|
తమిళనాడులో ప్రారంభమైన ఎక్స్‌సీడ్ శిక్షాయాత్రదేశ విద్యా వ్యవస్థలో నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టాలనే ప్రధాన ఉద్దేశ్యంతో సమాజసేవా సంస్థ ఐడిస్కరి ఎడ్యుకేషన్ సంస్థ ఎక్స్‌సీడ్ శిక్షాయాత్రా పేరుతో ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ యాత్ర ఈనెల రెండో తేదీ నుంచి చెన్నయ్‌లో ప్రారంభమై, తమిళనాడులోని పలు ప్రాంతాల్లో సాగుతుంది.Source: Yahoo! Telugu: News | 4 Sep 2009 | 9:38 am లాభాలతో పుంజుకుంటున్న స్టాక్ మార్కెట్స్టాక్ మార్కటె లాభాలతో మరింతగా పుంజుకుంటుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 282 పాయింట్లు బలపడి 15,680 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 79 పాయింట్లు లాభపడి 4,673 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 1.83 శాతం, నిఫ్టీ 1.72 శాతం మేరకు వృద్ధి చెందాయి.Source: Yahoo! Telugu: News | 4 Sep 2009 | 9:26 am క్రమశిక్షణకు మారుపేరు వైఎస్సార్ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధను కనబరిచేవారు. ఉదయం వేకువ జామునే లేచి ఓ 20 నిమిషాలు నడక సాగించేవారు. ఒకవేళ ఏదైనా పనివల్ల నడక మిస్ అయినా ట్రెడ్‌మిల్ చేయడాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేసేవారు కాదు.Source: Yahoo! Telugu: News | 4 Sep 2009 | 9:11 am నిలువెత్తు తెలుగుదనానికి నిలువుటద్దం వైఎస్హెటెక్ ప్రపంచం. యువత కొత్త పుంతలు తొక్కుతున్న కాలం. మాతృభాషను మరచి.. పరాయి భాషపై మమకారం పెంచుకుంటున్న యువత. పెదవి తెరిస్తే ఆంగ్లం తప్పా మరోభాష మాట్లాడేందుకు సంకోచించే యువత. ఇలాంటి కాలంలోనూ వైఎస్.. తన మాతృభాషపై మమకారం తగ్గించుకోలేదు.Source: Yahoo! Telugu: News | 4 Sep 2009 | 8:23 am ఆఫ్ఘన్ ఇంధన ట్యాంకర్‌పై నాటో వైమానిక దాడితాలిబాన్ తీవ్రవాదులు హైజాక్ చేసిన ఓ ఇంధన ట్యాంకర్‌పై ఆఫ్ఘనిస్థాన్‌లోని నాటో సైనిక దళాలు వైమానిక దాడి చేశాయి. నాటో దళాలు తాలిబాన్లు హైజాక్ చేసిన ఇంధన ట్యాంకర్‌ను లక్ష్యంగా చేసుకొని వైమానిక దాడి జరిపాయని శుక్రవారం అధికారిక వర్గాలు, సాక్షులు తెలిపారు. ఈ దాడిలో పదుల సంఖ్యలో ప్రాణనష్టం జరిగినట్లు తెలుస్తోంది.Source: Yahoo! Telugu: News | 4 Sep 2009 | 8:13 am 109 పాయింట్లు పుంజుకున్న సెన్సెక్స్స్టాక్ మార్కెట్ 109 పాయింట్లు పుంజుకోవడంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 15,507 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 36 పాయింట్లు లాభపడి 4,630 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.71 శాతం, నిఫ్టీ 0.79 శాతం చొప్పున వృద్ధి చెందాయి.Source: Yahoo! Telugu: News | 4 Sep 2009 | 8:00 am ఆర్థిక వృద్ధి 6.4శాతం ఉండొచ్చు: మూడీస్ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశపు ఆర్థిక వృద్ధి 6.4 శాతం ఉంటుందని రేటింగ్ ఏజెన్సీ మూడీస్ సంస్థ తెలిపింది. ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశీయ ఆర్థిక వృద్ధి పెరగవచ్చని ఆ సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది.Source: Yahoo! Telugu: News | 4 Sep 2009 | 7:34 am ముంబయి మృతులకు నష్టపరిహారం ప్రకటనముంబయి శివారుల్లోని అంధేరిలో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ దుర్ఘటనలో ఇద్దరు బాలలతోపాటు మొత్తం 12 మంది మృతి చెందారు. 13 మంది గాయపడ్డారు. గత రాత్రి ఎల్‌బీఎస్ నగర్‌లోని సాకినాకా వద్ద కొండచరియలు విరిగిపడ్డాయని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో 15- 20 ఇళ్లు దెబ్బతిన్నాయి.Source: Yahoo! Telugu: News | 4 Sep 2009 | 7:33 am ఇడుపులపాయకు పయనమైన వైఎస్ పార్థీవందివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి పార్థీవ దేహాన్ని ఆయనకు అత్యంత ప్రీతిప్రాయమైన ఇడుపులపాయకు తరలించారు. శుక్రవారం మధ్యాహ్నం 12.50 నిమిషాలకు ఎల్బీ స్టేడియం నుంచి వైఎస్ శవపేటికను బేగంపేట విమానాశ్రయానికి తరలించారు.Source: Yahoo! Telugu: News | 4 Sep 2009 | 7:32 am జన సంద్రాన్ని తలపిస్తున్న ఇడుపులపాయరాష్ట్రంలోని కోట్లాది మంది ప్రజల మనస్సుల్లో చెరగని ముద్రవేసుకుని తిరిగిరాని లోకాలకు చేరుకున్న జనహృదయ నేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డిని కడసారి దర్శనం చేసుకుని, కన్నీటి వీడ్కోలు పలికేందుకు జనం తండోపతండాలుగా తరలి వస్తున్నారు.Source: Yahoo! Telugu: News | 4 Sep 2009 | 7:25 am చికాకు వస్తే సినిమా చూడరట.. మనవరాళ్లతో ఆడుకునేవారటముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఎప్పుడైనా తీవ్రమైన ఒత్తిడి, చికాకుకి గురైనప్పుడు నేరుగా తన మనవలు, మనవరాళ్ల వద్దకు వెళ్లిపోయి వారితో ఆటలతో కాలక్షేపం చేసేవారట. వైఎస్ తాత తమతో ఆడుకోవడానికి వచ్చారని తెలిసి వారిలో పండుగ చేసుకున్నంత ఆనందం కలిగేదట. ఆటలాడుకుంటూనే "వైఎస్ తాత" వద్ద పేదరాశి పెద్దమ్మ కథలు చెప్పించుకునేవారట.Source: Yahoo! Telugu: Entertainment | 4 Sep 2009 | 6:46 am వైఎస్ మృతిపట్ల సంతాపం ప్రకటించిన అమెరికాఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ రుద్రకోట కొండను ఢీకొట్టడంతో వైఎస్‌తోపాటు మరో నలుగురు అక్కడికక్కడే మృతి చెందడంతో అమెరికా సంతాపం వ్యక్తం చేసింది.Source: జాతీయ | 4 Sep 2009 | 2:25 am ముంబయి మృతులకు నష్టపరిహారం ప్రకటనముంబయి శివారుల్లోని అంధేరిలో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ దుర్ఘటనలో ఇద్దరు బాలలతోపాటు మొత్తం 12 మంది మృతి చెందారు. 13 మంది గాయపడ్డారు. గత రాత్రి ఎల్‌బీఎస్ నగర్‌లోని సాకినాకా వద్ద కొండచరియలు విరిగిపడ్డాయని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో 15- 20 ఇళ్లు దెబ్బతిన్నాయి.Source: జాతీయ | 4 Sep 2009 | 2:03 am ఇడుపులపాయకు పయనమైన వైఎస్ పార్థీవందివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి పార్థీవ దేహాన్ని ఆయనకు అత్యంత ప్రీతిప్రాయమైన ఇడుపులపాయకు తరలించారు. శుక్రవారం మధ్యాహ్నం 12.50 నిమిషాలకు ఎల్బీ స్టేడియం నుంచి వైఎస్ శవపేటికను బేగంపేట విమానాశ్రయానికి తరలించారు.Source: ఏపీ న్యూస్ | 4 Sep 2009 | 2:03 am విమానంలో మంటలు: సురక్షితంగా ప్రయాణీకులుముంబై విమానాశ్రయంలో ఎయిర్ ఇండియాకు చెందిన విమానం రియాద్ బయలు దేరేందుకు సిద్ధంగానున్న సమయంలో ఇంజన్‌లో సర్ఫింగ్ ప్రారంభమైంది. దీంతో ఇంజన్‌లో మంటలు చెలరేగడంతో సంబంధిత పైలెట్లు వెంటనే విమానంలోని మంటలను అదుపులోకి తీసుకు వచ్చారు.Source: జాతీయ | 4 Sep 2009 | 1:05 am వైఎస్ వారసుని ఎంపిక: రాహుల్‌కు అగ్నిపరీక్షకాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీకి రాజకీయ అగ్నిపరీక్ష ఇపుడు ఎదురైంది. ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్ రాష్ట్రాల్లో తన మార్కు రాజకీయాన్ని ప్రదర్శించి, పార్టీని విజయపథంలో రాహుల్ నడిపి తనలోని రాజకీయ కోణాన్ని ఆవిష్కరించారు.Source: ఏపీ న్యూస్ | 4 Sep 2009 | 12:19 am వైఎస్సార్‌కు సోనియా, మన్మోహన్ నివాళులుఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి జాతి, దేశ రాజకీయ ప్రముఖులు శుక్రవారం ఘన నివాళులు అర్పించారు. బుధవారం ఉదయం నల్లమల అటవీ ప్రాంతంలో జరిగిన ఘోర హెలికాఫ్టర్ ప్రమాదంలో వైఎస్ రాజశేఖరరెడ్డి, మరో నలుగురు అధికారులు దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. వైఎస్సార్ అంతిమయాత్రకు హైదరాబాద్‌లో ఘనంగా ఏర్పాట్లు జరిగాయి.Source: జాతీయ | 4 Sep 2009 | 12:04 am వైఎస్ ఆశయాలను నెరవేర్చుదాం: వైఎస్ జగన్పేదలు, రైతుల సంక్షేమం, అభివృద్ధి కోసం అహర్నిశలు పాటు పడిన తన తండ్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి ఆశయాలు, లక్ష్యాల సాధన కోసం ప్రతి ఒక్కరం కృషి చేద్దామని ఆయన తనయుడు, కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు.Source: ఏపీ న్యూస్ | 3 Sep 2009 | 11:55 pm ఈశాన్య భారతదేశంలో మరోసారి భూకంపందేశంలోని ఈశాన్య భాగంలో మరోసారి భూకంపం సంభవించింది. గడిచిన మూడు వారాల్లో ఈ ప్రాంతంలో నాలుగోసారి భూకంపం సంభవించింది. తాజాగా సంభవించిన స్వల్ప భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.9గా నమోదయింది. శుక్రవారం తెల్లవారుజాముకు ముందు సంభవించిన ఈ భూకంపం కారణంగా స్థానికులు నిద్రలో ఉలిక్కిపడ్డారు.Source: జాతీయ | 3 Sep 2009 | 10:42 pm వైఎస్‌ను బలిగొన్న ప్రమాదంపై దర్యాప్తుకు కమిటీఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రాణాలను బలితీసుకున్న హెలికాఫ్టర్ ప్రమాదంపై దర్యాప్తు జరిపేందుకు కేంద్ర పౌర విమానయాన శాఖ నలుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని నల్లమల అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం జరిగిన ఘోర ప్రమాదంలో వైఎస్సార్ మృతి చెందిన సంగతి తెలిసిందే.Source: జాతీయ | 3 Sep 2009 | 10:10 pm వైఎస్ భౌతికకాయానికి ప్రముఖుల నివాళులురాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి భౌతికకాయాన్ని శుక్రవారం ఉదయం పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు సందర్శించారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, కేంద్ర హోంమంత్రి పి.చిదంబరం, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి రోశయ్య, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ తదితర రాజకీయ ప్రముఖులు సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకొని వైఎస్సార్‌కు ఘనంగా అంతిమ నివాళులు అర్పించారు.Source: ఏపీ న్యూస్ | 3 Sep 2009 | 9:53 pm వైఎస్సార్‌కు రాష్ట్ర ప్రజానీకం ఘన నివాళులుహెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి చెందిన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి రాష్ట్ర ప్రజానీకం ఘన నివాళులు అర్పిస్తోంది. సాధారణ పౌరులు, కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులతోపాటు వైఎస్సార్‌కు నివాళులు అర్పించేందుకు కేంద్ర నాయకులు కూడా శుక్రవారం హైదరాబాద్ వస్తున్నారు. వైఎస్సార్ భౌతికకాయానికి పలువురు ప్రముఖులు ఇప్పటికే నివాళులు అర్పించారు.Source: ఏపీ న్యూస్ | 3 Sep 2009 | 9:39 pm పేదల గుండెల్లో పదిలంగా ఉన్నారు: నటుల సంతాపంముఖ్యమంత్రి వైఎస్ పేదల గుండెల్లో పదిలంగా ఉన్నారని సినీ నటుడు మురళీమోహన్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అనతికాలంలోనే పేదల గుండెల్లో పేరు సంపాదించుకున్న వై.ఎస్. ఇక లేరనే వార్త నమ్మలేక పోతున్నా. ఇంకా క్షేమంగానే ఉన్నారని తెల్లవారుదాకా అనుకున్నా. కేంద్ర ప్రభుత్వం ప్రకటించాక దిగ్ర్భాంతికి గురయ్యాను. ప్రజల మనిషికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సానుభూతిని తెలియజేస్తోంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటోంది.Source: Yahoo! Telugu: Entertainment | 3 Sep 2009 | 2:34 pm స్టుడియోకు స్థలం ఆయనే ఇచ్చారు: రామానాయుడువై.ఎస్.తో తనకు గల సంబంధాన్ని రామానాయుడు నెమరు వేసుకున్నారు. "మద్రాస్ రాజ్‌భవన్‌లో వై.ఎస్. కోసం వేచి ఉన్నాం. బయటకు వస్తూ... నాయుడుగారూ... మీకూ, పద్మాలయాకు 15 ఎకరాల స్థలం ఇస్తున్నామని చెప్పారు. నాకు స్థలం ఇచ్చింది ఆయనే. నా వైజాగ్ స్టూడియోను ఆయన చేతులమీదుగానే ప్రారంభించాను. ఆయన లేరనేది దురదృష్టకరం"Source: Yahoo! Telugu: Entertainment | 3 Sep 2009 | 10:53 am ముఖ్యమంత్రి పదవిపై చర్చించడం సరి కాదు: చిరుఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందడంతో ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికి సహకరించాలని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవిని కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులు కోరారు. దీంతో చిరంజీవి స్పందిస్తూ... ఇంతటి విషాదకరమైన సమయంలో ముఖ్యమంత్రి పదవి గురించి మాట్లాడడం సరైన చర్య కాదని చిరంజీవి వారితో అన్నారు.Source: ఏపీ న్యూస్ | 3 Sep 2009 | 7:39 am ఆయనకోసం రాత్రింబవళ్లు ఎదురు చూశాను : చిరంజీవినా దృష్టిలో వై.ఎస్. ఇంకా బ్రతికే ఉన్నారు. రేపు ఉదయం వస్తారని కోట్లమందితోపాటు నేను రాత్రింబవళ్లు ఎదురుచూశాను. కానీ ఒక్కసారిగా ఆయన లేరనే వార్త జీర్ణించుకోలేకపోయాను. పేదలకు ఎంతో చేశారు. అహర్నిశలూ వారి కోసమే కృషి చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.Source: Yahoo! Telugu: Entertainment | 3 Sep 2009 | 7:37 am వై.ఎస్. లాంటి వ్యక్తి రాడు.. లేడు.. చలన చిత్రరంగం సంతాపంరాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి దుర్మరణంపట్ల తెలుగు చలన చిత్ర రంగ పరిశ్రమ తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేసింది. అటువంటి నాయకుడు ఇక రాడనీ ప్రకటనలో పేర్కొన్నారు. ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, నిర్మాతల మండలి, డైరెక్టర్స్ అసోసియేషన్ గురువారంనాడు వెల్లడించిన ఈ ప్రకటనలో పేర్కొంటూ.. చలన చిత్ర రంగానికి ఎంతో మేలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదైతే, దాన్ని ప్రోత్సహించిన ఘనత వై.ఎస్.దని కీర్తించింది.Source: Yahoo! Telugu: Entertainment | 3 Sep 2009 | 7:32 am జగన్‌ను సీఎం చేద్దాం: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలురాష్ట్ర ముఖ్యమంత్రి ఆకస్మిక మరణంతో తీవ్ర దిగ్భ్రాంతికి లోనైన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. ప్రభుత్వాన్ని నడపగల సమర్థవంతమైన నేత ఎన్నికకు కసరత్తు మొదలుపెట్టారు. పార్టీకోసం ఎంతో సేవ చేసిన వైఎస్ కుటుంబానికి చెందిన వ్యక్తినే ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని తీర్మానించారు. ఈ క్రమంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్ మోహన్ రెడ్డికి ఆ పదవిని కట్టబెట్టాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కోరుతున్నారు.Source: ఏపీ న్యూస్ | 3 Sep 2009 | 7:06 am ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోశయ్యరాష్ట్ర గవర్నర్ విదేశాలలోనుండటంతో ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో కొణజేటి రోశయ్య ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేశారు.Source: ఏపీ న్యూస్ | 3 Sep 2009 | 6:11 am భవిష్యత్ ప్రపంచ రాజధానుల్లో ముంబయిభారత ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబయి మహానగరం "భవిష్యత్ ప్రపంచ రాజధానుల" జాబితాలో చోటు దక్కించుకుంది. విస్తరిస్తున్న పారిశ్రామిక ప్రాబవం, ప్రపంచంలో అతిపెద్ద సినిమా పరిశ్రమ, పెరుగుతున్న మధ్యతరగతి ప్రజానీకంతో ముంబయి మహానగరం భవిష్యత్ ప్రపంచ రాజధానుల్లో ఒక నగరంగా గుర్తింపు పొందుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది.Source: జాతీయ | 3 Sep 2009 | 6:01 am వైఎస్ మృతి: కంటతడి పెట్టిన సోనియా గాంధీఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనేందుకుగాను బుధవారంనాడు హెలికాప్టర్‌లో బయలు దేరి వెళ్ళిన కొద్ది గంటలకే మృత్యువాత పడ్డారు. దీంతో గురువారం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మాట్లాడుతూ...వై.ఎస్. ప్రాణాలతో తిరిగి వస్తారని తాము అనుకున్నామంటూ ఆమె కంట తడిపెట్టారు.Source: జాతీయ | 3 Sep 2009 | 5:57 am ప్రజా సంక్షేమంపైనే వైఎస్సార్ చివరి మాటలురాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చివరిసారి ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం విఫలమైంది. చిత్తూరు జిల్లాలో బుధవారం ఉదయం ఆయన ప్రారంభించాలనుకున్న "రచ్చబండ" కార్యక్రమం విషాదాంతమైంది. జన హృదయాలు గెలుచుకున్న మహాన్నత నేత ప్రజల్లోకి మరోసారి వెళ్లేందుకు అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాతి రోజే చేపట్టిన ఈ యాత్ర ఆయనను తిరిగిరాని లోకాలకు తీసుకెళ్లింది.Source: ఏపీ న్యూస్ | 3 Sep 2009 | 5:37 am వైఎస్ మృతదేహం హైదరాబాద్‌కు తరలింపునల్లమల అడవుల్లో జరిగిన ఘోర హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి చెందిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి భౌతికకాయాన్ని కర్నూలు నుంచి హైదరాబాద్ తీసుకొస్తున్నారు. గురువారం సాయంత్రం 4.35 గంటల సమయంలో వైఎస్ మృతదేహాన్ని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమానంలో కర్నూలు నుంచి అధికారిక యంత్రాంగం హైదరాబాద్ తీసుకెళ్లింది.Source: ఏపీ న్యూస్ | 3 Sep 2009 | 5:19 am జమ్ములో ఉగ్రవాదుల దాడులు: ఇద్దరి మృతిజమ్ము ప్రాంతంలోని రాజౌరీ జిల్లాలో ఉగ్రవాదులు ఓ పోలీసు గస్తీ దళంపై దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో ఇద్దరు జవాన్లు మృతి చెందారు. రాజౌరీ జిల్లాలో ఉగ్రవాదులు ఓ పోలీసు గస్తీ దళంపై దాడులకు పాల్పడటంతో బుధవారం రాత్రి థానా మండీ వద్దనున్న తోతా మోరహా-డోరీమల్ గ్రామాలలో గస్తీ నిర్వహించారు.Source: జాతీయ | 3 Sep 2009 | 5:09 am
|