|
ఎఫ్-22పి రకం యుద్ధ నౌకను పాక్‌కు అప్పగించిన చైనాపాకిస్థాన్ నావికాదళం అమ్ముల పొదిలో మరో కొత్తరకం యుద్ధనౌక వచ్చి చేరింది. చైనా తయారు చేసిన ఎఫ్-22పి రకం యుద్ధ నౌకల్లో మూడింటిని పాక్ నౌకాదళానికి వచ్చి చేరాయి.Source: Yahoo! Telugu: News | 12 Sep 2009 | 9:46 am యూపీలో అనుమానిత ఐఎస్ఐ ఏజెంట్ అరెస్టుఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో అనుమానిత ఐఎస్ఐ ఏజెంట్‌ను ఆ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. కాన్పూర్ జిల్లాలోని అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఏజెంట్‌ను ఆ రాష్ట్ర తీవ్రవాద వ్యతిరేక దళం (ఏటీఎస్) శనివారం అరెస్టు చేసినట్టు ఏటీఎస్ వర్గాలు వెల్లడించాయి.Source: Yahoo! Telugu: News | 12 Sep 2009 | 9:23 am "వైఎస్సార్ అసలైన స్టార్" అని.. సినిమావాళ్లు ఒప్పుకోవాలి..!"దయచేసి సినిమా వాళ్ళు ఏమనుకోకూడదు". మొన్న ఎన్నికల్లో అన్ని కూటములు కలిశాయి. సినిమారంగంలో స్టార్స్, సూపర్‌స్టార్లు, మెగాస్టార్‌లు కలిసి కాంగ్రెస్‌ను ఓడించాలని చూశారు. కానీ "అసలైన స్టార్ వై.ఎస్.ఆర్." అని మీరు ఒప్పుకుతీరాలి. ప్రతి వ్యక్తీ వైఎస్సార్ చనిపోయినప్పుడు స్వంతమనిషి పోయినట్లుగా బాధపడ్డారు. తాను ఈ కార్యక్రమానికి వచ్చి మాట్లాడాల్సిరావడం తననెంతో కలచివేసిందని" సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి గీతారెడ్డి అన్నారు.Source: Yahoo! Telugu: News | 12 Sep 2009 | 8:29 am అమెరికా స్టాక్ మార్కెట్లు: లాభాలకు బ్రేక్ఐదు రోజుల లాభాలకు బ్రేక్ వేస్తూ... అమెరికా స్టాక్ మార్కెట్లు శుక్రవారం స్థిరంగా ముగిశాయి. అంతర్జాతీయ ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో.. అమెరికా మార్కెట్లు ఫ్లాట్ నోట్ వద్ద ముగిసినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ ఇండెక్స్ - 0.23 శాతంతో 22 పాయింట్లు కోల్పోయి 9,601 వద్దకు చేరుకుంది. స్టాండార్డ్ అండ్ పూర్స్ 500 ఇండెక్స్ - 0.14 శాతంతో 1.41 పాయింట్లు నష్టపోయి 1,042.73 వద్దకు చేరుకుంది. నాస్‌డాక్ కంపోజిట్ ఇండెక్స్ - 0.15 శాతంతో 3.12 పాయింట్లు బలహీనపడి 2,081 వద్దకు చేరుకుంది.Source: Yahoo! Telugu: News | 12 Sep 2009 | 7:56 am ఉల్ఫా నేత అప్పగింతకు బంగ్లాదేశ్ నిరాకరణఉల్ఫా తీవ్రవాద సంస్థకు చెందిన సీనియర్, వేర్పాటువాద నేత అనూప్ ఛెతియాను భారత్‌కు అప్పగించేందుకు బంగ్లాదేశ్ పాలకులు నిరాకరించారు. నకిలీ డాకుమెంట్లతో బంగ్లాలో ప్రవేశించిన ఛెతియా ప్రస్తుతం ఢాకాలో జైలు జీవితం గడుపుతున్నారు.Source: Yahoo! Telugu: News | 12 Sep 2009 | 7:15 am ఐదో రోజుకు పైలెట్ల సమ్మె: 281 జెట్ సర్వీసులు రద్దుప్రముఖ ప్రైవేట్ విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్.. పైలెట్లు సమ్మె ఐదో రోజుకు చేరుకుంది. దీంతో శనివారం రోజు మాత్రమే.. సుమారు 281 జెట్ విమానయాన సర్వీసులు రద్దయ్యాయి. వీటిల్లో 21 అంతర్జాతీయ సర్వీసులున్నాయి. ఈ సంక్షోభానికి తెరవేసేందుకు నేడు ముంబైలో చర్చలను పునరుద్ధరించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం.Source: Yahoo! Telugu: News | 12 Sep 2009 | 7:00 am "143" ఆడకపోవడం "నా ఖర్మ": పూరి జగన్నాథ్టాలీవుడ్ క్రేజ్ హీరోలు ప్రభాస్, రవితేజ, గోపిచంద్, రాజశేఖర్ సాక్షిగా పూరి జగన్నాథ్ సోదరుడు నటిస్తోన్న ""బంపర్ ఆఫర్" చిత్రం ఆడియో విడుదల కార్యక్రమంతో పాటు "పూరీ సంగీత్" ఆడియో సంస్థకూడా లాంఛనంగా ప్రారంభమైంది. శుక్రవారం రాత్రి ప్రసాద్ ల్యాబ్స్‌లో వైభవంగా ఈ కార్యక్రమాలు జరిగాయి. "శంఖం" హీరో గోపిచంద్ ఆడియో కేసెట్‌ను విడుదలచేయగా, రాజశేఖర్ దంపతులు సీడీని విడుదల చేశారు.Source: Yahoo! Telugu: Entertainment | 12 Sep 2009 | 6:59 am కర్ణాటకలో 57కు చేరిన స్వైన్ ఫ్లూ మృతుల సంఖ్యకర్ణాటకలో స్వైన్ ఫ్లూ వైరస్ వీరవిహారం చేస్తోంది. ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య 57కు చేరిందని ఆ రాష్ట్ర ఆరోగ్య వర్గాలు వెల్లడించాయి. శనివారం నమోదైన నాలుగు మృతి కేసుల్లో మూడు బెంగుళూరులోను, మిగిలిన ఒకటి కోలార్‌లో నమోదైనట్టు అధికారులు వెల్లడించారు.Source: Yahoo! Telugu: News | 12 Sep 2009 | 6:54 am హైదరాబాద్‌లో మరో స్వైన్ ఫ్లూ మృతి నమోదురాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మరో స్వైన్ ఫ్లూ కేసు నమోదైంది. రాం నగర్‌కు చెందిన రాంబాబు అనే వ్యక్తి శనివారం స్వైన్ ఫ్లూ వైరస్ కారణంగా మృతి చెందినట్టు ఎర్రగడ్డలోని ఛాతి ఆస్పత్రి వైద్య వర్గాలు వెల్లడించాయి.Source: Yahoo! Telugu: News | 12 Sep 2009 | 6:28 am మళ్లీ ఢిల్లీకి వెళ్ళిన కేవీపీ రామచంద్రరావుదివంగత నేత ముఖ్యమంత్రి వైఎస్ ఆప్తమిత్రుడు కేవీపీ.రామచంద్రరావు కాంగ్రెస్ అధిష్టానం పిలుపు మేరకు శనివారం మరోమారు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. తన ఆప్తమిత్రుడు వైఎస్ వారసుడు వైఎస్.జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలని కేవీపీ తన శక్తివంచన మేరకు కృషి చేస్తున్నారు.Source: Yahoo! Telugu: News | 12 Sep 2009 | 6:16 am బి.ఎన్.రెడ్డి, నాగిరెడ్డి, చక్రపాణి పేరిట జాతీయస్థాయి అవార్డులుతెలుగు చలన చిత్ర పరిశ్రమ పురోభివృద్ధికి విశేషంగా కృషిచేసిన బి.ఎన్.రెడ్డి, నాగిరెడ్డి, చక్రపాణి పేరిట జాతీయస్థాయి అవార్డులను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రాత్రి ప్రకటించింది. దివంగత ముఖ్యమంత్రి డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి గత ఏడాది, నవంబర్ 16న నంది అవార్డు ప్రదానోత్సవ సభలో ప్రకటించిన మేరకు ఈ అవార్డులను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఇటీవలే ఐదుగురు సభ్యుల కమిటీ తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. వాటి ఆధారంగా శుక్రవారంనాడు జి.ఓ. ఎం.ఎస్.నెం. 438ను ప్రభుత్వం విడుదల చేసింది.Source: Yahoo! Telugu: Entertainment | 12 Sep 2009 | 6:06 am మదురైలో సీపీఎం మహిళా నేత బృందా కారత్ అరెస్టుతమిళనాడు రాష్ట్రంలోని మదురై సమీపంలో సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్‌ను జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తంపురం అనే గ్రామాన్ని సందర్శించేందుకు వెళుతుండగా పోలీసులు ఈ చర్య చేపట్టారు.Source: Yahoo! Telugu: News | 12 Sep 2009 | 6:01 am 70 శాతం పూర్తయిన రామ్‌తేజ్, అనుపూర్వల చిత్రంగోల్డ్ఫిష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై బంగారునంది అవార్డు గ్రహీత రామ్‌తేజ్ హీరోగా, అనుపూర్వ హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం 70 శాతం షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. రవిశర్మ దర్శకత్వంలో సుధీర్ తుములూరి నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ఎస్.ఎ. రాజ్‌కుమార్ సంగీతం సమకూర్చారు.Source: Yahoo! Telugu: Entertainment | 12 Sep 2009 | 5:48 am ప్రముఖ తెలుగు దర్శకుడు ఆనంద్ బాబు మృతిప్రముఖ తెలుగు సినీ దర్శకుడు ఆనంద్ బాబు గుండెపోటుతో మరణించారు. నా పెళ్లాం నా ఇష్టం, శ్రీదేవి నర్సింగ్ హోమ్, హరిహర శంభో, కార్తీక మాసం, సూపర్ ఎక్స్‌ప్రెస్ వంటి తదితర చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన శనివారం హైదరాబాదులో కన్నుమూశారని ఆయన కుటుంబీకులు తెలిపారు.Source: Yahoo! Telugu: Entertainment | 12 Sep 2009 | 5:18 am యూపీలో అనుమానిత ఐఎస్ఐ ఏజెంట్ అరెస్టుఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో అనుమానిత ఐఎస్ఐ ఏజెంట్‌ను ఆ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. కాన్పూర్ జిల్లాలోని అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఏజెంట్‌ను ఆ రాష్ట్ర తీవ్రవాద వ్యతిరేక దళం (ఏటీఎస్) శనివారం అరెస్టు చేసినట్టు ఏటీఎస్ వర్గాలు వెల్లడించాయి.Source: జాతీయ | 12 Sep 2009 | 3:54 am "వైఎస్సార్ అసలైన స్టార్" అని.. సినిమావాళ్లు ఒప్పుకోవాలి..!"దయచేసి సినిమా వాళ్ళు ఏమనుకోకూడదు". మొన్న ఎన్నికల్లో అన్ని కూటములు కలిశాయి. సినిమారంగంలో స్టార్స్, సూపర్‌స్టార్లు, మెగాస్టార్‌లు కలిసి కాంగ్రెస్‌ను ఓడించాలని చూశారు. కానీ "అసలైన స్టార్ వై.ఎస్.ఆర్." అని మీరు ఒప్పుకుతీరాలి. ప్రతి వ్యక్తీ వైఎస్సార్ చనిపోయినప్పుడు స్వంతమనిషి పోయినట్లుగా బాధపడ్డారు. తాను ఈ కార్యక్రమానికి వచ్చి మాట్లాడాల్సిరావడం తననెంతో కలచివేసిందని" సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి గీతారెడ్డి అన్నారు.Source: ఏపీ న్యూస్ | 12 Sep 2009 | 3:01 am మళ్లీ ఢిల్లీకి వెళ్ళిన కేవీపీ రామచంద్రరావుదివంగత నేత ముఖ్యమంత్రి వైఎస్ ఆప్తమిత్రుడు కేవీపీ.రామచంద్రరావు కాంగ్రెస్ అధిష్టానం పిలుపు మేరకు శనివారం మరోమారు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. తన ఆప్తమిత్రుడు వైఎస్ వారసుడు వైఎస్.జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలని కేవీపీ తన శక్తివంచన మేరకు కృషి చేస్తున్నారు.Source: ఏపీ న్యూస్ | 12 Sep 2009 | 2:25 am కర్ణాటకలో 57కు చేరిన స్వైన్ ఫ్లూ మృతుల సంఖ్యకర్ణాటకలో స్వైన్ ఫ్లూ వైరస్ వీరవిహారం చేస్తోంది. ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య 57కు చేరిందని ఆ రాష్ట్ర ఆరోగ్య వర్గాలు వెల్లడించాయి. శనివారం నమోదైన నాలుగు మృతి కేసుల్లో మూడు బెంగుళూరులోను, మిగిలిన ఒకటి కోలార్‌లో నమోదైనట్టు అధికారులు వెల్లడించారు.Source: జాతీయ | 12 Sep 2009 | 1:26 am హైదరాబాద్‌లో మరో స్వైన్ ఫ్లూ మృతి నమోదురాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మరో స్వైన్ ఫ్లూ కేసు నమోదైంది. రాం నగర్‌కు చెందిన రాంబాబు అనే వ్యక్తి శనివారం స్వైన్ ఫ్లూ వైరస్ కారణంగా మృతి చెందినట్టు ఎర్రగడ్డలోని ఛాతి ఆస్పత్రి వైద్య వర్గాలు వెల్లడించాయి.Source: ఏపీ న్యూస్ | 12 Sep 2009 | 12:59 am మదురైలో సీపీఎం మహిళా నేత బృందా కారత్ అరెస్టుతమిళనాడు రాష్ట్రంలోని మదురై సమీపంలో సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్‌ను జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తంపురం అనే గ్రామాన్ని సందర్శించేందుకు వెళుతుండగా పోలీసులు ఈ చర్య చేపట్టారు.Source: జాతీయ | 12 Sep 2009 | 12:33 am పావురాల గుట్టకు చేరుకున్న సీబీఐ బృందందివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రయాణించిన హెలికాప్టర్ దుర్ఘటనకు సంబంధించిన విచారణను సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో భాగంగా కర్నూలు జిల్లా రుద్రకోడూరు వద్ద హెలికాప్టర్ ప్రమాదం జరిగిన పావురాల గుట్టకు సీబీఐ బృదం శనివారం ఉదయం చేరుకుందిSource: ఏపీ న్యూస్ | 12 Sep 2009 | 12:05 am సరిహద్దులపై దాడులకు పాల్పడుతున్న పాక్దేశ సరిహద్దు రాష్ట్రమైన పంజాబ్‌లోని పాక్ సరిహద్దుల్లో ఉన్న అత్తారీ ప్రాంతంపై పాకిస్థాన్ రేంజర్లు రాకెట్లతో దాడి చేశాయి. భారత్ భూభాగంలోకి ఈ రాకెట్లు దూసుకు రావడంతో అక్కడే ఉన్న సరిహద్దు భద్రతా దళాలు వాటిని సమవర్థవంతంగా తిప్పికొట్టాయి.Source: జాతీయ | 11 Sep 2009 | 10:00 pm ఢిల్లీలో స్వైన్‌ఫ్లూ బారినపడి మరో మహిళ మృతిదేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం స్వైన్‌ఫ్లూతో మరో మహిళ మృతి చెందింది. దీంతో అక్కడ ఈ వ్యాధితో మరణించిన వారి సంఖ్య ఆరుకు చేరింది. స్థానిక రామ్‌మనోహర్‌లోహియా ఆస్పత్రిలో రాజబాల (38) అనే మహిళ స్వైన్‌ఫ్లూ చికిత్సకోసం చేరింది. అయితే వైరల్ ఇన్‌ఫెక్షన్‌తో శుక్రవారం ఆమె మృతి చెందిందని ఆస్పత్రి ప్రధాన వైద్యులు చతుర్వేది తెలిపారు.Source: జాతీయ | 11 Sep 2009 | 9:14 pm "సున్నా" సెంటిమెంట్ "శంఖం"తెలుగు సినిమాల్లో కొన్ని ఇంకా రొటీన్ ఫార్ములాలోనే మునిగి తేలుతున్నాయ్ అనడానికి చక్కటి ఉదాహరణే ఈ శంఖం. రణం, లక్ష్యం, శౌర్యంలోని "సున్నా" సెంటిమెంట్‌తో ఈసారి శంఖం అంటూ గోపీచంద్ చేసిన మరో ప్రయత్నం. పక్కా మాస్‌ను దృష్టిలో పెట్టుకుని తీసిన చిత్రమిది. వెంకటేష్ నటించిన జయం మనదేరా... చిత్రానికి దాదాపు జెరాక్స్ కాపీ శంఖం. కాస్త మార్పులతో సత్యరాజ్ వంటి నటుడితో చేసిన ప్రయోగం.Source: Yahoo! Telugu: Entertainment | 11 Sep 2009 | 12:00 pm ఎన్టీఆర్‌చే రామ్ "గణేష్" ఆడియో విడుదలరామ్, కాజల్ జంటగా ఎం.శరవణన్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై "స్రవంతి" రవికిషోర్ నిర్మిస్తోన్న గణేష్ (జస్ట్ గణేష్) చిత్రం ఆడియో ఆవిష్కరణోత్సవం గురువారం రాత్రి రామానాయుడు స్టూడియోస్‌లో వైభవంగా జరిగింది.Source: Yahoo! Telugu: Entertainment | 11 Sep 2009 | 10:30 am మంచి తిండి, నిద్రతోనే సన్నబడ్డాను: సంధ్య"ప్రేమిస్తే" చిత్రం ద్వారా తెరంగేట్రం చేసిన టీనేజ్ స్టార్ "సంధ్య". కోలీవుడ్‌కు ప్రముఖ దర్శకుడు శంకర్ ద్వారా పరిచయమైన ఈ భామ తెలుగువారికి "అన్నవరం" చిత్రం ద్వారా బాగా దగ్గరైంది. తాజాగా "హాసిని" చిత్రంలో నటిస్తోన్న సంధ్య కాస్త సన్నబడింది. "హాసిని" షూటింగ్ సందర్భంలో ఏంటి మేడమ్? సన్నబడ్డారని అడిగితే.. షూటింగ్‌లేక, చేతిలో సినిమాలు లేక దిగులుతో సన్నబడలేదు. ఖాళీ దొరికితే అవిఇవీ అన్నీ తినేస్తా. సినిమాలుంటే సరైన తిండి, నిద్ర రోజూ అరగంట వ్యాయామం చేస్తా. అందుకే సన్నబడ్డానని సంధ్య చెప్పింది. అంతేకాదు.. బాగా తిని ఎక్కువగా మొద్దు నిద్రపోతానని ఆమె వెల్లడించింది.Source: Yahoo! Telugu: Entertainment | 11 Sep 2009 | 9:49 am అమరావతి టిక్కెట్ ఆశిస్తున్న రాష్ట్రపతి కుమారుడుమహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విదర్భ రీజియన్‌లోని అమరావతి నియోజకవర్గ టిక్కెట్‌ను రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ కుమారుడు రాజేంద్ర పాటిల్ షెకావత్ ఆశిస్తున్నారు. కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు తన వంతు కృషి చేస్తున్నారు.Source: జాతీయ | 11 Sep 2009 | 9:34 am కరీనా హాట్ హాట్ పిజ్జాస్ కావాలా...?పిజ్జా అంటే లొట్టలేయని మోడ్రన్ పీపుల్ ఎవరుంటారు చెప్పండి. పిజ్జా సంగతి సరే... కరీనా హాట్ పిజ్జాలను ఎప్పుడైనా రుచి చూశారా..? ఇప్పుడు ముంబయిలో కరీనా హాట్ హాట్ పిజ్జాలకోసం జనం ఎగబడుతున్నారట. ఇంతకీ ఈ కరీనా పిజ్జాల సంగతేంటీ అనుకుంటున్నారా...? ఇటీవల ముంబయిలో ఓ యువకుడు తను చదివిన చదువుకు తగిన ఉద్యోగం రాకపోవడంతో ఉపాధి మార్గం ఏమిటా... అని రాత్రింబవళ్లు ఆలోచించాడట. చివరికి అతనికో ఆలచోన రావడంతో ఓ షాపును అద్దెకు తీసుకుని.. ఆ షాపుకు "కరీనా హాట్ పిజ్జాస్" అని పేరు పెట్టాడట. అంతే.. ఆ మరుసటి రోజునుంచి ఆ షాపు మహా పాపులర్ అయిందట. అంతేకాదు.. కరీనా హాట్ పిజ్జాస్ రుచిచూసేందుకు జనం కిక్కిరిపోతున్నారట.Source: Yahoo! Telugu: Entertainment | 11 Sep 2009 | 7:23 am జైలు నుంచి "కృషి" వెంకటేశ్వర రావు విడుదల"కృషి" బ్యాంకు కుంభకోణానికి సంబంధించి జైలు జీవితం గడుపుతూ వచ్చిన ఆ బ్యాంకు మాజీ ఛైర్మన్ కొసరాజు వెంకటేశ్వర రావుకు జైలు నుంచి విముక్తి లభించింది. ఆయన శుక్రవారం విడుదలైంది.Source: ఏపీ న్యూస్ | 11 Sep 2009 | 7:16 am కోర్టు బోనులో నిలబడనున్న మడోన్నాపాప్ సంగీత ప్రపంచంలో రాణి.. మడోన్నా త్వరలో కోర్టు బోనులో నిలబడనున్నట్లు హాలీవుడ్ వర్గాలు తెలిపాయి. ఇటీవల బల్గేరియాలోని ఓ స్టేడియంలో ఈ పాప్ రాణి సంగీత కచ్చేరీ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమం సందర్భంగా స్టేడియం నాశనం అయిందట. ఈ పరిణామంతో.. స్టేడియం నిర్వాహకులు ఆగ్రహించారు.Source: Yahoo! Telugu: Entertainment | 11 Sep 2009 | 7:06 am మంత్రులు ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించాలి: కాంగ్రెస్స్వదేశీ, విదశీ పర్యటనలు చేపట్టే మంత్రులు ఎకనామీ క్లాస్‌లోనే ప్రయాణించాలని, మీడియా సమావేశాలు కూడా ఫైవ్ స్టార్ హోటల్స్‌లలో నిర్వహించరాదని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా కోరారు.Source: జాతీయ | 11 Sep 2009 | 6:29 am సెక్స్ టేపుల జోలికెళ్లను: మేగాన్ ఫాక్స్తాను సెక్స్ టేపుల జోలికెళ్లనని ప్రముఖ హాలీవుడ్ అందాల నటి మరియు మోడల్ మేగాన్ ఫాక్స్ తేల్చి చెప్పింది. తన శృంగార సన్నివేశాలను తాను చూస్తే.. భవిష్యత్తులో శృంగారానికి దూరమవ్వాల్సి వస్తుందేమోనన్న ఆందోళనను మేగాన్ ఫాక్స్ వ్యక్తం చేసింది. లాస్ ఏంజెలెస్‌లో ప్రముఖ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మేగాన్ ఫాక్స్ మాట్లాడింది.Source: Yahoo! Telugu: Entertainment | 11 Sep 2009 | 6:04 am నిన్నలేని అందమేదో నిదుర లేచెనెందుకో....!ఒకవైపు కారుమబ్బులు, అంతలో చల్లగా వీస్తూ శరీరాన్ని రాసుకుంటూ పోయే పిల్లగాలి, అక్కడే జుమ్మని నాదం చేస్తూ తిరిగే తుమ్మెదలు.. రకరకాల రంగులతో, సువాసనలు వెదజల్లుతూ నవ్వుతూ పలుకరించే పుష్పాలు, ఇంతలో మేమున్నామని గుర్తు చేస్తూ కురిసే వర్షపు చినుకులు, వర్షానికి తడిసిన భూమాత మట్టి సువాసన... ఇవన్నీ మనసును దోచేవే. వీటికి భాష లేకపోయినా, వాటి లక్షణాలను బట్టి తన్మయత్వం చెందని హృదయమనేది ఉండదు.Source: వినోదం | 11 Sep 2009 | 5:52 am కాంగ్రెస్‌లో కార్యకర్తగానే ఉంటా: రోజా సెల్వమణికాంగ్రెస్ పార్టీలో చేరేందుకు గతంలో రోజా సెల్వమణి వైఎస్‌ను కలిసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారని కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు గంగా భావానీ తనపై నిందారోపణలు చేయటం సరికాదని రోజా చెప్పారు. పార్టీలో తాను ఓ సాధారణ కార్యకర్తగానే ఉంటానని ఆమె తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 11 Sep 2009 | 5:21 am ఎన్టీఆర్‌చే రామ్ "గణేష్" ఆడియో విడుదలరామ్, కాజల్ జంటగా ఎం.శరవణన్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై "స్రవంతి" రవికిషోర్ నిర్మిస్తోన్న గణేష్ (జస్ట్ గణేష్) చిత్రం ఆడియో ఆవిష్కరణోత్సవం గురువారం రాత్రి రామానాయుడు స్టూడియోస్‌లో వైభవంగా జరిగింది.Source: వినోదం | 11 Sep 2009 | 5:01 am మాయావతి సర్కార్‌కు సుప్రీం కోర్టు ఆదేశం!ఉత్తరప్రదేశ్‌లోని మాయావతి సర్కార్‌ను దేశ అత్యున్నత న్యాయస్థానం ఘాటుగా హెచ్చరించింది. లక్నోలోని అన్ని పార్కుల్లో మాయా సర్కారు చేపట్టిన విగ్రహాల నిర్మాణాలను ఆరు గంటల్లో నిలిపి వేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అపెక్స్ కోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.Source: జాతీయ | 11 Sep 2009 | 4:13 am
|