జగన్‌లో నాయకత్వ లక్షణాలు పుష్కలం: రాహుల్

దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి వారసుడు వైఎస్.జగన్‌ మోహన్ రెడ్డిలో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. తమిళనాడు రాష్ట్రంలో మూడు రోజుల పాటు పర్యటన చేస్తున్న ఆయన గురువారం చెన్నయ్‌లో మీడియాతో మాట్లాడారు.
Source: Yahoo! Telugu: News | 10 Sep 2009 | 9:56 am

అధిష్టానం నిర్ణయం మేరకే సీఎం అభ్యర్థి ఎంపిక: రఘువీరా

ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి వారసుని పేరును కాంగ్రెస్ అధిష్టానమే ఎంపిక చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి ఎన్.రఘువీరా రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు.
Source: Yahoo! Telugu: News | 10 Sep 2009 | 9:46 am

పెరిగిన గృహ వినియోగ వస్తువుల ధరలు

ప్రస్తుత వారంలో పండ్లు, కూరగాయలు మరియు పాల ధరల్లో ఒక శాతం పెరిగింది. అదే కోడిగ్రుడ్ల ధరలు నాలుగు శాతానికి పెరిగాయి. సముద్రపు చేపలు రెండు శాతం మరియు సోయాబీన్ నూనె మూడు శాతానికి పెరిగాయని మార్కెట్ వర్గాలు తెలిపాయి.
Source: Yahoo! Telugu: News | 10 Sep 2009 | 9:32 am

స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్

స్టాక్ మార్కెట్ ప్రస్తుతం స్వల్ప లాభాల్లో పయనిస్తుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 6 పాయింట్లు పెరిగి 16,189 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 2 పాయింట్లు లాభపడి 4,816 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.04 శాతం, నిఫ్టీ 0.03 శాతం మేరకు వృద్ధి చెందాయి.
Source: Yahoo! Telugu: News | 10 Sep 2009 | 9:27 am

తిన్నది అరక్క తమ్ముడితో గొడవపడుతా: షీలా

"తినలేక కొందరు.. తిందామంటే ఏమీ దొరక్క కొందరుంటే.. తిని అరక్క కొందరుంటారని పెద్దలంటుంటారు. అందుకే పరిమితంగా తినాలంటారు. కానీ నటి షీలా మాత్రం ఫుల్‌గా తిని.. అది అరగడానికి తన తమ్ముడితో కొట్టాటకు దిగుతుందట. ఈ విషయాన్ని ఆమె ఇటీవలే చెప్పింది. చైల్డ్ ఆర్టిస్టుగా తమిళులకు పరిచయమైన ఈ భామ తెలుగులో అల్లు అర్జున్‌తో "పరుగు"లో నటించింది. తర్వాత "మస్కా"లో చేసింది. తాజాగా ఎన్టీఆర్ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం గ్యాప్‌లో షీలాను పలుకరిస్తే.. ఈ విధంగా స్పందించింది. ఖాళీ టైమ్‌లో ఏం చేస్తారని అడిగితే..? అమ్మరొయ్యల వేపుడు చేసి పెడితే లొట్టలేసుకుని తింటానని చెబుతూ.. రొయ్యల బిర్యానీ అంటే చాలా ఇష్టమంటోంది. "నేను చెన్నైలో ఉంటే అమ్మ చేసే టేస్టీ రొయ్యల వేపుడు ఇష్టపడి తింటానని చెబుతోంది. "తిన్న తర్వాత అది అరగాలి కదా.. అందుకే తమ్ముడితో గొడవపడతానని" షీలా తెలిపింది.
Source: Yahoo! Telugu: Entertainment | 10 Sep 2009 | 8:39 am

సెంటిమెంట్ రాజకీయాలు: అంధకారంలో రోజా భవిత!

సాధారణంగా సినీనటులు, రాజకీయ నేతలు సెంటిమెంట్లకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ప్రయాణం చేయాలన్నా.. ఒక పని తలపెట్టాలని భావించినా.. తమ ఆస్థాన జ్యోతిష్యులను సంప్రదించనిదే వారు మొదలుపెట్టరు. నోరు మెదపరు. ఎన్నికల్లో గెలుపోటముల్లో సైతం ఈ సెంటిమెంట్ బాగానే ప్రభావం చూపుతుంది.
Source: Yahoo! Telugu: News | 10 Sep 2009 | 8:30 am

లాభాల్లోనే కొనసాగుతున్న స్టాక్ మార్కెట్

స్టాక్ మార్కెట్ ప్రస్తుతం లాభాల్లోనే కొనసాగుతుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 114 పాయంట్లు పుంజుకుని 16,297 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 24 పాయింట్లు లాభపడి 4,839 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.70 శాతం, నిఫ్టీ 0.51 శాతం మేరకు వృద్ధి చెందాయి.
Source: Yahoo! Telugu: News | 10 Sep 2009 | 8:25 am

కాంగ్రెస్- డీఎంకే సంబంధాలు బలంగా ఉన్నాయి

తమిళనాడుతో అధికార డీఎంకే పార్టీతో తమ సంబంధాలు బలంగా ఉన్నాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ తెలిపారు. ఆయన గురువారం చెన్నైలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్- డీఎంకే మధ్య విభేదాలు ఉన్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. రెండు పార్టీల మధ్య బలమైన భాగస్వామ్యం ఉందన్నారు.
Source: Yahoo! Telugu: News | 10 Sep 2009 | 8:09 am

కొత్త హార్డ్ ‌డిస్క్ కొనడానికి వెళ్తున్నారా?

మనిషికి గుండె ఎంత ప్రధానమో.. కంప్యూటర్‌కు హార్డ్ డిస్క్ అంతే కీలకం. గుండె ఎంత సామర్థ్యంతో పనిచేస్తే.. అంతబాగా శరీరంలోని రక్తనాళాలన్నింటికీ రక్తం సరఫరా అవుతుంది. అలాగే హార్డ్ డిస్క్ ఎంత సామర్థ్యంతో పనిచేస్తే... కంప్యూటర్ అంత వేగంగా.. మనకు కావలసిన పనులను చక్కబెడుతుంది. కంప్యూటర్‌‌లో ఇంత కీలక పాత్రను పోషించే...
Source: Yahoo! Telugu: News | 10 Sep 2009 | 8:04 am

సముద్ర మట్టానికి 355 మీటర్ల ఎత్తులో ప్రమాదం: త్యాగి

ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ సముద్ర మట్టానికి 355 మీటర్ల ఎత్తులో ప్రమాదం జరిగిందని సివిల్ ఏవియేషన్ డైరక్టర్ జరనల్ డీజీ త్యాగి వెల్లడించారు. హెలికాఫ్టర్ ప్రమాద స్థలాన్ని ఆయన నేతృత్వంలోని ప్రత్యేక బృందం గురువారం సందర్శించింది.
Source: Yahoo! Telugu: News | 10 Sep 2009 | 7:52 am

స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్

స్టాక్ మార్కెట్ ప్రస్తుతం స్వల్ప లాభాల్లో పయనిస్తుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 46 పాయింట్లు పుంజుకుని 16,230 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 7 పాయింట్లు లాభపడి 4,821 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.29 శాతం, నిఫ్టీ 0.14 శాతం మేరకు వృద్ధి చెందాయి.
Source: Yahoo! Telugu: News | 10 Sep 2009 | 7:36 am

"ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను": బొమ్మాళీ

"అరుంధతి" తర్వాత టాలీవుడ్ అగ్ర హీరోయిన్‌గా మార్కులేసుకున్న సెక్సీతార, బిల్లా సుందరి అనుష్క ఈ మధ్య టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు డైలాగ్‌లు చెప్పుకుని తిరుగుతుందట. ఇంతకీ విషయమేమిటంటే..? అరుంధతి తర్వాత ఈ భామ మళ్లీ అటువంటి ప్రాధాన్యత గల సినిమాలో నటించడానికి అగ్రిమెంట్లో సంతకం పెట్టింది. మళ్లీ అలాంటి పాత్రనే ఎందుకు పోషిస్తున్నారని బొమ్మాళీని అడిగితే.. "నేను ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను" అంది. ఇదేదో పోకిరి మహేష్ బాబు డైలాగ్‌లా ఉందంటే..? "నేను చిన్నతనం నుంచి అంతే. మనిషికి ఎన్ని ఆలోచనలైనా రావచ్చు. మార్పు అనేది జీవితంలో మార్చలేనిది. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. తీసుకున్నాక మళ్లీ ఆలోచించకూడదని.." ఈ సెక్సీడాళ్ అంటోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 10 Sep 2009 | 5:09 am

మంత్రుల సహకారం ఉంది: ముఖ్యమంత్రి రోశయ్య

రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రికి కొందరు మంత్రులు సహకరించడం లేదని, సమావేశాలకు హాజరు కావడం లేదని మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి రోశయ్య అన్నారు.
Source: ఏపీ న్యూస్ | 10 Sep 2009 | 4:28 am

జగన్‌లో నాయకత్వ లక్షణాలు పుష్కలం: రాహుల్

దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి వారసుడు వైఎస్.జగన్‌ మోహన్ రెడ్డిలో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. తమిళనాడు రాష్ట్రంలో మూడు రోజుల పాటు పర్యటన చేస్తున్న ఆయన గురువారం చెన్నయ్‌లో మీడియాతో మాట్లాడారు.
Source: జాతీయ | 10 Sep 2009 | 4:28 am

కాంగ్రెస్- డీఎంకే సంబంధాలు బలంగా ఉన్నాయి

తమిళనాడుతో అధికార డీఎంకే పార్టీతో తమ సంబంధాలు బలంగా ఉన్నాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ తెలిపారు. ఆయన గురువారం చెన్నైలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్- డీఎంకే మధ్య విభేదాలు ఉన్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. రెండు పార్టీల మధ్య బలమైన భాగస్వామ్యం ఉందన్నారు.
Source: జాతీయ | 10 Sep 2009 | 4:21 am

అధిష్టానం నిర్ణయం మేరకే సీఎం అభ్యర్థి ఎంపిక: రఘువీరా

ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి వారసుని పేరును కాంగ్రెస్ అధిష్టానమే ఎంపిక చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి ఎన్.రఘువీరా రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు.
Source: ఏపీ న్యూస్ | 10 Sep 2009 | 4:16 am

సముద్ర మట్టానికి 355 మీటర్ల ఎత్తులో ప్రమాదం: త్యాగి

ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ సముద్ర మట్టానికి 355 మీటర్ల ఎత్తులో ప్రమాదం జరిగిందని సివిల్ ఏవియేషన్ డైరక్టర్ జరనల్ డీజీ త్యాగి వెల్లడించారు. హెలికాఫ్టర్ ప్రమాద స్థలాన్ని ఆయన నేతృత్వంలోని ప్రత్యేక బృందం గురువారం సందర్శించింది.
Source: ఏపీ న్యూస్ | 10 Sep 2009 | 2:22 am

నాకిప్పుడు పెళ్ళైతే ఎంత బావుణ్ణో: కరుణానిధి

నాకిప్పుడు పెళ్ళైతే ఎంత బావుణ్ణో... ఈ మాట అన్నది ఎవరో కాదు...ఓ వయో వృద్ధుడు అందునా ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి...ఇప్పటికే మీరు ఊహించి ఉంటారనుకుంటాను. అతనే తమిళనాడు ముఖ్యమంత్రి, కళైంజర్ కరుణానిధి తన 86వ జన్మదినం సందర్భంగా చెన్నైలో 86 జంటలకు సామూహిక వివాహాలు ఉచితంగా నిర్వహించారు.
Source: జాతీయ | 10 Sep 2009 | 1:09 am

ఢిల్లీ పాఠశాలలో తొక్కిసలాట: ఐదుగురి మృతి

ఢిల్లీలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో గురువారం తొక్కిసలాట జరిగింది. ఇందులో ఐదుగురు విద్యార్థులు మృతి చెందినట్లు తెలుస్తోంది. మరో 30 మంది విద్యార్థులు గాయపడ్డారు. గాయపడినవారిని జీటీబీ ఆస్పత్రికి తరలించారు.
Source: జాతీయ | 9 Sep 2009 | 11:51 pm

జెట్ ఎయిర్‌వేస్‌లో కొనసాగుతున్న ప్రతిష్టంభన

జెట్ ఎయిర్‌వేస్ పైలెట్లు, యాజమాన్యం మధ్య నెలకొన్న వివాదం మూడో రోజు కూడా కొనసాగుతోంది. జెట్ ఎయిర్‌వేస్‌‍లో కొనసాగుతున్న ఈ ప్రతిష్టంభన కారణంగా గురువారం కూడా ఈ పౌరవిమానయాన సంస్థ అనేక విమాన సర్వీసులు రద్దు చేసింది. సుమారు 200 అంతర్జాతీయ, దేశీయ విమాన సేవలను ఈ రోజు కూడా రద్దు చేస్తున్నట్లు జెట్ ఎయిర్‌వేస్ వెల్లడించింది.
Source: జాతీయ | 9 Sep 2009 | 11:44 pm

నల్లమలలో ప్రమాద స్థలాన్ని సందర్శించిన సీఎస్

ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి ప్రయాణించిన హెలికాఫ్టర్ ప్రమాదానికి గురైన ప్రాంతాన్ని రాష్ట్ర ప్రభుత్వ యంత్రాగం బుధవారం సందర్శించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రమకాంత్ రెడ్డి, డీజీపీ ఎస్ఎస్‌పి.యాదవ్, గ్రేహౌండ్స్ దళ అధిపతి, ఇంటలిజెన్స్ చీఫ్‌తో పాటు.
Source: ఏపీ న్యూస్ | 9 Sep 2009 | 11:43 pm

టెక్కలిలో ప్రారంభమైన ఉప ఎన్నిక పోలింగ్

శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి నియోజకవర్గంలో గురువారం ఉదయం ఏడు గంటలకు ఉప ఎన్నిక అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లమధ్య ప్రారంభమైంది. ఈ స్థానానికి ఆరుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
Source: ఏపీ న్యూస్ | 9 Sep 2009 | 11:27 pm

టెక్కలి ఉప ఎన్నిక: ప్రశాంతంగా సాగుతున్న పోలింగ్

శ్రీకాకుళం జిల్లా టెక్కలి అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. పోలింగ్ ప్రారంభమైన గురువారం ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారు.
Source: ఏపీ న్యూస్ | 9 Sep 2009 | 11:26 pm

షాపింగ్‌ కాంప్లెక్స్‌ కూలి ఆరుగురి మృతి

హర్యానాలోని ఫరీదాబాద్‌లో బుధవారం మధ్యాహ్నం మూడు అంతస్తులు కలిగిన భవనంలోని షాపింగ్‌ కాంప్లెక్స్‌ కూలిపోవడంతో ఆరుగురు దుర్మరణం చెందారు. మృతి చెందిన వారిలో షాపింగ్‌ కాంప్లెక్స్‌లో పనిచేస్తున్న ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్లు సమాచారం.
Source: జాతీయ | 9 Sep 2009 | 9:55 pm

దేశవ్యాప్తంగా ప్రారంభమైన ఉపఎన్నిక పోలింగ్

గురువారం ఉదయం ఏడు గంటలకు దేశవ్యాప్తంగా దాదాపు 20 అసెంబ్లీలకు ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. దీంతో దేశంలోని అన్నీ ప్రధాన రాజకీయ పార్టీలకు పరీక్షే! లోక్‌సభ ఎన్నికల తర్వాత జరిగే ఎన్నికలను అన్నీ రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి.
Source: జాతీయ | 9 Sep 2009 | 9:46 pm

నాకు మల్టిపుల్ మైలోమా క్యాన్సర్: లీసా రే

బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌ ప్రేక్షకులను సైతం తన అందచందాలతో ఇట్టే ఆకట్టుకోన్న అందాల తార లీసా రే.. మల్టీపుల్ మైలోమా అనే క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని లీసా రేనే స్వయంగా తన బ్లాగులో తెలియజేసింది. జూలై 2వ తేదీ నుంచి తనకు వైద్యులు ట్రీట్‌మెంట్ ప్రారంభించారని.. జూన్ 23వ తేదీన తనకు క్యాన్సర్ ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారని లీసారే తన బ్లాగులో చెప్పుకుంది.
Source: Yahoo! Telugu: Entertainment | 9 Sep 2009 | 10:42 am

నైన్త్‌క్లాస్‌లో ప్రేమా...? తెలుగు సినిమా పరువు తీయకండి

ప్రేమకథలు వింతపోకడలుపోతున్నాయి. అందుకు తాజా ఉదాహరణే.. బుధవారంనాడు అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైన "నైన్త్‌క్లాస్ కేరాఫ్ ఏలేశ్వరం" చిత్రం. పైగా ఈ చిత్రాన్ని 9వతేదీ 9వ నెల 2009 సంవత్సరం.. ఉదయం 9 గంటల 9 నిమిషాలకు ప్రారంభించామని, ఇది అద్వితీయ లఘ్నమని చిత్ర దర్శక నిర్మాత ఎం. రాజ్‌కుమార్ చెబుతున్నారు. ఈ రోజు చాలా సినిమాల ఓపెనింగ్స్ జరగాల్సింది. కానీ జరగలేదు. కారణమేమని ఆరా తీస్తే ఎన్ని 9లు వచ్చినా ఈ రోజు మంచిరోజు కాదనేది కొందరు సినీ పండితుల వాదన.
Source: Yahoo! Telugu: Entertainment | 9 Sep 2009 | 10:03 am

ఆ పైలెట్లను విధుల్లోకి తీసుకుంటేనే వస్తాం: పైలెట్లు

జెట్ ఎయిర్వేస్‌లో తలెత్తిన సంక్షోభం మరింత ముదిరిపోతోంది. పైలెట్లు టెర్రరిస్టుల్లా వ్యవహరిస్తున్నారనీ జెట్ యాజమాన్యం ఒకవైపు మండిపడుతుంటే.. మరోవైపు తొలగించిన పైలెట్లను తిరిగి తీసుకుంటేనే తాము విధులకు హాజరవుతామని జెట్ ఎయిర్వేస్ పైలెట్లు తెగేసి చెపుతున్నారు.
Source: జాతీయ | 9 Sep 2009 | 8:59 am

వెబ్‌సైట్లో హెలికాప్టర్‌ ప్రమాద దర్యాప్తు వివరాలు: డీజీసీఏ

వైఎస్‌ హెలికాప్టర్‌ ప్రమాదానికి సంబంధించిన దర్యాప్తు వివరాలను తాము వెబ్‌సైట్లో పొందుపరుస్తామని డీజీసీఏ అధికారి త్యాగి తెలిపారు. ప్రమాదంపై ప్రజలకున్న సందేహాలను నివారించేందుకు తాము వెబ్‌సైట్లో ఉంచాలని అనుకున్నామని ఆయన అన్నారు.
Source: ఏపీ న్యూస్ | 9 Sep 2009 | 8:39 am

11వ తేదీన భేటీకానున్న తెరాస కార్యవర్గం

ఈనెల 11వ తేదీన తెలంగాణా రాష్ట్ర సమితి (తెరాస) కార్యవర్గం భేటీ కానుంది. శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు పార్టీ ప్రధాన కార్యాలయమైన తెలంగాణా భవన్‌లో ఈ సమావేశం జరుగనుంది. దీనికి పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షత వహిస్తారని ఆ పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది.
Source: ఏపీ న్యూస్ | 9 Sep 2009 | 6:48 am

రాష్ట్రంలో 971 కరువు మండలాలు: సీఎం రోశయ్య

రాష్ట్రంలో నెలకొన్న కరువుపై ప్రభుత్వం స్పందించింది. వర్షాభావ పరిస్థితుల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా కరువు పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో రాష్ట్రాన్ని కరువు పీడిత ప్రాంతంగా ప్రకటించాలని రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు గట్టిగానే డిమాండ్ చేశాయి. అయితే, ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి ఈ విషయంలో జాప్యం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 9 Sep 2009 | 6:33 am

జార్ఖండ్‌లో భాజపా ఎమ్మెల్యేల మూకుమ్మడి రాజీనామా!

జార్ఖండ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా తన శాసనసభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖలకు ఆ రాష్ట్ర గవర్నర్ కె.శంకర్ నారాయణ్‌కు బుధవారం సమర్పించారు.
Source: జాతీయ | 9 Sep 2009 | 6:20 am

"బుజ్జిగాడు" సుందరికి భలే ఆఫర్లొస్తున్నాయట..!

"బుజ్జిగాడు" చిత్రం ద్వారా దక్షిణాది సినీ రంగంలో ఆరంగేట్రం చేసిన సెక్సీతార సంజన. బిల్లా స్టార్ ప్రభాస్‌తో బుజ్జిగాడులో రెండో కథానాయికగా నటించిన సంజన ఈ మధ్య హాట్ హాట్‌గా వార్తల్లోకెక్కిన సంగతి తెలిసిందే. తాజాగా రాజా హీరోగా చేసే సమర్థుడు చిత్రంలో హీరోయిన్‌గా అందాలను ఆరబోస్తోన్న సంజన ఈ మధ్య తెగ బిజీ బిజీగా ఉంటోందని సినీ జనం అంటున్నారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు కీలక పాత్ర పోషించిన సమర్థుడు చిత్రం త్వరలో తెరపైకి రానున్న నేపథ్యంలో.. సంజన కన్నడంలో ఓ పెద్ద బ్యానర్‌పై రూపుదిద్దుకోనున్న చిత్రంలో నటించబోతోందని సమాచారం. అలాగే మలయాళంలోనూ సంజనకు ఆఫర్ల మీద ఆఫర్లొస్తున్నాయని తెలిసింది.
Source: Yahoo! Telugu: Entertainment | 9 Sep 2009 | 5:17 am

నాకు మల్టిపుల్ మైలోమా క్యాన్సర్: లీసా రే

బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌ ప్రేక్షకులను సైతం తన అందచందాలతో ఇట్టే ఆకట్టుకోన్న అందాల తార లీసా రే.. మల్టీపుల్ మైలోమా అనే క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని లీసా రేనే స్వయంగా తన బ్లాగులో తెలియజేసింది. జూలై 2వ తేదీ నుంచి తనకు వైద్యులు ట్రీట్‌మెంట్ ప్రారంభించారని.. జూన్ 23వ తేదీన తనకు క్యాన్సర్ ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారని లీసారే తన బ్లాగులో చెప్పుకుంది.
Source: వినోదం | 9 Sep 2009 | 5:17 am

నైన్త్‌క్లాస్‌లో ప్రేమా...? తెలుగు సినిమా పరువు తీయకండి

ప్రేమకథలు వింతపోకడలుపోతున్నాయి. అందుకు తాజా ఉదాహరణే.. బుధవారంనాడు అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైన "నైన్త్‌క్లాస్ కేరాఫ్ ఏలేశ్వరం" చిత్రం. పైగా ఈ చిత్రాన్ని 9వతేదీ 9వ నెల 2009 సంవత్సరం.. ఉదయం 9 గంటల 9 నిమిషాలకు ప్రారంభించామని, ఇది అద్వితీయ లఘ్నమని చిత్ర దర్శక నిర్మాత ఎం. రాజ్‌కుమార్ చెబుతున్నారు. ఈ రోజు చాలా సినిమాల ఓపెనింగ్స్ జరగాల్సింది. కానీ జరగలేదు. కారణమేమని ఆరా తీస్తే ఎన్ని 9లు వచ్చినా ఈ రోజు మంచిరోజు కాదనేది కొందరు సినీ పండితుల వాదన.
Source: వినోదం | 9 Sep 2009 | 4:40 am

కర్ణాటకలో 44కు పెరిగిన స్వైన్ ఫ్లూ మృతులు

కర్ణాటక రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా మరో 28 యేళ్ళ మహిళ హెచ్1ఎన్1 వైరస్‌కు ప్రాణాలు కోల్పోయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం స్వైన్ ఫ్లూ కేసుల సంఖ్య 44కు చేరుకుంది.
Source: జాతీయ | 9 Sep 2009 | 3:31 am