|
మాయావతి సర్కార్‌కు సుప్రీం కోర్టు ఆదేశం!ఉత్తరప్రదేశ్‌లోని మాయావతి సర్కార్‌ను దేశ అత్యున్నత న్యాయస్థానం ఘాటుగా హెచ్చరించింది. లక్నోలోని అన్ని పార్కుల్లో మాయా సర్కారు చేపట్టిన విగ్రహాల నిర్మాణాలను ఆరు గంటల్లో నిలిపి వేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అపెక్స్ కోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.Source: Yahoo! Telugu: News | 11 Sep 2009 | 9:42 am స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్స్టాక్ మార్కెట్ ప్రస్తుతం స్వల్ప లాభాల్లో పయనిస్తుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 31 పాయింట్లు పుంజుకుని 16,248 వద్ద పయనిస్తోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 4 పాయింట్లు లాభపడి 4,823 వద్దకు చేరుకుంది. సెన్సెక్స్ 0.19 శాతం, నిఫ్టీ 0.09 శాతం మేరకు వృద్ధి చెందాయి.Source: Yahoo! Telugu: News | 11 Sep 2009 | 9:27 am గృహరుణాలపై ఒక శాతం వడ్డీ తగ్గింపు: ఆర్బీఐగృహ రుణాలకు సంబంధించి రూ.10 లక్షల లోపు రుణాలు తీసుకునే వారికి వడ్డీని 1 శాతం తగ్గిస్తున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. అదే రూ.20 లక్షలకు పొందే రుణాలకుగాను 12 వాయిదాలకు ఈ వడ్డీ తగ్గింపు వర్తిస్తుందని అధికార వర్గాలు వెల్లడించాయి.Source: Yahoo! Telugu: News | 11 Sep 2009 | 9:12 am నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్స్టాక్ మార్కెట్ ప్రస్తుతం నష్టాల్లో కొనసాగుతుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 23 పాయింట్లు కోల్పోయి 16,194 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 6 పాయింట్లు నష్టపోయి.. 4,813 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్, నిఫ్టీ 0.14 శాతం మేరకు క్షీణించాయి.Source: Yahoo! Telugu: News | 11 Sep 2009 | 8:18 am మంత్రి జైపాల్ రెడ్డి సీఎం రేసులో లేరు: పొన్నం ప్రభాకర్రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖామంత్రి ఎస్.జైపాల్ రెడ్డి లేరని రాష్ట్ర ఎంపీల కన్వీనర్ పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఇదేవిషయాన్ని మంత్రి జైపాల్ రెడ్డి కూడా స్పష్టం చేశారని తెలిపారు. శుక్రవారం న్యూఢిల్లీలో రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీల బృందం మంత్రి జైపాల్ రెడ్డితో సమావేశమై రాష్ట్ర రాజకీయ పరిణామాలపై చర్చించారు.Source: Yahoo! Telugu: News | 11 Sep 2009 | 8:07 am హెచ్‌పీ రోజువారీ బ్లాక్ కాట్‌రిడ్జ్‌లు విడుదలప్రముఖ కంప్యూటర్ తయారీ సంస్థ.. హెవ్లెట్ పాకార్డ్ (హెచ్‌పీ).. ప్రింటర్లలో ఉపయోగించే.. రోజువారీ బ్లాక్ కాట్‌రిడ్జ్‌లను విడుదల చేసింది. తాము విడుదల చేసిన ఈ బ్లాక్ ఇంక్ కాట్‌రిడ్జ్‌ల కారణంగా.. ఒక పేజీకి.. 45 శాతం మేరకు వ్యయ నియంత్రణ గావించవచ్చని.. హెచ్‌పీ కంపెనీ తెలిపింది. 818బీ, 56బీ పేరిట ఈ కొత్త బ్లాక్ ఇంక్ కాట్‌రిడ్జ్‌లను హెచ్‌పీ మార్కెట్లోకి విడుదల చేసింది. 818బీ.. రూ. 399ల వద్ద లభ్యమవుతుంది...Source: Yahoo! Telugu: News | 11 Sep 2009 | 8:00 am సూత్రధారులపై పాక్ చర్యలు తీసుకోవడం లేదుఅమెరికా పర్యటనలో ఉన్న భారత హోం శాఖ మంత్రి పి.చిదంబరం గురువారం అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి హిల్లరీ క్లింటన్‌ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇరుదేశాల నేతల మధ్య ముంబయి ఉగ్రవాద దాడులపై కూడా చర్చలు జరిగాయి. గత ఏడాది నవంబరులో ముంబయి మహానగరంలో పాక్ నుంచి వచ్చిన పది మంది ఉగ్రవాదులు మారణహోమం సృష్టించిన సంగతి తెలిసిందే.Source: Yahoo! Telugu: News | 11 Sep 2009 | 7:57 am సీఎం పీఠం ఇవ్వకుంటే రాజీనామా: మంత్రి మాణిక్యరావుముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి వారసుడు వైఎస్.జగన్ మోహన్ రెడ్డికి సీఎం బాధ్యతలు అప్పగించక పోతే తన పదవికి రాజీనామా చేయనున్నట్టు రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖా మంత్రి మాణిక్యరావు తేల్చి చెప్పారు.Source: Yahoo! Telugu: News | 11 Sep 2009 | 7:46 am నష్టాల్లో పయనిస్తున్న స్టాక్ మార్కెట్స్టాక్ మార్కెట్ ప్రస్తుతం నష్టాల్లో పయనిస్తుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 32 పాయింట్లు కోల్పోయి 16,185 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 9 పాయింట్లు నష్టపోయి 4,810 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్, నిఫ్టీ 0.19 శాతం మేరకు క్షీణించాయి.Source: Yahoo! Telugu: News | 11 Sep 2009 | 7:31 am ఎంసెట్ కౌన్సెలింగ్ తేదీల్లో మళ్లీ మార్పుఎంసెట్ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ నిర్వహణ తేదీల్లో మళ్లీ మార్పులు చోటుచేసుకున్నాయి. ఇంతకుముందు నిర్ణయించిన ప్రకారం సెప్టెంబర్ 13 నుంచి 18వ తేదీ వరకు ఇంజినీరంగ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు గతంలో ఎంసెట్ ప్రవేశాల కమిటీ ప్రకటించింది.Source: Yahoo! Telugu: News | 11 Sep 2009 | 7:26 am కరీనా హాట్ హాట్ పిజ్జాస్ కావాలా...?పిజ్జా అంటే లొట్టలేయని మోడ్రన్ పీపుల్ ఎవరుంటారు చెప్పండి. పిజ్జా సంగతి సరే... కరీనా హాట్ పిజ్జాలను ఎప్పుడైనా రుచి చూశారా..? ఇప్పుడు ముంబయిలో కరీనా హాట్ హాట్ పిజ్జాలకోసం జనం ఎగబడుతున్నారట. ఇంతకీ ఈ కరీనా పిజ్జాల సంగతేంటీ అనుకుంటున్నారా...? ఇటీవల ముంబయిలో ఓ యువకుడు తను చదివిన చదువుకు తగిన ఉద్యోగం రాకపోవడంతో ఉపాధి మార్గం ఏమిటా... అని రాత్రింబవళ్లు ఆలోచించాడట. చివరికి అతనికో ఆలచోన రావడంతో ఓ షాపును అద్దెకు తీసుకుని.. ఆ షాపుకు "కరీనా హాట్ పిజ్జాస్" అని పేరు పెట్టాడట. అంతే.. ఆ మరుసటి రోజునుంచి ఆ షాపు మహా పాపులర్ అయిందట. అంతేకాదు.. కరీనా హాట్ పిజ్జాస్ రుచిచూసేందుకు జనం కిక్కిరిపోతున్నారట.Source: Yahoo! Telugu: Entertainment | 11 Sep 2009 | 7:23 am కోర్టు బోనులో నిలబడనున్న మడోన్నాపాప్ సంగీత ప్రపంచంలో రాణి.. మడోన్నా త్వరలో కోర్టు బోనులో నిలబడనున్నట్లు హాలీవుడ్ వర్గాలు తెలిపాయి. ఇటీవల బల్గేరియాలోని ఓ స్టేడియంలో ఈ పాప్ రాణి సంగీత కచ్చేరీ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమం సందర్భంగా స్టేడియం నాశనం అయిందట. ఈ పరిణామంతో.. స్టేడియం నిర్వాహకులు ఆగ్రహించారు.Source: Yahoo! Telugu: Entertainment | 11 Sep 2009 | 7:06 am సెక్స్ టేపుల జోలికెళ్లను: మేగాన్ ఫాక్స్తాను సెక్స్ టేపుల జోలికెళ్లనని ప్రముఖ హాలీవుడ్ అందాల నటి మరియు మోడల్ మేగాన్ ఫాక్స్ తేల్చి చెప్పింది. తన శృంగార సన్నివేశాలను తాను చూస్తే.. భవిష్యత్తులో శృంగారానికి దూరమవ్వాల్సి వస్తుందేమోనన్న ఆందోళనను మేగాన్ ఫాక్స్ వ్యక్తం చేసింది. లాస్ ఏంజెలెస్‌లో ప్రముఖ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మేగాన్ ఫాక్స్ మాట్లాడింది.Source: Yahoo! Telugu: Entertainment | 11 Sep 2009 | 6:04 am తెలుగు సినిమాలా చూద్దాం.. మలయాళం వైపు "మంత్ర" కన్ను!"మంత్ర" తర్వాత అందాల ముద్దుగుమ్మ, సెక్సీతార ఛార్మికి అంతటి సక్సెస్ రాలేదు. హీరోయిన్‌గా అందాలను ఆరబోస్తూ.. ప్రేక్షకులను ఆకట్టుకుంటోన్న ఛార్మి.. లేడి ఓరియెంటెడ్ పాత్రలు చేస్తున్న సంగతి తెలిసిందే. మంత్ర, మనోరమ, కావ్యాస్ డైరీ చిత్రాలు కూడా ఈ కోవకు చెందినవే. ప్రస్తుతం తెలుగు సినిమా ఆశాజనకంగా లేదని మలయాళంలో ప్రవేశించింది. అయితే గతంలో ఆమె చేసిన ఓ సినిమా పెద్దగా ఆడకపోవడంతో రూటుమార్చిన ఛార్మి తన సోయగాలను జనాలకు చూపించి థియేటర్‌కు రప్పించాలనే ప్రయత్నాలు చేస్తోంది. "శ్రీ ఆంజనేయం"లో చూపించిన తరహాలో ఈ తాజా చిత్రంలో ఛార్మి కన్పింటనున్నట్లు ఇండస్ట్రీలో టాక్.Source: Yahoo! Telugu: Entertainment | 11 Sep 2009 | 5:08 am మాయావతి సర్కార్‌కు సుప్రీం కోర్టు ఆదేశం!ఉత్తరప్రదేశ్‌లోని మాయావతి సర్కార్‌ను దేశ అత్యున్నత న్యాయస్థానం ఘాటుగా హెచ్చరించింది. లక్నోలోని అన్ని పార్కుల్లో మాయా సర్కారు చేపట్టిన విగ్రహాల నిర్మాణాలను ఆరు గంటల్లో నిలిపి వేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అపెక్స్ కోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.Source: జాతీయ | 11 Sep 2009 | 4:13 am మంత్రి జైపాల్ రెడ్డి సీఎం రేసులో లేరు: పొన్నం ప్రభాకర్రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖామంత్రి ఎస్.జైపాల్ రెడ్డి లేరని రాష్ట్ర ఎంపీల కన్వీనర్ పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఇదేవిషయాన్ని మంత్రి జైపాల్ రెడ్డి కూడా స్పష్టం చేశారని తెలిపారు. శుక్రవారం న్యూఢిల్లీలో రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీల బృందం మంత్రి జైపాల్ రెడ్డితో సమావేశమై రాష్ట్ర రాజకీయ పరిణామాలపై చర్చించారు.Source: ఏపీ న్యూస్ | 11 Sep 2009 | 2:39 am సీఎం పీఠం ఇవ్వకుంటే రాజీనామా: మంత్రి మాణిక్యరావుముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి వారసుడు వైఎస్.జగన్ మోహన్ రెడ్డికి సీఎం బాధ్యతలు అప్పగించక పోతే తన పదవికి రాజీనామా చేయనున్నట్టు రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖా మంత్రి మాణిక్యరావు తేల్చి చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 11 Sep 2009 | 2:17 am సీఎం పదవికి జగన్ మినహా వేరే ప్రత్యామ్నాయం లేదు!దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి స్థానంలో సీఎంగా వై.ఎస్. జగన్ మినహా వేరే ప్రత్యామ్నాయం లేదని ప్రాథమిక విద్యాశాఖ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. ముఖ్యమంత్రి ఎవరవుతారన్న విషయంలో ఎలాంటి అయోమయం లేదని వరప్రసాద్ స్పష్టం చేశారు.Source: ఏపీ న్యూస్ | 11 Sep 2009 | 1:29 am జగన్‌కు ముఖ్యమంత్రి పదవి దక్కనట్టేనా...!కీర్తిశేషులు వైఎస్ రాజశేఖరరెడ్డి గత వారం హఠాన్మరణం చెండంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. సంతాపదినాలు ముగిసిన తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరిని నియమించాలనే దానిపై ఏఐసీసీ కోర్ కమిటీ తర్జనభర్జనలు పడుతోంది. ముఖ్యమంత్రి ఎవరన్నది స్పష్టంగా తేల్చి చెప్పకుండానే కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం గురువారం ముగిసింది.Source: ఏపీ న్యూస్ | 11 Sep 2009 | 1:24 am నిథారీ హత్య కేసు: ఎంఎస్ పాంధెర్‌కు విముక్తిసంచనాత్మక నిథారీ హత్యల్లో భాగమైన 14 ఏళ్ల బాలిక రింపా హల్దార్ అత్యాచారం, హత్య కేసులో అలహాబాద్ హైకోర్టు శుక్రవారం వ్యాపారవేత్త మొనీందర్ సింగ్ పాంధెర్‌ను నిర్దోషిగా విడిచిపెట్టింది. ఈ కేసులో పాంధెర్‌పై నమోదు చేసిన అభియోగాలను నిరూపించేందుకు బలమైన ఆధారాలులేని కారణంగా హైకోర్టు ఈ తీర్పు వెలువరించింది.Source: జాతీయ | 11 Sep 2009 | 1:18 am పూణేలో మరో మూడు స్వైన్ ఫ్లూ మరణాలుదేశంలో ప్రమాదకర స్వైన్ ఫ్లూ వ్యాధి కారణంగా తీవ్రంగా ప్రభావితమైన పూణే నగరంలో తాజాగా మరో మూడు మరణాలు సంభవించాయి. తాజాగా స్వైన్ ఫ్లూతో బాధపడుతున్న మరో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారని పూణే ఆరోగ్య శాఖ శుక్రవారం వెల్లడించింది. దీంతో నగరంలో మొత్తం మృతుల సంఖ్య 40కి చేరుకుందిSource: జాతీయ | 11 Sep 2009 | 12:58 am వైఎస్సార్ సంతాప సభకు హాజరుకానున్న కేవీపీదివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డికి శుక్రవారం రవీంద్ర భారతిలో అఖిలపక్ష సంతాపసభ జరుగనుంది. ఈ అఖిలపక్ష సంతాపసభలో పాల్గొనేందుకు వైఎస్ కుటుంబ ఆప్తుడు, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు శుక్రవారం రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు చేరుకోనున్నారు.Source: ఏపీ న్యూస్ | 11 Sep 2009 | 12:30 am భద్రతాంశాలపై అమెరికా సానుకూల స్పందనకేంద్ర హోంశాఖ మంత్రి పి.చిదంబరం అమెరికా పర్యటన దిగ్విజయంగా సాగుతోంది. నాలుగు రోజుల చిదంబరం అమెరికా పర్యటన శుక్రవారంతో ముగియనుంది. గత మూడు రోజులు అమెరికా నేతలు, యంత్రాంగంతో చిదంబరం ఫలవంతమైన చర్చలు జరిపారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా యంత్రాంగంలోని కీలక నేతలతో చిదంబరం భేటీ అయిన సంగతి తెలిసిందే.Source: జాతీయ | 11 Sep 2009 | 12:09 am దేశవ్యాప్తంగా మరో 9 స్వైన్ ఫ్లూ మరణాలుదేసవ్యాప్తంగా మరో తొమ్మిద స్వైన్ ఫ్లూ మరణాలు నమోదవడంతో గురువారానికి ఈ ప్రమాదకర వ్యాధి బారినపడి మృతి చెందినవారి సంఖ్య 154కి చేరుకుంది. ఇదిలా ఉంటే గురువారం దేశవ్యాప్తంగా మరో 176 స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులను ఢిల్లీ (68), హర్యానా (14), కర్ణాటక (32), తమిళనాడు (19), మహారాష్ట్ర (26)ల్లో కనుగొన్నారు.Source: జాతీయ | 10 Sep 2009 | 10:27 pm ఢిల్లీ తొక్కిసలాట: దర్యాప్తుకు ఆదేశించిన సీఎంఈశాన్య ఢిల్లీలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో గురువారం జరిగిన తొక్కిసలాటలో ఐదుగురు విద్యార్థినిలు ప్రాణాలు కోల్పోయారు. మరో 34 మంది గాయపడ్డారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ దుర్ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ విచారణకు ఆదేశించారు. అంతేకాకుండా మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.లక్ష, గాయపడినవారికి రూ.50 వేల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు.Source: జాతీయ | 10 Sep 2009 | 9:36 pm వేషము మార్చెనూ... హూయ్...టాలీవుడ్‌లో "ప్రేమికుడు" సరసన ప్రియురాలుగా "ఘరానా మొగుడు"కి భార్యగా నటించిన సెక్సీ నటి నగ్మా గుర్తుండే ఉంటుంది. ఇప్పుడామె మహారాష్ట్రలో రాజకీయ నాయకురాలు అవతారమెత్తింది. మహారాష్ట్ర అసెంబ్లీకి జరుగనున్న ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయనుంది. బుధవారం మహారాష్ట్రలోని తిలక్ భవన్‌లో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు నిర్వహించిన సభకు నగ్మా హాజరైంది.Source: Yahoo! Telugu: Entertainment | 10 Sep 2009 | 2:18 pm విలేకరులూ చూడండి... ఇదిగో జగన్‌కు మద్దతుగా ఫ్యాక్స్: రాజశేఖర్గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో.. వై.ఎస్. జగన్‌కు మద్దతు తెలిపేందుకే విలేకరులను పిలిచినట్లు రాజశేఖర్ స్పష్టం చేశారు. జగన్‌ను సీఎంగా చూడాలని రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు. మా ఆకాంక్షకూడా అదేనని ఆయన అన్నారు. తమ కోరిక నెరవేరాలని యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీని స్వయంగా కలిసి తెలియజేయాలనుకున్నామని, కానీ ఇప్పుడున్న పరిస్థితుల రీత్యా ఆమె అపాంట్‌మెంట్ సాధ్యంకాదని చాలామంది సలహా ఇచ్చారు.Source: Yahoo! Telugu: Entertainment | 10 Sep 2009 | 2:07 pm ఉషాకిరణ్ మూవీస్ "నిన్ను కలిశాక" ఆడియో విడుదలఉషాకిరణ్మూవీస్ నూతన కథానాయికలను పరిచయం చేస్తూ "నిన్ను కలిశాక" పేరుతో ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. శివనాగేశ్వరరావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, సంతోష్, చైతన్య, ప్రియ, డిపాషాలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇకపోతే.. ప్రముఖ నిర్మాత రామోజీరావు నిర్మిస్తోన్న 83వ చిత్రమిది. ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం గురువారం ఉదయం రామోజీ ఫిలింసిటీలో కేంద్ర కార్యాలయంలో జరిగింది.Source: Yahoo! Telugu: Entertainment | 10 Sep 2009 | 1:52 pm వైఎస్సారే నిజమైన రాజకీయనాయకుడు: రాజారాజకీయనాయకుడంటే ఎలా ఉండాలనేది "సమర్థుడు" చిత్రంలో చూపించామని హీరో రాజా అన్నారు. ఇటీవలే దివంగతులైన వై.ఎస్. రాజశేఖర రెడ్డి అసలైన రాజకీయనాయకుడని ప్రశంసించారు. ప్రమాదంలో ఆయన మరణించడం దురదృష్టకరమని రాజా చెప్పారు. తాజాగా తాను హీరోగా నటిస్తోన్న "సమర్థుడు" చిత్రాన్ని నాయకత్వ లక్షణాలను కూడిన కథతో రూపొందించినట్లు రాజా తెలిపారు. సంజన హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ఈ నెల 18వ తేదీన విడుదల కానుందని చెప్పారు.Source: Yahoo! Telugu: Entertainment | 10 Sep 2009 | 11:59 am "యంగ్ ఇండియా" పాటల రికార్డింగ్ ప్రారంభందర్శకరత్న డా. దాసరి నారాయణరావు అంతా కొత్తవారితో తీయనున్న చిత్రం యంగ్ ఇండియాకు సంబంధించి పాటల రికార్డింగ్ కార్యక్రమాన్ని గురువారం ప్రసాద్‌ల్యాబ్స్ థియేటర్‌లో ప్రారంభించారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 10 Sep 2009 | 11:29 am "చిరుత"కు కుర్రాడు అనే టైటిల్ పెట్టాలనుకున్నాం: పూరి'రామ్‌చరణ్‌తేజ నటించిన తొలి చిత్రానికి "కుర్రాడు" అని టైటిల్‌పెట్టి.. "లోక్లాస్" అనే కాప్షన్ పెట్టాలనుకున్నాం. కానీ మెగాస్టార్ చిరంజీవి తనయుడు లోక్లాస్‌కాలేడు. చూడ్డానికి హైక్లాస్‌లా ఉన్నాడు. ఆ తర్వాత చరణ్ తొలి చిత్రానికి "చిరుత" అనే టైటిల్ పెట్టామని' దర్శకుడు పూరి జగన్నాథ్ తన మనసులోని మాటను వెల్లడించారు. వరుణ్, నేహాశర్మ నటించిన "కుర్రాడు" ఆడియో కార్యక్రమంలో పూరి మాట్లాడారు. గతంలో కమల్‌హాసన్ నటించిన "అందమైన అనుభవం" చిత్రంలోని "కుర్రాళ్ళు కుర్రాళ్లు.." అనే పాటను ఈ చిత్రంలో రీమిక్స్‌గా జొప్పించారు. ఈ పాటకు పూరి లయబద్ధంగా డ్యాన్స్ చేయడం విశేషం.Source: Yahoo! Telugu: Entertainment | 10 Sep 2009 | 11:18 am ముగిసిన కోర్ కమిటీ భేటీ: వీడని సందిగ్ధత!స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి వారసుని ఎంపికపై చర్చించేందుకు భేటీ అయిన కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం ముగిసింది. అయితే, వారసుని ఎంపికపై కోర్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం బయటకు వెల్లడించలేదు. ఫలితంగా సీఎం అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠత కొనసాగుతోంది.Source: ఏపీ న్యూస్ | 10 Sep 2009 | 9:13 am ప్రశాంతంగా ముగిసిన టెక్కలి ఉప ఎన్నికల పోలింగ్శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక పోలింగ్ గురువారం ప్రశాంతంగా ముగిసింది. చిన్నపాటి సంఘటనలు మినహా ఓటింగ్ ప్రక్రియ సజావుగా జరిగినట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు.Source: ఏపీ న్యూస్ | 10 Sep 2009 | 8:42 am రాహుల్ పర్యటనపై డీఎంకే క్యాడర్ అసంతృప్తికాంగ్రెస్ యువరాజు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ తమిళనాడు రాష్ట్ర పర్యటనపై అధికార డీఎంకే క్యాడర్ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. గతంలో రాష్ట్ర పర్యటనకు రాహుల్ మూడు సార్లు వచ్చినప్పటికీ.. డీఎంకే చీఫ్‌తో ఒక్కసారి కూడా భేటీ కాలేదు.Source: జాతీయ | 10 Sep 2009 | 8:34 am అద్వైత భావనల, హొయసల రాజసాల "చిక్‌మగళూరు"పశ్చిమ కనుమల పర్వత శ్రేణుల్లో తుంగ మరియు భద్ర నదుల జన్మస్థలంగా.. అత్యంత ఎత్తులో ఉండే పర్వ శ్రేణులతో, ప్రకృతి రమణీయ దృశ్యాలు కలిగిన కెమ్మనగుండి, కుద్రేముఖ్ కొండల సౌందర్యంతో, మాణిక్యధార, కల్లథిగిరి జలపాతాల పరవళ్లతో... భారతదేశంలోనే మొట్టమొదటగా కాఫీ తోటలు పెంచబడ్డ ప్రాంతంగా.. పర్యాటకులకు నేత్రానందం కలిగింపజేస్తున్న ప్రాంతమే "చిక్‌మగళూరు"...Source: వినోదం | 10 Sep 2009 | 6:05 am "యంగ్ ఇండియా" పాటల రికార్డింగ్ ప్రారంభందర్శకరత్న డా. దాసరి నారాయణరావు అంతా కొత్తవారితో తీయనున్న చిత్రం యంగ్ ఇండియాకు సంబంధించి పాటల రికార్డింగ్ కార్యక్రమాన్ని గురువారం ప్రసాద్‌ల్యాబ్స్ థియేటర్‌లో ప్రారంభించారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు.Source: వినోదం | 10 Sep 2009 | 6:02 am నేడు కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ భేటీ!కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటి గురువారం సాయంత్రం ఆరు గంటలకు భేటీ కానుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు వార్తలు వెలువడుతున్నాయి.Source: జాతీయ | 10 Sep 2009 | 5:05 am కేంద్ర ఆర్థిక మంత్రితో ముగిసిన రాష్ట్ర ఎంపీలు భేటీ!కేంద్ర ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఉద్ధండుడు ప్రణబ్ ముఖర్జీతో రాష్ట్ర ఎంపీలు గురువారం సమావేశమయ్యారు. అందుబాటులో ఉన్న ఎంపీలందరూ ఒకటిగా వెళ్లి ఆయనతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.Source: ఏపీ న్యూస్ | 10 Sep 2009 | 4:57 am మంత్రుల సహకారం ఉంది: ముఖ్యమంత్రి రోశయ్యరాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రికి కొందరు మంత్రులు సహకరించడం లేదని, సమావేశాలకు హాజరు కావడం లేదని మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి రోశయ్య అన్నారు.Source: ఏపీ న్యూస్ | 10 Sep 2009 | 4:28 am జగన్‌లో నాయకత్వ లక్షణాలు పుష్కలం: రాహుల్దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి వారసుడు వైఎస్.జగన్ మోహన్ రెడ్డిలో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. తమిళనాడు రాష్ట్రంలో మూడు రోజుల పాటు పర్యటన చేస్తున్న ఆయన గురువారం చెన్నయ్‌లో మీడియాతో మాట్లాడారు.Source: జాతీయ | 10 Sep 2009 | 4:28 am కాంగ్రెస్- డీఎంకే సంబంధాలు బలంగా ఉన్నాయితమిళనాడుతో అధికార డీఎంకే పార్టీతో తమ సంబంధాలు బలంగా ఉన్నాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ తెలిపారు. ఆయన గురువారం చెన్నైలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్- డీఎంకే మధ్య విభేదాలు ఉన్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. రెండు పార్టీల మధ్య బలమైన భాగస్వామ్యం ఉందన్నారు.Source: జాతీయ | 10 Sep 2009 | 4:21 am అధిష్టానం నిర్ణయం మేరకే సీఎం అభ్యర్థి ఎంపిక: రఘువీరాముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి వారసుని పేరును కాంగ్రెస్ అధిష్టానమే ఎంపిక చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి ఎన్.రఘువీరా రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు.Source: ఏపీ న్యూస్ | 10 Sep 2009 | 4:16 am తిన్నది అరక్క తమ్ముడితో గొడవపడుతా: షీలా"తినలేక కొందరు.. తిందామంటే ఏమీ దొరక్క కొందరుంటే.. తిని అరక్క కొందరుంటారని పెద్దలంటుంటారు. అందుకే పరిమితంగా తినాలంటారు. కానీ నటి షీలా మాత్రం ఫుల్‌గా తిని.. అది అరగడానికి తన తమ్ముడితో కొట్టాటకు దిగుతుందట. ఈ విషయాన్ని ఆమె ఇటీవలే చెప్పింది. చైల్డ్ ఆర్టిస్టుగా తమిళులకు పరిచయమైన ఈ భామ తెలుగులో అల్లు అర్జున్‌తో "పరుగు"లో నటించింది. తర్వాత "మస్కా"లో చేసింది. తాజాగా ఎన్టీఆర్ చిత్రంలో నటిస్తోంది.Source: వినోదం | 10 Sep 2009 | 3:32 am
|