|
రూ. 60వేల కోట్లు దాటిన విదేశీ నిధులుభారత స్టాక్ మార్కెట్లలో విదేశీల నిధులు ప్రవాహం.. రూ. 60వేల కోట్లు దాటినట్లు తాజాగా మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. రానున్న మాసాల్లో విదేశీ నిల్వలచే.. పెట్టుబడులు మరింత పెరిగే అవకాశం ఉండటంతో.. ఈ మార్కు రూ. 70వేల కోట్లు దాటే అవకాశం కూడా ఉందని తెలిపాయి.Source: Yahoo! Telugu: News | 3 Oct 2009 | 9:32 am ప్రాణ భయం గుప్పెట్లో దివిసీమ-లంక గ్రామవాసులుప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. దీంతో ఒకటో నంబరు ప్రమాద సూచికను జారీ చేశారు. వరద ఉద్ధృతి మరింతగా పెరిగితే రెండో నంబరు ప్రమాద సూచికను కూడా జారీ చేసే అవకాశాలు ఉన్నట్టు స్థానిక అధికారులు వెల్లడించారు.Source: Yahoo! Telugu: News | 3 Oct 2009 | 9:30 am గాంధీ జయంతిన కూడా పని చేయాలి: మంత్రి శశి థరూర్వియత్నాం ప్రజలు జాతిపితగా భావించే హెచిమిన్ జయంతి రోజున కొన్ని గంటల పాటు పని చేస్తారని, ఈ మార్గాన్ని మనం కూడా అనుసరిస్తే బాగుంటుదని థరూర్ అన్నారు. జాతిపిత గాంధీజీ జయంతి రోజున ప్రజలు సెలవు తీసుకుని ఇంటిలో ఉండటం కంటే.. పని చేయాలని మంత్రి అభిప్రాయపడ్డారు.Source: Yahoo! Telugu: News | 3 Oct 2009 | 9:09 am వరద బాధితులకు హీరో రామ్ చరణ్ "చిరు" సాయంరాష్ట్రంలో వరద బాధితులను ఆదుకునేందుకు యువ హీరో రామ్ చరణ్ తేజ్ తన వంతు సాయం ప్రకటించారు. రాష్ట్రాన్ని కుదిపేస్తున్న వరదలు, వరద ఉద్ధృతిలో చిక్కుకుని ప్రాణాలను కాపాడుకుంటున్న బాధితులను ఆదుకోవాల్సిందిగా తన అభిమానులకు విజ్ఞప్తి చేశారు.Source: Yahoo! Telugu: News | 3 Oct 2009 | 8:48 am సిసిలాన్‌లో భూకంపం : 13 మంది మృతిఇటలీలోని సిసిలాన్ నగరంలో భారీ వర్షాలతోపాటు భూమి కంపించింది. దీంతో దాదాపు 13 మంది మృతి చెందగా చాలామంది తీవ్రగాయాలపాలైనారు.Source: Yahoo! Telugu: News | 3 Oct 2009 | 8:35 am విప్రోతో ఒప్పందం చేసుకున్న జీఈప్రపంచంలోని వ్యాపార రంగంలో అగ్రగామిగానున్న జీఈ సంస్థ తన హెల్త్‌కేర్ ప్రోడక్ట్స్‌ను భారతదేశంలోకి ప్రవేశపెట్టే నేపథ్యంలో దేశీయ ప్రముఖ ఐటీ కంపెనీ విప్రోతో ఒప్పందం చేసుకుంది.Source: Yahoo! Telugu: News | 3 Oct 2009 | 8:20 am ప్రముఖ హాస్యనటుడు పి. పద్మనాభంకు స్వర్ణకంకణంప్రముఖ హాస్యనటుడు పి. పద్మనాభంకు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్వర్ణకంకణాన్ని తొడిగారు. పద్మశ్రీ డాక్టర్. అల్లురామలింగయ్య పేరిట జాతీయస్థాయి అవార్డును పద్మశ్రీ డా. అల్లురామలింగయ్య కళాపీఠం నిర్వహించింది.గురువారం జూబ్లిహిల్స్‌లోని రావినారాయణరెడ్డి ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో గుమ్మడి, కె. రాఘవేంద్రారావు, అల్లు అర్డున్ రామ్‌చరణ్‌తేజ, సారిపల్లి కొండలరావు తదితరులు పాల్గొన్నారు. గుమ్మడి జ్ఞాపికతో సత్కరిస్తే, రాఘవేంద్రరావు, అల్లు అర్జున్, బ్రహ్మానందం ప్రశంసా పత్రంలో పద్మనాభంను గౌరవించారు.Source: Yahoo! Telugu: Entertainment | 3 Oct 2009 | 8:13 am పేదరికాన్ని నిర్మూలిస్తే ఉగ్రవాదం అంతం: ఖురేషీప్రపంచంలోనున్న పేదరికాన్ని నిర్మూలించేందుకు ప్రయత్నిస్తే ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేయవచ్చని పాకిస్థాన్ విదేశాంగ శాఖామంత్రి ముహమ్మద్ ఖురేషీ అన్నారుSource: Yahoo! Telugu: News | 3 Oct 2009 | 7:57 am జాబ్స్: కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్భారతీయ సైనిక, నౌక, వైమానిక అకాడెమీల్లో ప్రవేశాన్ని కోరుతూ.. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీడీఎస్)- 2010 పేరిట యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించి కింద వివరాలు తెలపడం జరిగింది. కోర్సు, ఖాళీలు, అర్హతల వివరాలను తెలపడం జరిగింది.Source: Yahoo! Telugu: News | 3 Oct 2009 | 7:55 am మావోయిస్టుల బంద్: బెంగాల్‌లో రైల్వే ట్రాక్ పేల్చివేతమావోయిస్టులు ఇచ్చిన దేశ వ్యాప్త బంద్ పిలుపు పలు ప్రాంతాల్లో హింసాత్మక సంఘటనలకు దారితీసింది. మావోయిస్టుల అణిచివేతతో పాటు.. తమ అగ్రనేత అరెస్టును ఖండిస్తూ నక్సలైట్లు రెండు రోజుల పాటు దేశ వ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది.Source: Yahoo! Telugu: News | 3 Oct 2009 | 7:42 am చక్కెర కోటా విడుదల చేసిన కేంద్రంఅక్టోబర్ నెల కోటాకింద 20.85 లక్షల టన్నుల చక్కెరను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినట్లు ప్రభుత్వాధికారులు శనివారం ప్రకటించారు. ప్రస్తుతం పండుగ సీజన్ కావడంతో ప్రత్యేకంగా సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెలలకుగాను దాదాపు 1044 లక్షల టన్నుల లెవీ చక్కెరను విడుదల చేసినట్లు అధికారుల పేర్కొన్నారు.Source: Yahoo! Telugu: News | 3 Oct 2009 | 7:40 am తాతయ్య వారసులు కావడం మా అదృష్టం: జూ.ఎన్టీఆర్నందమూరి కళ్యాణ్ రామ్, హన్సిక నటించిన "జయీభవ" చిత్ర ఆడియో ఆవిష్కరణ గురువారం రాత్రి హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడా సినీ విలేజ్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ.. మీ కడుపున ఎన్టీఆర్ పుట్టడం అదృష్టం అని మోహన్‌బాబు ఇప్పుడే మా నాన్నతో అన్నారు. గొప్ప తండ్రి కడుపులో మేము పుట్టడం అదృష్టంగా భావిస్తున్నాం. కానీ మేమంతా తాతయ్య వారసులుగా పుట్టడం మరింత అదృష్టమని ఎన్టీఆర్ పేర్కొన్నారు. దానవీరశూరకర్ణలోనిది టైటిల్: బాలయ్య"జయీభవ" అనేది నాన్నగారు నటించిన "దానవీర శూరకర్ణలోని" దుర్యోధనుని పాత్ర ప్రవేశంలో వచ్చే సాంగ్. జయీభవ.. విజయీభవ.. ఆ రేంజ్‌లో సినిమా ఉంటుంది. గత చిత్రాలకు మించిన సక్సెస్‌ను కళ్యాణ్‌రామ్ పొందుతాడని బాలయ్య అన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 3 Oct 2009 | 7:20 am కుక్క మొరిగిందని స్టేజీపైనే అనలేను: హరికృష్ణఏనుగు పోతుంటే కుక్కలు మొరుగుతాయి. దీన్ని సామెతగా తీసుకుంటారు. అలాంటిదే నందమూరి హరికృష్ణ తన అభిమానులు అన్నమాటను తనమాటగా తీసుకోమన్నారు. వివరాల్లోకి వెళితే.. హరికృష్ణ తనయుడు నందమూరి కళ్యాణ్‌రామ్ నటించిన "జయీభవ" ఆడియో వేడుక గురువారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హరికృష్ణ మాట్లాడుతూ.. ఈ మధ్య ఎన్.టి. రామారావు చరిత్రను కొంతమంది చిలువలు పలువలు చేస్తున్నారు. ఇండస్ట్రీలోకి రావడానికి ఎంతో మంది కృషి చేశారని చెబుతున్నారు. అయితే "ఎన్టీఆర్ గురించి అస్సలు ఎవరూ చెప్పడం లేదు. అనగానే.. అభిమానులు ఏనుగు పోతుంటే కుక్కమొరిగిందని అనుకోండని, దానివల్ల ఏనుగు ప్రతిష్టకు ఎలాంటి భంగం కలగదని అరిచారు. మీరన్నది కరెక్ట్. కానీ నేను స్టేజీ పైనే ఉన్నాను. "కుక్కమొరిగిందని నేను అనలేనని, అందుచేత అభిమానుల మాటను నేనన్నట్లు తీసుకోమని హరికృష్ణ సమాధానమిచ్చారు.Source: Yahoo! Telugu: Entertainment | 3 Oct 2009 | 6:55 am "నిన్ను కలిశాక" అంతే సంగతులు..!నటీనటులు: చైతన్య, సంతోష్, దీపా షా, ప్రియ, కృష్ణుడు తదితరులు, సమర్పణ: రామోజీ ఫిలింసిటీ, నిర్మాత: రామోజీరావు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శివనాగేశ్వర రావు. పాయింట్: ఎప్పుడూ కలిగేది ఆకర్షణ.. ఒక్కసారి కలిగేది ప్రేమ... అందుకే "ప్రేమను ప్రేమించు".. అనే పాయింట్‌కు కథగా మలిచిన సినిమా ఇది.ఇండస్ట్రీలో కథల కొరత ఉంది అనేది కొన్ని సినిమాలను చూస్తే నిజమే అనిపిస్తుంది. మరికొన్నింటిని చూస్తే మన చుట్టూనే చాలా కథలే ఉన్నాయి. వాటిని తీసేందుకు సరైన దర్శకుడు లేడనిపిస్తుంది. "నిన్ను కలిశాక" చూశాక దర్శకుడిలోపం స్పష్టంగా కన్పిస్తోంది. ఈనాటి యువత అంటేనే పెద్దలక ఒక దురభిప్రాయం ఉంటుంది. ఒక ఆడ, మగ కలిసి మాట్లాడుకున్నా, తిరిగినా ఇద్దరి మధ్య ఉండేది "అదే"నని అనుకుంటారు. మరోరోజు వారే వేరేవారితో ఉంటే బరితెగించారని, ప్రేమ అనేపదాన్ని దుర్వినియోగం చేస్తూ పాశ్చాత్యపోకడలతో మన కట్టుబాట్లను కలుషితం చేస్తున్నారని విమర్శిస్తుంటారు. కానీ నేటి యువతకు జీవితంపైనా, ప్రేమపైనా సరైన స్పష్టత ఉంది. స్నేహం అంటే ఏమిటి? ప్రేమ అంటే ఏమిటి? అనే విషయాల్లో క్లారిటీ ఉంది.. అని చెప్పే ప్రయత్నమే 'నిన్ను కలిశాక'.Source: Yahoo! Telugu: Entertainment | 3 Oct 2009 | 6:29 am అస్వస్థతకు గురైన మెగాస్టార్ చిరంజీవి!మెగాస్టార్ చిరంజీవి అస్వస్థతకు గురయ్యారు. గత కొద్దిరోజులుగా ఆయన పక్కటెముకల నొప్పితో బాధపడుతున్నారు. గతంలో " రాజా విక్రమార్క" షూటింగ్‌లో జరిగిన పోరాట సన్నివేశంలో ఆయనకు ఎముకలపై దెబ్బలు తగిలాయి. ఆ తర్వాత మరి కొంతకాలానికి "దొంగ" చిత్రం సమయంలోనూ అదే ప్రాంతంలో దెబ్బలు తగలడంతో కొంతకాలం షూటింగ్‌లకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత తగిన ట్రీట్‌మెంట్ తీసుకుని కోలుకున్నారు. అయితే, ఇటీవల తిరుపతి పర్యటనలో ఆయనను కలిసేందుకు పలువురు అభిమానులు అత్యుత్సాహం చూపి ఆయనపైకి తోసుకువచ్చారు.Source: Yahoo! Telugu: Entertainment | 3 Oct 2009 | 5:06 am ప్రాణ భయం గుప్పెట్లో దివిసీమ-లంక గ్రామవాసులుప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. దీంతో ఒకటో నంబరు ప్రమాద సూచికను జారీ చేశారు. వరద ఉద్ధృతి మరింతగా పెరిగితే రెండో నంబరు ప్రమాద సూచికను కూడా జారీ చేసే అవకాశాలు ఉన్నట్టు స్థానిక అధికారులు వెల్లడించారు.Source: ఏపీ న్యూస్ | 3 Oct 2009 | 4:01 am గాంధీ జయంతిన కూడా పని చేయాలి: మంత్రి శశి థరూర్వియత్నాం ప్రజలు జాతిపితగా భావించే హెచిమిన్ జయంతి రోజున కొన్ని గంటల పాటు పని చేస్తారని, ఈ మార్గాన్ని మనం కూడా అనుసరిస్తే బాగుంటుదని థరూర్ అన్నారు. జాతిపిత గాంధీజీ జయంతి రోజున ప్రజలు సెలవు తీసుకుని ఇంటిలో ఉండటం కంటే.. పని చేయాలని మంత్రి అభిప్రాయపడ్డారు.Source: జాతీయ | 3 Oct 2009 | 3:40 am వరద బాధితులకు హీరో రామ్ చరణ్ "చిరు" సాయంరాష్ట్రంలో వరద బాధితులను ఆదుకునేందుకు యువ హీరో రామ్ చరణ్ తేజ్ తన వంతు సాయం ప్రకటించారు. రాష్ట్రాన్ని కుదిపేస్తున్న వరదలు, వరద ఉద్ధృతిలో చిక్కుకుని ప్రాణాలను కాపాడుకుంటున్న బాధితులను ఆదుకోవాల్సిందిగా తన అభిమానులకు విజ్ఞప్తి చేశారు.Source: ఏపీ న్యూస్ | 3 Oct 2009 | 3:19 am మావోయిస్టుల బంద్: బెంగాల్‌లో రైల్వే ట్రాక్ పేల్చివేతమావోయిస్టులు ఇచ్చిన దేశ వ్యాప్త బంద్ పిలుపు పలు ప్రాంతాల్లో హింసాత్మక సంఘటనలకు దారితీసింది. మావోయిస్టుల అణిచివేతతో పాటు.. తమ అగ్రనేత అరెస్టును ఖండిస్తూ నక్సలైట్లు రెండు రోజుల పాటు దేశ వ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది.Source: జాతీయ | 3 Oct 2009 | 2:13 am నాగాలాండ్‌లో రోడ్డు ప్రమాదాలు: 13 మంది మృతినాగాలాండ్ రాష్ట్రంలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 13 మంది మృత్యువాత పడ్డారు. మరికొందరు గాయపడినట్టు పోలీసులు వెల్లడించారు. మణిపూర్‌లోని ఇంఫాల్ నుంచి కొంతమంది ప్రయాణికులతో వస్తున్న బస్సు ఒకటి లోతైన లోయలో బోల్తా పడింది.Source: జాతీయ | 3 Oct 2009 | 1:18 am అన్నిరకాల సాయానికి కేంద్ర సంసిద్ధత: సీఎం రోశయ్యరాష్ట్రంలో వరద ముంపు నుంచి బయటపడేందుకు అవసరమైన అన్ని రకాల సహాయక చర్యలను అందిస్తామని ప్రధాని భరోసా ఇచ్చారని ముఖ్యమంత్రి రోశయ్య తెలిపారు. ఈ మేరకు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌తో శుక్రవారం రాత్రి జరిపిన ఫోన్ సంభాషణల్లో హామీ ఇచ్చారని రోశయ్య తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 3 Oct 2009 | 1:07 am కర్నూలు వరద నీటిలో చిక్కుకున్న 25 వేల మందికర్నూలు జిల్లా జలమయమైంది. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కర్నూలుతో పాటు.. మహబూబ్‌నగర్, కృష్ణా జిల్లాలు నీటిలో మునిగి పోయాయి. ఫలితంగా ఒక్క కర్నూలు జిల్లాలోనే సుమారు 25 వేల మంది ప్రజలు వరద నీటిలో చిక్కుకున్నారు.Source: ఏపీ న్యూస్ | 3 Oct 2009 | 12:38 am కేరళ పడవ ప్రమాదం: 42కు పెరిగిన మృతుల సంఖ్యకేరళ రాష్ట్రంలోని ఇడుక్కి జిల్లాలో థెక్కడి నదిలో జరిగిన పడవ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య శనివారానికి 42కు చేరుకుంది. ఇడుక్కి జిల్లాలోని పెరియార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరికొంతమంది క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉంది.Source: జాతీయ | 3 Oct 2009 | 12:25 am వరద పనుల్లో నిమగ్నం కావాలి: చంద్రబాబు పిలుపువరద సహాయ చర్యల్లో నిమగ్నం కావాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. వరద నీటిలో చిక్కుకున్న బాధితులను శక్తిమేరకు ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.Source: ఏపీ న్యూస్ | 2 Oct 2009 | 11:45 pm తొలగని వరద ముప్పు ప్రమాదం: ముఖ్యమంత్రి రోశయ్యరాష్ట్రానికి వరద ముప్పు ప్రమాదం ఇంకా తొలగిపోలేదని ముఖ్యమంత్రి కె.రోశయ్య అన్నారు. వరద బాధిత ప్రాంతాల్లో సహయ పునరావాస చర్యలను ఆయన ఉన్నతాధికారులతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వరద ప్రమాదం పూర్తిగా తొలగిపోలేదన్నారు.Source: ఏపీ న్యూస్ | 2 Oct 2009 | 11:36 pm వరద సహాయక చర్యలకు రూ.20 లక్షల సాయం: జగన్రాష్ట్రంలో వరద సహాయక చర్యలకు వైఎస్సార్ ఫౌండేషన్ తరపున మాజీ ముఖ్యమంత్రి తనయుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి రూ.20 లక్షలను విరాళంగా ప్రకటించారు. ఈ మొత్తం నిధులను ఆయన ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేశారు.Source: ఏపీ న్యూస్ | 2 Oct 2009 | 11:24 pm కర్ణాటక-ఆంధ్ర రాష్ట్రాల్లో వరదలు: 130 మంది మృతికర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సంభవించిన వరదలకు 130 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది ఆచూకీ తెలియడం లేదు. వేలాది ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లింది. వరద నీటిలో చిక్కుకున్న బాధితులను రక్షించేందుకు ప్రభుత్వం అన్ని రకాల సహయక చర్యలను చేపట్టింది.Source: జాతీయ | 2 Oct 2009 | 10:39 pm నేడు రాష్ట్రానికి రానున్న ప్రధాని మన్మోహన్వరద ముంపులో చిక్కుకున్న రాష్ట్రాన్ని పరిశీలించేందుకు ప్రధాని మన్నోహన్ సింగ్ శనివారం రాష్ట్రానికి రానున్నారు. ఆయనతో పాటు.. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.Source: జాతీయ | 2 Oct 2009 | 9:46 pm కర్నూలు, మహబూబ్ నగర్, కృష్ణా జిల్లాల్లో రెడ్ అలెర్ట్వరద ఉధృతి మరింతగా పెరగడంతో కర్నూలు, మెహబూబ్ నగర్, కృష్ణా జిల్లాలో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. ప్రత్యేకించి కర్నూలు జిల్లాలోని మంత్రాలయం పూర్తిగా జలమయం అయింది. ఎమ్మెల్యె బాలనాగి రెడ్డి సహా స్థానికులందరూ జలదిగ్బంధంలో చిక్కుకున్నట్లు సమాచారం. ఈ వరద నీటిలో కర్నూలు జిల్లాలో ఉన్న రెయిన్ బో ఆసుపత్రి తొలి అంతస్థు నిండిపోగా... రెండు అంతస్థుకు సమీపంలో నీరు ప్రవహిస్తున్నాయి.Source: ఏపీ న్యూస్ | 2 Oct 2009 | 6:36 am కర్నాటకలో భారీ వర్షాలు: 88మంది మృతికర్నాటక రాష్ట్రంలో భారీగా వర్షాలు కురవడంతో దాదాపు ఎనిమిది జిల్లాలు నీటమునిగిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. భారీ వర్షాల కారణంగా దాదాపు 88మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.Source: జాతీయ | 2 Oct 2009 | 6:16 am ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సంతాపసభదివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి మరణించి నేటికి నెలరోజులు పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సంతాపసభ నిర్వహించారు.Source: ఏపీ న్యూస్ | 2 Oct 2009 | 5:50 am రాష్ట్రంలో భారీ వర్షాలు : 15 మంది మృతిబంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమౌతోంది. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మొత్తం 15 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం ప్రకటించింది.Source: ఏపీ న్యూస్ | 2 Oct 2009 | 5:36 am స్వార్థాన్ని విడనాడి ఐక్యంగా ఉండండి: ఆర్ఎస్ఎస్స్వార్థాన్ని విడనాడి, ఐక్యంగా ఉండేందుకు ప్రయత్నించాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ భారతీయ జనతా పార్టీ సభ్యులను పరోక్షంగా కోరింది.Source: జాతీయ | 2 Oct 2009 | 5:04 am బీహార్ సీఎంను చంపుతాం: మావోల హెచ్చరికజైలులో బంధించబడిన ఇద్దరు మావోయిస్టు నేతలను విడుదల చేయకపోతే.. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను చంపుతామని నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీ హెచ్చరించింది. ఓ ప్రైవేటు టీవీ ఛానెళ్‌కు చెందిన ఓ రిపోర్టర్‌కు 09308670993 అనే మొబైల్ నెంబర్ ద్వారా.. ఈ బెదిరింపు సందేశం (ఎస్ఎంఎస్) డబ్లూ అనే ఓ నక్సలైట్ నేత పంపినట్లుగా వచ్చింది.Source: జాతీయ | 2 Oct 2009 | 3:42 am
|