|
ఏఐజీ ఆస్తుల నిర్వహణ యూనిట్ విక్రయంఅమెరికా బీమా దిగ్గజం ఏఐజీ తన పెట్టుబడుల సలహా, ఆస్తుల నిర్వహణ వ్యాపారంలో కొంత భాగాన్ని విక్రయిస్తున్నట్లు ప్రకటించింది. హాంకాంగ్‌కు చెందిన ఫసిఫిక్ సెంచురీ గ్రూపు అనుబంధ సంస్థకు అమెరికన్ ఇంటర్నేషనల్ గ్రూపు (ఏఐజీ) తన ఆస్తుల నిర్వహణ వ్యాపారంలో కొంత భాగాన్ని 500 మిలియన్ డాలర్లకు విక్రయించింది.Source: Yahoo! Telugu: News | 6 Sep 2009 | 9:43 am ఆఫ్ఘన్ ఎన్నికల ఫలితాలను నిలిపివేయాలిఆఫ్ఘనిస్థాన్ అధ్యక్ష ఎన్నికల ఫలితాలను నిలిపివేయాలని అధ్యక్షుడు హమీద్ కర్జాయ్‌కు ప్రధాన ప్రత్యర్థిగా పోటీ చేసిన అబ్దుల్లా అబ్దుల్లా శనివారం ఆ దేశ ఎన్నికల సంఘాన్ని కోరారు. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాలు అత్యంత అనుమానాస్పదంగా ఉండటంతో అబ్దుల్లా అబ్దుల్లా ప్రాథమిక ఫలితాల వెల్లడిని నిలిపివేయాలని డిమాండ్ చేశారు.Source: Yahoo! Telugu: News | 6 Sep 2009 | 9:28 am నియంత్రణ రేఖపై చొరబాట్లు పెరిగాయి: ఆర్మీపాకిస్థాన్వైపు నుంచి జమ్ము- కాశ్మీర్ రాష్ట్రంలోకి సరిహద్దు చొరబాట్లు తీవ్రంగా పెరిగాయని ఆర్మీ వెల్లడించింది. శీతాకాలం రావడానికి ఎంతో సమయం లేకపోవడంతో.. పాక్ నుంచి భారత్‌లోకి చొరబాట్లు ఉధృతమయ్యాయని ఆర్మీ అధికారులు చెప్పారు. సాధ్యమైనంత ఎక్కువ మందిని భారత్‌లోకి చొరబడేలా చేసేందుకు పాక్‌వైపు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.Source: Yahoo! Telugu: News | 6 Sep 2009 | 8:56 am వచ్చే ఏడాదికి నల్లధనాన్ని రప్పించే ఒప్పందంస్విట్జర్లాండ్ బ్యాంకుల్లో భారతీయులు దాచివుంచిన నల్లధనాన్ని తిరిగి దేశానికి తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన ఒప్పందంపై జరుగుతున్న పునఃచర్చల్లో సానుకూల ఫలితం వస్తుందని అధికారిక యంత్రాంగం తెలిపింది. వచ్చే ఏడాదినాటికి ఈ ఒప్పందం ఖరారయ్యే అవకాశం ఉందని స్విట్జర్లాండ్ ప్రభుత్వం తాజాగా వెల్లడించింది.Source: Yahoo! Telugu: News | 6 Sep 2009 | 8:47 am మళ్లీ ప్రమాణస్వీకారం చేయనున్న మంత్రులురాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మృతి చెందడంతో రాజ్యంగం ప్రకారం ఆయన మంత్రివర్గం కూడా రద్దు కానుంది. మంత్రులు తీసుకునే నిర్ణయాలకు చెల్లుబాటు ఉండదు. ముఖ్యమంత్రి మరణంతో రాజ్యాంగం ప్రకారం ప్రస్తుత మంత్రివర్గం తీసుకునే నిర్ణయాలకు చెల్లుబాటు ఉండదని న్యాయ నిపుణులు సూచించడంతో రాష్ట్ర మంత్రులు ఆదివారం సాయంత్రం తిరిగి ప్రమాణస్వీకారం చేయనున్నారు.Source: Yahoo! Telugu: News | 6 Sep 2009 | 7:30 am ఇండోనేషియా భూకంపం: 70కి చేరిన మృతులుఇండోనేషియాలో ఇటీవల సంభవించిన తీవ్ర భూకంపం కారణంగా మృతి చెందినవారి సంఖ్య తాజాగా 70కి పెరిగింది. ఇప్పటికీ 32 మంది ఆచూకీ కనుగొనాల్సి ఉందని ఇండోనేషియా అధికారిక యంత్రాంగం శనివారం వెల్లడించింది. ఇదిలా ఉంటే భూకంపం కారణంగా వివిధ ప్రాంతాల్లో 966 మంది గాయపడ్డారు. పశ్చిమ జావాలో బుధవారం సంభవించిన ఈ భారీ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.3గా నమోదయింది.Source: Yahoo! Telugu: News | 6 Sep 2009 | 6:32 am జశ్వంత్ సింగ్ పాక్ పర్యటనకు గ్రీన్ సిగ్నల్!"జిన్నా-ఇండియా-పార్టిషన్ అండ్ ఇండిపెండెన్స్" పుస్తకంపై ప్రచారం కోసం పాకిస్తాన్‌లో పర్యటించేందుకు గానూ భారతీయ జనతా పార్టీ నుంచి బహిష్కరణకు గురైన సీనియర్ నేత జశ్వంత్ సింగ్‌కు కేంద్రం అనుమతినిచ్చింది. తాను రాసిన "జిన్నా-ఇండియా-పార్టిషన్ అండ్ ఇండిపెండెన్స్" పై ప్రచారం కోసం జశ్వంత్ పాక్‌లో పర్యటించనున్నారు.Source: Yahoo! Telugu: News | 6 Sep 2009 | 6:27 am నాటో దాడిలో పౌరులు గాయపడ్డారు: అమెరికాఉత్తర ఆఫ్ఘనిస్థాన్‌లో ఇటీవల తమ దళాలు జరిపిన వైమానిక దాడిలో ఆఫ్ఘన్ పౌరులు గాయపడ్డారని నాటో ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఈ దాడిలో సుమారు 90 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. మృతుల్లో తాలిబాన్ తీవ్రవాదులతోపాటు ఆఫ్ఘన్ పౌరుల కూడా ఉండటంతో నాటో సైనలు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాయి.Source: Yahoo! Telugu: News | 6 Sep 2009 | 6:18 am వైఎస్సార్ సంతాప సభలో తీవ్ర గందరగోళంహెలికాఫ్టర్ ప్రమాదంలో ఇటీవల మృతి చెందిన ముఖ్యమంత్రి వైఎస్సార్‌కు నివాళులు అర్పించేందుకు కాంగ్రెస్ నేతలు ఆదివారం రాష్ట్ర రాజధానిలోని గాంధీ భవన్‌లో సంతాప సభ నిర్వహించారు. ఈ సభలో కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్ర గందరగోళాన్ని సృష్టించారు. వైఎస్సార్ కుమారుడు జగన్ మోహన్ రెడ్డిని సీఎం చేయాలంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ఈ సంతాప సభలో నినాదాలు చేశారు.Source: Yahoo! Telugu: News | 6 Sep 2009 | 6:08 am గజియాబాద్ హింస: 25 మందికి గాయాలుఅనధికారిక కాలనీలను కూల్చివేయడాన్ని నిరసిస్తూ గజియాబాద్‌లో స్థానికులు శనివారం చేసిన ఆందోళన హింసాత్మకమైంది. ఈ హింసాకాండలో 25 మంది గాయపడ్డారు. వీరిలో ఏడుగురు పోలీసు సిబ్బంది కూడా ఉన్నారు. కాలనీలను కూల్చివేతను నిరసిస్తూ ఆందోళనకారులు గజియాబాద్‌లో వాహనాలుకు నిప్పుపెట్టడంతోపాటు, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగించారు.Source: Yahoo! Telugu: News | 6 Sep 2009 | 5:52 am నియంత్రణ రేఖపై చొరబాట్లు పెరిగాయి: ఆర్మీపాకిస్థాన్వైపు నుంచి జమ్ము- కాశ్మీర్ రాష్ట్రంలోకి సరిహద్దు చొరబాట్లు తీవ్రంగా పెరిగాయని ఆర్మీ వెల్లడించింది. శీతాకాలం రావడానికి ఎంతో సమయం లేకపోవడంతో.. పాక్ నుంచి భారత్‌లోకి చొరబాట్లు ఉధృతమయ్యాయని ఆర్మీ అధికారులు చెప్పారు. సాధ్యమైనంత ఎక్కువ మందిని భారత్‌లోకి చొరబడేలా చేసేందుకు పాక్‌వైపు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.Source: జాతీయ | 6 Sep 2009 | 3:27 am వచ్చే ఏడాదికి నల్లధనాన్ని రప్పించే ఒప్పందంస్విట్జర్లాండ్ బ్యాంకుల్లో భారతీయులు దాచివుంచిన నల్లధనాన్ని తిరిగి దేశానికి తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన ఒప్పందంపై జరుగుతున్న పునఃచర్చల్లో సానుకూల ఫలితం వస్తుందని అధికారిక యంత్రాంగం తెలిపింది. వచ్చే ఏడాదినాటికి ఈ ఒప్పందం ఖరారయ్యే అవకాశం ఉందని స్విట్జర్లాండ్ ప్రభుత్వం తాజాగా వెల్లడించింది.Source: జాతీయ | 6 Sep 2009 | 3:18 am మళ్లీ ప్రమాణస్వీకారం చేయనున్న మంత్రులురాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మృతి చెందడంతో రాజ్యంగం ప్రకారం ఆయన మంత్రివర్గం కూడా రద్దు కానుంది. మంత్రులు తీసుకునే నిర్ణయాలకు చెల్లుబాటు ఉండదు. ముఖ్యమంత్రి మరణంతో రాజ్యాంగం ప్రకారం ప్రస్తుత మంత్రివర్గం తీసుకునే నిర్ణయాలకు చెల్లుబాటు ఉండదని న్యాయ నిపుణులు సూచించడంతో రాష్ట్ర మంత్రులు ఆదివారం సాయంత్రం తిరిగి ప్రమాణస్వీకారం చేయనున్నారు.Source: ఏపీ న్యూస్ | 6 Sep 2009 | 2:00 am జశ్వంత్ సింగ్ పాక్ పర్యటనకు గ్రీన్ సిగ్నల్!"జిన్నా-ఇండియా-పార్టిషన్ అండ్ ఇండిపెండెన్స్" పుస్తకంపై ప్రచారం కోసం పాకిస్తాన్‌లో పర్యటించేందుకు గానూ భారతీయ జనతా పార్టీ నుంచి బహిష్కరణకు గురైన సీనియర్ నేత జశ్వంత్ సింగ్‌కు కేంద్రం అనుమతినిచ్చింది. తాను రాసిన "జిన్నా-ఇండియా-పార్టిషన్ అండ్ ఇండిపెండెన్స్" పై ప్రచారం కోసం జశ్వంత్ పాక్‌లో పర్యటించనున్నారు.Source: జాతీయ | 6 Sep 2009 | 12:58 am వైఎస్సార్ సంతాప సభలో తీవ్ర గందరగోళంహెలికాఫ్టర్ ప్రమాదంలో ఇటీవల మృతి చెందిన ముఖ్యమంత్రి వైఎస్సార్‌కు నివాళులు అర్పించేందుకు కాంగ్రెస్ నేతలు ఆదివారం రాష్ట్ర రాజధానిలోని గాంధీ భవన్‌లో సంతాప సభ నిర్వహించారు. ఈ సభలో కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్ర గందరగోళాన్ని సృష్టించారు. వైఎస్సార్ కుమారుడు జగన్ మోహన్ రెడ్డిని సీఎం చేయాలంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ఈ సంతాప సభలో నినాదాలు చేశారు.Source: ఏపీ న్యూస్ | 6 Sep 2009 | 12:39 am గజియాబాద్ హింస: 25 మందికి గాయాలుఅనధికారిక కాలనీలను కూల్చివేయడాన్ని నిరసిస్తూ గజియాబాద్‌లో స్థానికులు శనివారం చేసిన ఆందోళన హింసాత్మకమైంది. ఈ హింసాకాండలో 25 మంది గాయపడ్డారు. వీరిలో ఏడుగురు పోలీసు సిబ్బంది కూడా ఉన్నారు. కాలనీలను కూల్చివేతను నిరసిస్తూ ఆందోళనకారులు గజియాబాద్‌లో వాహనాలుకు నిప్పుపెట్టడంతోపాటు, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగించారు.Source: జాతీయ | 6 Sep 2009 | 12:23 am 26/11 దర్యాప్తును పాకిస్థాన్ నీరుగారుస్తోందిముంబయి ఉగ్రవాద దాడుల కేసు దర్యాప్తును పాకిస్థాన్ నీరుగారుస్తోందని కేంద్ర హోం శాఖ మంత్రి పి.చిదంబరం ఆరోపించారు. ముంబయి దాడులపై దర్యాప్తును పాక్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నీరుగారుస్తోందని దుయ్యబట్టారు. పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక చర్చలు పునఃప్రారంభించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.Source: జాతీయ | 5 Sep 2009 | 11:17 pm వైఎస్సార్ మరణం: సీవీఆర్ డీకోడింగ్ ప్రారంభంరాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని బలిగొన్న హెలికాఫ్టర్ ప్రమాదంపై అధికారిక యంత్రాంగం దర్యాప్తు చర్యలను ముమ్మరం చేసింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)కు చెందిన కమిటీ వైఎస్సార్ మృతిపై దర్యాప్తు ప్రారంభించింది. డీజీసీఏ కమిటీ శనివారం కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (సీవీఆర్) డీకోడింగ్ ప్రక్రియను మొదలుపెట్టింది.Source: ఏపీ న్యూస్ | 5 Sep 2009 | 11:03 pm "వరుడు"గా వస్తోన్న 'బన్నీ' హీరో అల్లు అర్జున్!స్టైలిష్ హీరో అల్లు అర్జున్ హీరోగా డైనమిక్ డైరక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో యూనివర్శల్ మీడియా పతాకంపై హిట్ చిత్రాల నిర్మాత డి.వి.వి. దానయ్య నిర్మిస్తోన్న భారీ చిత్రానికి "వరుడు" అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమా గురించి నిర్మాత డి.వి.వి. దానయ్య మాట్లాడుతూ.. తమ కథకు "వరుడు" అనే టైటిల్ చక్కగా సరిపోతుందన్నారు. ఈ టైటిల్‌ను తాము అడిగిన వెంటనే ఇచ్చిన నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి)కి పత్రికాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామని దానయ్య చెప్పారు.Source: Yahoo! Telugu: Entertainment | 5 Sep 2009 | 12:13 pm యువతంటే ఇలా ఉండాలంటోన్న "జోష్"యువసామ్రాట్ నాగార్జున వారసుడు సినిమా అనగానే ఎలా ఉంటుంది? ఎలా తీర్చిదిద్దుతారు? అనే ఆసక్తి అటు అభిమానుల్లోనూ, ఇటు ప్రేక్షకుల్లోనూ ఉండటం సహజమే. ఎటువంటి కథను తీసుకున్నా తొలుత మాస్ చిత్రాన్ని తీసి జనాలపై రుద్దడం భావ్యం కాదు గనుక సాఫ్ట్ లవ్‌స్టోరీతో జోష్‌ను తెరకెక్కించారు. అందులోను దిల్‌రాజు (వెంకటేశ్వర రెడ్డి) లాంటి నిర్మాత చిత్రమంటే కాస్తో, కూస్తో సందేశముంటుంది. ఆ రూటులో సాగిన కథాకమామిషే "జోష్" సినిమా.Source: Yahoo! Telugu: Entertainment | 5 Sep 2009 | 11:52 am పూర్తయిన ఎంఎస్‌రెడ్డి అంత్యక్రియలురాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదంలో బుధవారం మృతి చెందిన కో పైలెట్ ఎం.సత్యనారాయణరెడ్డి(45) అంత్యక్రియలు శనివారం జరిగాయి.Source: ఏపీ న్యూస్ | 5 Sep 2009 | 9:38 am రాజశేఖరుడు ఉదార స్వభావి: ముఖ్యమంత్రి రోశయ్యముఖ్యమంత్రి దివంగత వైఎస్.రాజశేఖర రెడ్డి ఉదారస్వభావి అని రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె.రోశయ్య అభిప్రాయపడ్డారు. పేదలు రెండు పూటలా కడుపునిండా అన్నం తినేందుకు గాను ఎన్నికల్లో హామీ ఇవ్వక పోయినా కిలో బియ్యం రెండు రూపాయల పథకాన్ని అమలు చేసిన మహానేత వైఎస్ అని రోశయ్య శ్లాఘించారు.Source: ఏపీ న్యూస్ | 5 Sep 2009 | 7:41 am పీసీసీ చీఫ్ డీఎస్ వ్యాఖ్యలను సమర్థించిన కేకేదివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసుని ఎంపిక వ్యవహారంపై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు కె.కేశవరావు సమర్థించారు.Source: ఏపీ న్యూస్ | 5 Sep 2009 | 7:18 am యువతంటే ఇలా ఉండాలంటోన్న "జోష్"యువసామ్రాట్ నాగార్జున వారసుడు సినిమా అనగానే ఎలా ఉంటుంది? ఎలా తీర్చిదిద్దుతారు? అనే ఆసక్తి అటు అభిమానుల్లోనూ, ఇటు ప్రేక్షకుల్లోనూ ఉండటం సహజమే. ఎటువంటి కథను తీసుకున్నా తొలుత మాస్ చిత్రాన్ని తీసి జనాలపై రుద్దడం భావ్యం కాదు గనుక సాఫ్ట్ లవ్‌స్టోరీతో జోష్‌ను తెరకెక్కించారు. అందులోను దిల్‌రాజు (వెంకటేశ్వర రెడ్డి) లాంటి నిర్మాత చిత్రమంటే కాస్తో, కూస్తో సందేశముంటుంది. ఆ రూటులో సాగిన కథాకమామిషే "జోష్" సినిమా.Source: వినోదం | 5 Sep 2009 | 7:00 am వైఎస్ చిరునవ్వులు లేని సభ ఊహించలేం: స్పీకర్ముఖ్యమంత్రి దివంగత వైఎస్.రాజశేఖర్ రెడ్డి చిందించే చిరునవ్వులు ఇక సభలో కనిపించవని, అలాంటి సభను కలలో కూడా ఊహించుకోలేక పోతున్నట్టు స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా వైఎస్ చేసిన ప్రసంగాలను సీడీలు, పుస్తక రూపంలో విడుదల చేసేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 5 Sep 2009 | 6:58 am పుట్టినరోజు వేడుకలు వద్దన్న "కొమరం పులి"పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సెప్టెంబరు 2. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ అభిమాన సంఘాలు పెద్ద ఎత్తున ఆయన పుట్టినరోజు వేడుకలను నిర్వహించాలని అందుకు తగిన ఏర్పాట్లు చేశాయి. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో అదే రోజున మృతి చెందటంతో తన బర్త్‌డే వేడుకలను జరుపవద్దని పవన్ అభిమానులకు తెలియజేశారు.Source: Yahoo! Telugu: Entertainment | 5 Sep 2009 | 6:39 am ఏఐ విమానంలో మంటలు: పైలెట్లపై వేటుఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ విమానంలో మంటలు చెలరేగడంపై అధికారిక యంత్రాంగం దర్యాప్తు ప్రారంభించింది. ఇంజిన్ మంటల్లో చిక్కుకోవడంతో శుక్రవారం ముంబయి నుంచి రియాద్ వెళ్లవలిసిన ఈ విమానాన్ని నిలిపివేసిన సంగతి తెలిసిందే. విమానంలోని ప్రయాణికులను బయటకు రప్పించేందుకు ఉపయోగించిన స్లైడ్‌లను మంటలు చెలరేగినవైపు కూడా తెరవడం వివాదాస్పదమైంది.Source: జాతీయ | 5 Sep 2009 | 6:19 am దివంగత నేత వైఎస్సార్‌కు ఘన నివాళులుహెలికాఫ్టర్ ప్రమాదంలో అకాలమరణం చెందిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక ప్రార్థనలు, సంస్మరణ సభలు జరిగాయి. వైఎస్ సొంతగడ్డ పులివెందులలో ఆయన కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.Source: ఏపీ న్యూస్ | 5 Sep 2009 | 6:10 am జగన్మోహన్ రెడ్డికే పట్టం కట్టాలి: అక్కినేని నాగార్జునముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి లక్ష్యాలు, ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలంటే ఆయన తనయుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డికే సీఎం బాధ్యతలు అప్పగించాలని సినీ హీరో అక్కినేని నాగార్జున అభిప్రాయపడ్డారు.Source: ఏపీ న్యూస్ | 5 Sep 2009 | 6:04 am 19న తెరపైకి వస్తోన్న "సమర్థుడు"రెబల్ స్టార్ కృష్ణంరాజు ప్రధాన పాత్రలో రాజా, సంజన హీరోహీరోయిన్లుగా నటించిన "సమర్థుడు" చిత్రం ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. ఏడాదిన్నరపాటు షూటింగ్‌ను జరుపుకున్న ఈ సినిమా ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.ఈ సందర్భంగా నిర్మాతలు ఆకుల సురేష్ పటేల్, ఎం. వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. ఇది ప్రజాచిత్రం. కృష్ణంరాజు పోషించిన పాత్రచుట్టూనే కథ తిరుగుతుందన్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 19వ తేదీన సమర్థుడిని విడుదల చేయనున్నట్లు నిర్మాతలు తెలియజేశారు.Source: Yahoo! Telugu: Entertainment | 5 Sep 2009 | 5:15 am బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనంపశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బాగా బలపడింది. ఇది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని విశాఖపట్నంలోని తుఫాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం అది ఒరిస్సాలోని బాలాపూర్‌కు 170 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది.Source: ఏపీ న్యూస్ | 5 Sep 2009 | 5:12 am పూణే నగరంలో మరో స్వైన్ ఫ్లూ రోగి మరణంపూణే నగరంలో మరో స్వైన్ ఫ్లూ రోగి మృతి చెందాడు. దీంతో నగరంలో ఇప్పటివరకు ఈ ప్రమాదకర వైరస్ బారినపడి మృతి చెందినవారి సంఖ్య 34కి చేరుకుంది. దేశంలోనే అత్యుధికంగా స్వైన్ ఫ్లూ మరణాలు పూణేలో సంభవించిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఈ నగరంలో స్వైన్ ఫ్లూ మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి.Source: జాతీయ | 5 Sep 2009 | 5:00 am శివసేన నేత బాల్ థాకరేపై అరెస్ట్ వారెంట్ జారీశివసేన అధినేత బాల్ థాకరేపై బీహార్ కోర్టు నాన్- బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. శివసేన పత్రిక సామ్నాలో బీహారీలను రెచ్చగొట్టే, వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకు బీహార్‌లోని భోజ్‌పూర్ సబ్ డివిజినల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టు ఆయనపై ఈ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.Source: జాతీయ | 5 Sep 2009 | 4:14 am పాక్ ప్రభుత్వం సీరియస్‌గా లేదు: ఎస్ఎం కృష్ణముంబయి ఉగ్రవాద దాడుల సుత్రధారులను పాకిస్థాన్ ప్రభుత్వం చట్టం ముందుకు తీసుకుకురావడంపై భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ఎం కృష్ణ అనుమానం వ్యక్తం చేశారు. ముంబయి దాడుల సుత్రధారులను చట్టం ముందుకు తీసుకొచ్చేందుకు తాము కట్టుబడి ఉన్నామని పాక్ ప్రభుత్వం పదేపదే ప్రకటనలు చేస్తున్న సంగతి తెలిసిందే.Source: జాతీయ | 5 Sep 2009 | 2:41 am
|