|
నేనుండగా.. నువ్వెందుకు..?: కాజల్‌పై చిందులేసిన ఛార్మిఏ రంగంలోనైనా ప్రొఫెషనల్ జెలసీ కామనే. సినిమా, రాజకీయ రంగాల్లో అసూయ మరీ ఎక్కువ. సినీ హీరోయిన్ల సంగతి కొస్తే.. అబ్బో ఒకరిపై ఒకరికి.. అందాలు, రెమ్యునరేష్, ఆఫర్లపై ఈర్ష్య పడుతూ ఉంటారు. కానీ బయటికి మాత్రం చూపించుకోరు. కానీ అందాల ముద్దుగుమ్మ ఛార్మి కాజల్‌పై ఓ ఫంక్షన్‌లో ఆక్రోశం వ్యక్తం చేసిందట. అసలు కారణమేమిటంటే..? గతంలో బిగ్-సి అనే సెల్‌ఫోన్‌కు ఛార్మి అంబాసిడర్‌గా ఉండేది. అప్పటికి ఛార్మి, వెంకటేష్, నాగార్జున చిత్రాల్లో కొద్దిగా బిజీగా ఉండేది. ఆ టైమ్‌లో రెమ్యునరేషన్ కూడా పెంచడంతో బిగ్-సి వారు ఛార్మిని పెండింగ్‌లో పెట్టారు. ఈ నేపథ్యంలో "చందమామ"తో గుడ్‌లుక్ ఉన్న కాజల్‌కు ఇటీవలే "మగధీర" హిట్ కావడంతో బిగ్-సి వారు కాజల్‌ను సంప్రదించారు. వెంటనే కాజల్ వారు చెప్పినమాటకు ఒప్పేసుకుని గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దాంతో కాజల్ బిగ్-సి యాడ్స్ కంటెన్యూగా చేస్తోంది. దీంతో ఆవేశానికి గురైన ఛార్మి.. తానుండగా నువ్వెందుకని ఓ ఫంక్షన్‌లో కాజల్‌పై ఆక్రోశం వ్యక్తం చేసిందట.Source: Yahoo! Telugu: Entertainment | 24 Sep 2009 | 9:30 am నష్టాల నుంచి లాభాల్లోకి స్టాక్ మార్కెట్స్టాక్ మార్కెట్ ప్రస్తుతం నష్టాల నుంచి లాభాల్లోకి ప్రవేశించడంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 45 పాయింట్లు పుంజుకుని 16,764 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 11 పాయింట్లు లాభపడి 4,981 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.27 శాతం, నిఫ్టీ 0.23 శాతం మేరకు వృద్ధి చెందాయి.Source: Yahoo! Telugu: News | 24 Sep 2009 | 9:17 am 0.37శాతం పెరిగిన ద్రవ్యోల్బణంప్రస్తుతం దేశంలో నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణం సెప్టెంబర్ 12కు ముగిసిన వారాంతానికి 0.37శాతానికి చేరుకుంది. అదే అంతకు మునుపు వారాంతానికి ద్రవ్యోల్బణం 0.12శాతంగా ఉండింది. నిత్యావసర సరుకుల ధరలు నిరుడు ఇదే కాలానికి పోలిస్తే 12.42శాతంగా ఉండింది.Source: Yahoo! Telugu: News | 24 Sep 2009 | 9:16 am ఇరాన్‌పై కొత్త ఆంక్షలు: అమెరికా, రష్యా దృష్టిఇరాన్ అణు వివాదాన్ని దౌత్యమార్గాల ద్వారా పరిష్కరించాలని అమెరికా, రష్యాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. అయితే ఇరాన్ స్పందించకుండా ఉంటే కొత్త ఆంక్షలను కూడా పరిశీలించాలని నిర్ణయించాయి. రష్యా అధ్యక్షుడు ద్మిత్రీ మెద్వెదెవ్, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మధ్య జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.Source: Yahoo! Telugu: News | 24 Sep 2009 | 9:01 am ఆత్మకూరులో వైఎస్ స్మృతి వనం: మంత్రి మండలిదివంగత మహానేత వై.ఎస్. రాజశేఖర రెడ్డి స్మృతి వనాన్ని నిర్మించాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది. కర్నూలు జిల్లా ఆత్మకూరులోని నల్లకాలువ సమీపంలో ఈ స్మృతి వనాన్ని నిర్మించాలని మంత్రి మండలి తీర్మానించింది.Source: Yahoo! Telugu: News | 24 Sep 2009 | 8:54 am 105 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్స్టాక్ మార్కెట్ 105 పాయింట్లు కోల్పోవడంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 16,614 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 29 పాయింట్లు నష్టపోయి 4,941 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.63 శాతం, నిఫ్టీ 0.59 శాతం మేరకు క్షీణించాయి. బీఎస్ఈ మధ్య తరహా ఇండెక్స్ 0.27 శాతం, బీఎస్ఈ చిన్న తరహా ఇండెక్స్ 0.20 శాతం మేరకు బలహీనపడ్డాయి.Source: Yahoo! Telugu: News | 24 Sep 2009 | 8:28 am మళ్లీ బలహీనంగా స్టాక్ మార్కెట్లుస్టాక్ మార్కెట్ మళ్లీ బలహీనపడ్డాయి. దీంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 130 పాయింట్లు కోల్పోయి 16,590 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 38 పాయింట్లు నష్టపోయి 4,932 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.78 శాతం, నిఫ్టీ 0.76 శాతం మేరకు క్షీణించాయి.Source: Yahoo! Telugu: News | 24 Sep 2009 | 8:00 am జిల్లాలకు పాకుతున్న జగన్ మోహన్ "రాగం"వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టేంత వరకూ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించేది లేదని పలు జిల్లాలకు చెందిన కాంగ్రెస్ నేతలు పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ కు తెగేసి చెపుతున్నారు. జగన్ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత మాత్రమే తిరిగి తాము సభ్యత్వ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెపుతున్నారు.Source: Yahoo! Telugu: News | 24 Sep 2009 | 7:54 am ఎన్జీ రంగా యూనివర్శిటీ: రెండో దశ కౌన్సెలింగ్బీఎస్సీ అగ్రికల్చర్, సీఏ అండ్ బీఎం, బీటెక్ ఫుడ్‌సైన్స్, బీఎఫ్ఎస్సీ, బీఎస్సీ (హానర్స్) హర్టికల్చర్ కోర్సుల్లో ప్రవేశం కోరు అభ్యర్థుల కోసం ఎన్జీ రంగా యూనివర్శిటీ రెండో దశ కౌన్సెలింగ్‌కు ఆహ్వానం కోరుతూ ప్రకటన జారీ చేసింది. అభ్యర్థులకు కౌన్సెలింగ్ హైదరాబాద్‌లో ఎన్జీ రంగా కాలేజ్ ఆఫ్ హోమ్ సైన్స్ ఆడిటోరియంలో ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది.Source: Yahoo! Telugu: News | 24 Sep 2009 | 7:50 am 26 నుంచి రైతు మహాసభలు: రామకృష్ణవిజయవాడలో ఈ నెల 26 నుంచి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మహాసభలు ప్రారంభం కానున్నాయని రైతు సంఘం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ ప్రకటించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ మహాసభలకు సంబంధించిన పోస్టర్లను రామకృష్ణ తిరుపతిలో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాల జాబితాలో వరదయ్యపాళెం, బుచ్చినాయుడుకండ్రిగ, కెవీబీపురం లేకపోవడం దురదృష్టకరమని రామకృష్ణ అన్నారు.Source: Yahoo! Telugu: News | 24 Sep 2009 | 7:40 am ఎన్‌టీపీసీ, ఆర్ఐఎల్‌ల మధ్య కుదిరిన ఒప్పందందేశీయ విద్యుత్ ఉత్పత్తి రంగంలో అగ్రామిగానున్న ఎన్‌టీపీసీకి, అంబానీ సోదరులలో ఒకరైన ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్‌ల మధ్య ఒప్పందం కుదిరింది.Source: Yahoo! Telugu: News | 24 Sep 2009 | 7:30 am విడుదలకు సిద్ధమవుతోన్న జెనీలియా "కథ"శ్రీనివాస్ రాగ దర్శకత్వంలో, గుణ్ణం గంగరాజు నిర్మిస్తోన్న ఈ చిత్రం విభిన్న కథాంశంతో తెరకెక్కనుంది. త్వరలో ఆడియోను విడుదలచేస్తామని చిత్ర నిర్మాత చెప్పారు.Source: Yahoo! Telugu: Entertainment | 24 Sep 2009 | 6:20 am మేకప్‌కంటే ఒరిజినాలిటీకే ప్రాధాన్యత: సంజనమొహానికి రంగులు పూసుకోవడం.. అనేది తనకు తగనిదని, పరిమతం మేరకే మేకప్ వేసుకుంటానని నటి సంజన అంటోంది. తాజాగా బ్యూటీ హీరో రాజాతో కలిసి "సమర్థుడు"లో నటించింది. తాను మేకప్‌కంటే ఒరిజినాలిటీకి అధిక ప్రాధాన్యత ఇస్తానని చెబుతోంది. ఎక్కువగా నీళ్ళుతాగుతానని, కొబ్బరిబొండాలు, పళ్లరసాలు సేవిస్తానని చెబుతోన్న ఈ బ్యూటీ గర్ల్ సంజన బుధవారం ఓ ఫంక్షన్‌లో హాజరైంది. ఈ సందర్భంగా మేకప్ టిప్స్ గురించి సంజన ఇలా చెప్పుకొచ్చింది. విదేశీ నటీమణులు ఎక్కువగా మేకప్ వేసుకోరని, సహజత్వానికే ముఖ్యత్వం ఇస్తారంది. రాజాతో ప్రేమాయణం కొనసాగిస్తున్న వార్తలపై సంజన స్పందిస్తూ.. రాజాతో ప్రేమా..? అటువంటిది ఏమీ లేదని, ఎప్పుడు చాలా సరదాగా ఉంటాడని, తనతో నటించే హీరోయిన్లపై ఆయన శ్రద్ధ తీసుకుంటాడని తెలిపింది.Source: Yahoo! Telugu: Entertainment | 24 Sep 2009 | 5:41 am నేనుండగా.. నువ్వెందుకు..?: కాజల్‌పై చిందులేసిన ఛార్మిఏ రంగంలోనైనా ప్రొఫెషనల్ జెలసీ కామనే. సినిమా, రాజకీయ రంగాల్లో అసూయ మరీ ఎక్కువ. సినీ హీరోయిన్ల సంగతి కొస్తే.. అబ్బో ఒకరిపై ఒకరికి.. అందాలు, రెమ్యునరేష్, ఆఫర్లపై ఈర్ష్య పడుతూ ఉంటారు. కానీ బయటికి మాత్రం చూపించుకోరు. కానీ అందాల ముద్దుగుమ్మ ఛార్మి కాజల్‌పై ఓ ఫంక్షన్‌లో ఆక్రోశం వ్యక్తం చేసిందట. అసలు కారణమేమిటంటే..?Source: వినోదం | 24 Sep 2009 | 4:02 am ఆత్మకూరులో వైఎస్ స్మృతి వనం: మంత్రి మండలిదివంగత మహానేత వై.ఎస్. రాజశేఖర రెడ్డి స్మృతి వనాన్ని నిర్మించాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది. కర్నూలు జిల్లా ఆత్మకూరులోని నల్లకాలువ సమీపంలో ఈ స్మృతి వనాన్ని నిర్మించాలని మంత్రి మండలి తీర్మానించింది.Source: ఏపీ న్యూస్ | 24 Sep 2009 | 3:25 am జిల్లాలకు పాకుతున్న జగన్ మోహన్ "రాగం"వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టేంత వరకూ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించేది లేదని పలు జిల్లాలకు చెందిన కాంగ్రెస్ నేతలు పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ కు తెగేసి చెపుతున్నారు. జగన్ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత మాత్రమే తిరిగి తాము సభ్యత్వ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెపుతున్నారు.Source: ఏపీ న్యూస్ | 24 Sep 2009 | 2:37 am 26 నుంచి రైతు మహాసభలు: రామకృష్ణవిజయవాడలో ఈ నెల 26 నుంచి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మహాసభలు ప్రారంభం కానున్నాయని రైతు సంఘం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ ప్రకటించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ మహాసభలకు సంబంధించిన పోస్టర్లను రామకృష్ణ తిరుపతిలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాల జాబితాలో వరదయ్యపాళెం, బుచ్చినాయుడుకండ్రిగ, కెవీబీపురం లేకపోవడం దురదృష్టకరమని రామకృష్ణ అన్నారు.Source: ఏపీ న్యూస్ | 24 Sep 2009 | 2:37 am ధైర్యవంతులను అదృష్టం ఓడించిన వేళ...జమ్ము- కాశ్మీర్‌లో కరుడుగట్టిన తీవ్రవాదులతో పోరాటానికి సిద్ధమై వెళ్లిన హైదరాబాద్‌కు చెందిన ఆర్మీ మేజర్ జీఎస్ సూరి, సైనికుడు నాయిక్ కుషాల్‌లు ప్రాణాలు కోల్పోవడానికి అదృష్టంపాళ్లు వారికి తక్కువగా ఉండటమే ప్రధాన కారణం. ఓ ఇంటిలో తలదాచుకున్న ఇద్దరు పరారీలో ఉన్న తీవ్రవాదులను పట్టుకునేందుకు వీరిద్దరూ వెళ్లారు.Source: జాతీయ | 24 Sep 2009 | 1:59 am రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృతిరాష్ట్రంలోని రెండు జిల్లాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృతిచెందారు. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం, సత్యనారాయణపురం వద్ద జాతీయ రహదారిపై రెండు లారీలు ఢీకొన్న సంఘటనలో ముగ్గురు మరణించారు. ఈ ప్రమాదంలో మృతులను విశాఖ జిల్లా యలమంచిలికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.Source: ఏపీ న్యూస్ | 24 Sep 2009 | 1:36 am ఆరోగ్యశ్రీపై విమర్శించే హక్కు తెదేపాకు లేదు: పితానిదివంగత మహానేత వై.ఎస్. రాజశేఖర రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆరోగ్య శ్రీ పథకంపై తెలుగుదేశం పార్టీకి విమర్శించే హక్కు లేదని ఆ శాఖా మంత్రి పితాని సత్యనాయణ అన్నారు. ఆస్పత్రులు, వైద్యం, వైద్య సహాయం అంటే తెలుగుదేశం పార్టీ నాయకులకు తెలుసా అని పితాని ప్రశ్నించారు. కనీస పరిజ్ఞానం లేకుండా వైద్యపథకాలపై మాట్లాడటం తెదేపాకు తగదని మీడియా సమక్షంలో మంత్రి పితాని ఘాటుగా స్పందించారు.Source: ఏపీ న్యూస్ | 24 Sep 2009 | 1:19 am వేతన పెంపు కోసం ఐఐటీ అధ్యాపకుల నిరసనకేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ, ఐఐటీ యాజమాన్యాలు తమ డిమాండ్‌లకు అంగీకరించకపోవడంతో ప్రతిష్టాత్మక ఐఐటీ విద్యా సంస్థల అధ్యాపకులు గురువారం నిరాహార దీక్షకు దిగారు. వేతన పెంపును డిమాండ్ చేస్తూ ఐఐటీ అధ్యాపకులు నిరాహార దీక్ష చేపట్టడం ఇదే తొలిసారి. ఇప్పటికే ఐఐటీ అధ్యాపకులు తమ డిమాండ్‌ల పత్రాన్ని మానవ వనరుల శాఖకు అందజేశారు.Source: జాతీయ | 24 Sep 2009 | 12:33 am సమావేశమైన రాష్ట్ర క్యాబినెట్గురువారం ఉదయం రాష్ట్ర మంత్రి వర్గం సమావేశమైంది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి రోశయ్య ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశం సచివాలయంలో జరగుతోంది. ప్రస్తుతం వీరి సమావేశంలో ప్రధాన ఎజెండాగా చేనేత రుణాల మాఫీ, కరువు, స్వైన్‌ఫ్లూ, డెంగ్యూ తదితర అంశాలపై చర్చ జరగుతోంది.Source: ఏపీ న్యూస్ | 24 Sep 2009 | 12:28 am రాష్ట్ర కాంగ్రెస్‌లో సంక్షోభం: నారాయణరాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం నెలకొని ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. దివంగత మహానేత వై.ఎస్. రాజశేఖర రెడ్డి స్థానంలో సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టే వ్యక్తి ఎవరైనా పర్వాలేదని, ప్రజా సమస్యలపైనే తాము దృష్టి సారిస్తామని చెప్పారు. వైఎస్సార్ మరణించి ఇన్నాళ్లు గడిచినా అసెంబ్లీని ఏర్పాటు చేసి ఆయనకు నివాళి అర్పించేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ సాహసించలేదని నారాయణ వ్యాఖ్యానించారు.Source: ఏపీ న్యూస్ | 24 Sep 2009 | 12:27 am తీవ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉంది: నిర్మల్ వర్మభారత్కు తీవ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందని నౌకాదళ ప్రధానాధికారి అడ్మిరల్ నిర్మల్ వర్మ స్పష్టం చేశారు. తీవ్రవాదులు ఎప్పుడైనా దాడులకు తెగబడే అవకాశమున్నందున రక్షణ దళాలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన విశాఖపట్నంలో తెలిపారు. అంతేగాకుండా భారత్‌కు సముద్రాలవైపు నుంచి వచ్చిపడే ఉగ్రవాదుల ముప్పు ఇంకా తొలగిపోలేదని వర్మ స్పష్టం చేశారు.Source: ఏపీ న్యూస్ | 23 Sep 2009 | 11:49 pm బాల్కో నగర్ ప్రమాదం: 15 మంది దుర్మరణంభారత్ అల్యూమినియం కో లిమిటెడ్ (బాల్కో) నిర్మిస్తున్న చిమ్నీ కూలిపోవడంతో పది మంది దుర్మరణం చెందారు. మృతులందరూ నిర్మాణ ప్రదేశంలో పని చేస్తున్న కార్మికులేనని సంబంధిత వర్గాలు తెలిపాయి. చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కోబ్రాలో బాల్కో విద్యుత్ ప్లాంటును నిర్మిస్తోంది. ఇందులో నిర్మాణంలో ఉన్న చిమ్నీ ప్రమాదవశాత్తూ కూలిపోయింది.Source: జాతీయ | 23 Sep 2009 | 11:26 pm కంధమాల్ అల్లర్లు: ఐదుగురికి జీవిత ఖైదుఒరిస్సాలోని సమస్యాత్మక కంధమాల్ జిల్లాలో గత ఏడాది ఆగస్టు ప్రారంభమై కొన్నివారాల పాటు సాగిన మత ఘర్షణలకు సంబంధించి స్థానిక కోర్టు బుధవారం ఐదుగురు యువకులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. కంధమాల్ అల్లర్ల సందర్భంగా ఓ క్రైస్తవ మత పెద్దను హత్య చేసిన కేసులో వీరిని కోర్టు దోషులగా పరిగణించింది.Source: జాతీయ | 23 Sep 2009 | 10:22 pm చంద్రుడిపై నీటి జాడలు గుర్తించిన చంద్రయాన్- 1భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన చంద్రయాన్- 1 మిషన్‌లో సంచలనాత్మక ఫలితాలు వెలువడ్డాయి. చంద్రయాన్- 1 ఉపగ్రహం చందమామపై భారీ స్థాయిలో నీటి జాడలు గుర్తించినట్లు గురువారం ఓ ప్రముఖ దినపత్రిక వెల్లడించింది. చంద్రుడి ఉపరితలంపై పెద్దమొత్తంలో చంద్రయాన్- 1 నీటి జాడలు గుర్తించిందని పేర్కొంది.Source: జాతీయ | 23 Sep 2009 | 9:49 pm "సారీ! మా ఆయన ఇంట్లో ఉన్నాడు" టైటిల్ అర్థం ఏమిటి..?సారీ! మా ఆయన ఇంట్లో ఉన్నాడు అన్న టైటిల్ పెడార్థాన్ని ధ్వనింపజేస్తోందని కొందరు అనుకోవడం కనిపించింది. పైకి చెప్పకపోయినా... కొంతమంది "ఏం చేస్తాం.. కలికాలం.. ముందు ముందు ఎటువంటి టైటిళ్లు వినాల్సి వస్తుందో" అని గొణుక్కోవడం కనిపించింది. కొందరైతే.. సెటైర్లపైన సెటైర్లు విసరడం కనిపించింది. మచ్చుకు ఒకతను విసిరిన సెటరికల్ టైటిల్స్... "సారీ! మా ఆయన వస్తున్నారు.., సారీ! ఆవిడ మీ ఆవిడా...? ఇత్యాది టైటిళ్లు కూడా వచ్చేస్తాయ్ బాసూ" అంటూ ఓ కుర్ర జర్నలిస్టు నవ్వుతూ అనడం కనిపించింది.Source: Yahoo! Telugu: Entertainment | 23 Sep 2009 | 2:22 pm సెప్టెంబరు 25న "క్విక్ గన్ మురుగన్"హిందీ, తమిళ భాషల్లో ఇప్పటికే విడుదలైన "క్విక్ గన్ మురుగన్" చిత్రం ఈ నెల 25న తెలుగులో విడుదలవుతున్నట్లు నటుడు రాజేంద్రప్రసాద్ బుధవారం వెల్లడించారు. ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జాతీయస్థాయికి తగిన విధమైన క్యారెక్టర్ నచ్చి ఈ చిత్రంలో నటించడానికి అంగీకరించానన్నారు. సూపర్‌మేన్‌లా... సౌత్ ఇండియన్ సూపర్ హీరోలా ఈ చిత్రంలో తన పాత్ర ఉంటుందన్నారు. శాకాహారులు, మాంసాహారులకు మధ్య ఉండే ఘర్షణను ఈ చిత్రంలో బాగా చూపారనీ, చక్కని సందేశం కూడా ఉండటంతో తాను నటించడానికి అంగీకరించానని చెప్పారు.Source: Yahoo! Telugu: Entertainment | 23 Sep 2009 | 1:46 pm సైనస్‌తో ఆస్పత్రి పాలైన గజినీ భామ "అసిన్"!"గజినీ" భామ అసిన్ సైనస్‌తో ఆస్పత్రిలో చేరింది. ముంబైలోని ధీరూబాయ్ అంబానీ ఆసుపత్రిలో రెండు రోజుల పాటు అసిన్ చికిత్స పొందుతున్నట్లు ఆమె తండ్రి చెప్పారు. సైనస్ కారణంగా సోమవారం పూట ఆస్పత్రిలో చేరిన అసిన్‌కు ఎలాంటి ప్రమాదం లేదని, ఆమె మెల్లమెల్లగా కోలుకుంటుందని ఆయన అన్నారు. అసిన్ ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సైనస్ పరిస్థితి సరిగాలేకే ఆస్పత్రిలో చేరినట్లు ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి. సైనస్ పరిస్థితి గురించి ఆమె గత కొంతకాలంగా నిర్లక్ష్యం చేస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు కచ్చితంగా ఆస్పత్రికి వెళ్లాల్సిన పరిస్థితి ఎదురైందని చెప్పారు. ఆమె విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆమె ఇప్పుడు కూడా చెలాకీగానే ఉందని సన్నిహితులు పేర్కొన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 23 Sep 2009 | 10:46 am ఛత్తీస్‌గఢ్‌లో కూలిన చిమ్నీ: 20 మంది మృతిఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోనున్న కోర్బాలోని విద్యుత్ ఉత్పత్తి కార్మాగారంలో జరిగిన ప్రమాదంలో 20 మంది దుర్మరణం పాలుకాగా మరో 40 మందికి తీవ్రగాయాలయ్యాయి.Source: జాతీయ | 23 Sep 2009 | 10:06 am నేలరాలిన అలనాటి తార ఎస్. వరలక్ష్మిఅలనాటి సినీతార ఎస్. వరలక్ష్మి కన్నుమూశారు. బాలనటిగా తెలుగు, తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్న వరలక్ష్మి.. వయ్యారిభామలు వగలమారి భర్తలు, ముద్దులకృష్ణయ్య, సతీసావిత్రి, భామా విజయం, బొమ్మా బొరుసా, మాంగల్య బలం వంటి పలు తెలుగు సినిమాల్లో నటించింది. "బాలయోగిని"లో బాలనటిగా పేరు సంపాదించిన వరలక్ష్మి, 1948 సంవత్సరంలో విడుదలైన "బాలరాజు" చిత్రం ద్వారా ప్రేక్షకులకు దగ్గరైంది. ఇలా టాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకులను తన నటన, స్వరంతో ఆకట్టుకున్న వరలక్ష్మి మంచం మీద నుంచి పడినందువల్ల తీవ్రమైన వెన్నుపోటుతో ఆరునెలలు బాధపడ్డారు. మంగళవారం రాత్రి (సెప్టెంబర్ 22) చెన్నై మహాలింగపురంలోని ఆమె స్వగృహంలో రాత్రి 11 గం.లకు తుదిశ్వాస విడిచారని కుటుంబీకులు తెలిపారు. వరలక్ష్మి మరణవార్తతో సినీలోకం దిగ్భ్రాంతిలో మునిగిపోయింది. వరలక్ష్మి మరణం పట్లు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.Source: Yahoo! Telugu: Entertainment | 23 Sep 2009 | 9:53 am వీఆర్ఎస్‌కు దరఖాస్తు చేసిన వందమంది పైలెట్లుభారత వైమానిక దళానికి చెందిన సుమారు వందమంది పైలట్లు స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసినట్లు ఎయిర్ చీఫ్ మార్షల్ పి.వి.నాయక్ బుధవారం వెల్లడించారు.Source: జాతీయ | 23 Sep 2009 | 8:03 am "ఇలియానా".. నితిన్‌తో "రెచ్చిపో"తుందా?సిక్స్ ప్యాక్ హీరో నితిన్, "అందాల ఖజానా" ఇలియానా హీరోయిన్‌గా నటిస్తోన్న "రెచ్చిపో" చిత్రం త్వరలో తెరపైకి రానుంది. ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ "అడవి" చిత్రంతో బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకోన్న నితిన్‌కు "రెచ్చిపో" మంచి గుర్తింపును సంపాదించి పెడుతుందని చిత్ర దర్శకుడు పరుచూరి మురళి అంటున్నారు. మరోవైపు "రెచ్చిపో"లో ఇలియానా, నితిన్‌లపై పలు రొమాంటిక్ సన్నివేశాలు మాస్ ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాయని ఫిలిమ్ నగర్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. మొత్తానికి ఇందులో ఇలియానా అందాలను ఆరబోసిందని.. నితిన్‌తో నటనలోనూ రెచ్చిపోయిందని టాలీవుడ్ వర్గాల్లో టాక్.Source: Yahoo! Telugu: Entertainment | 23 Sep 2009 | 7:13 am కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్లు: తొమ్మిది మంది మృతిజమ్ము- కాశ్మీర్ రాష్ట్రంలో రెండు వేర్వేరు చోట్ల జరిగిన ఎన్‌కౌంటర్లలో నలుగురు ఆర్మీ సిబ్బంది, ఐదుగురు మిలిటెంట్లు మృతి చెందారని అధికారిక వర్గాలు బుధవారం వెల్లడించాయి. కాశ్మీర్ లోయలోని బందిపురా, రఫియాబాద్ ప్రాంతాల్లో ఇప్పటికీ ఎన్‌కౌంటర్లు జరుగుతూనే ఉన్నాయని తెలిపారు.Source: జాతీయ | 23 Sep 2009 | 6:24 am ప్రరాపాలో ఎలాంటి చీలికలు లేవు: చిరుప్రజారాజ్యం పార్టీలో చీలికలు ఏర్పడుతున్నాయని మీడియాలో వస్తున్న వార్తల్లో ఏ మాత్రం వాస్తవం లేదని ఆ పార్టీ అధ్యక్షుడు, తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవి అన్నారు.Source: ఏపీ న్యూస్ | 23 Sep 2009 | 5:47 am శ్రేయకు అచ్లా సచ్‌దేవ్ నేకెడ్ బ్యాక్‌లుక్ టిప్స్హీరోయిన్లు సినిమాలో అగ్రస్థానానికి ఎగబాకాలంటే నేడు ఎక్స్‌పోజింగ్ తప్పనిసరి అయింది. అయితే ఎక్స్‌పోజింగ్ శృతి మించితే అసలుకే మోసం వస్తుంది. కనుక ప్రేక్షకులకు ఎంత గ్లామర్ కావాలో అంత మోతాదులో మాత్రమే పంచుతూ వారిని ఆనందపరచాలి. ఈ సూత్రాన్ని బాలీవుడ్ సెక్సీతార అచ్లా సద్‌దేవ్ చాలా బలంగా నమ్ముతుందట. ప్రేక్షకులకు ఏయే భంగిమల్లో సెక్సీగా కనిపిస్తే ప్రేక్షకులకు కిక్కెతుందో ఆమెకు బాగా తెలుసట. ఈ విషయాన్ని తెలుసుకున్న సెక్సీ నడుము శ్రేయ ఆమె వద్ద గ్లామర్ పాఠాలు నేర్చుకుంటోందట. ఆ పాఠాల్లో వీపు భాగాన్ని నగ్నంగా ఎంతవరకు చూపాలో శ్రేయకు చూపించి మరీ చెప్పుకొచ్చిందట సచ్‌దేవ్. ఇటువంటివాటిలో కొన్ని భంగిమలను ఇటీవల మల్లన్న చిత్రంలో అమలుపరిచి మంచి ఫలితాలను సాధించానని చెపుతోందట శ్రేయ.Source: Yahoo! Telugu: Entertainment | 23 Sep 2009 | 5:37 am వెబ్‌ప్రపంచంలో వెబ్‌దునియా దిగ్విజయ యాత్రభారత పోర్టల్ కమ్యునికేషన్‌లో ఎన్నో మైలురాళ్ళ దాటిన వెబ్‌దునియా బుధవారంతో 10 సంవత్సరాలను దిగ్విజయంగా పూర్తి చేసుకుని 11వ వసంతంలో అడుగు పెట్టింది. 1999 సెప్టెంబర్ 23న పురుడు పోసుకున్న వెబ్‌దునియా దేశంలో సంచలనంగా నిలచింది. తొలుత హిందీ బాషలో ఆరంభమై అనతి కాలంలోనే ఐదు భాషలకు వ్యాపించింది.Source: జాతీయ | 23 Sep 2009 | 5:31 am తొక్కిసలాటకు స్కూలు యంత్రాంగమే కారణందేశ రాజధానిలో ఇటీవల ప్రభుత్వ పాఠశాలలో జరిగిన తొక్కిసలాటకు ఆ పాఠశాల యంత్రాంగమే కారణమని తేలింది. ఈ తొక్కిసలాటపై జరిగిన న్యాయ విచరణలో దుర్ఘటనకు పాఠశాల యంత్రాంగమే కారణమని తేలినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఢిల్లీలోని ఖజూరి ఖాస్ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల సెప్టెంబరు 10న జరిగిన తొక్కిసలాటలో ఐదుగురు విద్యార్థినులు మృతి చెందిన సంగతి తెలిసిందే.Source: జాతీయ | 23 Sep 2009 | 4:49 am "అభయహస్తం" పథకానికి వైఎస్సార్ పేరు!దివంగత మహానేత, ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్ రాజశేఖర్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అభయహస్తం పథకానికి ఆయన పేరే పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కోటి మహిళలకు ఫించన్లు అందించే లక్ష్యంలో వైఎస్సార్ ఆవిష్కరించిన ఈ పథకానికి "వైఎస్ఆర్ అభయహస్తం" పేరు పెడుతున్నట్లు బుధవారం ప్రభుత్వం తెలిపింది.Source: ఏపీ న్యూస్ | 23 Sep 2009 | 2:56 am
|