ఇరాన్ షాహబ్ క్షిపణి పరీక్ష విజయవంతం

ఇరాన్ మిలిటరీ సోమవారం షాహబ్- 3 క్షిపణి పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. తన చిరకాల ప్రత్యర్థి ఇజ్రాయేల్‌ను ఢీకొట్టగల సామర్థ్యం ఈ క్షిపణికి ఉన్నాయి. ఇరాన్ మిలిటరీ గత కొన్ని గంటల్లో నిర్వహించిన రెండో క్షిపణి పరీక్ష ఇది.
Source: Yahoo! Telugu: News | 28 Sep 2009 | 9:38 am

కాంగ్రెస్ కార్యాలయానికి నిప్పంటించిన దుండగులు

ఖమ్మం జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ పోస్టర్లను ఆ పార్టీ నేతలు చింపివేయటంపై తీవ్ర పరిణామాలకు దారితీసిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనపై కాంగ్రెస్ సీనియర్ నేతలు మండిపడుతున్న నేపథ్యంలో.. మరో వివాదం చోటుచేసుకుంది.
Source: Yahoo! Telugu: News | 28 Sep 2009 | 9:35 am

డిసెంబరునాటికి బ్యాంకుల్లోకి పది వేల కోట్లు

సుమారు ఆరుకుపైగా ప్రభుత్వ రంగ బ్యాంకులకు డిసెంబరునాటికి రూ.10 వేల కోట్ల నిధులు అందుబాటులోకి రానున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులకు భారీ మొత్తంలో మూలధనాన్ని అందించేందుకు ప్రపంచ బ్యాంకు సంసిద్ధత వ్యక్తం చేసింది. బ్యాంకుల రుణ సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రపంచ బ్యాంకు ఈ నిర్ణయం తీసుకుంది.
Source: Yahoo! Telugu: News | 28 Sep 2009 | 8:06 am

బుగ్తి హత్య కేసులో ముషారఫ్‌కు సమన్లు

పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్, మరి కొంత మంది ఆయన కీలక సహాయకులకు ఆ దేశ కోర్టు సమన్లు జారీ చేసింది. బలూచిస్థాన్ నేత నవాబ్ అక్బర్ బుగ్తి హత్య కేసులో వీరిని విచారించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు ముషారఫ్, అతని సహాయకులు అక్టోబరు 7న ధర్మాసనం ఎదుట హాజరుకావాలని ఆదేశించింది.
Source: Yahoo! Telugu: News | 28 Sep 2009 | 7:58 am

పుల్వామా ఎన్‌కౌంటర్: తీవ్రవాదుల హతం

జమ్ము- కాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా జిల్లాలో సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్ ముగ్గురు లష్కరే తోయిబా తీవ్రవాదులు, ఒక పరుడు మృతి చెందారు. మృతి చెందిన ముగ్గురు తీవ్రవాదుల్లో ఇద్దరిని పాకిస్థాన్ నుంచి వచ్చినవారిగా గుర్తించారు. దక్షిణ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో సోమవారం ఈ ఎన్‌కౌంటర్ జరిగిందని భద్రతా దళాలు తెలిపాయి.
Source: Yahoo! Telugu: News | 28 Sep 2009 | 7:49 am

ఇరాన్: అసలే అణు వివాదం, ఆపై క్షిపణి పరీక్ష

వివాదాస్పద అణు కార్యక్రమంపై అగ్రరాజ్యాలు చిందులేస్తున్న తరుణంలో ఇరాన్ క్షిపణి పరీక్ష నిర్వహించింది. తమ మిలిటరీ స్వల్పదూరంలో లక్ష్యాలు చేధించే క్షిపణి పరీక్షను విజయవంతంగా నిర్వహించినట్లు ఇరాన్ అధికారిక వర్గాలు తెలిపాయి. తమ దేశానికి ఇతర దేశాల నుంచి ఉన్న మిలిటరీ ముప్పును తప్పించుకునేందుకు ఈ పరీక్ష నిర్వహించినట్లు ఇరాన్ మిలిటరీ వెల్లడించింది.
Source: Yahoo! Telugu: News | 28 Sep 2009 | 6:50 am

14 విమానాలను రద్దు చేసిన ఎయిర్ ఇండియా

ఎయిర్ ఇండియా ఎగ్జిక్యూటివ్ పైలెట్లు చేస్తున్న ఆందోళన సోమవారం మూడో రోజుకు చేరుకుంది. పైలెట్ల నిరసనను నిలిపివేసేందుకు యాజమాన్యం చేసిన ప్రతిపాదన కూడా విఫలమైంది. దీంతో దేశ రాజధాని నుంచి ఎయిర్ ఇండియా 14 విమానాలను రద్దు చేసింది.
Source: Yahoo! Telugu: News | 28 Sep 2009 | 6:03 am

సోనియాగాంధీని అవమానించారు: రోశయ్య

ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ పోస్టర్లను ధ్వంసం చేసిన సంఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి కే. రోశయ్య మండిపడ్డారు. త్యాగశీలి అయిన సోనియా గాంధీని అవమానించే విధంగా, పూర్తిగా కించపరిచినట్లు ఖమ్మం ఘటన జరిగిందని కె.రోశయ్య ఆవేదన వ్యక్తం చేశారు.
Source: Yahoo! Telugu: News | 28 Sep 2009 | 5:50 am

26/11 విచారణను పర్యవేక్షించమన్న భారత్

గత ఏడాది జరిగిన ముంబయి మారణహోమానికి సంబంధించి పాకిస్థాన్ యంత్రాంగం జరిపే విచారణలను తాము పర్యవేక్షించమని భారత్ ఆదివారం స్పష్టం చేసింది. పాకిస్థాన్ యంత్రాంగం అక్టోబరు 3 నుంచి ముంబయి దాడుల విచారణను ప్రారంభించనుంది. ముంబయి దాడులకు సంబంధించి తాము అరెస్టు చేసిన అనుమానితులను వచ్చే నెల 3 నుంచి విచారించనున్నట్లు పాకిస్థాన్ ప్రకటించింది.
Source: Yahoo! Telugu: News | 28 Sep 2009 | 5:08 am

స్వైన్ ఫ్లూ: గర్భిణి, బాలింతతో ఐదుగురు మృతి

స్వైన్ ఫ్లూ మహమ్మారికి మరో నలుగురు బలైయ్యారు. ఆదివారం స్వైన్ ఫ్లూతో మరణించిన వారిలో ఓ గర్భిణితో పాటు ముగ్గురు మహిళలు, ఓ యువకుడు ఉన్నారు. హైదరాబాద్ జియాగూడలోని కురుమబస్తీకి చెందిన కృష్ణవేణి (21) ఐదునెలల గర్భిణి. మరొకరు ఇటీవలే బెడ్డకు జన్మనిచ్చిన బాలింత ఉన్నారు.
Source: ఏపీ న్యూస్ | 28 Sep 2009 | 4:30 am

కాంగ్రెస్ కార్యాలయానికి నిప్పంటించిన దుండగులు

ఖమ్మం జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ పోస్టర్లను ఆ పార్టీ నేతలు చింపివేయటంపై తీవ్ర పరిణామాలకు దారితీసిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనపై కాంగ్రెస్ సీనియర్ నేతలు మండిపడుతున్న నేపథ్యంలో.. మరో వివాదం చోటుచేసుకుంది.
Source: ఏపీ న్యూస్ | 28 Sep 2009 | 4:05 am

పుల్వామా ఎన్‌కౌంటర్: తీవ్రవాదుల హతం

జమ్ము- కాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా జిల్లాలో సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్ ముగ్గురు లష్కరే తోయిబా తీవ్రవాదులు, ఒక పరుడు మృతి చెందారు. మృతి చెందిన ముగ్గురు తీవ్రవాదుల్లో ఇద్దరిని పాకిస్థాన్ నుంచి వచ్చినవారిగా గుర్తించారు. దక్షిణ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో సోమవారం ఈ ఎన్‌కౌంటర్ జరిగిందని భద్రతా దళాలు తెలిపాయి.
Source: జాతీయ | 28 Sep 2009 | 2:19 am

26/11 విచారణను పర్యవేక్షించమన్న భారత్

గత ఏడాది జరిగిన ముంబయి మారణహోమానికి సంబంధించి పాకిస్థాన్ యంత్రాంగం జరిపే విచారణలను తాము పర్యవేక్షించమని భారత్ ఆదివారం స్పష్టం చేసింది. పాకిస్థాన్ యంత్రాంగం అక్టోబరు 3 నుంచి ముంబయి దాడుల విచారణను ప్రారంభించనుంది. ముంబయి దాడులకు సంబంధించి తాము అరెస్టు చేసిన అనుమానితులను వచ్చే నెల 3 నుంచి విచారించనున్నట్లు పాకిస్థాన్ ప్రకటించింది.
Source: జాతీయ | 28 Sep 2009 | 12:42 am

సోనియాగాంధీని అవమానించారు: రోశయ్య

ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ పోస్టర్లను ధ్వంసం చేసిన సంఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి కే. రోశయ్య మండిపడ్డారు. త్యాగశీలి అయిన సోనియా గాంధీని అవమానించే విధంగా, పూర్తిగా కించపరిచినట్లు ఖమ్మం ఘటన జరిగిందని కె.రోశయ్య ఆవేదన వ్యక్తం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 28 Sep 2009 | 12:21 am

ఘనంగా జరిగిన జాషువా జయంతి వేడుకలు

తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని జనని సాంఘిక సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో విశ్వకవి గుఱ్ఱం జాషువా 114వ జయంతి వేడుకలను స్థానిక పొట్టి శ్రీరాములు స్మారక మందిరంలో ఘనంగా నిర్వహించారు.
Source: Yahoo! Telugu: News | 27 Sep 2009 | 12:58 pm

ఘనంగా జరిగిన జాషువా జయంతి వేడుకలు

తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని జనని సాంఘిక సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో విశ్వకవి గుఱ్ఱం జాషువా 114వ జయంతి వేడుకలను స్థానిక పొట్టి శ్రీరాములు స్మారక మందిరంలో ఘనంగా నిర్వహించారు.
Source: జాతీయ | 27 Sep 2009 | 7:28 am

బీజేపీ ర్యాలీలో కాల్పులు: ఒకరి మృతి

సోలాపుర్ జిల్లాలోని షేగాంవ్‌లో భారతీయ జనతా పార్టీ నిర్వహించిన ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన ప్రజలపై గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ సంఘటనలో ఒక వ్యక్తి మృతి చెందగా ముగ్గురు తీవ్ర గాయాలపాలైనారు.
Source: జాతీయ | 27 Sep 2009 | 6:29 am

రెండు దశాబ్దాల తర్వాత దసరా: కాశ్మీరీ పండిట్లు

దేశానికి మకుటంగానున్న ప్రాంతం కాశ్మీర్. ఈ కాశ్మీర్ లోయలోనివారు దసరా మహోత్సవాలు దాదాపు ఇరవై సంవత్సరాల తర్వాత జరుపుకుంటున్నారు.
Source: జాతీయ | 27 Sep 2009 | 6:18 am

హైకమాండ్‌ను బెదిరించిన వైఎస్ఆర్ : కాకా

తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు ఏఐసీసీ కోర్ కమిటీ సీనియర్ నేతలతో సంప్రదించినప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ సోనియాను బెదిరించారని, తెలంగాణా విషయంలో బెదిరింపుల ధోరణికి పాల్పడ్డారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వెంకటస్వామి అన్నారు
Source: ఏపీ న్యూస్ | 27 Sep 2009 | 4:59 am

విజయదశమినాడు సీ బ్లాక్‌లోకి రోశయ్య

రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొణజేటి రోశయ్య సీ బ్లాక్‌ నుంచి తన విధులు నిర్వహించడానికి ముహూర్తం దాదాపుగా ఖరారైంది. సోమవారంనాడు విజయదశమి కావడంతో ఉదయం తొమ్మిది గంటలకు సీ బ్లాక్‌లో ఉన్న సీఎం ఛాంబర్‌లోకి ప్రవేశించనున్నారు.
Source: ఏపీ న్యూస్ | 27 Sep 2009 | 4:30 am

సోనియా పోస్టర్లను చించిన వారిని శిక్షించండి: సీనియర్లు

ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోనియా పోస్టర్లు చించినవారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కే. కేశవరావు, వి. హనుమంతరావులు చిందులు తొక్కారు. బాధ్యులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని అధిష్టానాన్ని డిమాండ్‌ చేశారు.
Source: ఏపీ న్యూస్ | 27 Sep 2009 | 4:08 am

భక్తునిపై చేయి చేసుకున్న ఎస్సై

రాష్ట్రంలోని విజయవాడలో వెలసియున్న కనకదుర్గమ్మ ఆలయంలో ఆదివారంనాడు అమ్మవారి దర్శనం కోసం వచ్చిన ఓ భక్తునిపై విధినిర్వహణలో ఉన్న ఎస్సై చేయి చేసుకున్నారు.
Source: ఏపీ న్యూస్ | 27 Sep 2009 | 3:48 am

రాజస్థాన్‌లో రైలు ఢీకొనడంతో ముగ్గురి మృతి

రాజస్థాన్‌లోని అల్వర్ పట్టణానికి సమీపంలో రూప్‌వాస్ రైల్వే స్టేషనుకు సమీపంలో ముగ్గురిని రైలు ఢీకొనింది. దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు.
Source: జాతీయ | 27 Sep 2009 | 3:24 am