|
ధగ ధగ బంగారం.. ధరలు భగ భగ!అంతర్జాతీయం బులియన్ మార్కెట్లో బంగారానికి డిమాండ్ పెరగడంతో దేశంలో బంగారం ధరలు రానున్న రోజుల్లో మరింత పెరిగి ప్రతి పది గ్రాముల బంగారం ధర రూ. 17 వేలకు పెరిగే సూచనలున్నట్లు దేశీయ బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి.Source: Yahoo! Telugu: News | 7 Sep 2009 | 9:56 am జగన్‌కు పట్టం కట్టే విషయం పార్టీ చూసుకుంటుంది: వెంకీతెలుగు, తమిళభాషల్లో రూపొందిన ఈనాడు చిత్రంలో నటించడం గొప్ప థ్రిల్ కల్గించిందని వెంకటేష్ చెబుతున్నారు. ఇంకా వర్తమాన, భవిష్యత్ విషయాలను కొన్ని మనముందుంచారు. అందులో కొన్ని మీ కోసం.. ప్రశ్న: ఈ పాత్ర చేయడానికి కారణం? జ.. హాలీవుడ్ చిత్రాల్లో మల్టీస్టారర్ ఉంటారు. అవన్నీ చాలా బాగుంటాయని చూసి ఎంజాయ్ చేస్తాం. ఆ తరహాలో సాగే చిత్రం కనుక నటించడానికి ఒప్పుకున్నారు. తెలుగు, తమిళభాషల్లో పోలీస్ ఆఫీసర్‌గా నేనే నటించాను. "వెడ్నెస్‌డే"లో అనుపమ్‌ఖేర్ చేసిన పాత్ర నాది. ప్రశ్న: మీ వారసుడు అర్జున్ ఎప్పుడు తెరపైకి వస్తున్నాడు?జ.. ఇంకా వాడికి చాలా సమయం ఉంది.ప్రశ్న: మీ ఇద్దరు కలిసి నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి?జ. ఏవేవో వార్తలు బయటకు వస్తున్నాయి. అందులో పెద్దగా నిజంలేదు. కథ కుదరాలి కదా..ప్రశ్న: రాష్ట్ర పరిస్థితులు, జగన్ సీఎం పదవిపై మీ అభిప్రాయం?జ: వై.ఎస్. రాజశేఖర రెడ్డి దుర్మరణం.. ఊహించనిది. జగన్‌కు సీఎం పట్టం కట్టాలనే విషయాన్ని చెప్పేందుకు నేనెవర్ని. నాకు రాజకీయాలంటే భయం. అదంతా పార్టీ వ్యవహారం. ఆ పని వారు చూసుకుంటారు. మనపనేంటి..? నటించడం. అది నేను చూసుకుంటాను.Source: Yahoo! Telugu: Entertainment | 7 Sep 2009 | 9:56 am ఈవీఎంలపై సందేహాలు ఈసీ నివృత్తి చేయాలి: సీపీఐఓటింగ్ యంత్రాల (ఎలక్ట్రానికి ఓటింగ్ మెషన్స్)పై ఉన్న సందేహాలకు కేంద్ర ఎన్నికల సంఘం నివృత్తి చేయాలని సీపీఎం జాతీయ నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇందుకోసం అఖిలపక్ష సమావేశాన్ని ఈసీ ఏర్పాటు చేయాలని కోరారు.Source: Yahoo! Telugu: News | 7 Sep 2009 | 9:50 am సీఆర్‌పీఎఫ్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్సెంట్రల్ రిజర్వ్ పోలీస్ (సీఆర్‌పీఎఫ్)లో టెక్నికల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. టెక్నికల్ అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ కోసం ధరఖాస్తులు స్వీకరించనున్నారు. మొత్తం 125 ఖాళీలున్నాయి. వివరాలు ఇంగ్లీష్, ఫిజిక్స్, లెక్కలు సబ్జెకులతో మెట్రిక్యులేషన్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీంతో పాటు ఎలక్ట్రానిక్స్ లేదా రేడియో లేదా కంప్యూటర్ డిప్లొమా కలిగి ఉండాలి.. లేదా ఫిజిక్స్, లెక్కలు, రసాయన శాస్త్రం సబ్జెక్టులతో కూడిన బీఎస్సీ...Source: Yahoo! Telugu: News | 7 Sep 2009 | 9:40 am బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ భానుమతీ రామకృష్ణకేవలం పురుషులకే సాధ్యం అయిన సినీ సాంకేతిక నైపుణ్యంలోనూ ప్రావీణ్యం సంపాదించి నటిగా, గాయనిగా, దర్శకురాలిగా, నిర్మాతగా, రచయితగా, సంగీత దర్శకురాలిగా విభిన్న కోణాలను స్మృజిస్తూ సాటిలేని మేటి తెలుగు కళాకారిణిగా ఎదిగారు భానుమతి. ఆరణాల తెలుగింటి అత్తగారి కథల "భానుమతి"గా ఆమె పేరు తెలుగు సినీవినీలాకాశాన దాదాపు అర్ధశతాబ్దం పాటు మారుమోగిందంటే అతిశయోక్తికాదేమో. నేడు భానుమతిగారి జయంతి సందర్భంగా ఆ మహానటి గురించి...Source: Yahoo! Telugu: Entertainment | 7 Sep 2009 | 9:39 am వైఎస్ హెలికాఫ్టర్ ప్రమాదంపై సీబీఐ దర్యాప్తుస్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ప్రమాదానికి గురైన వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రోశయ్య, రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, డీజీపీ ఎస్ఎస్‌పి.యాదవ్‌లు సోమవారం ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు.Source: Yahoo! Telugu: News | 7 Sep 2009 | 9:36 am ఫిలిప్పీన్స్ నౌక మునక: తొమ్మిది మంది మృతిదక్షిణ ఫిలిప్పీన్స్ సముద్రంలో గత అర్ధరాత్రి వెయ్యి ప్రయాణికులతో వస్తున్న నౌక హఠాత్తుగా సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది దుర్మరణం చెందారు. మరో 926 మందిని ఫిలిప్పీన్స్ అధికార యంత్రాంగం సురక్షితంగా కాపాడింది. 30 మందికిపైగా ప్రయాణికుల ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.Source: Yahoo! Telugu: News | 7 Sep 2009 | 9:14 am లాభాలతో పుంజుకుంటున్న సెన్సెక్స్స్టాక్ మార్కెట్ లాభాలతో పుంజుకుంటుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 273 పాయింట్లు వృద్ధి చెంది 15,976 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 91 పాయింట్లు లాభపడి 4,770 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 1.74 శాతం, నిఫ్టీ 1.90 శాతం మేరకు వృద్ధి చెందాయి.Source: Yahoo! Telugu: News | 7 Sep 2009 | 9:13 am "మంచివాడు" రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంఆణిముత్యాల్లాంటి పలు ఉత్తమ కథాచిత్రాల్ని అందించిన మెగాసూపర్ గుడ్ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తమ పతాకంపై సునీల్ కథానాయకుడుగా "అందాలరాముడు" వంటి హిట్ చిత్రాన్ని అందించిన యువ దర్శకుడు లక్ష్మీనారాయణ (దీప్తి)కి మరో అవకాశాన్ని ఇస్తూ యువ కథానాయకుడు తనీష్ హీరోగా అందరూ మెచ్చే కథతో "మంచివాడు" అనే చిత్రాన్ని అందిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు 31 నుంచి చిలుకూరు సమీపంలోని ఓ గృహంలో ప్రారంభమైంది.Source: Yahoo! Telugu: Entertainment | 7 Sep 2009 | 8:38 am గ్యాస్ పైప్‌లైన్ ఒప్పందంపై వైదొలగిన భారత్పాక్, ఇరాన్ దేశాలతో గతంలో కుదుర్చుకున్న గ్యాస్ పైప్‌లైన్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఒప్పందం నుంచి భారతదేశం వైదొలగినట్లు పాకిస్థాన్ రాయబారి ముహమ్మద్ బక్స్ అబ్బాసీ ఇరాన్‌లో తెలిపినట్లు టెహ్రాన్‌కు చెందిన మెహర్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.Source: Yahoo! Telugu: News | 7 Sep 2009 | 8:33 am 202 పాయింట్ల లాభంతో స్టాక్ మార్కెట్స్టాక్ మార్కెట్ ప్రస్తుతం 202 పాయింట్ల లాభంతో పయనిస్తుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 15,891 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 65 పాయింట్లు బలపడి 4,745 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 1.28 శాతం, నిఫ్టీ 1.38 శాతం మేరకు వృద్ధి చెందాయి.Source: Yahoo! Telugu: News | 7 Sep 2009 | 8:11 am జియా మరణంలో మా ప్రమేయం లేదు: యూఎస్పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు జియా ఉల్ హక్, పలువురు ఉన్నతాధికారులను బలితీసుకున్న విమాన ప్రమాదంలో, తదనంతర దర్యాప్తులో తమ ప్రమేయం ఏ రకంగానూ లేదని అమెరికా ప్రభుత్వం స్పష్టం చేసింది. జియా విమాన ప్రమాదంలో అమెరికా ప్రమేయం ఉన్నట్లు వస్తున్న ఆరోపణనలను ఇస్లామాబాద్‌లోని అమెరికా దౌత్యకార్యాలయ అధికారి రిచర్డ్ స్నెల్‌సిర్ ఖండించారు.Source: Yahoo! Telugu: News | 7 Sep 2009 | 7:53 am రాష్ట్రంలో జగన్ నేతృత్వంలో 'వైఎస్ కాంగ్రెస్' పార్టీ!రాష్ట్రంలో మరో రాజకీయ పార్టీ ఆవిర్భవించనుందా? ప్రస్తుతం రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు దీనికి మరింత ఊతమిస్తున్నాయి. 'కాంగ్రెస్ అంటే వైఎస్'.. 'వైఎస్ అంటే కాంగ్రెస్' అనేలా రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకున్న మహానేత వైఎస్.రాజశేఖర్ రెడ్డి.Source: Yahoo! Telugu: News | 7 Sep 2009 | 7:48 am వాటి రసం మీరూ తాగండి.. యవ్వనంగా ఉంటారు...టాలీవుడ్ క్యూట్ గాళ్‌గా పేరుతెచ్చుకున్న ఇలియానా, తను సినిమాల్లో అంత సెక్సీగానూ.. యవ్వనంతో మిసమిసలాడుతూ కనబడటానికి కారణాలు ఎన్నో ఉన్నాయంటోది. నిత్యం యోగా చేయడంతోపాటు తీసుకునే ఆహార పదార్థాలలో శ్రద్ధ కనబరుస్తానని చెపుతోంది. పాలకూర, కొత్తిమీర, పుదీనా ఆకులనుంచి తీసిన రసాన్ని ఇలియానా తాగుతుంటుందట. ఈ రసాలే తన యవ్వన రహస్యమని ఇలియానా చెపుతోందట. అంతేకాదు... జొన్న, సజ్జ, మొలక ధాన్యాలను తీసుకుంటుందట. ఎక్కువగా తనే కూరగాయల మార్కెట్ కెళ్లి... సొర, కాకర, పొట్ల, వంకాయ, క్యారెట్, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, ఉల్లి, చిలకడ దుంప వంటివన్నిటినీ కొనుగోలు చేస్తుందట. షూటింగ్‌లకు వెళ్లినప్పుడు తనతోపాటు క్యారెట్లను తెచ్చుకుంటుందట. షూటింగ్ గ్యాప్‌లో క్యారెట్‌లను కరకరలాడిస్తుందట.Source: Yahoo! Telugu: Entertainment | 7 Sep 2009 | 6:59 am జ్వరమొచ్చి మూలుగుతుంటే.. రమ్మంటే ఎలా..?: నమితబొద్దందాల నమిత టాలీవుడ్, కోలీవుడ్ సినీ పరిశ్రమలను తన బొద్దందాలతో ఉర్రూతలూగించే నమితకు కోలీవుడ్ నడిగర్ సంఘం మొట్టికాయలు వేసింది. తను నటించిన ఓ తమిళ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమానికి ఎగ్గొట్టినందుకు నోటీసు జారీచేసింది. ఈ నోటీసుపై నమిత కారాలు మిరియాలు నూరుతోందట. తను వైరల్ జ్వరంతో వణికిపోతుంటే ఫంక్షనుకి రాలేదని నోటీసులు జారీ చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నిస్తోందట. ఎలాగైనా సినీ ఫంక్షనుకు హాజరవుదామని కప్పుకున్న దుప్పటి తీసి మంచం మీద నుంచి లేవబోతే వళ్లంతా వణకడం ప్రారంభించిందట. దాంతో ఆమె వ్యక్తిగత వైద్యులు.. "మీరు ఎక్కడికీ వెళ్లకూడదు. విశ్రాంతి ముఖ్యం" అని చెప్పారట. వైద్యుల సలహా మేరకు తను ఆ కార్యక్రమానికి హాజరుకాలేకపోయానని చెపుతోందట.Source: Yahoo! Telugu: Entertainment | 7 Sep 2009 | 6:14 am ఈవీఎంలపై సందేహాలు ఈసీ నివృత్తి చేయాలి: సీపీఐఓటింగ్ యంత్రాల (ఎలక్ట్రానికి ఓటింగ్ మెషన్స్)పై ఉన్న సందేహాలకు కేంద్ర ఎన్నికల సంఘం నివృత్తి చేయాలని సీపీఎం జాతీయ నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇందుకోసం అఖిలపక్ష సమావేశాన్ని ఈసీ ఏర్పాటు చేయాలని కోరారు.Source: జాతీయ | 7 Sep 2009 | 4:20 am వైఎస్ హెలికాఫ్టర్ ప్రమాదంపై సీబీఐ దర్యాప్తుస్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ప్రమాదానికి గురైన వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రోశయ్య, రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, డీజీపీ ఎస్ఎస్‌పి.యాదవ్‌లు సోమవారం ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు.Source: ఏపీ న్యూస్ | 7 Sep 2009 | 4:06 am రాష్ట్రంలో జగన్ నేతృత్వంలో 'వైఎస్ కాంగ్రెస్' పార్టీ!రాష్ట్రంలో మరో రాజకీయ పార్టీ ఆవిర్భవించనుందా? ప్రస్తుతం రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు దీనికి మరింత ఊతమిస్తున్నాయి. 'కాంగ్రెస్ అంటే వైఎస్'.. 'వైఎస్ అంటే కాంగ్రెస్' అనేలా రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకున్న మహానేత వైఎస్.రాజశేఖర్ రెడ్డి.Source: ఏపీ న్యూస్ | 7 Sep 2009 | 2:19 am జశ్వంత్ నేతృత్వంలోని పీఏసీ భేటీకి భాజపా డుమ్మా!పార్టీ బహిష్కృత నేత జశ్వంత్ సింగ్ నేతృత్వంలో ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) సమావేశానికి భారతీయ జనతా పార్టీకి చెందిన సభ్యులు గైర్హాజరయ్యారు. పీఏసీ సమావేశం జశ్వంత్ నేతృత్వంలో సోమవారం తొలిసారి జరిగింది.Source: జాతీయ | 7 Sep 2009 | 1:52 am 'ఐరెన్ లెగ్' రోజా.. మా పార్టీ వైపు చూడొద్దు: శోభారాణి'ఐరెన్ లెగ్ రోజా'గా పేరొందిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు ఆర్కే.రోజా తమ పార్టీ వైపు రావొద్దని ప్రజారాజ్యం మహిళా విభాగమైన మహిళారాజ్యం అధ్యక్షురాలు శోభారాణి అన్నారు.Source: ఏపీ న్యూస్ | 7 Sep 2009 | 1:41 am వైఎస్ వారసుని ఎంపిక: రాజీనామాకు సిద్ధం: దానందివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి వారసుడిని ఎంపిక వ్యవహారంలో ఆయన తనయుడు వైఎస్.జగన్ మోహన్ రెడ్డికి అన్యాయం జరిగితే సహించబోమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి దానం నాగేందర్ హెచ్చరించారు.Source: ఏపీ న్యూస్ | 7 Sep 2009 | 1:31 am ఢిల్లీ కామన్వెల్త్ క్రీడలకు పూర్తి భద్రత: చిదంబరంవచ్చే యేడాది దేశ రాజధాని ఢిల్లీలో జరిగే కామన్వెల్త్ క్రీడా పోటీలకు పూర్తి స్థాయి భద్రతను కల్పిస్తామని కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం స్పష్టం చేశారు. భద్రత విషయంలో విదేశీ ఆటగాళ్లకు ఏమైనా సందేహాలు ఉంటే వాటిని విడనాడాలని ఆయన పిలుపునిచ్చారు.Source: జాతీయ | 7 Sep 2009 | 1:20 am జశ్వంత్ సింగ్ పాక్ పర్యటనకు కేంద్రం సమ్మతం!దేశ విభజనపై తాను స్వయంగా రాసిన "జిన్నా.. భారత్, విభజన, స్వాతంత్ర్యం" అనే పుస్తక ప్రచారం కోసం జశ్వంత్ సింగ్ పాక్‌లో పర్యటించాలని భావించారు. ఈ పర్యటనకు జశ్వంత్‌కు అనుమతివ్వాలని కోరుతూ పబ్లిషర్ కేంద్రానికి విజ్ఞప్తి చేసుకోగా, కేంద్రం సానుకూలంగా స్పందించినట్టు స్థానిక మీడియా వెల్లడించింది.Source: జాతీయ | 7 Sep 2009 | 1:04 am కర్ణాటక నుంచే గుర్తింపు కార్డుల జారీ: నందన్కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యునిక్ ఐడెంటిటీ ప్రాజెక్టు (యుఐడి) కింద జారీ చేసే గుర్తింపు కార్డులను కర్ణాటక నుంచే జారీ చేయనున్నట్టు ఆ ప్రాజెక్టు ఛైర్మన్ నందన్ నీలేకర్ణి స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టును సక్రమంగా పూర్తి చేయడం తన ముందు ఉన్న అతిపెద్ద ఛాలెంజ్ అని ఆయన అభిప్రాయపడ్డారు.Source: జాతీయ | 7 Sep 2009 | 12:35 am 'ఐరెన్ లెగ్' రోజా ప్రవేశ వార్త: రాజన్న మటుమాయానికి "లింకు" ఉందా?తెలుగు వెండితెరపై 'ఐరెన్ లెగ్' నటిగా పేరుతెచ్చుకున్న అతికొద్ది మంది హీరోయిన్లలో ఆర్కే.రోజా ఒకరు. ఆమె తెలుగులో నటించిన అనేక చిత్రాలు బాక్సాఫీసు వద్ద బోల్తాపడ్డాయి. పలు చిత్రాలను స్వయంగా నిర్మించి చేతులు కూడా కాల్చుకున్నారు. దీంతో ఆమె చూపు రాజకీయాలపై పడింది.Source: ఏపీ న్యూస్ | 7 Sep 2009 | 12:12 am కాంగ్రెస్‌లో తాజా పరిస్థితులపై నో కామెంట్: బాబుముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి మరణానంతరం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలపై పార్టీకి చెందిన నేతలెవ్వరూ ఎలాంటి కామెంట్లు గానీ, అభిప్రాయాలు గానీ వ్యక్తం చేయరాదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు.Source: ఏపీ న్యూస్ | 6 Sep 2009 | 11:45 pm సోనియా నిర్ణయానికి కట్టుబడి ఉందాం: వైఎస్ జగన్స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి వారసుని ఎంపికలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తీసుకునే నిర్ణయానికి ప్రతి ఒక్కరం కట్టుబడి ఉందామని వైఎస్సార్ కుమారుడు, కడప ఎంపీ వైఎస్.జగన్ మోహన్ రెడ్డి తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు.Source: ఏపీ న్యూస్ | 6 Sep 2009 | 11:29 pm మహా సమరం: బీజేపీ- సేన సీట్ల సర్దుబాటు ఖరారుత్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రతిపక్ష బీజేపీ- శివసేన పార్టీలు పూర్తిస్థాయిలో పొత్తును ఖరారు చేసుకున్నాయి. బీజేపీ- శివసేన కూటమి తాజా ఎన్నికల సీట్ల సర్దుబాటు ఫార్ములాను కూడా సిద్ధం చేసింది. ఇదిలా ఉంటే అధికార భాగస్వాములు ఎన్సీపీ, కాంగ్రెస్‌లు మాత్రం ఈ దిశగా ఇప్పుడిప్పుడే అడుగులు వేయడం ప్రారంభించాయి.Source: జాతీయ | 6 Sep 2009 | 10:15 pm జిన్నా మద్దతుదారులందరిపై చర్యలు: రాజ్నాథ్మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ నేత జశ్వంత్ సింగ్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తూ బీజేపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ సమర్థించారు. పాకిస్థాన్ జాతిపిత మహమ్మదలీ జిన్నాను ప్రశంసిస్తూ జశ్వంత్ సింగ్ రాసిన "జిన్నా: ఇండియా, పార్టిషన్, ఇండిపెండెన్స్" పుస్తకం తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.Source: జాతీయ | 6 Sep 2009 | 9:37 pm మళ్లీ ప్రమాణస్వీకారం చేసిన రాష్ట్ర మంత్రులుదివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలోని 34 మంది సభ్యులు ఆదివారం తిరిగి మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో మంత్రులందరి చేత గవర్నర్ నారాయణ్‌దత్ తివారి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మంత్రిమండలి భేటి జరిగింది. దీనికి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి రోశయ్య హాజరయ్యారు.Source: ఏపీ న్యూస్ | 6 Sep 2009 | 7:01 am ఆందోళనలు వద్దు: కార్యకర్తలకు జగన్ విజ్ఞప్తికాంగ్రెస్ కార్యకర్తలు ఆదివారం గాంధీ భవన్‌లో డీఎస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, తనను సీఎం చేయాలంటూ చేసిన ఆందోళనపై దివంగత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్‌మోహన్ రెడ్డి స్పందించారు. తన నాయకత్వాన్ని సమర్థిస్తూ ప్లకార్డుల ప్రదర్శన, సంతకాల సేకరణ, ఆందోళనలు చేయవద్దని జగన్ ఈ సందర్భంగా సూచించారు.Source: ఏపీ న్యూస్ | 6 Sep 2009 | 6:47 am శరీరాలు మాత్రమే వేరు, ఆత్మ ఒకటే: కేవీపీదివంగత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సంతప సభలో ఆయన చిరకాల మిత్రుడు కేవీపీ రామచంద్రరావు కంటతడిపెట్టుకున్నారు. గాంధీ భవన్‌లో ఆదివారం జరిగిన వైఎస్ సంతాప సభలో కేవీపీ మాట్లాడుతూ.. మా శరీరాలు వేరైనా ఆత్మ ఒకటేనని అన్నారు. వైఎస్‌తో తన స్నేహాన్ని తలచుకొని కన్నీటి పర్యంతమయ్యారు.Source: ఏపీ న్యూస్ | 6 Sep 2009 | 6:36 am పాక్‌లో సయీద్ విడుదల దారుణం: చిదంబరంపాకిస్థాన్కు చెందిన నిషేధిత తీవ్రవాద సంస్థ జమాదుత్ దవా చీఫ్ హఫీజ్ సయీద్‌ను పాకిస్థాన్ విడుదల చేయడం దారుణమన్నారు. అమెరికా పర్యటనకు వెళ్లిన చిదంబరం ఈ సందర్భంగా అక్కడ మాట్లాడుతూ... పాకిస్థాన్ యంత్రాంగం సయీద్‌ను విడుదల చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ముంబయి ఉగ్రవాద దాడుల ప్రధాన సూత్రధారి సయీద్ అని భారత్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.Source: జాతీయ | 6 Sep 2009 | 6:12 am జార్ఖండ్‌లో బీజేపీ ఎమ్మెల్యేల రాజీనామాజార్ఖండ్ రాష్ట్రంలో బీజేపీ ఎమ్మెల్యేలు ఆదివారం మూకుమ్మడిగా రాజీనామా చేశారు. ఈ సందర్భంగా వారు ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఎమ్మెల్యేలందరూ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రఘువర్ దాస్‌కు రాజీనామా లేఖలు అందజేశారు. ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యేలు రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ను కలుసుకోనున్నారు.Source: జాతీయ | 6 Sep 2009 | 5:45 am నియంత్రణ రేఖపై చొరబాట్లు పెరిగాయి: ఆర్మీపాకిస్థాన్వైపు నుంచి జమ్ము- కాశ్మీర్ రాష్ట్రంలోకి సరిహద్దు చొరబాట్లు తీవ్రంగా పెరిగాయని ఆర్మీ వెల్లడించింది. శీతాకాలం రావడానికి ఎంతో సమయం లేకపోవడంతో.. పాక్ నుంచి భారత్‌లోకి చొరబాట్లు ఉధృతమయ్యాయని ఆర్మీ అధికారులు చెప్పారు. సాధ్యమైనంత ఎక్కువ మందిని భారత్‌లోకి చొరబడేలా చేసేందుకు పాక్‌వైపు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.Source: జాతీయ | 6 Sep 2009 | 3:27 am
|