గోపిచంద్, త్రిషల "శంఖం" ట్రైలర్ మీ కోసం..

గోపీచంద్, త్రిష జంటగా శివ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న "శంఖం" చిత్రం మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇటీవలే విడుదలైన ఈ సినిమాను శ్రీబాలాజీ సినీ మీడియా పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారెడ్డి సంయుక్తంగా నిర్మించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 25 Sep 2009 | 9:50 am

"ఈనాడు" సినిమా ట్రైలర్‌ను తిలకించండి

మనిషిలో రెండు కోణాలుంటాయి. అలా ఓ సగటుజీవి ఉండే రెండో కోణంతో సమాజశ్రేయస్సుకై ఎంతకైనా తెగిస్తాడు? అనే పాయింట్‌తో "ఈనాడు" సినిమా తెరకెక్కింది. వైవిధ్యమైన సినిమాలతో ఏదో కొత్తదనాన్ని తన పాత్రల ద్వారా ప్రేక్షకులకు చూపించాలని పరితపించే పద్మభూషణ్ కమల్ హాసన్.. తాజాగా సామాజిక పరిస్థితులకు అద్దంపట్టే కథాంశంతో "ఈనాడు" చిత్రాన్ని రూపొందించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 25 Sep 2009 | 9:40 am

జాతి వివక్ష: చట్ట సవరణలు చేసిన ఆస్ట్రేలియా

విదేశీ విద్యార్థులకు సురక్షిత వాతావరణం, పటిష్ట భద్రత కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్ర ప్రధానమంత్రి జాన్ బ్రుంబై హామీ ఇచ్చారు. భారత్‌పాటు, ఇక్కడకు వచ్చి ఉంటున్న విదేశీ విద్యార్థులరికీ సురక్షిత వాతావరణం నెలకొల్పుతామని తెలిపారు. ఇందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు.
Source: Yahoo! Telugu: News | 25 Sep 2009 | 9:28 am

మా నాన్న ఆశయాలు నెరవేరుద్దాం : జగన్

దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైఎస్.జగన్ నల్లకాల్వ వద్ద ఏర్పాటు చేసిన సంస్మరణ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ... తన తండ్రిని బలి తీసుకున్న హెలికాప్టర్ ఘటన నిజం కాకపోతే ఎంతబావుండునో అని అన్నారు.
Source: Yahoo! Telugu: News | 25 Sep 2009 | 9:24 am

"బాణం" సినిమా ట్రైలర్ మీ కోసం..

మాజీ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడి తనయుడు నారా రోహిత్ 'బాణం' చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయమైన సంగతి తెలిసిందే.అశ్వనీదత్ కుమార్తెలు నిర్మాణం చేతబట్టి 'త్రీ ఎంజెల్స్' పతాకంపై రూపొందించిన ఈ మొదటి చిత్రం థియేటర్లరో ప్రేక్షకులను అలరిస్తోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 25 Sep 2009 | 9:24 am

మళ్లీ బలహీనంగా స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్ మళ్లీ బలహీనపడటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 85 పాయింట్లు కోల్పోయి 16,696 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 30 పాయింట్లు నష్టపోయి 4,956 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.51 శాతం, నిఫ్టీ 0.61 శాతం మేరకు బలహీనపడ్డాయి.
Source: Yahoo! Telugu: News | 25 Sep 2009 | 9:19 am

"కామిక్" సినిమాగా "క్విక్ గన్ మురుగన్"

నటీనటులు: డా.రాజేంద్రప్రసాద్, రంభ, నాజర్, రాజుసుందరం తదితరులు. దర్శకత్వం: శశాంక్ ఘోష్, ఈ సినిమాను కేవలం మామూలు సినిమా అనుకుంటే పొరపాటే. ప్రముఖ మ్యూజిక్ ఛానల్ "వి"లో చాలారోజులు ప్రసారమవుతోన్న ఓ కామిక్ పాత్రకు తెరరూపమే "క్విక్ గన్ మురుగన్". ఇందులో పాత్రల తీరు, పేర్లు విచిత్రంగా ఉంటాయి. చిత్ర నిడివి కూడా చాలా తక్కువే. కౌబాయ్‌లుండే కాలానికి అనుగుణంగా ఓ ఊరిలో సెట్‌వేసి తీశారు. శాఖాహారులకు, మాంసాహారులకు మధ్య పోరే ఈ చిత్రంలోని కీలకమైన పాయింట్. దాన్ని కాస్త వెటకారంగానూ, కారంగానూ చూపించారు. ఇక కథలోకి వెళితే.. కౌబాయ్ క్విక్‌గన్ మురుగన్ (రాజేంద్రప్రసాద్) శాఖాహారులను ప్రోత్సహిస్తుంటారు. గోరక్షణ, స్త్రీలను గౌరవించడం అతని విధి. అందరూ రకరకాలుగా ఉద్యోగాలు చేస్తుంటే.. తాను చెడుపై పోరాటం చేసే ఉద్యోగాన్ని చేస్తున్నానంటాడు. మంచి చేయాలంటే చెడ్డవారితో పోరాడాలనేది అతని తత్త్వం. ఇలాంటి వ్యక్తి మాంసాహారం ప్రోత్సహించే వ్యక్తికి బలై, చనిపోయిన తర్వాత ఎలా ఆ వ్య.క్తిని అంతమొందించాడన్నదే సినిమా.
Source: Yahoo! Telugu: Entertainment | 25 Sep 2009 | 8:54 am

జీఎమ్ ఇండియా, రేవాల మధ్య కుదిరిన ఒప్పందం

జనరల్ మోటార్స్ ఇండియా, రేవా ఎలక్ట్రిక్ కార్ల కంపెనీల మధ్య దేశీయ కార్ల నిర్మాణరంగంలో ఎలక్ట్రిక్ కార్ల తయారీకిగాను ఓ ఒప్పందం జరిగింది. వాహనాలను నడిపే ఇంధన వాడకాన్ని తగ్గించేందుకుగాను తమ రెండు సంస్థలు ఎలక్ట్రానిక్ కార్ల నిర్మాణాన్ని రూపొందించాలనుకున్నట్లు జీఎమ్ ఇండియా అధ్యక్షుడు, మేనేజింగ్ డైరెక్టర్ కార్ల్ స్లిమ్ తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 25 Sep 2009 | 8:54 am

జగన్‌కు సీఎం సీటు దక్కుగాక!! మూడు మత పెద్దల దీవెనలు

దివంగత మాజీముఖ్యమంత్రి తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి దక్కాలని హిందూ, ముస్లిం, క్రైస్తవ మతపెద్దలు దీవెనలు అందించారు. జగన్‌కు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టాలన్నప్పుడు ప్రజల నుంచి విశేష స్పందన కనిపించింది.
Source: Yahoo! Telugu: News | 25 Sep 2009 | 8:45 am

100 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్

స్టాక్ మార్కెట్ ప్రస్తుతం 100 పాయింట్లు కోల్పోవడంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 16,691 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 30 పాయింట్లు నష్టపోయి 4,957 వద్ద పయనిస్తోంది. ఇప్పటి వరకు మొత్తం 2,732 కంపెనీల వాటాలు ట్రేడ్ అవగా, 1,515 కంపెనీల వాటాలు లాభపడ్డాయి. అలాగే 1,116 కంపెనీల వాటాలు నష్టపోయాయి.
Source: Yahoo! Telugu: News | 25 Sep 2009 | 8:23 am

మా ఎంఐపీ కూడా నీరు గుర్తించింది: ఇస్రో

చందమామపై నీటి జాడలను భారత్ పంపిన సొంత మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ (ఎంఐపీ) కూడా గుర్తించిందని ఇస్రో ఛైర్మన్ మాధవన్ నాయర్ శుక్రవారం వెల్లడించారు. చంద్రయాన్- 1లో 11 విదేశీ, స్వదేశీ పరికరాలను ఇస్రో చంద్రుడిపైకి పంపిన సంగతి తెలిసిందే. ఇప్పటికే చంద్రయాన్- 1లో చందమామపైకి వెళ్లిన నాసా పరికరం (ఎం3) నీటి జాడలు గుర్తించినట్లు వెల్లడైంది.
Source: Yahoo! Telugu: News | 25 Sep 2009 | 7:55 am

స్టాక్ మార్కెట్లో విస్తరిస్తున్న నష్టాలు

స్టాక్ మార్కెట్లో ప్రస్తుతం నష్టాలు మరింతగా విస్తరిస్తుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 128 పాయింట్లు కోల్పోయి 16,54 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 43 పాయింట్లు నష్టపోయి 4,943 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.76 శాతం, నిఫ్టీ 0.86 శాతం మేరకు క్షీణించాయి. ఇప్పటి వరకు మొత్తం 2,725 కంపెనీల వాటాలు ట్రేడ్ అవగా, 1,616 కంపెనీల వాటాలు లాభపడ్డాయి.
Source: Yahoo! Telugu: News | 25 Sep 2009 | 7:54 am

కింగ్స్ మధ్య క్వీన్ స్టోరీలా..? కాస్త కష్టమే..!!

పురుషాధిక్యసమాజం గల సినీ ఇండస్ట్రీలో పూర్థిస్థాయి అంటే... లేడి ఓరియెంటెడ్ సినిమాల్లో నటించడం మామూలు విషయం కాదని "బొమ్మరిల్లు" ముద్దుగుమ్మ జెనీలియా తేల్చి చెబుతోంది. టాలీవుడ్‌‌లో మనోరమ, మంత్ర వంటి లేడి ఓరియెంటెడ్ చిత్రాలు వస్తున్న ఈ సీజన్‌లో.. మొదటి నుంచి ఎక్కడున్నా నటిగా తనను తాను నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తానని హాసిని వెల్లడించింది. మనకంటూ గుర్తింపు వచ్చేంతవరకు ఎదురుచూడాల్సిందే తప్ప, ఇందులో ఎవరికి ఎవరూ పోటీకాదని జెన్నీ చెప్పింది. హిందీలో "జానే..తు" తర్వాత గుర్తింపు రావడంతోనే.. తెలుగులో గొప్పపేరు తెచ్చుకోవడం జరిగిందని జెనీలియా అంటోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 25 Sep 2009 | 7:26 am

బ్రౌన్‌తో సమావేశానికి నిరాకరించిన ఒబామా

బ్రిటన్ ప్రధాని గోర్డాన్ బ్రౌన్‌తో సమావేశమయ్యేందుకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నిరాకరించినట్లు తెలుస్తోంది. తనతో ద్వైపాక్షిక సమావేశానికి ఒబామా నిరాకరించినట్లు వచ్చిన కథనాలు గోర్డాన్ బ్రౌన్‌ను ఇరుకునపెడుతున్నాయి. బరాక్ ఒబామాతో ద్వైపాక్షిక సమావేశానికి బ్రిటన్ ఐదుసార్లు చేసిన విజ్ఞప్తులను ఒబామా తోసిపుచ్చినట్లు గురువారం కథనాలు వచ్చాయి.
Source: Yahoo! Telugu: News | 25 Sep 2009 | 7:26 am

అమెరికా, ఆసియా స్టాక్ మార్కెట్లు

అమెరికా మార్కెట్లు... బలహీన గృహ నివేదిక మరియు అధికారులు ఉద్ధీపన ప్యాకేజీలను ఉపసంహరించుకునే అవకాశం ఉందనే ఆందోళనలు వెరసి అమెరికా మార్కెట్లపై ప్రభావం చూపాయి. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ ఇండెక్స్- 41 పాయింట్లు కోల్పోయి 9,708 వద్దకు చేరుకుంది. నాస్‌డాక్ కంపోజిట్ ఇండెక్స్- 24 పాయింట్లు నష్టపోయి 2,108 వద్దకు చేరుకుంది. స్టాండార్డ్ అండ్ పూర్స్ 500 ఇండెక్స్ - 10 పాయింట్లు తగ్గి 1,051 వద్దకు చేరుకుంది. ఆసియా మార్కెట్లు... ఆసియా మార్కెట్లు రెడ్ మార్కులో పయనిస్తున్నాయి.. హాంగ్ సెంగ్- 118 పాయింట్లు క్షీణించి 20,933 వద్దకు చేరుకుంది. నిక్కీ- 2.5 శాతంతో 257 పాయింట్లు తగ్గి 10,287 వద్దకు చేరుకుంది. షాంఘై- 32 పాయింట్లు నష్టపోయి 2,822 వద్దకు చేరుకుంది. సియోల్ కంపోజిట్- 12 పాయింట్లు బలహీనపడి 1,682 వద్దకు చేరుకుంది.
Source: Yahoo! Telugu: News | 25 Sep 2009 | 7:21 am

మా నాన్న ఆశయాలు నెరవేరుద్దాం : జగన్

దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైఎస్.జగన్ నల్లకాల్వ వద్ద ఏర్పాటు చేసిన సంస్మరణ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ... తన తండ్రిని బలి తీసుకున్న హెలికాప్టర్ ఘటన నిజం కాకపోతే ఎంతబావుండునో అని అన్నారు.
Source: ఏపీ న్యూస్ | 25 Sep 2009 | 3:59 am

జగన్‌కు సీఎం సీటు దక్కుగాక!! మూడు మత పెద్దల దీవెనలు

దివంగత మాజీముఖ్యమంత్రి తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి దక్కాలని హిందూ, ముస్లిం, క్రైస్తవ మతపెద్దలు దీవెనలు అందించారు. జగన్‌కు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టాలన్నప్పుడు ప్రజల నుంచి విశేష స్పందన కనిపించింది.
Source: ఏపీ న్యూస్ | 25 Sep 2009 | 3:17 am

మా ఎంఐపీ కూడా నీరు గుర్తించింది: ఇస్రో

చందమామపై నీటి జాడలను భారత్ పంపిన సొంత మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ (ఎంఐపీ) కూడా గుర్తించిందని ఇస్రో ఛైర్మన్ మాధవన్ నాయర్ శుక్రవారం వెల్లడించారు. చంద్రయాన్- 1లో 11 విదేశీ, స్వదేశీ పరికరాలను ఇస్రో చంద్రుడిపైకి పంపిన సంగతి తెలిసిందే. ఇప్పటికే చంద్రయాన్- 1లో చందమామపైకి వెళ్లిన నాసా పరికరం (ఎం3) నీటి జాడలు గుర్తించినట్లు వెల్లడైంది.
Source: జాతీయ | 25 Sep 2009 | 2:26 am

యాసిడ్ దాడి చేస్తే.. మూడేళ్ల జైలుశిక్ష: సబితా ఇంద్రారెడ్డి

రాష్ట్రంలో మహిళలపై జరుగుతోన్న అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్న నేపథ్యంలో.. మహిళలపై యాసిడ్ దాడులకు పాల్పడేవారికి కఠినశిక్షలు తప్పవని రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి హెచ్చరించారు. యాసిడ్ దాడి చేసేవారికి కనీసం మూడేళ్ల జైలుశిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 25 Sep 2009 | 1:32 am

విజయవాడలో పర్యటించనున్న ముఖ్యమంత్రి

రాష్ట్ర ముఖ్యమంత్రి కే రోశయ్య శుక్రవారం విజయవాడలో పర్యటించనున్నారు. శరన్నవరాత్రుల్లో భాగంగా.. ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గమ్మ తల్లిని ముఖ్యమంత్రి దర్శించుకోనున్నారు. దివంగత మహానేత, ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి స్థానంలో సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తోన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మూలానక్షత్రం రోజున (నేడు) విజయవాడ కనకదుర్గమ్మ తల్లిని దర్శించుకోనున్నారు.
Source: ఏపీ న్యూస్ | 25 Sep 2009 | 1:00 am

నల్లకాల్వ వద్ద వైఎస్ జగన్ బహిరంగ సభ

కాంగ్రెస్ యువ నాయకుడు, ఎంపీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన తండ్రి మాజీముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి నల్లమలలోని పావురాలగుట్ట వద్ద నివాళులు అర్పించారు. అనంతరం నల్లకాల్వ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.
Source: ఏపీ న్యూస్ | 25 Sep 2009 | 12:58 am

చంద్రయాన్- 1: ఇస్రోకి నాసా అభినందనలు

భారత్ తొలిసారి చంద్రుడిపైకి పంపిన అంతరిక్ష నౌక (చంద్రయాన్- 1) అక్కడ నీటి జాడలు గుర్తించినట్లు అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం (నాసా) గురువారం ప్రకటించింది. చందమామపై నీటి జాడలు గుర్తించడం వెనుక ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ) కృషిని విస్మరించలేమని నాసా శాస్త్రవేత్తలు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
Source: జాతీయ | 25 Sep 2009 | 12:33 am

స్వైన్ ఫ్లూ: మరో 283 కొత్త కేసులు నమోదు

దేశంలో స్వైన్ ఫ్లూ వ్యాధి ప్రమాదకరంగా పరిణమిస్తోంది. తాజాగా మరో తొమ్మిది మంది స్వైన్ ఫ్లూ వైరస్ బారినపడి మృతి చెందారు. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా మరో 283 కొత్త స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. పూణే సమీపంలోని యెరవాడా కేంద్ర కారాగారంలో ఓ ఖైదీ స్వైన్ ఫ్లూతో మరణించినట్లు తెలుస్తోంది.
Source: జాతీయ | 25 Sep 2009 | 12:31 am

బాల్కో నగర్ ప్రమాదం: 18కి చేరిన మృతులు

చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కోర్బాలో నిర్మాణంలో ఉన్న విద్యుత్ ప్లాంటులో చిమ్మీ కూలిపోయిన ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 18కి పెరిగింది. అల్యూమినియం తయారీ సంస్థ బాల్కో ఈ విద్యుత్ ప్లాంటును నిర్మిస్తోంది. మరోవైపు బాల్కో నగర్‌లో చిమ్నీ కూలిపోయిన ప్రమాదంలో వంద మంది వరకు కూలీలు మృతి చెందివుండవచ్చని సీఐటీయూ అనుమానం వ్యక్తం చేస్తోంది.
Source: జాతీయ | 25 Sep 2009 | 12:03 am

"యంగ్ ఇండియా"ను యజ్ఞంలా చేస్తున్నాం: దాసరి

ఏడు సంవత్సరాల తర్వాత మళ్లీ తాను దర్శకత్వం వహిస్తోన్న "యంగ్ ఇండియా" అన్ని తరగతుల వారిని దృష్టిలో వుంచుకుని చిత్రీకరిస్తున్నట్లు తెలిపారు. కొన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ మన తెలుగు చిత్ర పరిశ్రమకి కొత్తవారిని పరిచయం చెయ్యాలనే ఆకాంక్షతో ఎంతో శ్రమపడి మంచి కథను తయారు చేయడం జరిగింది. ఈ చిత్రంలో హీరో, హీరోయిన్‌లనే కాకుండా, సపోర్టింగ్ ఆర్టిస్టులను స్క్రీన్‌ప్లేలో వచ్చే మొత్తం ఆర్టిస్టులను కొత్తవాళ్లనే పరిచయం చేయాలన్న ఉద్దేశంతో ఓ యజ్ఞానికి శ్రీకారం చుడితే, కొన్ని వేలమంది కొత్తవారి తమకు అవకాశం ఇవ్వమని అప్లికేషన్స్ పంపారు. వాటిని ఎన్నిక చేసి అందులోంచి కొందరిని సెలక్ట్ చేసి "యంగ్ ఇండియా" కోసం వారికి శిక్షణ ఇస్తున్నామని దాసరి చెప్పారు.
Source: Yahoo! Telugu: Entertainment | 24 Sep 2009 | 12:36 pm

"గణేష్" (జస్ట్).. ఓ సిల్లీ సినిమా మాత్రమే..!

దేవదాస్ తర్వాత రామ్ నటించిన చిత్రం "రెడీ". ఈ రెండు చిత్రాల్లో ఈజీ, ఫాస్ట్ నటుడిగా రామ్ గుర్తింపు పొందాడు. రవికిషోర్ బేనర్‌నుంచి వచ్చిన రెండో చిత్రమిది. "గణేష్"కు జస్ట్ గణేష్ అనే టాగ్‌లైన్‌కూడా పెట్టారు. ఎందుకంటే..? రామ్ (గణేష్) నవతరం అభిరుచులున్న యువకుడు. అలాగే ఈ సినిమాకూడా "జస్ట్" సినిమాగే ఉంటుంది. రొటీన్ ఫార్మూలాలకు భిన్నంగా 26మంది పిల్లలతో ఎంటర్‌టైన్ చేయిస్తూ సాగతీతగా దర్శకుడు శరవణనన్ తెరకెక్కించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 24 Sep 2009 | 11:17 am

పావురాలగుట్ట వద్ద జగన్ బహిరంగ సభ

ప్రజా నాయకుడు మాజీముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మృతి చెందిన నల్లమలలోని పావురాలగుట్ట ప్రాంతాన్ని సందర్శించేందుకు వైఎస్ జగన్ 25వ తేదీ.... అంటే రేపు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా అక్కడ భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. పావురాలగుట్ట వద్దకు వైఎస్ జగన్ వస్తున్నారని తెలుసుకున్న కార్యకర్తలు వేల సంఖ్యలో స్వచ్ఛందంగా తరలిరానున్నట్లు సమచారం.
Source: ఏపీ న్యూస్ | 24 Sep 2009 | 10:31 am

నేనుండగా.. నువ్వెందుకు..?: కాజల్‌పై చిందులేసిన ఛార్మి

ఏ రంగంలోనైనా ప్రొఫెషనల్ జెలసీ కామనే. సినిమా, రాజకీయ రంగాల్లో అసూయ మరీ ఎక్కువ. సినీ హీరోయిన్ల సంగతి కొస్తే.. అబ్బో ఒకరిపై ఒకరికి.. అందాలు, రెమ్యునరేష్, ఆఫర్లపై ఈర్ష్య పడుతూ ఉంటారు. కానీ బయటికి మాత్రం చూపించుకోరు. కానీ అందాల ముద్దుగుమ్మ ఛార్మి కాజల్‌పై ఓ ఫంక్షన్‌లో ఆక్రోశం వ్యక్తం చేసిందట. అసలు కారణమేమిటంటే..? గతంలో బిగ్-సి అనే సెల్‌ఫోన్‌కు ఛార్మి అంబాసిడర్‌గా ఉండేది. అప్పటికి ఛార్మి, వెంకటేష్, నాగార్జున చిత్రాల్లో కొద్దిగా బిజీగా ఉండేది. ఆ టైమ్‌లో రెమ్యునరేషన్ కూడా పెంచడంతో బిగ్-సి వారు ఛార్మిని పెండింగ్‌లో పెట్టారు. ఈ నేపథ్యంలో "చందమామ"తో గుడ్‌లుక్ ఉన్న కాజల్‌కు ఇటీవలే "మగధీర" హిట్ కావడంతో బిగ్-సి వారు కాజల్‌ను సంప్రదించారు. వెంటనే కాజల్ వారు చెప్పినమాటకు ఒప్పేసుకుని గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దాంతో కాజల్ బిగ్-సి యాడ్స్ కంటెన్యూగా చేస్తోంది. దీంతో ఆవేశానికి గురైన ఛార్మి.. తానుండగా నువ్వెందుకని ఓ ఫంక్షన్‌లో కాజల్‌పై ఆక్రోశం వ్యక్తం చేసిందట.
Source: Yahoo! Telugu: Entertainment | 24 Sep 2009 | 9:30 am

అమెరికా స్టయిల్ జీతాలు కావాలంటే కుదరదు: సిబాల్

ఐఐటీ ప్రొఫెసర్లు తమ జీతాలను పెంచాలంటూ సమ్మెకు దిగటంపై కేంద్ర మానవ వనరుల శాఖామంత్రి కపిల్ సిబాల్ మాట్లాడుతూ, " అమెరికా స్టైల్ జీతాలు కావాలంటే కుదరదని తెగేసి చెప్పారు. జీతాలు అంశం కాక మిగిలిన ఎటువంటి అభ్యర్థలనకైనా సానుకూలమైన నిర్ణయాలు తీసుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.
Source: జాతీయ | 24 Sep 2009 | 7:52 am

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తున్న కాంబ్లీ

క్రికెట్ ప్రపంచంలో ఓ వెలుగు వెలిగిన మాజీ క్రికెటర్‌ వినోద్‌ కాంబ్లీ గురువారంనాడు రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అక్టోబర్ నెలలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన విబ్రోలి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.
Source: జాతీయ | 24 Sep 2009 | 7:03 am

కంగారూల "పగడాల దీవి"లో వాలిపోదామా...?!

చుట్టూ గంభీరమైన సముద్రం, కాల ప్రవాహంతో తమకేమీ సంబంధం లేదన్నట్లుగా ఉండే పర్వత శ్రేణులూ, కమ్మటి వాసనలతో మత్తెక్కించే యూకలిప్టస్ చెట్లూ, వాటి కొమ్మల్ని కరచుకుని నిద్రపోతూ ముద్దొచ్చే పక్షులు, భూదేవి నొసటన ఎర్రటి కుంకుమలా ఉండే ఇసుక, గాలి చప్పుడు తప్పిస్తే ఏ విధమైన సవ్వడీ లేని నిశ్శబ్దం.... వెరసీ ఆస్ట్రేలియా ఖండం.
Source: వినోదం | 24 Sep 2009 | 6:48 am

రాహుల్ ఆకస్మిక పర్యటనలపై యూపీ సీరియస్

కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ ఆకస్మిక పర్యటనలతో యూపీ ప్రభుత్వానికి తలనొప్పి తెప్పిస్తున్నాడు. రాష్ట్రానికి ఆకస్మిక పర్యటనలు నిర్వహిస్తున్న రాహుల్ గాంధీకి భద్రత సమకూర్చడం యూపీ యంత్రాంగానికి సమస్యగా మారుతోంది. భద్రతా నిబంధనలు పాటించకుండా రాహుల్ పదేపదే యూపీలో పర్యటిస్తుండటంపై యూపీ ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేయాలనుకుంటోంది.
Source: జాతీయ | 24 Sep 2009 | 6:32 am

పైలెట్లకు ప్రతికూల వాతావరణం ముందే తెలుసా...!

కీర్తిశేషులు, వై.ఎస్. రాజశేఖరరెడ్డి ఈ నెల రెండవ తేదీన ప్రయాణించిన హెలికాప్టర్ పైలెట్లకు ప్రతికూల వాతావరణం గురించి ముందుగానే తెలుసునని అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎప్ఏఏ) చేపట్టిన విచారణలో వెల్లడైంది.
Source: ఏపీ న్యూస్ | 24 Sep 2009 | 6:29 am

విడుదలకు సిద్ధమవుతోన్న జెనీలియా "కథ"

శ్రీనివాస్ రాగ దర్శకత్వంలో, గుణ్ణం గంగరాజు నిర్మిస్తోన్న ఈ చిత్రం విభిన్న కథాంశంతో తెరకెక్కనుంది. త్వరలో ఆడియోను విడుదలచేస్తామని చిత్ర నిర్మాత చెప్పారు.
Source: Yahoo! Telugu: Entertainment | 24 Sep 2009 | 6:20 am

మేకప్‌కంటే ఒరిజినాలిటీకే ప్రాధాన్యత: సంజన

మొహానికి రంగులు పూసుకోవడం.. అనేది తనకు తగనిదని, పరిమతం మేరకే మేకప్ వేసుకుంటానని నటి సంజన అంటోంది. తాజాగా బ్యూటీ హీరో రాజాతో కలిసి "సమర్థుడు"లో నటించింది. తాను మేకప్‌కంటే ఒరిజినాలిటీకి అధిక ప్రాధాన్యత ఇస్తానని చెబుతోంది. ఎక్కువగా నీళ్ళుతాగుతానని, కొబ్బరిబొండాలు, పళ్లరసాలు సేవిస్తానని చెబుతోన్న ఈ బ్యూటీ గర్ల్ సంజన బుధవారం ఓ ఫంక్షన్‌లో హాజరైంది. ఈ సందర్భంగా మేకప్ టిప్స్ గురించి సంజన ఇలా చెప్పుకొచ్చింది. విదేశీ నటీమణులు ఎక్కువగా మేకప్ వేసుకోరని, సహజత్వానికే ముఖ్యత్వం ఇస్తారంది. రాజాతో ప్రేమాయణం కొనసాగిస్తున్న వార్తలపై సంజన స్పందిస్తూ.. రాజాతో ప్రేమా..? అటువంటిది ఏమీ లేదని, ఎప్పుడు చాలా సరదాగా ఉంటాడని, తనతో నటించే హీరోయిన్లపై ఆయన శ్రద్ధ తీసుకుంటాడని తెలిపింది.
Source: Yahoo! Telugu: Entertainment | 24 Sep 2009 | 5:41 am

200 కిలోటన్నుల అణు శక్తి సృష్టిస్తాం: భారత్

భారత్ 1998లో హైడ్రోజన్ బాంబు పరీక్షపై నెలకొన్న అనుమానాలను జాతీయ అణు శక్తి కమిషన్ ఛైర్మన్ అనిల్ కకోడ్కర్ తోసిపుచ్చారు. భారత అణు సామర్థ్యంపై ఎటువంటి సందేహాలు అవసరం లేదని స్పష్టం చేశారు. భారత శాస్త్రవేత్తలు 200 కిలోటన్నుల అణు విస్ఫోటనాన్ని సృష్టించిగల సామర్థ్యాన్ని దేశానికి ఆర్జించిపెట్టారని, ఈ దిశగా వారు సఫలీకృతులయ్యారని స్పష్టం చేశారు.
Source: జాతీయ | 24 Sep 2009 | 4:55 am

నేనుండగా.. నువ్వెందుకు..?: కాజల్‌పై చిందులేసిన ఛార్మి

ఏ రంగంలోనైనా ప్రొఫెషనల్ జెలసీ కామనే. సినిమా, రాజకీయ రంగాల్లో అసూయ మరీ ఎక్కువ. సినీ హీరోయిన్ల సంగతి కొస్తే.. అబ్బో ఒకరిపై ఒకరికి.. అందాలు, రెమ్యునరేష్, ఆఫర్లపై ఈర్ష్య పడుతూ ఉంటారు. కానీ బయటికి మాత్రం చూపించుకోరు. కానీ అందాల ముద్దుగుమ్మ ఛార్మి కాజల్‌పై ఓ ఫంక్షన్‌లో ఆక్రోశం వ్యక్తం చేసిందట. అసలు కారణమేమిటంటే..?
Source: వినోదం | 24 Sep 2009 | 4:02 am

ఆత్మకూరులో వైఎస్ స్మృతి వనం: మంత్రి మండలి

దివంగత మహానేత వై.ఎస్. రాజశేఖర రెడ్డి స్మృతి వనాన్ని నిర్మించాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది. కర్నూలు జిల్లా ఆత్మకూరులోని నల్లకాలువ సమీపంలో ఈ స్మృతి వనాన్ని నిర్మించాలని మంత్రి మండలి తీర్మానించింది.
Source: ఏపీ న్యూస్ | 24 Sep 2009 | 3:25 am