మాజీ ప్రియుల గోల గోల: ఐశ్వర్యారాయ్ వలవల

ఒక స్త్రీ ఒక మగాడితో సన్నిహితంగా మెలిగితే. అదే స్నేహం అంటారు కొన్నాళ్లు... ఆ తర్వాత దాన్నే డేటింగ్ అంటారు. ఆ తర్వాత ఇంకేదో ఉందంటారు. ఇప్పుడిదే చెపుతున్నారట ఐశ్వర్యారాయ్ మాజీ బాయ్ ఫ్రెండ్స్ సల్మాన్ ఖాన్, వివేక్ ఒబెరాయ్. వాళ్లిద్దరూ ఎక్కడబడితే అక్కడ ఐశ్వర్యారాయ్ తనతో "అలా ఉంది... ఇలా ఉండేది..." అని లేనిపోని మాటలు చెపుతూ గాలికి కట్టేస్తున్నారట. తమ మధ్య కొనసాగిన బంధం ఎటువంటిదో అందరికీ తెలుసుననీ, అయినా వివరించాల్సి వచ్చింది కనుక విడమర్చి చెపుతున్నామని గోల చేస్తున్నారట. అది ఆ నోటా.. ఈ నోటా తిరిగి చివరికి ఐష్ చెవికి చేరిందట. ఈ మాటలను విన్న ఐశ్వర్యారాయ్ వలవల ఏడ్చేసిందట.
Source: Yahoo! Telugu: Entertainment | 15 Sep 2009 | 10:02 am

లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్

స్టాక్ మార్కెట్ ప్రస్తుతం లాభాల్లో కొనసాగుతుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 142 పాయింట్లు పుంజుకుని 16,398 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 84 పాయింట్లు లాభపడి 4,832 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.87 శాతం, నిఫ్టీ 1.74 శాతం మేరకు వృద్ధి చెందాయి.
Source: Yahoo! Telugu: News | 15 Sep 2009 | 9:58 am

చంద్రబాబు, కేసీఆర్‌లకు నాన్ బెయిలబుల్ వారెంట్లు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావులకు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి. 2008లో జరిగిన ఉప ఎన్నికల ప్రచారంలో ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారంటూ.. ఆదిలాబాద్ జ్యూడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ఈ వారెంట్లను జారీ చేసింది.
Source: Yahoo! Telugu: News | 15 Sep 2009 | 9:35 am

ముషారఫ్ ఆరోపణలపై అమెరికా చిందులు

తీవ్రవాదంపై పోరు కోసం తాము పాక్‌కు అందజేసిన మిలిటరీ సాయాన్ని రక్షణావసరాలకు మళ్లించామని ఆ దేశ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ అంగీకరించడంపై అమెరికా ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ముషారఫ్ వెల్లడించిన విషయాలను తీవ్రంగా పరిగణిస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది.
Source: Yahoo! Telugu: News | 15 Sep 2009 | 9:31 am

నియంత్రణ రేఖపై చొరబాట్లు పెరిగాయి: ప్రధాని

జమ్ము- కాశ్మీర్ రాష్ట్రంలోని నియంత్రణ రేఖపై పాక్‌వైపు నుంచి చొరబాట్లు పెరుగుతున్నాయని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మంగళవారం ఆందోళన వ్యక్తం చేశారు. మిలిటెంట్ గ్రూపులు కాశ్మీర్‌లోకి చొరబడుతుండటం ఆందోళనకరంగా మారిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో అస్థిరత్వాన్ని సృష్టించేందుకు బయటి శక్తులు ప్రయత్నిస్తున్నాయని చెప్పారు.
Source: Yahoo! Telugu: News | 15 Sep 2009 | 9:15 am

డీఎల్ఎఫ్ క్షీణత: సెన్సెక్స్ 150 పాయింట్లు లాభం

స్టాక్ మార్కెట్ ప్రస్తుతం 150 పాయింట్లు లాభపడటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 16,405 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 79 పాయింట్లు పుంజుకుని 4,887 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ సెన్సెక్స్ 1.23 శాతం, నిఫ్టీ 1.18 శాతం మేరకు వృద్ధి చెందాయి.
Source: Yahoo! Telugu: News | 15 Sep 2009 | 9:05 am

ఐఎమ్ఈఐ లేకుంటే తిరస్కరించండి: డాట్

దేశీయ టెలికాం ఆపరేటర్లు నకిలీ మొబైల్ సామగ్రి గుర్తింపు సంఖ్య(ఐఎమ్ఈఐ)లపై టెలికమ్యూనికేషన్ల విభాగం(డాట్) ఆందోళన వ్యక్తం చేసింది. జాతీయ భద్రత దృష్ట్యా తప్పుడు ఐఎమ్ఈఐ లేదా ఐఎమ్ఈఐ సంఖ్యలున్న హ్యాండ్‌సెట్ల నుంచి వచ్చే కాల్స్‌ను మొబైల్ ఆపరేటర్లు తిరస్కరించాలని డాట్ కోరింది.
Source: Yahoo! Telugu: News | 15 Sep 2009 | 8:41 am

అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటాం: దానం

దివంగత మహానేత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి పదవీ బాధ్యతలను ఎవరికి అప్పగించాలనే అంశంపై అధిష్టానం తీసుకునే నిర్ణయానికి తామంతా కట్టుబడి ఉంటామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దానం నాగేందర్ మంగళవారం స్పష్టం చేశారు.
Source: Yahoo! Telugu: News | 15 Sep 2009 | 7:59 am

లాభాలతో దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్

స్టాక్ మార్కెట్ ప్రస్తుతం లాభాలతో దూసుకెళుతుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 187 పాయింట్లు పుంజుకుని 16,442 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 66 పాయింట్లు లాభపడి 4,874 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 1.15 శాతం, నిఫ్టీ 1.37 శాతం మేరకు వృద్ధి చెందాయి.
Source: Yahoo! Telugu: News | 15 Sep 2009 | 7:31 am

ఆఫ్ఘనిస్తాన్‌లో లొంగిపోయిన తాలిబన్ కమాండర్

ఆఫ్ఘనిస్తాన్‌లోని వాయువ్య బాద్గిస్‌లో తాలిబన్ కమాండర్ ముల్లా అబ్దుల్ సలామ్ అధికారుల ముందు లొంగిపోయాడు. ప్రభుత్వం ముందు లొంగిపోయిన కమాండర్లలో ఒకడిగా నిలిచిన ముల్లా అబ్దుల్ నుంచి వివిధ ఆయుధాలను అధికారులు స్వాధీన పరుచుకున్నారు. ఈ విషయాన్ని డైలీ 8 శుభ్ పత్రిక వెల్లడించింది.
Source: Yahoo! Telugu: News | 15 Sep 2009 | 7:23 am

రాష్ట్ర మంత్రులతో భేటీ అయిన కేవీపీ

కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ, ప్రభుత్వ ప్రధాన సలహాదారు కేవీపీ రామచంద్రరావు తన నివాసంలో పలువురు మంత్రులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులను చర్చించేందుకు ఎంపీ కేవీపీ రామచంద్రారావు తన నివాసంలో మంత్రులతో సమావేశమయ్యారు
Source: Yahoo! Telugu: News | 15 Sep 2009 | 6:50 am

రామ్ చరణ్‌.. మీరు జులపాలులోనే బావున్నారు...

మగధీరలో "బంగారుకోడిపెట్ట..." అంటూ పిలక జుట్టుతోనూ, ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్‌లో జులపాలతో కనిపించిన రామ్ చరణ్ తేజ జుట్టు కత్తిరించి ఇటీవల కుర్రాడు ఆడియో ఫంక్షనకు హాజరయ్యాడు. ఆ ఫంక్షనుకు హాజరైన కొంతమంది చరణ్ అభిమానులు, "రామ్ మీరు... జులపాలులోనే చాలా బావున్నార"ని చెప్పారట. చిత్రం ఏమిటంటే... ఇలా చెప్పినవారిలో అబ్బాయిలకంటే అమ్మాయిలే ఎక్కువగా ఉన్నారట. వారి మాటలను చరణ్ ముసిముసిగా నవ్వుతూ ఆలకించాడట. ఇదంతా ఓ ప్రక్కనుంచి గమనిస్తున్న ఓ సినిమా ప్రముఖుడు, సినిమా కోసం జులపాలే కాదు అవసరమైతే గుండుకూడా కొట్టించుకోవాలని వారితో అన్నారట. దీంతో అభిమానులు ఆయన చుట్టూ మూగారట. మీ తదుపరి చిత్రంలో ఏ హీరోను బోడిగుండులో చూపబోతున్నారని ప్రశ్నలు మీద ప్రశ్నలు వేశారట. వారి దెబ్బకు అక్కడ ఉండలేని సదరు సినీ ప్రముఖుడు పలాయనమయ్యాడట.
Source: Yahoo! Telugu: Entertainment | 15 Sep 2009 | 6:42 am

చంద్రబాబు, కేసీఆర్‌లకు నాన్ బెయిలబుల్ వారెంట్లు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావులకు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి. 2008లో జరిగిన ఉప ఎన్నికల ప్రచారంలో ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారంటూ.. ఆదిలాబాద్ జ్యూడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ఈ వారెంట్లను జారీ చేసింది.
Source: ఏపీ న్యూస్ | 15 Sep 2009 | 4:06 am

నియంత్రణ రేఖపై చొరబాట్లు పెరిగాయి: ప్రధాని

జమ్ము- కాశ్మీర్ రాష్ట్రంలోని నియంత్రణ రేఖపై పాక్‌వైపు నుంచి చొరబాట్లు పెరుగుతున్నాయని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మంగళవారం ఆందోళన వ్యక్తం చేశారు. మిలిటెంట్ గ్రూపులు కాశ్మీర్‌లోకి చొరబడుతుండటం ఆందోళనకరంగా మారిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో అస్థిరత్వాన్ని సృష్టించేందుకు బయటి శక్తులు ప్రయత్నిస్తున్నాయని చెప్పారు.
Source: జాతీయ | 15 Sep 2009 | 3:46 am

అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటాం: దానం

దివంగత మహానేత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి పదవీ బాధ్యతలను ఎవరికి అప్పగించాలనే అంశంపై అధిష్టానం తీసుకునే నిర్ణయానికి తామంతా కట్టుబడి ఉంటామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దానం నాగేందర్ మంగళవారం స్పష్టం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 15 Sep 2009 | 2:30 am

రాష్ట్ర మంత్రులతో భేటీ అయిన కేవీపీ

కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ, ప్రభుత్వ ప్రధాన సలహాదారు కేవీపీ రామచంద్రరావు తన నివాసంలో పలువురు మంత్రులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులను చర్చించేందుకు ఎంపీ కేవీపీ రామచంద్రారావు తన నివాసంలో మంత్రులతో సమావేశమయ్యారు
Source: ఏపీ న్యూస్ | 15 Sep 2009 | 1:21 am

తెదేపా నేత బుచ్చయ్య చౌదరి కన్నుమూత

దివంగత మహానేత నేత వై.ఎస్. రాజశేఖర్ రెడ్డిని విమాన ప్రమాదం పొట్టనబెట్టుకున్న నేపథ్యంలో.. తెలుగుదేశం పార్టీ నేత, ఏబీసీ విద్యాసంస్థల అధినేత ఆలూరి బుచ్చయ్య చౌదరి మంగళవారం కన్నుమూశారు.
Source: ఏపీ న్యూస్ | 15 Sep 2009 | 1:13 am

ఈశాన్య రాష్ట్రాల్లో పరిస్థితి బాగోలేదు: ప్రధాని

ప్రస్తుతం దేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లోని పరిస్థితి బాగోలేదని ప్రధాని మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. దేశంలోని యువత అసాంఘిక కార్యకలాపాలపట్ల ఆకర్షికతులవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Source: జాతీయ | 15 Sep 2009 | 12:49 am

నిన్న సోనియా... నేడు రాహుల్: ఎకానమీ "క్లాసు"లు

ఆర్థిక మాంద్యం కోరలు చాచిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ పొదుపు సూత్రాలను పాటించాలని సోనియాగాంధీ సోమవారం ఎకానమీ క్లాసులో ప్రయాణించి ఆచరించి చూపారు. తాజాగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ సైతం మంగళవారం ఢిల్లీ నుంచి లుధియానాకు శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో చైర్‌కార్‌లో ప్రయాణించి పొదుపును పాటించారు.
Source: జాతీయ | 15 Sep 2009 | 12:21 am

మహానేత వైఎస్సార్‌కు మహిళా మంత్రుల ఘననివాళి

దివంగత ముఖ్యమంత్రి, వై.ఎస్. రాజశేఖర రెడ్డికి రాష్ట్ర మహిళా మంత్రులు ఘన నివాళులర్పించారు. ఇడుపులపాయలోని వైఎస్సార్ సమాధిని మహిళా మంత్రులు మంగళవారం సందర్శించారు. హోమంత్రి సబితా ఇంద్రారెడ్డి, సమాచార మంత్రి గీతారెడ్డి, ఆర్అండ్‌బీ శాఖ మంత్రి గల్లా అరుణకుమారి, చిన్నపాటి నీటి పారుదల మంత్రి సునీతా లక్ష్మారెడ్డి వైఎస్‌కు ఘనంగా నివాళులు అర్పించారు.
Source: ఏపీ న్యూస్ | 15 Sep 2009 | 12:10 am

ఇపుడేం చేద్దాం: వైఎస్ జగన్‌తో కేవీపీ

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై మొన్నటివరకూ రాష్ట్ర రాజకీయ వాతావరణం మహా వేడిగా ఉంది. కానీ అధిష్ఠానం జగన్‌కు సీఎం పదవి కట్టబెట్టే విషయంలో ఎటువంటి హామీ ఇవ్వకపోవడమే కాక ముఖ్యమంత్రిగా కొణిజేటి రోశయ్యనే కొనసాగించడానికి సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Source: ఏపీ న్యూస్ | 14 Sep 2009 | 11:36 pm

ఢిల్లీ ఖజూరి ఖాస్ పాఠశాల పున:ప్రారంభం

దేశ రాజధానిలోని ఖజూరి ఖాస్ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను మంగళవారం తిరిగి ప్రారంభించనున్నారు. ఇటీవల ఈ పాఠశాలలో తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ తొక్కిసలాటలో ఐదుగురు విద్యార్థినిలు మృతి చెందారు. ఈ దుర్ఘటనతో పాఠశాలను తాత్కాలికంగా మూసివేయాలని యంత్రాంగం ఆదేశించింది.
Source: జాతీయ | 14 Sep 2009 | 10:46 pm

బీహార్ అసెంబ్లీ సీట్లకు ఉపఎన్నికలు ప్రారంభం

బీహార్ రాష్ట్రంలో 11 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల పోలింగ్ మంగళవారం ఉదయం ప్రారంభమైంది. దీంతో బీహార్‌లో మొత్తం 18 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలు పూర్తవనున్న సంగతి తెలిసిందే. రెండో దశలో ప్రస్తుతం మిగిలిన 11 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఈ ఎన్నికలకు అధికారిక యంత్రాంగం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది.
Source: జాతీయ | 14 Sep 2009 | 10:25 pm

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో "రాజశేఖర రెడ్డి"

వైష్ణో అకాడమీ బ్యానర్‌పై పూరీ జగన్నాథ్ స్వీయ దర్శకత్వంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జీవిత చరిత్రను తెరకెక్కించనున్నాడు. ఆయన ఈ విషయాన్ని సోమవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో పత్రికా విలేకరులకు వెల్లడించారు. ఈ సమావేశంలో డాక్టర్ రాజశేఖర్, జీవితలు కూడా పాల్గొన్నారు. చిత్రానికి పూరీ జగన్నాథ్ స్వీయ నిర్మాణ, దర్శకత్వం వహిస్తున్నప్పటికీ ఈ చిత్రం ఎలా ఉంటుందో జీవిత, రాజశేఖర్‌లు వివరించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 14 Sep 2009 | 1:28 pm

తెలుగు సినిమా మాటలు నేర్చి 78 ఏళ్లు

తెలుగు సినిమా మాటలు నేర్చి సరిగ్గా నేటికి అంటే... ఈ నెల 15కి 78 ఏళ్లయింది. 1926లో సి. పుల్లయ్య కాకినాడలో భక్త మార్కండేయ చిత్రాన్ని నిర్మించారు. కానీ అది తెరమీద కాకుండా గోడమీద ప్రదర్శతం కావడంతో అది గోడమీద బొమ్మగా పేరు తెచ్చుకుంది. అయితే తెలుగు మాట్లాడటం ఎవరూ వినలేదు. తొలి భారతీయ టాకీ చిత్రం ఆలమ్ ఆరా నిర్మించబడిన 1931లోనే తొలి తెలుగు టాకీ చిత్రం కూడా నిర్మించబడింది. హెచ్ఎం రెడ్డి బొంబాయిలో 1931లో భక్త ప్రహ్లాద నిర్మించాడు. సురభి కమలాభాయి తొలి తెలుగు కథానాయికగా నిలిచిపోయింది.
Source: Yahoo! Telugu: Entertainment | 14 Sep 2009 | 10:01 am

మా కుటుంబానికి సినిమా ఊపిరిలాంటిది: కమల్‌

తన కుటుంబ ఊపిరి సినిమానే అని పద్మశ్రీ కమల్‌హాసన్ అన్నారు. "ఈనాడు" చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఆడియోను ఆవిష్కరించి కమల్‌హాసన్ సతీమణి గౌతమికి అందజేశారు.
Source: Yahoo! Telugu: Entertainment | 14 Sep 2009 | 9:14 am

టెక్కలిలో కాంగ్రెస్ గెలుపు ఊహించినదే: చిరంజీవి

శ్రీకాకుళం జిల్లా టెక్కలి అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ముందుగా ఊహించినదే అని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి అభిప్రాయపడ్డారు. ఆయన సోమవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు.
Source: ఏపీ న్యూస్ | 14 Sep 2009 | 9:14 am

వరద నీటిని చూసి గొల్లుమన్న ఎంపీ జయప్రద

సమాజ్‌వాదీ పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యురాలు, సినీ నటి జయప్రద కన్నీటి పర్యంతమయ్యారు. ఆమె పేదల దుస్థితిని చూసి మాత్రం భోరుమనలేదు. తన ప్రాణాలను కాపాడాలని కోరుతూ తన అంగ రక్షకులతో పాటు.. ప్రభుత్వ అధికారులను ప్రాధేయపడ్డారు.
Source: జాతీయ | 14 Sep 2009 | 8:55 am

నల్గొండ జిల్లా కలెక్టర్‌కు స్వైన్ ఫ్లూ వ్యాధి

నల్గొండ జిల్లా కలెక్టర్ స్వైన్ ఫ్లూ బారిన పడ్డారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఆరోగ్య శాఖామంత్రి దానం నాగేందర్ కూడా ధృవీకరించారు. ఆయన జిల్లా కలెక్టర్ పేరు చెప్పకుండా ఒక సీనియర్ ఐఏఎస్ అధికారికి ఈ వ్యాధి సోకిందని చెప్పారు. ఆయనకు ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నట్లు దానం చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 14 Sep 2009 | 8:34 am

ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించిన సోనియా గాంధీ

ఆర్థిక మాంద్యం పరిస్థితుల దృష్ట్యా కేంద్రం పొదుపు మంత్రం జపిస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తమ పార్టీకి చెందిన కేంద్ర మంత్రులు పొదుపు పాటించాలని సూచించారు. అలాగే విత్తమంత్రి ప్రణబ్ ముఖర్జీ కూడా మంత్రులకు ఓ విజ్ఞప్తి చేశారు.
Source: జాతీయ | 14 Sep 2009 | 6:12 am

హీరోయిన్ త్రిషకు మత్తంటే... గమ్మత్తట!

హెటెక్ కాలంలో ప్రతి యువతీ యువకులు పబ్‌లకు వెళ్లి ఎంజాయ్ చేయడం సర్వ సాధారణం. ఈ కోవలో సినీ నటులు ముందుంటారు. పబ్‌లకు వెళ్లి పీకలదాకా తాగి తైతక్కలాడటం వారి అలవాటు. ఇది చిత్ర పరిశ్రమలోని మగాళ్లతో పాటు.. ఆడవాళ్లకు సైతం కామన్‌గా మారింది.
Source: Yahoo! Telugu: Entertainment | 14 Sep 2009 | 6:11 am

'మౌత్‌ కిస్‌'లతో తన్మయత్వం చెందుతున్న ఆర్తీ!

పెళ్లి చేసుకుని ఓ ఇంటికి ఇల్లాలైన సినీ నటి ఆర్తీ అగర్వాల్. ఆమె భర్తకు మౌత్ కిస్‌లను రుచి చూపించారో లేదోగానీ.. చిత్రంలో తన సరసన హీరోగా నటించే వారికి మాత్రం ఆ మద్దులు పవరేమిటో స్వయంగా చేసి చూపిస్తున్నారు. అలా.. ఆమె కూడా తన్మయత్వం చెందుతోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 14 Sep 2009 | 6:09 am

గుజరాత్ ఉప ఎన్నికలు: కొనసాగిన భాజపా హవా

గుజరాత్ రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ హవా కొనసాగింది. మొత్తం ఏడు స్థానాలకు ఉప ఎన్నికలు జరుగగా, ఐదింటిలో కమలం విజయకేతనం ఎగురవేయగా, కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాలను మాత్రమే కైవసం చేసుకుంది.
Source: జాతీయ | 14 Sep 2009 | 4:36 am

చెక్కు చెదరని పీఆర్పీ ఓటు బ్యాంకు: కోటగిరి

టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ప్రజారాజ్యం పార్టీ ఓటు బ్యాంకు ఏమాత్రం చెక్కుచెదర లేదని ఆ పార్టీ సీనియర్ నేత కోటగిరి విద్యాధర రావు అన్నారు. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయంలో డబుల్ సానుభూతి బాగా పని చేసిందని ఆయన చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 14 Sep 2009 | 4:35 am

సానుభూతి పవనాలతోనే కాంగ్రెస్ గెలుపు: బాబు

టెక్కలి ఉప ఎన్నికల్లో సానుభూతి పవనాలు బలంగా వీచాయని, అందువల్లే కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. ఈనెల పదో తేదీన జరిగిన టెక్కలి అసెంబ్లీ స్థానం ఉప ఎన్నిక ఫలితం సోమవారం వెల్లడించారు.
Source: ఏపీ న్యూస్ | 14 Sep 2009 | 4:34 am