|
సోనియా పోస్టర్లను చించిన వారిని శిక్షించండి: సీనియర్లుఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోనియా పోస్టర్లు చించినవారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కే. కేశవరావు, వి. హనుమంతరావులు చిందులు తొక్కారు. బాధ్యులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని అధిష్టానాన్ని డిమాండ్ చేశారు.Source: Yahoo! Telugu: News | 27 Sep 2009 | 9:37 am భక్తునిపై చేయి చేసుకున్న ఎస్సైరాష్ట్రంలోని విజయవాడలో వెలసియున్న కనకదుర్గమ్మ ఆలయంలో ఆదివారంనాడు అమ్మవారి దర్శనం కోసం వచ్చిన ఓ భక్తునిపై విధినిర్వహణలో ఉన్న ఎస్సై చేయి చేసుకున్నారు.Source: Yahoo! Telugu: News | 27 Sep 2009 | 9:18 am రాజస్థాన్‌లో రైలు ఢీకొనడంతో ముగ్గురి మృతిరాజస్థాన్లోని అల్వర్ పట్టణానికి సమీపంలో రూప్‌వాస్ రైల్వే స్టేషనుకు సమీపంలో ముగ్గురిని రైలు ఢీకొనింది. దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు.Source: Yahoo! Telugu: News | 27 Sep 2009 | 8:54 am మహీంద్రా సత్యంలో ప్రమోషన్లు!ప్రస్తుతం ఆర్థిక రంగం మాంద్యంతో అతలాకుతలమౌతున్న నేపథ్యంలో ఓవైపు చాలా కంపెనీలు వేతనాల్లో కోత విధిస్తున్నాయి. ఐతే ఇటీవలే మహీంద్రా సంస్థ చేతికి చిక్కిన సత్యం కంప్యూటర్స్ సంస్థ క్రమంగా గాడినపడుతున్నట్లు కనపడుతోంది. తాజాగా సంస్థలోని ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించింది.Source: Yahoo! Telugu: News | 27 Sep 2009 | 8:29 am టాప్-10 కంపెనీలకు రూ. 19వేల కోట్లు నష్టంగత వారం స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో టాప్ టెన్‌లోని ఆరు ప్రధాన కంపెనీలు సుమారు.. రూ. 19వేల కోట్లు నష్టపోయినట్లు మార్కెట్ వర్గాల సమాచారం. వీటిల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అత్యధికంగా నష్టాలను చవిచూసింది. సుమారు. రూ. 7,924.44 కోట్లు నష్టపోయింది.Source: Yahoo! Telugu: News | 27 Sep 2009 | 8:09 am నలుగురిని ఒకేసారి పెండ్లాడిన వ్యక్తి...!దక్షిణాఫ్రికాకు చెందిన ఓ వ్యక్తి ఒకేసారి నలుగురు మహిళలను పెండ్లాడాడు. పెండ్లి వేడుకల్లో పెండ్లి కూతురులకు ప్రతి ఒక్కరికి ఉంగరం తొడిగి ముద్దాడాడు. ఈ పెండ్లి సందడిలో వేలాదిమంది పాల్గొని వధూవరులకు శుభాకాంక్షలు చెప్పడం విశేషం.Source: Yahoo! Telugu: News | 27 Sep 2009 | 8:07 am దీపావళికి 25 శాతం వృద్ధి లక్ష్యంగా సోనీ ఇండియాపండుగ సీజన్ (సెప్టెంబర్/అక్టోబర్) వస్తున్న సందర్భంగా ప్రముఖ అంతర్జాతీయ కన్‌స్యూమర్ ఎలక్ట్రానిక్ బ్రాండ్ సంస్థ సోనీ ఇండియా ఆంధ్రప్రదేశ్‌లో 25 శాతం వృద్ధిని సాధించేందుకు ప్రణాళిక చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో గత ఏడాది.. ఇదే పండుగ సీజన్‌లో కంపెనీ విక్రయాలతో రూ. 45 కోట్లు మేరకు టర్నోవర్ సాధించినట్లు సోనీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మసారు తమాగవా తెలిపారు.Source: Yahoo! Telugu: News | 27 Sep 2009 | 8:01 am తాలిబన్ల దాడులు : ప్రాణాలతో బయటపడ్డ ఆఫ్గన్ మంత్రిఆఫ్గనిస్థాన్ క్యాబినెట్ మంత్రిపై తాలిబన్లు ఆదివారం నాడు బాంబులతో దాడులు చేశారు. ఆఫ్గనిస్థాన్‌కు పశ్చిమాన ఉన్న హేరత్ పట్టణంలో ఆదివారం తాలిబన్లు రోడ్డుపక్కన పొంచివుండి ఇంధన మరియు జలవనరుల శాఖామంత్రి ముహమ్మద్ ఇస్మాయిల్ ఖాన్‌పై బాంబులతో దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో ఆయన ప్రాణాలతో బయటపడినట్లు పోలీసు అధికారులు తెలిపారు.Source: Yahoo! Telugu: News | 27 Sep 2009 | 7:19 am రాష్ట్రంలో అల్పపీడన ద్రోణి: భారీ వర్షాలుబంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడటంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.Source: Yahoo! Telugu: News | 27 Sep 2009 | 6:51 am రికవరీ మార్గాన హోటల్ పరిశ్రమ: సర్వేభారత హోటల్ పరిశ్రమ ప్రస్తుతం రికవరీ మార్గాన ఉన్నట్లు తాజా సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఈ సర్వేలో.. వచ్చే ఆరు నెలల కాలం తమ వ్యాపార కార్యకలాపాలు మరింత వృద్ధి చెందనున్నట్లు 75 శాతం మేరకు హోటల్ వ్యాపారులు అభిప్రాయపడుతున్నట్లు తెలిసింది. సుమారు 40 శాతం మంది అభ్యర్థులు.. హోటల్ పరిశ్రమ తగినంత విధంగానే మెరుగుపడుతోందని.. ముగిసిన గత ఆరు నెలల కన్నా ఇప్పుడు ఫర్వాలేదనిపించేలా ఉందని సమాచారం.Source: Yahoo! Telugu: News | 27 Sep 2009 | 6:29 am సోనియా పోస్టర్లను చించిన వారిని శిక్షించండి: సీనియర్లుఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోనియా పోస్టర్లు చించినవారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కే. కేశవరావు, వి. హనుమంతరావులు చిందులు తొక్కారు. బాధ్యులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని అధిష్టానాన్ని డిమాండ్ చేశారు.Source: ఏపీ న్యూస్ | 27 Sep 2009 | 4:08 am భక్తునిపై చేయి చేసుకున్న ఎస్సైరాష్ట్రంలోని విజయవాడలో వెలసియున్న కనకదుర్గమ్మ ఆలయంలో ఆదివారంనాడు అమ్మవారి దర్శనం కోసం వచ్చిన ఓ భక్తునిపై విధినిర్వహణలో ఉన్న ఎస్సై చేయి చేసుకున్నారు.Source: ఏపీ న్యూస్ | 27 Sep 2009 | 3:48 am రాజస్థాన్‌లో రైలు ఢీకొనడంతో ముగ్గురి మృతిరాజస్థాన్లోని అల్వర్ పట్టణానికి సమీపంలో రూప్‌వాస్ రైల్వే స్టేషనుకు సమీపంలో ముగ్గురిని రైలు ఢీకొనింది. దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు.Source: జాతీయ | 27 Sep 2009 | 3:24 am రాష్ట్రంలో అల్పపీడన ద్రోణి: భారీ వర్షాలుబంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడటంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.Source: ఏపీ న్యూస్ | 27 Sep 2009 | 1:22 am జగన్‌కు మాత్రమే పిలుపొచ్చింది !వైఎస్ రాజశేఖర రెడ్డి ఆకస్మికంగా మృతి చెందిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలకు సంబంధించి ప్రధాన సూత్రధారులెవరో నిర్ధారించుకున్న అధిష్టానం ఆ మేరకు అడుగులు వేస్తోంది.Source: ఏపీ న్యూస్ | 27 Sep 2009 | 12:32 am స్వదేశానికి చేరుకున్న ప్రధాని మన్మోహన్అమెరికాలోని పిట్స్‌బర్గ్‌లో జరిగిన జీ-20 శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొన్న తర్వాత భారతదేశ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆదివారంనాడు స్వదేశానికి తిరిగి వచ్చారు.Source: జాతీయ | 27 Sep 2009 | 12:01 am మహతో అరెస్ట్: అక్టోబర్ 3న మావోల బంద్పోలీసు అత్యాచారాలకు వ్యతిరేకంగా పీపుల్స్ కమిటీ అగెనెస్ట్ పోలీస్ అట్రాసిటీస్- పీసీఏపీఏ (ప్రజా సంఘం) పేరుతో ఉద్యమం నడుపుతున్న గిరిజిన ప్రజలకు నేతృత్వం వహిస్తున్న ఛత్రధర్ మహతోను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో గత కొద్ది నెలలుగా పశ్చిమ బెంగాల్‌లోని లాల్‌ఘడ్‌లో రక్తపాతానికి పోలీసులు బ్రేక్ వేశారు.Source: జాతీయ | 26 Sep 2009 | 10:14 pm అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉందాం: కేవీపీదివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.ఆర్ తనయుడు వై.ఎస్. జగన్‌ని ముఖ్యమంత్రిని చేయాలని రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిరసన తెలుపడంపట్ల కే.వీ.పీ. రామచంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం తీసుకునే నిర్ణయాలకు కార్యకర్తలు కట్టుబడి ఉండాలని ఆయన కార్యకర్తలకు బహిరంగ లేఖ రాశారు.Source: ఏపీ న్యూస్ | 26 Sep 2009 | 8:59 am అవన్నీ నాన్న నుంచి నేర్చుకున్నా: శృతిహాసన్"దశావతారం" కథానాయకుడు, పద్మభూషణ్ కమల్ హాసన్ కుమార్తె శృతిహాసన్.. తాజాగా విడుదలైన "ఈనాడు" సినిమాకు సంగీత దర్శకురాలిగా పరిచయమైన సంగతి తెలిసిందే. శృతిహాసన్ తన గురించి చెబుతూ.. నటిగా తన పాత్ర గురించి ముందే బాగా తెలుసుకుంటాను. తర్వాత ఆ పాత్ర ఎలా ఉంటుందో ఊహించుకుని, దానికి తగ్గట్లుగా ఆహార నియమాలు పాటిస్తాను. ఇవన్నీ నాన్న నుంచి నేర్చుకున్నానని శృతి చెప్పింది. ఇంకా ఇంట్లో ఆరోగ్యం పట్ల అవగాహన ఎక్కువ. యోగాతో పాటు ఇతరత్రా వ్యాయామాలను చేస్తుంటామని ఆమె వెల్లడించింది.Source: Yahoo! Telugu: Entertainment | 26 Sep 2009 | 8:47 am ఆ సెంటిమెంట్ కలిసొస్తుందేమో చూడాలి: నితిన్నైజాం డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ రెడ్డి కుమారుడిగా "జయం"లో పరిచయం అయిన హీరో నితిన్.. తర్వాత కొన్ని చిత్రాల్లో నటించినా పెద్దగా ఫలితంలేకపోయింది. వరుసగా చేసుకుంటూపోతే ఏదోనాడు విజయం దక్కుతుందనే ఆశతో నితిన్ ఉన్నాడు. తాజాగా "రెచ్చిపో" అంటూ ముందుకు వచ్చాడు. ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా నితిన్‌తో కాసేపు.. ప్రశ్న: విజయాలు రావట్లేదు. "రెచ్చిపో"లో జాగ్రత్తలు తీసుకున్నారా?జ: ఇంతకుముందు వచ్చిన సినిమాల్లో కాస్త కామెడీ, ప్రేమ సన్నివేశాలు తక్కువగా ఉండేవి. 'రెచ్చిపో'లో అన్ని సమపాళ్ళలో ఉంటాయి. పైగా నాతో తొలిసినిమా తీసిన నిర్మాతలంతా బాగున్నారు. ఆ సెంటిమెంట్ కలిసివస్తుందేమో చూడాలి.ప్రశ్న: ఇలియానాతో నటించడం ఎలా అనిపించింది?జ: నిజం చెప్పాలంటే.. 'దేవదాసు'కు ముందే ఆమెతో నటించాల్సింది. కానీ అది కొన్ని అనివార్య కారణాల వల్ల చేజారిపోయింది. ఇప్పుడు ఆ ఛాన్సు వచ్చింది. ప్రశ్న: ఎందుకోసం రెచ్చిపోతుంటారు? జ: ప్రేమకోసమే. ప్రశ్న: "అడవి" చిత్రం తర్వాత హిందీలో ఆఫర్లు వచ్చాయంటున్నారు. నిజమేనా?జ: అవును. కానీ అడవి-2 కాదు. రంగీలా తరహాలో ఉంటుంది. తర్వాత వెల్ఫేర్ క్రియేషన్‌లో ఓ చిత్రం చేస్తా.Source: Yahoo! Telugu: Entertainment | 26 Sep 2009 | 7:25 am ఎల్ఏసీని చైనా అతిక్రమించడం లేదు: రాజుభారత్, చైనాల మధ్య ఉన్న వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ)పై ఎటువంటి అతిక్రమణలు జరగడం లేదని కేంద్ర ప్రభుత్వం శనివారం స్పష్టం చేసింది. ఇటీవల చైనా ఈ వాస్తవాధీన రేఖను అతిక్రమిస్తుందని జరిగిన ప్రచారంపై ఇరుదేశాల్లోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. దీనిపై అనవసర రాద్ధాంతం జరుగుతున్న నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన సమాధానంతో ముందుకొచ్చింది.Source: జాతీయ | 26 Sep 2009 | 7:16 am ఎంపీ కుమారుడిని కాల్చిచంపిన మావోలుచత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు శనివారం భారతీయ జనతా పార్టీకి చెందిన బస్తర్ ఎంపీ బలిరాం కశ్యప్ ఇద్దరు కుమారులపై కాల్పులు జరిపారు. మావోయిస్టుల కాల్పుల్లో ఎంపీ ఇద్దరు కుమారుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.Source: జాతీయ | 26 Sep 2009 | 6:42 am కంగనా పెదవులు ఎర్రగా వాచిపోయాయట...!!బాలీవుడ్ సెక్సీ డాళ్ నిరవధికంగా ఓ నెలరోజులపాటు షూటింగ్‌లో పాల్గొన్న కారణంగా కాస్త సుస్తీ చేస్తే ఇటలీ వెళ్లిందట. ఆమె ఏ సమస్యతో ఇటలీ వెళ్లిందో కానీ వచ్చేటపుడు చూస్తూ ఆమె పెదవులు ఎర్రగా... వాచిపోయి కనిపించాయట. అంతే ఇక పత్రికలవారు తమ పెన్నులకు పని చెప్పారట. పెదవులు వాచిపోవడానికి కారణం ఏమిటన్న అంశంపై ఎవరికి తోచిన వార్తలు వారు రాసి పారేశారట. పత్రికల రాతలు చూసి కంగానా కంగుతిన్నదట. పత్రికలవాళ్లందరినీ పనిగట్టుకుని పిలిపించి... ఎలర్జీ వల్ల తన పెదవులు వాచిపోయాయని పెదవులను కదపకుండా సమాధానం చెప్పిందట. పాపం మాట్లాడలేనంతగా పెదవులకు ఎలర్జీ సోకిందన్నమాట. ఇంతకీ ఆ ఎలర్జీ ఎలా సోకిందబ్బా...? అని మళ్లీ ఓ జర్నలిస్టు ప్రశ్నిచేసరికి... కంగనా పళ్లు పట పట నూరిందట. అంతే, ఆ పత్రికా సమావేశం స్టాప్.Source: Yahoo! Telugu: Entertainment | 26 Sep 2009 | 5:45 am పాక్ ఆ విధానాన్ని విడిచిపెట్టాలి: మన్మోహన్పాకిస్థాన్తో తిరిగి సాధారణ సంబంధాలు పునరుద్ధరించాలని తాము కోరుకుంటున్నామని భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ శుక్రవారం ఉద్ఘాటించారు. అందుకు పాక్ ప్రభుత్వ యంత్రాంగం తీవ్రవాద సంబంధాలు తెంచుకోవాలని సూచించారు. తీవ్రవాదాన్ని పాక్ ప్రభుత్వం ఓ విధానంగా ఉపయోగించుకోవడాన్ని మానుకోవాలని డిమాండ్ చేశారు.Source: జాతీయ | 26 Sep 2009 | 3:55 am విశాఖపట్నంలో వర్షాలు: గోడకూలి ముగ్గురు మృతివిశాఖపట్నంలో గోడకూలి ముగ్గురు మృతి చెందారు. నగరంలో కురుస్తున్న వర్షానికి గోడకూలి నివాసాలపై పడటంతో ఇద్దరు చిన్నారులతో పాటు ఓ మహిళ దుర్మరణం చెందారు. గాజువాక కృష్ణానగర్ వాలు ప్రాంతంలో పేదల నివాసానికి రక్షణగా నిర్మించిన గోడ వర్షంతో కరిగి దిగువ ఉన్న మూడు వాటాల రేకుల ఇంటిపై పడింది.Source: ఏపీ న్యూస్ | 26 Sep 2009 | 3:37 am
|