|
యుద్ధ నేరాల్లో రెండింటికి ప్రమేయం ఉందిఇజ్రాయేల్, పాలస్తీనా రెండూ యుద్ధ నేరాలకు పాల్పడ్డాయని ఐక్యరాజ్యసమితి నివేదిక ఒకటి వెల్లడించింది. గాజా ప్రాంతంలో ఈ రెండు దేశాలు యుద్ధ నేరాలకు పాల్పడ్డాయని ఈ నివేదిక పేర్కొంది. ఇందులో ముఖ్యంగా ఇజ్రాయేల్‌కు ఎక్కువ పాత్ర ఉందని వెల్లడించింది.Source: Yahoo! Telugu: News | 16 Sep 2009 | 9:19 am కమల్, వెంకీల "ఈనాడు" సినిమా ట్రైలర్ మీకోసం...వైవిధ్యమైన సినిమాలతో ఏదో కొత్తదనాన్ని తన పాత్రల ద్వారా ప్రేక్షకులకు చూపించాలని పరితపించే పద్మభూషణ్ కమల్ హాసన్.. తాజాగా సామాజిక పరిస్థితులకు అద్దంపట్టే కథాంశంతో "ఈనాడు" చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కమల్ హాసన్, విక్టరీ వెంకటేష్ నటిస్తోన్న ఈ చిత్రాన్ని తన అభిరుచికి అనుగుణంగా కమల్ సొంతగా నిర్మించడం ఓ విశేషం.Source: Yahoo! Telugu: Entertainment | 16 Sep 2009 | 9:04 am లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్స్టాక్ మార్కెట్ ప్రస్తుతం లాభాల్లో కొనసాగుతుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 153 పాయింట్లు పుంజుకుని 16,607 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 47 పాయింట్లు లాభపడి 4,939 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.93 శాతం, నిఫ్టీ 0.95 శాతం మేరకు వృద్ధి చెందాయి.Source: Yahoo! Telugu: News | 16 Sep 2009 | 8:56 am '8" సిరీస్‌తో ఎయిర్‌టెల్ మొబైల్ నెంబర్ఆసియా టెలికాం రంగంలో అగ్రగామిగానున్న ఎయిర్‌టెల్ సంస్థ రాజస్థాన్ రాష్ట్రంలో "8" సిరీస్‌తో కొత్త మొబైల్ నంబర్‌ను వినియోగిదారులకు అందించింది.Source: Yahoo! Telugu: News | 16 Sep 2009 | 8:09 am నక్సల్స్ హింసను అణచి వేయండి: ప్రధాని పిలుపుదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో చెలరేగుతున్న నక్సల్స్ హింసను ఉక్కుపాదంతో అణిచి వేయాలని ప్రధాని మన్మోహన్ సింగ్ పిలుపునిచ్చారు. పలు ప్రాంతాల్లో ఇప్పటికీ వామపక్ష తీవ్రవాదం పెట్రేగుతూనే ఉందని, ఇలాంటి దుశ్చర్యలకు అడ్డుకట్ట వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.Source: Yahoo! Telugu: News | 16 Sep 2009 | 8:04 am లాభాల్లో పయనిస్తున్న స్టాక్ మార్కెట్స్టాక్ మార్కెట్ ప్రస్తుతం లాభాల్లో పయనిస్తుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 141 పాయింట్లు పుంజుకుని 16,595 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 45 పాయింట్లు లాభపడి 4,937 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.85 శాతం, నిఫ్టీ 0.92 శాతం మేరకు వృద్ధి చెందాయి.Source: Yahoo! Telugu: News | 16 Sep 2009 | 8:00 am గృహ నిర్బంధంలో సిరిసిల్ల ఎమ్మెల్యే రామారావుకరీంనగర్ జిల్లా గర్జనపల్లి జడ్పీటీసీ ఉప ఎన్నికను పురస్కరించుకుని సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే, తెరాస అధినేత కేసీఆర్ తనయుడు కె.తారక రామారావును పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు.Source: Yahoo! Telugu: News | 16 Sep 2009 | 7:56 am అధిష్టానం తలచుకుంటే జగనే ముఖ్యమంత్రి: కేవీపీకాంగ్రెస్ అధిష్టానం తలచుకుంటే ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసునిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంపిక అవుతారని ఆయన ఆయన ఆప్తమిత్రుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కేవీపీ.రామచంద్రరావు అభిప్రాయపడ్డారు. దీనిపై ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పదవికి వైఎస్ జగన్ అర్హుడన్నారు.Source: Yahoo! Telugu: News | 16 Sep 2009 | 7:47 am బలపడుతున్న తీవ్రవాద సంబంధాలు: ముల్లెన్ఆఫ్ఘనిస్థాన్- పాకిస్థాన్‌ల మధ్య తీవ్రవాద సంబంధాలు బలపడుతున్నాయని అమెరికా ఉన్నతాధికారి మైక్ ముల్లెన్ తెలిపారు. ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ దేశాల్లోని వివిధ తీవ్రవాద సంస్థల మధ్య సంబంధాలు బాగా బలపడుతున్నాయని, వీటి ద్వారా అల్ ఖైదా, తాలిబాన్ తీవ్రవాద సంస్థలు పునరుత్తేజం పొందే అవకాశం ఉందని అమెరికా మిలిటరీ కమాండర్ ముల్లెన్ వెల్లడించారు.Source: Yahoo! Telugu: News | 16 Sep 2009 | 7:27 am రోజాకు గ్రీన్ సిగ్నల్: మహిళా కాంగ్రెస్ మణుల్లో ఆందోళనతెలుగుదేశం మహిళా విభాగం అధ్యక్షురాలు సినీనటి రోజాను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.Source: Yahoo! Telugu: News | 16 Sep 2009 | 7:27 am పీసీ విక్రయాల పెంపుపై హెచ్‌సీఎల్ దృష్టిప్రముఖ అంతర్జాతీయ కంప్యూటర్ తయారీ సంస్థ హెచ్‌సీఎల్ ఇన్ఫోసిస్టమ్స్ కంపెనీ.. ల్యాప్‌టాప్, పర్సనల్ కంప్యూటర్ విక్రయాల పెంపుపై దృష్టి సారించింది. మరో మూడేళ్ల లేదా నాలుగేళ్లలోపు 50 నిష్పత్తితో విక్రయాలను మరింతగా పెంచాలని హెచ్‌సీఎల్ ప్రణాళిక చేస్తోంది. ముంబైలో హెచ్‌సీఎల్ కంపేనీ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఉపాధ్యక్షుడు జార్జి పాల్ మాట్లాడుతూ...Source: Yahoo! Telugu: News | 16 Sep 2009 | 7:15 am 'డర్టీ డ్యాన్సింగ్' హీరో "పాట్రిక్ స్వేజ్" పర్సనల్ టచ్!భారతీయులకు "సిటీ ఆఫ్ జాయ్" చిత్రం ద్వారా పరిచయమైన హాలీవుడ్ సంచలనం పాట్రిక్ స్వేజ్ కన్నుమూశారు. "డర్టీ డ్యాన్సింగ్"తో ప్రేక్షకులను ఆకట్టునికి "ఘోస్ట్"లో తన భార్యపై ప్రేమ కురిపించిన పాత్రలో మురిపించిన పాట్రిక్ కాన్సర్‌తో సోమవారం మరణించాడు. పాట్రిక్ తండ్రి కొరియోగ్రాఫర్ కావడంతో పాట్రిక్ సహజంగానే నర్తకుడయ్యాడు. సినిమాల్లోకి ప్రవేశించకముందు డ్యాన్స్ ప్రోగ్రామ్‌లు ఇచ్చేవారు. దీంతో డర్టీ డ్యాన్సింగ్ చిత్రంలో రాక్ డ్యాన్సర్‌గా జానీ క్యాజిల్ పాత్రలో జీవించి.. లక్షల మంది అభిమానుల హృదయాల్లో స్థానం ఏర్పరుచుకున్నాడు. మూడుసార్లు గోల్డెన్ గ్లోబ్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. 1987లో అతను నటించిన "నో వన్ పుట్స్ బేబీ ఇన్ ఏ కార్నర్" చిత్రం హాలీవుడ్ రొమాంటిక్ చిత్రాల్లో ఓ కావ్యంగా స్థానం సంపాదించుకుంది. పుట్టిన తేది.. ఆగస్టు 18, 1952,జన్మస్థలం: హూస్టన్, టెక్సాస్,భార్యపేరు: లీజా నియోమిసోదరుని పేరు: డాన్ స్వేజ్తండ్రి: కేథలిక్, బాప్టిస్ట్, సైంటలాజిస్ట్, బౌద్ధమతస్తుడు.2008 జనవరి నుంచి క్యానర్‌తో బాధపడిన పాట్రిక్ సెప్టెంబర్ 14, 2009లో మరణించారు.Source: Yahoo! Telugu: Entertainment | 16 Sep 2009 | 6:18 am సల్మాన్ పెద్ద సోమరిపోతు: కత్రినా కైఫ్సల్మాన్ ఖాన్ పేరెత్తితేనే బాలీవుడ్ హీరోయిన్లకు దడ దడ. అతడి గురించి పల్లెత్తు మాట అనాలన్నా వణికిపోతారు. కానీ కత్రినాకైఫ్ మాత్రం సల్మాన్‌ఖాన్ ఓ పెద్ద సోమరిపోతు అని నిర్భయంగా చెపుతోంది. అతడితో తనకున్న పరిచయంలో తను గమనించినది ఇదేనంటోందట. సల్మాన్ ను ఇలా కామెంట్ చేస్తున్నారు.... మీకేం భయం వేయడం లేదా...? అనడిగితే... ఉన్న విషయాన్నే చెప్పా. అతడు తనకు మంచి స్నేహితుడు కనుక ఏమైనా అంటానని చెపుతోందట. ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం ఎందుకు బెడిసి కొట్టిందని అడిగితే.... దాని గురించి సల్మానే చెప్పాలి. నేను మాత్రం అతడిని పెద్ద సోమరిపోతు అని అంటానని చెప్పిందట. తను ఎంతగానో ప్రేమించిన ప్రియురాలే కనుక సల్మాన్ ఖాన్ బహుశా కత్రినాను ఏమీ అనకపోవచ్చు. మరొకరైతే... తగిన రీతిలో మంచి గుణపాఠం చెప్పి తీరుతాడు. ఏదేమైనా కత్రినా కత్తిలాంటి డైలాగులను విని సల్మాన్ ఊరుకుంటాడో... లేదంటే ఇటీవల ఐష్‌తో తనకు గల అనుబంధాన్ని మీడియాలో ఇంటర్యూల ద్వారా ఏకిపారేస్తున్నట్లుగా కత్రినాకైఫ్‌ను కూడా గాలికి కట్టేస్తాడో చూడాలి మరి.Source: Yahoo! Telugu: Entertainment | 16 Sep 2009 | 6:14 am నక్సల్స్ హింసను అణచి వేయండి: ప్రధాని పిలుపుదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో చెలరేగుతున్న నక్సల్స్ హింసను ఉక్కుపాదంతో అణిచి వేయాలని ప్రధాని మన్మోహన్ సింగ్ పిలుపునిచ్చారు. పలు ప్రాంతాల్లో ఇప్పటికీ వామపక్ష తీవ్రవాదం పెట్రేగుతూనే ఉందని, ఇలాంటి దుశ్చర్యలకు అడ్డుకట్ట వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.Source: జాతీయ | 16 Sep 2009 | 4:14 am గృహ నిర్బంధంలో సిరిసిల్ల ఎమ్మెల్యే రామారావుకరీంనగర్ జిల్లా గర్జనపల్లి జడ్పీటీసీ ఉప ఎన్నికను పురస్కరించుకుని సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే, తెరాస అధినేత కేసీఆర్ తనయుడు కె.తారక రామారావును పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు.Source: ఏపీ న్యూస్ | 16 Sep 2009 | 2:27 am అధిష్టానం తలచుకుంటే జగనే ముఖ్యమంత్రి: కేవీపీకాంగ్రెస్ అధిష్టానం తలచుకుంటే ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసునిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంపిక అవుతారని ఆయన ఆయన ఆప్తమిత్రుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కేవీపీ.రామచంద్రరావు అభిప్రాయపడ్డారు. దీనిపై ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పదవికి వైఎస్ జగన్ అర్హుడన్నారు.Source: ఏపీ న్యూస్ | 16 Sep 2009 | 2:18 am రోజాకు గ్రీన్ సిగ్నల్: మహిళా కాంగ్రెస్ మణుల్లో ఆందోళనతెలుగుదేశం మహిళా విభాగం అధ్యక్షురాలు సినీనటి రోజాను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.Source: ఏపీ న్యూస్ | 16 Sep 2009 | 1:58 am రాహుల్ రైలుపై రాళ్ల దాడి: దర్యాప్తు చేపట్టిన పోలీసులుకాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ ప్రయాణించిన రైలుపై కొందరు దుండగులు రాళ్లతో దాడిచేసిన సంఘటనపై హర్యానా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రైలుపై రాళ్లు రువ్విన వారిని గుర్తించేందుకు స్థానిక పోలీసులతో పాటు.. ఆర్పీఎఫ్, ఫోరెన్సిక్ నిపుణులు కొంత మంది ప్రజలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.Source: జాతీయ | 16 Sep 2009 | 12:16 am "మహా" సీట్ల ఒప్పందంపై 18న అధికారిక ప్రకటనత్వరలో జరుగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్, ఎన్.సి.పి పార్టీల మధ్య సీట్ల ఒప్పందం బుధవారం ఖరారయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే, దీనిపై అధికారిక ప్రకటన మాత్రం శుక్రవారం వెల్లడించే అవకాశాలు ఉన్నట్టు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.Source: జాతీయ | 15 Sep 2009 | 11:56 pm త్వరలో రోజాకు కాంగ్రెస్ తీర్థం: ధర్మపురి శ్రీనివాస్తెలుగు మహిళా మాజీ అధ్యక్షురాలు సినీ నటి ఆర్కే.రోజా త్వరలోనే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటారని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ తెలిపారు. అయితే, తెలుగుదేశం పార్టీకి చెందిన తిరుగుబాటు ఎమ్మెల్యేలైన నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి....Source: ఏపీ న్యూస్ | 15 Sep 2009 | 11:49 pm కేవీపీకి మరోమారు ఢిల్లీ అధిష్టానం పిలుపుదివంగత నేత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి ఆప్తమిత్రుడు, రాజ్యసభ సభ్యుడు కేవీపీ.రామచంద్రరావుకు మరోమారు కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపువచ్చింది. ఈనెల 18వ తేదీన ఢిల్లీకి బయలుదేరి రావాల్సిందిగా ఆదేశించింది.Source: ఏపీ న్యూస్ | 15 Sep 2009 | 11:16 pm నక్సల్స్ విషయంలో పెద్దగా సాధించిందేమీ లేదుదేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని అరికట్టడంలో ప్రభుత్వం పెద్దగా విజయం సాధించిందేమీ లేదని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అంగీకరించారు. నక్సల్ సమస్య నుంచి దేశ అంతర్గత భద్రతకు తీవ్ర ముప్పు పొంచివుందని హెచ్చరించారు. ప్రధాని మన్మోహన్ సింగ్ మంగళవారం డీజీపీ, ఐజీపీల సమావేశంలో మాట్లాడుతూ.. దేశంలో వివిధ మార్గాల ద్వారా చొరబాట్లు కూడా ఇటీవల కాలంలో పెరిగాయని తెలిపారు.Source: జాతీయ | 15 Sep 2009 | 10:16 pm ఇన్ఫోసిస్ విజయాలను కీర్తించిన సోనియా గాంధీయూపీఏ ఛైర్‌పర్సన్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ సాధించిన విజయాలను కీర్తించారు. సోనియా మంగళవారం మాట్లాడుతూ.. భారత్‌ను మెరుగైన సమాజంగా మార్చడంలో ఇన్ఫోసిస్ విజయం సాధించిందన్నారు. భారతీయుల సత్తా ఏమిటో ప్రపంచానికి ఈ సాఫ్ట్‌వేర్ దిగ్గజం చాటి చెప్పిందని ప్రశంసించారు.Source: జాతీయ | 15 Sep 2009 | 9:37 pm కరిష్మా కొటక్ ప్రధాన పాత్రలో "గ్లామర్"కరిష్మా కొటక్ ప్రధాన పాత్రలో పి. సత్యారెడ్డి నిర్మాణదర్శకత్వంలో రూపొందుతోన్న "గ్లామర్" చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ నెల 10 నుంచి 25వరకు ముంబై పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ చేస్తున్నామని సత్యారెడ్డి చెప్పారు.Source: Yahoo! Telugu: Entertainment | 15 Sep 2009 | 1:40 pm "బెండు అప్పారావు" ఆడియో విడుదలనరేష్ హీరోగా కామ్నజఠ్మలానీ హీరోయిన్‌గా సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఇ.వి.వి. సత్యనారాయణ దర్శకత్వం వహించిన "బెండు అప్పారావు" చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం రామానాయుడు స్టూడియోలో జరిగింది. హీరో విక్టరీ వెంకటేష్ ఆడియోను విడుదలచేసి రామానాయుడు మనుమడు అభిరామ్‌కు తొలికేసెట్‌ను అందజేశారు. సీడీని రామానాయుడు ఆవిష్కరించి సంగీతదర్శకుడు కోటికి అందించారు.Source: Yahoo! Telugu: Entertainment | 15 Sep 2009 | 1:35 pm దాసరి చేతులమీదుగా "వెండివెన్నెల" పుస్తకావిష్కరణతెలుగుసినిమా టాకీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారంనాడు సీనియర్ పాత్రికేయుడు వినాయకరావు రచించిన "వెండివెన్నెల" పుస్తకాన్ని లాంఛనంగా ఆవిష్కరించారు. టాకీ తొలిచిత్రంలో నటించిన ఎల్.వి.ప్రసాద్‌కు చెందిన ప్రసాద్‌ల్యాబ్స్‌లో ఈ వేడుక జరగడం విశేషం. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డా. దాసరి నారాయణరావు చేతులమీదుగా పుస్తకావిష్కరణ జరిగింది.Source: Yahoo! Telugu: Entertainment | 15 Sep 2009 | 1:32 pm మాజీ ప్రియుల గోల గోల: ఐశ్వర్యారాయ్ వలవలఒక స్త్రీ ఒక మగాడితో సన్నిహితంగా మెలిగితే. అదే స్నేహం అంటారు కొన్నాళ్లు... ఆ తర్వాత దాన్నే డేటింగ్ అంటారు. ఆ తర్వాత ఇంకేదో ఉందంటారు. ఇప్పుడిదే చెపుతున్నారట ఐశ్వర్యారాయ్ మాజీ బాయ్ ఫ్రెండ్స్ సల్మాన్ ఖాన్, వివేక్ ఒబెరాయ్. వాళ్లిద్దరూ ఎక్కడబడితే అక్కడ ఐశ్వర్యారాయ్ తనతో "అలా ఉంది... ఇలా ఉండేది..." అని లేనిపోని మాటలు చెపుతూ గాలికి కట్టేస్తున్నారట. తమ మధ్య కొనసాగిన బంధం ఎటువంటిదో అందరికీ తెలుసుననీ, అయినా వివరించాల్సి వచ్చింది కనుక విడమర్చి చెపుతున్నామని గోల చేస్తున్నారట. అది ఆ నోటా.. ఈ నోటా తిరిగి చివరికి ఐష్ చెవికి చేరిందట. ఈ మాటలను విన్న ఐశ్వర్యారాయ్ వలవల ఏడ్చేసిందట.Source: Yahoo! Telugu: Entertainment | 15 Sep 2009 | 10:02 am స్వైన్‌ఫ్లూతో రాష్ట్రంలో మరో ఇద్దరి మృతిరాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో స్వైన్‌ఫ్లూ బారిన పడిన ఓ స్త్రీ మంగళవారంనాడు మృతి చెందింది. దీంతో రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూతో మృతి చెందిన వారి సంఖ్య 14కు చేరిందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.Source: ఏపీ న్యూస్ | 15 Sep 2009 | 9:45 am దేశీయ సైన్యంలో డ్రోన్‌లాంటి విమానాలుప్రస్తుతం ఆఫ్గనిస్థాన్ మరియు పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్రవాదులను అంతమొందించేందుకు డ్రోన్ విమానలను ఉపయోగిస్తున్నారు. వీటి పనితీరును పరిశీలించిన తర్వాత భారత సైన్యం కూడా ఇలాంటి విమానాలను ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించింది.Source: జాతీయ | 15 Sep 2009 | 9:16 am ప్రధాని, సోనియాలు గాంధీజీ పొదుపు సూత్రాలు పాటించాలి: లాలూమంత్రులు, ప్రజాప్రతినిధులకు పొదుపు సూత్రాలను బోధించే ముందు ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీలు వాటిని పూర్తిస్థాయిలో ఆచిరించాలని, ముఖ్యంగా గాంధీజీ ఆచిరించిన మితవ్యయ సూత్రాలను పాటించాలని పేర్కొన్నారు.Source: జాతీయ | 15 Sep 2009 | 9:02 am సత్యం రామలింగరాజుకు యాంజియోప్లాస్టీసత్యం కంప్యూటర్స్ మాజీ అధినేత బైర్రాజు రామలింగరాజుకు నిమ్స్ వైద్యులు యాంజియోప్లాస్టీ చికిత్స మంగళవారంనాడు నిర్వహించారు. మూసుకుపోయిన గుండె కవాటాలకు రెండు స్టంట్లు అమర్చినట్లు వైద్యులు తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 15 Sep 2009 | 7:31 am భారత్- చైనా సోదర దేశాలు: దౌత్యాధికారిభారత్- చైనాల మధ్య ఎటువంటి వైరం లేదని ముంబయికి కొత్తగా వచ్చిన చైనా దౌత్యాధికారి వాంగ్ డోంగువా తెలిపారు. భారత సరిహద్దులను, గగనతలాన్ని చైనా మిలిటరీ ఉల్లంఘించినట్లు ఇటీవల జరిగిన ప్రచారం.. తాజాగా చైనా దళాలు భారత జవాన్లపైకి కాల్పులు జరిపినట్లు వచ్చిన వార్తా కథనాలు గందరగోళం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.Source: జాతీయ | 15 Sep 2009 | 7:28 am కోవై పేలుళ్లు: తొమ్మిది మంది దోషుల విడుదలకోయంబత్తూరు బాంబు పేలుళ్ల కేసులో దోషులుగా నిర్ధారించబడిన తొమ్మిది మంది ఖైదీలను తమిళనాడు ప్రభుత్వం మంగళవారం విడిచిపెట్టింది. 1998నాటి కోవై బాంబు పేలుళ్లలో 58 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో శిక్ష అనుభవిస్తున్న తొమ్మిది మంది దోషులకు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించింది.Source: జాతీయ | 15 Sep 2009 | 7:17 am రామ్ చరణ్.. మీరు జులపాలులోనే బావున్నారు...మగధీరలో "బంగారుకోడిపెట్ట..." అంటూ పిలక జుట్టుతోనూ, ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్‌లో జులపాలతో కనిపించిన రామ్ చరణ్ తేజ జుట్టు కత్తిరించి ఇటీవల కుర్రాడు ఆడియో ఫంక్షనకు హాజరయ్యాడు. ఆ ఫంక్షనుకు హాజరైన కొంతమంది చరణ్ అభిమానులు, "రామ్ మీరు... జులపాలులోనే చాలా బావున్నార"ని చెప్పారట. చిత్రం ఏమిటంటే... ఇలా చెప్పినవారిలో అబ్బాయిలకంటే అమ్మాయిలే ఎక్కువగా ఉన్నారట. వారి మాటలను చరణ్ ముసిముసిగా నవ్వుతూ ఆలకించాడట. ఇదంతా ఓ ప్రక్కనుంచి గమనిస్తున్న ఓ సినిమా ప్రముఖుడు, సినిమా కోసం జులపాలే కాదు అవసరమైతే గుండుకూడా కొట్టించుకోవాలని వారితో అన్నారట. దీంతో అభిమానులు ఆయన చుట్టూ మూగారట. మీ తదుపరి చిత్రంలో ఏ హీరోను బోడిగుండులో చూపబోతున్నారని ప్రశ్నలు మీద ప్రశ్నలు వేశారట. వారి దెబ్బకు అక్కడ ఉండలేని సదరు సినీ ప్రముఖుడు పలాయనమయ్యాడట.Source: Yahoo! Telugu: Entertainment | 15 Sep 2009 | 6:42 am చైనా దళాలు కాల్పులు జరపలేదు: కేంద్రంసిక్కింలో చైనా దళాలు కాల్పులు జరిపినట్లు వచ్చిన వార్తలను భారత ప్రభుత్వం తోసిపుచ్చింది. మీడియాలో వచ్చిన ఈ విధమైన కథనాలను ఖండించింది. చైనా దళాలు సిక్కింలో కాల్పులేమీ జరపలేదని కేంద్ర విదేశాంగ శాఖ ప్రతినిధి విష్ణు ప్రకాష్ ఓ ప్రకటనలో స్పష్టం చేశారు.Source: జాతీయ | 15 Sep 2009 | 5:53 am "తీరాలకు తీరాలనే" మింగేస్తున్న సముద్రాలు"భూమి వేడెక్కినట్లయితే, సముద్రం ముందుకొస్తుందా..? ఇసుక తిన్నెలు మునిగిపోతాయా..?" అనే సందేహం మీకెప్పుడయినా కలిగిందా..? దీనికి సమాధానంగా "అవును" అనే అంటున్నారు శాస్త్రవేత్తలు. ఎన్నో అద్భుతాలను తనలో కలిపేసుకున్న కడలి.. దాని తీరప్రాంతాలను సైతం మింగేస్తోందని పలు పరిశోధనలు నిరూపిస్తున్నాయి.Source: వినోదం | 15 Sep 2009 | 5:40 am జగన్మోహన రెడ్డే సీఎం కావాలి: భారతిదివంగత మహానేత, వై.ఎస్. రాజశేఖర రెడ్డి తనయుడు వై.ఎస్. జగన్మోహన రెడ్డే రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని టెక్కలి కాంగ్రెస్ శాసనసభ్యురాలు కొర్ల భారతి అన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కొర్ల భారతి గెలుపొందారు. ఈ సందర్భంగా భారత్ మంగళవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో వై.ఎస్. జగన్‌తో భేటీ అయి, ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు.Source: ఏపీ న్యూస్ | 15 Sep 2009 | 5:28 am మాజీ ప్రియుల గోల గోల: ఐశ్వర్యారాయ్ వలవలఒక స్త్రీ ఒక మగాడితో సన్నిహితంగా మెలిగితే. అదే స్నేహం అంటారు కొన్నాళ్లు... ఆ తర్వాత దాన్నే డేటింగ్ అంటారు. ఆ తర్వాత ఇంకేదో ఉందంటారు. ఇప్పుడిదే చెపుతున్నారట ఐశ్వర్యారాయ్ మాజీ బాయ్ ఫ్రెండ్స్ సల్మాన్ ఖాన్, వివేక్ ఒబెరాయ్. వాళ్లిద్దరూ ఎక్కడబడితే అక్కడ ఐశ్వర్యారాయ్ తనతో "అలా ఉంది... ఇలా ఉండేది..." అని లేనిపోని మాటలు చెపుతూ గాలికి కట్టేస్తున్నారట. తమ మధ్య కొనసాగిన బంధం ఎటువంటిదో...Source: వినోదం | 15 Sep 2009 | 4:34 am చంద్రబాబు, కేసీఆర్‌లకు నాన్ బెయిలబుల్ వారెంట్లుతెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావులకు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి. 2008లో జరిగిన ఉప ఎన్నికల ప్రచారంలో ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారంటూ.. ఆదిలాబాద్ జ్యూడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ఈ వారెంట్లను జారీ చేసింది.Source: ఏపీ న్యూస్ | 15 Sep 2009 | 4:06 am
|