|
ఎన్నికల్లో భాజపా కూటమి విజయం ఖాయం: రాజ్నాథ్ఈనెలలో జరుగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ - శివసేన కూటమి తప్పుకుండా విజయం సాధిస్తుందని భాజపా జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు.Source: Yahoo! Telugu: News | 4 Oct 2009 | 9:44 am అన్ని విభాగాల్లో ప్రభుత్వం విఫలం: చిరంజీవివరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైందని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ఆరోపించారు. ముఖ్యంగా వరద నీటిలో చిక్కుకున్న బాధితుల ప్రాణాలను కాపాడటంలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, అందువల్లే ఈ దుస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.Source: Yahoo! Telugu: News | 4 Oct 2009 | 9:25 am రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్‌పై రిమాక్స్ సదస్సురియల్ ఎస్టేట్ బ్రోకరేజ్‌పై ప్రపంచ ప్రఖ్యాత రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ కంపెనీ అయిన రిమాక్స్ సంస్థ రెండు రోజుల పాటు ఒక సదస్సును నిర్వహిస్తోంది. రిమాక్స్ తమిళనాడు విభాగం ఈ రెండు రోజుల సదస్సును చెన్నయ్‌లో ఏర్పాటు చేసింది.Source: Yahoo! Telugu: News | 4 Oct 2009 | 8:27 am జాతీయ విపత్తుగా ప్రకటించాలి: యడ్యూరప్ప విజ్ఞప్తికర్ణాటక రాష్ట్రంలో సంభవించిన వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్.యడ్యూరప్ప విజ్ఞప్తి చేశారు. వరద బాధిత ప్రాంతాల్లో సహాయ చర్యల కోసం తక్షణం వెయ్యి కోట్ల రూపాయలను విడుదల చేయాలని ఆయన కోరారు.Source: Yahoo! Telugu: News | 4 Oct 2009 | 7:35 am "చిరుత"నయుడి "మగధీర" ట్రైలర్ మీకోసం.."చిరుత"నయుడు రామ్‌చరణ్ తేజ హీరోగా, అందాల రాశి కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన బ్లాక్ బ్లస్టర్ మూవీ "మగధీర". యాక్షన్, లవ్, ఎంటర్‌టైన్‌మెంట్ వంటి అన్ని అంశాల మేళవింపుతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. హాలీవుడ్ స్థాయిలో నిలిచింది. తమిళ చిత్రాలైన ‘శివాజి’, ‘దశావతారం’, తర్వాత ‘మగధీర’ చిత్రం సినిమా ఇండస్ట్రీలో ఒక చరిత్రను సృష్టింస్తోంది.Source: Yahoo! Telugu: Entertainment | 4 Oct 2009 | 7:33 am "హ్యాపీడేస్" కృష్ణుడు, కృతిక జంటగా "చేత వెన్నముద్ద"హ్యాపీడేస్ ఫేమ్ కృష్ణుడు కీలక పాత్రలో ఆల్తాఫ్, హ్యాపీడేస్ ఫేమ్ కృతిక క్రిష్ణన్ హీరోయిన్‌గా నటిస్తోన్న "చేత వెన్నముద్ద" చిత్రం సగం పూర్తయింది. రోహిత్. ఎస్. అభ్యుదయ్ దర్శకత్వంలో ఫుల్‌మూన్ పిక్చర్స్ పతాకంపై పి.ఆర్.కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం గురించి ఎగ్జిక్యూటివ్ నిర్మాత ఎమ్. భరత్ మాట్లాడుతూ.. ఇటీవలే కృష్ణుడు స్పెయిన్ అమ్మాయి అన్నాజెన్, మెటిల్డా, మైక్, శశిలపై కామెడీ సన్నివేశాలను చిత్రీకరించడంలో సినిమా సగం పూర్తయ్యిందన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 4 Oct 2009 | 7:30 am జయం మూవీస్‌పై తేజ కొత్త చిత్రం!"కేక" తర్వాత ప్రముఖ దర్శకుడు తేజ కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టనున్నారు. జయం మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై "అటు ఇటు" పేరుతో కొత్త సినిమాను రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. డి. సురేష్‌బాబు సమర్పణలో శ్రీవల్లీతేజ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. "కిక్" ఫేమ్ శ్యామ్ ఇందులో ప్రధానపాత్ర పోషిస్తున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 4 Oct 2009 | 7:28 am ఇరాన్ ప్రతినిధులతో యూఎన్ ఆటామిక్ చీఫ్ చర్చలు!అణు కేంద్రాల తనిఖీ నిమిత్తం ఇరాన్ ప్రతినిధులతో ఐక్యరాజ్య సమితి అటామిక్ చీఫ్ ఆదివారం సమావేశమై చర్చలు జరుపనున్నట్టు ఇరాన్ సీనియర్ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇరాన్ చేపడుతున్న అణు కార్యక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఆరు అగ్రరాజ్యాలు కలిసి ఆ దేశంతో చర్చలు జరిపిన విషయం తెల్సిందే.Source: Yahoo! Telugu: News | 4 Oct 2009 | 7:26 am రామానాయుడు మనుమడు 'రాణా' హీరోగా "లీడర్"డా||. డి. రామానాయుడు మనుమడు రాణాను హీరోగా పరిచయం చేస్తూ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం "లీడర్". ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక ఏవీఎం సంస్థ నిర్మిస్తోంది. కాగా, ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్‌ప్రొడక్షన్స్ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటోంది.Source: Yahoo! Telugu: Entertainment | 4 Oct 2009 | 7:25 am పారామౌంట్‌తో విలీనం చర్చలు జరుపలేదు: గోఎయిర్తమిళనాడు కేంద్రంగా పని చేస్తున్న పారామౌంట్ ఎయిర్‌వేస్‌తో విలీన చర్చలు జరుపుతున్నట్టు మీడియాలో వస్తున్న వార్తలను గోఎయిర్ కొట్టిపారేసింది. విలీనానికి సంబంధించి ఆ సంస్థతో ఎలాంటి చర్చలు జరుపలేదని ఆ సంస్థ స్పష్టం చేసింది.Source: Yahoo! Telugu: News | 4 Oct 2009 | 7:05 am వరద బాధితులను ఆదుకోండి: వైఎస్.జగన్ పిలుపురాష్ట్రంలోని వరద బాధితులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కడప పార్లమెంట్ సభ్యుడు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ తనయుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు.Source: Yahoo! Telugu: News | 4 Oct 2009 | 6:49 am జపాన్ మాజీ ఆర్థిక మంత్రి నకగవా మృతి: పోలీసులుజపాన్ మాజీ ఆర్థిక మంత్రి నకగవా మృతి చెందినట్టు ఆ దేశ పోలీసులు వెల్లడించారు. అయితే, ఆయన మృతికి గల కారణాలను మాత్రం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.Source: Yahoo! Telugu: News | 4 Oct 2009 | 6:26 am రేపు వరద బాధిత ప్రాంతాల్లో సోనియా గాంధీ పర్యటనరాష్ట్రంలోని వరద బాధిత ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, కేంద్ర హోం శాఖామంత్రి చిదంబరంలు సోమవారం పర్యటించనున్నారు. న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు చేరుకునే వారు.. కర్నూలు, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని వరద బాధిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహిస్తారు.Source: Yahoo! Telugu: News | 4 Oct 2009 | 6:03 am ప్రభుత్వ యంత్రాంగానికి ప్రజలు సహకరించాలి: సీఎంవరద సహాయక చర్యల్లో నిమగ్నమైవున్న ప్రభుత్వ యంత్రాంగానికి ప్రజలు పూర్తి సహాయక సహకారాలు అందించాలని ముఖ్యమంత్రి కె.రోశయ్య పిలుపునిచ్చారు. శ్రీశైలంలో వరద ఉధృతి తగ్గుముఖం పట్టిందని ఆయన చెప్పారు.Source: Yahoo! Telugu: News | 4 Oct 2009 | 5:54 am ఎన్నికల్లో భాజపా కూటమి విజయం ఖాయం: రాజ్నాథ్ఈనెలలో జరుగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ - శివసేన కూటమి తప్పుకుండా విజయం సాధిస్తుందని భాజపా జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు.Source: జాతీయ | 4 Oct 2009 | 4:14 am అన్ని విభాగాల్లో ప్రభుత్వం విఫలం: చిరంజీవివరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైందని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ఆరోపించారు. ముఖ్యంగా వరద నీటిలో చిక్కుకున్న బాధితుల ప్రాణాలను కాపాడటంలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, అందువల్లే ఈ దుస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.Source: ఏపీ న్యూస్ | 4 Oct 2009 | 3:56 am జాతీయ విపత్తుగా ప్రకటించాలి: యడ్యూరప్ప విజ్ఞప్తికర్ణాటక రాష్ట్రంలో సంభవించిన వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్.యడ్యూరప్ప విజ్ఞప్తి చేశారు. వరద బాధిత ప్రాంతాల్లో సహాయ చర్యల కోసం తక్షణం వెయ్యి కోట్ల రూపాయలను విడుదల చేయాలని ఆయన కోరారు.Source: జాతీయ | 4 Oct 2009 | 2:07 am వరద బాధితులను ఆదుకోండి: వైఎస్.జగన్ పిలుపురాష్ట్రంలోని వరద బాధితులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కడప పార్లమెంట్ సభ్యుడు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ తనయుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు.Source: ఏపీ న్యూస్ | 4 Oct 2009 | 1:19 am రేపు వరద బాధిత ప్రాంతాల్లో సోనియా గాంధీ పర్యటనరాష్ట్రంలోని వరద బాధిత ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, కేంద్ర హోం శాఖామంత్రి చిదంబరంలు సోమవారం పర్యటించనున్నారు. న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు చేరుకునే వారు.. కర్నూలు, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని వరద బాధిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహిస్తారు.Source: ఏపీ న్యూస్ | 4 Oct 2009 | 12:35 am ప్రభుత్వ యంత్రాంగానికి ప్రజలు సహకరించాలి: సీఎంవరద సహాయక చర్యల్లో నిమగ్నమైవున్న ప్రభుత్వ యంత్రాంగానికి ప్రజలు పూర్తి సహాయక సహకారాలు అందించాలని ముఖ్యమంత్రి కె.రోశయ్య పిలుపునిచ్చారు. శ్రీశైలంలో వరద ఉధృతి తగ్గుముఖం పట్టిందని ఆయన చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 4 Oct 2009 | 12:29 am మణిపూర్‌లో ఎన్‌కౌంటర్: ముగ్గురు మిలిటెంట్ల హతంమణిపూర్ రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌కు సమీపంలోని బిషెన్‌పూర్ జిల్లాలో ఆదివారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మిలిటెంట్లు హతమయ్యారు. తమ విధుల్లో భాగంగా గస్తీ నిర్వహిస్తున్న కమాండర్లపై మిలిటెంట్లు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు.Source: జాతీయ | 4 Oct 2009 | 12:13 am వరదలు: ఆర్మీ సాయంతో సహాయక చర్యలురాష్ట్రంలో వరద సృష్టించిన భీభత్సంలో చిక్కుకుపోయిన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు పలు సహాయక చర్యల్లో ఆర్మీ నిమగ్నమైంది. కృష్ణా, తుంగభద్ర నదులు పోటెత్తడంతో నీట మునిగిన మహబూబ్ నగర్ జిల్లాలో వరద సహాయక చర్యలు ముమ్మరం చేశారు. బీహార్ రెంజిమెంట్ నుంచి వచ్చిన సైనికులు జలదిగ్భంధంలో ఉన్న గ్రామాలకు మర పడవలతో చేరుకుని వరదనీటిలో చిక్కుకుపోయిన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.Source: ఏపీ న్యూస్ | 4 Oct 2009 | 12:06 am భారీ వర్షాలు: మూడు రాష్ట్రాల్లో 227 మంది మృతిబంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావం కారణంగా మూడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలతో ఏర్పడిన వరద ముప్పు వల్ల ఇప్పటి వరకు 227 మంది మృత్యువాత పడినట్టు అధికార వర్గాల సమాచారం.Source: జాతీయ | 3 Oct 2009 | 11:28 pm 28 నుంచి భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలుభారతీయ జనతా పార్టీ జాతీయ కార్యనిర్వాహకవర్గ సమావేశం ఈనెల 28వ తేదీన జరుగనుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశం దేశ రాజధానిలోని పార్లమెంటు అనుబంధ భవనంలో జరుగుతుందని ఆ పార్టీ మీడియా విభాగం వెల్లడించింది.Source: జాతీయ | 3 Oct 2009 | 10:26 pm ప్రకాష్ రాజ్, భూమిక జంటగా కొత్త చిత్రం!"ఒక్కడు" సినిమాలో భూమిక కోసం టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుతో పోరాటం చేసి విలన్‌గానే మిగిలిపోయిన ప్రకాష్ రాజ్ తాజాగా అందాల సుందరి భూమికతో జతకట్టనున్నాడు. ప్రకాష్ రాజ్, భూమిక జంటగా అమోద్ ఎంటర్‌టైన్‌మెంట్స్ తొలి ప్రయత్నంగా ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. ఈ సినిమా సంగతులను శనివారం చిత్ర దర్శకుడు టేకుల కృపాకరరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రంగా దీన్ని రూపొందిస్తున్నామన్నారు. క్లీన్ ఫ్యామిలి ఎంటర్‌టైనర్ అయిన ఈ చిత్రం ప్రధానంగా భార్యభర్తల మధ్య ఉండాల్సిన బంధాలు, అనుబంధాలు, అనురాగం, ఆప్యాయతలు వంటి అంశాల చుట్టూ తిరుగుతుందని చెప్పారు.Source: Yahoo! Telugu: Entertainment | 3 Oct 2009 | 11:51 am ఐశ్వర్యారాయ్ బూట్లలో అసిన్ కాళ్లుప్రపంచ సుందరిగా పేరుప్రఖ్యాతులు గాంచి, అటుపిమ్మట బాలీవుడ్ రారాణిగా వెలుగొందుతోన్న ఐశ్వర్య స్థానాన్ని దక్షిణాది తార అసిన్ ఆక్రమించబోతోందా...? అవుననే అనుకోవాల్సి వస్తోంది. బాలీవుడ్ దర్శక నిర్మాత అశుతోష్ గౌరికర్ త్వరలో నిర్మించబోతున్న "ఖేలీన్ హమ్ జీ జాన్ సే" చిత్రంలో తొలుత ఐశ్వర్యను అనుకున్నారు. అయితే నాలుగు రోజుల క్రితం అశుతోష్‌ను అసిన్ అతని కార్యాలయంలో కలిసిందట. ఇద్దరి మధ్య సుదీర్ఘమైన సంభాషణ జరిగిందట. అంతే ఆ మరుసటి రోజు తన తదుపరి చిత్రంలో అసిన్ కథానాయికగా నటించబోతోందని అశుతోష్ ప్రకటించేశాడట. ఎందుకిలా...? అని ఆరా తీస్తే... అశుతోష్ ఇలా చెప్పాడట. "అసిన్ చాలా మంచి అమ్మాయి. కొంతమంది నా చిత్రంలో నటిస్తావా...? అని అడిగితే, కథ ఎలాంటిది.. పాత్ర ఎలాంటిది... నా మొగుడికి ఛాన్సిస్తావా..? నా బాయ్ ఫ్రెండ్‌కు కూడా ఛాన్సిస్తావా...? అంటూ ప్రశ్నలతో వేధిస్తారు. కానీ అసిన్ మాత్రం అదేం అడగలేదు. జస్ట్.. నాతో కలిసి సినిమా చేస్తావా.? అనడిగా. అంతే వెనక ముందూ చూడకుండా వెంటనే సంతకం చేసేసింది" అని అసిన్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడట.Source: Yahoo! Telugu: Entertainment | 3 Oct 2009 | 11:38 am యమదొంగ కథానాయిక "మమతా మోహన్‌దాస్" పర్సనల్ టచ్"యమదొంగ" చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన కేరళ కుట్టి మమతా మోహన్‌దాస్. మెగాస్టార్ హీరోగా నటించిన "శంకర్ దాదా జిందాబాద్" చిత్రంలో "ఆకలేస్తే అన్నం పెడతా..అలిసివస్తే..ఆయిల్ పెడతా..మూడ్ వస్తే ముద్దులు పెడతా.. అంటూ పాడిన మమతా మోహన్‌దాస్‌ను గాయనిగానూ టాలీవుడ్ ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోరు.ప్రముఖ దర్శకుడు రాజమౌళిచే తెలుగు తెరకు పరిచయమైన మమతామోహన్‌దాస్ నటీమణిగానే గాకుండా.. గాయనిగా కూడా పేరు సంపాదించింది. పలు తెలుగు చిత్రాల్లో పాడిన ఈ భామ కోలీవుడ్‌లోనూ పలు చిత్రాల్లో కథానాయికగా నటించింది. విక్టరీ, కృష్ణార్జున, హోమం, చింతకాయల రవి, కింగ్ వంటి సినిమాల్లో నటించిన మమతాకు ఈ మధ్య తెలుగులో ఛాన్సులు అంతగా రావడం లేదని వినికిడి. ఇకపోతే.. మమతా పూర్తి పేరు.. మమతా మోహన్ దాస్, ముద్దుపేరు: మామ్స్, మోలే, పుట్టినరోజు: నవంబర్ 14, విద్య: బీఎస్ఈ,తొలి తెలుగు చిత్రం: యమదొంగ,తొలి పాట: రాఖీ చిత్రంలో రాఖీ.. రాఖీ..,అలవాట్లు: పాటలు వినడం, షాపింగ్ చేయడం,ఫేవరేట్ కార్: బీఎండబ్ల్యూ,నచ్చిన హీరో: అమితాబ్ బచ్చన్,బ్యూటీ సీక్రెట్: నీటిని ఎక్కువగా తాగడం,నచ్చిన ఆహారం: అరేబియన్ వంటకాలు.Source: Yahoo! Telugu: Entertainment | 3 Oct 2009 | 11:23 am ప్రముఖ హాస్యనటుడు పి. పద్మనాభంకు స్వర్ణకంకణంప్రముఖ హాస్యనటుడు పి. పద్మనాభంకు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్వర్ణకంకణాన్ని తొడిగారు. పద్మశ్రీ డాక్టర్. అల్లురామలింగయ్య పేరిట జాతీయస్థాయి అవార్డును పద్మశ్రీ డా. అల్లురామలింగయ్య కళాపీఠం నిర్వహించింది.గురువారం జూబ్లిహిల్స్‌లోని రావినారాయణరెడ్డి ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో గుమ్మడి, కె. రాఘవేంద్రారావు, అల్లు అర్డున్ రామ్‌చరణ్‌తేజ, సారిపల్లి కొండలరావు తదితరులు పాల్గొన్నారు. గుమ్మడి జ్ఞాపికతో సత్కరిస్తే, రాఘవేంద్రరావు, అల్లు అర్జున్, బ్రహ్మానందం ప్రశంసా పత్రంలో పద్మనాభంను గౌరవించారు.Source: Yahoo! Telugu: Entertainment | 3 Oct 2009 | 8:13 am వరద మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా: రోశయ్యవరద భీభత్సంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి రోశయ్య అన్నారు. రాష్ట్ర సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... వరదల్లో మృతి చెందిన కుటుంబాల వారికి లక్షరూపాయల ఎక్స్‌గ్రేషియాను అందజేస్తామన్నారు. ఒక్కో మృతుని తరపున వారి కుటుంబానికి ఈ సహాయాన్ని అందజేస్తామని రోశయ్య తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 3 Oct 2009 | 7:41 am తాతయ్య వారసులు కావడం మా అదృష్టం: జూ.ఎన్టీఆర్నందమూరి కళ్యాణ్ రామ్, హన్సిక నటించిన "జయీభవ" చిత్ర ఆడియో ఆవిష్కరణ గురువారం రాత్రి హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడా సినీ విలేజ్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ.. మీ కడుపున ఎన్టీఆర్ పుట్టడం అదృష్టం అని మోహన్‌బాబు ఇప్పుడే మా నాన్నతో అన్నారు. గొప్ప తండ్రి కడుపులో మేము పుట్టడం అదృష్టంగా భావిస్తున్నాం. కానీ మేమంతా తాతయ్య వారసులుగా పుట్టడం మరింత అదృష్టమని ఎన్టీఆర్ పేర్కొన్నారు. దానవీరశూరకర్ణలోనిది టైటిల్: బాలయ్య"జయీభవ" అనేది నాన్నగారు నటించిన "దానవీర శూరకర్ణలోని" దుర్యోధనుని పాత్ర ప్రవేశంలో వచ్చే సాంగ్. జయీభవ.. విజయీభవ.. ఆ రేంజ్‌లో సినిమా ఉంటుంది. గత చిత్రాలకు మించిన సక్సెస్‌ను కళ్యాణ్‌రామ్ పొందుతాడని బాలయ్య అన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 3 Oct 2009 | 7:20 am కుక్క మొరిగిందని స్టేజీపైనే అనలేను: హరికృష్ణఏనుగు పోతుంటే కుక్కలు మొరుగుతాయి. దీన్ని సామెతగా తీసుకుంటారు. అలాంటిదే నందమూరి హరికృష్ణ తన అభిమానులు అన్నమాటను తనమాటగా తీసుకోమన్నారు. వివరాల్లోకి వెళితే.. హరికృష్ణ తనయుడు నందమూరి కళ్యాణ్‌రామ్ నటించిన "జయీభవ" ఆడియో వేడుక గురువారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హరికృష్ణ మాట్లాడుతూ.. ఈ మధ్య ఎన్.టి. రామారావు చరిత్రను కొంతమంది చిలువలు పలువలు చేస్తున్నారు. ఇండస్ట్రీలోకి రావడానికి ఎంతో మంది కృషి చేశారని చెబుతున్నారు. అయితే "ఎన్టీఆర్ గురించి అస్సలు ఎవరూ చెప్పడం లేదు. అనగానే.. అభిమానులు ఏనుగు పోతుంటే కుక్కమొరిగిందని అనుకోండని, దానివల్ల ఏనుగు ప్రతిష్టకు ఎలాంటి భంగం కలగదని అరిచారు. మీరన్నది కరెక్ట్. కానీ నేను స్టేజీ పైనే ఉన్నాను. "కుక్కమొరిగిందని నేను అనలేనని, అందుచేత అభిమానుల మాటను నేనన్నట్లు తీసుకోమని హరికృష్ణ సమాధానమిచ్చారు.Source: Yahoo! Telugu: Entertainment | 3 Oct 2009 | 6:55 am కర్నూలులో 26.. మహబూబ్ నగర్‌లో 13 మృతదేహాలురాష్ట్రంలో వరద ఉధృతి ధాటికి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య లెక్క తేలడం లేదు. జనవాస ప్రాంతాలు చిన్నపాటి సముద్రాన్ని తలపిస్తున్నాయి. ఈ నీటిలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆచూకీ తెలియడం లేదు. అయితే, ప్రాథమిక సమాచారం మేరకు ఒక్క కర్నూలు జిల్లాలోనే 26 మృతదేహాలు బయటపడ్డాయి.Source: ఏపీ న్యూస్ | 3 Oct 2009 | 6:36 am ప్రకాష్ రాజ్, భూమిక జంటగా కొత్త చిత్రం!"ఒక్కడు" సినిమాలో భూమిక కోసం టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుతో పోరాటం చేసి విలన్‌గానే మిగిలిపోయిన ప్రకాష్ రాజ్ తాజాగా అందాల సుందరి భూమికతో జతకట్టనున్నాడు. ప్రకాష్ రాజ్, భూమిక జంటగా అమోద్ ఎంటర్‌టైన్‌మెంట్స్ తొలి ప్రయత్నంగా ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. ఈ సినిమా సంగతులను శనివారం చిత్ర దర్శకుడు టేకుల కృపాకరరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రంగా దీన్ని రూపొందిస్తున్నామన్నారు.Source: వినోదం | 3 Oct 2009 | 6:22 am మహారాష్ట్ర ఎన్నికల సమరం: పోటీలో 90యేళ్ళ వృద్ధుడుమహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమరంలో 90 సంవత్సరాల వృద్ధుడు బరిలోకి దిగుతున్నారు. కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ విజ్ఞప్తి మేరకు ఆ పార్టీ అధిష్టానం ఆ ముదుసలికి టిక్కెట్ కేటాయించింది. దీంతో పశ్చిమ మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా షిరోల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.Source: జాతీయ | 3 Oct 2009 | 6:08 am జాతీయ విపత్తుగా ప్రకటించాలి: చంద్రబాబు డిమాండ్రాష్ట్రంలో తలెత్తిన వరదను జాతీయ విపత్తుగా ప్రకటించాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. దీనిపై ఆయన శనివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కర్నూలు, మహబూబ్‌నగర్ జిల్లాలను అతలాకుతలం చేసిన వరదలను కేంద్రం ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించాలని కోరారు.Source: ఏపీ న్యూస్ | 3 Oct 2009 | 4:47 am వరద ఉద్ధృతి తగ్గిన తర్వాతే ఏరియల్ సర్వే: రోశయ్యవరద ముంపు ప్రాంతాల్లో నీటి ఉద్ధృతి తగ్గిన తర్వాతే ఏరియల్ సర్వే నిర్వహిస్తానని ముఖ్యమంత్రి కె.రోశయ్య శనివారం స్పష్టం చేశారు. రాష్ట్ర మంత్రివర్గం ముఖ్యమంత్రి అధ్యక్షతన అత్యవసరంగా సమావేశమైంది.Source: ఏపీ న్యూస్ | 3 Oct 2009 | 4:45 am గాంధీ జయంతినాడు కూడా పని చేయాలి: మంత్రి శశి థరూర్వియత్నాం ప్రజలు జాతిపితగా భావించే హెచిమిన్ జయంతి రోజున కొన్ని గంటల పాటు పని చేస్తారని, ఈ మార్గాన్ని మనం కూడా అనుసరిస్తే బాగుంటుదని థరూర్ అన్నారు. జాతిపిత గాంధీజీ జయంతి రోజున ప్రజలు సెలవు తీసుకుని ఇంటిలో ఉండటం కంటే.. పని చేయాలని మంత్రి అభిప్రాయపడ్డారు.Source: జాతీయ | 3 Oct 2009 | 4:38 am ప్రాణ భయం గుప్పెట్లో దివిసీమ-లంక గ్రామవాసులుప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. దీంతో ఒకటో నంబరు ప్రమాద సూచికను జారీ చేశారు. వరద ఉద్ధృతి మరింతగా పెరిగితే రెండో నంబరు ప్రమాద సూచికను కూడా జారీ చేసే అవకాశాలు ఉన్నట్టు స్థానిక అధికారులు వెల్లడించారు.Source: ఏపీ న్యూస్ | 3 Oct 2009 | 4:01 am
|