స్వైన్‌ఫ్లూ వ్యాక్సిన్ సిద్ధం: ఎగబడుతున్న దేశాలు

అమెరికాకు చెందిన బాక్స్‌టెర్ ఇంటర్నేషనల్ సంస్థ శుక్రవారం స్వైన్ ఫ్లూ వ్యాక్సిన్‌ను విడుదల చేసింది. బాక్స్‌టెర్ విడుదల చేసిన తొలి బ్యాచ్ వ్యాక్సిన్ వలన స్వైన్ ఫ్లూతో భయాందోళనలకు గురవుతున్న భారత పౌరులకు ఒరిగేదేమీ లేదు. ఎందుకంటే మొదటి బ్యాచ్ వ్యాక్సిన్లను రప్పించుకునే ప్రయత్నాల్లో ఇతర దేశాలు ఇప్పటికే విజయవంతమయ్యాయి.
Source: Yahoo! Telugu: News | 29 Aug 2009 | 9:35 am

లాభాలు పెరిగిన టాటా పవర్

టాటా పవర్ కంపెనీ లిమిటెడ్‌ సంస్థ ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికాంతానికి నికర లాభాలు 160.47 శాతం పెరిగి రూ. 572.65 కోట్లకు చేరుకుందని కంపెనీ ప్రకటించింది. నిరుడు ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి కంపెనీ రూ. 219.85 కోట్ల నికర లాభాలను ఆర్జించిందని కంపెనీ తెలిపింది.
Source: Yahoo! Telugu: News | 29 Aug 2009 | 9:31 am

భాజపా పరిణామాలు మంచిది కాదు: మన్మోహన్

ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ గత కొన్ని రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు మంచిది కాదని ప్రధాని మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. అలాగే, కాందహార్, ఫోఖ్రాన్-2‌లపై ఇపుడు రాద్ధాంతం అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు.
Source: Yahoo! Telugu: News | 29 Aug 2009 | 9:28 am

ఇండోనేషియాలో నౌక మునక: ఐదుగురి మృతి

ఇండోనేషియా తీరంలో ఓ ప్రయాణికుల నౌక మునిగిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, 18 మంది ఆచూకీ గల్లతైందని ఇండోనేషియా అధికారిక యంత్రాంగం శనివారం వెల్లడించింది. సారీ ములియా అనే నౌక శుక్రవారం రాత్రి మునిగిపోయిందని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గురైన నౌక నెగారా నుంచి బంజర్మాసిన్‌కు వెళుతోంది.
Source: Yahoo! Telugu: News | 29 Aug 2009 | 8:42 am

కీరవాణి x అల్లు అరవింద్... అబ్బా ఇక్కడ కూడా గొడవేనా...?

అల్లు అరవింద్ ఎక్కడున్నా గొడవ మనిషే అని ఇండస్ట్రీలో పేరు పడింది. అటు ప్రజారాజ్యం పార్టీలో వేలు పెట్టి కార్యకర్తలకు దూరం అయ్యాడు. తాజా సమాచారం ప్రకారం మగధీర సంగీత దర్శకుడు కీరవాణితో కూడా పేచీ పెట్టుకున్నాడట. దీంతో దర్శకుడు రాజమౌళి కూడా ఆయనపై గుర్రుగా ఉన్నారని తెలిసింది. మొదటి నుంచి కీరవాణి ట్యూన్స్‌లో కొద్దిగా మార్పులు చేయాలంటూ... సున్నితంగా చెబుతూ... చివరికి డామినేట్ చేసేవాడట. దాంతో కీరవాణి ఆగ్రహించి.. కొన్నాళ్లు విదేశాలకు వెళ్లిపోయాడు. దీంతో సినిమా ఆగిపోతుందనే టాక్ కూడా వచ్చింది. మగధీర ఆడియో హక్కులు తన రికార్డింగ్ కంపెనీ వేల్స్‌కు ఇవ్వమని కీరవాణి అడిగితే.. ససేమిరా అని.. ఆదిత్యవారికి కట్టబెట్టాడట అరవింద్. దీంతో వివాదం మరింత ముదిరింది. ఇకపై గీతా ఆర్ట్స్ చిత్రాలకు సంగీతం చేయనని కీరవాణి తేల్చి చెప్పినట్లు సమాచారం. అందుకే పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్, గ్రాఫిక్స్ వర్క్ ఆలస్యమైందని అప్పట్లో చెప్పారు. కానీ అసలు కథ ఇదంటండీ. ఏదైనా చివర్లో గదా అసలు విషయం తెలిసేది.
Source: Yahoo! Telugu: Entertainment | 29 Aug 2009 | 8:05 am

ఎల్‌వీబీ వాటాదారులకు 25 శాతం డివిడెండ్

లక్ష్మీ విలాస్ బ్యాంకు (ఎల్‌వీబీ) బోర్డు డైరెక్టర్లు శుక్రవారం 25 శాతం టాక్స్- ఫ్రి డివిడెండ్ ప్రకటించాలని సిఫార్సు చేశారు. ఇదిలా ఉంటే శుక్రవారం ఎల్‌వీబీ 82వ వార్షిక సర్వసభ్య సమావేశం కూడా జరిగింది. ఈ సమావేశానికి వ్యవస్థాగత ప్రతినిధులు, వాటాదారులు హాజరయ్యారు. ఈ ఏడాది బ్యాంకు నికరలాభం రెట్టింపు అయ్యింది.
Source: Yahoo! Telugu: News | 29 Aug 2009 | 7:50 am

ఫోఖ్రాన్-2పై రాద్ధాంతం వద్దు: ప్రధాని మన్మోహన్

భారత శాస్త్రవేత్తలు విజయవంతంగా నిర్వహించిన ఫోఖ్రాన్-2 అణు పరీక్షలపై ఎలాంటి అనుమానాలు, సందేహాలు పెట్టుకోవద్దని, అలాగే, దీనిపై రాద్ధాంతం చేయాల్సిన పని లేదని ప్రధాని మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు.
Source: Yahoo! Telugu: News | 29 Aug 2009 | 7:18 am

ఈ ఏడాది ఆరు శాతం వృద్ధి సాధ్యమే: ప్రణబ్

దేశవ్యాప్తంగా ఎక్కువ ప్రాంతాల్లో కరువు పరిస్థితులు నెలకొని ఉన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆరు శాతం వృద్ధి రేటు సాధ్యపడుతుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ తెలిపారు. కరువు నెలకొన్నా ఈ ఏడాది భారత్ ఆరు శాతం వృద్ధి రేటు నమోదు చేయగలదని ప్రణబ్ ధీమా వ్యక్తం చేశారు.
Source: Yahoo! Telugu: News | 29 Aug 2009 | 7:14 am

అమెరికా స్టాక్ మార్కెట్లు

డౌ జోన్స్ ఇండస్ట్రియల్ ఇండెక్స్ - 0.38 శాతంతో 36.43 పాయింట్లు వృద్ధి చెంది 9,544.20 వద్దకు చేరుకుంది. స్టాండార్డ్ అండ్ పూర్స్ 500 ఇండెక్స్ - 0.20 శాతంతో 2.05 పాయింట్లు బలపడి 1,028.93 వద్దకు చేరుకుంది. నాస్‌డాక్ కంపోజిట్ ఇండెక్స్ - 0.05 శాతంతో 1.04 పాయింట్లు పెరిగి 2,028.77 వద్దకు చేరుకుంది.
Source: Yahoo! Telugu: News | 29 Aug 2009 | 7:01 am

లింకులు పెట్టి రాయడం విలేకరులకు వెన్నతో పెట్టిన విద్య: సల్మాన్

సల్మాన్ ఖాన్ నోరు విప్పాడంటే మాటల తూటాలే. ముంబయిలో ఇటీవల జరిగిన ఓ మీడియా సమావేశంలో అనూహ్యంగా పత్రికా విలేకరులపై మాటల బాణాలు సంధించాడు సల్మాన్. పరోక్షంగా తన గాళ్‌ఫ్రెండ్స్‌తో లింకులు పెడుతూ వచ్చిన వార్తలను దృష్టిలో పెట్టుకుని సల్మాన్ నవ్వుతూనే విలేకరులకు చురకలు అంటించాడు. ఆడ-మగ కలిసి మాట్లాడుకుంటే చాలు.. పత్రికలవాళ్లు లింకులు పెడుతూ రాసి పారేస్తారనీ, ముఖ్యంగా హీరోహీరోయిన్లు కాస్తంత చనువుగా కనబడితే... తెల్లారేసరికి వాళ్లిద్దరి మధ్య ఎఫైర్ ఉందని ఊదరకొడతారని సల్మాన్ అన్నాడట. ఒక జంట వివాహం చేసుకోవాలంటే.. దానికి ముందు ఒకరినొకరు అర్థం చేసుకోవాలనీ, అందుకుగాను ఇద్దరూ కలిసి సినిమాలు, పార్కులు.. ఇలా అనేక ప్రాంతాలలో కలుసుకుని మనసు విప్పి మాట్లాడుకుంటారనీ చెప్పుకొచ్చాడట. సదరు జంట అభిప్రాయాలు ఒకటైతే డేటింగ్ మొదలవుతుందనీ... ఇంత జరిగిన తర్వాతే వారి మధ్య ఎఫైర్ నడుస్తుందనీ... అయితే ఈ లోపే వాళ్లిద్దరు కలిసి కార్లో వెళ్లారనో.. ఇంకెక్కిడికో వెళ్లారనో పత్రికలవాళ్లు రాస్తుంటారని నవ్వుతూ చురకలేశాడట సల్మాన్.
Source: Yahoo! Telugu: Entertainment | 29 Aug 2009 | 6:50 am

మైకేల్ జాక్సన్ మరణం 'హత్యే': కరోనెర్

పాప్ సంగీత ప్రపంచం రారాజుగా కోట్లాది మంది అభిమానులను ఆలరించిన మైకేల్ జాక్సన్‌‍ది సాధారణ మరణం కాదని లాస్ ఏంజెలెస్ కౌంటీ కరోనెర్ వెల్లడించారు. పాప్ కింగ్ మరణం డగ్స్‌తో ముడిపడిన హత్యేనని నిర్ధారణకు వచ్చారు. మైకేల్ జాక్సన్ మరణానికి ప్రొపొఫోల్, రోరాజెపామ్ డ్రగ్స్ ప్రధాన కారణమని గుర్తించారు.
Source: Yahoo! Telugu: News | 29 Aug 2009 | 6:47 am

షోపియాన్ కేసు: సమాచారం ఇస్తే.. రివార్డు

షోపియాన్ జిల్లాల్లో ఇద్దరు మహిళలపై అత్యాచారం చేసి ఆపైన హత్య కావింపబడిన కేసుకు సంబంధించి సమాచారం అందించిన వారికి జమ్మూ, కాశ్మీర్ పోలీసులు రూ. 20 రివార్డును ప్రకటించారు. సమాచారం అందించిన వ్యక్తి గురించిన వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 29 Aug 2009 | 6:29 am

"దారిన పోయే దానయ్య"తో చిత్రం తీయలేం: నాగ్

తెలుగు చిత్ర పరిశ్రమలో వారసత్వం ఎక్కువ కావడం లేదు. మా కుటుంబాలకు చెందిన వారే కాకుండా.. అనేక మంది యువ హీరోలు వస్తున్నారు. ఏదైనా ఖర్చు చేయాలంటే పది సార్లు ఆలోచన చేయడం మనిషి నైజం. కోట్లు పెట్టి సినిమా తీసే దర్శక నిర్మాతకు ఆమాత్రం స్వేచ్ఛ ఉంటుంది.
Source: Yahoo! Telugu: Entertainment | 29 Aug 2009 | 4:17 am

భాజపా పరిణామాలు మంచిది కాదు: మన్మోహన్

ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ గత కొన్ని రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు మంచిది కాదని ప్రధాని మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. అలాగే, కాందహార్, ఫోఖ్రాన్-2‌లపై ఇపుడు రాద్ధాంతం అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు.
Source: జాతీయ | 29 Aug 2009 | 3:59 am

ఫోఖ్రాన్-2పై రాద్ధాంతం వద్దు: ప్రధాని మన్మోహన్

భారత శాస్త్రవేత్తలు విజయవంతంగా నిర్వహించిన ఫోఖ్రాన్-2 అణు పరీక్షలపై ఎలాంటి అనుమానాలు, సందేహాలు పెట్టుకోవద్దని, అలాగే, దీనిపై రాద్ధాంతం చేయాల్సిన పని లేదని ప్రధాని మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు.
Source: జాతీయ | 29 Aug 2009 | 1:50 am

షోపియాన్ కేసు: సమాచారం ఇస్తే.. రివార్డు

షోపియాన్ జిల్లాల్లో ఇద్దరు మహిళలపై అత్యాచారం చేసి ఆపైన హత్య కావింపబడిన కేసుకు సంబంధించి సమాచారం అందించిన వారికి జమ్మూ, కాశ్మీర్ పోలీసులు రూ. 20 రివార్డును ప్రకటించారు. సమాచారం అందించిన వ్యక్తి గురించిన వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
Source: జాతీయ | 29 Aug 2009 | 1:28 am

ఇద్దరు ప్రరాపా కార్యకర్తలు దుర్మరణం

ప్రజారాజ్యం పార్టీకి చెందిన ఇద్దరు కార్యకర్తలు శనివారం మృతి చెందారు. ఆ పార్టీ తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ ఎదుట నిర్వహించ తలపెట్టిన మహా ధర్నాకు కారులో బయలుదేరారు. కారు కాకినాడ సమీపంలో వెళుతుండగా అదుపు తప్పి లాకుల్లోకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది.
Source: ఏపీ న్యూస్ | 29 Aug 2009 | 12:54 am

నేడు కాకినాడలో ప్రజారాజ్యం మహా ధర్నా

కృష్ణా-గోదావరి (కేజీ) బేసిన్‌లో ఉత్పత్తి అయ్యే గ్యాస్‌ నిక్షేపాల్లో రాష్ట్ర వాటాను కేటాయించిన తర్వాతే మిగిలిన వనరులను ఇతర ప్రాంతాలకు తరలించాలని ప్రజారాజ్యం పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తోంది.
Source: ఏపీ న్యూస్ | 29 Aug 2009 | 12:44 am

ఆర్థిక క్రమశిక్షణే.. అభివృద్ధికి ప్రమాణికం: వైఎస్

ఆర్థిక క్రమశిక్షణే.. ఆభివృద్ధికి ప్రమాణికమని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి అభిప్రాయపడ్డారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో దక్షిణ భారత ఛార్టెడ్ అకౌంటెంట్ల సదస్సు శనివారం ఆరంభమైంది.
Source: ఏపీ న్యూస్ | 29 Aug 2009 | 12:39 am

కాంగ్రెస్-తెదేపాల దాగుడు మూతలు: చిరంజీవి

రాష్ట్ర జల వనరులను కాపాడటంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు రెండూ కూడా దాగుడు మూతలు ఆడుతున్నాయని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ఆరోపించారు. ఆ రెండు పార్టీలకు ప్రజా సమస్యల కంటే సొంత అజెండాలే ప్రధానంగా భావిస్తున్నాయని దుయ్యబట్టారు.
Source: ఏపీ న్యూస్ | 29 Aug 2009 | 12:16 am

భాజపా సారథ్య పగ్గాలు నరేంద్ర మోడీకి!

భారతీయ జనతా పార్టీలో నెలకొన్న అంతర్గత సంక్షోభం ఆ పార్టీ ప్రక్షాళనకు దారితీసే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పార్టీ పగ్గాలను యువతరానికి అప్పగించాలని మాతృసంస్థ ఆర్.ఎస్.ఎస్ చేస్తున్న వాదననకు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు మరింత బలం చేకూర్చుతున్నాయి.
Source: జాతీయ | 28 Aug 2009 | 11:39 pm

నేటి నుంచి సీపీఎం రాష్ట్ర సమావేశాలు!

సీపీఎం రాష్ట్ర స్థాయి సమావేశాలు శనివారం నుంచి నాలుగు రోజుల పాటు జరుగనున్నాయి. రాష్ట్ర రాజధానిలో జరిగే ఈ కీలక సమావేశాలకు ఆ పార్టీకి చెందిన జాతీయ నేతలు సైతం హాజరుకానున్నారు. ఇందులో ఎన్నికల అనంతర పరిస్థితులు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేస్తారు.
Source: ఏపీ న్యూస్ | 28 Aug 2009 | 10:05 pm

అద్వానీ వైదొలగండి : ఆర్ఎస్ఎస్

భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకత్వంలో మార్పులు రావడం దాదాపు ఖరారైనట్లు సమాచారం. బీజేపీ నేతలైన అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్ మరియు వెంకయ్య నాయుడుల ద్వారా అద్వానీని రాజీనామా చేయాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆదేశాలు పంపించింది.
Source: జాతీయ | 28 Aug 2009 | 9:43 pm

గిన్నిస్‌ కోసం వైద్యుల ఆరాటం

తమిళనాడులోని మధురైలో ఉన్న రాజాజీ ప్రభుత్వ ఆసుపత్రిలో ఈనెల 24న బ్రెస్ట్ క్యాన్సర్ ఆపరేషన్లు నిర్వహించారు. ఈ ఆపరేషన్లు ఒకే రోజు కేవలం మూడున్నర గంటల వ్యవధిలో పద్నాలుగు బ్రెస్ట్ క్యాన్సర్ ఆపరేషన్లు నిర్వహించడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది
Source: జాతీయ | 28 Aug 2009 | 8:54 pm

సెప్టెంబర్ 16న వస్తోన్న నారా రోహిత్ "బాణం"

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సోదరుని కుమారుడు నారా రోహిత్ హీరోగా, వేదిక హీరోయిన్‌గా నటిస్తోన్న "బాణం" చిత్రం సెప్టెంబర్ 16వ తేదీన తెరపైకి రానుంది. వైజయంతి మూవీస్ నుంచి త్రీ ఏంజెల్స్ స్టూడియోపై శేషు ప్రియాంక చలసాని నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ప్రముఖ ఫిల్మ్ జర్నలిస్ట్ మరియు కథా రచయిత డి. నారాయణ వర్మ కుమారుడు చైతన్య దంతులూరి దర్శకత్వం వహిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 28 Aug 2009 | 1:12 pm

గోపీచంద్, త్రిషల "శంఖం" ట్రైలర్ మీ కోసం...

గోపీచంద్, త్రిష జంటగా నటిస్తున్న చిత్రం 'శంఖం'. ఇందులో తమిళ నటుడు సత్యరాజ్ ఓ కీలక పాత్రను పోషించారు. ఇప్పటికే ఈ సినిమాకు చెందిన పాటలు శ్రోతలను అలరిస్తున్నాయని దర్శకుడు శివ అన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 28 Aug 2009 | 12:30 pm

భార్యను పట్టించుకోని వ్యక్తి "జెంటిల్‌మేన్" ఎలా అయ్యాడు?

పోసాని కృష్ణమురళి, ఆర్తీ అగర్వాల్, లూయిస్ హీరోహీరోయిన్లుగా, నల్లం పద్మజ నిర్మిస్తోన్న "జెంటిల్‌మేన్" చిత్రం షూటింగ్ ముగింపు దశలో ఉంది. శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని ఓ భవింతిలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు పోసాని మాట్లాడుతూ.. పెళ్లికి ముందునుంచే భార్య కొంగుపట్టుకుని తిరిగే ప్రతి వ్యక్తి ఐదేళ్ల తర్వాత దూరమవుతున్నాడు. అలా అని ఆమెపై ప్రేమలేకకాదు. మరో కొత్త మనిషి పరిచయమయ్యేసరికి గతంలో భార్యపై ఎలాంటి ప్రేమను వ్యక్తం చేసేవాడో.. ఇప్పుడు ఆ అమ్మాయిపై చేస్తుంటాడు. అసలు భార్యను పట్టించుకోడు. దీనికి కారణమేమిటి? అనేది జెంటిల్‌మేన్‌లో చర్చించామని పోసాని చెప్పారు.
Source: Yahoo! Telugu: Entertainment | 28 Aug 2009 | 12:18 pm

సెప్టెంబరులో వస్తోన్న "సారాయి వీర్రాజు" పాటలు

అజయ్ హీరోగా, మలయాళనటి మధులిత హీరోయిన్‌గా నటిస్తోన్న చిత్రం "సారాయి వీర్రాజు". విశాలాక్షీ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై పి.ఆర్.కె. రావు నిర్మిస్తోన్న ఈ చిత్రం 90 శాతం పూర్తయ్యింది. ప్రముఖ దర్శకుడు రాజమౌళి శిష్యుడు డి.ఎస్. కణ్ణన్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. టైటిల్ పాత్రను "ఆ ఒక్కడు" ఫేమ్ అజయ్ బాగా చేశాడని, ఎండలో చాలా కష్టపడ్డానని కణ్ణన్ చెప్పారు. మలయాళ నటి మధులిక పాత్రకు న్యాయం చేసిందని, సెప్టెంబరులో ఈ సినిమా ఆడియోను విడుదల చేస్తున్నామని దర్శకుడు వెల్లడించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 28 Aug 2009 | 12:00 pm

శరవేగంగా "నాగార్జున" తాజా సినిమా షూటింగ్!

విక్కీదాదా, అల్లరి అల్లుడు, సీతారామరాజు, నేనున్నాను. కింగ్ వంటి హిట్ చిత్రాల తర్వాత టాలీవుడ్ "కింగ్" నాగార్జున కథానాయకుడిగా కామాక్షి కళా మూవీస్ పతాకంపై కొత్త చిత్రం రూపుదిద్దుకుంటోంది. ప్రముఖ నిర్మాత డి. శివప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం షెడ్యూల్ ఏకధాటిగా జరుగుతోంది. ఈ సందర్భంగా నిర్మాత డి. శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ.. "మా మిత్రులు.. మా హీరో అయిన.." నాగార్జునకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. "కింగ్" తర్వాత మళ్లీ నాగార్జునతో నిర్మిస్తున్న కొత్త చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోందన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 28 Aug 2009 | 10:30 am

"ఓటుకు నోటు" సూత్రధారి అద్వానీయే: జస్వంత్

ఓటుకు నోటు సూత్రధారి భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకుడు లాల్ కృష్ణ అద్వానీయేనని ఆ పార్టీ బహిష్కృత నేత జస్వంత్ సింగ్ అన్నారు. నిరుడు లోక్‌సభలో నోట్ల కట్టలను నాటకీయంగా ప్రవేశపెట్టిన ప్రధాన సూత్రధారి అద్వానీయేనని ఆయన అన్నారు.
Source: జాతీయ | 28 Aug 2009 | 10:03 am

అత్యవసరంగా సమావేశమైన జాతీయ భద్రతా మండలి

దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ అధ్యక్షతన శుక్రవారం నాడు జాతీయ భద్రతా మండలి అత్యవసరంగా సమావేశమైంది. భారత అణు కార్యక్రమంపై మాజీ ఐఆర్‌డిఎ శాస్త్రవేత్త సంతానం చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో జాతీయ భద్రతా మండలి అత్యవసరంగా సమావేశం కావడం ప్రాథాన్యతను సంతరించుకుంది.
Source: జాతీయ | 28 Aug 2009 | 9:08 am

50వ వసంతంలో యువసామ్రాట్ నాగార్జున!

టాలీవుడ్ "కింగ్"గా తన హవాను కొనసాగిస్తున్న యువసామ్రాట్ అక్కేనేని నాగార్జున.. "కింగ్" తర్వాత కొంత గ్యాప్ తీసుకుంటున్నారు. ఈ నెల 29 (శనివారం)న నాగ్ పుట్టినరోజు. ఈ 50వ పుట్టినరోజు నాగ్‌కు స్పెషల్ బర్త్ డే అని సినీ వర్గాల్లో టాక్. అసలు విషయమేమిటంటే..? తన కుమారుడైన నాగచైతన్య హీరోగా పరిచయమవుతున్న "జోష్" చిత్రం ఇదే రోజున విడుదల కానుందని సినీ వర్గాల సమాచారం. సుప్రసిద్ధ నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వర రావు తనయుడైన నాగార్జున 1986వ సంవత్సరం మే 23వ తేదీన విడుదలైన "విక్రం"తో తెరంగేట్రం చేశారు. బావనచ్చాడు, స్నేహమంటే ఇదేరా, సంతోషం, మన్మథుడు, శివమణి, నేనున్నాను, కృష్ణార్జున వంటి.. ఇంచు మించు 80 సినిమాల్లో నటించి మాస్ హీరోగా ముద్రవేసుకున్నాడు. ఇకపోతే.. నాగార్జున పుట్టినరోజు: ఆగస్టు 29, 1959జన్మస్థలం: చెన్నై.ముద్దుపేరు: నాగ్,సినీ తెరంగేట్రం: 1986.తాజా సినిమా: ఆకాశమంత దర్శకుడు రాధామోహన్‌తో (ఇంకా చర్చల్లో..).వయస్సు: 50 సంవత్సరాల్లోకి అడుగు పెడుతున్న నాగార్జున. తెలుగు సినీ రంగంలో 25 సంవత్సరాల వసంతాలకు దగ్గరవుతోన్న అక్కినేని నాగార్జునకు పుట్టిన రోజు శుభాకాంక్షలు...
Source: Yahoo! Telugu: Entertainment | 28 Aug 2009 | 8:50 am

తితిదే చర్చ రాకూడదనే అలా చేస్తున్నారు: చిరు

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)లో జరుగుతున్న లీలలపై చర్చ జరగరాదనే అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు సభలో రాద్దాంతం సృష్టిస్తున్నాయని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి అభిప్రాయపడ్డారు.
Source: ఏపీ న్యూస్ | 28 Aug 2009 | 8:07 am

నయనతారకు అంత సీన్ లేదు.. హాన్సికను తీసుకుందాం....

ఎదపై టాటూలు వేసుకుని గ్లామర్‌కే మెరుగులు దిద్దుకుంటూ దక్షిణాది ప్రేక్షకులను అలరించే నయనతారకు హాన్సిక షాక్ ఇచ్చింది. ప్రముఖ నిర్మాత ఎమ్.ఎస్. రాజు నిర్మిస్తున్న "చండి" చిత్రంలోని ఆమె పాత్రను అత్యంత చాకచక్యంగా లాగేసుకుంది. పైగా ఆ పాత్రకు నయనతారను తీసుకున్నట్లు తనకు తెలియదని సన్నాయి నొక్కులు నొక్కుతోందట. ఇదిలావుంటే అరుంధతి టైపు పాత్రలో నయనతారకంటే హాన్సిక అయితే ఖచ్చితంగా సరిపోతుందని దర్శకుడు కోడి రామకృష్ణ అభిప్రాయపడ్డారట. అందువల్లనే నయనతారకు బదులు హాన్సికను తీసుకున్నట్లు టాలీవుడ్ న్యూస్. నయనతారకు ఇటువంటి షాకులు తమిళంలో తమన్నా కూడా ఇచ్చింది. నయనకు వచ్చిన ఆఫర్‌ను చివరి నిమిషంలో తమన్నా గద్దలా తన్నుకుపోయింది. ఆ సందర్భంలో నయనతార తమన్నాను ఏమీ అనలేక, సదరు చిత్ర నిర్మాతపై చిందులు వేసింది. ప్చ్... నయనతార బ్యాడ్ లక్. ఏం చేస్తాం...
Source: Yahoo! Telugu: Entertainment | 28 Aug 2009 | 7:41 am

గోపీచంద్, త్రిషల "శంఖం" ట్రైలర్ మీ కోసం...

గోపీచంద్, త్రిష జంటగా నటిస్తున్న చిత్రం 'శంఖం'. ఇందులో తమిళ నటుడు సత్యరాజ్ ఓ కీలక పాత్రను పోషించారు. ఇప్పటికే ఈ సినిమాకు చెందిన పాటలు శ్రోతలను అలరిస్తున్నాయని దర్శకుడు శివ అన్నారు.
Source: వినోదం | 28 Aug 2009 | 7:05 am

సెప్టెంబరులో వస్తోన్న "సారాయి వీర్రాజు" పాటలు

అజయ్ హీరోగా, మలయాళనటి మధులిత హీరోయిన్‌గా నటిస్తోన్న చిత్రం "సారాయి వీర్రాజు". విశాలాక్షీ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై పి.ఆర్.కె. రావు నిర్మిస్తోన్న ఈ చిత్రం 90 శాతం పూర్తయ్యింది. ప్రముఖ దర్శకుడు రాజమౌళి శిష్యుడు డి.ఎస్. కణ్ణన్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. టైటిల్ పాత్రను "ఆ ఒక్కడు" ఫేమ్ అజయ్ బాగా చేశాడని, ఎండలో చాలా కష్టపడ్డానని కణ్ణన్ చెప్పారు. మలయాళ నటి మధులిక పాత్రకు న్యాయం చేసిందని, సెప్టెంబరులో ఈ సినిమా ఆడియోను విడుదల చేస్తున్నామని దర్శకుడు వెల్లడించారు.
Source: వినోదం | 28 Aug 2009 | 6:31 am

భాజపాకు ప్రత్యక్షంగా సలహాలు ఇవ్వం: ఆర్.ఎస్.ఎస్

అంతర్గత సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న భారతీయ జనతా పార్టీకి అడగకుండా తాము ఎలాంటి సలహాలు ఇవ్వబోమని ఆ పార్టీ మాతృసంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్‌సంఘ్ (ఆర్.ఎస్.ఎస్) చీఫ్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు. సాధారణంగా భాజపాకు సంఘ్ సలహాలు, సూచనలు ఇస్తూ ఉంటామన్నారు.
Source: జాతీయ | 28 Aug 2009 | 6:24 am

ఉగ్రవాది ముజీబ్‌కు జీవిత ఖైదు: కోర్టు తీర్పు

హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన తీవ్రవాది ముజీబ్‌కు రాజధానిలోని నాంపల్లి కోర్టు జీవిత కారాగార శిక్ష విధించింది. ఆయుధాల అక్రమ రవాణా కేసులో ఆయనకు ఈ శిక్ష విధిస్తూ కోర్టు శుక్రవారం తీర్పు ఇచ్చింది.
Source: ఏపీ న్యూస్ | 28 Aug 2009 | 5:57 am

శరవేగంగా "నాగార్జున" తాజా సినిమా షూటింగ్!

విక్కీదాదా, అల్లరి అల్లుడు, సీతారామరాజు, నేనున్నాను. కింగ్ వంటి హిట్ చిత్రాల తర్వాత టాలీవుడ్ "కింగ్" నాగార్జున కథానాయకుడిగా కామాక్షి కళా మూవీస్ పతాకంపై కొత్త చిత్రం రూపుదిద్దుకుంటోంది. ప్రముఖ నిర్మాత డి. శివప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం షెడ్యూల్ ఏకధాటిగా జరుగుతోంది. ఈ సందర్భంగా నిర్మాత డి. శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ.. "మా మిత్రులు.. మా హీరో అయిన.." నాగార్జునకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
Source: వినోదం | 28 Aug 2009 | 5:01 am

వసుంధర రాజేకు నోటీసు జారీ చేసిన భాజపా

రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజేకు భారతీయ జనతా పార్టీ అధిష్టానం మరోమారు నోటీసు జారీ చేసింది. ఈనెల 31వ తేదీన ఢిల్లీకి వచ్చి పార్టీ సీనియర్ నేత ఎం.వెంకయ్య నాయుడుని కలవాలని అందులో భాజపా అధిష్టానం పేర్కొంది.
Source: జాతీయ | 28 Aug 2009 | 3:54 am

50వ వసంతంలో యువసామ్రాట్ నాగార్జున!

టాలీవుడ్ "కింగ్"గా తన హవాను కొనసాగిస్తున్న యువసామ్రాట్ అక్కేనేని నాగార్జున.. "కింగ్" తర్వాత కొంత గ్యాప్ తీసుకుంటున్నారు. ఈ నెల 29 (శనివారం)న నాగ్ పుట్టినరోజు. ఈ 50వ పుట్టినరోజు నాగ్‌కు స్పెషల్ బర్త్ డే అని సినీ వర్గాల్లో టాక్. అసలు విషయమేమిటంటే..? తన కుమారుడైన నాగచైతన్య హీరోగా పరిచయమవుతున్న "జోష్" చిత్రం ఇదే రోజున విడుదల కానుందని సినీ వర్గాల సమాచారం. సుప్రసిద్ధ నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వర రావు తనయుడైన నాగార్జున 1986వ సంవత్సరం మే 23వ తేదీన విడుదలైన "విక్రం"తో తెరంగేట్రం చేశారు. బావనచ్చాడు, స్నేహమంటే ఇదేరా, సంతోషం, మన్మథుడు, శివమణి, నేనున్నాను, కృష్ణార్జున వంటి.. ఇంచు మించు 80 సినిమాల్లో నటించి మాస్ హీరోగా ముద్రవేసుకున్నాడు. ఇకపోతే.. నాగార్జున పుట్టినరోజు: ఆగస్టు 29, 1959 జన్మస్థలం: చెన్నై. ముద్దుపేరు: నాగ్, సినీ తెరంగేట్రం: 1986. తాజా సినిమా: ఆకాశమంత దర్శకుడు రాధామోహన్‌తో (ఇంకా చర్చల్లో..). వయస్సు: 50 సంవత్సరాల్లోకి అడుగు పెడుతున్న నాగార్జున. తెలుగు సినీ రంగంలో 25 సంవత్సరాల వసంతాలకు దగ్గరవుతోన్న అక్కినేని నాగార్జునకు పుట్టిన రోజు శుభాకాంక్షలు...
Source: వినోదం | 28 Aug 2009 | 3:21 am