కొనుగోళ్లు ఆశాజనకం: లాభాల్లో స్టాక్ మార్కెట్

అర్ధ సంవత్సర లావాదేవీలు చూస్తున్న కారణంగా బ్యాంకులు రేపు కూడా ముసివేసి ఉండబోతుండటం, అక్టోబరు- 2న గాంధీ జయంతి సందర్భంగా సెలవు కావడంతో మార్కెట్ సూచి కాస్త పైస్థాయిలోనే నడుస్తోంది. మధ్యాహ్నం 1.48 గంటల సమయంలో సూచి కొనుగోళ్లు ఆశాజనకంగా ఉండటంతో లాభాల్లో సాగుతోంది. దీంతో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ 191 పాయింట్ల వృద్ధితో 16,886 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 45 పాయింట్ల వృద్ధితో 5వేల మార్కు వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 29 Sep 2009 | 9:24 am

చెన్నైలో 11 విమానాలను రద్దు చేసిన ఎయిర్ ఇండియా

దేశవ్యాప్తంగా ఎయిర్ ఇండియా పైలట్లు చేస్తున్న సమ్మె నాలుగో రోజుకు చేరుకుంది. దీంతో తమిళనాడు రాజధాని చెన్నైలో 11 విమాన సర్వీసులను మంగళవారం రద్దు చేసింది.
Source: Yahoo! Telugu: News | 29 Sep 2009 | 9:06 am

బీహార్‌లో బోటు మునక: 11 మంది మరణం

బీహార్ రాష్ట్రంలోని ఖగారియా జిల్లాలో పడవ మునిగిపోయిన ప్రమాదంలో 11 మంది మృతి చెందారు. మరో 14 మంది ఆచూకీ ఇప్పటికీ తెలియరావాల్సివుంది. ఖగారియా జిల్లాలోని బాగ్‌మతీ నదిలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న బోటు నీటిలో మునిగిపోయిందని పోలీసులు మంగళవారం వెల్లడించారు.
Source: Yahoo! Telugu: News | 29 Sep 2009 | 8:36 am

ఫిలిప్పీన్స్ వరద భీభత్సం: 240 మంది మృతి

ఫిలిప్పీన్స్‌లో వరదలు భీభత్సం సృష్టిస్తున్నాయి. వీటికి సంబంధించిన ప్రమాదాల్లో ఇప్పటివరకు 240 మంది మృత్యువాత పడ్డారని ఆ దేశ అధికారిక యంత్రాంగం వెల్లడించింది. ముందురోజు మృతుల సంఖ్య వంద వద్ద ఉన్నప్పటికీ, సోమవారం సంఖ్య బాగా పెరిగింది. భారీ వరదల కారణంగా ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలోనే 90 మరణాలు సంభవించాయి
Source: Yahoo! Telugu: News | 29 Sep 2009 | 8:15 am

దాడులకు... జగన్‌కు సంబంధం లేదు: రోశయ్య

రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలపై కొందరు దుండుగులు చేస్తున్న దాడులకు వై.ఎస్. జగన్‌కు ఎలాంటి సంబంధం లేదని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి రోశయ్య అన్నారు.
Source: Yahoo! Telugu: News | 29 Sep 2009 | 8:12 am

దేశీయ వాటాల కొనుగోళ్ల వృద్ధి: లాభాల బాటలో సెన్సెక్స్

ఐటీ, డ్యూరబుల్, పార్మా, ఆయిల్ మరియు గ్యాస్ వాటాల కొనుగోళ్లు పుంజుకోవడంతో బాంబే స్టాక్ మార్కెట్ లాభాల దిశగా పయనిస్తోంది. మంగళవారం ట్రేడింగ్ ప్రారంభంలోనే 200 పాయింట్ల మేర వృద్ధి చెందిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో 150 పాయింట్లు పుంజుకుని, 16,840 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 45 పాయింట్లు బలపడి, 5,004 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 29 Sep 2009 | 7:54 am

మళ్లీ "పోకిరి"తో సినిమా తీస్తానంటున్న పూరీ

త్వరలో మహేష్ బాబుతో తాను చిత్రాన్ని నిర్మిస్తున్నాననీ, కానీ అది పోకిరి-2 మాత్రం కాదని పూరీ జగన్నాథ్ అన్నారు. "అసలు పోకిరి చిత్రాన్ని అభిషేక్ బచ్చన్‌తో తీద్దామని కథ చెప్పాను. కానీ అది అతనికి నచ్చలేదు. ఆ తర్వాత మరో కథ చెపుదామంటే కుదరలేదు. ఇటీవలే మళ్లీ అమితాబ్‌కు ఓ కథ చెప్పాను. ఆ కథను వీలు చూసుకుని సెట్‌పైకి తీసుకెళతానని చెప్పార"న్నారు జగన్నాథ్.
Source: Yahoo! Telugu: Entertainment | 29 Sep 2009 | 7:08 am

ఢిల్లీలో బస్సు ప్రమాదం: 20 మందికి గాయాలు

దేశ రాజధానిలో మంగళవారం ఓ పాఠశాల బస్సు తిరగబడటంతో, అందులోని 20 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. దక్షిణ ఢిల్లీలో ఒక ప్రైవేట్ బస్సును ఢీకొనడంతో విద్యార్థులు ప్రయాణిస్తున్న బస్సు తిరగబడిందని పోలీసులు తెలిపారు. మంగళారం ఉదయం 7.45 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
Source: Yahoo! Telugu: News | 29 Sep 2009 | 6:51 am

షాపింగ్‌మాల్‌‌ను ప్రారంభించిన అంపా

దక్షిణ భారతదేశంలోనే వినూత్నమైన తరహాలో అంపా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ షాపింగ్ మాల్‌ను తమిళనాడులోని చెన్నైలో ప్రారంభించింది.
Source: Yahoo! Telugu: News | 29 Sep 2009 | 6:47 am

పుంజుకున్న స్టాక్ మార్కెట్ ట్రేడింగ్: సెన్సెక్స్ వృద్ధి

బాంబే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ మంగవాళం ప్రారంభం నుంచే పుంజుకోవడంతో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ లాభాల బాటలో పయనిస్తున్నాయి. అంతేగాకుండా.. దేశీయ వాటాల కొనుగోళ్లు పుంజుకోవడం, ఆసియా, అమెరికా స్టాక్ మార్కెట్ల సంకేతాలు లాభదాయకంగా ఉండటంతో మంగళవారం 12 గంటల ప్రాంతంలో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ 175 పాయింట్లు లాభపడి, 16, 866 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 47 పాయింట్లు పుంజుకుని 5, 007 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 29 Sep 2009 | 6:46 am

భారత్‌లోనూ వోక్స్‌వ్యాగన్‌కు చెందిన బీటల్ కారు

అంతర్జాతీయ స్థాయిలో వాహన నిర్మాణ రంగంలో అగ్రగామిగానున్న వోక్స్‌వ్యాగన్ సంస్థకు చెందిన బీటల్ మోడల్ కార్లను భారత్‌లోనూ ప్రవేశ పెట్టేందుకు ఆసంస్థ ప్రణాళికలను సిద్ధం చేసింది.
Source: Yahoo! Telugu: News | 29 Sep 2009 | 6:27 am

తెలుగు, హిందీ, ఆంగ్లంలో యానిమేషన్ లవకుశ

ఆర్. ఛానెల్ ఆర్ వీఎంఎల్ బ్యానర్‌పై కాణిపాకం క్రియేషన్స్ సంస్థతో కలిసి నిర్మిస్తోన్న యానిమేషన్ చిత్రం లవకుశ. రాయుడు వి. శశాంక్ నిర్మాత. యానిమేషన్ లవకుశ చిత్రం గురించి శశాంక్ మాట్లాడుతూ, "లవకుశ గాథ గురించి మన ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అయితే 2-డి పరిజ్ఞానంతో ఈ యానిమేషన్ చిత్రాన్ని రూపొందించాం.
Source: Yahoo! Telugu: Entertainment | 29 Sep 2009 | 5:15 am

కొనసాగుతున్న ఎయిర్ ఇండియా సంక్షోభం: 20 విమానాలు రద్దు

ఎయిర్ ఇండియా సమస్య మరింత జటిలమవుతోంది. మంగళవారం మరో 600 మంది పైలెట్లు కొత్తగా సమ్మెకు దిగుతామని బెదిరించడంతో పరిస్థితి అదుపుతప్పుతున్నట్లు కనిపిస్తోంది. సమ్మె మొదలై నాలుగు రోజులు కావస్తున్నా చర్చల్లో పురోగతి ఏమాత్రం కనిపించడంలేదు. సోమవారంనాడు ఎయిరిండియా చైర్మన్ అర్వింద్ జాధవ్‌కు పైలెట్లకు మధ్య జరిగిన చర్చలు విఫలం కావడంతో మంగళవారం మరో 20 విమానాలు రద్దయ్యాయి.
Source: జాతీయ | 29 Sep 2009 | 3:48 am

బీహార్‌లో బోటు మునక: 11 మంది మరణం

బీహార్ రాష్ట్రంలోని ఖగారియా జిల్లాలో పడవ మునిగిపోయిన ప్రమాదంలో 11 మంది మృతి చెందారు. మరో 14 మంది ఆచూకీ ఇప్పటికీ తెలియరావాల్సివుంది. ఖగారియా జిల్లాలోని బాగ్‌మతీ నదిలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న బోటు నీటిలో మునిగిపోయిందని పోలీసులు మంగళవారం వెల్లడించారు.
Source: జాతీయ | 29 Sep 2009 | 3:06 am

దాడులకు... జగన్‌కు సంబంధం లేదు: రోశయ్య

రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలపై కొందరు దుండుగులు చేస్తున్న దాడులకు వై.ఎస్. జగన్‌కు ఎలాంటి సంబంధం లేదని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి రోశయ్య అన్నారు.
Source: ఏపీ న్యూస్ | 29 Sep 2009 | 3:03 am

హస్తినకు పయనమైన కేవీపీ రామచంద్రారావు

రాష్ట్ర కాంగ్రెస్‌లో ఆసక్తి కరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. దివంగత మహానేత వై.ఎస్. రాజశేఖర రెడ్డి మరణానంతరం ఆ పదవిని.. ఆయన కుమారుడు వై.ఎస్. జగన్మోహన రెడ్డికి అప్పగించేందుకు.. వైఎస్సార్ సన్నిహితుడు, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రారావు సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం కేవీపీ హస్తినకు బయలుదేరారు. అయితే పార్లమెంటరీ స్టాండింగ్ కమీటీ సమావేశాల్లో పాల్గొనేందుకే కేవీపీ ఢిల్లీకి పయనమైయ్యారని పార్టీ శ్రేణులు వెల్లడించాయి.
Source: ఏపీ న్యూస్ | 29 Sep 2009 | 3:02 am

ఢిల్లీలో బస్సు ప్రమాదం: 20 మందికి గాయాలు

దేశ రాజధానిలో మంగళవారం ఓ పాఠశాల బస్సు తిరగబడటంతో, అందులోని 20 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. దక్షిణ ఢిల్లీలో ఒక ప్రైవేట్ బస్సును ఢీకొనడంతో విద్యార్థులు ప్రయాణిస్తున్న బస్సు తిరగబడిందని పోలీసులు తెలిపారు. మంగళారం ఉదయం 7.45 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
Source: జాతీయ | 29 Sep 2009 | 1:22 am

నాతో పనిచేయడం నచ్చకపోతే వెళ్లిపోండి: రోశయ్య

అధిష్టానం ఆదేశం మేరకే తాను ముఖ్యమంత్రి బాధ్యతలను నిర్వర్తిస్తున్నానని, ఇష్టమైనవారు తనతో కలిసి పనిచేయవచ్చునని, నచ్చని మంత్రులు తన అసెంబ్లీ నుంచి వెళ్లిపోవచ్చునని రాష్ట్ర ముఖ్యమంత్రి కే. రోశయ్య అన్నారు. ఖమ్మంజిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోని యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ పోస్టర్లను చింపివేసిన మంత్రులపై రోశయ్య మండిపడ్డారు.
Source: ఏపీ న్యూస్ | 29 Sep 2009 | 12:56 am

కాంగ్రెస్‌ కార్యాలయానికి నిప్పు పెట్టిన దుండుగులు

అనంతపురం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో గుర్తు తెలియని దుండగులు కార్యాలయానికి నిప్పంటించారు. దీంతో మంటలు ఉవ్వెత్తున చెలరేగుతున్నాయి. స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో ప్రమాదస్థలానికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపుచేశారు. ఈ ఘటనలో కార్యాలయంలోని ఫర్నిచర్‌ పూర్తిగా దగ్ధమైనట్లు సమాచారం
Source: ఏపీ న్యూస్ | 29 Sep 2009 | 12:52 am

రాజకీయ సన్యాసం తీసుకోవాలని ఉంది: అద్వానీ

భారతీయ జనతాపార్టీ (బీజేపీ) అగ్రనేత లాల్‌ కృష్ణ అద్వానీ రాజకీయ సన్యాసం తీసుకుంటానని సోమవారం ఆయన కోరికను వెలిబుచ్చారు. సోమవారంనాడు ఢిల్లీలోని ఉడిపి మఠాన్ని సందర్శించారు. అక్కడున్న ప్రముఖ స్వామి విశేష తీర్థంకరులతో తాను ఇకపై రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఆయన తెలిపినట్లు సమాచారం. కాని మఠాధిపతులు అద్వానీని రాజకీయాల నుంచి తప్పుకోకూడదని కోరినట్లు ప్రాథమిక సమాచారం.
Source: జాతీయ | 28 Sep 2009 | 10:29 pm

రాహుల్‌ను మళ్ళీ మెచ్చుకున్న శత్రుఘ్న సిన్హా

జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీని ప్రముఖ బాలీవుడ్ నటుడు, భారతీయ జనతా పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు శత్రుఘ్న సిన్హా సోమవారం నాడు మరోసారి ప్రస్తుతించారు.
Source: జాతీయ | 28 Sep 2009 | 9:43 pm

26/11 నిందితులపై చర్యలు: చిదంబరం డౌట్

ముంబయి ఉగ్రవాద దాడుల నిందితులపై పాకిస్థాన్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడంపట్ల కేంద్ర హోంశాఖ మంత్రి పి.చిదంబరం అనుమానం వ్యక్తం చేశారు. ఈ దాడులకు సంబంధించి విచారణ ప్రారంభమైన తరువాతే తనకు ఈ విషయంలో నమ్మకం వస్తుందని చిదంబరం పేర్కొన్నారు.
Source: జాతీయ | 28 Sep 2009 | 6:55 am

మహా సమరం: సేన- బీజేపీ మేనిఫెస్టో ప్రకటన

మహారాష్ట్ర ఎన్నికల కోసం శివసేన- బీజేపీల నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమి సోమవారం మేనిఫెస్టో ప్రకటించింది. సంచార తెగల సంక్షేమం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటుతోపాటు, ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు విద్యా సంస్థల్లో, ఉద్యోగాల్లో 15 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని బీజేపీ, శివసేన పార్టీలు వెల్లడించాయి.
Source: జాతీయ | 28 Sep 2009 | 6:29 am

2014వరకు రోశయ్యే ముఖ్యమంత్రి: దివాకర్ రెడ్డి

వచ్చే 2014వరకు కోణిజేటి రోశయ్యే ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దివాకర్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం సీఎం రోశయ్య అసెంబ్లీలో కొనసాగుతోన్న మంత్రులు కూడా తాత్కాలికమేనని ఆయన గుర్తు చేశారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ పోస్టర్లను మంత్రులు చింపివేయడంపై మండిపడ్డారు.
Source: ఏపీ న్యూస్ | 28 Sep 2009 | 5:13 am

జశ్వంత్ సింగ్‌కు శతృఘ్న సిన్హా మద్దతు

రాజకీయాల్లోకి అడుగుపెట్టిన బాలీవుడ్ నటుడు శతృఘ్న సిన్హా ఆదివారం బీజేపీ బహిష్కృత నేత జశ్వంత్ సింగ్‌కు మద్దతుగా నిలిచారు. జశ్వంత్ సింగ్‌ను తిరిగి పార్టీలోకి తీసుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించారు. పార్టీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని జశ్వంత్ సింగ్‌ను తిరిగి బీజేపీలోకి ఆహ్వానించాలని శతృఘ్న సిన్హా చెప్పారు.
Source: జాతీయ | 28 Sep 2009 | 4:59 am

ఇష్టం లేకుంటే రాజీనామా చేయండి: పాల్వాయి

రాష్ట్ర ముఖ్యమంత్రి కే. రోశయ్య అసెంబ్లీ పనిచేయడం ఇష్టం లేని మంత్రులు తమ పార్టీలకు రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన రెడ్డి అన్నారు. సోమవారం విజయదశమి సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేతలందరు కె. కేశవరావు నివాసంలో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి అనంతరం పాల్వాయి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి పగ్గాలను అధిష్టానం ఏ వ్యక్తికి అప్పగిస్తుందో అంతవరకు మంత్రులు సంయమనం పాటించాలని పిలుపు నిచ్చారు.
Source: ఏపీ న్యూస్ | 28 Sep 2009 | 4:54 am

స్వైన్ ఫ్లూ: గర్భిణి, బాలింతతో ఐదుగురు మృతి

స్వైన్ ఫ్లూ మహమ్మారికి మరో నలుగురు బలైయ్యారు. ఆదివారం స్వైన్ ఫ్లూతో మరణించిన వారిలో ఓ గర్భిణితో పాటు ముగ్గురు మహిళలు, ఓ యువకుడు ఉన్నారు. హైదరాబాద్ జియాగూడలోని కురుమబస్తీకి చెందిన కృష్ణవేణి (21) ఐదునెలల గర్భిణి. మరొకరు ఇటీవలే బెడ్డకు జన్మనిచ్చిన బాలింత ఉన్నారు.
Source: ఏపీ న్యూస్ | 28 Sep 2009 | 4:30 am

కాంగ్రెస్ కార్యాలయానికి నిప్పంటించిన దుండగులు

ఖమ్మం జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ పోస్టర్లను ఆ పార్టీ నేతలు చింపివేయటంపై తీవ్ర పరిణామాలకు దారితీసిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనపై కాంగ్రెస్ సీనియర్ నేతలు మండిపడుతున్న నేపథ్యంలో.. మరో వివాదం చోటుచేసుకుంది.
Source: ఏపీ న్యూస్ | 28 Sep 2009 | 4:05 am