|
వసుంధర రాజేకు నోటీసు జారీ చేసిన భాజపారాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజేకు భారతీయ జనతా పార్టీ అధిష్టానం మరోమారు నోటీసు జారీ చేసింది. ఈనెల 31వ తేదీన ఢిల్లీకి వచ్చి పార్టీ సీనియర్ నేత ఎం.వెంకయ్య నాయుడుని కలవాలని అందులో భాజపా అధిష్టానం పేర్కొంది.Source: Yahoo! Telugu: News | 28 Aug 2009 | 9:23 am లాభాల్లో స్టాక్ మార్కెట్: డీఎల్ఎఫ్ వృద్ధిస్టాక్ మార్కెట్ ప్రస్తుతం లాభాల్లో పయనిస్తుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 128 పాయింట్లు పుంజుకుని 15,909 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 35 పాయింట్లు లాభపడి 4,723 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.81 శాతం, నిఫ్టీ 0.75 శాతం మేరకు వృద్ధి చెందాయి.Source: Yahoo! Telugu: News | 28 Aug 2009 | 9:08 am 50వ వసంతంలో యువసామ్రాట్ నాగార్జున!టాలీవుడ్ "కింగ్"గా తన హవాను కొనసాగిస్తున్న యువసామ్రాట్ అక్కేనేని నాగార్జున.. "కింగ్" తర్వాత కొంత గ్యాప్ తీసుకుంటున్నారు. ఈ నెల 29 (శనివారం)న నాగ్ పుట్టినరోజు. ఈ 50వ పుట్టినరోజు నాగ్‌కు స్పెషల్ బర్త్ డే అని సినీ వర్గాల్లో టాక్. అసలు విషయమేమిటంటే..? తన కుమారుడైన నాగచైతన్య హీరోగా పరిచయమవుతున్న "జోష్" చిత్రం ఇదే రోజున విడుదల కానుందని సినీ వర్గాల సమాచారం. సుప్రసిద్ధ నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వర రావు తనయుడైన నాగార్జున 1986వ సంవత్సరం మే 23వ తేదీన విడుదలైన "విక్రం"తో తెరంగేట్రం చేశారు. బావనచ్చాడు, స్నేహమంటే ఇదేరా, సంతోషం, మన్మథుడు, శివమణి, నేనున్నాను, కృష్ణార్జున వంటి.. ఇంచు మించు 80 సినిమాల్లో నటించి మాస్ హీరోగా ముద్రవేసుకున్నాడు. ఇకపోతే.. నాగార్జున పుట్టినరోజు: ఆగస్టు 29, 1959జన్మస్థలం: చెన్నై.ముద్దుపేరు: నాగ్,సినీ తెరంగేట్రం: 1986.తాజా సినిమా: ఆకాశమంత దర్శకుడు రాధామోహన్‌తో (ఇంకా చర్చల్లో..).వయస్సు: 50 సంవత్సరాల్లోకి అడుగు పెడుతున్న నాగార్జున. తెలుగు సినీ రంగంలో 25 సంవత్సరాల వసంతాలకు దగ్గరవుతోన్న అక్కినేని నాగార్జునకు పుట్టిన రోజు శుభాకాంక్షలు...Source: Yahoo! Telugu: Entertainment | 28 Aug 2009 | 8:50 am స్మోకింగ్ రేసులో భారతీయ మహిళ తృతీయ స్థానం"పొగ త్రాగని వాడు దున్నపోతై పుట్టున్...!" అనే ధూమపాన ప్రియుల మాటల్ని నేడు మన భారతదేశ మహిళామణులు బాగానే వంటబట్టించుకున్నట్లు అర్థమవుతోంది. పొగ సేవించే ప్రపంచంలోని టాప్-20 దేశాల జాబితాలో మన పడతులు ముచ్చటగా మూడో స్థానాన్ని అలంకరించటమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పవచ్చు.Source: Yahoo! Telugu: News | 28 Aug 2009 | 8:33 am ఒడిదుడుకుల మధ్య స్టాక్ మార్కెట్స్టాక్ మార్కెట్ ప్రస్తుతం ఒడిదుడుకుల మధ్య పయనిస్తుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 36 పాయింట్లు లాభపడి 15,817 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 5 పాయింట్లు పుంజుకుని 4,693 వద్ద పయనిస్తోంది.Source: Yahoo! Telugu: News | 28 Aug 2009 | 8:14 am పుస్తకంపై నిషేధం: సుప్రీంలో జశ్వంత్ పిటీషన్తన స్వీయ రచన చేసి, విడుదల చేసిన పుస్తకంపై గుజరాత్‌లోని నరేంద్ర మోడీ సర్కారు నిషేధం విధించడం పట్ల భారతీయ జనతా పార్టీ బహిష్కృత నేత జశ్వంత్ సింగ్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం అపెక్స్ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.Source: Yahoo! Telugu: News | 28 Aug 2009 | 7:53 am నయనతారకు అంత సీన్ లేదు.. హాన్సికను తీసుకుందాం....ఎదపై టాటూలు వేసుకుని గ్లామర్‌కే మెరుగులు దిద్దుకుంటూ దక్షిణాది ప్రేక్షకులను అలరించే నయనతారకు హాన్సిక షాక్ ఇచ్చింది. ప్రముఖ నిర్మాత ఎమ్.ఎస్. రాజు నిర్మిస్తున్న "చండి" చిత్రంలోని ఆమె పాత్రను అత్యంత చాకచక్యంగా లాగేసుకుంది. పైగా ఆ పాత్రకు నయనతారను తీసుకున్నట్లు తనకు తెలియదని సన్నాయి నొక్కులు నొక్కుతోందట. ఇదిలావుంటే అరుంధతి టైపు పాత్రలో నయనతారకంటే హాన్సిక అయితే ఖచ్చితంగా సరిపోతుందని దర్శకుడు కోడి రామకృష్ణ అభిప్రాయపడ్డారట. అందువల్లనే నయనతారకు బదులు హాన్సికను తీసుకున్నట్లు టాలీవుడ్ న్యూస్. నయనతారకు ఇటువంటి షాకులు తమిళంలో తమన్నా కూడా ఇచ్చింది. నయనకు వచ్చిన ఆఫర్‌ను చివరి నిమిషంలో తమన్నా గద్దలా తన్నుకుపోయింది. ఆ సందర్భంలో నయనతార తమన్నాను ఏమీ అనలేక, సదరు చిత్ర నిర్మాతపై చిందులు వేసింది. ప్చ్... నయనతార బ్యాడ్ లక్. ఏం చేస్తాం...Source: Yahoo! Telugu: Entertainment | 28 Aug 2009 | 7:41 am ఏకపక్షంగా సొసైటీల రిజిస్ట్రేన్ల బిల్లుకు ఆమోదం!రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు మరో వివాదాస్పద బిల్లుకు ఏకపక్షంగా ఆమోదముద్ర వేసింది. ఒకవైపు ప్రతిపక్ష పార్టీలు బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ.. ప్రభుత్వం మాత్రం తాము చెప్పిందే వేదం అన్నట్టుగా బిల్లును ఆమోదిస్తూ.. తాము చేపట్టిన చర్యను సమర్థించుకుంది.Source: Yahoo! Telugu: News | 28 Aug 2009 | 7:36 am చైనాలోని వాయువ్య దిశలో తీవ్రమైన భూకంపంచైనా దేశానికి వాయువ్యాన ఉన్న ఛిన్‌ఘాయ్ ప్రాంతంలోని గోల్‌ముద్‌కు 165 కిలోమీటర్ల దూరంలో అక్కడి సమయాన్ననుసరించి శుక్రవారం ఉదయం గం. 9.52లకు భూకంపం సంభవించింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణహాని కలగలేదని అక్కడి వార్తా సంస్థ తెలిపింది.Source: Yahoo! Telugu: News | 28 Aug 2009 | 7:29 am బషీర్‌బాగ్ కాల్పులకు నేటితో తొమ్మిదేళ్లురాష్ట్ర రాజధాని బషీర్‌బాగ్‌లో వామపక్ష కార్యకర్తలపై పోలీసులు కాల్పులు జరిపిన సంఘటనకు నేటితో తొమ్మిదేళ్లు. అప్పటి తెలుగుదేశం పార్టీ పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా లెఫ్ట్ పార్టీల కార్యకర్తలు బషీర్‌బాగ్‌లో భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ ఆందోళన హింసాత్మకంగా మారింది.Source: Yahoo! Telugu: News | 28 Aug 2009 | 7:24 am నష్టాల్లో పయనిస్తున్న స్టాక్ మార్కెట్స్టాక్ మార్కెట్ ప్రస్తుతం లాభాల్లో పయనిస్తుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 99 పాయింట్లు కోల్పోయి 15,682 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 32 పాయింట్లు లాభపడి 4,656 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.63 శాతం, నిఫ్టీ 0.68 శాతం మేరకు వృద్ధి చెందాయి.Source: Yahoo! Telugu: News | 28 Aug 2009 | 7:23 am ఉత్పత్తులు పెంచనున్న హీరోహోండాప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి తమ ఉత్పత్తులను పెంచుకుంటామని ద్విచక్ర వాహనాల నిర్మాణ రంగంలో అగ్రగామిగానున్న హీరోహోండా సంస్థ తెలిపింది.Source: Yahoo! Telugu: News | 28 Aug 2009 | 6:41 am నాది లవ్ మ్యారేజే: జెనీలియా"సత్యం" సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన చిలిపి నవ్వుల ముద్దుగుమ్మ జెనీలియా డిసౌజా. ఆగస్టు ఐదోతేదీ, 1987లో పుట్టిన జెనీలియా.. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో నటించింది. బాలీవుడ్ గ్రాండ్ ఫాదర్ అమితాబ్ బచ్చన్‌తో పార్కర్ పెన్ వ్యాపార ప్రకటన చిత్రం (యాడ్ ఫిలిమ్) ద్వారా వెలుగులోకి వచ్చిన జెన్నీ.. హిందీలో "తుజే మేరి కసం"తో తెరంగేట్రం చేసింది. ఇలా ఉత్తరాది నుంచి దక్షిణాదికి వచ్చిన జెనీలియా తాజాగా తెలుగులో "సత్య ఇన్ లవ్" అనే చిత్రంలో నటిస్తోంది. సాంబ, సై, హ్యాపీ, రామ్, ఢీ వంటి చిత్రాల్లో నటించిన జెనీలియాకు "బొమ్మరిల్లు" చిత్రం మొదటి ఫిలిం ఫేర్ అవార్డును (ఉత్తమ నటి అవార్డు) సంపాదించిపెట్టింది. ప్రస్తుతం హిందీ, తెలుగు, తమిళ చిత్రాల షూటింగ్‌లలో బిజీబిజీగా ఉన్న జెన్నీని కదిలిస్తే ఇలా చెప్పుకొచ్చింది. ప్రశ్న: "సత్య ఇన్ లవ్"లో మీది ఎలాంటి పాత్ర?జ: వైవిధ్యంగా ఉంటుంది. ఇప్పుడే ఆ పాత్ర గురించి చెప్పను.ప్రశ్న: మీది లవ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజా?జ.. తప్పకుండా నాది లవ్ మ్యారేజే. ప్రశ్న: మీకు భర్తగా వచ్చే వ్యక్తి ఎలా ఉండాలి?జ: సామాన్యంగా మగాడంటే ఆడదాన్ని గౌరవించాలి.Source: Yahoo! Telugu: Entertainment | 28 Aug 2009 | 5:56 am వసుంధర రాజేకు నోటీసు జారీ చేసిన భాజపారాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజేకు భారతీయ జనతా పార్టీ అధిష్టానం మరోమారు నోటీసు జారీ చేసింది. ఈనెల 31వ తేదీన ఢిల్లీకి వచ్చి పార్టీ సీనియర్ నేత ఎం.వెంకయ్య నాయుడుని కలవాలని అందులో భాజపా అధిష్టానం పేర్కొంది.Source: జాతీయ | 28 Aug 2009 | 3:54 am పుస్తకంపై నిషేధం: సుప్రీంలో జశ్వంత్ పిటీషన్తన స్వీయ రచన చేసి, విడుదల చేసిన పుస్తకంపై గుజరాత్‌లోని నరేంద్ర మోడీ సర్కారు నిషేధం విధించడం పట్ల భారతీయ జనతా పార్టీ బహిష్కృత నేత జశ్వంత్ సింగ్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం అపెక్స్ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.Source: జాతీయ | 28 Aug 2009 | 2:24 am ఏకపక్షంగా సొసైటీల రిజిస్ట్రేన్ల బిల్లుకు ఆమోదం!రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు మరో వివాదాస్పద బిల్లుకు ఏకపక్షంగా ఆమోదముద్ర వేసింది. ఒకవైపు ప్రతిపక్ష పార్టీలు బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ.. ప్రభుత్వం మాత్రం తాము చెప్పిందే వేదం అన్నట్టుగా బిల్లును ఆమోదిస్తూ.. తాము చేపట్టిన చర్యను సమర్థించుకుంది.Source: ఏపీ న్యూస్ | 28 Aug 2009 | 2:07 am బషీర్‌బాగ్ కాల్పులకు నేటితో తొమ్మిదేళ్లురాష్ట్ర రాజధాని బషీర్‌బాగ్‌లో వామపక్ష కార్యకర్తలపై పోలీసులు కాల్పులు జరిపిన సంఘటనకు నేటితో తొమ్మిదేళ్లు. అప్పటి తెలుగుదేశం పార్టీ పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా లెఫ్ట్ పార్టీల కార్యకర్తలు బషీర్‌బాగ్‌లో భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ ఆందోళన హింసాత్మకంగా మారింది.Source: ఏపీ న్యూస్ | 28 Aug 2009 | 1:54 am పార్టీ నేతలతో భేటీ కానున్న శరద్ పవార్!కాంగ్రెస్ పార్టీతో పొత్తు కొనసాగించాలా వద్దా అనే అంశంపై తేల్చేందుకు నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్.సి.పి)కి చెందిన చెందిన కీలక నేతలతో ఆ పార్టీ అధ్యక్షుడు, కేంద్ర వ్యవసాయ శాఖామంత్రి శరద్ పవార్ శుక్రవారం భేటీ కానున్నారు. త్వరలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, పొత్తులు తదితర అంశాలపై ఆయన చర్చించనున్నారు.Source: జాతీయ | 28 Aug 2009 | 1:08 am అమెరికా పర్యటనను రద్దు చేసుకున్న సల్మాన్!సినీ నటుడు షారూక్ ఖాన్‌కు అమెరికాలో జరిగిన పరాభవం... ముంబై బాలీవుడ్ స్టార్లలో కనువిప్పు కలిగించినట్టయింది. చీటికిమాటికీ అమెరికా పయనమయ్యే బాలీవుడ్ హీరోలు.. షారూక్ సంఘటన తర్వాత కాస్త వెనుకంజ వేస్తున్నారు. తాజాగా హీరో సల్మాన్ ఖాన్ తన న్యూయార్క్ పర్యటనను రద్దు చేసుకున్నారు.Source: జాతీయ | 28 Aug 2009 | 12:29 am తలతిక్కగా వ్యవహరిస్తున్న సభాపతులు: బాబురాష్ట్ర శాసనసభను సజావుగా నిర్వహించాల్సిన సభాపతి, ఉప సభాపతులు తమ ఇష్టానుసారంగా సభా కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు.Source: ఏపీ న్యూస్ | 28 Aug 2009 | 12:01 am 2014 లోపు ప్రతిపక్షాలను అంతమొందిస్తా: వైఎస్వచ్చే 2014 సంవత్సరంలో జరిగే సాధారణ ఎన్నికల నాటికి రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు పూర్తిగా తుడిచి పెట్టుకుని పోయేలా చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి జోస్యం చెప్పారు. అలాగే, 2014 ఎన్నికల తర్వాత దేశ ప్రధాని పీఠాన్ని పార్టీ యువరాజు రాహుల్ గాంధీ కావాలని ప్రతి కాంగ్రెస్ వాది కోరుకుంటున్నారన్నారు.Source: ఏపీ న్యూస్ | 27 Aug 2009 | 11:42 pm వచ్చే ఐదున తిరుపతికి రానున్న ప్రధానిప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఒక రోజు పర్యటన నిమిత్తం వచ్చే నెల ఐదో తేదీన రాష్ట్రానికి రానున్నారు. ఐదో తేదీ సాయంత్రం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతికి చేరుకునే ప్రధాని.. ఆ రోజు రాత్రికి అక్కడే బస చేస్తారు.Source: ఏపీ న్యూస్ | 27 Aug 2009 | 11:30 pm దేశంలో కొత్తగా 123 స్వైన్ ప్లూ కేసులు: ఇద్దరి మృతి!ప్రపంచాన్ని వణికిస్తున్న స్వైన్ ఫ్లూ మహమ్మారి దేశంలోని పలు ప్రాంతాలకు విస్తరిస్తోంది. దీన్ని రుజువు చేసేలా అనేక ప్రాంతాల్లో కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. ఒక్క గురువారమే.. దేశ వ్యాప్తంగా 123 స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం స్వైన్ ఫ్లూ కేసుల సంఖ్య 3,396కు చేరుకుంది.Source: జాతీయ | 27 Aug 2009 | 10:20 pm అంతర్గత కుమ్ములాటలు: అద్వానీ యాత్రకు బ్రేక్!ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీని అంతర్గత కుమ్ములాటలు పట్టిపీడిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో ఓటమిని, రానున్న రాష్ట్ర శాసనసభల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అద్వానీ సెప్టెంబర్‌లో యాత్ర తలపెట్టారు. అయితే, ఇటీవలి కాలంలో ఆ పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలు పార్టీ శ్రేణులను కుంగదీశాయి.Source: జాతీయ | 27 Aug 2009 | 9:41 pm "యంగ్ ఇండియా"కి స్క్రిప్ట్ నేనే రాసుకున్నా..!: దాసరిచాలాకాలం తర్వాత అంటే.. "స్వర్గం-నరకం" తర్వాత మళ్ళీ తాను తీసే చిత్రకథకు తానే స్క్రిప్ట్ రాసుకున్నానని దర్శకరత్న దాసరి నారాయణ రావు అన్నారు, అప్పుడు అసిస్టెంట్ డైరక్టర్లు ఉండేవారు. తాను చెబితే రికార్డు చేసేవారు. కానీ ఈసారి మాత్రం తానే స్వయంగా స్క్రిప్ట్ రాసుకున్నానని ఆయన చెప్పారు."యంగ్ ఇండియా" పేరుతో దాసరి ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్ర విశేషాలను ఆయన తెలియజేస్తూ.. ఇందులో అందరూ కొత్తవారే నటిస్తారు. అందులో ఏ మాత్రం సందేహం లేదని చెప్పారు. ఇతరుల వలె చెప్పేదొకటి వేరొకటి చేయడం తన తత్త్వంకాదని దాసరి స్పష్టం చేశారు.Source: Yahoo! Telugu: Entertainment | 27 Aug 2009 | 12:33 pm మాకు టెన్షన్-ఆమెకు భలే హుషారు: విక్రమ్విలక్షణ నటుడు విక్రమ్, సెక్సీడాళ్ శ్రేయ నటించిన తాజా చిత్రం "మల్లన్న". ఈ సినిమా షూటింగ్‌లో తామెంతో టెన్షన్‌కు గురయ్యామని, కానీ శ్రేయ మాత్రం చాలా సరదాగా, హుషారుగా గంతులేసిందని మల్లన్న హీరో విక్రమ్ అన్నారు. గురువారం హైదరాబాద్‌లో ఆయన మల్లన్న చిత్రం గురించి మాట్లాడుతూ.. కోడిపుంజు గెటెప్‌తో పాటు, ముసలివాడి గెటప్ కోసం చాలా టైమ్ పట్టేదని, ప్రధానంగా మెక్సికో ఎపిసోడ్ అనుకున్న టైమ్‌కు షూటింగ్ జరుగుతుందో? లేదో? అనే టెన్షన్‌లో పడ్డామని చెప్పారు.Source: Yahoo! Telugu: Entertainment | 27 Aug 2009 | 12:16 pm సెప్టెంబరులో వస్తోన్న "మా నాన్న చిరంజీవి"జగపతిబాబు హీరోగా అరుణ్‌ప్రసాద్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం "మా నాన్న చిరంజీవి". జయశ్రీ సమర్పణలో లాఫింగ్ లార్డ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయి పోస్ట్‌ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. దర్శకుడు మాట్లాడుతూ.. చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోందని అన్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని వచ్చేనెలలో సినిమాను విడుదల చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఇంకా ఈ చిత్రానికి కెమెరా: కె. ధరన్, ఆర్ట్: కె.వి. రమణ. ఈ సందర్భంగా హీరో జగపతిబాబు మాట్లాడుతూ.. ఈ కథ తనకు బాగా నచ్చిందన్నారు. "శుభలగ్నం"లా సెంటిమెంట్ ఉంటూ మంచి ఎంటర్‌టైన్‌మెంట్ మిళితమైన కథ ఇదని తెలిపారు.Source: Yahoo! Telugu: Entertainment | 27 Aug 2009 | 11:55 am "హాసిని"గా వస్తోన్న 'ప్రేమిస్తే' ఫేమ్ సంధ్య"ప్రేమిస్తే" ఫేమ్ సంధ్య "హాసిని"గా నటిస్తోంది. "అన్నవరం" చిత్రంలో పవన్‌కళ్యాణ్ చెల్లెలుగా నటించిన తర్వాత తెలుగులో తాను నటిస్తోన్న లేడిఓరియెంటెడ్ సినిమా ఇదని సంధ్య చెప్పింది. బుధవారం రాత్రి అన్నపూర్ణ స్టూడియోలో ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది. "అభి" ఫేమ్ కమలాకర్ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. బి.వి. రమణారెడ్డి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రానికి బి. కమలాకర్ రెడ్డి నిర్మాణ పగ్గాలు చేపట్టారు.Source: Yahoo! Telugu: Entertainment | 27 Aug 2009 | 11:34 am నట కిరీటి "క్విక్ గన్ మురుగన్"క్విక్ గన్ మురుగన్ సౌత్ ఇండియన్ కౌబాయ్ చిత్రం. ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన హీరో రాజేంద్ర ప్రసాద్ నిస్సహాయులకు సహాయం చేస్తూ, వారికి ఎల్లప్పుడు తోడు-నీడగా ఉంటాడు. తను చేసే ప్రతి పనిలోనూ ఓ స్టైల్ ఉంటుంది.Source: Yahoo! Telugu: Entertainment | 27 Aug 2009 | 11:01 am డాడీ కూల్సినిమా చివరిలో ఏముంటుంది. ట్రాజెడీ, దుఖంతో కూడుకున్న మాటలు, కాసేపు నిశ్శబ్దం, కాని ఈ చిత్రంలో స్టీవన్ లాజరస్(సునీల్ శెట్టి) తండ్రి శవానికి దహన సంస్కార కార్యక్రమాలు పూర్తి చేస్తుండగా ఓ వేరొక మనిషి శవాన్ని తీసుకువస్తే ఎలా ఉంటుంది. కామెడీగా ఉండదు...Source: Yahoo! Telugu: Entertainment | 27 Aug 2009 | 10:26 am తొలి వార్షికం ముగిసింది: ప్రధాన కార్యదర్శి వెళ్లిపోయాడుప్రజారాజ్యం పార్టీ బుధవారం ప్రధమ వార్షికోత్సవాన్ని జరుపుకుని 24 గంటలు గడిచేలోపే మరో ముఖ్య నేత ఆ పార్టీకి రాజీనామా చేశారు. ప్రజారాజ్యం పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న జల్లి సిద్ధయ్య తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు గురువారం ప్రకటించారు. రాజీనామాకు గల కారణాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు.Source: ఏపీ న్యూస్ | 27 Aug 2009 | 8:46 am నాగచైతన్య "జోష్" ట్రైలర్‌ను తిలకించండియువసామ్రాట్ అక్కినేని నాగార్జున కుమారుడు నాగచైతన్య హీరోగా దిల్ రాజు నిర్మిస్తున్న "జోష్" చిత్రం అనేక ప్రత్యేకతలతో తెరకెక్కనుంది. చైతన్యకి జోడీగా ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాధ కుమార్తె కార్తీక ఈ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమవుతోంది.Source: Yahoo! Telugu: Entertainment | 27 Aug 2009 | 8:40 am రేపు తేలనున్న రంగనాథ్ భవితవ్యంగుంటూరు జిల్లా పొన్నూరు ఎస్ఐ రంగనాథ్ గౌడ్ బెయిల్ పిటీషన్ విచారణ నేడు పూర్తయ్యింది. తుది నిర్ణయాన్ని రేపటికి వాయిదా వేస్తూ న్యాయమూర్తి గురువారం ఆదేశాలు జారీ చేశారు.Source: ఏపీ న్యూస్ | 27 Aug 2009 | 7:06 am మాకు టెన్షన్-ఆమెకు భలే హుషారు: విక్రమ్విలక్షణ నటుడు విక్రమ్, సెక్సీడాళ్ శ్రేయ నటించిన తాజా చిత్రం "మల్లన్న". ఈ సినిమా షూటింగ్‌లో తామెంతో టెన్షన్‌కు గురయ్యామని, కానీ శ్రేయ మాత్రం చాలా సరదాగా, హుషారుగా గంతులేసిందని మల్లన్న హీరో విక్రమ్ అన్నారు. గురువారం హైదరాబాద్‌లో ఆయన మల్లన్న చిత్రం గురించి మాట్లాడుతూ.. కోడిపుంజు గెటెప్‌తో పాటు, ముసలివాడి గెటప్ కోసం చాలా టైమ్ పట్టేదని, ప్రధానంగా మెక్సికో ఎపిసోడ్ అనుకున్న టైమ్‌కు...Source: వినోదం | 27 Aug 2009 | 6:50 am కాందహార్ నిర్ణయం అద్వానీకి తెలుసు: మిశ్రాఎన్డీఏ హయాంలో హోం మంత్రిగా పనిచేసిన బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీకి కాందహార్ హైజాక్ వ్యవహారానికి సంబంధించి తీసుకున్న అన్ని నిర్ణయాలు తెలుసని మాజీ జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) బ్రజేష్ మిశ్రా వెల్లడించారు. కాందహార్ హైజాక్ వ్యవహారంలో భారత ప్రభుత్వం ప్రయాణికులను విడిపించేందుకు కరుడుగట్టిన ఉగ్రవాదులను విడిచిపెట్టిన సంగతి తెలిసిందే.Source: జాతీయ | 27 Aug 2009 | 6:43 am సెప్టెంబరులో వస్తోన్న "మా నాన్న చిరంజీవి"జగపతిబాబు హీరోగా అరుణ్‌ప్రసాద్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం "మా నాన్న చిరంజీవి". జయశ్రీ సమర్పణలో లాఫింగ్ లార్డ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయి పోస్ట్‌ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. దర్శకుడు మాట్లాడుతూ.. చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోందని అన్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని వచ్చేనెలలో సినిమాను విడుదల చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఇంకా ఈ చిత్రానికి కెమెరా: కె. ధరన్, ఆర్ట్: కె.వి. రమణ. ఈ సందర్భంగా హీరో జగపతిబాబు మాట్లాడుతూ.. ఈ కథ తనకు బాగా నచ్చిందన్నారు. "శుభలగ్నం"లా సెంటిమెంట్ ఉంటూ మంచి ఎంటర్‌టైన్‌మెంట్ మిళితమైన కథ ఇదని తెలిపారు.Source: వినోదం | 27 Aug 2009 | 6:25 am జిన్నా వివాదం: నిప్పులు చెరిగిన ప్రణబ్ ముఖర్జీచరిత్రను వక్రీకరించడం ద్వారా భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూకు అపకీర్తిని అంటగట్టేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆర్థిక శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ దుయ్యబట్టారు. ఇటీవల బీజేపీ మాజీ సీనియర్ నేత యశ్వంత్ సింగ్ రాసిన "జిన్నా: భారత్, విభజన, స్వాతంత్ర్యం" పుస్తకం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.Source: జాతీయ | 27 Aug 2009 | 6:25 am "హాసిని"గా వస్తోన్న 'ప్రేమిస్తే' ఫేమ్ సంధ్య"ప్రేమిస్తే" ఫేమ్ సంధ్య "హాసిని"గా నటిస్తోంది. "అన్నవరం" చిత్రంలో పవన్‌కళ్యాణ్ చెల్లెలుగా నటించిన తర్వాత తెలుగులో తాను నటిస్తోన్న లేడిఓరియెంటెడ్ సినిమా ఇదని సంధ్య చెప్పింది. బుధవారం రాత్రి అన్నపూర్ణ స్టూడియోలో ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది. "అభి" ఫేమ్ కమలాకర్ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. బి.వి. రమణారెడ్డి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రానికి బి. కమలాకర్ రెడ్డి నిర్మాణ పగ్గాలు చేపట్టారు.Source: వినోదం | 27 Aug 2009 | 6:05 am నాగచైతన్య "జోష్" ట్రైలర్‌ను తిలకించండియువసామ్రాట్ అక్కినేని నాగార్జున కుమారుడు నాగచైతన్య హీరోగా దిల్ రాజు నిర్మిస్తున్న "జోష్" చిత్రం అనేక ప్రత్యేకతలతో తెరకెక్కనుంది. చైతన్యకి జోడీగా ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాధ కుమార్తె కార్తీక ఈ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమవుతోంది.Source: వినోదం | 27 Aug 2009 | 5:57 am నారా రోహిత్ "బాణం" ట్రైలర్ మీ కోసం...సినీ ప్రముఖుల వారసుల్ని హీరోలుగా పరిచయం చేసి ఘనత సాధించుకున్న మెగా ప్రొడ్యూసర్ అశ్వనీదత్.. తాజాగా మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సోదరుడు, నారా రామ్మూర్తినాయుడు తనయుడు, నారా రోహిత్‌ను హీరోగా వెండితెరపై పరిచయం చేయనున్నారు. నారా రోహిత్, వేదిక జంటగా నటిస్తోన్న ఈ చిత్రంలో రణధీర్‌రెడ్డి, షాయాజీ షిండే, భానుచందర్, ఎ.వి.ఎస్. తదితరులు నటించారు.Source: వినోదం | 27 Aug 2009 | 5:54 am గణేష్ నిమజ్జనం: 3న "గ్రేటర్" సెలవుగణేశ నిమజ్జనం సందర్భంగా సెప్టెంబరు మూడో తేదీన రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది. గ్రేటర్ హైదరబాద్ పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలకు కూడా సెలవు దినంగా సర్కారు ప్రకటిస్తూ గురువారం ఉత్తర్వులు వెలువరించింది. గణేశ నిమజ్జనం సందర్భంగా సెప్టెంబరు మూడో తేదీన రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది. గ్రేటర్ హైదరబాద్ పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలకు కూడా సెలవు దినంగా సర్కారు ప్రకటిస్తూ గురువారం ఉత్తర్వులు వెలువరించింది.Source: ఏపీ న్యూస్ | 27 Aug 2009 | 5:26 am పోఖ్రాన్- 2 విజయవంతమైంది: సురేష్ మెహతాదేశ అణు సామర్థ్యంపై అనుమానాలు కలిగించే రీతిలో డీఆర్‌డీఓ శాస్త్రవేత్త కె. సంతానం పోఖ్రాన్- 2 అణు పరీక్షలపై వెల్లడించిన వివరాలను దేశ నావికా దళ చీఫ్ సురేష్ మెహతా ఖండించారు. సంతానం వెల్లడించిన సంచలనాత్మక వివరాలేవీ వాస్తవం కాదని స్పష్టం చేశారు. పోఖ్రాన్- 2 అణు పరీక్షలు విజయవంతమయ్యాయని తెలిపారు.Source: జాతీయ | 27 Aug 2009 | 4:44 am టూరిజం స్పాట్‌గా "శ్రీ అష్టలక్ష్మీ దేవాలయం"సమస్త విద్యల భేదాలు, లక్ష్మీ స్వరూపమే. సమస్త స్త్రీ రూపాలు ఆ తల్లి దేహమే. స్త్రీలలో ఉండే సౌందర్యం, సత్ స్వభావం, సదాచారం సౌభాగ్యం, రతి సుఖం ఇవన్నీ ఆ లక్ష్మీ స్వరూపమే. ఆ శ్రీ మహాలక్ష్మీ కటాక్షంలో పది వేలలో ఒక వంతు మాత్రమే పొందిన బ్రహ్మ, రుద్రుడు, దేవేంద్రుడు, చంద్రుడు, సూర్యుడు, కుబేరుడు, యముడు, అగ్నిలాంటివారు నిరంతరం ఐశ్వర్యాన్ని పొందుతున్నారు...Source: వినోదం | 27 Aug 2009 | 4:27 am రామారావు చర్చతో శుక్రవారానికి సభ వాయిదాఎమ్మెల్యే రామారావు కేసు విషయంతో గురువారం శాసనసభ సమావేశాలు ముగిశాయి. ఎమ్మెల్యే రామారావు ఆరోపణలకు ప్రభుత్వం వివరణ ఇవ్వడంతో సభను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.Source: ఏపీ న్యూస్ | 27 Aug 2009 | 4:06 am పండుగలు చేసుకోడానికి.. మేం సినిమావాళ్లం కాదు.!ఎన్నికల్లో ఘనవిజయం సాధించి తద్వారా అధికారం చేపట్టి వందరోజులైన సందర్భంగా పండుగలు జరుపుకోవడానికి తాము సినిమావాళ్లం కాదని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు ఇప్పటి నుంచే దృష్టి సారిస్తున్నామని చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 27 Aug 2009 | 3:59 am ఏడు కొత్త ఐఐఎంలకు కేంద్రం గ్రీన్సిగ్నల్కేంద్ర మంత్రివర్గం గురువారం ఏడు కొత్త ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)లకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రెండు దశల్లో వీటిని అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. ఏడు కొత్త ఐఐఎంల ఏర్పాటు ప్రతిపాదనలకు కేంద్ర మంత్రివర్గం తాజా సమావేశంలో ఆమోదం తెలిపినట్లు సమాచార, ప్రసారాల శాఖ మంత్రి అంబికా సోనీ విలేకరులతో చెప్పారు.Source: జాతీయ | 27 Aug 2009 | 3:28 am
|