త్వరలోనే మార్కెట్‌లోకి టాటా ఎల్‌వీఎం వాహనాలు

దేశంలో భారీ రకం వాణిజ్య వాహనాలను తయారు చేస్తున్న టాటా మోటార్స్ సంస్థ దేశీయ మార్కెట్‌లోకి త్వరలోనే తేలికపాటి వాణిజ్య వాహనాలను ప్రవేశపెట్టనున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. దేశీయ మార్కెట్‌లోకే త్వరలోనే వీటని విడుదల చేస్తామని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 30 Aug 2009 | 9:42 am

మరోమారు వెంకయ్యకు భాజపా పగ్గాలు?

భారతీయ జనతా పార్టీ సారథ్య బాధ్యతలను ఆ పార్టీ సీనియర్ నేత ముప్పవరపు వెంకయ్య నాయుడుకు కట్టబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. భాజపాకు నాయకత్వ మార్పిడి అనివార్యమనే సంకేతాలు ప్రస్తుతం జోరుగా వస్తున్న విషయం తెల్సిందే.
Source: Yahoo! Telugu: News | 30 Aug 2009 | 9:22 am

బాగ్దాద్‌లో బాంబు పేలుళ్లు: 20 మృతి

ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో ఆదివారం ఉదయం జరిగిన బాంబు పేలుళ్లలో 20 మంది మృత్యువాత పడ్డారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. తిక్రీక్ నగర్‌కు సమీపంలో ఈ బాంబు పేలుడు సంభవించింది.
Source: Yahoo! Telugu: News | 30 Aug 2009 | 7:49 am

పండగ సీజన్‌కు హోండా సివిక్ లగ్జరీ కారు

దేశీయ కార్ల మార్కెట్‌లోకి లగ్జరీ కార్ల ఉత్పత్తి సంస్థ అయిన హోండా సీయల్ కార్స్ ఇండియా సంస్థ తన కొత్త మోడల్ సివిక్‌ను స్వల్ప మార్పులతో మళ్లీ మార్కెట్‌లోకి ప్రవేశపెట్టనుంది. జపాన్‌కు చెందిన ఆటోదిగ్గజం హోండా అండ్ సీయల్ గ్రూపు ఈ కారును దేశీయ మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు నిర్ణయించింది.
Source: Yahoo! Telugu: News | 30 Aug 2009 | 7:24 am

సమస్యలను భాజపా అధిగమిస్తుంది: ఆర్ఎస్ఎస్

ప్రస్తుతం నెలకొన్న అంతర్గత సమస్యలను భారతీయ జనతా పార్టీ స్వయంగా పరిష్కరించుకుంటుందని ఆ పార్టీ మాతృసంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అభిప్రాయపడింది. ఈ విషయంలో తమ జోక్యం అవసరం లేదని స్పష్టం చేసింది.
Source: Yahoo! Telugu: News | 30 Aug 2009 | 6:31 am

ఆయన్ని పక్కనపెట్టడం ఎవరితరం కాదు: వెంకయ్య

భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఎల్.కె. అద్వానీని పార్టీ నుంచి పక్కనపెట్టడం ఎవరి తరం కాదని ఆ పార్టీ నేత వెంకయ్య నాయుడు అన్నారు. దేశంలోనే గొప్ప రాజకీయ వేత్తను పక్కన పెట్టడం ఎవరివల్లవుతుందని ఆయన ప్రశ్నించారు. పార్టీలో విభేదాలు ఉన్నమాట వాస్తవేమని, కాదనడం లేదని, అయితే వాటిని పరిష్కరించడానికి కొంత సమయం పడుతుందని వెంకయ్య అన్నారు.
Source: Yahoo! Telugu: News | 30 Aug 2009 | 6:07 am

'గ్యాస్ మనది.. క్యాష్ వాళ్లకా'?: చిరంజీవి ధ్వజం

రాష్ట్రంలోని సముద్ర గర్భంలో లభ్యమవుతున్న సహజవాయువనరుల్లో మన రాష్ట్ర వాటా మనకు దక్కాల్సిందేనని ప్రజారాజ్యం పార్టీ గట్టిగా డిమాండ్ చేసింది. 'ఈ నేల మనది... ఈ నీరు మనది... భూమిలో ఉన్న నిక్షేపాలూ మనవేనంటూ ఆ పార్టీ అధినేత చిరంజీవి ప్రజలకు పిలుపునిచ్చారు.
Source: Yahoo! Telugu: News | 30 Aug 2009 | 5:59 am

1984 సిక్కుల అల్లర్ల కేసు: ముగ్గురికి యావజ్జీవం

1984 సంవత్సరంలో జరిగిన సిక్కుల అల్లర్ల కేసులో దోషులుగా తేలిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ ఢిల్లీలోని స్థానిక కోర్టు శనివారం తుది తీర్పు ఇచ్చింది. అలాగే, 6.20 లక్షల రూపాయల అపరాధ రుసుం కూడా విధించింది.
Source: Yahoo! Telugu: News | 30 Aug 2009 | 5:42 am

ఇరాక్‌లో పేలుళ్లు: 16 మంది మృత్యువాత

ఇరాక్‌ మరోమారు బాంబు పేలుళ్ళతో దద్ధరిల్లింది. శనివారం రెండు వేర్వేరు ప్రాంతాల్లో రెండు బాంబులు పేలాయి. ఈ ఘటనలో 16 మంది మృత్యువాత పడ్డారు. శనివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ట్రక్కులో బాంబుల నింపుకున్న ఒక బాంబర్ హమద్ అనే మారుమూల గ్రామంలోని ఒక పోలీస్ స్టేషన్‌పై దాడికి తెగబడ్డాడు.
Source: Yahoo! Telugu: News | 30 Aug 2009 | 5:31 am

మార్కెట్లో కోడిగుడ్లు ధరలు

రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్‌లలో ఆదివారం కోడిగుడ్ల ధరలు కింది విధంగా ఉన్నాయి. హైదరాబాద్‌ మార్కెట్‌లో వంద కోడిగుడ్లు ధర రూ.219గా ఉండగా, చిల్లరగా ఒక్క గుడ్డు ధర రూ.2.45గా ఉంది. అలాగే.. వరంగల్ మార్కెట్‌లో రూ.189 గాను, విజయవాడలో రూ.220, విశాఖపట్నంలో రూ.250, గోదావరి మార్కెట్‌లో రూ.227, తూర్పుగోదావరిలో రూ.227, చిత్తూరులో 233రూపాయలుగా ఉంది. ఇకపోతే.. పొరుగు రాష్ట్రమైన తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో వంద కోడిగుడ్లు ధర రూ.240 పలుకగా, కోళ్ళ పరిశ్రమకు ఆయువుపట్టుగా ఉన్న నామక్కల్‌లో 233 రూపాయలుగా పలుకుతోంది.
Source: Yahoo! Telugu: News | 30 Aug 2009 | 5:26 am

మరోమారు వెంకయ్యకు భాజపా పగ్గాలు?

భారతీయ జనతా పార్టీ సారథ్య బాధ్యతలను ఆ పార్టీ సీనియర్ నేత ముప్పవరపు వెంకయ్య నాయుడుకు కట్టబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. భాజపాకు నాయకత్వ మార్పిడి అనివార్యమనే సంకేతాలు ప్రస్తుతం జోరుగా వస్తున్న విషయం తెల్సిందే.
Source: జాతీయ | 30 Aug 2009 | 3:52 am

సమస్యలను భాజపా అధిగమిస్తుంది: ఆర్ఎస్ఎస్

ప్రస్తుతం నెలకొన్న అంతర్గత సమస్యలను భారతీయ జనతా పార్టీ స్వయంగా పరిష్కరించుకుంటుందని ఆ పార్టీ మాతృసంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అభిప్రాయపడింది. ఈ విషయంలో తమ జోక్యం అవసరం లేదని స్పష్టం చేసింది.
Source: జాతీయ | 30 Aug 2009 | 1:02 am

ఆయన్ని పక్కనపెట్టడం ఎవరితరం కాదు: వెంకయ్య

భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఎల్.కె. అద్వానీని పార్టీ నుంచి పక్కనపెట్టడం ఎవరి తరం కాదని ఆ పార్టీ నేత వెంకయ్య నాయుడు అన్నారు. దేశంలోనే గొప్ప రాజకీయ వేత్తను పక్కన పెట్టడం ఎవరివల్లవుతుందని ఆయన ప్రశ్నించారు. పార్టీలో విభేదాలు ఉన్నమాట వాస్తవేమని, కాదనడం లేదని, అయితే వాటిని పరిష్కరించడానికి కొంత సమయం పడుతుందని వెంకయ్య అన్నారు.
Source: ఏపీ న్యూస్ | 30 Aug 2009 | 12:38 am

'గ్యాస్ మనది.. క్యాష్ వాళ్లకా'?: చిరంజీవి ధ్వజం

రాష్ట్రంలోని సముద్ర గర్భంలో లభ్యమవుతున్న సహజవాయువనరుల్లో మన రాష్ట్ర వాటా మనకు దక్కాల్సిందేనని ప్రజారాజ్యం పార్టీ గట్టిగా డిమాండ్ చేసింది. 'ఈ నేల మనది... ఈ నీరు మనది... భూమిలో ఉన్న నిక్షేపాలూ మనవేనంటూ ఆ పార్టీ అధినేత చిరంజీవి ప్రజలకు పిలుపునిచ్చారు.
Source: ఏపీ న్యూస్ | 30 Aug 2009 | 12:31 am

1984 సిక్కుల అల్లర్ల కేసు: ముగ్గురికి యావజ్జీవం

1984 సంవత్సరంలో జరిగిన సిక్కుల అల్లర్ల కేసులో దోషులుగా తేలిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ ఢిల్లీలోని స్థానిక కోర్టు శనివారం తుది తీర్పు ఇచ్చింది. అలాగే, 6.20 లక్షల రూపాయల అపరాధ రుసుం కూడా విధించింది.
Source: జాతీయ | 30 Aug 2009 | 12:12 am

ప్రతిపక్ష నేత బాధ్యతలకు అద్వానీ స్వస్తి!?

లోక్‌సభలో ప్రతిపక్ష నేత బాధ్యతల నుంచి ఎల్కే.అద్వానీ తప్పుకునేందుకు నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ వర్గాలు సీఎన్ఎన్ఐబీఎన్ ఛానల్ ప్రతినిధికి తెలియజేశాయి. ప్రస్తుతం పార్టీలో నెలకొన్న పరిణామాలపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌పై అద్వానీ శనివారం మధ్యాహ్నం సమావేశమై విపులంగా చర్చించారు.
Source: జాతీయ | 29 Aug 2009 | 10:39 pm

నేనేమైనా వెధలా కనిపిస్తున్నానా?... రామ్‌గోపాల్ వర్మ

ఎవరైనా కోట్లు ఖర్చు పెట్టి ఒక సినిమాను ఊరకనే తీయరు. బావుందనే ఉద్దేశ్యంతోనే తీస్తారు. నా మదికి నచ్చింది కనుక నేను తీసుకుంటూ పోతున్నాను. నా మైండ్ సెట్‌కు ట్యూన్ అయ్యే ప్రేక్షకులు ఉంటారు. మీరు గమనించాల్సిందేమిటంటే.. ప్రేక్షకులందరూ ఒకలా ఉండరని. గతంలో "కౌన్" అనే సినిమాను 18 లక్షలు ఖర్చు పెట్టి తీస్తే దానికి 3 కోట్ల రూపాయలు లాభం వచ్చింది.
Source: Yahoo! Telugu: Entertainment | 29 Aug 2009 | 12:52 pm

నాగార్జున బర్త్ డే: ఆరోగ్యశ్రీకి రూ.50 వేలు

ప్రతి ఏడాది ఎంతో ఆర్భాటంగా అక్కినేని నాగార్జున పుట్టినరోజు జరిగేది. కానీ ఈ ఏడాది మాత్రం ఎటువంటి ఆర్భాటం లేకుండా జరిగింది. ఆల్ ఇండియా నాగార్జున ఫ్యాన్స్ అధ్యక్షుడు పి. రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం అక్కినేని నివాసంలో నాగార్జున జన్మదినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా నాగార్జున కేక్ కట్ చేసి అభిమానులతో మాట్లాడారు. నాగార్జున పుట్టినరోజును పురస్కరించుకుని ఫ్యాన్స్ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి ఆరోగ్యశ్రీ పథకానికిగాను 50 వేల రూపాయల విరాళాన్ని డీడీ రూపంలో అందించారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టు పర్చా శరత్ కుమార్ కు స్వర్ణ కంకణం బహూకరణ జరిగింది.
Source: Yahoo! Telugu: Entertainment | 29 Aug 2009 | 10:24 am

యూపీఏ- 2 ప్రభుత్వానికి వంద రోజులు పూర్తి

ఐక్యప్రగతిశీల కూటమి (యూపీఏ) కేంద్రంలో వరుసగా రెండోసారి అధికారాన్ని చేపట్టి వంద రోజులు పూర్తయ్యాయి. యూపీఏ- 2కి వందరోజులు పూర్తయిన సందర్భంగా దాని ప్రదర్శనను ఒకసారి పరిశీలిస్తే.. మిశ్రమ స్పందనలే కనిపిస్తాయి. తొలి వంద రోజుల్లో ఏదో చేసేస్తామంటూ.. చెప్పడానికి చాలా చెప్పినప్పటికీ, చేతల్లోకి వచ్చేసరికి కొన్నే అమలు పరచగలిగింది.
Source: జాతీయ | 29 Aug 2009 | 8:59 am

కీరవాణి x అల్లు అరవింద్... అబ్బా ఇక్కడ కూడా గొడవేనా...?

అల్లు అరవింద్ ఎక్కడున్నా గొడవ మనిషే అని ఇండస్ట్రీలో పేరు పడింది. అటు ప్రజారాజ్యం పార్టీలో వేలు పెట్టి కార్యకర్తలకు దూరం అయ్యాడు. తాజా సమాచారం ప్రకారం మగధీర సంగీత దర్శకుడు కీరవాణితో కూడా పేచీ పెట్టుకున్నాడట. దీంతో దర్శకుడు రాజమౌళి కూడా ఆయనపై గుర్రుగా ఉన్నారని తెలిసింది. మొదటి నుంచి కీరవాణి ట్యూన్స్‌లో కొద్దిగా మార్పులు చేయాలంటూ... సున్నితంగా చెబుతూ... చివరికి డామినేట్ చేసేవాడట. దాంతో కీరవాణి ఆగ్రహించి.. కొన్నాళ్లు విదేశాలకు వెళ్లిపోయాడు. దీంతో సినిమా ఆగిపోతుందనే టాక్ కూడా వచ్చింది. మగధీర ఆడియో హక్కులు తన రికార్డింగ్ కంపెనీ వేల్స్‌కు ఇవ్వమని కీరవాణి అడిగితే.. ససేమిరా అని.. ఆదిత్యవారికి కట్టబెట్టాడట అరవింద్. దీంతో వివాదం మరింత ముదిరింది. ఇకపై గీతా ఆర్ట్స్ చిత్రాలకు సంగీతం చేయనని కీరవాణి తేల్చి చెప్పినట్లు సమాచారం. అందుకే పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్, గ్రాఫిక్స్ వర్క్ ఆలస్యమైందని అప్పట్లో చెప్పారు. కానీ అసలు కథ ఇదంటండీ. ఏదైనా చివర్లో గదా అసలు విషయం తెలిసేది.
Source: Yahoo! Telugu: Entertainment | 29 Aug 2009 | 8:05 am

నాయకత్వ బదిలీ లేదు: బీజేపీ, ఆర్ఎస్ఎస్

పార్టీలో నాయకత్వ బదిలీ గురించి ఆలోచించడం లేదని బీజేపీ, ఆర్ఎస్ఎస్ శనివారం స్పష్టం చేశాయి. గత కొన్ని రోజులుగా బీజేపీలో నాయకత్వ మార్పు జరిగే అవకాశాలున్నట్లు, యువతరం చేతుల్లో పార్టీ నాయకత్వాన్ని పెట్టాలని ఆర్ఎస్ఎస్ పార్టీ ప్రస్తుత నాయకత్వంపై ఒత్తిళ్లు వస్తున్నట్లు మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.
Source: జాతీయ | 29 Aug 2009 | 7:25 am

చంద్రయాన్- 1కు అనుకోని ముగింపు: ఇస్రో

భారత్ ప్రతిష్టాత్మంగా చందమామపైకి పంపిన తొలి అంతరిక్ష నౌకతో భూమికి సంబంధాలు తెగిపోయాయి. దీంతో చంద్రయాన్- 1 శనివారం అనుకోనిరీతిలో ఆగిపోయింది. భారత్ చంద్రుడిపైకి పంపిన అంతరిక్ష నౌకకు శనివారం భూమితో సమాచార సంబంధాలు తెగిపోయాయి. శనివారం ఉదయం 1.30 గంటల సమయంలో ఉపగ్రహానికి భూమిపై స్టేషన్‌కు మధ్య రేడియో లింక్ తెగిపోయిందని ఇస్రో ప్రకటించింది.
Source: జాతీయ | 29 Aug 2009 | 7:03 am

లింకులు పెట్టి రాయడం విలేకరులకు వెన్నతో పెట్టిన విద్య: సల్మాన్

సల్మాన్ ఖాన్ నోరు విప్పాడంటే మాటల తూటాలే. ముంబయిలో ఇటీవల జరిగిన ఓ మీడియా సమావేశంలో అనూహ్యంగా పత్రికా విలేకరులపై మాటల బాణాలు సంధించాడు సల్మాన్. పరోక్షంగా తన గాళ్‌ఫ్రెండ్స్‌తో లింకులు పెడుతూ వచ్చిన వార్తలను దృష్టిలో పెట్టుకుని సల్మాన్ నవ్వుతూనే విలేకరులకు చురకలు అంటించాడు. ఆడ-మగ కలిసి మాట్లాడుకుంటే చాలు.. పత్రికలవాళ్లు లింకులు పెడుతూ రాసి పారేస్తారనీ, ముఖ్యంగా హీరోహీరోయిన్లు కాస్తంత చనువుగా కనబడితే... తెల్లారేసరికి వాళ్లిద్దరి మధ్య ఎఫైర్ ఉందని ఊదరకొడతారని సల్మాన్ అన్నాడట. ఒక జంట వివాహం చేసుకోవాలంటే.. దానికి ముందు ఒకరినొకరు అర్థం చేసుకోవాలనీ, అందుకుగాను ఇద్దరూ కలిసి సినిమాలు, పార్కులు.. ఇలా అనేక ప్రాంతాలలో కలుసుకుని మనసు విప్పి మాట్లాడుకుంటారనీ చెప్పుకొచ్చాడట. సదరు జంట అభిప్రాయాలు ఒకటైతే డేటింగ్ మొదలవుతుందనీ... ఇంత జరిగిన తర్వాతే వారి మధ్య ఎఫైర్ నడుస్తుందనీ... అయితే ఈ లోపే వాళ్లిద్దరు కలిసి కార్లో వెళ్లారనో.. ఇంకెక్కిడికో వెళ్లారనో పత్రికలవాళ్లు రాస్తుంటారని నవ్వుతూ చురకలేశాడట సల్మాన్.
Source: Yahoo! Telugu: Entertainment | 29 Aug 2009 | 6:50 am

బీహార్‌లో వైద్యుల సమ్మె: 21 మంది మృతి

తమ డిమాండ్ల పరిష్కారం కోసం బీహార్ రాజధానిలో ఉన్న పాట్నా వైద్య కళాశాల, ఆస్పత్రి (పీఎంసీహెచ్)లో పనిచేస్తున్న జూనియర్ డాక్టర్లు చేపట్టిన సమ్మె శనివారానికి మూడో రోజుకు చేరుకుంది. ఈ సమ్మె కారణంగా ఆస్పత్రిలో సరైన వైద్య సదుపాయాలు అందకపోవడంతో 21 మంది ప్రాణాలు కోల్పోయారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించారు.
Source: జాతీయ | 29 Aug 2009 | 5:18 am

ఆర్థిక క్రమశిక్షణే.. అభివృద్ధికి ప్రామాణికం: వైఎస్

ఆర్థిక క్రమశిక్షణే.. ఆభివృద్ధికి ప్రమాణికమని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి అభిప్రాయపడ్డారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో దక్షిణ భారత ఛార్టెడ్ అకౌంటెంట్ల సదస్సు శనివారం ఆరంభమైంది.
Source: ఏపీ న్యూస్ | 29 Aug 2009 | 4:58 am

నక్సల్స్ కదలికలపై అప్రమత్తం: హోం మంత్రి

రాష్ట్రంలో నక్సల్స్ కార్యకలాపాలపై నిరంతరం అప్రమత్తంగా ఉన్నట్టు హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు చర్చలు తీసుకుంటామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి అధ్యక్షతన రాష్ట్రంలో శాంతిభద్రతలపై ఉన్నతస్థాయి సమావేశం జరిగింది.
Source: ఏపీ న్యూస్ | 29 Aug 2009 | 4:30 am

"దారిన పోయే దానయ్య"తో చిత్రం తీయలేం: నాగ్

తెలుగు చిత్ర పరిశ్రమలో వారసత్వం ఎక్కువ కావడం లేదు. మా కుటుంబాలకు చెందిన వారే కాకుండా.. అనేక మంది యువ హీరోలు వస్తున్నారు. ఏదైనా ఖర్చు చేయాలంటే పది సార్లు ఆలోచన చేయడం మనిషి నైజం. కోట్లు పెట్టి సినిమా తీసే దర్శక నిర్మాతకు ఆమాత్రం స్వేచ్ఛ ఉంటుంది.
Source: Yahoo! Telugu: Entertainment | 29 Aug 2009 | 4:17 am

భాజపా పరిణామాలు మంచిది కాదు: మన్మోహన్

ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ గత కొన్ని రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు మంచిది కాదని ప్రధాని మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. అలాగే, కాందహార్, ఫోఖ్రాన్-2‌లపై ఇపుడు రాద్ధాంతం అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు.
Source: జాతీయ | 29 Aug 2009 | 3:59 am