కొత్త తరహా టైర్లను విడుదల చేసిన బ్రిడ్జ్‌స్టోన్

టైర్లు, రబ్బరు ట్యూబుల తయారీలో ప్రపంచంలోనే అగ్రగామిగానున్న ప్రపంచప్రసిద్ధిగాంచిన బ్రిడ్జ్‌స్టోన్ సంస్థ కొత్త తరానికి హెచ్‌పీ స్పోర్ట్ టైర్ అండ్ అడ్రెనలిన్ పొటెన్జా ఆర్ఈ001 పేరుతో కొత్త తరహా టైర్లను రూపొందించి మార్కెట్లోకి విడుదల చేసింది.
Source: Yahoo! Telugu: News | 1 Oct 2009 | 9:58 am

బీఎస్ఎన్ఎల్‌తో టాటా టెలీ భాగస్వామ్య ఒప్పందం

ప్రముఖ దేశీయ టెలికాం రంగ దిగ్గజం బీఎస్ఎన్ఎల్‌తో టాటా టెలీ సర్వీసెస్ సంస్థ మౌళికసదుపాయాల భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కింద బీఎస్ఎన్ఎల్ దేశవ్యాప్తంగా ఉన్న మౌళికసదుపాయాలను టాటా టెలీ సర్వీసెస్‌కు అందించాల్సి ఉంటుంది. ఈ భాగస్వామ్య ఒప్పందంతో ప్రైవేటు సంస్థ అయిన టాటా టెలీ సర్వీసెస్ జీఎస్ఎం నెట్‌వర్క్...
Source: Yahoo! Telugu: News | 1 Oct 2009 | 9:57 am

సాయిరామ్ శంకర్‌కు పూరీ ఇచ్చే "బంపర్ ఆఫర్" ఇదే.!

డాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరామ్ శంకర్ హీరోగా పూరి శిష్యుడు జయరవీంద్ర దర్శకత్వంలో వైష్ణో అకాడమీ పతాకంపై నిర్మిస్తున్న "బంపర్ ఆఫర్" సినిమా నిర్మాణం పూర్తయ్యింది. ఈ చిత్రం ద్వారా పూరి మిత్రుడు, గాయకుడు రఘు కుంచెని సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శంకర్ గణేష్ మాట్లాడుతూ.. మా బంపర్ ఆఫర్ ఆడియో సూపర్‌హిట్ అయ్యిందన్నారు. అన్ని ఏరియాలనుండి రిపీట్ ఆర్డర్స్ రావడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. అక్టోబర్9న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని 'బంపర్ ఆఫర్' అలరించి బంపర్ హిట్ అవుతుందని ఆశించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 1 Oct 2009 | 9:56 am

రాజకీయ ఘటికుల సమక్షంలో "ఘటికుడు" ఆడియో

సూర్య, నయనతార జంటగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో, తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి కరుణానిధి వారసుడు స్టాలిన్ నిర్మిస్తున్న తమిళ చిత్రం "ఆదవన్" చిత్రం తెలుగులో "ఘటికుడు"గా వస్తోంది. ఈ చిత్రం తెలుగు హక్కులను ఇప్పటికే నిర్మాత, వ్యాపారవేత్త, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే చందన రమేష్ పొందారు. సిఎన్ఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకు హారిస్ జైరాజ్ సంగీతం అందించారు. ఈ ఆడియోను విజయదశమినాడు రాజమండ్రిలో జరిపారు. ఆడియో సీడీని అమలాపురం ఎంపీ హర్షకుమార్ ఆవిష్కరించి రాజమండ్రి శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాశరావుకి అందజేశారు.
Source: Yahoo! Telugu: Entertainment | 1 Oct 2009 | 9:38 am

రాష్ట్రంలో భారీ వర్షాలు: 15 మంది మృత్యువాత

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటి వరకు 15 మంది మృత్యువాత పడినట్టు రాష్ట్ర రెవెన్యూ శాఖామంత్రి ధర్మాన ప్రసాదరావు వెల్లడించారు. వందలాది చెరువులకు గండ్లు పడ్డాయని మంత్రి వెల్లడించారు.
Source: Yahoo! Telugu: News | 1 Oct 2009 | 9:30 am

స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్న సెన్సెక్స్

స్టాక్ మార్కెట్ ప్రస్తుతం స్వల్ప నష్టాల్లో కొనసాగుతుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 3 పాయింట్లు కోల్పోయి 17,124 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 5 పాయింట్లు నష్టపోయి 5,079 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.02 శాతం, నిఫ్టీ 0.10 శాతం మేరకు క్షీణించాయి.
Source: Yahoo! Telugu: News | 1 Oct 2009 | 9:30 am

చైనాతో సత్‌సంబంధాల కోసం కట్టుబడిన భారత్: ప్రధాని

చైనాతో సత్‌సంబంధాల కోసం భారత్ కట్టుబడి ఉందని ప్రధాని మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు. ఇందుకోసం అవసరమైన అన్ని రకాల చర్యలను తాము చేపడుతామని ఆయన తెలిపారు. చైనా జాతీయ దినోత్సవాల సందర్భంగా చైనా ప్రధాని వెన్ జిబావోకు పంపిన ప్రత్యేక సందేశంలో ఈ మేరకు పేర్కొన్నారు.
Source: Yahoo! Telugu: News | 1 Oct 2009 | 9:18 am

సౌకర్యవంతమైన వాహనం : గ్సైలో

మోటారు వాహనాల నిర్మాణ రంగంలో అగ్రగామిగానున్న మహీంద్రా అండ్ మహీందా సంస్థ ఇటీవలే గ్సైలో వాహనాన్ని మార్కెట్లోకి విడుదల చేసింది. ఇందులో ప్రయాణించడం సౌకర్యవంతంగా ఉంటుందని కంపెనీ ప్రకటించింది.
Source: Yahoo! Telugu: News | 1 Oct 2009 | 8:53 am

అనూహ్యంగా నష్టాల్లోకి స్టాక్ మార్కెట్

స్టాక్ మార్కెట్ అనూహ్యంగా నష్టాల్లోకి జారుకోవడంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 62 పాయింట్లు కోల్పోయి 17,065 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 26 పాయింట్లు నష్టపోయి 5,058 వద్ద పయనిస్తోంది. సన్సెక్స్ 0.36 శాతం, నిఫ్టీ 0.50 శాతం మేరకు క్షీణించాయి.
Source: Yahoo! Telugu: News | 1 Oct 2009 | 8:44 am

శరణార్థులకు అనుమతి మంజూరు: ఒబామా

ప్రపంచవ్యాప్తంగా అమెరికా వచ్చిన దాదాపు 80 వేల మంది శరణార్థులకు ప్రవేశానుమతి కల్పిస్తూ అమెరికా అధ్యక్షుడు బరాక్ హుస్సేన్ ఒబామా సమ్మతించినట్లు వైట్‌హౌస్ ప్రకటించింది.
Source: Yahoo! Telugu: News | 1 Oct 2009 | 8:04 am

స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్

స్టాకా మార్కెట్ ప్రస్తుతం స్వల్ప లాభాల్లో పయనిస్తుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 21 పాయింట్లు పెరిగి 17,148 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 4 పాయింట్లు స్వల్పంగా బలపడి 5,088 వద్ద పయనిస్తోంది. అన్ని సెక్టోరల్ ఇండెక్స్‌లు స్థిరంగా పయనిస్తున్నాయి.
Source: Yahoo! Telugu: News | 1 Oct 2009 | 7:56 am

సింగపూర్ సంస్థతో టీసీఎస్ ఔట్‌సోర్సింగ్ డీల్

సాఫ్ట్‌వేర్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్).. బుధవారం.. సింగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న పీపుల్స్ అసోసియేషన్ ఫర్ అప్లికేషన్ మేనేజ్మెంట్ సర్వీసు (ఏఎంఎస్)తో రెండు సంవత్సరాల మల్టీ మిలియన్ డాలర్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. సింగపూర్ కమ్యూనిటీ డెవలెప్మెంట్, యూత్ మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థే ఈ పీపుల్స్ అసోసియేషన్.
Source: Yahoo! Telugu: News | 1 Oct 2009 | 7:49 am

నాగచైతన్య సరసన త్రిష కుదురుతుందా...?

"జోష్" చిత్రం బాక్సాఫీస్ వద్ద బోర్లా పడటంతో అక్కినేని నాగార్జున తన పుత్రరత్నానికి ఎలాగైనా పెద్ద బ్రేక్ తీసుకురావాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో గౌతమ్ మీనన్ తమిళంలో తీస్తున్న "విన్నైథాండి వరువాయా" చిత్రం హక్కులు తీసుకున్నట్లు సమాచారం. తమిళ చిత్రంలో కథానాయికగా నటిస్తున్న త్రిషనే తెలుగులో నాగచైతన్య సరసన నటింపజేయాలని గౌతమ్ సంకల్పించాడట. తెలుగుకైతే తన మార్కెట్ రేటు వేరుగా ఉందని త్రిష చెప్పడంతో అవాక్కయ్యాడట. తమిళ నిర్మాతలు త్రిష పారితోషికాన్ని 60 లక్షలుగా నిర్ణయించి, అంతకు ఒక్కపైసా కూడా ఎక్కువ ఇవ్వటం లేదు. కానీ టాలీవుడ్ నిర్మాతలు మాత్రం కోటి రూపాయలు, అంతకు మించి కూడా ఇవ్వటానికి ఆసక్తి చూపుతున్నారట. కనుక నాగచైతన్య సరసన నటించాలంటే "కో..." అని అనాల్సిందే పట్టుపడుతోందట త్రిష. మరీ అంత మంకుపట్టుబడితే గౌతమ్ మాత్రం ఏం చేస్తాడు. 60 "ల"కారాలకు ఓకే చెప్తే సరి... లేదంటే హాటెస్ట్ నటీమణి సమంతను తీసుకుంటానని ముఖం మీద చెప్పేశాడట. అయినా నాగచైతన్య సరసన త్రిష సూటవుతుందా...? ఏమంటారూ...?
Source: Yahoo! Telugu: Entertainment | 1 Oct 2009 | 7:14 am

"అన్నమయ్య సకలదేవతార్చన" పాటల ఆల్బమ్ విడుదల

సుప్రసిద్ధ తెలుగు సినిమా పాటల రచయిత కొసరాజు రాఘవయ్య మునిమనుమరాలు కొసరాజు నయనతార ఆలపించిన "అన్నమయ్య సకలదేవతార్చన" పాటల ఆల్బమ్ లాంఛనంగా విడుదలైంది. దర్శకుడు కె. రాఘవేంద్రరావు ఆల్బమ్‌ను విడుదలచేసి రామానాయుడుకు అందజేశారు.
Source: Yahoo! Telugu: Entertainment | 1 Oct 2009 | 6:53 am

ఎండిపోయిన చెట్టుకు జీవం పోశారు: పద్మనాభం

"నేను 1931లో పుట్టాను. కానీ ఈ రోజు నాకు జరుగుతున్న సన్మానం చూస్తుంటే ఈ రోజే పుట్టినట్లుంది. నా కోసం మూడు లక్షలు బహుమానంగా ఇచ్చారు. ఎండిపోయిన చెట్టుకుజీవం పోసినట్లుంది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని" అలనాటి హాస్యనటుడు పద్మనాభం అన్నారు. బుధవారం హైదరాబాద్‌లో హాస్యనటీనటులు పద్మనాభాన్ని సన్మానించారు. నేటినాటితరాన్ని సన్మానించే కార్యక్రమంలో భాగంగా ఇది జరిగింది.
Source: Yahoo! Telugu: Entertainment | 1 Oct 2009 | 6:37 am

అక్టోబర్ 9న తెరపైకి వస్తోన్న "మహాత్మ"

శ్రీకాంత్, భావన హీరోహీరోయిన్లుగా నటించిన "మహాత్మ" చిత్రాన్ని అక్టోబర్ 9న విడుదల చేయనున్నారు. ఈ సినిమా లోగో ఆవిష్కరణలో చిత్ర దర్శకుడు కృష్ణవంశీ మాట్లాడుతూ.. అక్టోబర్ 2న "మహాత్మ"ను విడుదల చేయాలనుకుంటున్నామని, కానీ ఇంకా ఖరారు కాలేదన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 1 Oct 2009 | 5:44 am

కళ్యాణ్ రామ్, హన్సికల "జయీభవ" షూటింగ్ పూర్తి

అతనొక్కడే, హరేరామ్ వంటి హిట్ చిత్రాల తర్వాత ఎన్టీఆర్ ఆర్ట్స్ పతకంపై ఎనర్జిటిక్ స్టార్ నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న భారీ చిత్రం "జయీభవ" షూటింగ్ పూర్తయింది. అక్టోబర్ 1న నందమూరి హీరోలు ముఖ్యఅతిథులుగా "జయీభవ" చిత్రం ఆడియోను రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణ్‌రామ్ హ్యాట్రిక్ ఫిలింగా రానున్న "జయీభవ"లో హన్సిక కథానాయిక పాత్రను పోషిస్తోంది. ఈ చిత్రం ద్వారానే నరేన్ కొండేపాటి దర్శకుడుదా పరిచయం అవుతున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 1 Oct 2009 | 5:15 am

రాష్ట్రంలో భారీ వర్షాలు: 15 మంది మృత్యువాత

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటి వరకు 15 మంది మృత్యువాత పడినట్టు రాష్ట్ర రెవెన్యూ శాఖామంత్రి ధర్మాన ప్రసాదరావు వెల్లడించారు. వందలాది చెరువులకు గండ్లు పడ్డాయని మంత్రి వెల్లడించారు.
Source: ఏపీ న్యూస్ | 1 Oct 2009 | 4:01 am

చైనాతో సత్‌సంబంధాల కోసం కట్టుబడిన భారత్: ప్రధాని

చైనాతో సత్‌సంబంధాల కోసం భారత్ కట్టుబడి ఉందని ప్రధాని మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు. ఇందుకోసం అవసరమైన అన్ని రకాల చర్యలను తాము చేపడుతామని ఆయన తెలిపారు. చైనా జాతీయ దినోత్సవాల సందర్భంగా చైనా ప్రధాని వెన్ జిబావోకు పంపిన ప్రత్యేక సందేశంలో ఈ మేరకు పేర్కొన్నారు.
Source: జాతీయ | 1 Oct 2009 | 3:49 am

అక్టోబరు 13 తర్వాత "సీఎం పోస్టు" గందరగోళానికి తెర

కాంగ్రెస్ అధిష్ఠానం ఈ అసమ్మతికి ఫుల్‌స్టాప్ పెట్టేందుకు సన్నద్ధమవుతోంది. మూడు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన అనంతరం.. అంటే అక్టోబరు 13 తర్వాత రాష్ట్ర కాంగ్రెస్‌లో తలెత్తిన గందరగోళానికి తాళం వేయడానికి సిద్ధమవుతోంది.
Source: జాతీయ | 1 Oct 2009 | 1:03 am

సినీ కార్మికులకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది: రోశయ్య

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడాలోని చిత్రపురి కాలనీపేరుతో సినీ కార్మికులకు కేటాయించిన ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య బుధవారం మధ్యాహ్నం శంకుస్థాపన చేశారు. సినీ కార్మికులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, అవసరమైన సాయం చేస్తుందని రోశయ్య హామీ ఇచ్చారు.
Source: ఏపీ న్యూస్ | 1 Oct 2009 | 12:47 am

అధిష్టానం నిర్ణయానికి కట్టుబడాల్సిందే: కిషోర్ చంద్రదేవ్

దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి వారసుని ఎంపికలో అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాల్సిందేనని అరకు ఎంపీ కిషోర్ చంద్రదేవ్ అభిప్రాయపడ్డారు. దీనిపై ఆయన మీడియాతో మాట్లాడుతూ అధిష్టాన నిర్ణయాన్ని ధిక్కరించిన వారిపై అనర్హత వేటు తప్పదని హెచ్చరించారు.
Source: ఏపీ న్యూస్ | 1 Oct 2009 | 12:31 am

ఖమ్మం ఘటనపై త్రిసభ్య కమిటీ: ధర్మపురి

ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన దాడి ఘటనపై విచారణ చేపట్టేందుకు ముగ్గురు సభ్యులతో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసినట్టు ధర్మపురి శ్రీనివాస్ వెల్లడించారు. ఈ విషయంపై ఆయన ఒక పత్రికా ప్రకటనను విడుదల చేశారు.
Source: ఏపీ న్యూస్ | 1 Oct 2009 | 12:01 am

నేడు వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి రోశయ్య సమీక్ష

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఏర్పడిన వరద పలు ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి. అనేక జిల్లాలు వరద ముంపునకు గురయ్యాయి. దీంతో లోతట్టు ప్రాంతాలకు చెందిన ప్రజలు ఆవాసాలను కోల్పోయారు.
Source: ఏపీ న్యూస్ | 30 Sep 2009 | 11:34 pm

కేరళలో పడవ ప్రమాదం: 35కు చేరిన మృతులు

కేరళ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. ఆ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి శాఖకు చెందిన పడవ ఒకటి నీటిలో మునిగి పోయింది. ఈ ప్రమాదంలో మృత్యువాత పడిన వారి సంఖ్య గురువారానికి 35కు చేరుకుంది. మరికొందరు గాయపడగా, వీరి పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉంది.
Source: జాతీయ | 30 Sep 2009 | 11:09 pm

విద్యార్థుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేని రాహుల్!

భావి ప్రధానిగా అభివర్ణిస్తున్న కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ విద్యార్థులు అడిగిన ప్రశ్నల్లో ఏ ఒక్కదానికి సమాధానం ఇవ్వలేక పోయారు. దీంతో విద్యార్థులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. అంతేకాకుండా.. ఇలాంటి వ్యక్తిని భావి ప్రధానిగా అభివర్ణించడమా అంటూ పెదవి విరిచారు.
Source: జాతీయ | 30 Sep 2009 | 10:22 pm

మహారాష్ట్ర జిన్నా.. ఈ రాజ్‌థాక్రే: శివసేన చీఫ్

మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్‌థాక్రేపై శివసేన చీఫ్ బాల్‌థాక్రే మండిపడ్డారు. మరాఠీయులను విభజించే దుష్ట శక్తి అని.. అందుకే ఆయన మరో మహ్మద్ ఆలీ జిన్నాగా పేర్కొన వచ్చన్నారు. పార్టీ పత్రిక సామ్నాలో రాసిన సంపాదకీయం ఈ అంశంలో పేర్కొన్నారు.
Source: జాతీయ | 30 Sep 2009 | 9:35 pm

ఆ వ్యాఖ్యలు వారి మెహర్భానీ కోసమే: మంత్రి ఆనం

రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలపై కొంత మంది పార్టీ సీనియర్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖామంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తప్పుబట్టారు. ఆయన బుధవారం చెన్నయ్‌లో మీడియాతో మాట్లాడుతూ.. అధిష్టానం ఆదేశాలను ధిక్కరిస్తూ కొంతమంది సీనియర్ నేతలు తమ బలాన్ని చాటుకునేందుకు వివాదాస్పద ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు.
Source: ఏపీ న్యూస్ | 30 Sep 2009 | 9:08 am

జగన్‌కు న్యాయం జరగకపోతే రాజీనామా చేస్తా..!: సబిత

దివంగత మహానేత, ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి కుమారుడు కడప లోక్‌సభ సభ్యుడు జగన్మోహనరెడ్డికి న్యాయం జరగని పక్షంలో తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని రాష్ట్ర హోం మంత్రి సబిత ఇంద్రారెడ్డి అన్నారు.
Source: ఏపీ న్యూస్ | 30 Sep 2009 | 7:55 am

మూడోసారి పెళ్లికూతురు కాబోతోన్న మడోన్నా..!?

ప్రముఖ పాప్ గాయని మడోన్నా మూడోసారి ముచ్చటగా పెళ్లికూతురు కాబోతోంది. తనకంటే 29 సంవత్సరాల జీసెస్ లజ్‌తో మడోన్నా ప్రేమాయణం కొనసాగిస్తోందని, అందుకే తన మాజీ భర్త గైరిచీకి విడాకులిచ్చిందని హాలీవుడ్ వర్గాల్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి.ఈ నేపథ్యంలో.. జీసెస్ లజ్‌ను వివాహమాడి తొమ్మిది నెలలుగా నెలకొన్న విమర్శలన్నింటికి మడోన్నా తెరదించనుందని డైలీ మెయిల్ తెలిపింది.
Source: Yahoo! Telugu: Entertainment | 30 Sep 2009 | 7:42 am

ప్రభుదేవా భార్య ఏమంటే నాకేంటీ...?

నయనతార- ప్రభుదేవా ఇద్దరి మధ్య లవ్వాట సాగుతోందని అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ ఒకటే గుసగసలుపోతున్నాయి. ఈ మాట ప్రభుదేవా భార్య రామలత చెవిన పడటంతో కోపంతో ఊగిపోయిందట. "నా మొగుడిని వలలో వేసుకోవడానికి నీకెంత ధైర్యం... ఇంకోసారి నా మొగుడితో కనబడ్డావో నా చేతుల్లో నీకు దెబ్బలు తప్పవు. జాగ్రత్త!!" అని నయనను హెచ్చరించిదట. రామలత హెచ్చరికను కొందరు పత్రికా విలేకరులు నయనతార దృష్టికి తీసుకుని వెళ్లగా... అసలు ఆ విషయంపై తాను మాట్లాడదలుచుకోలేదని అందట. చెత్తరాతలు రాసే కొన్ని తమిళ, ఇంగ్లీషు పత్రికలను తాను చూడటమే లేదనీ, తాను చెప్పని మాటలను కూడా చెప్పినట్లు కొన్ని పత్రికలు రాసి... విలువల్ని దిగజారుస్తున్నాయని మండిపడిందట. అదిసరే ప్రభుదేవాతో మీకు సన్నిహిత స్నేహం ఉన్నదన్న వార్త నిజమేనా...? అని అంటే.. "సినీ ప్రపంచంలో హీరోహీరోయిన్లు స్నేహంగానే ఉంటారు. అందులో తప్పేమీ లేదు. అయితే ఆ స్నేహాన్ని కొందరు వక్రీకరిస్తూ పొగ వార్తలు రాస్తుంటారు. కనుక అటువంటి వార్తల గురించి నేనసలు పట్టించుకోనని చెప్పిందట నయన. నయనది ఎంతో విశాల హృదయంలా అనిపించడం లేదూ...
Source: Yahoo! Telugu: Entertainment | 30 Sep 2009 | 6:55 am

అనిల్ ఆర్ట్ ప్రొడక్షన్స్‌పై ఉదయ్‌బాబు రెండో చిత్రం

హాస్యనటుడు బాబూమోహన్‌ తనయుడు ఉదయ్‌బాబు హీరోగా అనిల్ ఆర్ట్ ప్రొడక్షన్స్ ఓ కొత్త చిత్రాన్ని దసరానాడు లాంఛనంగా ప్రారంభింది. ఎడ్ల జోగిరెడ్డి, సత్యనారాయణ గౌడ్ నిర్మాణ సారథ్యంలో రూపుదిద్దుకోనున్న ఈ సినిమాకు రావువేముగంటి దర్శకుడు. గతంలో "సమ్మక సారక్క మహాత్మ్యం" అనే చిత్రానికి పనిచేసిన వీరంతా తిరిగి ఉదయ్‌బాబు కొత్త సినిమాకు కూడా పనిచేయడం విశేషం.
Source: Yahoo! Telugu: Entertainment | 30 Sep 2009 | 6:03 am

కసబ్ నేరాంగీకారం వెనుక ఎవరి ఒత్తిడీ లేదు

గత ఏడాది నవంబరు 26న వాణిజ్య రాజధాని ముంబయిపై జరిపిన దాడులలో పాల్గొన్నానని ప్రాణాలతో పట్టుబడ్డ నిందితుడు అజ్మల్ కసబ్ తనకు తానే ఒప్పుకున్నాడని ముంబై నగర మేజిస్ట్రేట్ బుధవారం వెల్లడించారు. నేరాంగీకారంలో అతనిపై ఎవరి ఒత్తిడి లేదనీ, దాడిలో తను పాల్గొన్నది నిజమేనని కసబ్ విచారణలో చెప్పాడని ఆమె వెల్లడించారు.
Source: జాతీయ | 30 Sep 2009 | 6:03 am

రైలుకి నిప్పు పెట్టిన ఆందోళనకారులు

ఉత్తరప్రదేశ్‌లోని హాత్రాస్ జిల్లాలో జల్పాయిగిరి-ఢిల్లీల మధ్య నడుస్తున్న మహానందా ఎక్స్‌ప్రెస్‌ రైలుకు ఈరోజు ఉదయం ఆందోళనకారులు నిప్పు పెట్టారు. హాత్రాస్‌లో ఉన్న మీటర్ గేజ్ రైల్వే స్టేషన్ను ఇటీవల మూసివేయడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది.
Source: జాతీయ | 30 Sep 2009 | 5:56 am

కార్యకర్తలూ.. ఇదిగో నేను వచ్చేస్తున్నా: వైఎస్ జగన్

కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్.జగన్‌మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం వచ్చే నెల రెండో తేదీ నుంచి జరుగనుంది. కడప జిల్లా నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా తన పూర్తి రాజకీయ జీవితాన్ని పూర్తి స్థాయిలో ఆరంభించాలని జగన్‌ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
Source: ఏపీ న్యూస్ | 30 Sep 2009 | 4:36 am

శ్రీనాథుడి పద స్పర్శతో పులకించిన "రాచకొండ"

కొండలపైనుంచి జాలువారే చిన్న చిన్న జలపాతాలు, సెలయేళ్ళు.. కనువిందు చేసే కోనేరులు.. హరిత వర్ణాన్ని కప్పుకున్న కొండలు, పక్షుల కిలకిలా రావాలు, వన్యప్రాణుల వింత అరుపులతో... ప్రాచీన వైభవానికి సజీవ సాక్ష్యంగా నిలిచిన ప్రాంతమే "రాచకొండ గుట్ట". సంప్రదాయ దుస్తులు ధరించి.. పల్లె జీవనం సాగిస్తున్న అమాయక గిరిజన ప్రజలు నివసించే ఈ ప్రాంతాన్ని చేరగానే పర్యాటకులు అలౌకిక ఆనందానికి, అనుభూతికి లోనవకమానరు...
Source: వినోదం | 30 Sep 2009 | 4:06 am

ఓటర్లను దగా చేస్తున్న ప్రధాన పార్టీలు: రాజ్‌థాక్రే

ప్రధాన రాజకీయ పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఓటర్లను దగా చేస్తున్నాయని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్‌థాక్రే ఆరోపించారు.
Source: జాతీయ | 30 Sep 2009 | 3:55 am