పాకిస్థాన్‌లో 21 మంది తీవ్రవాదుల హతం

పాకిస్థాన్ భద్రతా దళాలు తాజా పోరులో 21 మంది తాలిబాన్ తీవ్రవాదులను హతమర్చాయి. సమస్యాత్మక మలకాండ్ డివిజన్, పక్కనున్న గిరిజన ప్రాంతాల్లో తిరుగుబాటు గ్రూపులపై భద్రతా దళాలు దాడులు చేశాయి. భద్రతా దళాల దాడిలో తీవ్రవాదుల ఆరుగురు రహస్య స్థావరాలు ధ్వంసమయ్యాయి.
Source: Yahoo! Telugu: News | 3 Sep 2009 | 9:38 am

101 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్

స్టాక్ మార్కెట్ ప్రస్తుతం 101 పాయింట్ల నష్టంతో పయనిస్తుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 101 పాయింట్లు కోల్పోయి 15,366 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 24 పాయింట్లు నష్టపోయి 4,585 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.65 శాతం, నిఫ్టీ 0.51 శాతం మేరకు వృద్ధి చెందాయి.
Source: Yahoo! Telugu: News | 3 Sep 2009 | 9:28 am

సవాలుగా మారిన ఆఫ్ఘన్ పరిస్థితులు: యూఎస్

ఆఫ్ఘనిస్థాన్‌లో ఇటీవల కాలంలో తాలిబాన్లు పేట్రోగిపోతున్నారు. తాలిబాన్ హింసాకాండ నానాటికీ పెరిగిపోతున్న నేపథ్యంలో.. అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి ఇయాన్ కెల్లీ మాట్లాడుతూ.. ఈ సమస్యాత్మక దేశంలో పరిస్థితులు సవాలుగా మారాయన్నారు. తాలిబాన్ల హింసాకాండ కారణంగా అక్కడ తీవ్ర పరిస్థితులు నెలకొని ఉన్నాయన్నారు.
Source: Yahoo! Telugu: News | 3 Sep 2009 | 9:26 am

వై.ఎస్. భౌతిక కాయానికి పూర్తయిన పోస్ట్ మార్టం

రాష్ట్ర ముఖ్యమంత్రి హెలికాప్టర్ క్రాష్ కావడంతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఆయన భౌతిక కాయానికి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించారు.
Source: Yahoo! Telugu: News | 3 Sep 2009 | 9:21 am

వైఎస్ మృతిని జీర్ణించుకోలేకపోతున్న తారలు

నమ్మలేక పోతున్నా: నాగార్జున వై.ఎస్. ఇక లేరనే విషయం నమ్మలేక పోతున్నా. ఆయనది గ్రేట్ విజన్. భవిష్యత్ ఎలా ఉండాలో ప్రజలకు తెలియజెప్పాలనే ఆరాటంగల వ్యక్తి. ఆయన ఇంకా ఉంటే రాష్ట్రం ఇంకా ముందుకెళ్లేది. ఆయన కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తున్నా.
Source: Yahoo! Telugu: News | 3 Sep 2009 | 8:42 am

టాటా టీ పేరును మారుస్తాం: రతన్ టాటా

ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన బ్రాండ్లలో తన స్థానాన్ని పొందుపరచుకునేందుకుగాను టాటా టీ పేరును మార్పు చేయనున్నట్లు కంపెనీ అధినేత రతన్ టాటా పేర్కొన్నారు.
Source: Yahoo! Telugu: News | 3 Sep 2009 | 8:22 am

స్వల్ప లాభాల్లో కొనసాగుతున్న సెన్సెక్స్

స్టాక్ మార్కెట్ ప్రస్తుతం లాభాల్లో కొనసాగుతుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 20 పాయింట్లు పుంజుకుని 15,488 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 12 పాయింట్లు లాభపడి 4,621 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.13 శాతం, నిఫ్టీ 0.26 శాతం మేరకు వృద్ధి చెందాయి.
Source: Yahoo! Telugu: News | 3 Sep 2009 | 8:20 am

వైఎస్ మృతిపట్ల సంతాపం ప్రకటించిన అమెరికా

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ రుద్రకోట కొండను ఢీకొట్టడంతో వైఎస్‌తోపాటు మరో నలుగురు అక్కడికక్కడే మృతి చెందడంతో అమెరికా సంతాపం వ్యక్తం చేసింది.
Source: Yahoo! Telugu: News | 3 Sep 2009 | 7:59 am

కొండను ఢీకొన్న భెల్-430 హెలికాఫ్టర్: ప్రభుత్వం

ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డితో పాటు ఐదుగురు ప్రయాణిస్తున్న భెల్-430 రకం విమానం నల్లమల అడవుల్లో కొండను ఢీకొనడం వల్లే ప్రమాదం జరిగినట్టు రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. మృతదేహాలు ఏమాత్రం గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య స్పష్టం చేశారు.
Source: Yahoo! Telugu: News | 3 Sep 2009 | 7:45 am

ఆయనకోసం రాత్రింబవళ్లు ఎదురు చూశాను : చిరంజీవి

నా దృష్టిలో వై.ఎస్. ఇంకా బ్రతికే ఉన్నారు. రేపు ఉదయం వస్తారని కోట్లమందితోపాటు నేను రాత్రింబవళ్లు ఎదురుచూశాను. కానీ ఒక్కసారిగా ఆయన లేరనే వార్త జీర్ణించుకోలేకపోయాను. పేదలకు ఎంతో చేశారు. అహర్నిశలూ వారి కోసమే కృషి చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.
Source: Yahoo! Telugu: Entertainment | 3 Sep 2009 | 7:37 am

వైఎస్ మృతి తీరని లోటు: కాంగ్రెస్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి బుధవారంనాడు హెలికాప్టర్ క్రాష్ కావడంతో దుర్మరణం పాలైనారు. వైఎస్ మృతి తమ పార్టీకి తీరని లోటని కాంగ్రెస్ అధిష్టానం అభిప్రాయపడింది. వైఎస్ లోటును తామ పార్టీ పూడ్చుకోలేదని పార్టీ తెలిపింది. వైఎస్ దుర్మరణంతో తమ పార్టీ సభ్యులు, కార్యకర్తలు జీర్ణించుకోలేక పోతున్నారని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Source: Yahoo! Telugu: News | 3 Sep 2009 | 7:34 am

వై.ఎస్. లాంటి వ్యక్తి రాడు.. లేడు.. చలన చిత్రరంగం నివాళి

రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి దుర్మరణంపట్ల తెలుగు చలన చిత్ర రంగ పరిశ్రమ తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేసింది. అటువంటి నాయకుడు ఇక రాడనీ ప్రకటనలో పేర్కొన్నారు. ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, నిర్మాతల మండలి, డైరెక్టర్స్ అసోసియేషన్ గురువారంనాడు వెల్లడించిన ఈ ప్రకటనలో పేర్కొంటూ.. చలన చిత్ర రంగానికి ఎంతో మేలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదైతే, దాన్ని ప్రోత్సహించిన ఘనత వై.ఎస్.దని కీర్తించింది.
Source: Yahoo! Telugu: Entertainment | 3 Sep 2009 | 7:32 am

వై.ఎస్. భౌతిక కాయానికి పూర్తయిన పోస్ట్ మార్టం

రాష్ట్ర ముఖ్యమంత్రి హెలికాప్టర్ క్రాష్ కావడంతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఆయన భౌతిక కాయానికి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించారు.
Source: ఏపీ న్యూస్ | 3 Sep 2009 | 3:51 am

వైఎస్ మృతిపట్ల సంతాపం ప్రకటించిన అమెరికా

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ రుద్రకోట కొండను ఢీకొట్టడంతో వైఎస్‌తోపాటు మరో నలుగురు అక్కడికక్కడే మృతి చెందడంతో అమెరికా సంతాపం వ్యక్తం చేసింది.
Source: జాతీయ | 3 Sep 2009 | 2:30 am

కొండను ఢీకొన్న భెల్-430 హెలికాఫ్టర్: ప్రభుత్వం

ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డితో పాటు ఐదుగురు ప్రయాణిస్తున్న భెల్-430 రకం విమానం నల్లమల అడవుల్లో కొండను ఢీకొనడం వల్లే ప్రమాదం జరిగినట్టు రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. మృతదేహాలు ఏమాత్రం గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య స్పష్టం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 3 Sep 2009 | 2:16 am

వైఎస్ మృతి తీరని లోటు: కాంగ్రెస్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి బుధవారంనాడు హెలికాప్టర్ క్రాష్ కావడంతో దుర్మరణం పాలైనారు. వైఎస్ మృతి తమ పార్టీకి తీరని లోటని కాంగ్రెస్ అధిష్టానం అభిప్రాయపడింది. వైఎస్ లోటును తామ పార్టీ పూడ్చుకోలేదని పార్టీ తెలిపింది. వైఎస్ దుర్మరణంతో తమ పార్టీ సభ్యులు, కార్యకర్తలు జీర్ణించుకోలేక పోతున్నారని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Source: జాతీయ | 3 Sep 2009 | 2:04 am

తిరిగిరాని లోకాలకు "ప్రజా జన హృదయ నేత"

రాష్ట్ర ప్రజల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి తిరిగి రాని లోకాలకు చేరుకున్నారు. ఆయన నల్లమల అటవీ ప్రాంతంలోని రుద్రకోట కొండ ప్రాంతంలో జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో మృత్యువాత పడినట్టు ప్రధాన మంత్రి కార్యాలయంతో పాటు.. కేంద్ర హోంశాఖ వర్గాలు గురువారం మధ్యాహ్నం అధికారికంగా వెల్లడించాయి.
Source: ఏపీ న్యూస్ | 3 Sep 2009 | 1:51 am

రాష్ట్రానికి రేపు రానున్న ప్రధాని, సోనియా

దేశ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ వైఎస్ పార్థీవ శరీరాన్ని చూసేందుకు శుక్రవారం హైదరాబాద్ రానున్నారు.
Source: జాతీయ | 3 Sep 2009 | 1:43 am

ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా రోశయ్య: కేంద్రం

రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ క్రాష్ కావడంతో దుర్మణం పాలైనారు. దీంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ కార్యకలాపాలను చూసుకునేందుకుగాను ప్రస్తుత ఆర్థిక మంత్రి రోశయ్యను ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చెపట్టి వ్యవహారాలను చూసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
Source: ఏపీ న్యూస్ | 3 Sep 2009 | 1:35 am

వైఎస్ పార్థీవ శరీరాన్ని హైదరాబాద్‌కు తరలింపు

రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ క్రాష్ కావడంతో బుధవారం దుర్మరణం పాలైనారు. ఆయన పార్థీవ శరీరాన్ని కర్నూలులో పోస్ట్‌మార్టం చేసిన అనంతరం హైదరాబాద్‌కు తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
Source: ఏపీ న్యూస్ | 3 Sep 2009 | 1:29 am

వైఎస్ మృతికి సంతాపంగా తమిళనాడు సెలవు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి బుధవారంనాడు హెలికాప్టర్ క్రాష్ కావడంతో దుర్మరణం పాలైనారు. ఈ నేపథ్యంలో పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, పాండిచ్చేరి ప్రభుత్వాలు సంతాప సూచకంగా శుక్రవారంనాడు సెలవుగా ఈ రోజు ప్రకటించాయి.
Source: జాతీయ | 3 Sep 2009 | 1:02 am

నరకయాతన అనుభవించిన వైఎస్ కుటుంబ సభ్యులు

ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులు 24 గంటల పాటు నరకయాతన అనుభవించారు. తమ కుటుంబ పెద్ద ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన రచ్చ బండ కార్యక్రమానికి వెళుతూ మార్గమధ్యంలో జాడ కనిపించ కుండా పోయారు.
Source: ఏపీ న్యూస్ | 3 Sep 2009 | 12:54 am

హెలికాఫ్టర్ ప్రమాదంలో వైఎస్సార్ దుర్మరణం!

ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి నల్లమల అటవీ ప్రాంతంలోని ఎత్తైన రుద్రకోట కొండపై దుర్మరణం పాలయ్యారు. హైదరాబాద్‌ నుంచి చిత్తూరుకు వెళుతూ ఆచూకీ కనిపించకుండా పోయిన ముఖ్యమంత్రి హెలికాఫ్టర్‌ను 23 గంటల పాటు కనుగొన్న విషయం తెల్సిందే.
Source: ఏపీ న్యూస్ | 2 Sep 2009 | 11:39 pm

ల్యాండ్ క్రాష్ అయిన ముఖ్యమంత్రి హెలికాఫ్టర్!

ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి ప్రయాణం చేసిన భెల్-430 రకం హెలికాఫ్టర్ ల్యాండ్ క్రాష్ అయినట్టు కేంద్ర హోం శాఖతోపాటు.. ప్రధాన మంత్రి కార్యాలయ వర్గాలు ధృవీకరించాయి. ప్రమాదం జరిగిన చోట ఐదు మృతదేహాలు ఉన్నట్టు అనధికార సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వెల్లడించాల్సి వుంది.
Source: ఏపీ న్యూస్ | 2 Sep 2009 | 11:22 pm

జశ్వంత్ నేతృత్వంలో 7న పీఏసీ సమావేశం

జశ్వంత్ సింగ్ నేతృత్వంలో ఈ నెల 7న పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశం జరగబోతుంది. బీజేపీ బహిష్కృత నేత జశ్వంత్ సింగ్‌ను పీఏసీ ఛైర్మన్ పదవి నుంచి తప్పుకోవాలని ఇటీవల ఆ పార్టీ సూచించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పార్లమెంటరీ పదవి నుంచి తప్పుకునేందుకు జశ్వంత్ సింగ్ నిరాకరించారు.
Source: జాతీయ | 2 Sep 2009 | 10:17 pm

హమ్మయ్య.. 23 గంటల ఉత్కంఠతకు పాక్షిక తెర!

ఎట్టకేలకు రాష్ట్ర ప్రజల పూజలు, ప్రార్థనలు ఫలించాయి. వారి పూజాఫలమో.. రాజశేఖరుడు చేసుకున్న అదృష్టమో.. ఏదైతే ఏమోగానీ.. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆచూకీ తెలిసింది.
Source: ఏపీ న్యూస్ | 2 Sep 2009 | 10:05 pm

ముఖ్యమంత్రి హెలికాఫ్టర్ ఆచూకీ లభ్యం!

ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి ప్రయాణిస్తూ మాయమైన హెలికాఫ్టర్‌ను గురువారం ఉదయం వైమానిక దళ అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని వైమానికి దళ కమాండర్ ప్రకటించారు. వైఎస్ ప్రయాణించిన హెలికాఫ్టర్... కర్నూలుకు 40 నాటికన్ మైళ్ళ దూరంలో ఉన్నట్టు తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 2 Sep 2009 | 9:33 pm

వైఎస్ భద్రతపై మన్మోహన్, సోనియా ఆందోళన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆచూకీ గల్లంతవడంపై ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ బుధవారం ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ బుధవారం ఉదయం ఆచూకీ తెలియకుండా పోవడం కలకలం రేపింది. ఆయన ఆచూకీని కనుగొనేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Source: జాతీయ | 2 Sep 2009 | 9:32 pm

ముఖ్యమంత్రి క్షేమంగా తిరిగి వస్తారు: టాలీవుడ్

రాష్ట్రముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి క్షేమంగా తిరిగి వస్తారని టాలీవుడ్ ఆకాంక్షించింది. రేపు జరగాల్సిన సినీ కార్యక్రమాలను నిలిపివేస్తున్నట్లు పలు నిర్మాతలు ప్రకటించారు. మరోవైపు సెప్టెంబరు 3న విడుదల కావాల్సిన జోష్ చిత్రాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు చిత్ర నిర్మాత "దిల్" రాజు ప్రకటించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా చిత్రాన్ని విడుదల చేయడం లేదని తెలిపారు.
Source: Yahoo! Telugu: Entertainment | 2 Sep 2009 | 4:38 pm

నక్సలైట్లకు అంత సామర్థ్యం లేదు: నారాయణన్

ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌పై నక్సలైట్లు విద్రోహ చర్యకు పాల్పడే అవకాశం లేదనీ... అసలు వారికి అంతటి సామర్థ్యం లేదని కేంద్ర భద్రతా సలహాదారు ఎమ్.కె. నారాయణన్ కొట్టి పారేశారు. హెలికాప్టర్ ఆచూకి లేకుండా పోవడం వెనుక పైలట్ తప్పిదమో.. లేదంటే హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తి ఉండటమో కారణమై ఉంటుందన్నారు.
Source: జాతీయ | 2 Sep 2009 | 2:39 pm

రాత్రిపూట కూడా గాలింపు సాగుతుంది: చిదంబరం

ఆచూకీ తెలియని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి ప్రయాణించే హెలికాఫ్టర్‌ కోసం రాత్రి పూట కూడా గాలింపు చర్యలు కొనసాగించనున్నట్టు కేంద్ర హోంమంత్రి పి.చిదంబరం వెల్లడించారు.
Source: జాతీయ | 2 Sep 2009 | 8:14 am

ఇక ముంబై బస్సుల్లో బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు

నిరుడు ముంబైలో జరిగిన తీవ్రవాద దాడులతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ముంబై నగరానికి చెందిన బస్సుల్లో బుల్లెట్ ప్రూఫ్ అద్దాలను ఏర్పాటు చేయాలని నగర పాలక సంస్థ నిర్ణయించింది.
Source: జాతీయ | 2 Sep 2009 | 6:48 am

వైఎస్ మిస్సింగ్: కాంగ్రెస్ అత్యవసర భేటీ!

ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ మిస్సింగ్ కావడం పట్ల కాంగ్రెస్ అధిష్టానం తీవ్ర ఆందోళన చెందుతోంది. దీనిపై చర్చించేందుకు కాంగ్రెస్ అధిష్టానం బుధవారం సాయంత్రం ఐదు గంటలకు పార్టీ అధినేత్రి సోనియా నివాసంలో అత్యవసరంగా సమావేశం కానుంది.
Source: జాతీయ | 2 Sep 2009 | 5:20 am