|
జగన్‌ను ముఖ్యమంత్రి చేయండి: జానారెడ్డిముఖ్యమంత్రి అభ్యర్థిగా వైఎస్ జగన్‌కు మద్దతు తెలుపుతున్న మంత్రులు, మాజీ మంత్రుల, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. వైఎస్ జగన్‌ను సీఎం చేయాలని సోమవారం మాజీ మంత్రి జేసీ.దివాకర్ రెడ్డి పార్టీ అధిష్టానానికి లేఖ రాశారు.Source: Yahoo! Telugu: News | 8 Sep 2009 | 9:40 am లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్స్టాక్ మార్కెట్ ప్రస్తుతం లాభాల్లో కొనసాగుతుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 79 పాయింట్లు పుంజుకుని 16,096 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 13 పాయింట్లు లాభపడి 4,796 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.50 శాతం, నిఫ్టీ 0.28 శాతం చొప్పున వృద్ధి చెందాయి.Source: Yahoo! Telugu: News | 8 Sep 2009 | 9:36 am పాకిస్థాన్‌లో విద్యార్థులపై తాలిబాన్ దాడులుపాకిస్థాన్లోని సమస్యాత్మక నార్త్‌వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావీన్స్‌లో తాలిబాన్ తీవ్రవాదులు హైస్కూలు విద్యార్థులపై దాడి చేశారు. పాఠశాలకు వెళుతున్న వీరిని లక్ష్యంగా చేసుకొని తాలిబాన్లు జరిపిన దాడిలో నలుగురు విద్యార్థులు మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారని ప్రభుత్వ అధికారులు తెలిపారు.Source: Yahoo! Telugu: News | 8 Sep 2009 | 9:24 am నోటిఫికేషన్: బీఎస్ఎన్ఎల్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీలుదేశంలో టెలికాం రంగ దిగ్గజ సంస్థ అయిన భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) మేనేజ్‌మెంట్ ట్రైనీల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 300 ఖాళీలను భర్తీ చేసేందుకు బీఎస్ఎన్ఎల్ సమాయత్తం అవుతోంది. వివరాలు టెలికాం ఆపరేటర్లు.. టెలీకమ్యూనికేషన్స్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా బీఈ ఎలక్ట్రికల్ లేదా బీటెక్ లేదా ఐటీ లేదా కంప్యూటర్స్‌తో పాటు రెండు సంవత్సరాల ఫుల్‌టైం ఎంబీఏ చేసి ఉండాలి. టెలికాం ఫైనాన్స్... సీఏ లేదా ఐసీడబ్ల్యూఏ లేదా సీఎస్ చేసి ఉండాలి.Source: Yahoo! Telugu: News | 8 Sep 2009 | 9:10 am 100 పాయంట్లు లాభంతో సెన్సెక్స్స్టాక్ మార్కెట్ ప్రస్తుతం లాభాల్లో పయనిస్తుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 100 పాయింట్లు పుంజుకుని 16,116 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 25 పాయింట్లు లాభపడి 4,808 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.62 శాతం, నిఫ్టీ 0.52 శాతం మేరకు వృద్ధి చెందాయి.Source: Yahoo! Telugu: News | 8 Sep 2009 | 9:03 am ఐదు నక్షత్రాల హోటల్స్‌ను ఖాళీ చేయండి: ప్రణబ్ఐదు నక్షత్రాల హోటళ్లలో బస చేస్తున్న కేంద్ర మంత్రులు ఎస్.ఎం.కృష్ణ, శశి థరూర్‌లు తక్షణం ఆ హోటల్స్‌ను ఖాళీ చేయాలని కేంద్ర ఆర్థిక శాఖామంత్రి ప్రణబ్ ముఖర్జీ విజ్ఞప్తి చేశారు. ఖర్చు తగ్గింపు చర్యల్లో భాగంగా వీరిద్దరూ తమకు కేటాయించిన అధికారిక నివాసాలకు మారాలని ఆయన ఆదేశించారు.Source: Yahoo! Telugu: News | 8 Sep 2009 | 9:00 am లాభాల్లో పయనిస్తున్న స్టాక్ మార్కెట్స్టాక్ మార్కెట్ ప్రస్తుతం లాభాల్లో పయనిస్తుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 195 పాయింట్లు పుంజుకుని 16,211 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 54 పాయింట్లు బలపడి 4,837 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 1.22 శాతం, నిఫ్టీ 1.13 శాతం మేరకు వృద్ధి చెందాయి.Source: Yahoo! Telugu: News | 8 Sep 2009 | 8:06 am 40 లక్షల వినియోగదారులను పొందిన సన్!గడచిన రెండు సంవత్సరాలలో తమ సంస్థ డీటీహెచ్ వినియోగదారులను దాదాపు 40 లక్షలకు పెంచుకుందని సన్ డైరెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధి టోనీ డీసిల్వా తెలిపారు.Source: Yahoo! Telugu: News | 8 Sep 2009 | 8:00 am నేను మగాడిని మోసం చేస్తా: ముగ్ధా గాడ్సేనిండైన పరువాలతో పిచ్చెక్కించే అందం తన సొంతం అని చెప్పే బాలీవుడ్ బాంబ్‌షెల్ ముగ్ధా గాడ్సే సంచలనమైన స్టేట్మెంట్లివ్వడంలో దిట్ట. ఇటీవల "ప్రేమ- ప్రియుడు" అనే అంశంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు మగాళ్లు గుండెలు గుభేలుమనే సమాధానమిచ్చిందట ముగ్ధా. వివరాల్లోకి వెళితే... గాడ్సేను ఓ బాలీవుడ్ సినీ విలేకరి, " ఎవరైనా మగాడు నిన్ను ప్రేమించి.. ఆ తర్వాత మోసం చేస్తే ఎలా ఫీలవుతావు" అని ప్రశ్నించాడట. దాంతో ముగ్ధా ఎంతమాత్రం తడుముకోకుండా, "మోసం చేయడం మగాడికే కాదు.. ఆడాళ్లకూ తెలుసు. కాకపోతే స్త్రీలు మోసం చేస్తే మగాడు మటాష్ అయిపోతాడు. నన్ను గనుక ఎవరైనా మోసం చేస్తే.. అతగాడినే తిరిగి నేను మోసం చేయగలను. ఎలా మోసం చేస్తారూ...? అని అడగకండి. నేను ఇచ్చిన షాక్‌తో ఆ మగాడు అతను ఉన్న చోటును వదిలి పిరికి పందలా పారిపోతాడు" అని చెప్పిందట. అయ్యబాబోయ్... దిమ్మతిరిగే సమాధానం. ఇంతగా చెప్పిన తర్వాత ఏ మగాడైనా ముగ్దాను మోసం చేయాలని సాహసిస్తాడా.. ఏంటి?Source: Yahoo! Telugu: Entertainment | 8 Sep 2009 | 7:52 am సౌర విద్యుత్ ఉత్పత్తిపై దృష్టిసారించాలి: మంత్రి ఫరూక్దేశంలో భవిష్యత్ విద్యుత్ అవసరాలను నివృత్తి చేయాలంటే సౌర విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి సారించాలని కేంద్ర నూతన పునరుత్పాదక విద్యుత్ శాఖామంత్రి ఫరూక్ అబ్దుల్లా పిలుపునిచ్చారు.Source: Yahoo! Telugu: News | 8 Sep 2009 | 7:50 am 14శాతం తగ్గిన దేశీయ టీ ఎగుమతులుప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం కారణంగా ఈ ఏడాది జనవరి నెల నుంచి జూన్ నెల వరకు జరిగిన ఎగుమతుల్లో 14 శాతం తగ్గుదల నమోదు చేసుకుంది.Source: Yahoo! Telugu: News | 8 Sep 2009 | 7:41 am బ్యాంకాక్ వెళ్లొచ్చిన తరుణ్, విమలారామన్ చిత్రం!తరుణ్, "ఎవరైనా ఎప్పుడైనా" ఫేమ్ విమలారామన్ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న తాజా చిత్రం షూటింగ్ తొలి షెడ్యూల్ బ్యాంకాక్‌లో పూర్తయ్యింది. ప్రణవ్ స్టూడియో సమర్పణలో సుప్రీం మూవీస్ పతాకంపై రాజు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి వి.ఎన్. ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 8 Sep 2009 | 6:50 am విజయదశమి కానుకగా "బంపర్ ఆఫర్"డాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ సోదరుడు సాయిరామ్ శంకర్ హీరోగా, "ఆవకాయ్ బిర్యానీ" ఫేమ్ బింధు మాధవి హీరోయిన్‌గా నటిస్తోన్న "బంపర్ ఆఫర్" చిత్రం షూటింగ్ పూర్తయ్యింది. వైష్ణో అకాడమీ పతాకంపై పూరిజగన్నాథ్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి జయరవీంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. యూత్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దే ఈ చిత్రానికి గాయకుడు రఘు కుంచె సంగీత దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ నిర్మాత శంకర్ గణేష్ మాట్లాడుతూ.. బ్యాంకాక్‌లో రెండు పాటలను చిత్రీకరించామన్నారు. దీంతో ఈ చిత్రం షూటింగ్ పూర్తయిందని.. విజయదశమి కానుకగా ఈ నెల 25న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని శంకర్ గణేష్ చెప్పారు.Source: Yahoo! Telugu: Entertainment | 8 Sep 2009 | 6:24 am అంతఃపురానికే అవార్డు వస్తోందనుకున్నా: ప్రకాష్ రాజ్తమిళచిత్రం "కంజీవరం"లో నటించిన ప్రకాష్‌రాజ్‌కు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు దక్కడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇదంతా సమిష్టి కృషిగా ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాలకే అవార్డు దక్కడంపై ప్రకాష్ రాజ్ స్పందిస్తూ.. గతంలో కృష్ణవంశీ "అంతఃపురం" సినిమా చేశారని, ఆ సినిమాకే జాతీయ అవార్డు వస్తుందనుకున్నానని చెప్పారు. అంతఃపురం తరహాలో సినిమాలు రూపొందించేందుకు మరికొంతమంది దర్శకులు ఆ దిశగా దృష్టిసారిస్తే తప్పనిసరిగా తెలుగు సినిమాలకు కూడా అవార్డులు వస్తాయని నమ్మకం వ్యక్తం చేశారు.Source: Yahoo! Telugu: Entertainment | 8 Sep 2009 | 5:36 am గాంధీ జయంతి నాడు వస్తోన్న "మహాత్మ"శ్రీకాంత్ వందో చిత్రమైన "మహాత్మ"ను అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా విడుదల చేయనున్నట్లు దర్శకుడు కృష్ణవంశీ తెలిపారు. సోమవారం రాత్రి ఫిలింఛాంబర్ క్లబ్‌లో మహాత్మ ట్రైలర్స్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.Source: Yahoo! Telugu: Entertainment | 8 Sep 2009 | 5:15 am జగన్‌ను ముఖ్యమంత్రి చేయండి: జానారెడ్డిముఖ్యమంత్రి అభ్యర్థిగా వైఎస్ జగన్‌కు మద్దతు తెలుపుతున్న మంత్రులు, మాజీ మంత్రుల, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. వైఎస్ జగన్‌ను సీఎం చేయాలని సోమవారం మాజీ మంత్రి జేసీ.దివాకర్ రెడ్డి పార్టీ అధిష్టానానికి లేఖ రాశారు.Source: ఏపీ న్యూస్ | 8 Sep 2009 | 4:11 am ఐదు నక్షత్రాల హోటల్స్‌ను ఖాళీ చేయండి: ప్రణబ్ఐదు నక్షత్రాల హోటళ్లలో బస చేస్తున్న కేంద్ర మంత్రులు ఎస్.ఎం.కృష్ణ, శశి థరూర్‌లు తక్షణం ఆ హోటల్స్‌ను ఖాళీ చేయాలని కేంద్ర ఆర్థిక శాఖామంత్రి ప్రణబ్ ముఖర్జీ విజ్ఞప్తి చేశారు. ఖర్చు తగ్గింపు చర్యల్లో భాగంగా వీరిద్దరూ తమకు కేటాయించిన అధికారిక నివాసాలకు మారాలని ఆయన ఆదేశించారు.Source: జాతీయ | 8 Sep 2009 | 3:31 am సౌర విద్యుత్ ఉత్పత్తిపై దృష్టిసారించాలి: మంత్రి ఫరూక్దేశంలో భవిష్యత్ విద్యుత్ అవసరాలను నివృత్తి చేయాలంటే సౌర విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి సారించాలని కేంద్ర నూతన పునరుత్పాదక విద్యుత్ శాఖామంత్రి ఫరూక్ అబ్దుల్లా పిలుపునిచ్చారు.Source: జాతీయ | 8 Sep 2009 | 2:20 am టెక్కలిలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండి: వైఎస్.జగన్టెక్కలి అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి భారతమ్మను అఖండ మెజారిటీతో గెలిపించాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి తనయుడు వైఎస్.జగన్ మోహన్ రెడ్డిని విజ్ఞప్తి చేశారు.Source: ఏపీ న్యూస్ | 8 Sep 2009 | 1:37 am రామలింగ రాజుకు గుండెపోటు: నిలకడగా ఆరోగ్యంగుండెపోటుకు గురైన సత్యం కంప్యూటర్స్ సర్వీసెస్ లిమిటెడ్ మాజీ ఛైర్మన్ రామలింగ రాజు ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. ఆయనను పరిశీలించిన వైద్యులు ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉంచారు. రాజుకు మరిన్ని వైద్య పరీక్షలు చేయాల్సి ఉందని వైద్యులు వెల్లడించారు.Source: ఏపీ న్యూస్ | 8 Sep 2009 | 1:18 am భారత అధికారులతో సంప్రదింపులు: యూఏఈభారత ఎయిర్‌పోర్టు అధికారుల అదుపులో ఉన్న విమాన వ్యవహారానికి సంబంధించి న్యూఢిల్లీ యంత్రాంగంతో సంప్రదింపులు జరుపుతున్నట్టు యూఏఈ ప్రభుత్వం ప్రకటించింది. యూఏఈ నంచి చైనాకు వెళుతున్న విమానం ఒకటి కోల్‌కతా ఎయిర్‌పోర్టులో దిగిన విషయం తెల్సిందే.Source: జాతీయ | 8 Sep 2009 | 1:03 am నరక యాతన అనుభవించిన 'ఆ ఐదుగురు'ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి హెలికాఫ్టర్ ప్రమాదానికి లోనుకాక ముందు అందులో ఉన్న 'ఆ ఐదుగురు' వ్యక్తులు పది నిమిషాల పాటు నరకయాతన అనుభవించినట్టు సమాచారం.Source: ఏపీ న్యూస్ | 8 Sep 2009 | 12:33 am గుజరాత్‌లో 12కు చేరిన స్వైన్ ఫ్లూ మృతులుగుజరాత్ రాష్ట్రంలో మరో స్వైన్ ఫ్లూ మరణం నమోదైంది. సూరత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 23 సంవత్సరాల మహిళ మంగళవారం కన్నుమూసింది. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం స్వైన్ ఫ్లూ మృతుల సంఖ్య 12కు చేరుకుంది.Source: జాతీయ | 8 Sep 2009 | 12:02 am టెక్కలి ఉప ఎన్నిక: ప్రచారానికి చిరు దూరంఈనెలలో జరుగనున్న టెక్కలి అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారానికి ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. తొలుత ఈ ఉప ఎన్నికలు ప్రరాపా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.Source: ఏపీ న్యూస్ | 7 Sep 2009 | 11:39 pm వైఎస్ జగన్‌నే ముఖ్యమంత్రి చేయాలి: డీఎస్ పుత్రుడుముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి వారసునిగా ఆయన తనయుడు వైఎస్.జగన్‌మోహన్ రెడ్డిని ఎంపిక చేయాలని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ తనయుడు డి.సంజయ్ అభిప్రాయపడ్డారు. దీంతో వైఎస్ జగన్‌కు వస్తున్న మద్దతుదారుల సంఖ్య నానాటికీ ఎక్కువ అవుతోంది.Source: ఏపీ న్యూస్ | 7 Sep 2009 | 11:26 pm పీఏసీ సమావేశం బాగానే జరిగింది: జశ్వంత్తొలి ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) సమావేశం బాగానే జరిగిందని ఆ కమిటీ ఛైర్మన్ జశ్వంత్ సింగ్ విలేకరులతో చెప్పారు. సోమవారం జరిగిన ఈ సమావేశానికి బీజేపీ, దాని భాగస్వామ్య పక్షాల ప్రతినిధులు హాజరుకారాదని నిర్ణయించుకున్నారు. బీజేపీ, దాని భాగస్వామ్య పక్షాలు బహిష్కరించినప్పటికీ, ఈ సమావేశం బాగానే జరిగిందని, రాబోయే సమావేశాలకు వారు హాజరవతారని జశ్వంత్ పేర్కొన్నారు.Source: జాతీయ | 7 Sep 2009 | 10:17 pm లెహ్‌లో పర్యటించనున్న భారత ఆర్మీ చీఫ్జమ్ము- కాశ్మీర్ రాష్ట్రంలోని లెహ్, లడక్ ప్రాంతాల్లో ఇటీవల చైనా మిలిటరీ సరిహద్దు ఉల్లంఘనలకు పాల్పడినట్లు వచ్చిన వార్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని విదేశాంగ మంత్రి ఎస్ఎం కృష్ణ సోమవారం స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే చైనా మిలిటరీ ఉల్లంఘనలపై తాజా కేంద్ర భద్రతా కమిటీ (సీసీఎస్) సమావేశంలో చర్చించారు.Source: జాతీయ | 7 Sep 2009 | 9:23 pm హాలీవుడ్ రామాయణంలో సీతాదేవిగా "శిల్పాశెట్టి"సుప్రసిద్ధ భారతీయ ఇతిహాస గాథ రామాయణం హాలీవుడ్‌లో రూపుదిద్దుకోనుంది. "ది మాస్క్" ఫేమ్ చక్‌రస్సెల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారని బీబీసీ ఓ కథనంలో వెల్లడించింది. ప్రవాస భారతీయుడు ఉరూపటేల్ నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్‌ఖాన్ హనుమంతుడి పాత్రలో కన్పించనున్నారు. మరో విశేషమేమిటంటే..? బాలీవుడ్ అందాల తార శిల్పాశెట్టి సీతాదేవి పాత్రను పోషిస్తున్నారని బీబీసీ తన కథనంలో వెల్లడించింది. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది చివరికల్లా రాజస్థాన్‌లో ప్రారంభం కానుందని చిత్ర యూనిట్ సమాచారం.Source: Yahoo! Telugu: Entertainment | 7 Sep 2009 | 1:38 pm విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్‌కు జాతీయ ఉత్తమ నటుడి అవార్డుటాలీవుడ్, కోలీవుడ్ సినీ రంగాల్లో విలక్షణ నటుడిగా ముద్రవేసుకుని ప్రేక్షకులకు దగ్గరైన ప్రకాష్ రాజ్ జాతీయ ఉత్తమ నటుడు అవార్డును గెలుచుకున్నారు. దీంతో జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడు ఎవరన్న విషయంపై ఇన్నాళ్లు నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. 2007 సంవత్సరానికి గానూ ఫిల్మ్‌ఫేర్ జాతీయ అవార్డులను సోమవారం ప్రకటించారు. ఇందులో జాతీయ ఉత్తమ నటుడి అవార్డు రేసులో నిలిచిన బాలీవుడ్ అగ్రహీరోలైన షారూఖ్ ఖాన్, అమీర్‌ఖాన్‌లను ప్రకాష్ రాజ్ వెనక్కి నెట్టారు.Source: Yahoo! Telugu: Entertainment | 7 Sep 2009 | 10:33 am జగన్‌కు పట్టం కట్టే విషయం పార్టీ చూసుకుంటుంది: వెంకీతెలుగు, తమిళభాషల్లో రూపొందిన ఈనాడు చిత్రంలో నటించడం గొప్ప థ్రిల్ కల్గించిందని వెంకటేష్ చెబుతున్నారు. ఇంకా వర్తమాన, భవిష్యత్ విషయాలను కొన్ని మనముందుంచారు. అందులో కొన్ని మీ కోసం.. ప్రశ్న: ఈ పాత్ర చేయడానికి కారణం? జ.. హాలీవుడ్ చిత్రాల్లో మల్టీస్టారర్ ఉంటారు. అవన్నీ చాలా బాగుంటాయని చూసి ఎంజాయ్ చేస్తాం. ఆ తరహాలో సాగే చిత్రం కనుక నటించడానికి ఒప్పుకున్నారు. తెలుగు, తమిళభాషల్లో పోలీస్ ఆఫీసర్‌గా నేనే నటించాను. "వెడ్నెస్‌డే"లో అనుపమ్‌ఖేర్ చేసిన పాత్ర నాది. ప్రశ్న: మీ వారసుడు అర్జున్ ఎప్పుడు తెరపైకి వస్తున్నాడు?జ.. ఇంకా వాడికి చాలా సమయం ఉంది.ప్రశ్న: మీ ఇద్దరు కలిసి నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి?జ. ఏవేవో వార్తలు బయటకు వస్తున్నాయి. అందులో పెద్దగా నిజంలేదు. కథ కుదరాలి కదా..ప్రశ్న: రాష్ట్ర పరిస్థితులు, జగన్ సీఎం పదవిపై మీ అభిప్రాయం?జ: వై.ఎస్. రాజశేఖర రెడ్డి దుర్మరణం.. ఊహించనిది. జగన్‌కు సీఎం పట్టం కట్టాలనే విషయాన్ని చెప్పేందుకు నేనెవర్ని. నాకు రాజకీయాలంటే భయం. అదంతా పార్టీ వ్యవహారం. ఆ పని వారు చూసుకుంటారు. మనపనేంటి..? నటించడం. అది నేను చూసుకుంటాను.Source: Yahoo! Telugu: Entertainment | 7 Sep 2009 | 9:56 am బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ భానుమతీ రామకృష్ణకేవలం పురుషులకే సాధ్యం అయిన సినీ సాంకేతిక నైపుణ్యంలోనూ ప్రావీణ్యం సంపాదించి నటిగా, గాయనిగా, దర్శకురాలిగా, నిర్మాతగా, రచయితగా, సంగీత దర్శకురాలిగా విభిన్న కోణాలను స్పృశిస్తూ సాటిలేని మేటి తెలుగు కళాకారిణిగా ఎదిగారు భానుమతి. ఆరణాల తెలుగింటి అత్తగారి కథల "భానుమతి"గా ఆమె పేరు తెలుగు సినీవినీలాకాశాన దాదాపు అర్ధశతాబ్దం పాటు మారుమోగిందంటే అతిశయోక్తికాదేమో. నేడు భానుమతిగారి జయంతి సందర్భంగా ఆ మహానటి గురించి...Source: Yahoo! Telugu: Entertainment | 7 Sep 2009 | 9:39 am మాధ్యమిక విద్యా మిషన్ పేరు మార్పు: మంత్రిరాష్ట్రీయ మాధ్యమిక విద్యా మిషన్ పేరును వైఎస్ఆర్ మాధ్యమిక విద్యా మిషన్‌గా మార్పు చేసినట్లు మాధ్యమిక విద్యా శాఖ మంత్రి మాణిక్య వరప్రసాద్ సోమవారం ప్రకటించారు.Source: ఏపీ న్యూస్ | 7 Sep 2009 | 9:15 am వైఎస్ హెలికాఫ్టర్ ప్రమాదంపై సీబీఐ దర్యాప్తుస్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ప్రమాదానికి గురైన వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రోశయ్య, రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, డీజీపీ ఎస్ఎస్‌పి.యాదవ్‌లు సోమవారం ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు.Source: ఏపీ న్యూస్ | 7 Sep 2009 | 8:54 am "మంచివాడు" రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంఆణిముత్యాల్లాంటి పలు ఉత్తమ కథాచిత్రాల్ని అందించిన మెగాసూపర్ గుడ్ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తమ పతాకంపై సునీల్ కథానాయకుడుగా "అందాలరాముడు" వంటి హిట్ చిత్రాన్ని అందించిన యువ దర్శకుడు లక్ష్మీనారాయణ (దీప్తి)కి మరో అవకాశాన్ని ఇస్తూ యువ కథానాయకుడు తనీష్ హీరోగా అందరూ మెచ్చే కథతో "మంచివాడు" అనే చిత్రాన్ని అందిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు 31 నుంచి చిలుకూరు సమీపంలోని ఓ గృహంలో ప్రారంభమైంది.Source: Yahoo! Telugu: Entertainment | 7 Sep 2009 | 8:38 am మహావిష్ణువు "బద్రీనాథ్"ను ఎప్పటికీ వదలరట..!!గర్హ్వాల్ కొండలలో, అలకనందానదీ తీరంలో, నర నారాయణ కొండల వరుసల మధ్య ఉండే నీలకంఠ శిఖరానికి దిగువ భాగంలో, రుషికేశ్‌కు ఉత్తరాన, కేదారనాథ్‌కు సమీపంలోని గౌరీకుండ్‌కు 233 కిలోమీటర్ల దూరంలో నెలవైన ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రం "బద్రీనాథ్". భారతావనిలోని ఉత్తరాఖండ్, చమోలి జిల్లాలో ఉన్న ప్రదేశం... హిందూ పురాణాలలో బద్రీ లేకా బద్రికాశ్రమంగా వర్ణించబడిన బద్రీనాథ్... నర-నారాయణులు ఆశ్రమ జీవితం గడిపిన పుణ్యస్థలమే..!Source: వినోదం | 7 Sep 2009 | 7:22 am ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికకు త్రిసభ్య కమిటీ: కాంగ్రెస్హెలికాఫ్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలైన ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి వారసుడిని ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఒక త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిటీలో.. సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, వీరప్ప మొయిలీలు సభ్యులుగా ఉంటారు.Source: జాతీయ | 7 Sep 2009 | 6:47 am 10వ తేదీ తర్వాత సీఎల్పీ భేటీ: అహ్మద్ పటేల్దుర్మరణంపాలైన ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి వారసుడిని ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పీ) సమావేశం ఈనెల 10వ తేదీ తర్వాత జరుగవచ్చని ఆ పార్టీ అధినేత్రి సోనియా కగాంధీ సలహాదారు అహ్మద్ పటేల్ సూచన ప్రాయంగా వెల్లడించారు.Source: ఏపీ న్యూస్ | 7 Sep 2009 | 6:33 am మొన్న మటన్ బిరియాని.. నేడు.. బాస్మతి రైస్: కసబ్దేశ వాణిజ్య రాజధాని ముంబైపై దాడికి తెగబడి సజీవంగా పట్టుబడిన తీవ్రవాది అజ్మల్ కసబ్‌కకు బాస్మతి బియ్యంతో వండిన భోజనం కావాలని కోరుతున్నాడు. ఇటీవల మటన్ బిర్యానీ కావాలని కోరిన కసబ్.. తాజాగా బాస్మతి బియ్యంతో చేసిన భోజనం కావాలని కోరడం గమనార్హం.Source: జాతీయ | 7 Sep 2009 | 6:24 am తెలుగుదేశం పార్టీకి సినీ నటి రోజా గుడ్బైతెలుగుదేశం పార్టీకి ఆ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు సినీ నటి రోజా గుడ్‌బై చెప్పారు. ఈ మేరకు ఆ పార్టీ ప్రధాన కార్యాలయమైన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు సోమవారం తన రాజీనామా లేఖను పంపారు. ఈ లేఖలో తెదేపా అధిష్టానంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.Source: ఏపీ న్యూస్ | 7 Sep 2009 | 5:15 am లోయలో పడిన బస్సు: 18 మంది దుర్మరణంజమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. జమ్మూకు 145 కిలోమీటర్ల దూరంలోని అస్సార్ వద్ద జమ్మూ-దోడా-బటోటే జాతీయ రహదారిలో వెళుతున్న బస్సు లోతైన లోయలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 18 మంది మృత్యువాత పడగా, మరో 23 మంది గాయపడ్డారు.Source: జాతీయ | 7 Sep 2009 | 5:07 am విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్‌కు జాతీయ ఉత్తమ నటుడి అవార్డుటాలీవుడ్, కోలీవుడ్ సినీ రంగాల్లో విలక్షణ నటుడిగా ముద్రవేసుకుని ప్రేక్షకులకు దగ్గరైన ప్రకాష్ రాజ్ జాతీయ ఉత్తమ నటుడు అవార్డును గెలుచుకున్నారు. దీంతో జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడు ఎవరన్న విషయంపై ఇన్నాళ్లు నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. 2007 సంవత్సరానికి గానూ ఫిల్మ్‌ఫేర్ జాతీయ అవార్డులను సోమవారం ప్రకటించారు.Source: వినోదం | 7 Sep 2009 | 5:05 am "మంచివాడు" రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంఆణిముత్యాల్లాంటి పలు ఉత్తమ కథాచిత్రాల్ని అందించిన మెగాసూపర్ గుడ్ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తమ పతాకంపై సునీల్ కథానాయకుడుగా "అందాలరాముడు" వంటి హిట్ చిత్రాన్ని అందించిన యువ దర్శకుడు లక్ష్మీనారాయణ (దీప్తి)కి మరో అవకాశాన్ని ఇస్తూ యువ కథానాయకుడు తనీష్ హీరోగా అందరూ మెచ్చే కథతో "మంచివాడు" అనే చిత్రాన్ని అందిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు 31 నుంచి చిలుకూరు సమీపంలోని ఓ గృహంలో ప్రారంభమైంది.Source: వినోదం | 7 Sep 2009 | 4:27 am ఈవీఎంలపై సందేహాలు ఈసీ నివృత్తి చేయాలి: సీపీఐఓటింగ్ యంత్రాల (ఎలక్ట్రానికి ఓటింగ్ మెషన్స్)పై ఉన్న సందేహాలకు కేంద్ర ఎన్నికల సంఘం నివృత్తి చేయాలని సీపీఎం జాతీయ నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇందుకోసం అఖిలపక్ష సమావేశాన్ని ఈసీ ఏర్పాటు చేయాలని కోరారు.Source: జాతీయ | 7 Sep 2009 | 4:20 am
|