెను ఎంపిక చేశారట. మరో విశేషమేమిటంటే, ఈ చిత్రాన్ని దర్శకత్వం వహిస్తున్నది బొమ్మరిల్లు భాస్కర్. ఈ చిత్రం తాలూకు పాటల రికార్డింగ్ కార్యక్రమాన్ని అక్టోబరు 21న ప్రారంభించనున్నట్లు నాగేంద్రబాబు తెలియజేశారు. హారిస్ జయరాజ్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 5 Oct 2009 | 12:54 pm

పడువువృత్తిలో పలువురు హీరోయిన్లు: భువనేశ్వరి

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అనేక మంది హీరోయిన్లు పడుపువృత్తి చేస్తున్నారని బుల్లితెర నటి భువనేశ్వరి బాంబులాంటి వార్త పేల్చారు. పలు చిన్న చిత్రాలతో పాటు అనేక టీవీ సీరియల్స్‌లో నటిస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటి ఈమె.
Source: Yahoo! Telugu: Entertainment | 5 Oct 2009 | 11:01 am

కోర్టుతో గేమ్స్ ఆడొద్దు: మాయకు సుప్రీం చివాట్లు

సుప్రీం కోర్టు మాయవతిని సోమవారం తీవ్రంగా మందలించింది. విగ్రహాల నిర్మాణ విషయంలో కోర్టు ఇచ్చిన తీర్పుతో గేమ్స్ ఆడుకోవద్దనీ, ఆ గేమ్స్ అసెంబ్లీలో సాగుతాయి కానీ కోర్టు ముందు సాగవని హెచ్చరించింది.
Source: జాతీయ | 5 Oct 2009 | 9:22 am

వరదప్రాంతాల్లో ప్యాసింజర్ రైళ్ళ రద్దు: దమరైల్వే

రాష్ట్రంలోని కర్నూలు, మహబూబ్‌నగర్, కృష్ణా, గుంటూరు, నల్గొండ తదితర ప్రాంతాల్లో ప్రయాణించే ప్యాసింజర్ రైళ్ళను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వేశాఖ తెలిపింది.
Source: ఏపీ న్యూస్ | 5 Oct 2009 | 8:03 am

వరదతో అల్లాడుతుంటే... బ్లాక్ మార్కెటింగా...?: చిరంజీవి

రాష్ట్రంలో భీభత్సం సృష్టించిన భారీ వరదను జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి డిమాండ్ చేశారు. ఇంతటి విపత్తు సంభవించి, ప్రజలు నానా తంటాలు పడుతుంటే నల్ల బజారు వ్యాపారాలు రెచ్చిపోయి, నిత్యావసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచేస్తున్నారని చిరు చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 5 Oct 2009 | 7:33 am

గుజరాత్‌లో తుఫాను: 12 మంది మరణం

గుజరాత్‌లో తుఫాను తాకిడికి 12 మంది మరణించారు. గుజరాత్‌లో కురిసిన భారీ వర్షాలకు రాజకోట ప్రాంతంలోని తరగధి గ్రామంలో పిట్టగోడ కూలి నలుగురు యువకులు, ఒక మహిళతో పాటు ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. అలాగే జన్‌గధ్ జిల్లాలో వన్‌తలిలో ముగ్గురు యువకులతో పాటు ఇద్దరు చిన్నారులు తుఫాను తాకిడి బలైయ్యారు.
Source: జాతీయ | 5 Oct 2009 | 7:08 am

ఏ భంగిమలో కావాలో చెప్పండి... ఫోజిస్తా: కంగనా

టాలీవుడ్‌కు ఇప్పుడు కంగనా ఫీవర్ పట్టుకుంది. మొన్నటివరకూ టాలీవుడ్ సినీ పరిశ్రమను ఏలిన బక్కపలచని హీరోయిన్లను కాదని కంగనా రనౌత్ వెంటపడుతున్నారట తెలుగు సినీ నిర్మాతలు. పైగా రనౌత్ కలుపుగోలుతనాన్ని చూసిన నిర్మాతలు "ఐస్" అయిపోతున్నారట. నిర్మాతలు ఎలా అడిగితే అలా నటించడానికి తాను సిద్ధంగా ఉన్నాననీ, తెలుగు దర్శకనిర్మాతల పనితీరు తనకు ఎంతో బాగా నచ్చిందని వారికి మరింత "ఐస్" పెడుతోందట కంగనా. అంతేకాదండోయ్... ఫోటోగ్రాఫర్లు ఎవరైనా ఫలానా ఫోజు కావాలి మిస్ అని అడిగిందే తడవుగా... వారికి కావలసిన ఫోజు ఇవ్వడమే కాక "ఇంకా ఏ భంగిమలో కావాలో చెప్పండి... ఫోజిస్తా" అని అంటోందట. కంగనా మాటలతో ఫోటోగ్రాఫర్ల సైతం గుల్లైపోతున్నారట. కంగనా వరస చూస్తుంటే టాలీవుడ్‌లో టాప్ రేంజ్‌లో ఉన్న హీరోయిన్లందరినీ బీట్ చేస్తుందంటున్నారు టాలీవుడ్ సినీజనం. అన్నట్లు కంగనా పెదవులు ఇటీవల దొండపండు ఎరుపు టైపులో ఎరుపెక్కాయట. అంతేకాదు బాగా వాచిపోయాయట. కారణం ఏమై ఉంటుందోనన్న సంగతి తెలుసుకునేందుకు మన పిల్ల జర్నలిస్టు విశ్వప్రయత్నం చేస్తున్నాడు. ఒకవేళ తెలిస్తే చెపుతానన్నాడు... ఏం చెపుతాడో చూద్దాం...
Source: Yahoo! Telugu: Entertainment | 5 Oct 2009 | 6:35 am

రాష్ట్రంలో వరద బీభత్సం: నష్టం 12,225 కోట్లు!

రాష్ట్రంలో సంభవించిన వరద నష్టం 12,225 కోట్ల రూపాయలుగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక అంచానా వేసింది. ఈ మొత్తం సగం నిధులను తక్షణం విడుదల చేయాలని ముఖ్యమంత్రి కె.రోశయ్య కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Source: ఏపీ న్యూస్ | 5 Oct 2009 | 6:07 am

తుది మెరుగుల్లో "మా నాన్న చిరంజీవి"

జగపతిబాబు, నీలిమ హీరోహీరోయిన్లుగా రూపుదిద్దుకుంటోన్న "మా నాన్న చిరంజీవి" చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం డీటీఎస్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్రం త్వరలో తెరపైకి రానుంది. అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న ఈ సినిమాలో బాలనటుడిగా "తులసి" ఫేమ్ అతులిత్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. హేమచంద్ర సమకూర్చిన సంగీతం తప్పకుండా శ్రోతల మన్ననలను చూరగొంటుందని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 5 Oct 2009 | 6:06 am

కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్న జగన్ పత్రిక!

దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి తనయుడు, యువ పారిశ్రామికవేత్త, కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి స్థాపించిన సొంత పత్రిక కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా పని చేస్తోంది.
Source: ఏపీ న్యూస్ | 5 Oct 2009 | 5:46 am

"గజిని"తో దక్షిణాది దర్శకులవైపు బాలీవుడ్ నిర్మాతల దృష్టి!

కోలీవుడ్‌లో మురుగదాస్ దర్శకత్వంలో సూపర్ హిట్ అయిన "గజిని" సినిమాతో దక్షిణాది దర్శకులకు డిమాండ్ పెరిగిందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అమీర్ ఖాన్, అసిన్ హీరోహీరోయిన్లుగా హిందీలో తీసిన "గజిని"కూడా బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచిపోవడంతో బాలీవుడ్ నిర్మాతల దృష్టి దక్షిణాది దర్శకులవైపు మళ్లింది. అంతకుముందు యాక్షన్ హీరోలపై బాలీవుడ్ చిన్న చూపు ఉండేది. కానీ "గజిని" విజయం సాధించిన తర్వాత ఆ ధోరణి మారిందని దక్షిణాది సినీ విశ్లేషకులు అంటున్నారు. కాగా.. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, కోలీవుడ్ యంగ్ స్టార్ విజయ్ లాంటి హీరోలతో సినిమాలు చేసిన దర్శకులు సామాన్యుల నాడి పట్టుకున్నారని, వారితో హిందీ రంగం పలు సినిమాలు తీయబోతుందని వాంటెడ్ నిర్మాత బోనీకపూర్ వెల్లడించడం ఇందులో విశేషం.
Source: Yahoo! Telugu: Entertainment | 5 Oct 2009 | 5:29 am

ప్రత్యక్ష దైవానికి మరో విడిది "ద్వారకా తిరుమల"

"నడిరేయి ఏ జాములో స్వామి నినుచేర దిగివచ్చునో... తిరుమల శిఖరాలు దిగివచ్చునో... మముగన్న మాయమ్మ అలివేలు మంగ.. పతిదేవు ఒడిలోన మురిసేటి వేళ.. స్వామి చిరునవ్వు వెన్నెలలు కురిసేటి వేళ..." అంటూ భక్త జనావళి స్వామివారి కరుణ తమమీద ఉండేలా చూడాలని అమ్మవారికి విన్నవించుకోవటం మామూలే..! అయితే ఈ అయ్యవారిని...
Source: వినోదం | 5 Oct 2009 | 5:14 am

ఐదుగురు పాక్ జాతీయులను అరెస్టు చేసిన బీఎస్ఎఫ్

గుజరాత్ రాష్ట్రంలో సర్ క్రీక్ సమీపంలో ఐదుగురు పాకిస్థాన్ జాతీయులను భారత సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) సోమవారం అరెస్టు చేసింది. పశ్చిమ తీరంలోని కుచ్ జిల్లాలో క్రీక్ ఏరియాలో వీరిని అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు.
Source: జాతీయ | 5 Oct 2009 | 4:54 am