పాక్ ఆ విధానాన్ని విడిచిపెట్టాలి: మన్మోహన్

పాకిస్థాన్‌తో తిరిగి సాధారణ సంబంధాలు పునరుద్ధరించాలని తాము కోరుకుంటున్నామని భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ శుక్రవారం ఉద్ఘాటించారు. అందుకు పాక్ ప్రభుత్వ యంత్రాంగం తీవ్రవాద సంబంధాలు తెంచుకోవాలని సూచించారు. తీవ్రవాదాన్ని పాక్ ప్రభుత్వం ఓ విధానంగా ఉపయోగించుకోవడాన్ని మానుకోవాలని డిమాండ్ చేశారు.
Source: Yahoo! Telugu: News | 26 Sep 2009 | 9:25 am

విశాఖపట్నంలో వర్షాలు: గోడకూలి ముగ్గురు మృతి

విశాఖపట్నంలో గోడకూలి ముగ్గురు మృతి చెందారు. నగరంలో కురుస్తున్న వర్షానికి గోడకూలి నివాసాలపై పడటంతో ఇద్దరు చిన్నారులతో పాటు ఓ మహిళ దుర్మరణం చెందారు. గాజువాక కృష్ణానగర్ వాలు ప్రాంతంలో పేదల నివాసానికి రక్షణగా నిర్మించిన గోడ వర్షంతో కరిగి దిగువ ఉన్న మూడు వాటాల రేకుల ఇంటిపై పడింది.
Source: Yahoo! Telugu: News | 26 Sep 2009 | 9:06 am

అవన్నీ నాన్న నుంచి నేర్చుకున్నా: శృతిహాసన్

"దశావతారం" కథానాయకుడు, పద్మభూషణ్ కమల్ హాసన్ కుమార్తె శృతిహాసన్.. తాజాగా విడుదలైన "ఈనాడు" సినిమాకు సంగీత దర్శకురాలిగా పరిచయమైన సంగతి తెలిసిందే. శృతిహాసన్ తన గురించి చెబుతూ.. నటిగా తన పాత్ర గురించి ముందే బాగా తెలుసుకుంటాను. తర్వాత ఆ పాత్ర ఎలా ఉంటుందో ఊహించుకుని, దానికి తగ్గట్లుగా ఆహార నియమాలు పాటిస్తాను. ఇవన్నీ నాన్న నుంచి నేర్చుకున్నానని శృతి చెప్పింది. ఇంకా ఇంట్లో ఆరోగ్యం పట్ల అవగాహన ఎక్కువ. యోగాతో పాటు ఇతరత్రా వ్యాయామాలను చేస్తుంటామని ఆమె వెల్లడించింది.
Source: Yahoo! Telugu: Entertainment | 26 Sep 2009 | 8:47 am

అక్టోబర్‌లో "వైఎస్ జీవిత చరిత్ర" పుస్తకావిష్కరణ

దివంగత మహానేత, ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి జీవిత చరిత్రకు సంబంధించిన పుస్తకాన్ని అక్టోబర్ రెండో వారంలో విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ తెలిపారు.ఈ పుస్తకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కే. రోశయ్య, వైఎస్సార్ తనయుడు జగన్మోహన రెడ్డి సమక్షంలో ఈ పుస్తకాన్ని విడుదల చేస్తామని మాణిక్య వరప్రసాద్ అన్నారు.
Source: Yahoo! Telugu: News | 26 Sep 2009 | 8:04 am

కుటుంబాన్ని నిర్బంధించిన నేరగాళ్లు హతం

గూర్గావ్‌లో ఓ కుటుంబాన్ని బందీలుగా చేసుకున్న నలుగురు దుండగుల్లో ఇద్దరు పోలీసుల కాల్పుల్లో హతమయ్యారు. మరో ఇద్దరు పోలీసు ఎన్‌కౌంటర్ నుంచి తప్పించుకొని పారిపోయారు. గుర్గావ్ జిల్లాలోని పాలం విహార్ ప్రాంతంలో ఎనిమిది సభ్యులున్న ఓ కుటుంబాన్ని నిర్బంధించి నలుగురు దుండుగులు దోపిడికి ప్రయత్నించారు.
Source: Yahoo! Telugu: News | 26 Sep 2009 | 7:49 am

పైలెట్ల సమ్మెతో ఏఐ విమాన సర్వీసులు రద్దు

మొత్తానికి ఎయిర్ ఇండియాలో మరో సంక్షోభం ఆజ్యం పోసుకుంది. తమ వేతనాల్లో తగ్గింపులు చేపట్టేందుకు ఎయిర్ ఇండియా సిద్ధపడటంతో.. ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ... ఆ సంస్థ పైలెట్లు మూకుమ్మడి సెలవులను తీసుకున్నారు. ఇప్పటి వరకు యూనియన్ ఏర్పాటు చేయకపోయినప్పటికీ.. సీనియర్ పైలెట్లు మాత్రం సుమారు 400 మంది ఈ మూకుమ్మడి సెలవులను తీసుకున్నట్లు సమాచారం.
Source: Yahoo! Telugu: News | 26 Sep 2009 | 7:44 am

ఆ సెంటిమెంట్ కలిసొస్తుందేమో చూడాలి: నితిన్

నైజాం డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ రెడ్డి కుమారుడిగా "జయం"లో పరిచయం అయిన హీరో నితిన్.. తర్వాత కొన్ని చిత్రాల్లో నటించినా పెద్దగా ఫలితంలేకపోయింది. వరుసగా చేసుకుంటూపోతే ఏదోనాడు విజయం దక్కుతుందనే ఆశతో నితిన్ ఉన్నాడు. తాజాగా "రెచ్చిపో" అంటూ ముందుకు వచ్చాడు. ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా నితిన్‌తో కాసేపు.. ప్రశ్న: విజయాలు రావట్లేదు. "రెచ్చిపో"లో జాగ్రత్తలు తీసుకున్నారా?జ: ఇంతకుముందు వచ్చిన సినిమాల్లో కాస్త కామెడీ, ప్రేమ సన్నివేశాలు తక్కువగా ఉండేవి. 'రెచ్చిపో'లో అన్ని సమపాళ్ళలో ఉంటాయి. పైగా నాతో తొలిసినిమా తీసిన నిర్మాతలంతా బాగున్నారు. ఆ సెంటిమెంట్ కలిసివస్తుందేమో చూడాలి.ప్రశ్న: ఇలియానాతో నటించడం ఎలా అనిపించింది?జ: నిజం చెప్పాలంటే.. 'దేవదాసు'కు ముందే ఆమెతో నటించాల్సింది. కానీ అది కొన్ని అనివార్య కారణాల వల్ల చేజారిపోయింది. ఇప్పుడు ఆ ఛాన్సు వచ్చింది. ప్రశ్న: ఎందుకోసం రెచ్చిపోతుంటారు? జ: ప్రేమకోసమే. ప్రశ్న: "అడవి" చిత్రం తర్వాత హిందీలో ఆఫర్లు వచ్చాయంటున్నారు. నిజమేనా?జ: అవును. కానీ అడవి-2 కాదు. రంగీలా తరహాలో ఉంటుంది. తర్వాత వెల్ఫేర్ క్రియేషన్‌లో ఓ చిత్రం చేస్తా.
Source: Yahoo! Telugu: Entertainment | 26 Sep 2009 | 7:25 am

త్వరలోనే మంత్రులతో సమీక్షా సమావేశాలు: సీఎం

ప్రభుత్వానికి చెందిన అన్ని శాఖల మంత్రులు, కమిషనర్లు, కార్యదర్శులతో త్వరలో సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కే. రోశయ్య అన్నారు. దేవాదాయ, ధర్మదాయశాఖపై ప్రప్రథమంగా సమీక్ష నిర్వహించాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆ శాఖలో ఇటీవల వెలుగులోకి వస్తున్న పలు తప్పులను ఇకపై జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Source: Yahoo! Telugu: News | 26 Sep 2009 | 6:55 am

ఇరాన్ ప్లాంటుపై అమెరికా, బ్రిటన్ అల్టిమేటం

ఇరాన్ వివాదాస్పద అణు కార్యక్రమంపై చాలాకాలం నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పశ్చిమ దేశాలు మరోసారి ఆ దేశంపై విరుచుకపడ్డాయి. ఇరాన్ తాజాగా తమ దేశంలో రెండో రహస్య యురేనియం శుద్ధి కేంద్రం ఉన్నట్లు బయటపెట్టడం అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలకు ఆగ్రహం తెప్పించింది.
Source: Yahoo! Telugu: News | 26 Sep 2009 | 6:55 am

ఎన్‌పీటీ ఇప్పటి రూపం సమ్మతం కాదు: భారత్

స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి అణు నిరాయుధీకరణ విషయంలో భారత్ స్పష్టమైన వైఖరి కలిగివుందని కేంద్ర విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి శశి థరూర్ తెలిపారు. అణు నిరాయుధీకరణ ఒప్పందం (ఎన్‌‍పీటీ) ఇప్పటి రూపంపై భారత్ సంతకం చేయబోదని స్పష్టం చేశారు. శశి థరూర్ శుక్రవారం రాత్రి మాట్లాడుతూ.. ఏ దేశం అణ్వాయుధాలు కలిగివుండకూడదనేది తమ భావనని చెప్పారు.
Source: Yahoo! Telugu: News | 26 Sep 2009 | 6:46 am

భూమా దంపతులు ప్లేటు ఫిరాయిస్తారేమో...?!!

వైఎస్ జగన్మోహన్ రెడ్డి పావురాల గుట్ట సందర్శనలో భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి వైఎస్ జగన్‌ను అనుసరించడం ప్రజారాజ్యం పార్టీలో చర్చనీయాంశమైంది. వైఎస్ జగన్ పట్ల వారు అంతగా అత్యుత్సాహం కనబరచాల్సిన అవసరం ఏమిటీ..? ఒకవేళ ప్లేటు ఫిరాయించి (వైఎస్) కాంగ్రెస్ గూటికి చేరే అవకాశం ఉన్నదా..?
Source: Yahoo! Telugu: News | 26 Sep 2009 | 6:44 am

ముఖ్యమంత్రి గారూ మీ దారేదో తేల్చుకోండి..!: గౌడ్

జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపట్టే పనులను ఇందిరమ్మ కమిటీలకు ప్రభుత్వం జారీ చేసిన జీవోలను వ్యతిరేకిస్తూ.. టీడీపీ లక్డీకాపూల్‌లోని జిల్లా కలక్టరేట్ ముందు శుక్రవారం ధర్నా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో తెదేపా సీనియర్ నేత దేవందర్ గౌడ్ సీఎంను ఉద్దేశించి.. "ఎంతో రాజకీయ అనుభవమున్న మీరు కొత్తగా సీఎం అయ్యారు. ప్రజాస్వామ్యయుతంగా నడుచుకుంటారా? లేక అప్రజాస్వామిక విధానాలతో ముందుకు వెళతారో? తేల్చుకోండి. ఇది మీకు అసలు సిసలు పరీక్ష. ప్రజాస్వామ్య పద్ధతినే ఎంచుకుంటే జాతీయ ఉపాధి పథకం కింద చేపట్టే పనులను ప్రజలెన్నుకున్న స్థానిక సంస్థలకే అప్పగించండి. ప్రజాస్వామ్యంపై మీకున్న గౌరవాన్ని నిరూపించుకోండి" అంటూ వ్యాఖ్యానించారు.
Source: Yahoo! Telugu: News | 26 Sep 2009 | 6:41 am

కంగనా పెదవులు ఎర్రగా వాచిపోయాయట...!!

బాలీవుడ్ సెక్సీ డాళ్ నిరవధికంగా ఓ నెలరోజులపాటు షూటింగ్‌లో పాల్గొన్న కారణంగా కాస్త సుస్తీ చేస్తే ఇటలీ వెళ్లిందట. ఆమె ఏ సమస్యతో ఇటలీ వెళ్లిందో కానీ వచ్చేటపుడు చూస్తూ ఆమె పెదవులు ఎర్రగా... వాచిపోయి కనిపించాయట. అంతే ఇక పత్రికలవారు తమ పెన్నులకు పని చెప్పారట. పెదవులు వాచిపోవడానికి కారణం ఏమిటన్న అంశంపై ఎవరికి తోచిన వార్తలు వారు రాసి పారేశారట. పత్రికల రాతలు చూసి కంగానా కంగుతిన్నదట. పత్రికలవాళ్లందరినీ పనిగట్టుకుని పిలిపించి... ఎలర్జీ వల్ల తన పెదవులు వాచిపోయాయని పెదవులను కదపకుండా సమాధానం చెప్పిందట. పాపం మాట్లాడలేనంతగా పెదవులకు ఎలర్జీ సోకిందన్నమాట. ఇంతకీ ఆ ఎలర్జీ ఎలా సోకిందబ్బా...? అని మళ్లీ ఓ జర్నలిస్టు ప్రశ్నిచేసరికి... కంగనా పళ్లు పట పట నూరిందట. అంతే, ఆ పత్రికా సమావేశం స్టాప్.
Source: Yahoo! Telugu: Entertainment | 26 Sep 2009 | 5:45 am

పాక్ ఆ విధానాన్ని విడిచిపెట్టాలి: మన్మోహన్

పాకిస్థాన్‌తో తిరిగి సాధారణ సంబంధాలు పునరుద్ధరించాలని తాము కోరుకుంటున్నామని భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ శుక్రవారం ఉద్ఘాటించారు. అందుకు పాక్ ప్రభుత్వ యంత్రాంగం తీవ్రవాద సంబంధాలు తెంచుకోవాలని సూచించారు. తీవ్రవాదాన్ని పాక్ ప్రభుత్వం ఓ విధానంగా ఉపయోగించుకోవడాన్ని మానుకోవాలని డిమాండ్ చేశారు.
Source: జాతీయ | 26 Sep 2009 | 3:55 am

విశాఖపట్నంలో వర్షాలు: గోడకూలి ముగ్గురు మృతి

విశాఖపట్నంలో గోడకూలి ముగ్గురు మృతి చెందారు. నగరంలో కురుస్తున్న వర్షానికి గోడకూలి నివాసాలపై పడటంతో ఇద్దరు చిన్నారులతో పాటు ఓ మహిళ దుర్మరణం చెందారు. గాజువాక కృష్ణానగర్ వాలు ప్రాంతంలో పేదల నివాసానికి రక్షణగా నిర్మించిన గోడ వర్షంతో కరిగి దిగువ ఉన్న మూడు వాటాల రేకుల ఇంటిపై పడింది.
Source: ఏపీ న్యూస్ | 26 Sep 2009 | 3:37 am

అక్టోబర్‌లో "వైఎస్ జీవిత చరిత్ర" పుస్తకావిష్కరణ

దివంగత మహానేత, ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి జీవిత చరిత్రకు సంబంధించిన పుస్తకాన్ని అక్టోబర్ రెండో వారంలో విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ తెలిపారు. ఈ పుస్తకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కే. రోశయ్య, వైఎస్సార్ తనయుడు జగన్మోహన రెడ్డి సమక్షంలో ఈ పుస్తకాన్ని విడుదల చేస్తామని మాణిక్య వరప్రసాద్ అన్నారు.
Source: ఏపీ న్యూస్ | 26 Sep 2009 | 2:35 am

కుటుంబాన్ని నిర్బంధించిన నేరగాళ్లు హతం

గూర్గావ్‌లో ఓ కుటుంబాన్ని బందీలుగా చేసుకున్న నలుగురు దుండగుల్లో ఇద్దరు పోలీసుల కాల్పుల్లో హతమయ్యారు. మరో ఇద్దరు పోలీసు ఎన్‌కౌంటర్ నుంచి తప్పించుకొని పారిపోయారు. గుర్గావ్ జిల్లాలోని పాలం విహార్ ప్రాంతంలో ఎనిమిది సభ్యులున్న ఓ కుటుంబాన్ని నిర్బంధించి నలుగురు దుండుగులు దోపిడికి ప్రయత్నించారు.
Source: జాతీయ | 26 Sep 2009 | 2:19 am

త్వరలోనే మంత్రులతో సమీక్షా సమావేశాలు: సీఎం

ప్రభుత్వానికి చెందిన అన్ని శాఖల మంత్రులు, కమిషనర్లు, కార్యదర్శులతో త్వరలో సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కే. రోశయ్య అన్నారు. దేవాదాయ, ధర్మదాయశాఖపై ప్రప్రథమంగా సమీక్ష నిర్వహించాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆ శాఖలో ఇటీవల వెలుగులోకి వస్తున్న పలు తప్పులను ఇకపై జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Source: ఏపీ న్యూస్ | 26 Sep 2009 | 1:26 am

ఎన్‌పీటీ ఇప్పటి రూపం సమ్మతం కాదు: భారత్

స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి అణు నిరాయుధీకరణ విషయంలో భారత్ స్పష్టమైన వైఖరి కలిగివుందని కేంద్ర విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి శశి థరూర్ తెలిపారు. అణు నిరాయుధీకరణ ఒప్పందం (ఎన్‌‍పీటీ) ఇప్పటి రూపంపై భారత్ సంతకం చేయబోదని స్పష్టం చేశారు. శశి థరూర్ శుక్రవారం రాత్రి మాట్లాడుతూ.. ఏ దేశం అణ్వాయుధాలు కలిగివుండకూడదనేది తమ భావనని చెప్పారు.
Source: జాతీయ | 26 Sep 2009 | 1:16 am

భూమా దంపతులు ప్లేటు ఫిరాయిస్తారేమో...?!!

వైఎస్ జగన్మోహన్ రెడ్డి పావురాల గుట్ట సందర్శనలో భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి వైఎస్ జగన్‌ను అనుసరించడం ప్రజారాజ్యం పార్టీలో చర్చనీయాంశమైంది. వైఎస్ జగన్ పట్ల వారు అంతగా అత్యుత్సాహం కనబరచాల్సిన అవసరం ఏమిటీ..? ఒకవేళ ప్లేటు ఫిరాయించి (వైఎస్) కాంగ్రెస్ గూటికి చేరే అవకాశం ఉన్నదా..?
Source: ఏపీ న్యూస్ | 26 Sep 2009 | 1:16 am

ముఖ్యమంత్రి గారూ మీ దారేదో తేల్చుకోండి..!: గౌడ్

జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపట్టే పనులను ఇందిరమ్మ కమిటీలకు ప్రభుత్వం జారీ చేసిన జీవోలను వ్యతిరేకిస్తూ.. టీడీపీ లక్డీకాపూల్‌లోని జిల్లా కలక్టరేట్ ముందు శుక్రవారం ధర్నా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో తెదేపా సీనియర్ నేత దేవందర్ గౌడ్ సీఎంను ఉద్దేశించి.. "ఎంతో రాజకీయ అనుభవమున్న మీరు కొత్తగా సీఎం అయ్యారు. ప్రజాస్వామ్యయుతంగా నడుచుకుంటారా? లేక అప్రజాస్వామిక విధానాలతో ముందుకు వెళతారో? తేల్చుకోండి. ఇది మీకు అసలు సిసలు పరీక్ష. ప్రజాస్వామ్య పద్ధతినే ఎంచుకుంటే జాతీయ ఉపాధి పథకం కింద చేపట్టే పనులను ప్రజలెన్నుకున్న స్థానిక సంస్థలకే అప్పగించండి. ప్రజాస్వామ్యంపై మీకున్న గౌరవాన్ని నిరూపించుకోండి" అంటూ వ్యాఖ్యానించారు.
Source: ఏపీ న్యూస్ | 26 Sep 2009 | 1:11 am

శ్రీవారి ప్రసాదం ఇచ్చేందుకే వచ్చా..: డీజీపీ యాదవ్

డీజీపీ ఎస్ఎస్‌పీ యాదవ్ శనివారం రాష్ట్ర హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలుసుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి మృతికి సంబంధించి ఏదైనా అదనపు వివరాలిచ్చేందుకే డీజీపీ ఎస్ఎస్‌పీ యాదవ్ శనివారం హోం మంత్రిని, కేవీపీని కలుసుకున్నారనుకుంటే పొరబాటే..!. రాష్ట్ర హోం మంత్రిని డీజీపీ కలుసుకుని తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని అందించారు. అంతకుముందుకు యాదవ్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రారావును కలుసుకుని స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.
Source: ఏపీ న్యూస్ | 26 Sep 2009 | 12:37 am

సరిహద్దుల్లో భద్రత పటిష్టం చేస్తున్న ఐఏఎఫ్

చైనా- భారత్ మధ్య ఉన్న సరిహద్దు ప్రాంతంలో భారత వైమానిక దళం (ఐఏఎఫ్) భద్రతను పటిష్టం చేస్తోంది. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ)పై ఉన్న లడక్ ప్రాంతంలో చైనా ఇటీవల సరిహద్దు ఉల్లంఘనలకు పాల్పడిందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. వాస్తవాధీన రేఖ వద్దకు ఐఏఎఫ్ ప్రత్యేక రాడార్లను తరలిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
Source: జాతీయ | 26 Sep 2009 | 12:06 am

చందమామపై మరిన్ని పరిశోధనలు: నాయర్

చంద్రయాన్- 1 ద్వారా అద్భుత ఫలితాలు సాధించిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఇప్పుడు చందమామపై మరిన్ని సాహసోపేత పరిశోధనలకు ఉపక్రమించాలనుకుంటుంది. చంద్రుడిపైకి తదుపరి నిర్వహించే యాత్రల ద్వారా నీటికి సంబంధించి మరిన్ని పరిశోధనలు నిర్వహించాలని ఇస్రో భావిస్తోంది.
Source: జాతీయ | 25 Sep 2009 | 10:21 pm

భారత్‌లో ఆర్థిక సంక్షోభం లేదు: మన్మోహన్

దేశంలో ఆర్థిక సంక్షోభం లేదని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తెలిపారు. భారత్‌లో ఆర్థిక సంక్షోభం జాడలేదని అమెరికా పర్యటనలో ఉన్న మన్మోహన్ సింగ్ శుక్రవారం పేర్కొన్నారు. అయితే అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రభావితమయ్యాయమని చెప్పారు. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం వలన భారత ఎగుమతులు దెబ్బతిన్నాయి.
Source: జాతీయ | 25 Sep 2009 | 9:47 pm

ప్రభాస్, కాజల్ అగర్వాల్ జంటగా కొత్త చిత్రం!

యంగ్‌రెబల్‌ స్టార్ ప్రభాస్ హీరోగా, 'తొలిప్రేమ' కరుణాకరన్ దర్శకత్వంలో 'ఛత్రపతి' ప్రసాద్ శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నిర్మిస్తోన్న భారీ చిత్రం రెండో షెడ్యూల్ స్విట్జర్లాండ్‌ జరుగుతుంది.ఈ షెడ్యూల్ విశేషాల్ని 'ఛత్రపతి' ప్రసాద్ చెబుతూ.. సెప్టెంబర్ 28 నుంచి నెలరోజులపాటు స్విట్జర్లాండ్‌లో జరిగే షెడ్యూల్లో ప్రభాస్, కాజల్‌ అగర్వాల్‌లపై రెండు పాటల్ని, ప్రభాస్ పాల్గొనే ఓ ముఖ్యమైన ఛేజ్‌ని చిత్రీకరిస్తున్నట్లు తెలిపారు.
Source: Yahoo! Telugu: Entertainment | 25 Sep 2009 | 11:40 am

నితిన్, ఇలియానాల "రెచ్చిపో" సినిమా ట్రైలర్ మీకోసం..

తన బాడీ లాంగ్వేజ్‌కు అనుగుణమైన లవ్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రాలనే హీరో నితిన్‌ ఎంపికచేసుకుంటున్నారు. ఆయన తాజాగా నటించిన "రెచ్చిపో" చిత్రం నేడే (సెప్టెంబర్ 25) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం ద్వారా 'పెదబాబు' వంటి ఫ్యామిలీ చిత్రానికి, 'ఆంధ్రుడు' వంటి యాక్షన్‌ చిత్రానికి దర్శకత్వం వహించి హిట్ సాధించిన పరుచూరి మురళి తన కెరీర్‌ను 'రెచ్చిపో' చిత్రం మలుపు తిప్పుతుందని భావిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 25 Sep 2009 | 11:14 am

రామ మందిరం నిర్మించి తీరుతాం : అద్వానీ

అద్వానీ తను చేపట్టిన రథయాత్ర పూర్తయ్యి ఇరవై సంవత్సరాలు నిండిన సందర్భంగా ఆయన సోమనాథ్ మందిరంలో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ... రామ మందిరాన్ని తాము తప్పకుండా నిర్మిస్తామని తెలిపారు.
Source: జాతీయ | 25 Sep 2009 | 9:55 am

గోపిచంద్, త్రిషల "శంఖం" ట్రైలర్ మీ కోసం..

గోపీచంద్, త్రిష జంటగా శివ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న "శంఖం" చిత్రం మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇటీవలే విడుదలైన ఈ సినిమాను శ్రీబాలాజీ సినీ మీడియా పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారెడ్డి సంయుక్తంగా నిర్మించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 25 Sep 2009 | 9:50 am

"ఈనాడు" సినిమా ట్రైలర్‌ను తిలకించండి

మనిషిలో రెండు కోణాలుంటాయి. అలా ఓ సగటుజీవి ఉండే రెండో కోణంతో సమాజశ్రేయస్సుకై ఎంతకైనా తెగిస్తాడు? అనే పాయింట్‌తో "ఈనాడు" సినిమా తెరకెక్కింది. వైవిధ్యమైన సినిమాలతో ఏదో కొత్తదనాన్ని తన పాత్రల ద్వారా ప్రేక్షకులకు చూపించాలని పరితపించే పద్మభూషణ్ కమల్ హాసన్.. తాజాగా సామాజిక పరిస్థితులకు అద్దంపట్టే కథాంశంతో "ఈనాడు" చిత్రాన్ని రూపొందించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 25 Sep 2009 | 9:40 am

"బాణం" సినిమా ట్రైలర్ మీ కోసం..

మాజీ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడి తనయుడు నారా రోహిత్ 'బాణం' చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయమైన సంగతి తెలిసిందే.అశ్వనీదత్ కుమార్తెలు నిర్మాణం చేతబట్టి 'త్రీ ఎంజెల్స్' పతాకంపై రూపొందించిన ఈ మొదటి చిత్రం థియేటర్లరో ప్రేక్షకులను అలరిస్తోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 25 Sep 2009 | 9:24 am

"కామిక్" సినిమాగా "క్విక్ గన్ మురుగన్"

నటీనటులు: డా.రాజేంద్రప్రసాద్, రంభ, నాజర్, రాజుసుందరం తదితరులు. దర్శకత్వం: శశాంక్ ఘోష్, ఈ సినిమాను కేవలం మామూలు సినిమా అనుకుంటే పొరపాటే. ప్రముఖ మ్యూజిక్ ఛానల్ "వి"లో చాలారోజులు ప్రసారమవుతోన్న ఓ కామిక్ పాత్రకు తెరరూపమే "క్విక్ గన్ మురుగన్". ఇందులో పాత్రల తీరు, పేర్లు విచిత్రంగా ఉంటాయి. చిత్ర నిడివి కూడా చాలా తక్కువే. కౌబాయ్‌లుండే కాలానికి అనుగుణంగా ఓ ఊరిలో సెట్‌వేసి తీశారు. శాఖాహారులకు, మాంసాహారులకు మధ్య పోరే ఈ చిత్రంలోని కీలకమైన పాయింట్. దాన్ని కాస్త వెటకారంగానూ, కారంగానూ చూపించారు. ఇక కథలోకి వెళితే.. కౌబాయ్ క్విక్‌గన్ మురుగన్ (రాజేంద్రప్రసాద్) శాఖాహారులను ప్రోత్సహిస్తుంటారు. గోరక్షణ, స్త్రీలను గౌరవించడం అతని విధి. అందరూ రకరకాలుగా ఉద్యోగాలు చేస్తుంటే.. తాను చెడుపై పోరాటం చేసే ఉద్యోగాన్ని చేస్తున్నానంటాడు. మంచి చేయాలంటే చెడ్డవారితో పోరాడాలనేది అతని తత్త్వం. ఇలాంటి వ్యక్తి మాంసాహారం ప్రోత్సహించే వ్యక్తికి బలై, చనిపోయిన తర్వాత ఎలా ఆ వ్య.క్తిని అంతమొందించాడన్నదే సినిమా.
Source: Yahoo! Telugu: Entertainment | 25 Sep 2009 | 8:54 am

మరోసారి ఆంధ్రుల ఆత్మగౌరవం దెబ్బతింటుంది: అమర్

జాతీయ స్థాయిలో వైఎస్ జగన్ మోహన్ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాన్ని సమర్థించే నాయకుడు నేటికి ఒకరు వెలికి వచ్చారు. ఆయనే సమాజ్‌వాదీ పార్టీ నేత అమర్ సింగ్. వైఎస్ జగన్‌కు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టకపోయినట్లయితే ఆంధ్రుల ఆత్మగౌరవం దెబ్బతింటుందని ఆయన కాంగ్రెస్ పార్టీని హెచ్చరించారు.
Source: జాతీయ | 25 Sep 2009 | 8:18 am

ఎన్‌ఫోర్స్‌మెంట్ వలలో పెద్ద హవాలా చేప

కోట్లాది రూపాయాల హవాలా నెట్‌వర్క్ నడుపుతున్న జైన్ అనే వ్యక్తిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం లక్ష్యంగా చేసుకొంది. రూ.5000 కోట్ల మేర హవాలా కార్యకలాపాలు సాగిస్తున్నందుకు అతడిపై ఈడీ కేసు నమోదు చేసింది. అమెరికా అంతర్గత భద్రతా విభాగం కూడా జైన్ చేతుల మీదగా తీవ్రవాద నెట్‌వర్క్‌లకు డబ్బు అందుతున్నట్లు తెలిపింది.
Source: జాతీయ | 25 Sep 2009 | 7:36 am

కింగ్స్ మధ్య క్వీన్ స్టోరీలా..? కాస్త కష్టమే..!!

పురుషాధిక్యసమాజం గల సినీ ఇండస్ట్రీలో పూర్థిస్థాయి అంటే... లేడి ఓరియెంటెడ్ సినిమాల్లో నటించడం మామూలు విషయం కాదని "బొమ్మరిల్లు" ముద్దుగుమ్మ జెనీలియా తేల్చి చెబుతోంది. టాలీవుడ్‌‌లో మనోరమ, మంత్ర వంటి లేడి ఓరియెంటెడ్ చిత్రాలు వస్తున్న ఈ సీజన్‌లో.. మొదటి నుంచి ఎక్కడున్నా నటిగా తనను తాను నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తానని హాసిని వెల్లడించింది. మనకంటూ గుర్తింపు వచ్చేంతవరకు ఎదురుచూడాల్సిందే తప్ప, ఇందులో ఎవరికి ఎవరూ పోటీకాదని జెన్నీ చెప్పింది. హిందీలో "జానే..తు" తర్వాత గుర్తింపు రావడంతోనే.. తెలుగులో గొప్పపేరు తెచ్చుకోవడం జరిగిందని జెనీలియా అంటోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 25 Sep 2009 | 7:26 am

జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నా చేసిన టీడీపీ

రాష్ట్రంలోని కాంగ్రెస్‌ పార్టీ పాలనలో స్థానిక సంస్థలు నిర్వీర్యమవుతున్నాయని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలు శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు ధర్నాలు నిర్వహించారు
Source: ఏపీ న్యూస్ | 25 Sep 2009 | 7:22 am

గ్రేటర్ ఎన్నికలు: లోక్‌సత్తా తొలి జాబితా విడుదల

రాష్ట్రంలో గ్రేటర్ ఎన్నికల హడావుడి మొదలైంది. పార్టీలన్ని గ్రేటర్ ఎన్నికలకు తమ తమ అభ్యర్థుల ఎంపికలో నిమగ్నమయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికలకు లోక్‌సత్తా పార్టీ 35 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను శుక్రవారం విడుదల చేసింది.
Source: ఏపీ న్యూస్ | 25 Sep 2009 | 6:33 am

సీటీబీటీ, ఎన్‌పీటీపై ప్రభుత్వ స్పందన బాగుంది

సమగ్ర అణు పరీక్షల నిషేధ ఒప్పందం (సీటీబీటీ), అణు నిరాయుధీకరణ ఒప్పందం (ఎన్‌పీటీ)లపై భారత్‌సహా, వీటిపై సంతకం చేయని ఇతర దేశాలు సంతకం చేయాలని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా చేసిన ప్రకటనపై భారత్ స్పందన భేషుగ్గా ఉందని ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధికారంలో ఉన్న యూపీఏ కూటమి ప్రభుత్వాన్ని ప్రశంసించింది.
Source: జాతీయ | 25 Sep 2009 | 6:15 am

సైకిలెక్కి "హిమ" పర్వతాల్ని చుట్టేద్దామా...?

ఓ వైపు కొండ.. మరోవైపు లోయలో గలగలా పారే బియాస్ నదీమతల్లి పరవళ్లు, కొండచిలువలా మలుపులు తిరిగిన తారు రోడ్డు, 50 నుంచి 100 అడుగుల ఎత్తుదాకా పెరిగిన దేవదారు చెట్ల పరిమళం, నీరెండలో చల్లటి చలి...ఇంతటి వింత అనుభూతిని అందించే ఈ ప్రాంతంలో ఆహ్లాదం తప్ప మరేమీ కనిపించదు. అదే మన హిమాచల్‌ప్రదేశ్. భగభగా మండే ఎండల నుంచి మంచు కొండలకు, కాంక్రీట్ అడవుల నుంచి కీకారణ్యానికి, రణగొణ ధ్వనుల...
Source: వినోదం | 25 Sep 2009 | 4:22 am

"బాణం" సినిమా ట్రైలర్ మీ కోసం..

మాజీ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడి తనయుడు నారా రోహిత్ 'బాణం' చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయమైన సంగతి తెలిసిందే. అశ్వనీదత్ కుమార్తెలు నిర్మాణం చేతబట్టి 'త్రీ ఎంజెల్స్' పతాకంపై రూపొందించిన ఈ మొదటి చిత్రం థియేటర్లరో ప్రేక్షకులను అలరిస్తోంది.
Source: వినోదం | 25 Sep 2009 | 4:10 am

మా నాన్న ఆశయాలు నెరవేరుద్దాం : జగన్

దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైఎస్.జగన్ నల్లకాల్వ వద్ద ఏర్పాటు చేసిన సంస్మరణ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ... తన తండ్రిని బలి తీసుకున్న హెలికాప్టర్ ఘటన నిజం కాకపోతే ఎంతబావుండునో అని అన్నారు.
Source: ఏపీ న్యూస్ | 25 Sep 2009 | 3:59 am

జగన్‌కు సీఎం సీటు దక్కుగాక!! మూడు మత పెద్దల దీవెనలు

దివంగత మాజీముఖ్యమంత్రి తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి దక్కాలని హిందూ, ముస్లిం, క్రైస్తవ మతపెద్దలు దీవెనలు అందించారు. జగన్‌కు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టాలన్నప్పుడు ప్రజల నుంచి విశేష స్పందన కనిపించింది.
Source: ఏపీ న్యూస్ | 25 Sep 2009 | 3:17 am