|
రాయలసీమ జిల్లాలకు రద్దైన బస్సులుకర్నూలు తదితర ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ జలమయం కావడంతో రాష్ట్ర రాజధానినుంచి రాయలసీమ జిల్లాలకు వెళ్ళే బస్సు సర్వీసులను ఆర్‌టీసీ అధికారులు శుక్రవారం రద్దు చేశారు.Source: Yahoo! Telugu: News | 2 Oct 2009 | 9:14 am వడ్డీరేట్లను తగ్గించిన ఎస్బీఐదేశీయ బ్యాంకింగ్ రంగంలో అగ్రగామిగానున్న భారతీయ స్టేట్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లకు అందించే వడ్డీ రేట్లలో మార్పులుచేసి 0.25 శాతం తగ్గించింది. కొత్తగా అమలు చేసిన ఈ వడ్డీ రేట్లు అక్టోబర్ నెల ఐదవ తేదీనుంచి అమలులోకి వస్తాయని బ్యాంక్ ప్రకటించింది.Source: Yahoo! Telugu: News | 2 Oct 2009 | 9:00 am నేటి బులియన్ మార్కెట్ ధరలునేటి బులియన్ మార్కెట్‌లో బంగారు, వెండి ధరలు ఇలా ఉన్నాయి... హైదరాబాద్ 24 క్యారెట్ - రూ. 16,200, వెండి కిలో - రూ. 26,900. చెన్నై 24 క్యారెట్ - రూ. 15,725 - రూ. 15,695, వెండి కిలో - రూ. 27,585- రూ. 27,490. విజయవాడ - రూ. 15,925, వెండి కిలో - రూ. 27,200.Source: Yahoo! Telugu: News | 2 Oct 2009 | 8:47 am జాతిపితకు ఘన నివాళి అర్పించిన రాష్ట్రంజాతిపిత మహాత్మాగాంధీ 140వ జయంతి సందర్భంగా రాష్ట్ర అసెంబ్లీ ఆవరణలోని మహాత్ముని విగ్రహానికి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి రోశయ్య, శాసనసభ స్పీకర్ కిరణ్ కుమార్‌రెడ్డి, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, గీతారెడ్డి, దానం నాగేందర్, ముఖేష్‌గౌడ్ నివాళులర్పించారు.Source: Yahoo! Telugu: News | 2 Oct 2009 | 8:28 am మహాత్మాగాంధీని స్మరించుకున్న దేశ పౌరులుజాతిపిత మహాత్మాగాంధీ 140వ జయంతి సందర్భంగా శుక్రవారం దేశవ్యాప్తంగా ప్రజలు వేడుకలు జరుపుకుని జాతిపితను స్మరించుకున్నారు. ఈ నేపథ్యంలో న్యూఢిల్లీలో దేశ ఉపాధ్యక్షుడు హమీద్ అన్సారీ, దేశ ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రతిపక్ష నాయకుడు, బీజేపీ అగ్రనేత ఎల్.కే. అద్వానీ తదితరులు రాజ్‌ఘాట్‌లోనున్న జాతిపిత సమాధి వద్ద పుష్పగుచ్ఛాలుంచి శ్రద్ధాంజలి ఘటించారుSource: Yahoo! Telugu: News | 2 Oct 2009 | 7:27 am పాకిస్థాన్‌లో హింస పెరగవచ్చు: అమెరికాఆఫ్గనిస్థాన్లో అమెరికా సైనికుల సంఖ్య పెంచడంతో తాలిబన్-అల్‌ఖైదా తీవ్రవాద దళాలు సంయుక్తంగా కలిసి పాక్‌లో హింసను సృష్టిస్తాయని అమెరికా భావిస్తోంది.Source: Yahoo! Telugu: News | 2 Oct 2009 | 7:10 am కార్ల అమ్మకాల్లో రికార్డు సృష్టించిన హుండాయ్దేశంలో ఎన్నడూ లేని విధంగా సెప్టెంబర్ నెలలో తమ సంస్థకు చెందిన వాహనాల విక్రయాల్లో హుండాయ్ మోటార్ ఇండియా(హెచ్ఎంఐ) సరికొత్త రికార్డు నమోదు చేసుకొందని హుండాయ్ ప్రకటించింది.Source: Yahoo! Telugu: News | 2 Oct 2009 | 6:29 am శ్రీశైలం డ్యాంకు ప్రమాదం లేదు: రోశయ్యప్రస్తుతం వరద ఉద్ధృతి తీవ్రంగా ఉన్నా కర్నూలు జిల్లాలోనున్న శ్రీశైలం డ్యాంకు ఎలాంటి ప్రమాదం లేదని రాష్ట్ర అపద్ధర్మ ముఖ్యమంత్రి రోశయ్య అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...వరద ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితిపై ప్రతి అర్థగంటకు ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహిస్తామని ఆయన చెప్పారు.Source: Yahoo! Telugu: News | 2 Oct 2009 | 6:14 am బీహార్ సీఎంను చంపుతాం: మావోల హెచ్చరికజైలులో బంధించబడిన ఇద్దరు మావోయిస్టు నేతలను విడుదల చేయకపోతే.. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను చంపుతామని నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీ హెచ్చరించింది. ఓ ప్రైవేటు టీవీ ఛానెళ్‌కు చెందిన ఓ రిపోర్టర్‌కు 09308670993 అనే మొబైల్ నెంబర్ ద్వారా.. ఈ బెదిరింపు సందేశం (ఎస్ఎంఎస్) డబ్లూ అనే ఓ నక్సలైట్ నేత పంపినట్లుగా వచ్చింది.Source: Yahoo! Telugu: News | 2 Oct 2009 | 5:58 am పాక్‌లోనే ఒసామా ఉన్నాడు: అమెరికాఒసామా బిన్ లాడెన్ ప్రస్తుతం పాకిస్థాన్‌లోనే తలదాచుకుంటున్నాడని పాక్‌లోని అమెరికా దౌత్యకార్యాలయ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ గెరాల్డ్ ఎమ్. ఫియర్‌స్టీన్ తెలిపారు.Source: Yahoo! Telugu: News | 2 Oct 2009 | 5:41 am రాయలసీమ జిల్లాలకు రద్దైన బస్సులుకర్నూలు తదితర ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ జలమయం కావడంతో రాష్ట్ర రాజధానినుంచి రాయలసీమ జిల్లాలకు వెళ్ళే బస్సు సర్వీసులను ఆర్‌టీసీ అధికారులు శుక్రవారం రద్దు చేశారు.Source: ఏపీ న్యూస్ | 2 Oct 2009 | 3:45 am బీహార్ సీఎంను చంపుతాం: మావోల హెచ్చరికజైలులో బంధించబడిన ఇద్దరు మావోయిస్టు నేతలను విడుదల చేయకపోతే.. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను చంపుతామని నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీ హెచ్చరించింది. ఓ ప్రైవేటు టీవీ ఛానెళ్‌కు చెందిన ఓ రిపోర్టర్‌కు 09308670993 అనే మొబైల్ నెంబర్ ద్వారా.. ఈ బెదిరింపు సందేశం (ఎస్ఎంఎస్) డబ్లూ అనే ఓ నక్సలైట్ నేత పంపినట్లుగా వచ్చింది.Source: జాతీయ | 2 Oct 2009 | 3:42 am జాతిపితకు ఘన నివాళి అర్పించిన రాష్ట్రంజాతిపిత మహాత్మాగాంధీ 140వ జయంతి సందర్భంగా రాష్ట్ర అసెంబ్లీ ఆవరణలోని మహాత్ముని విగ్రహానికి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి రోశయ్య, శాసనసభ స్పీకర్ కిరణ్ కుమార్‌రెడ్డి, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, గీతారెడ్డి, దానం నాగేందర్, ముఖేష్‌గౌడ్ నివాళులర్పించారు.Source: ఏపీ న్యూస్ | 2 Oct 2009 | 2:59 am మహాత్మాగాంధీని స్మరించుకున్న దేశ పౌరులుజాతిపిత మహాత్మాగాంధీ 140వ జయంతి సందర్భంగా శుక్రవారం దేశవ్యాప్తంగా ప్రజలు వేడుకలు జరుపుకుని జాతిపితను స్మరించుకున్నారు. ఈ నేపథ్యంలో న్యూఢిల్లీలో దేశ ఉపాధ్యక్షుడు హమీద్ అన్సారీ, దేశ ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రతిపక్ష నాయకుడు, బీజేపీ అగ్రనేత ఎల్.కే. అద్వానీ తదితరులు రాజ్‌ఘాట్‌లోనున్న జాతిపిత సమాధి వద్ద పుష్పగుచ్ఛాలుంచి శ్రద్ధాంజలి ఘటించారుSource: జాతీయ | 2 Oct 2009 | 1:58 am శ్రీశైలం డ్యాంకు ప్రమాదం లేదు: రోశయ్యప్రస్తుతం వరద ఉద్ధృతి తీవ్రంగా ఉన్నా కర్నూలు జిల్లాలోనున్న శ్రీశైలం డ్యాంకు ఎలాంటి ప్రమాదం లేదని రాష్ట్ర అపద్ధర్మ ముఖ్యమంత్రి రోశయ్య అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...వరద ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితిపై ప్రతి అర్థగంటకు ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహిస్తామని ఆయన చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 2 Oct 2009 | 12:45 am ముంచెత్తుతున్న వర్షాలు: జనజీవనం అస్తవ్యస్తంభారీ వర్షాలతో.. మెహబూబ్ నగర్, కర్నూలు జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తం అయింది. ప్రత్యేకించి మెహబూబ్ నగర్ జిల్లాలో ఊళ్లలోకి నీరు రాగా, కర్నూలులోని మంత్రాలయం పూర్తిగా నిటమునిగింది. దీంతో అక్కడి ప్రజలు ఇళ్ల పైకి.. బస్టాండు పైకి ఎక్కారు. కోట్ల విజయభాస్కర రెడ్డి బ్యారేజీ కూడా కట్టలు తెంచుకుని ప్రవహిస్తోంది.Source: ఏపీ న్యూస్ | 1 Oct 2009 | 11:58 pm కర్నూలు జిల్లాలో భారీ వర్షాలుకర్నూలు జిల్లాలో భారీగా వర్షాలు కురవడంతో వరదనీరు ముంచెత్తింది. దీంతో జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు. జిల్లాలోనున్న తుంగభద్రా నది ప్రమాదస్థాయిని దాటి ప్రవహిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది.Source: ఏపీ న్యూస్ | 1 Oct 2009 | 11:49 pm చెలరేగిన మావోలు: బీహార్‌లో దారుణ మారణకాండబీహార్ ముఖ్యమంత్రి నితిష్ కుమార్ సారథ్యంలోని ఎన్టీఏ పాలనలో తొలిసారిగా దారుణమైన మారణకాండ జరిగింది. నిన్న రాత్రి బీహార్‌లోని ఖగారియా జిల్లాలో ఓ గ్రామంలో అనుమానిత మావోయిస్టు కాడర్లు కాల్పులతో విరుచుకుపడ్డారు. ఈ కాల్పుల్లో సుమారు 16 మందికి పైగా అమాయక ప్రాణులు బలయ్యారు.Source: జాతీయ | 1 Oct 2009 | 10:18 pm ఈనెల 11న ఏఆర్.రెహ్మాన్ "జయహో" సంగీత విభావరిఅంతర్జాతీయ చలనచిత్ర యవనికపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన సంగీత మేధావి ఏఆర్.రెహ్మాన్ మార్గనిర్ధేశకత్వంలో "జయహో" సంగీత విభావరి కార్యక్రమం జరుగనుంది. తమిళనాడు రాష్ట్ర రాజధానికి సమీపంలోని కాంచీపురం సమీపంలో ఈ మ్యూజికల్ నైట్ నిర్వహించనున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 1 Oct 2009 | 2:02 pm "మగధీర"లాంటి గుర్తుండిపోయే సినిమాలు చేయాలి: రవీందర్కళా దర్శకుడికి ఊహాశక్తి చాలా అవసరం. నిబద్ధత, అభిరుచి దానికి తోడైతే అద్భుతమైన దృశ్యాన్ని ప్రేక్షకులు వీక్షించవచ్చునని రవీందర్ అంటున్నారు. రామ్‌చరణ్ హీరోగా నటించిన "మగధీర" చిత్రానికి కళాదర్శకత్వ పగ్గాలు చేపట్టిన రవీందర్ ఇంటర్వ్యూ మీకోసం.. ప్రశ్న: ఉత్తమ కళాదర్శకుడిగా ఎదగాలంటే ఏం కావాలి? జ: చాలామంచి ఊహాశక్తి కావాలి. దీనికి అభిరుచి తోడైతే ఇక చెప్పనవసరం లేదు. ప్రశ్న: మీ నేపథ్యం? జ: నెల్లూరు జిల్లా. ఢిల్లీలో ఐఐటిలో ఎం.డి.ఇ.ఎస్. పూర్తిచేశాను. ముందుగా గుణ్ణం గంగరాజు నిర్మించిన "అమృతం" సీరియల్‌కు పనిచేశాను. తర్వాత "ఐతే" సినిమాకు చేశాను. రాఖీ, అష్టాచమ్మా, ఒక్కడున్నాడు, విక్రమార్కుడు, ఛత్రపతి చిత్రాలకు పనిచేశాను. ఇవన్నీ ఒక ఎత్తయితే మగధీర మరో ఎత్తు. ప్రశ్న: మీకు ఆదర్శకులు ఎవరు? జ: తోట తరణి. ఒక విధంగా ఆయనకు నేను ఏకలవ్యశిష్యుడ్ని. ప్రశ్న: మీ తదుపరి చిత్రాలు? జ: ఆర్య-2 చేస్తున్నారు. తర్వాత చంద్రశేఖర ఏలేటి చిత్రం. దాని తర్వాత రాజమౌళి దర్శకత్వం వహించే "మర్యాద రామన్న". ప్రశ్న: మీ లక్ష్యం? జ: ఎన్ని చేశామనేదికాదు. మగధీరలాంటి గుర్తిండిపోయే చిత్రాలు ఎన్ని చేశామనేదే నాకు ముఖ్యం.Source: Yahoo! Telugu: Entertainment | 1 Oct 2009 | 10:46 am సాయిరామ్ శంకర్‌కు పూరీ ఇచ్చే "బంపర్ ఆఫర్" ఇదే.!డాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరామ్ శంకర్ హీరోగా పూరి శిష్యుడు జయరవీంద్ర దర్శకత్వంలో వైష్ణో అకాడమీ పతాకంపై నిర్మిస్తున్న "బంపర్ ఆఫర్" సినిమా నిర్మాణం పూర్తయ్యింది. ఈ చిత్రం ద్వారా పూరి మిత్రుడు, గాయకుడు రఘు కుంచెని సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శంకర్ గణేష్ మాట్లాడుతూ.. మా బంపర్ ఆఫర్ ఆడియో సూపర్‌హిట్ అయ్యిందన్నారు. అన్ని ఏరియాలనుండి రిపీట్ ఆర్డర్స్ రావడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. అక్టోబర్9న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని 'బంపర్ ఆఫర్' అలరించి బంపర్ హిట్ అవుతుందని ఆశించారు.Source: Yahoo! Telugu: Entertainment | 1 Oct 2009 | 9:56 am రాజకీయ ఘటికుల సమక్షంలో "ఘటికుడు" ఆడియోసూర్య, నయనతార జంటగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో, తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి కరుణానిధి వారసుడు స్టాలిన్ నిర్మిస్తున్న తమిళ చిత్రం "ఆదవన్" చిత్రం తెలుగులో "ఘటికుడు"గా వస్తోంది. ఈ చిత్రం తెలుగు హక్కులను ఇప్పటికే నిర్మాత, వ్యాపారవేత్త, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే చందన రమేష్ పొందారు. సిఎన్ఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకు హారిస్ జైరాజ్ సంగీతం అందించారు. ఈ ఆడియోను విజయదశమినాడు రాజమండ్రిలో జరిపారు. ఆడియో సీడీని అమలాపురం ఎంపీ హర్షకుమార్ ఆవిష్కరించి రాజమండ్రి శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాశరావుకి అందజేశారు.Source: Yahoo! Telugu: Entertainment | 1 Oct 2009 | 9:38 am బెంగాల్‌లో కాంగ్రెస్ అభ్యర్థికి సీపీఎం మద్దతుపశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజకీయాలు మలుపులు తిరుగుతున్నాయి. గత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్‌లు చేతులు కలిపి విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో సిలిగురి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవికి గురువారం జరిగిన ఎన్నికల్లో అధికార సీపీఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇచ్చింది.Source: జాతీయ | 1 Oct 2009 | 8:27 am నిజాయితీకి నిదర్శనం లోక్‌సత్తా: జయప్రకాష్ప్రస్తుతం దేశవ్యాప్తంగానున్న రాజకీయాలలో కేవలం రాష్ట్రంలోనున్న రాజకీయ పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, రాష్ట్రంలో తమదే నిజాయితీ కలిగిన రాజకీయ పార్టీ అని, దీనికి నిదర్శనమే తమ పార్టీ అని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ అన్నారు.Source: ఏపీ న్యూస్ | 1 Oct 2009 | 8:00 am ఫోజులిచ్చేముందు కాస్త ఆలోచించండి: రాష్ట్రపతిమసక వెలుతురుల్లో ప్రకటనలకు ఫోజులిచ్చేటపుడు సదరు మహిళలు కాస్త ఆలోచించి ఫోజులివ్వాలని రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ పిలుపునిచ్చారు. కొన్ని ప్రత్యేకమైన ప్రకటనలకు ఫోజులిచ్చేటపుడు మహిళలకు తమకు తాము ఆలోచించుకుని ముందుకు సాగాలన్నారు.Source: జాతీయ | 1 Oct 2009 | 7:43 am నాగచైతన్య సరసన త్రిష కుదురుతుందా...?"జోష్" చిత్రం బాక్సాఫీస్ వద్ద బోర్లా పడటంతో అక్కినేని నాగార్జున తన పుత్రరత్నానికి ఎలాగైనా పెద్ద బ్రేక్ తీసుకురావాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో గౌతమ్ మీనన్ తమిళంలో తీస్తున్న "విన్నైథాండి వరువాయా" చిత్రం హక్కులు తీసుకున్నట్లు సమాచారం. తమిళ చిత్రంలో కథానాయికగా నటిస్తున్న త్రిషనే తెలుగులో నాగచైతన్య సరసన నటింపజేయాలని గౌతమ్ సంకల్పించాడట. తెలుగుకైతే తన మార్కెట్ రేటు వేరుగా ఉందని త్రిష చెప్పడంతో అవాక్కయ్యాడట. తమిళ నిర్మాతలు త్రిష పారితోషికాన్ని 60 లక్షలుగా నిర్ణయించి, అంతకు ఒక్కపైసా కూడా ఎక్కువ ఇవ్వటం లేదు. కానీ టాలీవుడ్ నిర్మాతలు మాత్రం కోటి రూపాయలు, అంతకు మించి కూడా ఇవ్వటానికి ఆసక్తి చూపుతున్నారట. కనుక నాగచైతన్య సరసన నటించాలంటే "కో..." అని అనాల్సిందే పట్టుపడుతోందట త్రిష. మరీ అంత మంకుపట్టుబడితే గౌతమ్ మాత్రం ఏం చేస్తాడు. 60 "ల"కారాలకు ఓకే చెప్తే సరి... లేదంటే హాటెస్ట్ నటీమణి సమంతను తీసుకుంటానని ముఖం మీద చెప్పేశాడట. అయినా నాగచైతన్య సరసన త్రిష సూటవుతుందా...? ఏమంటారూ...?Source: Yahoo! Telugu: Entertainment | 1 Oct 2009 | 7:14 am "అన్నమయ్య సకలదేవతార్చన" పాటల ఆల్బమ్ విడుదలసుప్రసిద్ధ తెలుగు సినిమా పాటల రచయిత కొసరాజు రాఘవయ్య మునిమనుమరాలు కొసరాజు నయనతార ఆలపించిన "అన్నమయ్య సకలదేవతార్చన" పాటల ఆల్బమ్ లాంఛనంగా విడుదలైంది. దర్శకుడు కె. రాఘవేంద్రరావు ఆల్బమ్‌ను విడుదలచేసి రామానాయుడుకు అందజేశారు.Source: Yahoo! Telugu: Entertainment | 1 Oct 2009 | 6:53 am ఎండిపోయిన చెట్టుకు జీవం పోశారు: పద్మనాభం"నేను 1931లో పుట్టాను. కానీ ఈ రోజు నాకు జరుగుతున్న సన్మానం చూస్తుంటే ఈ రోజే పుట్టినట్లుంది. నా కోసం మూడు లక్షలు బహుమానంగా ఇచ్చారు. ఎండిపోయిన చెట్టుకుజీవం పోసినట్లుంది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని" అలనాటి హాస్యనటుడు పద్మనాభం అన్నారు. బుధవారం హైదరాబాద్‌లో హాస్యనటీనటులు పద్మనాభాన్ని సన్మానించారు. నేటినాటితరాన్ని సన్మానించే కార్యక్రమంలో భాగంగా ఇది జరిగింది.Source: Yahoo! Telugu: Entertainment | 1 Oct 2009 | 6:37 am పనిమనిషిపై అత్యాచారం కేసు: అహుజాకు బెయిల్గత నాలుగు నెలలుగా జైల్లో ఊచలు లెక్కబెట్టుకుంటూ కాలం గడిపిన బాలీవుడ్ నటుడు షీనై అహుజాకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తన ఇంట్లో పనిచేసే 19 ఏళ్ల యువతిపై అహుజా అత్యాచారానికి పాల్పడి జైలుపాలైన సంగతి తెలిసిందే.Source: జాతీయ | 1 Oct 2009 | 6:05 am అక్టోబర్ 9న తెరపైకి వస్తోన్న "మహాత్మ"శ్రీకాంత్, భావన హీరోహీరోయిన్లుగా నటించిన "మహాత్మ" చిత్రాన్ని అక్టోబర్ 9న విడుదల చేయనున్నారు. ఈ సినిమా లోగో ఆవిష్కరణలో చిత్ర దర్శకుడు కృష్ణవంశీ మాట్లాడుతూ.. అక్టోబర్ 2న "మహాత్మ"ను విడుదల చేయాలనుకుంటున్నామని, కానీ ఇంకా ఖరారు కాలేదన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 1 Oct 2009 | 5:44 am పల్లవరాజుల అద్భుత కళాత్మక సృష్టి "మహాబలిపురం"డిసెంబర్ నెల వచ్చిందంటే చాలు... ఈ ప్రాంతం కొత్త అందాలను పులుముకుంటుంది. ఇక్కడికి రోడ్డు మార్గం గుండా ప్రయాణించే పర్యాటకులకు దారి పొడవునా అనేక దృశ్యాలు కన్నులపండుగ చేస్తాయి. సంధ్యవేళల్లో జాలువారే సున్నితపు సూర్యకిరణాలు సృష్టించే అద్భుతాలను నీలాల అఖాతపు సోయగాలతో కలిపి చూసే అదృష్టం వీరికే లభిస్తుంది. ఇంతటి ఆనందాన్ని, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేదే "మహాబలిపురం" సముద్ర తీర ప్రాంతం.Source: వినోదం | 1 Oct 2009 | 5:34 am "మగధీర"లాంటి గుర్తుండిపోయే సినిమాలు చేయాలి: రవీందర్కళా దర్శకుడికి ఊహాశక్తి చాలా అవసరం. నిబద్ధత, అభిరుచి దానికి తోడైతే అద్భుతమైన దృశ్యాన్ని ప్రేక్షకులు వీక్షించవచ్చునని రవీందర్ అంటున్నారు. రామ్‌చరణ్ హీరోగా నటించిన "మగధీర" చిత్రానికి కళాదర్శకత్వ పగ్గాలు చేపట్టిన రవీందర్ ఇంటర్వ్యూ మీకోసం.. ప్రశ్న: ఉత్తమ కళాదర్శకుడిగా ఎదగాలంటే ఏం కావాలి? జ: చాలామంచి ఊహాశక్తి కావాలి.Source: వినోదం | 1 Oct 2009 | 5:18 am కళ్యాణ్ రామ్, హన్సికల "జయీభవ" షూటింగ్ పూర్తిఅతనొక్కడే, హరేరామ్ వంటి హిట్ చిత్రాల తర్వాత ఎన్టీఆర్ ఆర్ట్స్ పతకంపై ఎనర్జిటిక్ స్టార్ నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న భారీ చిత్రం "జయీభవ" షూటింగ్ పూర్తయింది. అక్టోబర్ 1న నందమూరి హీరోలు ముఖ్యఅతిథులుగా "జయీభవ" చిత్రం ఆడియోను రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణ్‌రామ్ హ్యాట్రిక్ ఫిలింగా రానున్న "జయీభవ"లో హన్సిక కథానాయిక పాత్రను పోషిస్తోంది. ఈ చిత్రం ద్వారానే నరేన్ కొండేపాటి దర్శకుడుదా పరిచయం అవుతున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 1 Oct 2009 | 5:15 am మరణాలపై స్పష్టత లేదు: ఎంపీ హర్ష కుమార్ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి దుర్మరణ వార్త తెలిసి అశువులు బాసిన మృతుల్లో ఖచ్చితమైన స్పష్టత లేదని అమలాపురం ఎంపీ హర్షకుమార్ అభిప్రాయపడ్డారు. ఇదే విషయంపై అధికారులను ఆరా తీయగా, వారు వివరణ ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారని ఆయన తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 1 Oct 2009 | 4:42 am రాష్ట్రంలో భారీ వర్షాలు: 15 మంది మృత్యువాతరాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటి వరకు 15 మంది మృత్యువాత పడినట్టు రాష్ట్ర రెవెన్యూ శాఖామంత్రి ధర్మాన ప్రసాదరావు వెల్లడించారు. వందలాది చెరువులకు గండ్లు పడ్డాయని మంత్రి వెల్లడించారు.Source: ఏపీ న్యూస్ | 1 Oct 2009 | 4:01 am చైనాతో సత్‌సంబంధాల కోసం కట్టుబడిన భారత్: ప్రధానిచైనాతో సత్‌సంబంధాల కోసం భారత్ కట్టుబడి ఉందని ప్రధాని మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు. ఇందుకోసం అవసరమైన అన్ని రకాల చర్యలను తాము చేపడుతామని ఆయన తెలిపారు. చైనా జాతీయ దినోత్సవాల సందర్భంగా చైనా ప్రధాని వెన్ జిబావోకు పంపిన ప్రత్యేక సందేశంలో ఈ మేరకు పేర్కొన్నారు.Source: జాతీయ | 1 Oct 2009 | 3:49 am
|