|
ప్రధాన నగరాల్లోని వస్తువుల మార్కెట్ల ధరలుదేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో గల మార్కెట్లలో వస్తువుల ధరలు... కోల్హాపూర్ మార్కెట్‌లో చక్కెర ధర (100 కేజీలు) - రూ. 2,876 గుంటూరు మార్కెట్‌లో ఎండుమిరపకాయలు (100 కేజీలు) - రూ. 6,058 హజీరాబాద్ మార్కెట్‌లో సహజవాయువు (1ఎంఎంబీటీయు) - రూ. 148.20 ముంబాయి మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ (1బీబీఎల్) - రూ. 3,555 నిజామాబాద్ మార్కెట్‌లో పసుపు (100 కేజీలు) - రూ. 7,925 ఢిల్లీ మార్కెట్‌లో గోధుమలు (100 కేజీలు) - రూ. 1,148.70Source: Yahoo! Telugu: News | 31 Aug 2009 | 10:05 am దేశ రాజకీయ నేతల్లో స్వైన్ ఫ్లూ లక్షణాలు!ప్రపంచ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న స్వైన్ ఫ్లూ వైరస్.. రాజకీయ నేతలను సైతం వదిలేలా కనిపించడం లేదు. దేశంలోని పలువురు రాజకీయ నేతలకు ఈ వైరస్ సోకినట్టు తెలుస్తోంది. వివిధ పనుల నిమిత్తం ఢిల్లీకి రాకపోకలు సాగించే నేతల్లో పెక్కుమందికి ఈ వైరస్ లక్షణాలు కనిపిస్తున్నట్టు తెలుస్తోంది.Source: Yahoo! Telugu: News | 31 Aug 2009 | 10:01 am 'కౌ బాయ్''గా వస్తోన్న "క్విక్ గన్ మురుగన్"విశ్వంలోని ప్రతిదానిలో జీవం ఉన్నట్లయితే.. చెట్లు, ఆకుకూరలు, కాయగూరల్లోనూ జీవం ఉండబట్టే ఎదుగుదల ఉంటుంది. మరీ దాన్ని కోసి తింటుంటే అదికూడా మాంసాహారమేగా..? అని మాంసాహారులు ప్రశ్నింస్తుంటారు. ఏది ఏమైనా ఇదే నేపథ్యంలో రాజేంద్రప్రసాద్ "క్విక్ గన్ మురుగన్" చిత్రం రాబోతోంది. ఇందులో తాను కౌబాయ్‌గా నటించానని, "మైండ్ ఇట్" అనేది ఇందులో తన ఊతపదమని రాజేంద్రప్రసాద్ వెల్లడించారు. అప్పుడప్పుడు నోటికొచ్చిన ఇంగ్లీషును మాట్లాడుతుంటానని.. అందులో కాస్త తమిళయాస కూడా ఉంటుందని రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఈ సినిమా డైలాగ్‌లతో రింగ్‌టోన్లు కూడా తయారు చేశారని చెప్పుకొచ్చారు. ఇకపోతే సెక్సీతార రంభ క్విక్ గన్ మురుగన్‌లో నృత్యకారిణిగా నటించింది. ఈ చిత్రాన్ని చూసి అమీర్‌ఖాన్ కూడా మెచ్చుకున్నాడట. మరి ఈ చిత్రం ఇంకా తెలుగులో విడుదల కావాల్సి ఉంది.Source: Yahoo! Telugu: Entertainment | 31 Aug 2009 | 9:59 am కొత్త హోటళ్ళను ప్రారంభించనున్న ఒబెరాయ్హోటల్ రంగంలో అగ్రగామిగానున్న ఒబెరాయ్ హోటల్ సమూహం అబుదాబీ మరియు ఓమన్ ప్రాంతాలలో మరో 3 కొత్త హోటళ్ళను ప్రారంభించనుంది.Source: Yahoo! Telugu: News | 31 Aug 2009 | 9:46 am భారతీయ సిబ్బంది ఉన్న నౌకపై పైరేట్ల దాడిభారత సిబ్బంది పనిచేస్తున్న ఓ నౌకపై పర్షియన్ గల్ఫ్ జలాల్లో పైరేట్లు దాడి చేశారు. పర్షియన్ గల్ఫ్‌లో నౌకలపై పైరేట్ల (సముద్రపు దొంగలు) దాడి జరగడం గత కొన్నేళ్లలో ఇదే తొలిసారి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి బహ్రయిన్ వెళుతున్న నౌకపై సముద్రపు దొంగలు అనూహ్యంగా దాడి చేసినట్లు ఆదివారం తెలియవచ్చింది.Source: Yahoo! Telugu: News | 31 Aug 2009 | 9:38 am తితిదే అంతటా అవినీతి మయం: చిరంజీవిప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం అంతటా అవినీతిమయమైందని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ఆరోపించారు. తితిదేలో ఎలాంటి పొరపాట్లు జరగడం లేదని పాలకపక్షం సభ్యులు గుండెలపై చేయి వేసుకుని చెప్పగలరా అని ఆయన ప్రశ్నించారు.Source: Yahoo! Telugu: News | 31 Aug 2009 | 9:38 am జశ్వంత్‌జీ.. ఆ బాధ్యతల నుంచి తప్పుకోండి: సుష్మాభాజపా బహిష్కృత నేత జశ్వంత్ సింగ్ నిర్వహిస్తున్న పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) ఛైర్మన్ గిరి నుంచి తప్పుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ మహిళా సీనియర్ నేత సుష్మా స్వరాజ్ కోరారు. పీఏసీ ఛైర్మన్‌గా జశ్వంత్ సింగ్ భాజపా తరపున నెల రోజుల క్రితమే బాధ్యతలు చేపట్టిన విషయం తెల్సిందే.Source: Yahoo! Telugu: News | 31 Aug 2009 | 9:25 am సాహితీవనంలో అందమైన పురుగు "ఆరుద్ర"కవి, విమర్శకుడు, సాహిత్య చరిత్రకారుడు, సామాజిక శాస్త్రవేత్త, మార్క్సిస్టు మేధావి.. ఇలా అన్నింటినీ మించి ఒక మంచి మానవుడు, సహృదయుడు, స్నేహశీలి అయిన ఆరుద్ర జీవితప్రస్థానం ఒక ఇతిహాసం, ఒక సాహిత్య సాంస్కృతిక సుదర్శనం. అభ్యుదయ కవులలో శ్రీశ్రీ మొదటి తరానికి చెందితే, ఆరుద్ర రెండవ తరానికి చెందినవాడు, ఒకే ఒక్కడు. నేడు ఆ ఒకే ఒక్కడి జన్మదినం. ఈ సందర్భంగా ఆయన స్మృతిలో...Source: Yahoo! Telugu: Entertainment | 31 Aug 2009 | 9:20 am నష్టాల్లోనే కొనసాగుతున్న స్టాక్ మార్కెట్స్టాక్ మార్కెట్ ప్రస్తుతం నష్టాల్లో కొనసాగుతుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 222 పాయింట్లు కోల్పోయి 15,700 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 62 పాయింట్లు నష్టపోయి 4,671 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 1.40 శాతం, నిఫ్టీ 1.30 శాతం మేరకు క్షీణించాయి.Source: Yahoo! Telugu: News | 31 Aug 2009 | 9:08 am 322 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్స్టాక్ మార్కెట్ ప్రస్తుతం 318 పాయింట్లు కోల్పోవడంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ 15,604 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 93 పాయింట్లు నష్టపోయి 4,640 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 2 శాతం, నిఫ్టీ 1.96 శాతం మేరకు క్షీణించాయి.Source: Yahoo! Telugu: News | 31 Aug 2009 | 8:20 am కాలిఫోర్నియా అడవుల్లో చెలరేగిన మంటలుకాలిఫోర్నియా అడవుల్లో మంటలు చెలరేగడంతో పక్కనే ఉన్న ఓ గ్రామంలో 12 గృహాలు మంటల్లో కాలి బూడిదైపోయాయి. మంటల ద్వారా వ్యాపించిన బూడిద లాస్‌ఏంజెల్స్ వరకు వ్యాపించిందిSource: Yahoo! Telugu: News | 31 Aug 2009 | 8:19 am నష్టాల్లో కూరుకుపోతున్న స్టాక్ మార్కెట్స్టాక్ మార్కెట్ ప్రస్తుతం నష్టాల్లో పయనిస్తుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 304 పాయింట్లు కోల్పోయి 15,619 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 91 పాయింట్లు నష్టపోయి 4,642 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్, నిఫ్టీ 1.91 శాతం చొప్పున క్షీణించాయి.Source: Yahoo! Telugu: News | 31 Aug 2009 | 7:48 am నా శరీరాన్ని స్వేచ్ఛగా ఉంచుతా: మీరా చోప్రా"బంగారం" చిత్రంతో ముందుకు వచ్చిన భామ మీరా చోప్రాకు బంగారమంటేనే ఇష్టముండదట. నగలను ధరిస్తే ఒళ్లంతా పట్టేసిన భావం కలుగుతుందట. తన శరీరం ఎప్పుడూ స్వేచ్ఛగా ఉంచేందుకు తాను ఇష్టపడతానని చెపుతోందట. అయితే.. జగన్మోహినిలో యువరాణిలా నటిస్తున్నావు కదా.. మరి ఆ పాత్రకు నగలు నట్రా ధరించాల్సి వుంటుంది కదా... అని ఎవరైనా అంటే, సినిమా వరకే కనుక ఎలాకొలా నా శరీరాన్ని ఒప్పించుకుని నటిస్తున్నాను. నిజానికి ఒంటినిండా ఆభరణాలతో నటించాలంటే నాకసలు ఇష్టమే ఉండదు. ఈమధ్య వచ్చిన గ్యాప్ గురించి చెబుతూ... "సినిమానే ప్రపంచం కాదు. దాన్ని మించిన లోకం చాలా పెద్దది. ఖాళీ సమయల్లో నేను తీరిగ్గా గోళ్లు గిల్లుకుంటూ కూచోను. నాకు నచ్చిన హోటల్ ఇండస్ట్రీలో దిగాను. అన్ని నగరాల్లో నా బ్రాండ్ పేరుతో చెయిన్ ఆఫ్ హోటళ్లను ప్రారంభించాలన్నది నా చిరకాల వాంఛ" అని చెప్పింది. అందుకే ఢిల్లీలో తన తండ్రి పేరుకూడా కలిసివచ్చే "మిరాజ్" పేరుతో ఈ పరిశ్రమలో కాలిడింది. గొప్ప స్థాయిలో ఈ రంగంలో దూసుక వెళతానని చెబుతోంది. ముక్కుమీద కోపం ఉన్న ఈ అమ్మడికి అదే సూటవుతుందని కొందరు "చోప్రా" బాధితులు అంటున్నారట.Source: Yahoo! Telugu: Entertainment | 31 Aug 2009 | 6:27 am బిల్లాతో "డార్లింగ్" అనిపించుకోనున్న కాజల్ అగర్వాల్!అత్యున్నత ప్రమాణాలతో టాలీవుడ్‌లో సరికొత్త రికార్డు సృష్టించిన బ్లాక్ బస్టర్ మూవీ "మగధీర". 'చిరుత'నయుడు రామ్‌చరణ్ తేజ హీరోగా నటించిన ఈ చిత్రంలో అందాల సుందరి కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు సంపాదించిన కాజల్ అగర్వాల్ రిలాక్స్ కాకుండా మరో చిత్రంలో నటించేందుకు అగ్రిమెంట్లో సంతకాలు కూడా చేసేసింది. మగధీరతో పాటు రామ్ హీరోగా నటిస్తోన్న "గణేష్" చిత్రంలో కథానాయికగా ప్రేక్షకులను అలరించనున్న కాజల్ అగర్వాల్.. త్వరలో "బిల్లా" హీరో ప్రభాస్‌తో "డార్లింగ్" అనిపించుకోనుంది. ఇంతకీ విషయమేమిటంటే...? కరుణాకరన్ దర్శకత్వంలో ఛత్రపతి ప్రసాద్ నిర్మిస్తోన్న వైవిధ్యమైన ప్రేమకథా చిత్రంలో ప్రభాస్ సరసన కాజల్ అగర్వాల్ నటించనుందని టాలీవుడ్ వర్గాల సమాచారం. దీనికి తోడు "ఆర్య-2"లో స్టైలిష్ హీరో అల్లు అర్జున్‌తో కూడా జతకట్టనుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.Source: Yahoo! Telugu: Entertainment | 31 Aug 2009 | 5:52 am దేశ రాజకీయ నేతల్లో స్వైన్ ఫ్లూ లక్షణాలు!ప్రపంచ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న స్వైన్ ఫ్లూ వైరస్.. రాజకీయ నేతలను సైతం వదిలేలా కనిపించడం లేదు. దేశంలోని పలువురు రాజకీయ నేతలకు ఈ వైరస్ సోకినట్టు తెలుస్తోంది. వివిధ పనుల నిమిత్తం ఢిల్లీకి రాకపోకలు సాగించే నేతల్లో పెక్కుమందికి ఈ వైరస్ లక్షణాలు కనిపిస్తున్నట్టు తెలుస్తోంది.Source: జాతీయ | 31 Aug 2009 | 4:33 am తితిదే అంతటా అవినీతి మయం: చిరంజీవిప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం అంతటా అవినీతిమయమైందని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ఆరోపించారు. తితిదేలో ఎలాంటి పొరపాట్లు జరగడం లేదని పాలకపక్షం సభ్యులు గుండెలపై చేయి వేసుకుని చెప్పగలరా అని ఆయన ప్రశ్నించారు.Source: ఏపీ న్యూస్ | 31 Aug 2009 | 4:16 am జశ్వంత్‌జీ.. ఆ బాధ్యతల నుంచి తప్పుకోండి: సుష్మాభాజపా బహిష్కృత నేత జశ్వంత్ సింగ్ నిర్వహిస్తున్న పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) ఛైర్మన్ గిరి నుంచి తప్పుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ మహిళా సీనియర్ నేత సుష్మా స్వరాజ్ కోరారు. పీఏసీ ఛైర్మన్‌గా జశ్వంత్ సింగ్ భాజపా తరపున నెల రోజుల క్రితమే బాధ్యతలు చేపట్టిన విషయం తెల్సిందే.Source: జాతీయ | 31 Aug 2009 | 3:56 am కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం మేమే: సీతారాం ఏచూరీజాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం తృతీయ కూటమేనని సీపీఎం సీనియర్ నేత సీతారాం ఏచూరీ అన్నారు. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు రెండూ రెండేనని ఆయన ఆరోపించారు. జాతీయ పార్టీలుగా చెప్పుకునే కాంగ్రెస్, భాజపాలు.. అమెరికా సామ్రాజ్యవాదానికి దాసోహమయ్యాయని దుయ్యబట్టారుSource: ఏపీ న్యూస్ | 31 Aug 2009 | 2:50 am అసెంబ్లీ సమావేశాలు: చిరుతో ఉండవల్లి భేటీప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవితో రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సోమవారం భేటీ అయ్యారు. అసెంబ్లీ ప్రాంగణంలోని పీఆర్పీ ఛాంబర్‌లో ఉండవల్లితో పాటు.. మంత్రి వట్టి వసంత కుమార్ కలిసి సమావేశమయ్యారు. అయితే, ఈ భేటీలోని ఆంతర్యం మాత్రం వెల్లడి కాలేదు.Source: ఏపీ న్యూస్ | 31 Aug 2009 | 1:57 am వారి పాత్రలపై వారే నిర్ణయం తీసుకోవాలి: భగవత్భారతీయ జనతా పార్టీలో తాము పోషించాల్సిన పాత్రలపై అగ్రనేతలైన ఎల్కే.అద్వానీ, రాజ్‌నాథ్ సింగ్‌లే తుది నిర్ణయం తీసుకోవాలని ఆర్.ఎస్.ఎస్. చీఫ్ మోహన్ భగవత్ అభిప్రాయపడ్డారు.Source: జాతీయ | 31 Aug 2009 | 1:44 am తెదేపా కథ ఇక కంచికే: ముఖ్యమంత్రి వైఎస్తెలుగుదేశం పార్టీ కథ ఇక కంచికేనని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి జోస్యం చెప్పారు. తాము ఏ ఒక్కరినీ ఆకర్షించడం లేదని ఆయన తేల్చి చెప్పారు. ఇతర పార్టీలపై నమ్మకం లేకనే తమ పార్టీలో చేరేందుకు పలువురు నేతలు ఉత్సాహం చూపుతున్నారని వైఎస్ అన్నారు.Source: ఏపీ న్యూస్ | 31 Aug 2009 | 12:58 am స్వైన్ ఫ్లూ వైరస్: పూణెలో మరో ఇద్దరి మృతిస్వైన్ ఫ్లూ వైరస్ మహమ్మారికి మరో ఇద్దరు మృత్యువాత పడ్డారు. వీరిద్దరు కూడా పూణె ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న స్వైన్ ఫ్లూ రోగులే కావడం గమనార్హం. దీంతో పూణెలో స్వైన్ ఫ్లూకు మరణించిన వారి సంఖ్య 31కు చేరుకుంది.Source: జాతీయ | 31 Aug 2009 | 12:09 am రాష్ట్రాన్ని ముంచెత్తుతున్న భారీ వర్షాలుబంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం కారణంగా రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాలను ముంచెత్తాయి. గంటల తరబడి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల వలన జన జీవనానికి అంతరాయం ఏర్పడింది.Source: ఏపీ న్యూస్ | 30 Aug 2009 | 11:32 pm దేశంలో మరో 128 స్వైన్ ఫ్లూ పాజిటివ్ కేసులుదేశాన్ని స్వైన్ ఫ్లూ మహమ్మారిని పట్టిపీడిస్తోంది. ఒక్క ఆదివారమే దేశవ్యాప్తంగా 128 స్వైన్ ఫ్లూ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా స్వైన్ ఫ్లూ నిర్ధారణ అయినవారిలో ఓ బ్రిటన్ పౌరురాలు కూడా ఉంది. తాజా పాజిటివ్ కేసులతో కలిపి, దేశవ్యాప్తంగా మొత్తం స్వైన్ ఫ్లూ కేసుల సంఖ్య 3881కి పెరిగియని అధికారిక యంత్రాంగం వెల్లడించింది.Source: జాతీయ | 30 Aug 2009 | 10:48 pm అధ్యక్షపగ్గాలు మళ్లీ రాజ్‌నాథ్‌కు దక్కవు: బీజేపీబీజేపీ అధ్యక్ష పగ్గాలు మరోసారి రాజ్‌నాథ్ సింగ్‌కు దక్కబోవని ఆ పార్టీ ప్రతినిధి ప్రకాశ్ జావేద్కర్ ఆదివారం విలేకరులతో చెప్పారు. గత కొంతకాలంగా బీజేపీలో నాయకత్వ మార్పుపై పెద్దఎత్తున చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. బీజేపీలో మార్పులు చర్చనీయాంశంగా మారిన తరుణంలో.. జావేద్కర్ మాట్లాడుతూ.. బీజేపీ అధ్యక్ష బాధ్యతలు మళ్లీ రాజ్‌నాథ్ స్వీకరించబోరని తెలిపారు.Source: జాతీయ | 30 Aug 2009 | 9:51 pm సెప్టెంబరు 4కు "జోష్" చిత్రం వాయిదా!?యువసామ్రాట్ నాగార్జున పెద్ద కుమారుడు అక్కినేని నాగ చైతన్యను వెండి తెరకు పరిచయం చేస్తూ నిర్మించిన "జోష్" చిత్రం విడుదలకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈ చిత్రం గత నెలాఖరులో విడుదల కావాల్సి వుంది.Source: Yahoo! Telugu: Entertainment | 30 Aug 2009 | 12:17 pm దాసరిచే కమల్, వెంకీల "ఈనాడు" లోగో ఆవిష్కరణదశావతారం హీరో పద్మభూషణ్ కమల్ హాసన్, విక్టరీ వెంకటేష్‌లు నటిస్తోన్న మల్టీస్టారర్ చిత్రం "ఈనాడు". హిందీలో ఘన విజయం సాధించిన "వెడ్నెస్‌డే" చిత్రాన్ని తెలుగులో "ఈనాడు"గా తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలోగో ఆవిష్కరణ కార్యక్రమం శనివారం రాత్రి లాంఛనంగా జరిగింది. లోగోను దర్శకరత్న దాసరి నారాయణరావు ఆవిష్కరించారు.Source: Yahoo! Telugu: Entertainment | 30 Aug 2009 | 11:29 am విద్యా రంగంలో రాష్ట్రం అగ్రస్థానం: ముఖ్యమంత్రిదేశంలో మెరుగైన, నాణ్యవంతమైన విద్యను అందించడంలో మన రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా, విద్యా రంగానికి రూ.11 వేల కోట్ల బడ్జెట్‌తో కొత్త కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నట్టు ఆయన తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 30 Aug 2009 | 6:55 am పోలీసు అకాడెమీ సిబ్బందికి జీతాల పెంపురాష్ట్రంలో నిఘా, సీఐడీ, పోలీసు అకాడెమీ విభాగాల్లో పని చేస్తున్న పోలీసు సిబ్బందికి 30 శాతం మేరకు జీత భత్యాలను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.Source: ఏపీ న్యూస్ | 30 Aug 2009 | 6:55 am 31న కల్లుగీత కార్మికుల "ఛలో అసెంబ్లీ"కల్లుగీత వృత్తిని రద్దు చేయడానికి ప్రభుత్వం సన్నద్ధమవడాన్ని రాష్ట్ర గౌడ కల్లుగీత వృత్తి పరిరక్షణ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. దీనికి నిరసన వ్యక్తం చేస్తూ.. సోమవారం ఛలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టాలని ఆ సంఘం తీర్మానించింది.Source: ఏపీ న్యూస్ | 30 Aug 2009 | 6:55 am చంద్రయాన్-1 కథ ఇక ముగిసింది: ఇస్రోదేశ శాస్త్రవేత్తలు చందమామపై జరిపిన ప్రయోగం పూర్తిగా విఫలమైంది. చంద్రునిపై మరింత లోతైన అధ్యయనం జరపాలన్న దేశ శాస్త్రవేత్తల మానవ ప్రయత్నానికి బ్రేక్ పడింది. చంద్ర మడలంపై అడుగుపెట్టడమే లక్ష్యంగా భారత్ మొదలుపెట్టిన 'చంద్రయాన్' ప్రాజెక్టులో తొలి దశ అర్థాంతరంగా ఆగిపోయింది.Source: జాతీయ | 30 Aug 2009 | 6:39 am ఆస్తుల వివరాల వెల్లడికి హెచ్‌పీ జడ్జీలు నిర్ణయం!తమ వ్యక్తిగత ఆస్తుల వివరాలను వెల్లడించేందుకు హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు జడ్జీలు ముందుకు వచ్చారు. ఇందుకోసం అపెక్స్ కోర్టు మార్గదర్శకాల కోసం వేచి చూస్తున్నట్టు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ వీకె.శర్మ తెలిపారు.Source: జాతీయ | 30 Aug 2009 | 4:41 am మరోమారు వెంకయ్యకు భాజపా పగ్గాలు?భారతీయ జనతా పార్టీ సారథ్య బాధ్యతలను ఆ పార్టీ సీనియర్ నేత ముప్పవరపు వెంకయ్య నాయుడుకు కట్టబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. భాజపాకు నాయకత్వ మార్పిడి అనివార్యమనే సంకేతాలు ప్రస్తుతం జోరుగా వస్తున్న విషయం తెల్సిందే.Source: జాతీయ | 30 Aug 2009 | 3:52 am
|