బుష్‌పై బూటు విసిరిన విలేకరి విడుదల వాయిదా

నిరుడు డిసెంబర్ 14న అమెరికా మాజీ అధ్యక్షుడు బుష్‌పై బూటు విసిరిన ఇరాక్ విలేకరి ముంతజర్ అల్-జియాదీ విడుదల మంగళవారానికి వాయిదా పడింది.
Source: Yahoo! Telugu: News | 14 Sep 2009 | 9:31 am

మా కుటుంబానికి సినిమా ఊపిరిలాంటిది: కమల్‌

తన కుటుంబ ఊపిరి సినిమానే అని పద్మశ్రీ కమల్‌హాసన్ అన్నారు. "ఈనాడు" చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఆడియోను ఆవిష్కరించి కమల్‌హాసన్ సతీమణి గౌతమికి అందజేశారు.
Source: Yahoo! Telugu: Entertainment | 14 Sep 2009 | 9:14 am

93 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్

స్టాక్ మార్కెట్ ప్రస్తుతం 93 పాయింట్లు కోల్పోవడంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 16,171 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 28 పాయింట్లు నష్టపోయి 4,801 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.57 శాతం, నిఫ్టీ 0.59 శాతం మేరకు క్షీణించాయి.
Source: Yahoo! Telugu: News | 14 Sep 2009 | 8:20 am

కాంగ్రెస్‌పై ఉన్న విశ్వాసానికి ప్రతీక ఈ విజయం: సీఎం

కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు ఉన్న విశ్వాసానికి ప్రతీక టెక్కలి ఉప ఎన్నిక విజయమని ముఖ్యమంత్రి కె.రోశయ్య అన్నారు. టెక్కలి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన విషయం తెల్సిందే. ఫలితం వెల్లడి అనంతరం ముఖ్యమంత్రి రోశయ్య హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు.
Source: Yahoo! Telugu: News | 14 Sep 2009 | 8:19 am

ఆరు నెలల్లో గాడిన పడనున్న ఆర్థిక వ్యవస్థ: మాంటెక్

భారత ఆర్థిక వ్యవస్థ రానున్న ఆరు నెలల్లో గాడిన పడనుందని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లువాలియా సోమవారం న్యూఢిల్లీలో అన్నారు.
Source: Yahoo! Telugu: News | 14 Sep 2009 | 7:56 am

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న వినోద్ కాంబ్లి!

భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లి రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారు. వచ్చే అక్టోబరులో జరుగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ సమరంలో ఆయన పోటీ చేయనున్నారు. విఖ్రేలి నియోజకవర్గం నుంచి వినోద్ కాంబ్లిని బరిలోకి దింపనున్నట్టు రిపబ్లికన్ లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఆర్ఎల్‌డీఎఫ్) ప్రకటించింది.
Source: Yahoo! Telugu: News | 14 Sep 2009 | 7:44 am

చెక్కు చెదరని పీఆర్పీ ఓటు బ్యాంకు: కోటగిరి

టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ప్రజారాజ్యం పార్టీ ఓటు బ్యాంకు ఏమాత్రం చెక్కుచెదర లేదని ఆ పార్టీ సీనియర్ నేత కోటగిరి విద్యాధర రావు అన్నారు. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయంలో డబుల్ సానుభూతి బాగా పని చేసిందని ఆయన చెప్పారు.
Source: Yahoo! Telugu: News | 14 Sep 2009 | 7:33 am

జులైలో పెరిగిన తేయాకు దిగుమతులు

దేశంలో వర్షాభావం కారణంగా తేయాకు ఉత్పత్తులు తగ్గడంతో జులై నెలలో విదేశాలనుంచి తేయాకును దిగుమతి చేసుకున్నట్లు తేయాకు బోర్డ్ అధికారులు తెలిపారు. జులై నెలలో దాదాపు 28 శాతం దిగుమతి చేసుకున్నట్లు వారు తెలిపారు
Source: Yahoo! Telugu: News | 14 Sep 2009 | 7:12 am

సానుభూతి పవనాలతోనే కాంగ్రెస్ గెలుపు: బాబు

టెక్కలి ఉప ఎన్నికల్లో సానుభూతి పవనాలు బలంగా వీచాయని, అందువల్లే కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. ఈనెల పదో తేదీన జరిగిన టెక్కలి అసెంబ్లీ స్థానం ఉప ఎన్నిక ఫలితం సోమవారం వెల్లడించారు.
Source: Yahoo! Telugu: News | 14 Sep 2009 | 7:08 am

నష్టాల్లో పయనిస్తున్న స్టాక్ మార్కెట్

స్టాక్ మార్కెట్ ప్రస్తుతం నష్టాల్లో పయనిస్తుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 99 పాయింట్లు కోల్పోయి 16,165 వద్దకు పడిపోయింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 32 పాయింట్లు నష్టపోయి 4,798 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.61 శాతం, నిఫ్టీ 0.65 శాతం మేరకు క్షీణించాయి.
Source: Yahoo! Telugu: News | 14 Sep 2009 | 7:00 am

దేశ భద్రతకు ముప్పుగా సరిహద్దు తీవ్రవాదం: చిదంబరం

దేశ భద్రతకు సరిహద్దు తీవ్రవాదు పెను ముప్పుగా పరిణమించిందని కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం అభిప్రాయపడ్డారు. అదేసమయంలో దేశంలో నక్సల్స్‌ హింసాకాండ కూడా నానాటికీ పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది అంతర్గత భద్రతకు తీవ్ర విఘాతం కలిగిస్తోందని చెప్పారు.
Source: Yahoo! Telugu: News | 14 Sep 2009 | 6:55 am

హీరోయిన్ త్రిషకు మత్తంటే... గమ్మత్తట!

హెటెక్ కాలంలో ప్రతి యువతీ యువకులు పబ్‌లకు వెళ్లి ఎంజాయ్ చేయడం సర్వ సాధారణం. ఈ కోవలో సినీ నటులు ముందుంటారు. పబ్‌లకు వెళ్లి పీకలదాకా తాగి తైతక్కలాడటం వారి అలవాటు. ఇది చిత్ర పరిశ్రమలోని మగాళ్లతో పాటు.. ఆడవాళ్లకు సైతం కామన్‌గా మారింది.
Source: Yahoo! Telugu: Entertainment | 14 Sep 2009 | 6:11 am

'మౌత్‌ కిస్‌'లతో తన్మయత్వం చెందుతున్న ఆర్తీ!

పెళ్లి చేసుకుని ఓ ఇంటికి ఇల్లాలైన సినీ నటి ఆర్తీ అగర్వాల్. ఆమె భర్తకు మౌత్ కిస్‌లను రుచి చూపించారో లేదోగానీ.. చిత్రంలో తన సరసన హీరోగా నటించే వారికి మాత్రం ఆ మద్దులు పవరేమిటో స్వయంగా చేసి చూపిస్తున్నారు. అలా.. ఆమె కూడా తన్మయత్వం చెందుతోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 14 Sep 2009 | 6:09 am

కాంగ్రెస్‌పై ఉన్న విశ్వాసానికి ప్రతీక ఈ విజయం: సీఎం

కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు ఉన్న విశ్వాసానికి ప్రతీక టెక్కలి ఉప ఎన్నిక విజయమని ముఖ్యమంత్రి కె.రోశయ్య అన్నారు. టెక్కలి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన విషయం తెల్సిందే. ఫలితం వెల్లడి అనంతరం ముఖ్యమంత్రి రోశయ్య హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు.
Source: ఏపీ న్యూస్ | 14 Sep 2009 | 2:50 am

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న వినోద్ కాంబ్లి!

భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లి రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారు. వచ్చే అక్టోబరులో జరుగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ సమరంలో ఆయన పోటీ చేయనున్నారు. విఖ్రేలి నియోజకవర్గం నుంచి వినోద్ కాంబ్లిని బరిలోకి దింపనున్నట్టు రిపబ్లికన్ లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఆర్ఎల్‌డీఎఫ్) ప్రకటించింది.
Source: జాతీయ | 14 Sep 2009 | 2:14 am

చెక్కు చెదరని పీఆర్పీ ఓటు బ్యాంకు: కోటగిరి

టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ప్రజారాజ్యం పార్టీ ఓటు బ్యాంకు ఏమాత్రం చెక్కుచెదర లేదని ఆ పార్టీ సీనియర్ నేత కోటగిరి విద్యాధర రావు అన్నారు. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయంలో డబుల్ సానుభూతి బాగా పని చేసిందని ఆయన చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 14 Sep 2009 | 2:04 am

సానుభూతి పవనాలతోనే కాంగ్రెస్ గెలుపు: బాబు

టెక్కలి ఉప ఎన్నికల్లో సానుభూతి పవనాలు బలంగా వీచాయని, అందువల్లే కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. ఈనెల పదో తేదీన జరిగిన టెక్కలి అసెంబ్లీ స్థానం ఉప ఎన్నిక ఫలితం సోమవారం వెల్లడించారు.
Source: ఏపీ న్యూస్ | 14 Sep 2009 | 1:39 am

దేశ భద్రతకు ముప్పుగా సరిహద్దు తీవ్రవాదం: చిదంబరం

దేశ భద్రతకు సరిహద్దు తీవ్రవాదు పెను ముప్పుగా పరిణమించిందని కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం అభిప్రాయపడ్డారు. అదేసమయంలో దేశంలో నక్సల్స్‌ హింసాకాండ కూడా నానాటికీ పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది అంతర్గత భద్రతకు తీవ్ర విఘాతం కలిగిస్తోందని చెప్పారు.
Source: జాతీయ | 14 Sep 2009 | 1:25 am

సచార్‌ కమిటీ సిఫార్సుల అమలుకు కృషి: ప్రణబ్

దేశంలోని మైనారిటీ వర్గాల ప్రజల సంక్షేమం కోసం జస్టీస్ రాజేందర్ సింగ్ నేతృత్వంలోని సచార్ కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేయడానికి కృషి చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ స్పష్టం చేశారు.
Source: జాతీయ | 14 Sep 2009 | 12:02 am

అలా ఎందుకు తీసుకున్నారో బోధపడటం లేదు: సబిత

చేవెళ్ల చెల్లమ్మగా తనను ఎంతగానో అభిమానించి రాష్ట్ర హోంమంత్రిని చేశారని, ఏ పథకం ప్రవేశపెట్టినా చేవెళ్ల నుంచే ప్రారంభించే తన అన్న వైఎస్.. రచ్చబండ కార్యక్రమాన్ని చిత్తూరు నుంచి ప్రారంభించాలని ఎందుకు నిర్ణయం తీసుకున్నోరో బోధపడటం లేదని హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి వాపోయారు.
Source: ఏపీ న్యూస్ | 13 Sep 2009 | 11:46 pm

టెక్కలిలో కాంగ్రెస్ అభ్యర్థి కొర్ల భారతి విజయం

శ్రీకాకుళం జిల్లా టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొర్ల భారతి అలియాస్ భారతమ్మ విజయం సాధించారు. గత ఎన్నికల్లో ఆమె భర్త రేవతీపతి కేవలం 1830 ఓట్ల మెజారిటీతో గెలుపొందగా, ఈ దఫా మాత్రం భారతికి 7173 ఓట్ల మెజారిటీ దక్కింది.
Source: ఏపీ న్యూస్ | 13 Sep 2009 | 11:22 pm

కొత్త ముఖ్యమంత్రి ఎంపిక ఇపుడే కాదు: ప్రణబ్ ముఖర్జీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి ఎంపిక ఇపుడే కాదని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు ఎంతో కీలకం. ఇప్పటికే.. అక్కడ ఓ పూర్తిస్థాయి ముఖ్యమంత్రి ఉన్నారు.
Source: ఏపీ న్యూస్ | 13 Sep 2009 | 11:07 pm

కొన్నిసీట్ల కోసం కాంగ్రెస్‌తో పేచీ ఉండదు: పవార్

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్‌‍తో సీట్ల సర్దుబాటుపై ఎన్‌సీపీ జరుపుతున్న అనధికారిక చర్చలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. ఇరుపక్షాలు సాధ్యమైనన్ని ఎక్కువ సీట్ల కోసం ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి.. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి, ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ మాట్లాడుతూ.. కొన్ని సీట్ల కోసం పొత్తు విచ్ఛిన్నమయ్యేందుకు తాము ఆస్కారం ఇవ్వమన్నారు.
Source: జాతీయ | 13 Sep 2009 | 9:56 pm

ప్రభుత్వ ఉద్యోగుల్లో అవినీతిపై మొయిలీ కన్నెర్ర

కేంద్ర న్యాయ శాఖ మంత్రి వీరప్ప మొయిలీ ప్రభుత్వ ఉద్యోగాల్లో అవినీతిపై కన్నెర్ర చేశారు. రాజ్యాంగం కల్పించిన కొన్ని వెసులుబాట్లను ఆసరాగా చేసుకొని ప్రజా సేవకులు అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు. రాజ్యాంగం కల్పించిన కొన్ని వెసులుబాట్లే ప్రభుత్వ ఉద్యోగాల్లో అవినీతిని అరికట్టేందుకు ప్రతిబంధకంగా మారాయన్నారు.
Source: జాతీయ | 13 Sep 2009 | 9:01 pm

ఈనెల 18 నుంచి "మగధీర" చిత్రానికి అదనపు ఆకర్షణ

దక్షిణ భారత చలన చిత్ర చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో కలెక్షన్స్‌ కురిపిస్తూ అప్రతిహత జైత్రయాత్ర కొనసాగిస్తున్న 'మగధీర' చిత్రానికి మరో అదనపు ఆకర్షణను జోడించనున్నారు. ఈ చిత్రం అర్థ శతదినోత్సవం పూర్తి చేసుకోనున్న శుభ సందర్భంలో అదనపు ఆకర్షణ కల్పించాలని చిత్ర నిర్మాత అల్లు అరవింద్ చెప్పారు.
Source: Yahoo! Telugu: Entertainment | 13 Sep 2009 | 7:05 am

వైఎస్.జగన్‌కు పెరుగుతున్న ఇతర పార్టీల మద్దతు

దివంగత నేత, ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి తనయుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డికి ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు మద్దతు తెలుపుతున్నారు. ఇప్పటికే సొంత పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు బహిరంగ మద్దతు తెలిపిన విషయం తెల్సిందే.
Source: ఏపీ న్యూస్ | 13 Sep 2009 | 5:33 am

బెంగాల్ సీఎంగా భట్టాచార్య కొనసాగుతారు: ఏచూరీ

పశ్చిమబెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా చేశారని, ఆయనను మారుస్తారని ఇలా పలు రకాలుగా వస్తున్న ఊహాగానాలపై సీపీఎం నాయకత్వం స్పందించింది. బెంగాల్ ముఖ్యమంత్రిగా బుద్ధదేవ్ భట్టాచార్య కొనసాగుతారని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సీతారం ఏచూరీ స్పష్టం చేశారు.
Source: జాతీయ | 13 Sep 2009 | 5:10 am

'గ్రేటర్ హైదరాబాద్‌'లో విజయం మాదే: మంత్రి దానం

గ్రేటర్ హైదరాబాద్‌ మున్సిఫల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖామంత్రి దానం నాగేందర్ జోస్యం చెప్పారు. ఆయన ఆదివారం హైదరాబాద్‌లో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి, ప్రజల మనిషి వైఎస్ రాజశేఖర రెడ్డి లేని లోటు ఈ ఎన్నికల్లో స్పష్టంగా తెలుస్తుందన్నారు.
Source: ఏపీ న్యూస్ | 13 Sep 2009 | 4:06 am

స్వైన్ ఫ్లూ విజృంభణపై సీఎం రోశయ్య సమీక్ష

రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ మహమ్మారి విజృంభణపై ముఖ్యమంత్రి రోశయ్య ఆదివారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర రాజధానిలో స్వైన్ ఫ్లూ మరణాలు పెరుగుతున్న విషయం తెల్సిందే. శనివారం ఒక్కరోజే ముగ్గురు మరణించగా, ఆదివారం ఉదయం మరో యువతి ప్రాణాలు కోల్పోయింది.
Source: ఏపీ న్యూస్ | 13 Sep 2009 | 3:41 am

పొదుపు చర్యలను స్వాగతించిన మమతా బెనర్జీ

కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ చేపట్టిన పొదుపు చర్యలను తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, కేంద్ర రైల్వే శాఖామంత్రి మమతా బెనర్జీ స్వాగతించారు. కొన్ని దశాబ్దాలుగా తాను పొదుపును పాటిస్తున్నానని, అందువల్ల విత్తమంత్రి పొదుపు మంత్రం వల్ల తనకు కలిగే నష్టమేమీ లేదని ఆమె స్పష్టం చేశారు.
Source: జాతీయ | 13 Sep 2009 | 3:25 am