ప్రధాన నగరాల్లోని వస్తువుల మార్కెట్ల ధరలు

దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో గల మార్కెట్లలో వస్తువుల ధరలు... కోల్హాపూర్ మార్కెట్‌లో చక్కెర ధర (100 కేజీలు) - రూ. 2,874 గుంటూరు మార్కెట్‌లో ఎండుమిరపకాయలు (100 కేజీలు) - రూ. 6,026 హజీరాబాద్ మార్కెట్‌లో సహజవాయువు (1ఎంఎంబీటీయు) - రూ. 145.50 ముంబాయి మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ (1బీబీఎల్) - రూ. 3,420 నిజామాబాద్ మార్కెట్‌లో పసుపు (100 కేజీలు) - రూ. 7,925 ఢిల్లీ మార్కెట్‌లో గోధుమలు (100 కేజీలు) - రూ. 1,150.40
Source: Yahoo! Telugu: News | 1 Sep 2009 | 9:55 am

రష్యా యుద్ధనౌక హైజాక్‌లో పాకిస్థాన్ హస్తం?

సోమాలియా సముద్రపు దొంగలు ఈ ఏడాది ఏప్రిల్‌లో రష్యా యుద్ధనౌకను ఒకదానిని హైజాక్ చేశారు. అయితే ఈ హైజాక్ వ్యవహారం వెనుక పాకిస్థాన్ పౌరుల హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నౌక హైజాక్‌పై జరిపిన దర్యాప్తులో 12 మంది పాకిస్థాన్ పౌరులకు దీనిలో ప్రమేయం ఉన్నట్లు టైమ్స్ నౌ వార్తా ఛానల్ వెల్లడించింది.
Source: Yahoo! Telugu: News | 1 Sep 2009 | 9:51 am

పూణేలో స్వైన్ ఫ్లూతో ఏడేళ్ల బాలిక మృతి

పూణేలో స్వైన్ ఫ్లూతో మంగళవారం ఏడేళ్ల బాలిక మృతి చెందింది. పూణే నగరంలో దేశంలోనే అత్యధిక సంఖ్యలో స్వైన్ ఫ్లూ మరణాలు సంభవించిన సంగతి తెలిసిందే. తాజా మృతితో నగరంలో స్వైన్ ఫ్లూ మరణాల సంఖ్య 32కి చేరుకుంది. దేశవ్యాప్తంగా ఈ ప్రమాదకర వైరస్ ఇప్పటివరకు బలితీసుకున్న ప్రాణాల సంఖ్య 108కి పెరిగింది.
Source: Yahoo! Telugu: News | 1 Sep 2009 | 9:40 am

మాంద్యంతో విద్యుత్‌ ఆదా చేస్తున్న ఆమెరికా

డబ్బుని ఆదా చేయడానికి నగరాలు, పట్టణాల్లోని వీధి దీపాలను ఆపేసే చర్యలు విస్తరించనుంది. ఖర్చులు తగ్గించుకునే విషయంలో భాగంగా వీధి దీపాలు ఎంత సేపు వెలగాలనే సమయంలో మార్పు తీసుకు వచ్చారు. వీధి దీపాలు ఎక్కువ సేపు వెలగడంతో అధిక శక్తి ఖర్చవుతోందని అధికార వర్గాలు వెల్లడించాయి
Source: Yahoo! Telugu: News | 1 Sep 2009 | 9:35 am

మధ్యాహ్నపు ట్రేడ్‌: నష్టాల్లో సెన్సెక్స్

స్టాక్ మార్కెట్ ప్రస్తుతం నష్టాల్లో పయనిస్తుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 134 పాయింట్లు కోల్పోయి 15,532 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 43 పాయింట్లు నష్టపోయి 4,619 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.86 శాతం, నిఫ్టీ 0.93 శాతం మేరకు క్షీణించాయి.
Source: Yahoo! Telugu: News | 1 Sep 2009 | 9:09 am

వైఎస్సార్ తెలివైన వ్యక్తి కాదు: చంద్రబాబు

రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి ఆస్తిపైన విచారణ జరపాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి తెలివైన వ్యక్తి కాదని, వైఎస్‌కు చరిష్మా ఉండేది కాదని, రాజకీయాల్లోకి వచ్చాకే ఆయన బలపడ్డారని బాబు అన్నారు.
Source: Yahoo! Telugu: News | 1 Sep 2009 | 8:59 am

పొరుగు రాష్ట్రాల అక్రమ ప్రాజెక్టులపై అసెంబ్లీలో తీర్మానం

కృష్ణా, గోదావరి నదులపై కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను నియంత్రించాలని కేంద్రాన్ని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి మంగళవారం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. పొరుగు రాష్ట్రాల అక్రమ పాజెక్టులపై ముఖ్యమంత్రి వివరణ ఇస్తూ.. దీనిపై అఖిలపక్షాన్ని ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ వద్దకు తీసుకెళ్లేందుకు తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని స్పష్టం చేశారు.
Source: Yahoo! Telugu: News | 1 Sep 2009 | 8:08 am

50 పాయింట్ల నష్టంతో స్టాక్ మార్కెట్

స్టాక్ మార్కెట్ ప్రస్తుతం 50 పాయింట్ల నష్టంతో పయనిస్తుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 15,617 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 26 పాయింట్లు నష్టపోయి 4,636 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.32 శాతం, నిఫ్టీ 0.56 శాతం మేరకు క్షీణించాయి.
Source: Yahoo! Telugu: News | 1 Sep 2009 | 8:06 am

9 లక్షల టన్నుల చక్కెర కొన్న భారత్

గడచిన మూడు వారాలలో భారత మార్కెట్ దిగుమతి దారులు బ్రెజిల్‌ నుంచి దాదాపు తొమ్మిది లక్షల టన్నుల చక్కెరను దిగుమతి చేసుకున్నారు.
Source: Yahoo! Telugu: News | 1 Sep 2009 | 7:58 am

ఆర్థిక మాంద్యానికి త్వరలో ముగింపు: ప్రధాని

అంతర్జాతీయ ఆర్థిక మాంద్యానికి త్వరలో శుభం కార్డు పడుతుందని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్థిక మాంద్యం వలన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తిరోగమనం చివరి దశకు వచ్చిందన్నారు. రాబోయే నెలల్లో తిరిగి నెమ్మదిగా ఆర్థిక వ్యవస్థ సాధారణ స్థితికి వస్తుందని ప్రధాని తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 1 Sep 2009 | 7:51 am

కలిసి కాఫీ తాగితే "లింకు" పెడతారేమో...? జెన్నీ అనుమానం..!!

ఇండస్ట్రీకి వచ్చాక ఎన్నో విషయాలు నేర్చుకున్నానని జెనీలియా అంటోంది. ఒక వ్యక్తి మనతో పది నిమిషాలు మాట్లాడితే చాలు... అవతలివారు మనల్ని గురించి అంచనాలు వేసేస్తుంటారు. నాక్కూడా ఆ విద్య కాస్త తెలుసు. ఇది కూడా నేను సినిమావాళ్ల దగ్గర నేర్చుకున్నదే. అందుకే మాటల్లో ఎప్పుడూ పొరబడను. ఎదుటి వ్యక్తి స్థాయి.. అన్నింటినీ దృష్టిలో ఉంచుకునే పెదవి కదుపుతానని చెబుతోంది జెనీలియా. తనపై వచ్చిన ప్రేమ రూమర్లపై చెబుతూ... రితేష్ దేశ్‌ముఖ్‌తో ప్రేమాయణం జరిపుతున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని చెబుతోంది. తామిద్దరూ కలిసి రెండే సినిమాల్లో నటించామని చెప్పింది. ఇలాంటి రూమర్లు వస్తాయనే అతనితో కలిసి కనీసం కాఫీ కూడా తాగలేదని ముసి ముసిగా నవ్వుతూ చెప్పింది జెనీలియా.
Source: Yahoo! Telugu: Entertainment | 1 Sep 2009 | 6:22 am

ఉదయభాను మసాజ్ దృశ్యాలు: ఎగబడుతున్న నెట్ లవర్స్

నటీమణుల స్నాన ఘట్టాలు, మసాజ్ చేయించుకుంటున్న దృశ్యాలు నెట్లో దర్శనమివ్వటం కొత్తకాదు. తాజాగా ఉదయభాను ( నటి, యాంకర్) మసాజ్ చేయించుకుంటున్న దృశ్యాలు నెట్‌లో దర్శనమిచ్చాయట. సుమారు 20 నిమిషాలు నిడివిగల ఈ వీడియోలో వైట్ టవల్‌ను చుట్టుకుని ఉన్న ఉదయభాను చైనా యువతితో మసాజ్ చేయించుకున్నదట. దీంతో ఆ వీడియో చూసేందుకు నెట్ వీక్షకులు ఎగబడుతున్నారట. ఆమె అభిమానులు ఆ దృశ్యాలను చూసి లొట్టలేసుకుంటున్నారట. ఇంటిలో తన అమ్మపోరు పడలేక, ఆమె నుంచి విడిపోయిన ఉదయభాను విజయవాడలోని ఐలాపురం స్టార్ హోటల్ మనవడిని వివాహమాడిన సంగతి తెలిసిందే.
Source: Yahoo! Telugu: Entertainment | 1 Sep 2009 | 4:58 am

పూణేలో స్వైన్ ఫ్లూతో ఏడేళ్ల బాలిక మృతి

పూణేలో స్వైన్ ఫ్లూతో మంగళవారం ఏడేళ్ల బాలిక మృతి చెందింది. పూణే నగరంలో దేశంలోనే అత్యధిక సంఖ్యలో స్వైన్ ఫ్లూ మరణాలు సంభవించిన సంగతి తెలిసిందే. తాజా మృతితో నగరంలో స్వైన్ ఫ్లూ మరణాల సంఖ్య 32కి చేరుకుంది. దేశవ్యాప్తంగా ఈ ప్రమాదకర వైరస్ ఇప్పటివరకు బలితీసుకున్న ప్రాణాల సంఖ్య 108కి పెరిగింది.
Source: జాతీయ | 1 Sep 2009 | 4:10 am

కాంగ్రెస్ పార్టీలో ఎవరినిపడితే వారిని తీసుకోం: సీఎం

తెలంగాణ రాష్ట్ర సమితి, తెలుగుదేశం పార్టీల నుంచి ప్రముఖ సినీ తారలు రోజా, విజయశాంతిలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే దిశగా ప్రయత్నాలు సాగిస్తోన్న నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీలోకి ఎవరిని బడితే వారిని తీసుకోమని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాబలం, సచ్చీలైతే పార్టీ ప్రవేశానికి అర్హతగా పేర్కొన్నారు.
Source: ఏపీ న్యూస్ | 1 Sep 2009 | 4:10 am

వైఎస్సార్ తెలివైన వ్యక్తి కాదు: చంద్రబాబు

రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి ఆస్తిపైన విచారణ జరపాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి తెలివైన వ్యక్తి కాదని, వైఎస్‌కు చరిష్మా ఉండేది కాదని, రాజకీయాల్లోకి వచ్చాకే ఆయన బలపడ్డారని బాబు అన్నారు.
Source: ఏపీ న్యూస్ | 1 Sep 2009 | 3:30 am

పొరుగు రాష్ట్రాల అక్రమ ప్రాజెక్టులపై అసెంబ్లీలో తీర్మానం

కృష్ణా, గోదావరి నదులపై కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను నియంత్రించాలని కేంద్రాన్ని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి మంగళవారం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. పొరుగు రాష్ట్రాల అక్రమ పాజెక్టులపై ముఖ్యమంత్రి వివరణ ఇస్తూ.. దీనిపై అఖిలపక్షాన్ని ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ వద్దకు తీసుకెళ్లేందుకు తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని స్పష్టం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 1 Sep 2009 | 2:39 am

ఆర్థిక మాంద్యానికి త్వరలో ముగింపు: ప్రధాని

అంతర్జాతీయ ఆర్థిక మాంద్యానికి త్వరలో శుభం కార్డు పడుతుందని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్థిక మాంద్యం వలన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తిరోగమనం చివరి దశకు వచ్చిందన్నారు. రాబోయే నెలల్లో తిరిగి నెమ్మదిగా ఆర్థిక వ్యవస్థ సాధారణ స్థితికి వస్తుందని ప్రధాని తెలిపారు.
Source: జాతీయ | 1 Sep 2009 | 2:21 am

అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన కాగ్ నివేదిక వివరాలివే..!

కాగ్ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం సభలో ప్రవేశపెట్టింది. ఈ నివేదికలో రెవెన్యూ నష్టం, వాహనపన్ను, భూమిశిస్తు, వంటి పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. వీటిలో ముఖ్యమైనవి: * ఇరిగేషన్ రెవెన్యూ శాఖల మధ్య సమన్వయలోపం కారణంగా రూ. 165. 48 కోట్ల రాయల్టీ వసూలు కాలేదు. * 3 ఇరిగేషన్ డివిజన్లలో విద్యత్ ఉత్పాదక సంస్థలపై రూ. 68 కోట్ల రాయల్టీని తక్కువగా విధించారు. * 3 ఇరిగేషన్ డివిజన్లలో విద్యత్ ఉత్పాదక సంస్థలపై రూ. 68 కోట్ల రాయల్టీని తక్కువగా విధించారు.
Source: ఏపీ న్యూస్ | 1 Sep 2009 | 1:07 am

దావూద్‌తో నేపాల్ యువరాజుకి సంబంధాలు

నేపాల్ మాజీ యువరాజు పారస్‌కు భారత మోస్ట్‌వాంటెడ్ తీవ్రవాదితో సంబంధాలు ఉన్నట్లు మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్టు చేసిన నేపాలీ పౌరులు వెల్లడించారు. మధ్యప్రదేశ్ తీవ్రవాద నిరోధక దళం ఇటీవల నకిలీ నోట్ల ముఠా గట్టురట్టు చేసింది. ఈ ముఠాలోని నేపాల్ పౌరులను పోలీసులు విచారించగా ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.
Source: జాతీయ | 1 Sep 2009 | 12:52 am

ప్రశాంతంగా ఉత్తర తెలంగాణ బంద్‌

రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మంగళవారం బంద్‌కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మంగళవారం బంద్ ప్రశాంతంగా జరుగుతోంది.
Source: ఏపీ న్యూస్ | 1 Sep 2009 | 12:34 am

నేటితో సమాప్తం కానున్న అసెంబ్లీ సమావేశాలు

శాసనసభ బడ్జెట్ సమావేశాలు మంగళవారంతో సమాప్తం కానున్నాయి. చివరిరోజైన నేడు 2009-10 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్య వినిమయ బిల్లును సభ ఆమోదించాల్సి ఉంది. అలాగే కృష్ణా, గోదావరి నదులపై ఇతర రాష్ట్రాలు నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టుల వ్యవహారాన్ని కూడా ఇవాళ సభలో చర్చించనున్నారు.
Source: ఏపీ న్యూస్ | 1 Sep 2009 | 12:22 am

భారత గగనతలంలోకి చైనా హెలికాఫ్టర్: ఆర్మీ

చైనా మిలిటరీ హెలికాఫ్టర్ ఒకటి భారత గగనతలంలోకి వచ్చిందని ఆర్మీ చీఫ్ జనరల్ దీపక్ కపూర్ సోమవారం వెల్లడించారు. జమ్ము- కాశ్మీర్ రాష్ట్రంలోకి రెండు నెలల క్రితం చైనా హెలికాఫ్టర్ ప్రవేశించిందని, ఈ విషయాన్ని ఆ దేశ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని దీపక్ కపూర్ తెలిపారు. లెహ్‌లోని వాస్తవాధీన రేఖను దాటి చైనా హెలికాఫ్టర్ భారత్ గగనతలంలోకి వచ్చింది.
Source: జాతీయ | 31 Aug 2009 | 11:51 pm

లాల్‌గఢ్: లొంగిపోయిన 700 మంది నక్సల్స్

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో సోమవారం సీబీఐ- ఎంఎల్ (లిబరేషన్) వర్గానికి చెందిన 700 మంది కార్యకర్తలు స్వచ్ఛందంగా కోర్టులో లొంగిపోయారు. లాల్‌గఢ్ ప్రాంతం నుంచి భద్రతా దళాలను వెంటనే ఉపసంహరించాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
Source: జాతీయ | 31 Aug 2009 | 10:13 pm

రాజ్‌నాథ్, అద్వానీయే నిర్ణయించుకోవాలి: మోహన్

బీజేపీ నేతలు ఎల్‌కే అద్వానీ, రాజ్‌నాథ్ సింగ్‌లు పార్టీలో తమ పాత్ర ఎలా ఉండాలో వారే నిర్ణయించుకోవాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సూచించారు. పార్టీలో తాము నిర్వహిస్తున్న పదవులను ఎల్‌కే అద్వానీ, రాజ్‌నాథ్ సింగ్‌లు విడిచిపెట్టనున్నట్లు వచ్చిన వార్తలకు బలం చేకూర్చేలా మోహన్ భగవత్ పైవ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Source: జాతీయ | 31 Aug 2009 | 9:44 pm

మెంటల్ కృష్ణ' ఫేమ్ పోసాని హీరోగా "తింగరోడు"

తెలుగు ప్రేక్షకులు మెచ్చిన ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తీర్చిదిద్దిన సుప్రసిద్ధ దర్శకులు కె. వాసు.. తాజాగా మెంటల్ కృష్ణ ఫేమ్ పోసాని కృష్ణమురళితో "తింగరోడు" అనే కొత్త సినిమాను రూపొందించనున్నారు. గాయత్రి ఆర్ట్స్ పతాకంపై నిర్మితమవుతోన్న ఈ చిత్రం సోమవారం (ఆగస్టు31వ తేదీన) ఫిలింఛాంబర్‌లో లాంఛనంగా ప్రారంభమైంది.
Source: Yahoo! Telugu: Entertainment | 31 Aug 2009 | 12:20 pm

విజయదశమికి "ఉదయబాబు" రెండో చిత్రం

ప్రముఖ హాస్యనటుడు బాబూమోహన్ తనయుడు ఉదయబాబు హీరోగా రెండో చిత్రం ప్రారంభానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మొదటి చిత్రం "శ్రీ మేడారం సమ్మక్క సారక్క మహాత్మ్యం" ద్వారా ఉదయబాబు ఫైట్స్, డ్యాన్స్‌లలోనే కాదు హీరో పాత్ర పోషణలో కూడా మంచి నటనను ప్రదర్శించిన విషయం తెలిసిందే. అనిల్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎడ్ల జోగిరెడ్డి, వి. సత్యనారాయణ గౌడ్‌లు నిర్మిస్తున్నారు. ఉదయబాబు కథానాయకుడిగా పరిచయమైన సమ్మక్క సారక్క మహాత్మ్యం చిత్రానికి దర్శకత్వం వహించిన వేముగంటి ఈ తాజా చిత్రానికి కూడా దర్శకత్వం వహించనున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 31 Aug 2009 | 11:20 am

సోషియో మైథిలాజికల్ చిత్రంగా "శబరి"

"శబరి" అనే పేరుతో సోషియో మైథిలాజికల్ చిత్రం రూపొందుతోంది. నరసింహారెడ్డి, రవిచాట్ల నిర్మిస్తోన్న ఈ చిత్రానికి జయశేఖర్ కల్లు దర్శకత్వం వహిస్తున్నారు. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా ప్రారంభమైన ఈ చిత్రం నలభై రోజుల పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఏకధాటిగా జరిగిన సింగిల్ షెడ్యూల్‌తో షూటింగ్‌ను పూర్తి చేసుకుంది.
Source: Yahoo! Telugu: Entertainment | 31 Aug 2009 | 10:44 am

విలన్‌గా అవతారమెత్తనున్న నందమూరి హీరో..!

నందమూరి వంశంలో హీరోలుగా ఎదగాలని ఆశపడుతున్న వారిలో తారకరత్న ఒకరు. ఏకంగా 9 చిత్రాల షూటింగ్‌లు ఒకేసారి జరిపి దిష్టిపోతుందని అనుకున్నా.. అందులో మూడు చిత్రాలు మినహా ఏవీ షూటింగ్‌కు నోచుకోలేదు. ఆ తర్వాత అరకొర చిత్రాలు చేసినా అంతగా గుర్తింపు రాలేదు. దీంతో ఇక హీరో వేషాలకు స్వస్తి చెప్పి.. విలన్ వేషాలకు సిద్ధమయ్యాడు.ఇందులో భాగంగా "అమరావతి" అనే చిత్రంలో తారకరత్న విలన్‌గా నటిస్తున్నాడు. అల్లరి రవిబాబు దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కనుంది. ఈ చిత్రం ద్వారానైనా తనకు గుర్తింపు వస్తుందని తారకరత్న ఆశిస్తున్నాడు.
Source: Yahoo! Telugu: Entertainment | 31 Aug 2009 | 10:15 am

'కౌ బాయ్‌''గా వస్తోన్న "క్విక్ గన్ మురుగన్"

విశ్వంలోని ప్రతిదానిలో జీవం ఉన్నట్లయితే.. చెట్లు, ఆకుకూరలు, కాయగూరల్లోనూ జీవం ఉండబట్టే ఎదుగుదల ఉంటుంది. మరీ దాన్ని కోసి తింటుంటే అదికూడా మాంసాహారమేగా..? అని మాంసాహారులు ప్రశ్నింస్తుంటారు. ఏది ఏమైనా ఇదే నేపథ్యంలో రాజేంద్రప్రసాద్ "క్విక్ గన్ మురుగన్" చిత్రం రాబోతోంది. ఇందులో తాను కౌబాయ్‌గా నటించానని, "మైండ్ ఇట్" అనేది ఇందులో తన ఊతపదమని రాజేంద్రప్రసాద్ వెల్లడించారు. అప్పుడప్పుడు నోటికొచ్చిన ఇంగ్లీషును మాట్లాడుతుంటానని.. అందులో కాస్త తమిళయాస కూడా ఉంటుందని రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఈ సినిమా డైలాగ్‌లతో రింగ్‌టోన్లు కూడా తయారు చేశారని చెప్పుకొచ్చారు. ఇకపోతే సెక్సీతార రంభ క్విక్ గన్ మురుగన్‌లో నృత్యకారిణిగా నటించింది. ఈ చిత్రాన్ని చూసి అమీర్‌ఖాన్ కూడా మెచ్చుకున్నాడట. మరి ఈ చిత్రం ఇంకా తెలుగులో విడుదల కావాల్సి ఉంది.
Source: Yahoo! Telugu: Entertainment | 31 Aug 2009 | 9:59 am

సాహితీవనంలో అందమైన "పురుగు" ఆరుద్ర

కవి, విమర్శకుడు, సాహిత్య చరిత్రకారుడు, సామాజిక శాస్త్రవేత్త, మార్క్సిస్టు మేధావి.. ఇలా అన్నింటినీ మించి ఒక మంచి మానవుడు, సహృదయుడు, స్నేహశీలి అయిన ఆరుద్ర జీవితప్రస్థానం ఒక ఇతిహాసం, ఒక సాహిత్య సాంస్కృతిక సుదర్శనం. అభ్యుదయ కవులలో శ్రీశ్రీ మొదటి తరానికి చెందితే, ఆరుద్ర రెండవ తరానికి చెందినవాడు, ఒకే ఒక్కడు. నేడు ఆ ఒకే ఒక్కడి జన్మదినం. ఈ సందర్భంగా ఆయన స్మృతిలో...
Source: Yahoo! Telugu: Entertainment | 31 Aug 2009 | 9:20 am

పదో తరగతిలో గ్రేడింగ్ విధానానికి గ్రీన్ సిగ్నల్

పదో తరగితిలో గ్రేడింగ్ విధానాన్ని అమలు చేయనున్నట్లు కేంద్ర మానవ వనరుల శాఖామంత్రి కపిల్ సిబాల్ సోమవారం ప్రకటించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ విధానాన్ని పదోతరగతితోపాటు సీబీఎస్ఈలో అమలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
Source: జాతీయ | 31 Aug 2009 | 9:13 am

డీఎస్సీ- 2008 నియామకాలకు తొలగిన అడ్డంకులు

2008 డీఎస్సీలో 30శాతం సెకండరీ గ్రేడ్ టీచర్స్ (ఎస్‌జీటీ) పోస్టులను డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (డీఎడ్) విద్యార్థులకు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవోను సవాల్ చేస్తూ బీఎడ్ విద్యార్థులు వేసిన పిటీషన్‌ను అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ సోమవారం తోసి పుచ్చింది.
Source: ఏపీ న్యూస్ | 31 Aug 2009 | 8:09 am

శ్రీవారి ఆభరణాల విలువ తేల్చాలి: జయప్రకాష్

శ్రీవారికి ఉన్న ఆభరణాల విలువను నిపుణుల కమిటీతో లెక్కతేల్చాలని లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్ డిమాండ్ చేశారు. సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో తితిదే నగలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తితిదేలో అవకతవకలు ఉన్న మాట వాస్తవమేనన్నారు.
Source: ఏపీ న్యూస్ | 31 Aug 2009 | 7:12 am

నిమజ్జనంలో విషాదం.. ఆరుగురి జలసమాధి

నిజామాబాద్ జిల్లాలో సోమవారం జరిగిన గణేష్ నిమజ్జనోత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. బీర్‌కూర్‌ మండలం బరంగేడ్గి గ్రామంలో నిమజ్జనం సందర్భంగా ఆరుగురు యువకులు జలసమాధి అయ్యారు. మరో యువకుడు గల్లంతయ్యాడు.
Source: ఏపీ న్యూస్ | 31 Aug 2009 | 6:55 am

మెంటల్ కృష్ణ' ఫేమ్ పోసాని హీరోగా "తింగరోడు"

తెలుగు ప్రేక్షకులు మెచ్చిన ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తీర్చిదిద్దిన సుప్రసిద్ధ దర్శకులు కె. వాసు.. తాజాగా మెంటల్ కృష్ణ ఫేమ్ పోసాని కృష్ణమురళితో "తింగరోడు" అనే కొత్త సినిమాను రూపొందించనున్నారు. గాయత్రి ఆర్ట్స్ పతాకంపై నిర్మితమవుతోన్న ఈ చిత్రం సోమవారం (ఆగస్టు31వ తేదీన) ఫిలింఛాంబర్‌లో లాంఛనంగా ప్రారంభమైంది.
Source: వినోదం | 31 Aug 2009 | 6:52 am

మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు: ఈసీ ప్రకటన

దేశంలో మూడు రాష్ట్రాల అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్‌ను సోమవారం ప్రకటించింది. మహారాష్ట్ర, హర్యానా, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు అక్టోబరు 13వ తేదీన ఎన్నికలు జరుగనున్నాయి.
Source: జాతీయ | 31 Aug 2009 | 6:41 am

నా శరీరాన్ని స్వేచ్ఛగా ఉంచుతా: మీరా చోప్రా

"బంగారం" చిత్రంతో ముందుకు వచ్చిన భామ మీరా చోప్రాకు బంగారమంటేనే ఇష్టముండదట. నగలను ధరిస్తే ఒళ్లంతా పట్టేసిన భావం కలుగుతుందట. తన శరీరం ఎప్పుడూ స్వేచ్ఛగా ఉంచేందుకు తాను ఇష్టపడతానని చెపుతోందట. అయితే.. జగన్మోహినిలో యువరాణిలా నటిస్తున్నావు కదా.. మరి ఆ పాత్రకు నగలు నట్రా ధరించాల్సి వుంటుంది కదా... అని ఎవరైనా అంటే, సినిమా వరకే కనుక ఎలాకొలా నా శరీరాన్ని ఒప్పించుకుని నటిస్తున్నాను. నిజానికి ఒంటినిండా ఆభరణాలతో నటించాలంటే నాకసలు ఇష్టమే ఉండదు. ఈమధ్య వచ్చిన గ్యాప్ గురించి చెబుతూ... "సినిమానే ప్రపంచం కాదు. దాన్ని మించిన లోకం చాలా పెద్దది. ఖాళీ సమయల్లో నేను తీరిగ్గా గోళ్లు గిల్లుకుంటూ కూచోను. నాకు నచ్చిన హోటల్ ఇండస్ట్రీలో దిగాను. అన్ని నగరాల్లో నా బ్రాండ్ పేరుతో చెయిన్ ఆఫ్ హోటళ్లను ప్రారంభించాలన్నది నా చిరకాల వాంఛ" అని చెప్పింది. అందుకే ఢిల్లీలో తన తండ్రి పేరుకూడా కలిసివచ్చే "మిరాజ్" పేరుతో ఈ పరిశ్రమలో కాలిడింది. గొప్ప స్థాయిలో ఈ రంగంలో దూసుక వెళతానని చెబుతోంది. ముక్కుమీద కోపం ఉన్న ఈ అమ్మడికి అదే సూటవుతుందని కొందరు "చోప్రా" బాధితులు అంటున్నారట.
Source: Yahoo! Telugu: Entertainment | 31 Aug 2009 | 6:27 am

సాహితీవనంలో అందమైన "పురుగు" ఆరుద్ర

కవి, విమర్శకుడు, సాహిత్య చరిత్రకారుడు, సామాజిక శాస్త్రవేత్త, మార్క్సిస్టు మేధావి.. ఇలా అన్నింటినీ మించి ఒక మంచి మానవుడు, సహృదయుడు, స్నేహశీలి అయిన ఆరుద్ర జీవితప్రస్థానం ఒక ఇతిహాసం, ఒక సాహిత్య సాంస్కృతిక సుదర్శనం. అభ్యుదయ కవులలో శ్రీశ్రీ మొదటి తరానికి చెందితే, ఆరుద్ర రెండవ తరానికి చెందినవాడు, ఒకే ఒక్కడు. నేడు ఆ ఒకే ఒక్కడి జన్మదినం. ఈ సందర్భంగా ఆయన స్మృతిలో...
Source: వినోదం | 31 Aug 2009 | 6:11 am

"హాసిని"గా వస్తోన్న 'ప్రేమిస్తే' ఫేమ్ సంధ్య

"ప్రేమిస్తే" ఫేమ్ సంధ్య "హాసిని"గా నటిస్తోంది. "అన్నవరం" చిత్రంలో పవన్‌కళ్యాణ్ చెల్లెలుగా నటించిన తర్వాత తెలుగులో తాను నటిస్తోన్న లేడిఓరియెంటెడ్ సినిమా ఇదని సంధ్య చెప్పింది. బుధవారం రాత్రి అన్నపూర్ణ స్టూడియోలో ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది. "అభి" ఫేమ్ కమలాకర్ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. బి.వి. రమణారెడ్డి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రానికి బి. కమలాకర్ రెడ్డి నిర్మాణ పగ్గాలు చేపట్టారు.
Source: వినోదం | 31 Aug 2009 | 6:10 am

సోదర భావానికి ప్రతీక "ఖాదిగుల్షన్ షరీఫ్ దర్గా"

హిందూ, ముస్లిం మత సామరస్యానికి, సోదర భావానికి ప్రతీకగా... సుమారు 300 సంవత్సరాల చరిత్ర కలిగినది "ఖాదిగుల్షన్ షరీఫ్ దర్గా". ఆంధ్రప్రదేశ్‌లోని కరీంనగర్ జిల్లా, రామగుండం మండలం, అల్లూరు గ్రామంలో ఉన్న ఈ మహిమాన్వితమైన దర్గాను సందర్శించని వారుండరంటే అతిశయోక్తి కాదు. ప్రతి సంవత్సరం నిర్వహించే ఉరుసు ఉత్సవానికి వివిధ జిల్లాలు, రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావడమే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు.
Source: వినోదం | 31 Aug 2009 | 6:03 am

బిల్లాతో "డార్లింగ్" అనిపించుకోనున్న కాజల్ అగర్వాల్!

అత్యున్నత ప్రమాణాలతో టాలీవుడ్‌లో సరికొత్త రికార్డు సృష్టించిన బ్లాక్ బస్టర్ మూవీ "మగధీర". 'చిరుత'నయుడు రామ్‌చరణ్ తేజ హీరోగా నటించిన ఈ చిత్రంలో అందాల సుందరి కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు సంపాదించిన కాజల్ అగర్వాల్ రిలాక్స్ కాకుండా మరో చిత్రంలో నటించేందుకు అగ్రిమెంట్లో సంతకాలు కూడా చేసేసింది. మగధీరతో పాటు రామ్ హీరోగా నటిస్తోన్న "గణేష్" చిత్రంలో కథానాయికగా ప్రేక్షకులను అలరించనున్న కాజల్ అగర్వాల్.. త్వరలో "బిల్లా" హీరో ప్రభాస్‌తో "డార్లింగ్" అనిపించుకోనుంది. ఇంతకీ విషయమేమిటంటే...? కరుణాకరన్ దర్శకత్వంలో ఛత్రపతి ప్రసాద్ నిర్మిస్తోన్న వైవిధ్యమైన ప్రేమకథా చిత్రంలో ప్రభాస్ సరసన కాజల్ అగర్వాల్ నటించనుందని టాలీవుడ్ వర్గాల సమాచారం. దీనికి తోడు "ఆర్య-2"లో స్టైలిష్ హీరో అల్లు అర్జున్‌తో కూడా జతకట్టనుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
Source: Yahoo! Telugu: Entertainment | 31 Aug 2009 | 5:52 am

విజయదశమికి "ఉదయబాబు" రెండో చిత్రం

ప్రముఖ హాస్యనటుడు బాబూమోహన్ తనయుడు ఉదయబాబు హీరోగా రెండో చిత్రం ప్రారంభానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మొదటి చిత్రం "శ్రీ మేడారం సమ్మక్క సారక్క మహాత్మ్యం" ద్వారా ఉదయబాబు ఫైట్స్, డ్యాన్స్‌లలోనే కాదు హీరో పాత్ర పోషణలో కూడా మంచి నటనను ప్రదర్శించిన విషయం తెలిసిందే. అనిల్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎడ్ల జోగిరెడ్డి, వి. సత్యనారాయణ గౌడ్‌లు నిర్మిస్తున్నారు. ఉదయబాబు కథానాయకుడిగా పరిచయమైన సమ్మక్క సారక్క మహాత్మ్యం చిత్రానికి దర్శకత్వం వహించిన వేముగంటి ఈ తాజా చిత్రానికి కూడా దర్శకత్వం వహించనున్నారు.
Source: వినోదం | 31 Aug 2009 | 5:51 am

సోషియో మైథిలాజికల్ చిత్రంగా "శబరి"

"శబరి" అనే పేరుతో సోషియో మైథిలాజికల్ చిత్రం రూపొందుతోంది. నరసింహారెడ్డి, రవిచాట్ల నిర్మిస్తోన్న ఈ చిత్రానికి జయశేఖర్ కల్లు దర్శకత్వం వహిస్తున్నారు. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా ప్రారంభమైన ఈ చిత్రం నలభై రోజుల పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఏకధాటిగా జరిగిన సింగిల్ షెడ్యూల్‌తో షూటింగ్‌ను పూర్తి చేసుకుంది.
Source: వినోదం | 31 Aug 2009 | 5:15 am

మహారాష్ట్ర సమరం: భాజపా-సేన పొత్తు ఖరారు!

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ, శివసేన పార్టీల మధ్య పొత్తు ఖరారైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కుదుర్చుకున్న ఒప్పందం మేరకే ఈ తాజా ఒప్పందం కుదిరినట్టు ఇరు పార్టీల వర్గాలు వెల్లడించాయి.
Source: జాతీయ | 31 Aug 2009 | 5:13 am

దేశ రాజకీయ నేతల్లో స్వైన్ ఫ్లూ లక్షణాలు!

ప్రపంచ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న స్వైన్ ఫ్లూ వైరస్.. రాజకీయ నేతలను సైతం వదిలేలా కనిపించడం లేదు. దేశంలోని పలువురు రాజకీయ నేతలకు ఈ వైరస్ సోకినట్టు తెలుస్తోంది. వివిధ పనుల నిమిత్తం ఢిల్లీకి రాకపోకలు సాగించే నేతల్లో పెక్కుమందికి ఈ వైరస్ లక్షణాలు కనిపిస్తున్నట్టు తెలుస్తోంది.
Source: జాతీయ | 31 Aug 2009 | 4:33 am

'కౌ బాయ్‌''గా వస్తోన్న "క్విక్ గన్ మురుగన్"

విశ్వంలోని ప్రతిదానిలో జీవం ఉన్నట్లయితే.. చెట్లు, ఆకుకూరలు, కాయగూరల్లోనూ జీవం ఉండబట్టే ఎదుగుదల ఉంటుంది. మరీ దాన్ని కోసి తింటుంటే అదికూడా మాంసాహారమేగా..? అని మాంసాహారులు ప్రశ్నింస్తుంటారు. ఏది ఏమైనా ఇదే నేపథ్యంలో రాజేంద్రప్రసాద్ "క్విక్ గన్ మురుగన్" చిత్రం రాబోతోంది. ఇందులో తాను కౌబాయ్‌గా నటించానని, "మైండ్ ఇట్" అనేది ఇందులో తన ఊతపదమని రాజేంద్రప్రసాద్ వెల్లడించారు. అప్పుడప్పుడు నోటికొచ్చిన ఇంగ్లీషును మాట్లాడుతుంటానని.. అందులో కాస్త తమిళయాస కూడా ఉంటుందని రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఈ సినిమా డైలాగ్‌లతో రింగ్‌టోన్లు కూడా తయారు చేశారని చెప్పుకొచ్చారు. ఇకపోతే సెక్సీతార రంభ క్విక్ గన్ మురుగన్‌లో నృత్యకారిణిగా నటించింది. ఈ చిత్రాన్ని చూసి అమీర్‌ఖాన్ కూడా మెచ్చుకున్నాడట. మరి ఈ చిత్రం ఇంకా తెలుగులో విడుదల కావాల్సి ఉంది.
Source: వినోదం | 31 Aug 2009 | 4:30 am

తితిదే అంతటా అవినీతి మయం: చిరంజీవి

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం అంతటా అవినీతిమయమైందని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ఆరోపించారు. తితిదేలో ఎలాంటి పొరపాట్లు జరగడం లేదని పాలకపక్షం సభ్యులు గుండెలపై చేయి వేసుకుని చెప్పగలరా అని ఆయన ప్రశ్నించారు.
Source: ఏపీ న్యూస్ | 31 Aug 2009 | 4:16 am