శివసేన నేత బాల్ థాకరేపై అరెస్ట్ వారెంట్ జారీ

శివసేన అధినేత బాల్ థాకరేపై బీహార్ కోర్టు నాన్- బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. శివసేన పత్రిక సామ్నాలో బీహారీలను రెచ్చగొట్టే, వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకు బీహార్‌లోని భోజ్‌పూర్ సబ్ డివిజినల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టు ఆయనపై ఈ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
Source: Yahoo! Telugu: News | 5 Sep 2009 | 9:43 am

మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా

ముఖ్యమంత్రి వైఎస్‌తో పాటు హెలికాఫ్టర్ ప్రయాణిస్తూ దుర్మరణం పాలైన ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. హెలికాఫ్టర్ పైలట్, కో పైలట్‌తో పాటు.. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ కార్యదర్శి కుటుంబాలకు తక్షణం పది లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేయనున్నట్టు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె.రోశయ్య తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 5 Sep 2009 | 9:42 am

నాల్కో, టాటా కమ్యూనికేషన్స్ తొలగింపు

నిఫ్టీ-50 నుంచి నాల్కో, టాటా కమ్యూనికేషన్స్‌ను తొలగిస్తున్నామని నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ (ఎన్ఎస్ఈ) తెలిపింది. వీటి స్థానంలో జై ప్రకాష్ అసోసియేట్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కంపెనీ (ఐడీఎఫ్‌సీ)లను కూడా చేరుస్తున్నామని ఎన్ఎస్ఈ ఓ ప్రకటనలో వెల్లడించింది.
Source: Yahoo! Telugu: News | 5 Sep 2009 | 9:32 am

వైఎస్ జగన్‌కు మద్దతుగా ఎమ్మెల్సీల తీర్మానం

స్వర్గీయ వైఎస్.రాజశేఖర్ రెడ్డి వారసునిగా ఆయన తనయుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డిని ఎంపిక చేయాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు శనివారం సమావేశమై ఒక తీర్మానం చేశారు.
Source: Yahoo! Telugu: News | 5 Sep 2009 | 9:29 am

కొరియా అణు కేంద్రంలో కొత్త నిర్మాణాలు లేవు

ఉత్తర కొరియాలోని యోగ్‌బైన్ అణు రియాక్టర్‌లో కొత్త నిర్మాణాలేవీ జరగడం లేదని నిపుణులు శాటిలైట్ ఛాయాచిత్రాల ఆధారంగా విశ్లేషిస్తున్నారు. ఈ అణు కేంద్రాన్ని పునర్నిర్మిస్తామని ఉత్తర కొరియా చేసిన బెదిరింపు ప్రకటనలు ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న నేపథ్యంలో.. నిపుణులు ఈ కేంద్రంపై దృష్టిసారించారు.
Source: Yahoo! Telugu: News | 5 Sep 2009 | 9:24 am

శాశ్వత నిద్రకు స్వయంగా స్థలాన్ని ఎంచుకున్న వైఎస్

యాదృచ్ఛికమో.. ఏమోగానీ.. స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి.. తాను శాశ్వతంగా ఎక్కడ నిద్ర పోవాలో కూడా ముందుగానే నిర్ణయించుకున్నారు. తనకు అత్యంత ప్రీతిపాత్రమైన ఇడుపులపాయ ఎస్టేట్‌లో వైఎస్ తన కుమార్తె, కుటుంబ సభ్యులతో కలిసి విహరించడం పరిపాటి.
Source: Yahoo! Telugu: News | 5 Sep 2009 | 9:11 am

పాక్ ప్రభుత్వం సీరియస్‌గా లేదు: ఎస్ఎం కృష్ణ

ముంబయి ఉగ్రవాద దాడుల సుత్రధారులను పాకిస్థాన్ ప్రభుత్వం చట్టం ముందుకు తీసుకుకురావడంపై భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ఎం కృష్ణ అనుమానం వ్యక్తం చేశారు. ముంబయి దాడుల సుత్రధారులను చట్టం ముందుకు తీసుకొచ్చేందుకు తాము కట్టుబడి ఉన్నామని పాక్ ప్రభుత్వం పదేపదే ప్రకటనలు చేస్తున్న సంగతి తెలిసిందే.
Source: Yahoo! Telugu: News | 5 Sep 2009 | 8:11 am

పాక్, ఆఫ్ఘన్‌లే తీవ్రవాద కేంద్రాలు: బ్రిటన్ ప్రధాని

ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ దేశాల్లోని పర్వత ప్రాంతాలు ప్రపంచంలో తీవ్రవాద దాడుల వ్యూహరచనకు ప్రధాన కేంద్రాలుగా ఉన్నాయని బ్రిటన్ ప్రధానమంత్రి గోర్డాన్ బ్రౌన్ తెలిపారు. బ్రిటన్‌లో జరిగే నాలుగింట మూడొంతుల దాడులకు ఈ ప్రాంతం నుంచి కుట్ర జరుగుతోందన్నారు. ఆఫ్ఘన్‌లో భద్రతా యంత్రాంగాన్ని మరింత వేగవంతంగా తయారు చేయాల్సి ఉందన్నారు.
Source: Yahoo! Telugu: News | 5 Sep 2009 | 8:01 am

చక్కెర ఉత్పత్తులు పెంచుకున్న థాయ్‌లాండ్

ప్రపంచవ్యాప్తంగా చక్కెర ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆసియాలో అతి పెద్ద చక్కెర ఎగుమతి దేశాలలో ఒకటైన థాయ్‌లాండ్‌లో చక్కెర ఉత్పత్తులు పెరిగాయి.
Source: Yahoo! Telugu: News | 5 Sep 2009 | 7:34 am

ఆఫ్ఘన్: అమెరికా ఎంబసీలో అశ్లీల కుంభకోణం

ఆఫ్ఘనిస్థాన్‌లోని అమెరికా దౌత్యకార్యాలయంలో అశ్లీల కుంభకోణం వెలుగుచూసింది. దీనికి సంబంధించి ఎనిమిది మంది భద్రతా సిబ్బందిపై అమెరికా దౌత్య యంత్రాంగం చర్యలు తీసుకుంది. నివాసం ఉంటున్న క్వార్టర్స్‌లో అనైతిక, లైంగిక దుష్ప్రవర్తన కనబరిచిన ఆరోపణలు రావడంతో ఈ ఎనిమిది మందిని విధుల నుంచి తొలగించారు.
Source: Yahoo! Telugu: News | 5 Sep 2009 | 7:22 am

పుట్టినరోజు వేడుకలు వద్దన్న "కొమరం పులి"

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సెప్టెంబరు 2. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ అభిమాన సంఘాలు పెద్ద ఎత్తున ఆయన పుట్టినరోజు వేడుకలను నిర్వహించాలని అందుకు తగిన ఏర్పాట్లు చేశాయి. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో అదే రోజున మృతి చెందటంతో తన బర్త్‌డే వేడుకలను జరుపవద్దని పవన్ అభిమానులకు తెలియజేశారు.
Source: Yahoo! Telugu: Entertainment | 5 Sep 2009 | 6:39 am

19న తెరపైకి వస్తోన్న "సమర్థుడు"

రెబల్ స్టార్ కృష్ణంరాజు ప్రధాన పాత్రలో రాజా, సంజన హీరోహీరోయిన్లుగా నటించిన "సమర్థుడు" చిత్రం ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. ఏడాదిన్నరపాటు షూటింగ్‌ను జరుపుకున్న ఈ సినిమా ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.ఈ సందర్భంగా నిర్మాతలు ఆకుల సురేష్ పటేల్, ఎం. వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. ఇది ప్రజాచిత్రం. కృష్ణంరాజు పోషించిన పాత్రచుట్టూనే కథ తిరుగుతుందన్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 19వ తేదీన సమర్థుడిని విడుదల చేయనున్నట్లు నిర్మాతలు తెలియజేశారు.
Source: Yahoo! Telugu: Entertainment | 5 Sep 2009 | 5:15 am

శివసేన నేత బాల్ థాకరేపై అరెస్ట్ వారెంట్ జారీ

శివసేన అధినేత బాల్ థాకరేపై బీహార్ కోర్టు నాన్- బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. శివసేన పత్రిక సామ్నాలో బీహారీలను రెచ్చగొట్టే, వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకు బీహార్‌లోని భోజ్‌పూర్ సబ్ డివిజినల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టు ఆయనపై ఈ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
Source: జాతీయ | 5 Sep 2009 | 4:14 am

మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా

ముఖ్యమంత్రి వైఎస్‌తో పాటు హెలికాఫ్టర్ ప్రయాణిస్తూ దుర్మరణం పాలైన ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. హెలికాఫ్టర్ పైలట్, కో పైలట్‌తో పాటు.. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ కార్యదర్శి కుటుంబాలకు తక్షణం పది లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేయనున్నట్టు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె.రోశయ్య తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 5 Sep 2009 | 4:13 am

వైఎస్ జగన్‌కు మద్దతుగా ఎమ్మెల్సీల తీర్మానం

స్వర్గీయ వైఎస్.రాజశేఖర్ రెడ్డి వారసునిగా ఆయన తనయుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డిని ఎంపిక చేయాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు శనివారం సమావేశమై ఒక తీర్మానం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 5 Sep 2009 | 3:59 am

శాశ్వత నిద్రకు స్వయంగా స్థలాన్ని ఎంచుకున్న వైఎస్

యాదృచ్ఛికమో.. ఏమోగానీ.. స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి.. తాను శాశ్వతంగా ఎక్కడ నిద్ర పోవాలో కూడా ముందుగానే నిర్ణయించుకున్నారు. తనకు అత్యంత ప్రీతిపాత్రమైన ఇడుపులపాయ ఎస్టేట్‌లో వైఎస్ తన కుమార్తె, కుటుంబ సభ్యులతో కలిసి విహరించడం పరిపాటి.
Source: ఏపీ న్యూస్ | 5 Sep 2009 | 3:47 am

పాక్ ప్రభుత్వం సీరియస్‌గా లేదు: ఎస్ఎం కృష్ణ

ముంబయి ఉగ్రవాద దాడుల సుత్రధారులను పాకిస్థాన్ ప్రభుత్వం చట్టం ముందుకు తీసుకుకురావడంపై భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ఎం కృష్ణ అనుమానం వ్యక్తం చేశారు. ముంబయి దాడుల సుత్రధారులను చట్టం ముందుకు తీసుకొచ్చేందుకు తాము కట్టుబడి ఉన్నామని పాక్ ప్రభుత్వం పదేపదే ప్రకటనలు చేస్తున్న సంగతి తెలిసిందే.
Source: జాతీయ | 5 Sep 2009 | 2:41 am

అంబేడ్కర్ పార్కు పనుల నిలిపివేతకు సిఫార్సు

నోయిడా వద్ద ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన బీఆర్ అంబేడ్కర్ పార్కు నిర్మాణ పనులు నిలిపివేయాలని సుప్రీంకోర్టు కమిటీ సిఫార్సు చేసింది. కేంద్ర పర్యావరణ శాఖ అభిప్రాయాలతో సుప్రీంకోర్టు కమిటీ కూడా ఏకీభవించింది. దళిత నేతల విగ్రహాలను ఈ పార్కులో ఆవిష్కరిస్తుండటం పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా జరుగుతోందని కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
Source: జాతీయ | 5 Sep 2009 | 1:38 am

సీఎల్పీ అభిప్రాయం మేరకే తుది నిర్ణయం: మొయిలీ

దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి వారసుని ఎంపికలో కాంగ్రెస్ శాసన సభాపక్షం (సీఎల్పీ) అభిప్రాయాన్ని పరిగణంలోకి తీసుకోకుండా అధిష్టానం తుది నిర్ణయం తీసుకోబోదని కేంద్ర మంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీ స్పష్టం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 5 Sep 2009 | 1:30 am

'క్రాష్‌'పై ఎన్నో సందేహాలు.. మరెన్నో అనుమానాలు

ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ప్రమాదానికి గురైన అంశంపై ఎన్నో సందేహాలు, మరెన్నో అనుమానాలకు దారితీస్తోంది. భెల్-430 రకానికి చెందిన హెలికాఫ్టర్‌లో పురాతన కాలానికి చెందినదే అయినప్పటికీ.. దానికి పైలట్‌గా ఉన్న వ్యక్తి భాటియా మాత్రం మంచి నైపుణ్యం కలిగిన అనుభవజ్ఞుడు.
Source: ఏపీ న్యూస్ | 5 Sep 2009 | 12:39 am

ఒకే కాన్పులో ఐదుగురు మగ బిడ్డలకు జన్మ

ముంబయి ప్రైవేట్ ఆస్పత్రిలో ఓ మహిళ ఒకే కాన్పులో ఐదుగురు బిడ్డలకు జన్మనిచ్చారు. మీరా రోడ్డులో నివాసం ఉంటున్న సబీరా ఖాన్ (24) అనే మహిళ నగర శివారుల్లోని అంధేరీలో ఉన్న కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో ఐదుగురు మగశిశువులకు జన్మనిచ్చినట్లు ఆ ఆస్పత్రి వైద్యులు తెలిపారు.
Source: జాతీయ | 5 Sep 2009 | 12:18 am

వైఎస్ హెలికాఫ్టర్ ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభం

ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి హెలికాఫ్టర్ ప్రమాదంపై దర్యాప్తు బృందం విచారణ చేపట్టింది. ఈ బృందం ప్రమాదం జరిగిన స్థలాన్ని సందర్శించి హెలికాఫ్టర్‌ కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డర్‌‌ను స్వాధీనం చేసుకుంది. అలాగే, కర్నూలు జిల్లా నల్లమల అడవుల్లో కుప్పకూలడానికి గల కారణాలపై ఆరా తీస్తోంది.
Source: ఏపీ న్యూస్ | 4 Sep 2009 | 11:55 pm

రాజన్న అస్తమయం: 300 దాటిన ప్రాణత్యాగాలు

ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్.రాజశేఖర్ రెడ్డి దుర్మణ వార్త విని రాష్ట్ర వ్యాప్తంగా 300 మంది అభిమానులు, కార్యకర్తలు తుదిశ్వాస విడిచారు. ఆయన అంతిమయాత్రను, అంత్యక్రియలను టెలివిజన్లలో చూస్తూ తల్లడిల్లిన ఆంధ్రావనిలో శుక్రవారం ఒక్కరోజులోనే 227 మంది మృతి చెందగా, శనివారం ఉదయానికి ఈ సంఖ్య 300కు దాటింది
Source: ఏపీ న్యూస్ | 4 Sep 2009 | 11:32 pm

హుస్సేన్ సాగర్‌లో దూకమన్నా దూకుతా: రోశయ్య

కాంగ్రెస్ అధిష్టానం తనను పిలిచి హుస్సేన్ సాగర్‌లో దూకేందుకు సిద్ధమని రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య స్పష్టం చేశారు. హెలికాఫ్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలైన ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి వారసుని ఎంపికపై అధిష్టానందే తుది నిర్ణయమని ఆయన స్పష్టం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 4 Sep 2009 | 11:12 pm

ఆరుషి డీఎన్ఏ సాక్ష్యాన్ని మార్చారు: సీబీఐ

సంచలనాత్మక ఆరుషి- హేమ్‌రాజ్ జంట హత్యల కేసు మరో మలుపు తిరిగింది. ఆరుషి డీఎన్ఏ సాక్ష్యాన్ని మార్చారని సీబీఐ వర్గాలు తాజాగా తెలిపాయి. బాధితురాలి యోని భాగం నుంచి సేకరించిన నమూనాలను మరో గుర్తు తెలియని మహిళ నమూనాలతో మార్చారని సీబీఐ అనుమానిస్తోంది. హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్‌ప్రింటింగ్, డయాగ్నోస్టిక్స్‌లో నమూనాలపై పరీక్షలు నిర్వహించారు.
Source: జాతీయ | 4 Sep 2009 | 10:38 pm

పుస్తకంపై నిషేధం ఎత్తివేత: జశ్వంత్ హర్షం

గుజరాత్ హైకోర్టు శుక్రవారం రాష్ట్రంలో తాను రాసిన "జిన్నా: భారత్, విభజన, స్వాతంత్ర్ర్యం" పుస్తకంపై నిషేధం ఎత్తివేయడం పట్ల బీజేపీ బహిష్కృత నేత జశ్వంత్ సింగ్ హర్షం వ్యక్తం చేశాడు. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జశ్వంత్ సింగ్ జిన్నాపై రాసిన వివాదాస్పద పుస్తకంపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
Source: జాతీయ | 4 Sep 2009 | 9:38 pm

ముఖ్యమంత్రికి చలనచిత్ర రంగం అశ్రు నివాళి

తెలుగు చలనచిత్ర రంగం శుక్రవారం సాయంత్రం ఫిలిం ఛాంబర్‌లో జరిగిన కార్యక్రమంలో దాదాపు ఇండస్ట్రీ పెద్దలంతా హాజరయ్యారు. హీరో రాజశేఖర్ దంపతులు, జయసుధతోపాటు పలువురు నటీమణులు నివాళులు అర్పించారు. వైఎస్‌ను ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా అభివర్ణించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 4 Sep 2009 | 12:07 pm

సెప్టెంబరు 5న 400 ప్రింట్లతో "జోష్" విడుదల

వాయిదా పడుతూ వస్తున్న నాగచైతన్య జోష్ చిత్రం ఎట్టకేలకు ఈ నెల 5వ తేదీ.. అంటే శనివారం నాడు విడుదల చేయనున్నామని నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌తో తమకిది హ్యాట్రిక్ చిత్రంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Source: Yahoo! Telugu: Entertainment | 4 Sep 2009 | 12:04 pm

వైఎస్.. నాకు స్ఫూర్తి ప్రదాత: రాహుల్ గాంధీ

ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి తనకు స్ఫూర్తి ప్రదాత అని కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ శ్లాఘించారు. ఆయన నుంచి తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నట్టు చెప్పుకొచ్చారు.
Source: ఏపీ న్యూస్ | 4 Sep 2009 | 9:20 am

రాజన్న అస్తమయం: 144 మంది ప్రాణత్యాగం

దేశ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజల హృదయాలను గెలుచుకుని చిరునవ్వులు చిందిస్తూ ఆప్యాయంగా పలుకరించే తమ నేత దుర్మరణ వార్తను తట్టుకోలేక రాష్ట్ర వ్యాప్తంగా 144 మంది ప్రాణాలు కోల్పోయారు.
Source: ఏపీ న్యూస్ | 4 Sep 2009 | 8:45 am

జశ్వంత్ పుస్తకంపై గుజరాత్‌లో నిషేధం ఎత్తివేత

బీజేపీ బహిష్కృత నేత జశ్వంత్ సింగ్ రాసిన పుస్తకంపై గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. జశ్వంత్ సింగ్ "జిన్నా: భారత్, విభజన, స్వాతంత్ర్యం" అనే పేరుతో రాసిన వివాదాస్పద పుస్తకం ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే.
Source: జాతీయ | 4 Sep 2009 | 7:19 am

చికాకు వస్తే సినిమా చూడరట.. మనవరాళ్లతో ఆడుకునేవారట

ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఎప్పుడైనా తీవ్రమైన ఒత్తిడి, చికాకుకి గురైనప్పుడు నేరుగా తన మనవలు, మనవరాళ్ల వద్దకు వెళ్లిపోయి వారితో ఆటలతో కాలక్షేపం చేసేవారట. వైఎస్ తాత తమతో ఆడుకోవడానికి వచ్చారని తెలిసి వారిలో పండుగ చేసుకున్నంత ఆనందం కలిగేదట. ఆటలాడుకుంటూనే "వైఎస్ తాత" వద్ద పేదరాశి పెద్దమ్మ కథలు చెప్పించుకునేవారట.
Source: Yahoo! Telugu: Entertainment | 4 Sep 2009 | 6:46 am

జమ్ము- కాశ్మీర్‌లో చొరబాట్లు పెరిగాయి: ఆర్మీ

జమ్ము- కాశ్మీర్ రాష్ట్రంలోకి పాకిస్థాన్ నుంచి తీవ్రవాద చొరబాట్లు పెరిగాయని ఆర్మీ చీఫ్ జనరల్ దీపక్ కపూర్ శుక్రవారం తెలిపారు. సరిహద్దు చొరబాట్లు రాష్ట్రంలో చొరబాట్లు ఇటీవల పెరుగుతూ వస్తున్నాయని చెప్పారు. శీతాకాలంలోగా సాధ్యమైనంత ఎక్కువ మంది తీవ్రవాదులను భారత్‌లోకి ప్రవేశించేలా చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Source: జాతీయ | 4 Sep 2009 | 6:46 am

జమ్ము- కాశ్మీర్‌లో లష్కరే తీవ్రవాది హతం

జమ్ము- కాశ్మీర్ రాష్ట్రంలోని రెయాసీ జిల్లాలో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబాకు చెందిన ఓ కీలక కమాండర్ హతమయ్యాడు. భద్రతా దళాలు ఈ రోజు ఓ కీలక లష్కరే తీవ్రవాదిని హతమార్చాయని అధికారిక వర్గాలు తెలిపాయి. జిల్లాలోని మహోర్ ప్రాంతంలోని బాటోయి అడవిలో శుక్రవారం ఉదయం భద్రతా దళాలకు, తీవ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి.
Source: జాతీయ | 4 Sep 2009 | 6:29 am

వాజ్‌పేయితో ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ భేటీ

మాజీ ప్రధానమంత్రి, బీజేపీ సీనియర్ నేత అటల్ బీహారీ వాజ్‌పేయిని శుక్రవారం దేశ రాజధానిలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ రావు భగవత్ కలుసుకున్నారు. వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితిని భగవత్ పరామర్శించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇద్దరు నేతలు భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో తాజాగా నెలకొన్న రాజకీయ సంక్షోభంపై కూడా చర్చలు జరిపినట్లు సమాచారం.
Source: జాతీయ | 4 Sep 2009 | 5:40 am