246 పాయింట్ల నష్టంతో స్టాక్ మార్కెట్

స్టాక్ మార్కెట్ 246 పాయింట్లు నష్టంతో పయనిస్తుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 16,888 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 73 పాయింట్లు నష్టపోయి 5,010 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్, నిఫ్టీ 1.44 శాతం చొప్పున క్షీణించాయి.
Source: Yahoo! Telugu: News | 5 Oct 2009 | 9:26 am

ప్రకాశం బ్యారేజీకి చేరుకున్న నాగార్జున సాగర్ జలాలు

నాగార్జున సాగర్ నుంచి విడుదల చేసిన వరద నీరు ప్రకాశం బ్యారేజీకి సోమవారం చేరుకుంది. దీంతో విజయవాడతో పాటు.. బ్యారేజీ సమీపంలోని లోతట్టు ప్రాంతాలన్నీ ముంపునకు గురయ్యే అవకాశం ఉంది. అటు అధికారులతో పాటు ఇటు స్థానికులు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు.
Source: Yahoo! Telugu: News | 5 Oct 2009 | 9:02 am

కోల్ ఇండియాతో ఒప్పందం చేసుకున్న పలు కంపెనీలు

అంతర్జాతీయ స్థాయిలోనున్న 52 కంపెనీలు దేశీయ బొగ్గు ఉత్పత్తి కేంద్రమైన కోల్ ఇండియా సంస్థతో ఒప్పందం చెసుకున్నట్లు ఆ సంస్థ సోమవారం వెల్లడించింది. ముఖ్యంగా ఆస్ట్రేలియా, మొజాంబికా, ఇండోనేషియా దేశాలు ఈ కోవలోనున్నాయని కోల్ ఇండియా ఛైర్మెన్ పార్థ.ఎస్. భట్టాచార్య తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 5 Oct 2009 | 8:47 am

నష్టాల్లో కూరుకపోతున్న స్టాక్ మార్కెట్

స్టాక్ మార్కెట్ ప్రస్తుతం నష్టాల్లో కూరుకుపోతుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 222 పాయింట్లు కోల్పోయి 16,913 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 67 పాయింట్లు నష్టపోయి 5,016 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 1.30 శాతం, నిఫ్టీ 1.32 శాతం మేరకు క్షీణించాయి. బీఎస్ఈ రియాల్టీ, బ్యాంకెక్స్, చమురు మరియు సహజవాయువుల ఇండెక్స్ 1 శాతం మేరకు క్షీణించాయి.
Source: Yahoo! Telugu: News | 5 Oct 2009 | 8:34 am

2013 నాటికి ఐటీ రంగంలో 5.8 లక్షల ఉద్యోగాలు

ఉద్యోగ అవకాశాల యంత్రంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) కొత్త అవతారం దాల్చనుంది. రానున్న నాలుగేళ్లలో ఐటీ రంగంలో సుమారు 5.8 లక్షల మేరకు కొత్త ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నట్లు ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) తన తాజా పరిశోధనల ద్వారా వెల్లడించింది.
Source: Yahoo! Telugu: News | 5 Oct 2009 | 8:27 am

నిధుల సమీకరణలో గ్లెన్‌మార్క్ జెనరిక్స్

ఔషధాల తయారీ రంగంలో అగ్రగామిగానున్న గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ అనుబంధ సంస్థ గ్లెన్‌మార్క్ జనరిక్స్ నిధులను సమీకరించాలని భావించింది. దీంతో స్టాక్‌మార్కెట్ నియంత్రణా సంస్థ (సెబీ)కు తన నిర్ణయాన్ని తెలిపింది.
Source: Yahoo! Telugu: News | 5 Oct 2009 | 8:26 am

పాక్ ఆర్మీకి అమెరికా సాయం చేరడం లేదు

ఉగ్రవాదంపై పోరాడేందు కోసం పాకిస్థాన్‌కు అమెరికా కొన్ని కోట్ల డాలర్లను సాయంగా అందిస్తూ వస్తోంది. అయితే ఆ సాయం పాక్ ఆర్మీకి కాకుండా.. పాక్ ఖజానాలోకి వెళుతోందని విశ్వసనీయ వర్గాల సమాచారం. భారత్‌తో పోరాటం జరపడం వంటి తదితర అంశాలకు ఈ నిధులను మళ్లిస్తున్నట్లు తాజాగా నివేదికలు వెల్లడిస్తున్నాయి.
Source: Yahoo! Telugu: News | 5 Oct 2009 | 8:21 am

స్టాక్ మార్కెట్లో విస్తరిస్తున్న నష్టాలు

స్టాక్ మార్కెట్లో మరింతగా నష్టాలు విస్తరిస్తుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 191 పాయింట్లు కోల్పోయి 16,944 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 57 పాయింట్లు నష్టపోయి 5,027 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్, నిఫ్టీ 1.11 శాతం చొప్పున క్షీణించాయి. బీఎస్ఈ మధ్యతరహా ఇండెక్స్ 0.56 శాతం, బీఎస్ఈ చిన్న తరహా ఇండెక్స్ 0.72 శాతం మేరకు క్షీణించాయి.
Source: Yahoo! Telugu: News | 5 Oct 2009 | 7:51 am

రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలుస్తాం: సోనియా

వరద బాధితుల్ని ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలుస్తామని యూపీఏ ఛైర్‌పర్సన్, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ హామీ ఇచ్చారు. వరద విపత్తు నుంచి బయటపడేందుకు రాష్ట్రానికి కేంద్రం అన్నివిధాలా బాసటగా నిలుస్తుందని ఆమె తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 5 Oct 2009 | 7:45 am

పాక్‌ ఐరాస కార్యాలయంవద్ద పేలుళ్ళుః ముగ్గురి మృతి

పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోనున్న ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం సమీపంలో సోమవారం పేలుళ్ళు సంభవించాయి. ఈ పేలుళ్ళలో ముగ్గురు మృతి చెందగా పలువురు తీవ్ర గాయాలపాలైనారు.
Source: Yahoo! Telugu: News | 5 Oct 2009 | 7:27 am

ఏ భంగిమలో కావాలో చెప్పండి... ఫోజిస్తా: కంగనా

టాలీవుడ్‌కు ఇప్పుడు కంగనా ఫీవర్ పట్టుకుంది. మొన్నటివరకూ టాలీవుడ్ సినీ పరిశ్రమను ఏలిన బక్కపలచని హీరోయిన్లను కాదని కంగనా రనౌత్ వెంటపడుతున్నారట తెలుగు సినీ నిర్మాతలు. పైగా రనౌత్ కలుపుగోలుతనాన్ని చూసిన నిర్మాతలు "ఐస్" అయిపోతున్నారట. నిర్మాతలు ఎలా అడిగితే అలా నటించడానికి తాను సిద్ధంగా ఉన్నాననీ, తెలుగు దర్శకనిర్మాతల పనితీరు తనకు ఎంతో బాగా నచ్చిందని వారికి మరింత "ఐస్" పెడుతోందట కంగనా. అంతేకాదండోయ్... ఫోటోగ్రాఫర్లు ఎవరైనా ఫలానా ఫోజు కావాలి మిస్ అని అడిగిందే తడవుగా... వారికి కావలసిన ఫోజు ఇవ్వడమే కాక "ఇంకా ఏ భంగిమలో కావాలో చెప్పండి... ఫోజిస్తా" అని అంటోందట. కంగనా మాటలతో ఫోటోగ్రాఫర్ల సైతం గుల్లైపోతున్నారట. కంగనా వరస చూస్తుంటే టాలీవుడ్‌లో టాప్ రేంజ్‌లో ఉన్న హీరోయిన్లందరినీ బీట్ చేస్తుందంటున్నారు టాలీవుడ్ సినీజనం. అన్నట్లు కంగనా పెదవులు ఇటీవల దొండపండు ఎరుపు టైపులో ఎరుపెక్కాయట. అంతేకాదు బాగా వాచిపోయాయట. కారణం ఏమై ఉంటుందోనన్న సంగతి తెలుసుకునేందుకు మన పిల్ల జర్నలిస్టు విశ్వప్రయత్నం చేస్తున్నాడు. ఒకవేళ తెలిస్తే చెపుతానన్నాడు... ఏం చెపుతాడో చూద్దాం...
Source: Yahoo! Telugu: Entertainment | 5 Oct 2009 | 6:35 am

తుది మెరుగుల్లో "మా నాన్న చిరంజీవి"

జగపతిబాబు, నీలిమ హీరోహీరోయిన్లుగా రూపుదిద్దుకుంటోన్న "మా నాన్న చిరంజీవి" చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం డీటీఎస్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్రం త్వరలో తెరపైకి రానుంది. అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న ఈ సినిమాలో బాలనటుడిగా "తులసి" ఫేమ్ అతులిత్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. హేమచంద్ర సమకూర్చిన సంగీతం తప్పకుండా శ్రోతల మన్ననలను చూరగొంటుందని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 5 Oct 2009 | 6:06 am

"గజిని"తో దక్షిణాది దర్శకులవైపు బాలీవుడ్ నిర్మాతల దృష్టి!

కోలీవుడ్‌లో మురుగదాస్ దర్శకత్వంలో సూపర్ హిట్ అయిన "గజిని" సినిమాతో దక్షిణాది దర్శకులకు డిమాండ్ పెరిగిందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అమీర్ ఖాన్, అసిన్ హీరోహీరోయిన్లుగా హిందీలో తీసిన "గజిని"కూడా బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచిపోవడంతో బాలీవుడ్ నిర్మాతల దృష్టి దక్షిణాది దర్శకులవైపు మళ్లింది. అంతకుముందు యాక్షన్ హీరోలపై బాలీవుడ్ చిన్న చూపు ఉండేది. కానీ "గజిని" విజయం సాధించిన తర్వాత ఆ ధోరణి మారిందని దక్షిణాది సినీ విశ్లేషకులు అంటున్నారు. కాగా.. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, కోలీవుడ్ యంగ్ స్టార్ విజయ్ లాంటి హీరోలతో సినిమాలు చేసిన దర్శకులు సామాన్యుల నాడి పట్టుకున్నారని, వారితో హిందీ రంగం పలు సినిమాలు తీయబోతుందని వాంటెడ్ నిర్మాత బోనీకపూర్ వెల్లడించడం ఇందులో విశేషం.
Source: Yahoo! Telugu: Entertainment | 5 Oct 2009 | 5:29 am

ప్రకాశం బ్యారేజీకి చేరుకున్న నాగార్జున సాగర్ జలాలు

నాగార్జున సాగర్ నుంచి విడుదల చేసిన వరద నీరు ప్రకాశం బ్యారేజీకి సోమవారం చేరుకుంది. దీంతో విజయవాడతో పాటు.. బ్యారేజీ సమీపంలోని లోతట్టు ప్రాంతాలన్నీ ముంపునకు గురయ్యే అవకాశం ఉంది. అటు అధికారులతో పాటు ఇటు స్థానికులు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు.
Source: ఏపీ న్యూస్ | 5 Oct 2009 | 3:33 am

భారీ వరదలు: ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల్లో 230 మంది మృతి

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో గడచిన ఐదు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా రెండు రాష్ట్రాలను భారీ వరదలు ముంచెత్తాయి. వరదలకు 200 మంది మృత్యువాత పడ్డారు.
Source: జాతీయ | 5 Oct 2009 | 3:04 am

వరద బాధితులారా.. క్షమించండి: మంత్రి రఘువీరా

వరద బాధితులారా.. మమ్మలను క్షమించండి. సహాయక చర్యలు చేపట్టడంలో పూర్తిగా విఫలమయ్యాం. అధికారుల అలసత్వం కారణంగా పొరపాట్లు దొర్లుతున్నాయి. కొన్నిచోట్ల సహాయక చర్యల్లో నిమగ్నం కావాల్సిన ప్రభుత్వ యంత్రాంగమే వరద బాధితురాలిగా మారిందని రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి ఎన్.రఘువీరా రెడ్డి అభిప్రాయపడ్డారు.
Source: ఏపీ న్యూస్ | 5 Oct 2009 | 2:48 am

క్షణ.. క్షణం... పెరుగుతున్న "ప్రకాశం" నీటి మట్టం

కృష్ణా నదిపై విజయవాడ వద్ద ఉన్న ప్రకాశం బ్యారేజీ వద్ద నీటి మట్టం క్షణ.. క్షణం పెరుగుతోంది. ఎగువ రిజర్వాయర్ల నుంచి సముద్రంలోకి లక్షలాది క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దీంతో ప్రకాశం బ్యారేజి నీటిమట్టం సోమవారం గరిష్ట స్థాయి 21.2 అడుగులకు చేరింది.
Source: ఏపీ న్యూస్ | 5 Oct 2009 | 2:27 am

రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలుస్తాం: సోనియా

వరద బాధితుల్ని ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలుస్తామని యూపీఏ ఛైర్‌పర్సన్, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ హామీ ఇచ్చారు. వరద విపత్తు నుంచి బయటపడేందుకు రాష్ట్రానికి కేంద్రం అన్నివిధాలా బాసటగా నిలుస్తుందని ఆమె తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 5 Oct 2009 | 2:17 am

కేరళలో పడవ ప్రమాదం: ఇద్దరు సిబ్బంది అరెస్టు

కేరళ రాష్ట్రంలోని థేక్కడి నదిలో జరిగిన ఘోర పడవ ప్రమాదానికి సంబంధించి పడవ స్టీర్‌మెన్, ఒక క్రూ సభ్యుడిని స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని సోమవారం ఇడుక్కి జిల్లా పోలీసులు వెల్లడించారు.
Source: జాతీయ | 5 Oct 2009 | 12:34 am

రాష్ట్రపతి కుమారునికి వ్యతిరేకంగా కాంగ్రెస్: భాజపా

పాటిల్ కుమారుడిని ఎన్నికల్లో ఓడించేందుకు తిరుగుబాటు అభ్యర్థిగా బరిలోకి దిగిన సునీల్ దేశ్‌ముఖ్ వెనుక కేంద్ర భారీ పరిశ్రమల శాఖామంత్రి, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావు దేశ్‌ముఖ్ హస్తం ఉందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి గోపీనాథ్ ముండే ఆరోపించారు.
Source: జాతీయ | 5 Oct 2009 | 12:23 am

సాయంగా రూ.6 వేల కోట్లు కేటాయించండి: సీఎం

రాష్ట్రంలో సంభవించిన వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని ముఖ్యమంత్రి కె.రోశయ్య కోరారు. ఈ మేరకు ఆయన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా తక్షణ వరద సాయంగా ఆరు వేల కోట్ల రూపాయలను విడుదల చేయాలని కోరుతూ ఒక వినతి పత్రం సమర్పించారు.
Source: ఏపీ న్యూస్ | 4 Oct 2009 | 11:38 pm

అధికారుల సమన్వయ లోపం వల్లే ఉపద్రవం: భాజపా

ప్రభుత్వ అధికారుల సమన్వయ లోపం వల్లే రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంత ఉపద్రవం సంభవించిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆరోపించింది. దీనిపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారుల మధ్య సమన్వయలేమి కొట్టొచ్చినట్టు కనిపిస్తోందన్నారు.
Source: ఏపీ న్యూస్ | 4 Oct 2009 | 11:13 pm

ఎట్టకేలకు 'సీ బ్లాకు'లోకి మారిన ముఖ్యమంత్రి రోశయ్య

ముఖ్యమంత్రి కె.రోశయ్య ఎట్టకేలకు తన కార్యాలయాన్ని మార్చారు. సచివాలయంలో ముఖ్యమంత్రి కార్యాలయమైన 'సీ బ్లాకు'కు చేరుకున్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, ప్రత్యేక పూజల మధ్య సోమవారం ఉదయం 9.17 నిమిషాలకు 'సీ' బ్లాకులోని తన ఛాంబర్‌లో ఆశీనులయ్యారు.
Source: ఏపీ న్యూస్ | 4 Oct 2009 | 11:06 pm

చైనా సరిహద్దుల్లో యుద్ధటాంకుల మొహరింపు!

ఇటీవలి కాలంలో చైనా చొరబాట్లు అధికం కావడంతో భారత్ కూడా అప్రమత్తమైంది. సరిహద్దుల వెంబడి గస్తీని ముమ్మరం చేసింది. పనిలో పనిగా.. వందలాది తేలికపాటి యుద్ధ టాంకులను భారత సైన్యం సరిహద్దుల వెంట మొహరించనుంది.
Source: జాతీయ | 4 Oct 2009 | 10:31 pm

నేడు హైదరాబాద్‌కు రానున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ సోమవారం రాష్ట్ర రాజధానికి వస్తున్నారు. వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో ఆమె ఏరియల్ సర్వే నిర్వహిస్తారు. ఉదయం 10.15 నిమిషాలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు.
Source: జాతీయ | 4 Oct 2009 | 9:28 pm

"చిరుత"నయుడి "మగధీర" ట్రైలర్ మీకోసం..

"చిరుత"నయుడు రామ్‌చరణ్ తేజ హీరోగా, అందాల రాశి కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన బ్లాక్ బ్లస్టర్ మూవీ "మగధీర". యాక్షన్, లవ్, ఎంటర్‌టైన్‌మెంట్ వంటి అన్ని అంశాల మేళవింపుతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. హాలీవుడ్ స్థాయిలో నిలిచింది. తమిళ చిత్రాలైన ‘శివాజి’, ‘దశావతారం’, తర్వాత ‘మగధీర’ చిత్రం సినిమా ఇండస్ట్రీలో ఒక చరిత్రను సృష్టింస్తోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 4 Oct 2009 | 7:33 am

"హ్యాపీడేస్" కృష్ణుడు, కృతిక జంటగా "చేత వెన్నముద్ద"

హ్యాపీడేస్ ఫేమ్ కృష్ణుడు కీలక పాత్రలో ఆల్తాఫ్, హ్యాపీడేస్ ఫేమ్ కృతిక క్రిష్ణన్ హీరోయిన్‌గా నటిస్తోన్న "చేత వెన్నముద్ద" చిత్రం సగం పూర్తయింది. రోహిత్. ఎస్. అభ్యుదయ్ దర్శకత్వంలో ఫుల్‌మూన్ పిక్చర్స్ పతాకంపై పి.ఆర్.కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం గురించి ఎగ్జిక్యూటివ్ నిర్మాత ఎమ్. భరత్ మాట్లాడుతూ.. ఇటీవలే కృష్ణుడు స్పెయిన్ అమ్మాయి అన్నాజెన్, మెటిల్డా, మైక్, శశిలపై కామెడీ సన్నివేశాలను చిత్రీకరించడంలో సినిమా సగం పూర్తయ్యిందన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 4 Oct 2009 | 7:30 am

జయం మూవీస్‌పై తేజ కొత్త చిత్రం!

"కేక" తర్వాత ప్రముఖ దర్శకుడు తేజ కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టనున్నారు. జయం మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై "అటు ఇటు" పేరుతో కొత్త సినిమాను రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. డి. సురేష్‌బాబు సమర్పణలో శ్రీవల్లీతేజ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. "కిక్" ఫేమ్ శ్యామ్ ఇందులో ప్రధానపాత్ర పోషిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 4 Oct 2009 | 7:28 am

రామానాయుడు మనుమడు 'రాణా' హీరోగా "లీడర్"

డా||. డి. రామానాయుడు మనుమడు రాణాను హీరోగా పరిచయం చేస్తూ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం "లీడర్". ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక ఏవీఎం సంస్థ నిర్మిస్తోంది. కాగా, ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్‌ప్రొడక్షన్స్ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 4 Oct 2009 | 7:25 am

రాష్ట్రంలో వరద బీభత్సం: 37కు చేరిన మృతులు

రాష్ట్రంలో సంభవించిన వరద బీభత్సానికి అశువులు బాసిన వారి సంఖ్య 37కు చేరుకుంది. వీరిలో కర్నూలు జిల్లాలో 15 మంది చనిపోగా, మహబూబ్ నగర్‌లో 16 మంది, కృష్ణా జిల్లాలో ముగ్గురు, గంటూరులో ఒకరు చొప్పున మృత్యువాత పడ్డారు. మరో 13 లక్షల మంది నిరాశ్రయులైనట్టు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు చెపుతున్నారు.
Source: ఏపీ న్యూస్ | 4 Oct 2009 | 6:16 am

ప్రత్యేక హెలికాఫ్టర్‌ ద్వారా రోశయ్య ఏరియల్‌ సర్వే

వరద బాధిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి కె.రోశయ్య ఆదివారం ఏరియల్‌ సర్వే నిర్వహించారు. ప్రత్యేక హెలికాఫ్టర్‌లో బయలుదేరి కర్నూలు, మహబూబ్‌నగర్‌లలో వరద నష్టాన్ని ఆయన అంచనావేశారు.
Source: ఏపీ న్యూస్ | 4 Oct 2009 | 6:00 am

ఎన్నికల్లో భాజపా కూటమి విజయం ఖాయం: రాజ్‌నాథ్

ఈనెలలో జరుగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ - శివసేన కూటమి తప్పుకుండా విజయం సాధిస్తుందని భాజపా జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు.
Source: జాతీయ | 4 Oct 2009 | 4:14 am

అన్ని విభాగాల్లో ప్రభుత్వం విఫలం: చిరంజీవి

వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైందని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ఆరోపించారు. ముఖ్యంగా వరద నీటిలో చిక్కుకున్న బాధితుల ప్రాణాలను కాపాడటంలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, అందువల్లే ఈ దుస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 4 Oct 2009 | 3:56 am