|
బిగ్‌బజార్‌ను బయటకు తెచ్చే ప్రయత్నం: బియానీఫ్యూచర్ గ్రూపు నుంచి బిగ్‌బజార్ హైపర్‌మార్కెట్ చైన్‌ను బయటకు తీసుకొచ్చే ఆలోచన ఉన్నట్లు ఆ గ్రూపు ఉన్నతాధికారి ఒకరు ఆదివారం వెల్లడించారు. గ్రూపు ప్రతిష్టాత్మక పునఃవ్యవస్థీకరణ, అభివృద్ధి ప్రణాళికల్లో భాగంగా ఫ్యూచర్ గ్రూపు నుంచి బిగ్ బజార్‌ను బయటకు తీసుకురావాలనుకుంటున్నట్లు చెప్పారు.Source: Yahoo! Telugu: News | 21 Sep 2009 | 10:06 am అస్సోంలో భారీ భూకంపం: గౌహతిలో తీవ్ర నష్టంఅస్సోం రాష్ట్రంలో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైంది. సోమవారం మధ్యాహ్నం 2.26 నిమిషాల ప్రాంతంలో ఈ భూకంపం సంభవించింది. ఈ భూకంప ప్రకంపనలు అస్సోం రాష్ట్రాన్ని తీవ్రంగా కుదిపేయగా, మిగిలిన ఈశాన్య రాష్ట్రాల్లో సైతం ప్రకంపనల ప్రభావం కనిపించింది.Source: Yahoo! Telugu: News | 21 Sep 2009 | 9:29 am లిబియా నేత గడాఫీతో గోర్డాన్ బ్రౌన్ సమావేశంబ్రిటన్ ప్రధాని గోర్డాన్ బ్రౌన్ గురువారం ఐక్యరాజ్యసమితి సమావేశంలో భాగంగా లిబియా నేత మౌమర్ గడాఫీతో భేటీ కానున్నారు. లాకర్‌బీ బాంబర్ విడుదల తరువాత ఇరుదేశాల నేతలు తొలిసారి సమావేశమవుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. 1988 లాకర్‌బీ ప్రాంతంలో విమానాన్ని కూల్చివేసిన కేసులో దోషిగా తేలిన ఓ లిబియా ఏజెంట్‌ను గత నెలలో స్కాట్లాండ్ యంత్రాంగం ముందుగా విడుదల చేసింది.Source: Yahoo! Telugu: News | 21 Sep 2009 | 9:20 am 'మహా' సమరం: శివసేన తొలి జాబితా విడుదలమహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమరంలో బరిలోకి దింపే అభ్యర్థుల తొలి జాబితాను శివసేన ప్రకటించింది. ఈ ఎన్నికల్లో శివసేన పార్టీ 169 స్థానాల్లో పోటీ చేస్తుండగా, భారతీయ జనతా పార్టీ 119 సీట్లలో పోటీ చేస్తోంది.Source: Yahoo! Telugu: News | 21 Sep 2009 | 7:49 am జనం మధ్యకు జగన్మోహనుడు.. 'సి' బ్లాకులోకి కొణిజేటి!జగన్మోహనుడి రథ చక్రాలు కదిలాయి. రాష్ట్ర రాజధానిలోని క్యాంపు కార్యాలయాన్ని వీడారు. నేరుగా తన సొంతూరు పులివెందులకు వెళ్లారు. అక్కడ నుంచి తన తండ్రి సేదతీరుతున్న ఇడుపులపాయ ఎస్టేట్‌కు చేరుకున్నారు.Source: Yahoo! Telugu: News | 21 Sep 2009 | 7:31 am ఆర్థిక వ్యవస్థపై పునరాలోచించాలి: ఒబామాఅంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు కొత్త రూపును ఇచ్చేందుకు కృషి చేయాలని ప్రపంచ దేశాల నేతలను తాను కోరనున్నట్లు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తెలిపారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పునరాలోచన జరపాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వారం జరిగే జి- 20 దేశాల సమావేశంలో తాను ఈ విషయాన్ని లేవనెత్తనున్నట్లు తెలిపారు.Source: Yahoo! Telugu: News | 21 Sep 2009 | 7:31 am థాయ్‌లాండ్ రాజు భూమిబోల్ ఆస్పత్రిపాలుథాయ్లాండ్ రాజు భూమిబోల్ అడుల్యాదెజ్ (81) జ్వరం, నీరసంతో ఆస్పత్రిలో చేరారు. ఈ మేరకు థాయ్‌లాండ్ రాజ మందిరం ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. వైద్యుల సిఫార్సు మేరకు శనివారం రాత్రి అస్వస్థత కారణంగా రాజు భూమిబోల్‌ను సిరిరాజ్ ఆస్పత్రికి తరలించామని రాయల్ హోల్‌హోల్డ్ బ్యూరో వెల్లడించింది.Source: Yahoo! Telugu: News | 21 Sep 2009 | 7:16 am 26/11 దాడులు.. సయీద్ వద్ద విచారణ జరిపాలి: చిదంబరందేశ వాణిజ్య రాజధాని ముంబైపై గత యేడాది నవంబరు 26వ తేదీన జరిగిన తీవ్రవాద దాడులకు సంబంధించి జైషే మొహ్మద్ సంస్థ చీఫ్ హఫీజ్ మొహమ్మద్ సయీద్‌ను విచారించాలని కేంద్ర హోం శాఖామంత్రి పి.చిదంబరం డిమాండ్ చేశారు.Source: Yahoo! Telugu: News | 21 Sep 2009 | 6:45 am మహిళ లాకప్ డెత్: నలుగురు ఖాకీల సస్పెండ్జిల్లా కేంద్రమైన ఒంగోలు రెండో పట్టణ పోలీసు స్టేషన్‌లో జ్యోతి అనే మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. దీన్ని పోలీసులు ఆత్మహత్యగా చిత్రీకరించారు. అయితే, దీనిపై ప్రాథమిక దర్యాప్తు జరిపిన పోలీసు ఉన్నతాధికారులు మాత్రం స్టేషన్ ఎస్‌ఐతో పాటు.. హెడ్ కానిస్టేబుల్, మరో ఇద్దరు కానిస్టేబుల్స్‌పై సస్పెన్షన్ వేటు వేశారు.Source: Yahoo! Telugu: News | 21 Sep 2009 | 6:24 am పరిస్థితులు మెరుగుపడితే వస్తా: ముషారఫ్పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు, మిలిటరీ పాలకుడు పర్వేజ్ ముషారఫ్ తన స్వదేశాగమనంపై మాట్లాడుతూ.. దేశంలో పరిస్థితులు మెరుగుపడితే తాను తిరిగి వస్తానని తెలిపారు. ఫిలడెల్ఫియా నుంచి జియో టీవీ ఛానల్‌తో ముషారఫ్ మాట్లాడుతూ.. అనుకూల వాతావరణం నెలకొంటే తాను తిరిగి పాక్‌కు వస్తానని వెల్లడించారుSource: Yahoo! Telugu: News | 21 Sep 2009 | 6:09 am పూరి జగన్నాథ్‌కు రూ.4 కోట్లు చెల్లించిన వైఎస్ జగన్?దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా పూరీ జగన్నాథ్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెల్సిందే. "రాజశేఖర్ రెడ్డి" అనే టైటిల్‌ను ఖరారు చేసిన ఈ చిత్రంలో యాంగ్రీ యంగ్‌మేన్ రాజశేఖర్ రెడ్డి హీరో పాత్రను పోషిస్తున్నారు. మిగిలిన తారాగణాన్ని ఎంపిక చేయాల్సి వుంది.Source: Yahoo! Telugu: Entertainment | 21 Sep 2009 | 6:05 am అస్సోంలో భారీ భూకంపం: గౌహతిలో తీవ్ర నష్టంఅస్సోం రాష్ట్రంలో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైంది. సోమవారం మధ్యాహ్నం 2.26 నిమిషాల ప్రాంతంలో ఈ భూకంపం సంభవించింది. ఈ భూకంప ప్రకంపనలు అస్సోం రాష్ట్రాన్ని తీవ్రంగా కుదిపేయగా, మిగిలిన ఈశాన్య రాష్ట్రాల్లో సైతం ప్రకంపనల ప్రభావం కనిపించింది.Source: జాతీయ | 21 Sep 2009 | 4:00 am 'మహా' సమరం: శివసేన తొలి జాబితా విడుదలమహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమరంలో బరిలోకి దింపే అభ్యర్థుల తొలి జాబితాను శివసేన ప్రకటించింది. ఈ ఎన్నికల్లో శివసేన పార్టీ 169 స్థానాల్లో పోటీ చేస్తుండగా, భారతీయ జనతా పార్టీ 119 సీట్లలో పోటీ చేస్తోంది.Source: జాతీయ | 21 Sep 2009 | 2:22 am 26/11 దాడులు.. సయీద్ వద్ద విచారణ జరిపాలి: చిదంబరందేశ వాణిజ్య రాజధాని ముంబైపై గత యేడాది నవంబరు 26వ తేదీన జరిగిన తీవ్రవాద దాడులకు సంబంధించి జైషే మొహ్మద్ సంస్థ చీఫ్ హఫీజ్ మొహమ్మద్ సయీద్‌ను విచారించాలని కేంద్ర హోం శాఖామంత్రి పి.చిదంబరం డిమాండ్ చేశారు.Source: జాతీయ | 21 Sep 2009 | 1:16 am మహిళ లాకప్ డెత్: నలుగురు ఖాకీల సస్పెండ్జిల్లా కేంద్రమైన ఒంగోలు రెండో పట్టణ పోలీసు స్టేషన్‌లో జ్యోతి అనే మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. దీన్ని పోలీసులు ఆత్మహత్యగా చిత్రీకరించారు. అయితే, దీనిపై ప్రాథమిక దర్యాప్తు జరిపిన పోలీసు ఉన్నతాధికారులు మాత్రం స్టేషన్ ఎస్‌ఐతో పాటు.. హెడ్ కానిస్టేబుల్, మరో ఇద్దరు కానిస్టేబుల్స్‌పై సస్పెన్షన్ వేటు వేశారు.Source: ఏపీ న్యూస్ | 21 Sep 2009 | 12:54 am షార్ పీఎస్‌ఎల్‌వీ ప్రయోగానికి కౌంట్‌డౌన్ ఆరంభంనెల్లూరు జిల్లా శ్రీహరి కోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం (షార్ సెంటర్) మరో ప్రయోగానికి ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ కేంద్రం నుంచి పీఎస్‌ఎల్‌వి-సి 14 ఉపగ్రహ వాహక నౌక ప్రయోగం ఈనెల 23వ తేదీన జరుగనుంది. ఇందుకోసం సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు కౌంట్‌డౌన్ ఆరంభమైంది.Source: జాతీయ | 21 Sep 2009 | 12:11 am తిరుపతి ఎమ్మెల్యేకు ఆహ్వానం పంపని తితిదేతిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) మరో వివాదానికి తెరలేపింది. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు స్థానిక ఎమ్మెల్యేను ఆహ్వానించాలనే నిబంధన ఉంది. అయితే, ప్రజారాజ్యం పార్టీ, తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవిని తితిదే అధికారులు పట్టించుకోలేదు. ఇది సరికొత్త వివాదానికి దారిస్తోంది.Source: ఏపీ న్యూస్ | 20 Sep 2009 | 11:54 pm రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం: బండారు దత్తాత్రేయరాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నెలకొనివుందని, దీనికి కాంగ్రెస్ అధినాయకత్వం నైతిక బాధ్యత వహించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ ఆరోపించారు. దీనిపై ఆయన హైదరాబాద్‌లో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా ఆర్థిక మంత్రి రోశయ్యను నియమించినప్పటికీ.. ఆయన పరిపాలనపై పట్టు సాధించలేక పోతున్నారన్నారు.Source: ఏపీ న్యూస్ | 20 Sep 2009 | 11:40 pm ముస్లిం సోదరులకు ప్రధాని రంజాన్ శుభాకాంక్షలురంజాన్ పండుగ సందర్భంగా ప్రధాని మన్మోహన్ సింగ్ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ రంజాన్ ముస్లిం సోదరుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. సోదరభావాన్ని, భిన్నత్వంలో ఏకత్వాన్ని పెంపొందించే రంజాన్ పండుగ అందరి జీవితాల్లో సుఖసంతోషాలతోపాటు శాంతిని కలుగజేయాలని కోరుకుంటున్నట్లు ప్రధాని తన సందేశంలో తెలిపారు.Source: జాతీయ | 20 Sep 2009 | 11:02 pm పోలీస్ స్టేషన్ల అనుసంధానంపై హోం శాఖ దృష్టిపోలీసు దళాలను ఆధునికీకరించడం, వారి సామర్థ్యాన్ని పెంచడం కోసం కేంద్ర హోం శాఖ దేశవ్యాప్తంగా పోలీస్ స్టేషన్లను అనుసంధానం చేసే కార్యక్రమంపై దృష్టి పెట్టింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 14 వేల పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. వీటిని అనుసంధానం చేసే ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి ముల్లపల్లి రామచంద్రన్ ఆదివారం వెల్లడించారు.Source: జాతీయ | 20 Sep 2009 | 10:53 pm దేశవ్యాప్తంగా స్వైన్ ఫ్లూతో మరో 8 మంది మృతిప్రమాదకర స్వైన్ ఫ్లూ వైరస్ దేశవ్యాప్తంగా మరో ఎనిమిది మంది ప్రాణాలు బలిగొంది. ఆదివారం స్వైన్ ఫ్లూ కారణంగా ఈ మరణాలు సంభవించాయి. దీంతో దేశంలో ఇప్పటివరకు స్వైన్ ఫ్లూ బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 240కి చేరుకుంది. ఇదిలా ఉంటే తాజాగా ఆరోగ్య శాఖ మరో 253 స్వైన్ ఫ్లూ కేసులు గుర్తించింది.Source: జాతీయ | 20 Sep 2009 | 10:03 pm చిత్ర షూటింగ్ సమయంలో నెల తప్పిన నయనతార!?తెలుగు, తమిళ చిత్ర సీమల్లో సంచలనాలకు కేంద్ర బిందుగా నిలిచే హీరోయిన్లలో మలయాళ కుట్టి నయనతార అగ్రస్థానంలో ఉంటారు. ఆమె ఎక్కడకు వెళ్లినా ఏదో ఒక సంచలనమే. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న అదుర్స్ చిత్రంలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ....Source: Yahoo! Telugu: Entertainment | 20 Sep 2009 | 11:43 am ప్రధాని మన్మోహన్‌కు వైద్య పరీక్షలు: ఆరోగ్యం భేష్ప్రధాని మన్మోహన్ సింగ్ ఆదివారం వైద్య పరీక్షలు చేయించుకున్నారు. రొటీన్ హెల్త్ చెకప్‌లో భాగంగానే ఆదివారం ఈ పరీక్షలు నిర్వహించినట్టు పీఎం వ్యక్తిగత వైద్యుడు కె.శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఎనిమిది నెలల క్రితం ప్రధానికి కరోనరీ బైపాస్ సర్జరీ చేసిన విషయం తెల్సిందే.Source: జాతీయ | 20 Sep 2009 | 4:31 am మంచి రోజున సీఎం బ్లాకులో అడుగుపెడతా: రోశయ్యఒక మంచి రోజు చూసుకుని ముఖ్యమంత్రి కార్యకలాపాలు సాగించే "సీ" బ్లాకులోకి వెళతానని ప్రస్తుతం సీఎం కె.రోశయ్య తెలిపారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ సీ బ్లాకులోకి వెళ్లడం విశేషమేమీ కాదని కాదన్నారు. ఏదో ఒక మంచి రోజున అడుగు పెడతానని చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 20 Sep 2009 | 4:14 am ప్రరాపా నూతన కార్యవర్గాన్ని ప్రకటించిన చిరుప్రజారాజ్యానికి కొత్త కార్యవర్గాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు చిరంజీవి ఆదివారం ప్రకటించారు. సీనియర్ నేత పర్వతనేని ఉపేంద్ర నేతృత్వంలో ఏర్పాటైన కార్యవర్గంలో ఏడుగురు ఉపాధ్యక్షులు, తొమ్మిది మంది ప్రధాన కార్యదర్శులు, ఒక కార్యనిర్వాహక కార్యదర్శి ఉంటారు.Source: ఏపీ న్యూస్ | 20 Sep 2009 | 3:43 am
|