ప్రజారాజ్యానికి అల్లు అరవింద్ రాజీనామా!

ప్రజారాజ్యం పార్టీలో అంతా తానై మెలిగిన వ్యక్తుల్లో సినీ నిర్మాత అల్లు అరవింద్ అగ్రగణ్యుడు. గత ఎన్నికల సమయంలో ఆయనపై లేనిపోని ఆరోపణలు వచ్చాయి. ఫలితంగా ఆ పార్టీ చిత్తుగా ఓడిపోయింది. ఈ దుస్థితికి అల్లు అరవిందే ప్రధాన కారణమని ఆ పార్టీ నేతలు చిరంజీవి ముందు వాపోయారు.
Source: Yahoo! Telugu: News | 22 Sep 2009 | 9:46 am

సూడాన్ హింసాకాండలో 100 మంది మృతి

దక్షిణ సూడన్‌లో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో 100 మంది పౌరులు మృతి చెందారని అధికారిక వర్గాలు మంగళవారం వెల్లడించాయి. రెండు ప్రత్యర్థి వర్గాల మధ్య జరిగిన ఘర్షణలతో దక్షిణ సూడాన్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జోంగ్లి రాష్ట్రంలో లౌ నుర్ గిరిజన వర్గానికి చెందిన సాయుధులు ప్రత్యర్థి గ్రూపుకు చెందిన ఓ గ్రామంపై ఆదివారం దాడి చేశారు.
Source: Yahoo! Telugu: News | 22 Sep 2009 | 9:32 am

కుర్ర హీరోలకు "మగధీర" సవాల్!

మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ నటించిన రెండో చిత్రంతోనే తెలుగు చిత్ర పరిశ్రమలో జూనియర్ మెగాస్టార్ రేంజ్‌కు చేరుకున్నారు. ఈ చిత్రం షూటింగ్ సమయంలో చరణ్ పడిన కష్టానికి దక్కిన ప్రతిఫలమే "మగధీర" విజయమని చిత్ర యూనిట్ చెపుతోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 22 Sep 2009 | 9:28 am

163 పాయింట్లు పుంజుకున్న సెన్సెక్స్

స్టాక్ మార్కెట్ ప్రస్తుతం 163 పాయింట్లు పుంజుకోవడంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 16,904 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 47 పాయింట్లు లాభపడి 5,023 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.97 శాతం, నిఫ్టీ 0.94 శాతం మేరకు వృద్ధి చెందాయి
Source: Yahoo! Telugu: News | 22 Sep 2009 | 9:16 am

"అ..ఆ..ఇ..ఈ.." హీరోయిన్ "సదా" పర్సనల్ టచ్

ప్రముఖ దర్శకుడు తేజ రూపొందించిన "జయం" సినిమా ద్వారా "వెళ్లవయ్యా.. వెళ్లూ.." అంటూ అన్ని వర్గాల ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకున్న అందాలనటి సదా. "జయం"లో లంగావోణిల్లో తెలుగమ్మాయిలా కనిపించిన సదా.. తర్వాత విలక్షణ నటుడు విక్రమ్‌తో "అపరిచితుడు"లో నటించింది. చుక్కల్లో చంద్రుడు, అవునన్నా కాదన్నా తదితర సినిమాల్లో నటించిన సదా తాజాగా శ్రీకాంత్ సరస న "అ..ఆ..ఇ..ఈ.." చిత్రంలో అందాలను ఆరబోస్తోంది. ఈ సినిమా షూటింగ్ మధ్యలో సదా కదిలిస్తే.. "నటిని కాకపోతే.. ఇంజనీర్‌ని అయ్యేదానినని" చెప్పింది. తెలుపు, పీచ్ రంగులంటే ఎంతో ఇష్టమంటోన్న సదా పూర్తి పేరు: సదాఫ్ మొహమ్మద్ సయీద్. ముద్దుపేరు: డార్లి,పుట్టిన తేది: ఫిబ్రవరి 17, జన్మస్థలం: పూణె,తొలి చిత్రం: జయం, నచ్చిన కారు: టయోటా,ఫేవరేట్ హాలిడే స్పాట్: ఇల్లు.ఫేవరేట్ పెర్‌ఫ్యూమ్: గ్లోబర్ ఎల్లో, అలవాట్లు: పుస్తకాలను చదవడం, నచ్చిన హీరోయిన్: మాధురీ దీక్షిత్, నచ్చిన హీరోలు: షారూఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, నచ్చిన సంగీత దర్శకుడు: ఎ.ఆర్. రెహ్మాన్, హరీశ్ జయరాజ్.
Source: Yahoo! Telugu: Entertainment | 22 Sep 2009 | 8:49 am

అమెరికా, మిత్రదేశాలను కాపాడటమే ధ్యేయం

ఆఫ్ఘనిస్థాన్- పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతం తీవ్రవాదానికి ప్రధాన కేంద్రంగా ఉందని అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి హిల్లరీ క్లింటన్ తెలిపారు. ఈ ప్రాంతంలో ఉంటున్న తీవ్రవాదుల నుంచి అమెరికాను, దాని మిత్రదేశాలను కాపాడటమే బరాక్ ఒబామా యంత్రాంగం ప్రధాన ధ్యేయమన్నారు.
Source: Yahoo! Telugu: News | 22 Sep 2009 | 8:42 am

కాంగ్రెస్ అధినేత్రితో సమావేశమైన మంత్రి శశి థరూర్

ఎకానమీ క్లాస్ విమాన ప్రయాణంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో చిక్కుకున్న కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి శశి థరూర్ మంగళవారం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశమయ్యారు. తాను చేసిన వ్యాఖ్యలపై ఆయన స్వయంగా వివరణ ఇచ్చుకున్నారు.
Source: Yahoo! Telugu: News | 22 Sep 2009 | 8:35 am

లాభాల్లోనే కొనసాగుతున్న స్టాక్ మార్కెట్

స్టాక్ మార్కెట్ ప్రస్తుతం లాభాల్లోనే కొనసాగుతుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 167 పాయింట్లు పుంజుకుని 16,908 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 44 పాయింట్లు లాభపడి 5,020 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.92 శాతం, నిఫ్టీ 0.84 శాతం మేరకు వృద్ధి చెందాయి.
Source: Yahoo! Telugu: News | 22 Sep 2009 | 8:25 am

పెరోట్ సిస్టమ్స్‌ను హస్తగతం చేసుకోనున్న డెల్

అంతర్జాతీయ కంప్యూటర్ తయారీ సంస్థ డెల్ ఇంక్.. త్వరలో.. ప్రముఖ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీసెస్ కంపెనీ పెరోట్ సిస్టమ్స్ కార్పొరేషన్‌ను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. పర్సనల్ కంప్యూటర్ (పీసీ)ల శ్రేణిలో మరింతగా విస్తరించాలనే ప్రణాళికల్లో భాగంగా ఈ కొనుగోళ్లు చేస్తున్నట్లు తెలిపింది.
Source: Yahoo! Telugu: News | 22 Sep 2009 | 8:08 am

లాభాల్లోనే పయనిస్తున్న స్టాక్ మార్కెట్

స్టాక్ మార్కెట్‌ ప్రస్తుతం లాభాల్లో పయనిస్తుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 182 పాయింట్లు పుంజుకుని 16,923 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 49 పాయింట్లు లాభపడి 5,025 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 1.09 శాతం, నిఫ్టీ 0.98 శాతం మేరకు వృద్ధి చెందాయి. ఇప్పటి వరకు మొత్తం 2,614 కంపెనీల వాటాలు ట్రేడ్ అవగాస 1,502 కంపెనీల వాటాలు లాభపడ్డాయి
Source: Yahoo! Telugu: News | 22 Sep 2009 | 7:40 am

సజావుగా పాలన సాగిస్తున్న రోశయ్య: కె.కేశవరావు

రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆర్థిక మంత్రి కె.రోశయ్య సజావుగానే పాలన సాగిస్తున్నారని రాజ్యసభ సభ్యుడు, పార్టీ సీనియర్ నేత కె.కేశవరావు అభిప్రాయపడ్డారు. ఆయన మంగళవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి అంతర్గత విభేదాలు లేవన్నారు.
Source: Yahoo! Telugu: News | 22 Sep 2009 | 7:29 am

ఆర్‌బీఐ యంగ్ స్కాలర్స్‌ అవార్డు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) యంగ్ స్కాలర్స్ అవార్డుకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దేశంలోని బ్యాంకింగ్ రంగ వ్యవస్థపై యువతకు సరైన అవగాహన కల్పించడానికే ఈ అవార్డును ఏర్పాటు చేసినట్లు ఆర్‌బీఐ వెల్లడించింది. దరఖాస్తు వివరాలు.. ఇంటర్మీడియట్ పూర్తి చేసి.. డిగ్రీ చదువుతున్న వారై ఉండాలి. 2009, సెప్టెంబర్ 1 నాటికి 18 నుంచి 23 ఏళ్లలోపు...
Source: Yahoo! Telugu: News | 22 Sep 2009 | 7:29 am

బిడియంతో ఓ డ్యూయెట్ పాటను కూడా రికార్డు చేయలేదు..!

పాప్ సామ్రాజ్యాన్ని శాసించిన పాప్ కింగ్ మైఖేల్ జాక్సన్‌కున్న సిగ్గు, మొహమాటం, బిడయంతో ఆయనతో కలిసి ఓ డ్యూయెట్ పాటను కూడా రికార్డు చేయడం సాధ్యం కాలేదని పాప్ గాయని మడోన్నా తెలిపింది. ఇటీవల జరిగిన ఎంటీవీ మ్యూజికల్ అవార్డుల సందర్భంగా తన పాతస్నేహితుడైన జాక్సన్‌కు మడోన్నా నివాళి అర్పించారు. ఈ సంగతులను సోమవారం టైమ్ పత్రికతో పంచుకున్నారు. పాప్ రారాజు మైఖేల్ జాక్సన్ చాలా బిడియస్థుడని, అందువల్లే ఆయనతో కలిసి ఓ డ్యూయెట్ పాటను కూడా రికార్డు చేయడం సాధ్యం కాలేదని అన్నారు. ఇలాంటి వ్యక్తిపై పసిపిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఎలాంటి ఆధారాలు లేకున్నా నీచమైనా ఆరోపణలు సాగించారని మడోన్నా విమర్శించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 22 Sep 2009 | 7:15 am

"పదహారేళ్ల వయసు" ట్రైలర్ మీ కోసం..

"పదహారేళ్ల వయసు" సినిమా పేరు చెబితే డ్రీమ్ గాళ్ శ్రీదేవి తెలుగు ప్రేక్షకుల మదిలో కదలాడుతుంది. ఆ సినిమాలో శ్రీదేవితోపాటు ఆ సినిమా పేరుకు కూడా ఎంతో క్రేజ్ వచ్చింది. ఇప్పుడు మళ్లీ అదే టైటిల్‌తో ఇద్దరి జీవితాల్లో పదహారేళ్ల ప్రాయం సృష్టించిన అలజడిని ఇతివృత్తంగా తీసుకుని కొత్తగా "పదహారేళ్ల వయసు" రూపుదిద్దుకుంటోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 22 Sep 2009 | 6:11 am

నా మార్కెట్ వేల్యూ పెరిగిదంటున్న ప్రియమణి

"ద్రోణ" చిత్రంలో పొట్టి బికినీలో కనిపించి టాలీవుడ్ టీనేజ్ కుర్రకారు గుండెల్లో గుబులు రేపిన ప్రియమణికి అవకాశాలు కాస్తంత తగ్గాయంటున్నారు. అయితే అదేమీ పైకి కనపడనీయడం లేదట ఈ పూబోణి. ఆఫర్లు తగ్గడానికి పారితోషికం పెంచడమే కారణమా...? అని ఓ పిల్ల జర్నలిస్టు అడిగితే, చివాల్న చూసి... " గతంలో నీ జీతం ఎంత... అదే జీతంతో ఏటెల్లకాలం కొనసాగుదామని అనుకుంటావా...? కాస్తా కూస్తో పెరగాలని అనుకోవూ..? కష్టించి పనిచేస్తున్నప్పుడు దానికి తగ్గ ప్రతిఫలం ఆశించడంలో తప్పులేదు. ఇటీవల టాలీవుడ్‌లో 'ద్రోణ' వంటి సినిమాలతో నా మార్కెట్ రేంజ్ పెరిగింది. దానికి తగ్గట్లు పారితోషికం అడుగుతున్నా. అవకాశాలంటారా..? నాతో సినిమా చేయాలనుకున్నవారు నన్ను వదలరు. తప్పకుండా నా వద్దకే వస్తారు. కనుక దాని గురించి నేను ఫీలవను.." అంటోందట.
Source: Yahoo! Telugu: Entertainment | 22 Sep 2009 | 5:36 am

ప్రజారాజ్యానికి అల్లు అరవింద్ రాజీనామా!

ప్రజారాజ్యం పార్టీలో అంతా తానై మెలిగిన వ్యక్తుల్లో సినీ నిర్మాత అల్లు అరవింద్ అగ్రగణ్యుడు. గత ఎన్నికల సమయంలో ఆయనపై లేనిపోని ఆరోపణలు వచ్చాయి. ఫలితంగా ఆ పార్టీ చిత్తుగా ఓడిపోయింది. ఈ దుస్థితికి అల్లు అరవిందే ప్రధాన కారణమని ఆ పార్టీ నేతలు చిరంజీవి ముందు వాపోయారు.
Source: ఏపీ న్యూస్ | 22 Sep 2009 | 4:19 am

కుర్ర హీరోలకు "మగధీర" సవాల్!

మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ నటించిన రెండో చిత్రంతోనే తెలుగు చిత్ర పరిశ్రమలో జూనియర్ మెగాస్టార్ రేంజ్‌కు చేరుకున్నారు. ఈ చిత్రం షూటింగ్ సమయంలో చరణ్ పడిన కష్టానికి దక్కిన ప్రతిఫలమే "మగధీర" విజయమని చిత్ర యూనిట్ చెపుతోంది.
Source: వినోదం | 22 Sep 2009 | 4:00 am

కాంగ్రెస్ అధినేత్రితో సమావేశమైన మంత్రి శశి థరూర్

ఎకానమీ క్లాస్ విమాన ప్రయాణంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో చిక్కుకున్న కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి శశి థరూర్ మంగళవారం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశమయ్యారు. తాను చేసిన వ్యాఖ్యలపై ఆయన స్వయంగా వివరణ ఇచ్చుకున్నారు.
Source: జాతీయ | 22 Sep 2009 | 3:30 am

"అ..ఆ..ఇ..ఈ.." హీరోయిన్ "సదా" పర్సనల్ టచ్

ప్రముఖ దర్శకుడు తేజ రూపొందించిన "జయం" సినిమా ద్వారా "వెళ్లవయ్యా.. వెళ్లూ.." అంటూ అన్ని వర్గాల ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకున్న అందాలనటి సదా. "జయం"లో లంగావోణిల్లో తెలుగమ్మాయిలా కనిపించిన సదా.. తర్వాత విలక్షణ నటుడు విక్రమ్‌తో "అపరిచితుడు"లో నటించింది. చుక్కల్లో చంద్రుడు, అవునన్నా కాదన్నా తదితర సినిమాల్లో నటించిన సదా తాజాగా శ్రీకాంత్ సరస న "అ..ఆ..ఇ..ఈ.." చిత్రంలో అందాలను ఆరబోస్తోంది.
Source: వినోదం | 22 Sep 2009 | 3:20 am

సజావుగా పాలన సాగిస్తున్న రోశయ్య: కె.కేశవరావు

రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆర్థిక మంత్రి కె.రోశయ్య సజావుగానే పాలన సాగిస్తున్నారని రాజ్యసభ సభ్యుడు, పార్టీ సీనియర్ నేత కె.కేశవరావు అభిప్రాయపడ్డారు. ఆయన మంగళవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి అంతర్గత విభేదాలు లేవన్నారు.
Source: ఏపీ న్యూస్ | 22 Sep 2009 | 2:00 am

స్వైన్ ఫ్లూకు మరో మహిళ మృతి: మొత్తం మృతులు 35

రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మంగళవారం కూడా మరో మహిళ మృత్యువాత పడింది. హైదరాబాద్‌లోని వనస్థలిపురానికి చెందిన విజయ (50) అనే మహిళ గ్లోబర్ అవేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది.
Source: ఏపీ న్యూస్ | 22 Sep 2009 | 1:48 am

కర్నూలు జిల్లాలో ఘోరం: 13 మంది మృత్యువాత

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో 13 మంది మృత్యువాత పడ్డారు. నంద్యాల మండలం బలపనూరు సమీపంలో కర్నూలు - చిత్తూరు జాతీయ రహదారిపై స్కార్పియో - మారుతి వ్యాన్‌లు ఎదురెదురుగా ఢీకొన్నాయి.
Source: ఏపీ న్యూస్ | 22 Sep 2009 | 1:32 am

'మహా' సమరం: కుదిరిన కాంగ్రెస్-ఎన్.సి.పి పొత్తు

మహారాష్ట్ర అసెంబ్లీ సమరం కోసం అధికార కాంగ్రెస్, ఎన్.సి.పిల మధ్య పొత్తు ఖరారైంది. ఈ రెండు పార్టీలో పోటీ చేసే సీట్ల సంఖ్యపై కూడా ఓ అవగాహనకు వచ్చారు. సీట్ల ఒప్పందంపై మంగళవారం అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది.
Source: జాతీయ | 22 Sep 2009 | 12:34 am

ఎంపిక చేసిన మెడికల్ షాపుల్లో టామీఫ్లూ మందు

దేశ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న స్వైన్ ఫ్లూ మహమ్మారికి అడ్డుకట్ట వేసే టామీ ఫ్లూ మందులు మంగళవారం నుంచి దేశ వ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయి. దేశంలో ఎంపిక చేసిన, గుర్తింపు పొందిన మెడికల్ షాపుల్లో ఈ మందుల రీటైల్ అమ్మకాలు జరుగనున్నాయి.
Source: జాతీయ | 22 Sep 2009 | 12:19 am

అనుభవం లేకుంటే సీఎం కాకూడదా: మంత్రి బొత్స

అనుభవం ఉన్నవారే ముఖ్యమంత్రి పదవిలో ఆసీనులు కావాలా? ఎలాంటి అనుభవం లేకుండా ఈ బాధ్యతలను చేపట్టిన వారు లేరా? అంటూ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖామంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. దేనికైనా అనుభవం అనేది తప్పనిసరన్నారు.
Source: ఏపీ న్యూస్ | 22 Sep 2009 | 12:02 am

వైఎస్.జగన్ వద్ద బోరున విలపించిన సినీ నటి రోజా

దివంగత నేత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి తనయుడు వైఎస్ జగన్‌ వద్ద సినీ నటి రోజా బోరున విలపించారు. అంధకారంగా మారిన తన భవిష్యత్‌కు ఏదోలా న్యాయం చేసి వెలుగులు నింపాలని మొరపెట్టుకుందట.
Source: ఏపీ న్యూస్ | 21 Sep 2009 | 11:54 pm

ఇష్టమైనవన్నీ కొనుక్కో...!

తన పుట్టిన రోజుకు స్నేహితురాలు బట్టల మూట ఇవ్వడం చూసి ఆశ్చర్యపోయిన సరళ ఇలా అడిగింది సరళ : "ఏంటే వనజా ఈ బట్టల మూట..?"..
Source: వినోదం | 21 Sep 2009 | 11:09 pm

అర్జెంటుగా వంట చేయడం నేర్చుకో..!

సుందర్ : "ఒరేయ్ నీ భార్య నువ్వు.. కొట్టుకోకుండా అంత అన్యోన్యంగా ఉండడానికి కారణాలు చెప్పరా..? నేను అలానే ఉండాలనుకుంటున్నానురా..!"..
Source: వినోదం | 21 Sep 2009 | 10:59 pm

దేశ రాజధానిలో మావోయిస్టు అగ్రనేత అరెస్ట్

సీపీఐ (మావోయిస్టు) పొలిట్‌బ్యూరోలోని ఓ సభ్యుడిని ఢిల్లీ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. దేశ రాజధానిలో ఓ మావోయిస్టు అగ్రనేతను ఢిల్లీ పోలీసు విభాగానికి చెందిన ప్రత్యేక సెల్ అదుపులోకి తీసుకుందని అధికారిక వర్గాలు వెల్లడించాయి.
Source: జాతీయ | 21 Sep 2009 | 10:22 pm

జశ్వంత్ బహిష్కరణను కోరుకోలేదు: అద్వానీ

బీజేపీ నుంచి సీనియర్ నేత జశ్వంత్ సింగ్‌ను బహిష్కరించాలని తాను కోరుకోలేదని ప్రతిపక్ష నేత ఎల్‌కే అద్వానీ తెలిపారు. జశ్వంత్ సింగ్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తూ ఇటీవల బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. పాక్ జాతిపిత జిన్నాను ప్రశంసిస్తూ పుస్తకం రాసినందుకు బీజేపీ ఈ నిర్ణయం తీసుకుంది.
Source: జాతీయ | 21 Sep 2009 | 9:51 pm

హీరో రవితేజకు ముదిరిన కులపిచ్చి!?

చిన్నచిన్న పాత్రలు వేసుకుంటూ హీరో రేంజ్‌కు ఎదిగిన వ్యక్తుల్లో రవితేజ ఒకరు. తెలుగు చిత్ర పరిశ్రమలో మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఈ పేరుతో పాటే తేజకు కులపిచ్చి కూడా కాస్త ఎక్కువగానే ఒంటబట్టినట్టు రాజధాని ఫిల్మ్‌నగర్ వర్గాలు అనుకుంటున్నాయి.
Source: Yahoo! Telugu: Entertainment | 21 Sep 2009 | 10:49 am

హాట్ హాట్ హాలీవుడ్ అడల్ట్ స్టార్స్

నెట్‌లో హీటెత్తించే ఫోటోలు ఎవరివై ఉంటాయి... అంటే ఖచ్చితంగా హాలీవుడ్ తారల పేర్లే బయటకు వినిపిస్తాయి. గుండెల్లో వేడి సెగలు పుట్టించే ఆ తారలకోసం నెటిజన్లు అదేపనిగా శోధిస్తూనే ఉంటారట. ప్రత్యేకించి కొంతమంది అడల్ట్ తారలంటే నెటిజన్లకు అమితమైన అభిమానం ఉన్నదట. ఆ అభిమానమే ఈ అడల్ట్ తారలకు మిలిన్ల వర్షం కురిపిస్తోందట. ఇంతకీ ఆ తారలెవరో చూద్దామా... సుమారు ఎనభైకి పైగా "పెద్దలకు మాత్రమే" టైపు చిత్రాల్లో నటించిన మేరీ కేరీ అందమైన అడల్ట్ నటీమణుల జాబితాలో ముందుకు దూసుకువచ్చి అగ్రస్థానంలో నిలుచుందట. ఆ తర్వాత ఇరవై అడల్ట్ చిత్రాల్లో తన హాట్ హాట్ అందాలను కనువిందు చేసిన జెన్నా జేమ్సన్ కుర్రకారు హృదయాలను కొల్లగొట్టి మేరీ కేరీ అందాలతో తన అందాలను పోటీగా ఉంచుతోందట.
Source: Yahoo! Telugu: Entertainment | 21 Sep 2009 | 10:08 am

రాజకీయ క్రీడలో కాంగ్రెస్ మంత్రులు: తెదేపా

ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి దుర్మరణంతో కాంగ్రెస్ మంత్రులు పొలిటికల్ గేమ్ ఆడుతున్నారని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపించారు. దీనిపై ఆ పార్టీ సీనియర్ నేతలు ఎర్రన్నాయుడు, నాగం జనార్థన్ రెడ్డిలు సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ శవ రాజకీయాలు చేస్తోందని వారు ఆగ్రహం ఆగ్రహం వ్యక్తం చేసింది.
Source: ఏపీ న్యూస్ | 21 Sep 2009 | 9:13 am

జగన్ సీఎం కాకుండా మీడియా కుట్ర: కె.కేశవరావు

దివంగత నేత వైఎస్.రాజశేఖర్ రెడ్డి తనయుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకుండా మీడియా శతవిధాలా అడ్డుకుంటోందని రాజ్యసభ సభ్యుడు, పీసీసీ మాజీ చీఫ్ కె.కేశవరావు ఆరోపించారు.
Source: ఏపీ న్యూస్ | 21 Sep 2009 | 7:32 am

2010-11 నాటికి జాతీయ గుర్తింపు కార్డులు: చిదంబరం

వచ్చే 2010-11 సంవత్సరం నాటికి దేశంలోని ప్రతి పౌరునికి జాతీయ గుర్తింపు కార్డులను అందజేస్తామని కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం తెలిపారు. సోమవారం ఆయన చెన్నయ్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ప్రాజెక్టు మొదటి దశలో భాగంగా 3,331 కోస్తా తీర గ్రామాల్లో నివశించే 1.3 కోట్ల మందికి గుర్తింపు కార్డులను ఈ యేడాది ఆఖరునాటికి అందిస్తామన్నారు
Source: జాతీయ | 21 Sep 2009 | 7:18 am

దక్షిణ కాశీ "ద్రాక్షారామం" మహిమాన్వితం...!

నిత్యం "ఓం నమ: శివాయ" అంటూ శివ నామస్మరణతో ప్రతిధ్వనించే పవిత్ర ధామం "ద్రాక్షారామం". "కాశీకి సమానమైన క్షేత్రమే ద్రాక్షారామమని" సాక్షాత్తూ అన్నపూర్ణాదేవి వ్యాస మహర్షితో అన్నట్లు పురాణేతిహాసాల్లో చెప్పబడింది. అందుకే దక్షిణ కాశీగా.. అఖిలాండకోటి భక్తుల కల్పతరువుగా... అలరారుతోంది ద్రాక్షారామ భీమేశ్వరాలయం.
Source: వినోదం | 21 Sep 2009 | 6:13 am

పూరి జగన్నాథ్‌కు రూ.4 కోట్లు చెల్లించిన వైఎస్ జగన్?

దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా పూరీ జగన్నాథ్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెల్సిందే. "రాజశేఖర్ రెడ్డి" అనే టైటిల్‌ను ఖరారు చేసిన ఈ చిత్రంలో యాంగ్రీ యంగ్‌మేన్ రాజశేఖర్ రెడ్డి హీరో పాత్రను పోషిస్తున్నారు. మిగిలిన తారాగణాన్ని ఎంపిక చేయాల్సి వుంది.
Source: Yahoo! Telugu: Entertainment | 21 Sep 2009 | 6:05 am

హీరో రవితేజకు ముదిరిన కులపిచ్చి!?

చిన్నచిన్న పాత్రలు వేసుకుంటూ హీరో రేంజ్‌కు ఎదిగిన వ్యక్తుల్లో రవితేజ ఒకరు. తెలుగు చిత్ర పరిశ్రమలో మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఈ పేరుతో పాటే తేజకు కులపిచ్చి కూడా కాస్త ఎక్కువగానే ఒంటబట్టినట్టు రాజధాని ఫిల్మ్‌నగర్ వర్గాలు అనుకుంటున్నాయి.
Source: వినోదం | 21 Sep 2009 | 5:21 am

రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం.. మీడియా సృష్టే: సీఎల్పీ

రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం తలెత్తిందని వస్తున్న వార్తలపై కాంగ్రెస్ శాసనసభాపక్షం మండిపడింది. పూర్తి స్థాయి ముఖ్యమంత్రి, మంత్రివర్గం పరిపాలన చేస్తుండగా సంక్షోభం ఎక్కడ ఏర్పడిందని ప్రశ్నించారు. ఈ అంశంలో మీడియా లేనిపోని రాద్ధాంతం చేస్తోందని ఆ పార్టీకి చెందిన మంత్రులు రఘువీరా రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, వట్టి వసంత కుమార్‌లో ఆరోపించారు.
Source: ఏపీ న్యూస్ | 21 Sep 2009 | 4:55 am

వైఎస్‌ను దూషించిన మాట నిజమే: సినీ నటి రోజా

దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డిని పలు సందర్భాల్లో దూషించిన మాట నిజమేనని తెలుగుదేశం పార్టీ మాజీ మహిళా నేత, సినీ నటి ఆర్కే.రోజా అన్నారు. అయితే, అవి వ్యక్తిగతం కావని, పార్టీ సిద్ధాంతాల మేరకు తాను వైఎస్సార్‌పై విమర్శలు చేశానని వివరణ ఇచ్చుకున్నారు.
Source: ఏపీ న్యూస్ | 21 Sep 2009 | 4:43 am

హాట్ హాట్ హాలీవుడ్ అడల్ట్ స్టార్స్

నెట్‌లో హీటెత్తించే ఫోటోలు ఎవరివై ఉంటాయి... అంటే ఖచ్చితంగా హాలీవుడ్ తారల పేర్లే బయటకు వినిపిస్తాయి. గుండెల్లో వేడి సెగలు పుట్టించే ఆ తారలకోసం నెటిజన్లు అదేపనిగా శోధిస్తూనే ఉంటారట. ప్రత్యేకించి కొంతమంది అడల్ట్ తారలంటే నెటిజన్లకు అమితమైన అభిమానం ఉన్నదట. ఆ అభిమానమే ఈ అడల్ట్ తారలకు మిలిన్ల వర్షం కురిపిస్తోందట. ఇంతకీ ఆ తారలెవరో చూద్దామా... సుమారు ఎనభైకి పైగా "పెద్దలకు మాత్రమే" టైపు చిత్రాల్లో నటించిన మేరీ కేరీ అందమైన అడల్ట్ నటీమణుల జాబితాలో ముందుకు దూసుకువచ్చి అగ్రస్థానంలో నిలుచుందట. ఆ తర్వాత ఇరవై అడల్ట్ చిత్రాల్లో తన హాట్ హాట్ అందాలను కనువిందు చేసిన జెన్నా జేమ్సన్ కుర్రకారు హృదయాలను కొల్లగొట్టి మేరీ కేరీ అందాలతో తన అందాలను పోటీగా ఉంచుతోందట.
Source: వినోదం | 21 Sep 2009 | 4:40 am

అస్సోంలో భారీ భూకంపం: గౌహతిలో తీవ్ర నష్టం

అస్సోం రాష్ట్రంలో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైంది. సోమవారం మధ్యాహ్నం 2.26 నిమిషాల ప్రాంతంలో ఈ భూకంపం సంభవించింది. ఈ భూకంప ప్రకంపనలు అస్సోం రాష్ట్రాన్ని తీవ్రంగా కుదిపేయగా, మిగిలిన ఈశాన్య రాష్ట్రాల్లో సైతం ప్రకంపనల ప్రభావం కనిపించింది.
Source: జాతీయ | 21 Sep 2009 | 4:00 am