|
లాభాల్లోనే కొనసాగుతున్న సెన్సెక్స్స్టాక్ మార్కెట్ ప్రస్తుతం లాభాల్లోనే కొనసాగుతుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 63 పాయింట్లు పుంజుకుని 16,187 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 11 పాయింట్లు లాభపడి 4,816 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.39 శాతం, నిఫ్టీ 0.22 శాతం మేరకు వృద్ధి చెందాయి.Source: Yahoo! Telugu: News | 9 Sep 2009 | 9:35 am వైఎస్ఆర్ మృతికి యమగండమే కారణమా!హైదరాబాద్ నుంచి చిత్తూరు జిల్లాలో ప్రారంభమయ్యే రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి వైఎస్ గత బుధవారం ఉదయం హెలికాప్టర్‌లో బయలుదేరి వెళ్ళారు. ఆయన బయలుదేరి వెళ్ళిన కొద్ది గంటలలోపే హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆయనతోపాటు మరో నలుగురు మృత్యువాత పడ్డ విషయం విదితమే.Source: Yahoo! Telugu: News | 9 Sep 2009 | 9:30 am 8 లక్షల కోట్లకు చేరుకున్న ఎల్ఐసీ ఖజానానిరుడు ఆర్థిక సంవత్సరం చివరినాటికి దేశీయ ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారతీయ జీవిత బీమా నిగమ్ (ఎల్ఐసీ) ఖజానా దాదాపు 8.07 లక్షల కోట్ల రూపాయలకు పైగా చేరుకుంది.Source: Yahoo! Telugu: News | 9 Sep 2009 | 9:03 am కర్ణాటకలో 44కు పెరిగిన స్వైన్ ఫ్లూ మృతులుకర్ణాటక రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా మరో 28 యేళ్ళ మహిళ హెచ్1ఎన్1 వైరస్‌కు ప్రాణాలు కోల్పోయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం స్వైన్ ఫ్లూ కేసుల సంఖ్య 44కు చేరుకుంది.Source: Yahoo! Telugu: News | 9 Sep 2009 | 9:00 am 52 పాయింట్ల లాభంతో స్టాక్ మార్కెట్స్టాక్ మార్కెట్ 52 పాయింట్లు లాభంతో పయనిస్తుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 16,175 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 7 పాయింట్లు నష్టపోయి.. 4,812 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.32 శాతం, నిఫ్టీ 0.14 శాతం మేరకు వృద్ధి చెందాయి.Source: Yahoo! Telugu: News | 9 Sep 2009 | 8:27 am ఎఫ్‌బీఐ నుంచి చిట్కాలు పొందిన చిదంబరంఅమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్‌ను తీవ్రవాద ముప్పు నుంచి ఎలా సంరక్షిస్తున్నారో కేంద్ర హోంశాఖ మంత్రి హోం శాఖ మంత్రి పి.చిదంబరం స్వయంగా పరిశీలించారు. అమెరికా పర్యటనలో భాగంగా చిదంబరం మంగళవారం న్యూయార్క్‌లోని ఎఫ్‌బీఐ అధికారులను కలుసుకున్నారు.Source: Yahoo! Telugu: News | 9 Sep 2009 | 8:14 am ఐదుసార్లు బిన్ లాడెన్‌ను కలుసుకున్న షరీఫ్పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ప్రపంచంలో మోస్ట్‌వాంటెడ్ తీవ్రవాది ఒసామా బిన్ లాడెన్‌ను ఐదుసార్లు కలుసుకున్నాడు. అమెరికాపై సెప్టెంబరు 11, 2001న వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై లాడెన్ నేతృత్వంలోని నిషేధిత అల్ ఖైదా తీవ్రవాద సంస్థ నిర్వహించిన సంగతి తెలిసిందే. అటువంటి ఈ తీవ్రవాద సంస్థ చీఫ్‌ను పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఐదుసార్లు కలుసుకున్నారని తెలుస్తోంది.Source: Yahoo! Telugu: News | 9 Sep 2009 | 8:00 am ఆ రోజు వైఎస్ వెంట "సూరీడు" లేడు.. అందుకే...సెప్టెంబరు 2న ముఖ్యమంత్రి మృతి వెనుక కూడా కొన్ని సెంటిమెంట్లు దాగి ఉన్నట్లు పలువురు అనుకోవడం వినిపిస్తోంది. సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఏ కార్యక్రమానికైనా వెళ్లేటపుడు ఆయన వెంట వ్యక్తిగత కార్యదర్శి సూర్యనారాయణ రెడ్డి ( సూరీడు) తప్పకుండా ఉంటారు. కానీ చిత్తూరు రచ్చబండ కార్యక్రమానికి వెళ్లేటపుడు ఆయన వెంట సూరీడు వెళ్లలేదు. అందువల్లనే వైఎస్ ప్రమాదానికి గురయ్యారని అంటున్నారు.Source: Yahoo! Telugu: News | 9 Sep 2009 | 7:58 am వైఎస్ పథకాలను కొనసాగిస్తాం : బొత్స సత్యనారాయణకీర్తి శేషులు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రాష్ట్రంలో అమలు చేసిన పథకాలను తాము కొనసాగిస్తామని పంచాయితీరాజ్ శాఖామంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.Source: Yahoo! Telugu: News | 9 Sep 2009 | 7:54 am రూరల్ మేనేజ్‌మెంట్ కోర్సులకు అడ్మీషన్స్ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్‌మెంట్ ఆనంద్ సంస్థ.. వివిధ మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశం కోసం ధరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కోర్సులు.. వాటికి సంబంధించిన వివరాలను ఈ విధంగా పేర్కొంది. 1. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ ఇన్ రూరల్ మేనేజ్‌మెంట్ (పీఆర్ఎం) అర్హతలు... డిగ్రీలో కనీసం 50 శాతం మార్కులను కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండీకాప్ (పీహెచ్)లకు మాత్రం 45 శాతం మార్కులు...Source: Yahoo! Telugu: News | 9 Sep 2009 | 7:45 am "బుజ్జిగాడు" సుందరికి భలే ఆఫర్లొస్తున్నాయట..!"బుజ్జిగాడు" చిత్రం ద్వారా దక్షిణాది సినీ రంగంలో ఆరంగేట్రం చేసిన సెక్సీతార సంజన. బిల్లా స్టార్ ప్రభాస్‌తో బుజ్జిగాడులో రెండో కథానాయికగా నటించిన సంజన ఈ మధ్య హాట్ హాట్‌గా వార్తల్లోకెక్కిన సంగతి తెలిసిందే. తాజాగా రాజా హీరోగా చేసే సమర్థుడు చిత్రంలో హీరోయిన్‌గా అందాలను ఆరబోస్తోన్న సంజన ఈ మధ్య తెగ బిజీ బిజీగా ఉంటోందని సినీ జనం అంటున్నారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు కీలక పాత్ర పోషించిన సమర్థుడు చిత్రం త్వరలో తెరపైకి రానున్న నేపథ్యంలో.. సంజన కన్నడంలో ఓ పెద్ద బ్యానర్‌పై రూపుదిద్దుకోనున్న చిత్రంలో నటించబోతోందని సమాచారం. అలాగే మలయాళంలోనూ సంజనకు ఆఫర్ల మీద ఆఫర్లొస్తున్నాయని తెలిసింది.Source: Yahoo! Telugu: Entertainment | 9 Sep 2009 | 5:17 am కర్ణాటకలో 44కు పెరిగిన స్వైన్ ఫ్లూ మృతులుకర్ణాటక రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా మరో 28 యేళ్ళ మహిళ హెచ్1ఎన్1 వైరస్‌కు ప్రాణాలు కోల్పోయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం స్వైన్ ఫ్లూ కేసుల సంఖ్య 44కు చేరుకుంది.Source: జాతీయ | 9 Sep 2009 | 3:31 am ఎఫ్‌బీఐ నుంచి చిట్కాలు పొందిన చిదంబరంఅమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్‌ను తీవ్రవాద ముప్పు నుంచి ఎలా సంరక్షిస్తున్నారో కేంద్ర హోంశాఖ మంత్రి హోం శాఖ మంత్రి పి.చిదంబరం స్వయంగా పరిశీలించారు. అమెరికా పర్యటనలో భాగంగా చిదంబరం మంగళవారం న్యూయార్క్‌లోని ఎఫ్‌బీఐ అధికారులను కలుసుకున్నారు.Source: జాతీయ | 9 Sep 2009 | 2:46 am వైఎస్ పథకాలను కొనసాగిస్తాం : బొత్స సత్యనారాయణకీర్తి శేషులు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రాష్ట్రంలో అమలు చేసిన పథకాలను తాము కొనసాగిస్తామని పంచాయితీరాజ్ శాఖామంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.Source: ఏపీ న్యూస్ | 9 Sep 2009 | 2:26 am సీఎంగా ఎవరిని నియమించాలో వారికి తెలుసు: కేవీపీఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరిని నియమించాలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి తెలుసునని కేవీపీ బుధవారం ఢిల్లీలో తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 9 Sep 2009 | 2:06 am జమ్ము- కాశ్మీర్‌లో కాల్పులు: ఆర్మీ మేజర్ మృతిజమ్ము- కాశ్మీర్ రాష్ట్రంలోని పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉన్న పర్వత ప్రాంత పూంచ్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్ ఓ ఆర్మీ మేజర్ ప్రాణాలు బలిగొంది. ఈ ఎన్‌కౌంటర్ ఇద్దరు తీవ్రవాదులు కూడా హతమయ్యారని అధికారిక వర్గాలు బుధవారం వెల్లడించాయి.Source: జాతీయ | 9 Sep 2009 | 12:58 am మరో ఐదుగురిపై వేటు వేయనున్న జెట్ ఎయిర్వేస్ఇద్దరు సహ పైలెట్లను విధుల నుంచి తొలగించినందుకు నిరసనగా జెట్ ఎయిర్వేస్‌కు చెందిన పైలెట్లు మంగళవారం మూకుమ్మడి సెలవులకు దిగిన నేపధ్యంలో జెట్ యాజమాన్యం పైలెట్లపై క్రమశిక్షణా చర్యలకు దిగుతోంది. తాజాగా మరో ఐదుగురు పైలెట్లపై క్రమశిక్షణా చర్యలు తీసుకోనున్నట్లు ఎయిర్‌లైన్స్‌కు చెందిన అధికారులు వెల్లడించారు.Source: జాతీయ | 9 Sep 2009 | 12:37 am అంత్యక్రియల రోజున చికెన్ బిర్యానీ ఆరగించిన డీజీపీ!తమను అమితంగా ప్రేమించే ప్రియతమ నేత వైఎస్.రాజశేఖర్ రెడ్డి ఇకలేరని తెలుసుకుని కోట్లాది మంది ప్రజలు విషాదంలో మునిగివున్న తరుణంలో రాష్ట్ర పోలీసు బాస్ ఎస్.ఎస్.పి.యాదవ్ మాత్రం ఉత్సాహంగా కనిపించారట.Source: ఏపీ న్యూస్ | 8 Sep 2009 | 11:38 pm నేడు నల్లమలకు చేరుకోనున్న త్యాగి బృందంముఖ్యమంత్రి వైఎస్ హెలికాఫ్టర్ కూలిపోయిన నల్లమల అటవీ ప్రదేశంలోని రుద్రకోట పావురాల గుట్ట ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వం నియమించిన సివిల్ ఏవియేషన్ డైరక్టర్ జనరల్ త్యాగి బృందం చేరుకోనుంది. ఈ బృందంలో త్యాగితో సహా ఆరుగురు సభ్యులు ఉంటారు.Source: ఏపీ న్యూస్ | 8 Sep 2009 | 11:18 pm రాజశేఖరుని వారసునికే సీఎం పదవి: ఎమ్మెస్సార్దివంగత నేత వైఎస్.రాజశేఖర్ రెడ్డి వారసునికే ముఖ్యమంత్రి పీఠం అప్పగించాలని ఆర్టీసీ ఛైర్మన్, కాంగ్రెస్ సీనియర్ నేత ఎంఎస్.సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. ఆయన ముఖ్యమంత్రి తనయుడు వైఎస్.జగన్ కుటుంబ సభ్యులను సీఎం క్యాంపు కార్యాలయంలో పరామర్శించారు.Source: ఏపీ న్యూస్ | 8 Sep 2009 | 11:02 pm టెక్కలి ఉప ఎన్నిక: ముగిసిన ఎన్నికల ప్రచారంశ్రీకాకుళం జిల్లా టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారానికి మంగళవారం సాయంత్రంతో తెరపడింది. గురువారం పోలింగ్ జరుగనుంది. అయితే, ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌తో పాటు.. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం, ప్రజారాజ్యం, లోక్‌సత్తా పార్టీలకు...Source: ఏపీ న్యూస్ | 8 Sep 2009 | 10:57 pm ఐదేళ్లలో సంపూర్ణ మహిళా అక్షరాస్యత: ప్రధానివచ్చే ఐదేళ్లకాలంలో దేశంలోని మహిళలందరినీ అక్షరాస్యులుగా మారుస్తామని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చారు. ఐదేళ్లలో దేశంలో సంపూర్ణ మహిళా అక్షరాస్యత సాధిస్తామన్నారు. భారత ఆర్థికాభివృద్ధిని మహిళా నిరక్షరాస్యత, మౌలిక సదుపాయాల కొరత అడ్డుకుంటున్నాయని తెలిపారు.Source: జాతీయ | 8 Sep 2009 | 10:33 pm ఇష్రాత్ ఎన్‌కౌంటర్ బూటకం కాదు: గుజరాత్2004లో ఇష్రాత్ జహాన్ అనుమానాస్పద బూటకపు ఎన్‌కౌంటర్‌పై తమంగ్ నివేదిక వెల్లడించిన వివరాలతో ఏకీభవించేందుకు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించింది. ఈ అనుమానాస్పద బూటకపు ఎన్‌కౌంటర్‌లో ఇష్రాత్ జహాన్‌తోపాటు నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ఎన్‌కౌంటర్ బూటకం కాదని గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.Source: జాతీయ | 8 Sep 2009 | 9:55 pm పూరి దర్శకత్వంలో గోపిచంద్ హీరోగా "గోలీమార్"వైష్టో అకాడమీ పతాకంపై ఇడియట్, అమ్మానాన్న ఓ తమిళమ్మాయి వంచి సూపర్ హిట్ చిత్రాల్ని, "పోకిరి" వంటి ఇండస్ట్రీ హిట్ మూవీని అందించిన డాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ ఎగ్రెసివ్ హీరో గోపిచంద్ హీరోగా నిర్మిస్తున్న తాజా చిత్రానికి "గోలీమార్" అనే పేరును ఖరారు చేశారు.Source: Yahoo! Telugu: Entertainment | 8 Sep 2009 | 11:33 am ప్రకాష్ రాజ్‌తో "కాంజీవరం"లో నటించడం హ్యాపీగా ఉంది!తమిళచిత్రం "కాంజీవరం"లో నటించినందుకుగాను ప్రముఖ నటుడు ప్రకాష్‌రాజ్ జాతీయ ఉత్తమనటుడు అవార్డును ఎంపికయిన సంగతి అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో "కాంజీవరం" చిత్రంలో అద్భుతంగా నటించిన ప్రకాష్ రాజ్‌కు జాతీయ అవార్డు లభించడంపై సుప్రసిద్ధ నటి, నిర్మాత విక్రమ్‌కృష్ణకు శ్రీమతి అయిన శ్రీయారెడ్డి హర్షం వ్యక్తం చేశారు.Source: Yahoo! Telugu: Entertainment | 8 Sep 2009 | 11:24 am ప్రధానితో చర్చించి సీఎం అభ్యర్థి ఎంపిక: కేవీపీప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీతో చర్చించిన పిదపే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ వారసుడిని ఎంపిక చేస్తామని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ స్పష్టం చేశారని ప్రభుత్వ సలహాదారు కేవీపీ.రామచంద్రరావు వెల్లడించారు.Source: ఏపీ న్యూస్ | 8 Sep 2009 | 9:08 am తమిళనాడు రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టిన రాహుల్ద్రవిడ పార్టీలు తమ ఆధిపత్యాన్ని చాటుతున్న తమిళనాడులో కాంగ్రెస్‌కు పూర్వవైభవం కల్పించేందుకు ఆ పార్టీ యువరాజు రాహుల్ గాంధీ శ్రీకారం చుట్టారు. తమిళనాడులో మూడు రోజుల పర్యటనకు మంగళవారం నుంచి శ్రీకారం చుట్టారు.Source: జాతీయ | 8 Sep 2009 | 7:59 am నేను మగాడిని మోసం చేస్తా: ముగ్ధా గాడ్సేనిండైన పరువాలతో పిచ్చెక్కించే అందం తన సొంతం అని చెప్పే బాలీవుడ్ బాంబ్‌షెల్ ముగ్ధా గాడ్సే సంచలనమైన స్టేట్మెంట్లివ్వడంలో దిట్ట. ఇటీవల "ప్రేమ- ప్రియుడు" అనే అంశంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు మగాళ్లు గుండెలు గుభేలుమనే సమాధానమిచ్చిందట ముగ్ధా. వివరాల్లోకి వెళితే... గాడ్సేను ఓ బాలీవుడ్ సినీ విలేకరి, " ఎవరైనా మగాడు నిన్ను ప్రేమించి.. ఆ తర్వాత మోసం చేస్తే ఎలా ఫీలవుతావు" అని ప్రశ్నించాడట. దాంతో ముగ్ధా ఎంతమాత్రం తడుముకోకుండా, "మోసం చేయడం మగాడికే కాదు.. ఆడాళ్లకూ తెలుసు. కాకపోతే స్త్రీలు మోసం చేస్తే మగాడు మటాష్ అయిపోతాడు. నన్ను గనుక ఎవరైనా మోసం చేస్తే.. అతగాడినే తిరిగి నేను మోసం చేయగలను. ఎలా మోసం చేస్తారూ...? అని అడగకండి. నేను ఇచ్చిన షాక్‌తో ఆ మగాడు అతను ఉన్న చోటును వదిలి పిరికి పందలా పారిపోతాడు" అని చెప్పిందట. అయ్యబాబోయ్... దిమ్మతిరిగే సమాధానం. ఇంతగా చెప్పిన తర్వాత ఏ మగాడైనా ముగ్దాను మోసం చేయాలని సాహసిస్తాడా.. ఏంటి?Source: Yahoo! Telugu: Entertainment | 8 Sep 2009 | 7:52 am డీజీపీ మెడపై కత్తి: నివేదిక కోరిన రాష్ట్ర హోంశాఖరాష్ట్ర పోలీసు బాస్ ఎస్.ఎస్.పి.యాదవ్ మెడపై ప్రభుత్వం కత్తి వేలాడదీసింది. ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి హెలికాఫ్టర్ ప్రయాణానికి సంధించిన చేపట్టిన భద్రతా చర్యలపై 'మినిట్ టు మినిట్' నివేదిక ఇవ్వాలని రాష్ట్ర హోంశాఖ మంగళవారం ఆదేశించింది.Source: ఏపీ న్యూస్ | 8 Sep 2009 | 7:44 am బ్యాంకాక్ వెళ్లొచ్చిన తరుణ్, విమలారామన్ చిత్రం!తరుణ్, "ఎవరైనా ఎప్పుడైనా" ఫేమ్ విమలారామన్ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న తాజా చిత్రం షూటింగ్ తొలి షెడ్యూల్ బ్యాంకాక్‌లో పూర్తయ్యింది. ప్రణవ్ స్టూడియో సమర్పణలో సుప్రీం మూవీస్ పతాకంపై రాజు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి వి.ఎన్. ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 8 Sep 2009 | 6:50 am విజయదశమి కానుకగా "బంపర్ ఆఫర్"డాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ సోదరుడు సాయిరామ్ శంకర్ హీరోగా, "ఆవకాయ్ బిర్యానీ" ఫేమ్ బింధు మాధవి హీరోయిన్‌గా నటిస్తోన్న "బంపర్ ఆఫర్" చిత్రం షూటింగ్ పూర్తయ్యింది. వైష్ణో అకాడమీ పతాకంపై పూరిజగన్నాథ్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి జయరవీంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. యూత్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దే ఈ చిత్రానికి గాయకుడు రఘు కుంచె సంగీత దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ నిర్మాత శంకర్ గణేష్ మాట్లాడుతూ.. బ్యాంకాక్‌లో రెండు పాటలను చిత్రీకరించామన్నారు. దీంతో ఈ చిత్రం షూటింగ్ పూర్తయిందని.. విజయదశమి కానుకగా ఈ నెల 25న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని శంకర్ గణేష్ చెప్పారు.Source: Yahoo! Telugu: Entertainment | 8 Sep 2009 | 6:24 am కామెర్లతో బాధపడుతున్న రామలింగ రాజు!సత్యం కంప్యూటర్స్ మాజీ అధినేత రామలింగ రాజు కామెర్లతో బాధపడుతున్నట్టు నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) వైద్యులు వెల్లడించారు. రాజుకి వ్యాధి నిరోధక శక్తి బాగా తగ్గిపోవడం వల్ల హెచ్.సి.వి హెపటైటీస్ బాగా పెరిగి పోయిందని వారు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం సురక్షితంగానే ఉందని చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 8 Sep 2009 | 5:58 am ప్రకాష్ రాజ్‌తో "కాంజీవరం"లో నటించడం హ్యాపీగా ఉంది!తమిళచిత్రం "కాంజీవరం"లో నటించినందుకుగాను ప్రముఖ నటుడు ప్రకాష్‌రాజ్ జాతీయ ఉత్తమనటుడు అవార్డును ఎంపికయిన సంగతి అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో "కాంజీవరం" చిత్రంలో అద్భుతంగా నటించిన ప్రకాష్ రాజ్‌కు జాతీయ అవార్డు లభించడంపై సుప్రసిద్ధ నటి, నిర్మాత విక్రమ్‌కృష్ణకు శ్రీమతి అయిన శ్రీయారెడ్డి హర్షం వ్యక్తం చేశారు.Source: వినోదం | 8 Sep 2009 | 5:56 am ఇష్రాత్ జహాన్‌ది బూటకపు ఎన్‌కౌంటర్ కాదు: గుజరాత్ఐదు సంవత్సరాల క్రితం జరిగిన ఇష్రాత్ జహాన్‌ది బూటకపు ఎన్‌కౌంటర్ కాదని గుజరాత్‌లోని నరేంద్ర మోడీ సర్కారు మంగళవారం స్పష్టం చేసింది. గుజరాత్ హైకోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ ఇచ్చిన నివేదికను సవాల్ చేయనున్నట్టు గుజరాత్ ప్రభుత్వ అధికార ప్రతినిధి వెల్లడించారు.Source: జాతీయ | 8 Sep 2009 | 5:36 am అంతఃపురానికే అవార్డు వస్తోందనుకున్నా: ప్రకాష్ రాజ్తమిళచిత్రం "కంజీవరం"లో నటించిన ప్రకాష్‌రాజ్‌కు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు దక్కడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇదంతా సమిష్టి కృషిగా ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాలకే అవార్డు దక్కడంపై ప్రకాష్ రాజ్ స్పందిస్తూ.. గతంలో కృష్ణవంశీ "అంతఃపురం" సినిమా చేశారని, ఆ సినిమాకే జాతీయ అవార్డు వస్తుందనుకున్నానని చెప్పారు. అంతఃపురం తరహాలో సినిమాలు రూపొందించేందుకు మరికొంతమంది దర్శకులు ఆ దిశగా దృష్టిసారిస్తే తప్పనిసరిగా తెలుగు సినిమాలకు కూడా అవార్డులు వస్తాయని నమ్మకం వ్యక్తం చేశారు.Source: Yahoo! Telugu: Entertainment | 8 Sep 2009 | 5:36 am గాంధీ జయంతి నాడు వస్తోన్న "మహాత్మ"శ్రీకాంత్ వందో చిత్రమైన "మహాత్మ"ను అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా విడుదల చేయనున్నట్లు దర్శకుడు కృష్ణవంశీ తెలిపారు. సోమవారం రాత్రి ఫిలింఛాంబర్ క్లబ్‌లో మహాత్మ ట్రైలర్స్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.Source: Yahoo! Telugu: Entertainment | 8 Sep 2009 | 5:15 am పార్వతి "శంకరుడి" కోసం తపస్సు చేసిందిక్కడే...!ప్రకృతి రమణీయ దృశ్యాలు, భక్తి పారవశ్య ప్రదేశాలు, ఎటుచూసినా అభయారణ్యాలు... కొండలమీద నుంచి జాలువారే జలపాతాలు.. విజ్ఞానం, వినోదం.... ఇవన్నీ వింటుంటే ఏదో దేశంలోనే, రాష్ట్రంలోనో అని అనుకున్నట్లయితే మీరు పప్పులో కాలేసినట్లే..! ఎందుకంటే, ఇవన్నీ ఎక్కడో కాదు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నల్లమల ప్రాంతంలోనే ఉన్నాయి కాబట్టి...Source: వినోదం | 8 Sep 2009 | 5:07 am జగన్‌ను ముఖ్యమంత్రి చేయండి: జానారెడ్డిముఖ్యమంత్రి అభ్యర్థిగా వైఎస్ జగన్‌కు మద్దతు తెలుపుతున్న మంత్రులు, మాజీ మంత్రుల, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. వైఎస్ జగన్‌ను సీఎం చేయాలని సోమవారం మాజీ మంత్రి జేసీ.దివాకర్ రెడ్డి పార్టీ అధిష్టానానికి లేఖ రాశారు.Source: ఏపీ న్యూస్ | 8 Sep 2009 | 4:11 am ఐదు నక్షత్రాల హోటల్స్‌ను ఖాళీ చేయండి: ప్రణబ్ఐదు నక్షత్రాల హోటళ్లలో బస చేస్తున్న కేంద్ర మంత్రులు ఎస్.ఎం.కృష్ణ, శశి థరూర్‌లు తక్షణం ఆ హోటల్స్‌ను ఖాళీ చేయాలని కేంద్ర ఆర్థిక శాఖామంత్రి ప్రణబ్ ముఖర్జీ విజ్ఞప్తి చేశారు. ఖర్చు తగ్గింపు చర్యల్లో భాగంగా వీరిద్దరూ తమకు కేటాయించిన అధికారిక నివాసాలకు మారాలని ఆయన ఆదేశించారు.Source: జాతీయ | 8 Sep 2009 | 3:31 am
|