నీలేకని పుస్తకానికి దక్కనున్న అవార్డు...!

ఐటీ రంగంలో అగ్రగణ్యుడు, యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఛైర్మన్‌ నందన్‌ నీలేకని రచించిన " ఇమేజినింగ్ ఇండియా " పుస్తకానికి 2009వ సంవత్సరానికిగాను ఫైనాన్షియల్ టైమ్స్ అండ్ గోల్డ్‌మైన్ సాక్స్ బిజినెస్ అవార్డు లభించనుంది.
Source: Yahoo! Telugu: News | 23 Sep 2009 | 9:36 am

చైనా గ్రేట్ వాల్ ఇంకా పొడుగ్గా ఉండేది

ప్రపంచ వింతల్లో ఒకటైన చైనా గ్రేట్ వాల్ వాస్తవానికి అనుకున్నదాని కంటే మరో 11 కిలోమీటర్లు ఎక్కువ పొడవు ఉంటుందని పురాతత్వ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన మూలాలను వారు ఇప్పుడు గుర్తించారు. గ్రేట్ వాల్‌లో భాగమైన కొత్త భాగాన్ని కిన్ (221-206 బిసి) మరియు హాన్ (206 బిసి- 220 ఎడి) రాజుల పాలనాకాలంలో నిర్మించివుంటారని భావిస్తున్నారు.
Source: Yahoo! Telugu: News | 23 Sep 2009 | 9:27 am

202 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్

స్టాక్ మార్కెట్ 202 పాయింట్లు కోల్పోవడంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 16,685 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 53 పాయింట్లు నష్టపోయి 4,968 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 1.19 శాతం, నిఫ్టీ 1.05 శాతం క్షీణించాయి. అన్ని సెక్టోరల్ ఇండెక్స్‌లలో ఐటీ, ఆటో, ఎఫ్ఎంసీజీ, విద్యుత్ ఇండెక్స్ అత్యధికంగా నష్టాల్లో ఉన్నాయి.
Source: Yahoo! Telugu: News | 23 Sep 2009 | 9:20 am

ఎన్‌సీపీ తొలి దశ అభ్యర్థుల జాబితా విడుదల

మహారాష్ట్రలో అక్టోబరు 13న జరిగే తొలి దశ అసెంబ్లీ ఎన్నికల కోసం అధికార కూటమి భాగస్వామి ఎన్‌సీపీ 80 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఛగన్ భుజ్‌బల్, రాష్ట్ర పార్టీ చీఫ్ ఆర్ఆర్ పాటిల్, సీనియర్ మంత్రులు అజిత్ పవార్, విజయసిన్హా మోహిత్ పాటిల్ తదితరులు ఉన్నారు.
Source: Yahoo! Telugu: News | 23 Sep 2009 | 9:16 am

ఒడిదుడుకుల మధ్య స్టాక్ మార్కెట్

స్టాక్ మార్కెట్ ప్రస్తుతం ఒడిదుడుకుల మధ్య పయనిస్తుండటంతో 35 పాయింట్లు కోల్పోయి 16,851 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ 10 పాయింట్లు నష్టపోయి 5,010 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్, నిఫ్టీ 0.21 చొప్పున క్షీణించాయి.
Source: Yahoo! Telugu: News | 23 Sep 2009 | 8:32 am

"అభయహస్తం" పథకానికి వైఎస్సార్ పేరు!

దివంగత మహానేత, ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్ రాజశేఖర్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అభయహస్తం పథకానికి ఆయన పేరే పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కోటి మహిళలకు ఫించన్లు అందించే లక్ష్యంలో వైఎస్సార్ ఆవిష్కరించిన ఈ పథకానికి "వైఎస్ఆర్ అభయహస్తం" పేరు పెడుతున్నట్లు బుధవారం ప్రభుత్వం తెలిపింది.
Source: Yahoo! Telugu: News | 23 Sep 2009 | 8:24 am

"పాదయాత్ర"తో అధిష్ఠానంపై ఒత్తిడి: జగన్ యోచన

వైఎస్ జగన్ కాంగ్రెస్ అధిష్ఠానం వైఖరిపై గుర్రుగా ఉన్నట్లు సమాచారం. తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం సీఎం పోస్టు తనకే వస్తుందని ఆశించిన జగన్‌కు అధిష్ఠానం మొండి చేయి చూపింది. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానంపై మరింత ఒత్తిడి తెచ్చేందుకు తన తండ్రి నడిచిన "పాదయాత్ర" బాటలోనే పయనించడానికి జగన్ రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.
Source: Yahoo! Telugu: News | 23 Sep 2009 | 8:14 am

చిరు + జగన్= కొత్తపార్టీ...!

కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆకస్మికంగా మృతి చెందడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందనడంలో సందేహంలేదు. ఆయన మృతితో ముఖ్యమంత్రి పదవిని ఎవరికి కట్టబెట్టాలనేదానిపై అధిష్టానం ఓ నిర్ణయానికి రాలేకపోతోంది. దీంతో వైఎస్ తనయుడు వై.ఎస్. జగన్మోహనరెడ్డి తన అనుయాయులతో సంప్రదింపులు జరిపి ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
Source: Yahoo! Telugu: News | 23 Sep 2009 | 8:04 am

నష్టాల్లోనే కొనసాగుతున్న స్టాక్ మార్కెట్

స్టాక్ మార్కెట్ ప్రస్తుతం నష్టాల్లో కొనసాగుతుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 22 పాయింట్లు కోల్పోయి 16,865 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 6 పాయింట్లు నష్టపోయి 5,014 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్, నిఫ్టీలు 0.13 శాతం చొప్పున క్షీణించాయి. ఇప్పటి వరకు మొత్తం 2,705 కంపెనీల వాటాలు ట్రేడ్ అవగా, 1స126 కంపెనీల వాటాలు లాభపడ్డాయి.
Source: Yahoo! Telugu: News | 23 Sep 2009 | 8:01 am

ఆర్థిక వృద్ధి మరింతగా పెరగవచ్చు: ప్రణబ్

దేశీయ ఆర్థిక రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో పుంజుకుంటుందని కేంద్ర ఆర్థిక శాఖామంత్రి ప్రణబ్ ముఖర్జీ బుధవారంనాడు కోలకతాలో ఆశాభావం వ్యక్తం చేశారు.
Source: Yahoo! Telugu: News | 23 Sep 2009 | 7:28 am

"ఇలియానా".. నితిన్‌తో "రెచ్చిపో"తుందా?

సిక్స్ ప్యాక్ హీరో నితిన్, "అందాల ఖజానా" ఇలియానా హీరోయిన్‌గా నటిస్తోన్న "రెచ్చిపో" చిత్రం త్వరలో తెరపైకి రానుంది. ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ "అడవి" చిత్రంతో బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకోన్న నితిన్‌కు "రెచ్చిపో" మంచి గుర్తింపును సంపాదించి పెడుతుందని చిత్ర దర్శకుడు పరుచూరి మురళి అంటున్నారు. మరోవైపు "రెచ్చిపో"లో ఇలియానా, నితిన్‌ల‌పై పలు రొమాంటిక్ సన్నివేశాలు మాస్ ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాయని ఫిలిమ్ నగర్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. మొత్తానికి ఇందులో ఇలియానా అందాలను ఆరబోసిందని.. నితిన్‌తో నటనలోనూ రెచ్చిపోయిందని టాలీవుడ్ వర్గాల్లో టాక్.
Source: Yahoo! Telugu: Entertainment | 23 Sep 2009 | 7:13 am

శ్రేయకు అచ్లా సచ్‌దేవ్ నేకెడ్ బ్యాక్‌లుక్ టిప్స్

హీరోయిన్లు సినిమాలో అగ్రస్థానానికి ఎగబాకాలంటే నేడు ఎక్స్‌పోజింగ్ తప్పనిసరి అయింది. అయితే ఎక్స్‌పోజింగ్ శృతి మించితే అసలుకే మోసం వస్తుంది. కనుక ప్రేక్షకులకు ఎంత గ్లామర్ కావాలో అంత మోతాదులో మాత్రమే పంచుతూ వారిని ఆనందపరచాలి. ఈ సూత్రాన్ని బాలీవుడ్ సెక్సీతార అచ్లా సద్‌దేవ్ చాలా బలంగా నమ్ముతుందట. ప్రేక్షకులకు ఏయే భంగిమల్లో సెక్సీగా కనిపిస్తే ప్రేక్షకులకు కిక్కెతుందో ఆమెకు బాగా తెలుసట. ఈ విషయాన్ని తెలుసుకున్న సెక్సీ నడుము శ్రేయ ఆమె వద్ద గ్లామర్ పాఠాలు నేర్చుకుంటోందట. ఆ పాఠాల్లో వీపు భాగాన్ని నగ్నంగా ఎంతవరకు చూపాలో శ్రేయకు చూపించి మరీ చెప్పుకొచ్చిందట సచ్‌దేవ్. ఇటువంటివాటిలో కొన్ని భంగిమలను ఇటీవల మల్లన్న చిత్రంలో అమలుపరిచి మంచి ఫలితాలను సాధించానని చెపుతోందట శ్రేయ.
Source: Yahoo! Telugu: Entertainment | 23 Sep 2009 | 5:37 am

ఎన్‌సీపీ తొలి దశ అభ్యర్థుల జాబితా విడుదల

మహారాష్ట్రలో అక్టోబరు 13న జరిగే తొలి దశ అసెంబ్లీ ఎన్నికల కోసం అధికార కూటమి భాగస్వామి ఎన్‌సీపీ 80 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఛగన్ భుజ్‌బల్, రాష్ట్ర పార్టీ చీఫ్ ఆర్ఆర్ పాటిల్, సీనియర్ మంత్రులు అజిత్ పవార్, విజయసిన్హా మోహిత్ పాటిల్ తదితరులు ఉన్నారు.
Source: జాతీయ | 23 Sep 2009 | 3:46 am

"అభయహస్తం" పథకానికి వైఎస్సార్ పేరు!

దివంగత మహానేత, ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్ రాజశేఖర్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అభయహస్తం పథకానికి ఆయన పేరే పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కోటి మహిళలకు ఫించన్లు అందించే లక్ష్యంలో వైఎస్సార్ ఆవిష్కరించిన ఈ పథకానికి "వైఎస్ఆర్ అభయహస్తం" పేరు పెడుతున్నట్లు బుధవారం ప్రభుత్వం తెలిపింది.
Source: ఏపీ న్యూస్ | 23 Sep 2009 | 2:56 am

"ఇలియానా".. నితిన్‌తో "రెచ్చిపో"తుందా?

సిక్స్ ప్యాక్ హీరో నితిన్, "అందాల ఖజానా" ఇలియానా హీరోయిన్‌గా నటిస్తోన్న "రెచ్చిపో" చిత్రం త్వరలో తెరపైకి రానుంది. ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ "అడవి" చిత్రంతో బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకోన్న నితిన్‌కు "రెచ్చిపో" మంచి గుర్తింపును సంపాదించి పెడుతుందని చిత్ర దర్శకుడు పరుచూరి మురళి అంటున్నారు. మరోవైపు "రెచ్చిపో"లో ఇలియానా, నితిన్‌ల‌పై పలు రొమాంటిక్ సన్నివేశాలు మాస్ ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాయని..
Source: వినోదం | 23 Sep 2009 | 1:45 am

పీఎస్‌ఎల్‌వీతో మరో విజయం: కక్ష్యలో ఓషన్‌శాట్

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నమ్మినబంటుగా మారిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్‌వీ) బుధవారం ఓషన్‌శాట్- 2, యురోప్‌కు చెందిన ఆరు నానో ఉపగ్రహాలను విజయవంతంగా భూకక్ష్యలోకి ప్రవేశపెట్టింది. భారత్ ప్రయోగించిన 16వ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ ఓషన్‌శాట్- 2 రాకెట్ నుంచి విజయవంతంగా విడిపోగానే శ్రీహరికోటలోని సతీష్ ధవన్ ఉపగ్రహ ప్రయోగ కేంద్రంలోని శాస్త్రవేత్తలు సంబరాల్లో మునిగిపోయారు.
Source: జాతీయ | 23 Sep 2009 | 1:17 am

జైల్లో నిరాహార దీక్షను విరమించిన నళిని

దివంగత మహానేత రాజీవ్ గాంధీ హత్యేకేసులో శిక్ష అనుభవిస్తోన్న ప్రధాన నిందితురాలు నళిని నిరాహార దీక్షను విరమించింది. వెల్లూరు జైల్లో శిక్ష అనుభవిస్తోన్న నళిని, తన శిక్షకాలం పూర్తయ్యేలోపే క్షమాభిక్ష పెట్టి విడుదల చేయాలని పలుసార్లు కోర్టుకు విన్నవించింది. అయినా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో ఆమె నిరాహార దీక్ష చేపట్టింది.
Source: జాతీయ | 23 Sep 2009 | 1:04 am

తెరాస ప్రజాకోర్టుకు అడ్డుకట్ట వేసిన పోలీసులు

తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో మంచిర్యాలలో నిర్వహిస్తున్న ప్రజాకోర్టుకు పోలీసులు అడ్డుకట్ట వేశారు. ప్రజాకోర్టుకు వెళ్తున్న ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావును పోలీసులు అరెస్టు చేశారు. టీఆర్ఎస్ బుధవారం ఏర్పాటు చేయతలపెట్టిన ప్రజాకోర్టు కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. అయితే తాము ప్రజాకోర్టు నిర్వహించి తీరుతామని టీఆర్ఎస్ ప్రకటించడంతో తెరాస నేతలను పోలీసులు అడ్డుకుంటున్నారు.
Source: ఏపీ న్యూస్ | 23 Sep 2009 | 12:49 am

కనకదుర్గమ్మను దర్శించుకోనున్న చిరంజీవి

ఇంద్రకీలాద్రిపై వెలసిన అమ్మలగన్న అమ్మ కనకదుర్గమ్మను ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి బుధవారం కుటుంబసమేతంగా దర్శించుకోనున్నారు. బుధవారం విజయవాడలో చిరంజీవి పర్యటిస్తారు. ఇందులో భాగంగా.. ఇటీవల ముంపునకు గురైన ఒన్‌టౌన్‌‌లో ఆయన పర్యటిస్తారని పీఆర్పీ వర్గాలు తెలిపాయి.
Source: ఏపీ న్యూస్ | 23 Sep 2009 | 12:47 am

రాష్ట్రంలో మరో రెండు స్వైన్‌ఫ్లూ మరణాలు

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో బుధవారంనాడు మరో రెండు స్వైన్‌ఫ్లూ మరణాలు సంభవించాయి. స్వైన్‌ఫ్లూ మహమ్మారి బారిన పడి మృతి చెందుతున్న వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది
Source: ఏపీ న్యూస్ | 23 Sep 2009 | 12:46 am

మా ఆవిడ కూడా వచ్చింది

"నువ్వీ మధ్య ఊటీ వెళ్ళావటగా?" అడిగాడు సూరి "అవునోయ్!" చెప్పాడు విజయ్ "అయితే ప్లషర్ ట్రిప్పన్నమాట!"...
Source: వినోదం | 23 Sep 2009 | 12:43 am

పెట్రోల్ ఒక్కరికే ఉంది!

"సార్! లిఫ్ట్ ప్లీజ్!" సురేందర్ స్కూటర్ ఆపి అడిగాడు వినయ్ "సారీ! పెట్రోల్ ఒక్కరికే ఉంది!" అంటూ వెళ్ళిపోయాడు సురేందర్.
Source: వినోదం | 22 Sep 2009 | 11:54 pm

ఇన్నాళ్లూ మౌనంగా ఎందుకున్నారు: జశ్వంత్

బీజేపీ నుంచి తనను బహిష్కరించి నెల రోజులు గడిచే వరకు మౌనంగా ఉండటం ఎందుకని జశ్వంత్ సింగ్ ఆ పార్టీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీని ప్రశ్నించారు. జిన్నాపై వివాదాస్పద పుస్తకం రాసినందుకు బీజేపీ గత నెలలో మాజీ కేంద్ర మంత్రి జశ్వంత్ సింగ్‌ను పార్టీ నుంచి బహిష్కరించిన సంగతి తెలిసిందే.
Source: జాతీయ | 22 Sep 2009 | 11:49 pm

పీఎస్ఎల్‌వి-సి14 సక్సెస్ కావాలి తల్లీ..!: ఇస్రో ఛైర్మన్

చంద్ర మడలంపై అడుగుపెట్టడమే లక్ష్యంగా భారత్‌ మొదలుపెట్టిన 'చంద్రయాన్-1' ప్రాజెక్టులో తొలి దశ అర్థాంతరంగా ఆగిపోయిన నేపథ్యంలో.. పీఎస్‌ఎల్‌వి-సీ 14 ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావాలని ఇస్రో ఛైర్మన్ మాధవన్ నాయర్ సూళ్లూరుపేట చెంగాలమ్మను వేడుకున్నారు. బుధవారం ఉదయం చెంగాలమ్మ గుడిలో మాధవన్ నాయర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీహరి కోట రాకెట్ ప్రయోగ కేంద్రం "షార్‌"లోని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి బుధవారం ఉదయం 11.51 గంటలకు పీఎస్ఎల్‌వి-సీ 14 ప్రయోగానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Source: ఏపీ న్యూస్ | 22 Sep 2009 | 11:45 pm

స్వైన్‌ ఫ్లూతో మహిళ మృతి : 38కి చేరిన మృతుల సంఖ్య

ప్రపంచదేశాలను వణికిస్తోన్న మహమ్మారి స్వైన్ ఫ్లూతో రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఓ యువతి మరణించింది. బాలానగర్ బీబీఆర్ ఆస్పత్రిలో లావణ్య అనే యువతి బుధవారం స్వైన్‌ఫ్లూ మృతి చెందింది. మృతురాలు మెదక్‌జిల్లాకు చెందిన వాసిగా తెలుస్తోంది. స్వైన్ ఫ్లూ మరణాలు రోజురోజుకి పెరుగుతోన్న నేపథ్యంలో.. రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ మృతుల సంఖ్య 38కి చేరింది.
Source: ఏపీ న్యూస్ | 22 Sep 2009 | 11:10 pm

ఇప్పుడు మెడికల్ షాపుల్లో స్వైన్ ఫ్లూ మందు

దేశవ్యాప్తంగా యాంటి స్వైన్ ఫ్లూ మందు "ఫ్లూవీర్" అందుబాటులోకి వచ్చింది. దేశంలో స్వైన్ ఫ్లూ ప్రమాదకర స్థాయిలో విస్తరిస్తుండటంతో ప్రభుత్వం దీని నియంత్రణ కోసం ఫ్లూవీర్ రీటైల్ అమ్మకానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దేశ రీటైల్ మార్కెట్‌లో ఇక ఫ్లూవీర్ దొరుకుతుంది. భారత రీటైల్ మార్కెట్‌లో ఈ మందు అందుబాటులోకి రావడం ఇదే తొలిసారి.
Source: జాతీయ | 22 Sep 2009 | 10:30 pm

పేదరికం మాకు ప్రధాన సమస్య: ఎస్ఎం కృష్ణ

భారత్ అభివృద్ధి పథంలో ఇప్పటికీ అనేక సవాళ్లు ఎదుర్కొంటుందని, పేదరిక నిర్మూలన తమ దేశానికి ప్రధాన సమస్య అని న్యూయార్క్‌లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి సదస్సులో ప్రపంచ దేశాల నేతలకు విదేశాంగ మంత్రి ఎస్ఎం కృష్ణ తెలియజేశారు. తమ దేశంలో సుమారు 200 మిలియన్ల మంది పౌరులు రోజుకు డాలర్‌‍కన్నా తక్కువ ఆదాయం పొందుతున్నారని చెప్పారు.
Source: జాతీయ | 22 Sep 2009 | 10:05 pm

తుషార్‌గాంధీ చేతులమీదుగా "మహాత్మా" ఆడియో

జాతిపిత మహాత్మాగాంధీ మనుమడు తుషార్‌గాంధీ "మహాత్మా" చిత్ర ఆడియోసీడీని విడుదల చేశారు. సోమవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ఈ ఆడియో విడుదల కార్యక్రమానికి తుషార్‌గాంధీ ముఖ్యఅతిథిగా విచ్చేశారు."మహాత్మా" ఆడియోను ఆవిష్కరించిన సందర్భంగా తుషార్‌గాంధీ మాట్లాడుతూ.. ఈ సినిమా కథను విన్నానని, ఈ సినిమా ద్వారా బాపు సందేశాన్ని ప్రజల హృదయాలకు చేరవేస్తున్నామని దర్శకుడు కృష్ణవంశీ వెల్లడించినట్లు పేర్కొన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 22 Sep 2009 | 12:50 pm

సంక్రాంతి కానుకగా బాలయ్య "సింహా"

బొబ్బిలిసింహం, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, లక్ష్మీనరసింహ వంటి సెన్సేషనల్ హిట్ చిత్రాల కథానాయకుడు యువరత్న బాలకృష్ణ హీరోగా రూపుదిద్దుకుంటోన్న భారీ బడ్జెట్ చిత్రం "సింహా".భద్ర, తులసి వంటి సూపర్‌హిట్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో, యునైటెడ్ మూవీస్ పతాకంపై పరుచూరి కిరీటి నిర్మిస్తోన్న ఈ సినిమా తొలి షెడ్యూల్ సెప్టెంబర్ 4 నుంచి 19వ తేదీ వరకు రామోజీ ఫిలింసిటీలో జరిగింది.
Source: Yahoo! Telugu: Entertainment | 22 Sep 2009 | 12:30 pm

"జయీభవ" అంటోన్న కళ్యాణ్‌రామ్, హన్సిక!

ఎనర్జిటిక్‌స్టార్ నందమూరి కళ్యాణ్‌రామ్ హీరోగా నటిస్తూ ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై 'ప్రొడక్షన్ నెం.3'గా నిర్మిస్తోన్న చిత్రానికి "జయీభవ" అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అతనొక్కడే, హరేరామ్ వంటి హిట్ చిత్రాల తర్వాత ఎన్టీఆర్ బేనర్‌లో వస్తోన్న ఈ హ్యాట్రిక్ ఫిలిమ్‌లో కళ్యాణ్‌రామ్ సరసన 'దేశముదురు' కథానాయిక హన్సిక కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం ద్వారానే నరేన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 22 Sep 2009 | 12:12 pm

25న ప్రభాస్ "ఏక్‌‌నిరంజన్" ఆడియో విడుదల

యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా, డాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న భారీ చిత్రం "ఏక్‌నిరంజన్". ఆదిత్యారామ్ మూవీస్ పతాకంపై ఆదిత్యారామ్ గ్రూఫ్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్ ఆదిత్యరామ్ నిర్మిస్తోన్న ఈ చిత్రం షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నిర్మాత ఆదిత్యారామ్ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 25న 'ఏక్‌నిరంజన్' ఆడియోను ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల చేస్తున్నామన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 22 Sep 2009 | 11:48 am

అక్టోబర్‌లో "సారాయివీర్రాజు"గా వస్తోన్న అజయ్

'ఆ ఒక్కడు' ఫేమ్ అజయ్ హీరోగా నటిస్తోన్న "సారాయి వీర్రాజు" సినిమాను వచ్చే నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం సోమవారం రాత్రి వైభవంగా జరిగింది. ఆడియోను సినీ ప్రముఖులు భోగవల్లి ప్రసాద్, తమ్మారెడ్డి భరద్వాజ, రాజమౌళి విడుదల చేశారు. ఆడియో వేడుక సందర్భంగా మగధీర దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ.. సారాయి వీర్రాజు చిత్ర దర్శకుడు కణ్ణన్ తన వద్ద పనిచేశాడని, తన సొంత ఆడియోలా భావిస్తున్నానని చెప్పారు. విజువలైజేషన్ గల కణ్ణన్‌కు సంగీతపరంగానూ మంచి అభిరుచి ఉందని రాజమౌళి కితాబిచ్చారు. ఈ చిత్రానికి సాయి చక్కటి ట్యూన్స్ ఇచ్చాడని తెలిపారు.
Source: Yahoo! Telugu: Entertainment | 22 Sep 2009 | 11:33 am

భోజ్‌పురి సూపర్ స్టార్ తన "తడాఖా" ఏంటో చూపిస్తారా..?

భోజ్‌పురి సూపర్‌స్టార్ దినేష్‌లాల్ యాదవ్ తొలిసారిగా తెలుగులో నటిస్తోన్న చిత్రం "తడాఖా". రాహుల్ మూవీ మేకర్స్ పతాకంపై బి.ఓ. సుబ్బారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూసల రాధా దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో సునయన హెగ్డే, రూపాకౌర్ కథానాయికలుగా నటిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 22 Sep 2009 | 11:15 am

కుర్ర హీరోలకు "మగధీర" సవాల్!

మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ నటించిన రెండో చిత్రంతోనే తెలుగు చిత్ర పరిశ్రమలో జూనియర్ మెగాస్టార్ రేంజ్‌కు చేరుకున్నారు. ఈ చిత్రం షూటింగ్ సమయంలో చరణ్ పడిన కష్టానికి దక్కిన ప్రతిఫలమే "మగధీర" విజయమని చిత్ర యూనిట్ చెపుతోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 22 Sep 2009 | 9:28 am

"అ..ఆ..ఇ..ఈ.." హీరోయిన్ "సదా" పర్సనల్ టచ్

ప్రముఖ దర్శకుడు తేజ రూపొందించిన "జయం" సినిమా ద్వారా "వెళ్లవయ్యా.. వెళ్లూ.." అంటూ అన్ని వర్గాల ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకున్న అందాలనటి సదా. "జయం"లో లంగావోణిల్లో తెలుగమ్మాయిలా కనిపించిన సదా.. తర్వాత విలక్షణ నటుడు విక్రమ్‌తో "అపరిచితుడు"లో నటించింది. చుక్కల్లో చంద్రుడు, అవునన్నా కాదన్నా తదితర సినిమాల్లో నటించిన సదా తాజాగా శ్రీకాంత్ సరస న "అ..ఆ..ఇ..ఈ.." చిత్రంలో అందాలను ఆరబోస్తోంది. ఈ సినిమా షూటింగ్ మధ్యలో సదా కదిలిస్తే.. "నటిని కాకపోతే.. ఇంజనీర్‌ని అయ్యేదానినని" చెప్పింది. తెలుపు, పీచ్ రంగులంటే ఎంతో ఇష్టమంటోన్న సదా పూర్తి పేరు: సదాఫ్ మొహమ్మద్ సయీద్. ముద్దుపేరు: డార్లి,పుట్టిన తేది: ఫిబ్రవరి 17, జన్మస్థలం: పూణె,తొలి చిత్రం: జయం, నచ్చిన కారు: టయోటా,ఫేవరేట్ హాలిడే స్పాట్: ఇల్లు.ఫేవరేట్ పెర్‌ఫ్యూమ్: గ్లోబర్ ఎల్లో, అలవాట్లు: పుస్తకాలను చదవడం, నచ్చిన హీరోయిన్: మాధురీ దీక్షిత్, నచ్చిన హీరోలు: షారూఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, నచ్చిన సంగీత దర్శకుడు: ఎ.ఆర్. రెహ్మాన్, హరీశ్ జయరాజ్.
Source: Yahoo! Telugu: Entertainment | 22 Sep 2009 | 8:49 am

షార్ కేంద్రంలో ఓషన్‌శాట్ ప్రయోగానికి సర్వం సిద్ధం

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రయోగించనున్న ఓషన్‌శాట్-2 ప్రయోగానికి శ్రీహరికోటలోని సతీష్ థావన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో సర్వం సిద్ధం చేశారు. ఈ కేంద్రం నుంచి పీఎస్‌ఎల్‌వి-సి 14 ఉపగ్రహ వాహక నౌక ద్వారా మరో ఏడు ఉపగ్రహాలను నింగిలోకి పంపుతారు.
Source: ఏపీ న్యూస్ | 22 Sep 2009 | 8:46 am

ఇస్రో-ఐఏఎఫ్ సహకారంతో నక్సలైట్లపై కేంద్రం ఉక్కుపాదం

దేశ అంతర్గత భద్రతకు పెను సవాల్ విసురుతున్న నక్సలిజం, వామపక్ష తీవ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు కేంద్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది. కీకారణ్యంలో దాగి ఉండే నక్సలైట్ల ఆచూకీ తెలుసుకునేందుకు వీలుగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)తో పాటు.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సహాయాన్ని తీసుకోనుంది.
Source: జాతీయ | 22 Sep 2009 | 8:18 am

కాంగ్రెస్‌లో చీలికకు వైఎస్.జగన్ "చిరు" కుట్ర!?

దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. తన తండ్రి కష్టపడి సంపాదించిన అధికారాన్ని తనకు అప్పగించేందుకు కాంగ్రెస్ అధిష్టానం ససేమిరా అనడతో జగన్ సరికొత్త ప్రణాళిక రచించారు.
Source: ఏపీ న్యూస్ | 22 Sep 2009 | 7:33 am

సిద్ధేశ్వరుడు కొలువైన "సిద్ధేశ్వర కోన జలపాతం"

వంద అడుగుల లోతు ఉన్నప్పటికీ.. కేవలం పది అడుగుల లోతే ఉంటుందని భ్రమ కల్పించే స్వచ్ఛమైన నీటి ప్రవాహంతో.. సిద్ధేశ్వర స్వామి పాదాలను తాకుతూ.. పరవళ్లు తొక్కుతూ.. కిందికి దూకుతుంటుంది సిద్ధేశ్వర కోన జలపాతం. సహజ సిద్ధమైన జలపాతాలను కలిగిన ఈ సుందర ప్రదేశం, యాత్రికులకు మధురానుభూతిని పంచుతూ.. ఎనలేని ప్రకృతి సౌందర్యాన్ని తనలో నిక్షిప్తం చేసుకుని మళ్లీ మళ్లీ.. రారమ్మని ఆహ్వానిస్తున్నట్లుగా ఉంటుంది.
Source: వినోదం | 22 Sep 2009 | 6:19 am

ముగింపు దశలో అద్వానీ రాజకీయ జీవితం: పారికర్

భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే.అద్వానీ రాజకీయ జీవితం ముంగిపు దశకు చేరుకుందని గోవా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఆరోపించారు. ఆయన పార్టీని మరో రెండుమూడు రోజులు మాత్రమే నడిపించే అవకాశం ఉందని ఆయన స్థానిక ఛానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
Source: జాతీయ | 22 Sep 2009 | 5:35 am

ప్రజారాజ్యానికి అల్లు అరవింద్ రాజీనామా..?!

ప్రజారాజ్యం పార్టీలో అంతా తానై మెలిగిన వ్యక్తుల్లో సినీ నిర్మాత అల్లు అరవింద్ అగ్రగణ్యుడు. గత ఎన్నికల సమయంలో ఆయనపై లేనిపోని ఆరోపణలు వచ్చాయి. ఫలితంగా ఆ పార్టీ చిత్తుగా ఓడిపోయింది. ఈ దుస్థితికి అల్లు అరవిందే ప్రధాన కారణమని ఆ పార్టీ నేతలు చిరంజీవి ముందు వాపోయారు.
Source: ఏపీ న్యూస్ | 22 Sep 2009 | 4:37 am

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరి పోరు: కాంగ్రెస్

బీహార్ అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని బీహార్ కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ ప్రకటించింది. రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలైన ఆర్జేడీ, ఎల్జేపీలతో కలిసి పోటీ చేసేది లేదని రాష్ట్రశాఖ తేల్చి చెప్పింది.
Source: జాతీయ | 22 Sep 2009 | 4:32 am

కుర్ర హీరోలకు "మగధీర" సవాల్!

మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ నటించిన రెండో చిత్రంతోనే తెలుగు చిత్ర పరిశ్రమలో జూనియర్ మెగాస్టార్ రేంజ్‌కు చేరుకున్నారు. ఈ చిత్రం షూటింగ్ సమయంలో చరణ్ పడిన కష్టానికి దక్కిన ప్రతిఫలమే "మగధీర" విజయమని చిత్ర యూనిట్ చెపుతోంది.
Source: వినోదం | 22 Sep 2009 | 4:00 am

కాంగ్రెస్ అధినేత్రితో సమావేశమైన మంత్రి శశి థరూర్

ఎకానమీ క్లాస్ విమాన ప్రయాణంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో చిక్కుకున్న కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి శశి థరూర్ మంగళవారం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశమయ్యారు. తాను చేసిన వ్యాఖ్యలపై ఆయన స్వయంగా వివరణ ఇచ్చుకున్నారు.
Source: జాతీయ | 22 Sep 2009 | 3:30 am