తన భారత్ పర్యటన విజయవంతం: నేపాల్ పీఎం

తాను చేపట్టిన ఐదు రోజుల భారత్ పర్యటన విజవంతమైందని నేపాల్ ప్రధాని మాధవ్ కుమార్ నేపాల్ అన్నారు. ఆయన తన పర్యటనను విజయవంతంగా ముగించుకుని ఆదివారం నేపాల్ రాజధాని ఖాట్మండుకు చేరుకున్నారు.
Source: Yahoo! Telugu: News | 23 Aug 2009 | 9:41 am

గ్రేటర్ సమరంలో తెరాస ఒంటరి పోరు: కేసీఆర్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత కే.చంద్రశేఖర రావు వెల్లడించారు. గ్రేటర్ పరిధిలోని అన్ని డివిజన్లలో తెరాస అభ్యర్థులు బరిలో దింపనున్నట్టు ఆయన తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 23 Aug 2009 | 9:19 am

రాజస్థాన్‌లో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు

రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం భారీ సంఖ్యలో ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఏకంగా 33 మంది ఐఏఎస్‌లను, ఏడుగురు రాజస్థాన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్ (ఆర్ఏఎస్) అధికారులను బదిలీ చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీలు తక్షణం అమలులోకి వస్తాయని ప్రభుత్వం పేర్కొంది.
Source: Yahoo! Telugu: News | 23 Aug 2009 | 9:09 am

కోయంబత్తూరులో నిఫ్ట్ స్పెషాలిటీ సెంటర్

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) స్పెషాలిటీ కేంద్రాన్ని త్వరలో కోయంబత్తూరులో ఏర్పాటు చేసే ప్రణాళికలు చేస్తున్నట్లు కేంద్ర వస్త్ర శాఖమంత్రి దయానిధి మారన్ వెల్లడించారు. ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం వల్ల.. కొయంబత్తూరులోనే కాకుండా.. సమీప ప్రాంతాల్లో ఉన్న వస్త్ర పరిశ్రమలకు ఎంతో ఉపకరించగలదన్నారు.
Source: Yahoo! Telugu: News | 23 Aug 2009 | 8:41 am

రజనీతో నటించే అవకాశం దక్కడం లక్: ఐష్

తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో కలిసి నటించే అవకాశం దక్కడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ ఐశ్వర్యారాయ్ అన్నారు. రజనీ వంటి హీరోతో నటించడం ఎంతో అదృష్టమని, రజనీతో కలిసి నటించిన అవకాశం భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 23 Aug 2009 | 7:46 am

ఏటీఎఫ్‌ పన్ను తగ్గింపు: వెనక్కు తగ్గని రాష్ట్రాలు

విమాన ఇంధనం (ఏటీఎఫ్)లో అమ్మకపు పన్ను తగ్గించేందుకు రాష్ట్రాలు నిరాకరిస్తున్నాయి. ప్రకటిత వస్తువుల (డిక్లేర్డ్ గూడ్స్) విభాగంలోకి చేర్చాల్సిందిగా.. ప్రైవేటు విమానయాన సంస్థలు చేసిన ప్రతిపాదనను రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నట్లు పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి మరియు వ్యాట్ ప్యానెల్ ఛైర్మన్ ఆసిమ్ దాస్‌గుప్తా వెల్లడించారు.
Source: Yahoo! Telugu: News | 23 Aug 2009 | 7:27 am

పాక్ ఆర్మీకి శిక్షణ ఇవ్వనున్న శ్రీలంక ఆర్మీ

సొంతగడ్డపై ఏళ్ళతరబడి తిష్టవేసిన ఎల్టీటీఈ వేర్పాటు వాదులను శ్రీలంక సైన్యం సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ శ్రీలంక సైనిక వీరులు తీవ్రవాదులతో పోరాడుతున్న పాకిస్థాన్ సైనికులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. దేశంలో ఉత్పన్నమయ్యే తిరుగుబాటు చర్యలను అణిచి వేసేందుకు పాక్ మిలిటరీకి శిక్షణ ఇవ్వనున్నట్టు ప్రకటించారు.
Source: Yahoo! Telugu: News | 23 Aug 2009 | 7:05 am

భాజపాకు గుడ్‌బై చెప్పిన సుధీంద్ర కులకర్ణి

భారతీయ జనతా పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. అగ్రనేతలు అటల్ బీహారీ వాజ్‌పేయి, ఎల్కే.అద్వానీకి అత్యంత సన్నిహితుడైన సుధీంద్ర కులకర్ణీ పార్టీ నుంచి వైదొలుగుతున్నట్టు ఆదివారం ప్రకటించారు. ఇది ఆ పార్టీ అగ్రనేత అద్వానీకి పూడ్చలేని లోటుగా పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.
Source: Yahoo! Telugu: News | 23 Aug 2009 | 6:36 am

నేటి బులియన్ మార్కెట్ ధరలు

నేటి బులియన్ మార్కెట్‌లో బంగారు, వెండి ధరలు ఇలా ఉన్నాయి... హైదరాబాద్ 24 క్యారెట్ - రూ. 15,250, వెండి కిలో - రూ. 23,400. చెన్నై 24 క్యారెట్ - రూ. 15,095 - రూ. 14,980, వెండి కిలో - రూ. 24,235 - రూ. 23,785. విజయవాడ - రూ. 15,230 - రూ. 15,140, వెండి కిలో - రూ. 23,800 - రూ. 23,500.
Source: Yahoo! Telugu: News | 23 Aug 2009 | 6:24 am

వైఎస్ పాలనలో దేవుళ్ళకే భద్రత కరువు: బాబు

దేవుడి పాలన సాగిస్తున్నట్టు చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి వైఎస్ పాలనలో ఆ దేవుళ్ళకు చెందిన ఆస్తులు, ఆభరణాలకే రక్షణ లేకుండా పోయిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. దేవుళ్ళకే భద్రత కల్పించలేని కాంగ్రెస్ ప్రభుత్వం సామాన్య ప్రజలు ఎలా రక్షణ కల్పిస్తుందని ఆయన ప్రశ్నించారు.
Source: Yahoo! Telugu: News | 23 Aug 2009 | 6:06 am

స్వైన్ ఫ్లూ వ్యాధి అదుపునకు చర్యలు: మంత్రి దానం

రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి చెందకుండా అన్ని చర్యలు చేపట్టామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి దానం నాగేందర్ స్పష్టం చేశారు. ఈ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలే గానీ, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
Source: Yahoo! Telugu: News | 23 Aug 2009 | 5:31 am

గ్రేటర్ సమరంలో తెరాస ఒంటరి పోరు: కేసీఆర్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత కే.చంద్రశేఖర రావు వెల్లడించారు. గ్రేటర్ పరిధిలోని అన్ని డివిజన్లలో తెరాస అభ్యర్థులు బరిలో దింపనున్నట్టు ఆయన తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 23 Aug 2009 | 3:51 am

రాజస్థాన్‌లో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు

రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం భారీ సంఖ్యలో ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఏకంగా 33 మంది ఐఏఎస్‌లను, ఏడుగురు రాజస్థాన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్ (ఆర్ఏఎస్) అధికారులను బదిలీ చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీలు తక్షణం అమలులోకి వస్తాయని ప్రభుత్వం పేర్కొంది.
Source: జాతీయ | 23 Aug 2009 | 3:40 am

భాజపాకు గుడ్‌బై చెప్పిన సుధీంద్ర కులకర్ణి

భారతీయ జనతా పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. అగ్రనేతలు అటల్ బీహారీ వాజ్‌పేయి, ఎల్కే.అద్వానీకి అత్యంత సన్నిహితుడైన సుధీంద్ర కులకర్ణీ పార్టీ నుంచి వైదొలుగుతున్నట్టు ఆదివారం ప్రకటించారు. ఇది ఆ పార్టీ అగ్రనేత అద్వానీకి పూడ్చలేని లోటుగా పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.
Source: జాతీయ | 23 Aug 2009 | 1:07 am

వైఎస్ పాలనలో దేవుళ్ళకే భద్రత కరువు: బాబు

దేవుడి పాలన సాగిస్తున్నట్టు చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి వైఎస్ పాలనలో ఆ దేవుళ్ళకు చెందిన ఆస్తులు, ఆభరణాలకే రక్షణ లేకుండా పోయిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. దేవుళ్ళకే భద్రత కల్పించలేని కాంగ్రెస్ ప్రభుత్వం సామాన్య ప్రజలు ఎలా రక్షణ కల్పిస్తుందని ఆయన ప్రశ్నించారు.
Source: ఏపీ న్యూస్ | 23 Aug 2009 | 12:37 am

స్వైన్ ఫ్లూ వ్యాధి అదుపునకు చర్యలు: మంత్రి దానం

రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి చెందకుండా అన్ని చర్యలు చేపట్టామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి దానం నాగేందర్ స్పష్టం చేశారు. ఈ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలే గానీ, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
Source: ఏపీ న్యూస్ | 23 Aug 2009 | 12:02 am

అబద్దాల్లో బాబు గిన్నిస్ రికార్డు: మంత్రి పొన్నాల

అబద్దాలను ప్రచారం చేయడంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గిన్నిస్‌బుక్ రికార్డులోకి ఎక్కించాలని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖామంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న కరువుపై రైతుల్లో అభద్రతాభావం సృష్టించేందుకు, అబద్దాలను ప్రచారం చేయడంలో చంద్రబాబును మించిన వారు లేరని ఆయన విమర్శించారు
Source: ఏపీ న్యూస్ | 22 Aug 2009 | 11:54 pm

ప్రతిపక్ష పదవికి వసుంధర రాజే గుడ్‌బై?

రాజస్థాన్ రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకురాలి బాధ్యతల నుంచి ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే తప్పుకునే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భాజపా అధిష్టానం ఆదేశాలను ఖాతరు చేసినందుకు ఆమె ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్, అగ్రనేత అద్వానీలతో శనివారం వేర్వేరుగా సమావేశమైన విషయం తెల్సిందే.
Source: జాతీయ | 22 Aug 2009 | 11:21 pm

ఐదు రాష్ట్రాల్లో మావోలు బంద్‌కు పిలుపు

పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, జార్ఖండ్, చత్తీస్‌గఢ్ తదితర ఐదు రాష్ట్రాల్లో రెండు రోజుల పాటు బంద్ నిర్వహించాలని సీపీఐ (ఎం) మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఆగస్ట్ 19వ తేదీన బీహార్ రాష్ట్రా పోలీసు శాఖచే అరెస్ట్ కాబడిన.. తమ గ్రూపుకు చెందిన ఇద్దరిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మావోలు ఈ బంద్ నిర్వహించనున్నట్లు తెలిసింది.
Source: జాతీయ | 22 Aug 2009 | 9:48 pm

ఆ డ్రింక్ నేనూ తాగుతాను.. అందులో తప్పులేదు: మహేశ్

తను తాజాగా నటిస్తున్న చిత్రానికి ఇంకా పేరు నిర్ణయించలేదనీ, వరుడు మాత్రం కాదని మహేశ్ బాబు స్పష్టం చేశారు. ఈ ఏడాది ఏడు నెలలు గ్యాప్ తీసుకుని చిత్రాన్ని చేస్తున్నానని, ఇకపై అటువంటి గ్యాప్ ఉండదని అన్నారు. థమ్స్అప్ బ్రాండ్ అంబాసిడర్ అయిన మహేశ్ మెక్ డొనాల్డ్ అవుట్‌లెట్ నిర్వహించిన "థమ్స్‌అప్ ఈట్ టు మీట్" విజేతలను కలుసుకునేందుకు శుక్రవారం ఐమాక్స్‌‌కు విచ్చేశారు.
Source: Yahoo! Telugu: Entertainment | 22 Aug 2009 | 9:29 am

కరువుపై టోల్‌ఫ్రీ నంబరు ఏర్పాటుకు సీఎం ఆదేశం

రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులపై ఫిర్యాదు చేసేందుకు టోల్‌ఫ్రీ నంబరును ఏర్పాటు చేయాల్సిందిగా అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులపై ఆయన శనివారం మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
Source: ఏపీ న్యూస్ | 22 Aug 2009 | 8:40 am

స్వైన్ ఫ్లూ వైరస్: యాభై దాటిన మృతుల సంఖ్య

స్వైన్ ఫ్లూ వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య దేశంలో యాభైకు చేరుకుంది. శనివారం మరో ముగ్గురు మృత్యువాత పడ్డారు. వీరిలో పూణెలో ఒకరు ఉన్నారు. అలాగే, ఈ వైరస్ సోకిన వారి సంఖ్య 2600కు చేరుకుంది. కొత్తగా 61 కేసులు నమోదయ్యాయి.
Source: జాతీయ | 22 Aug 2009 | 8:00 am

ఐ యామ్ ఫిట్.. డోంట్ వర్రీ: ఐశ్వర్యారాయ్

బాలీవుడ్ అందాల తార ఐశ్వర్యారాయ్ భాగ్యనగరిలో కలకలం సృష్టించారు. ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న స్వైన్ ఫ్లూ వైరస్ తాకిడి ఐష్ గురైనట్టు వార్తలు వచ్చాయి. దీంతో ఆమె ఆరోగ్యంపై సినీ అభిమానులు తెగ బెంగ పెట్టుకున్నారు. అయితే, తనకు ఏ వైరస్ సోకలేదని, పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నట్టు ఆమె ప్రకటించారు.
Source: ఏపీ న్యూస్ | 22 Aug 2009 | 7:02 am

బుద్ధ గార్డెన్ రేప్ కేసు: దోషులకు జీవిత ఖైదు

దేశ రాజధానిలోని బుద్ధ గార్డెన్‌‌లో జరిగిన ఒక యువతి అత్యాచారం కేసులో దోషులుగా తేలిన రాష్ట్రపతి అంగరక్షకులను జీవిత కారాగార శిక్ష విధిస్తూ ఢిల్లీ కోర్టు శనివారం తీర్పు ఇచ్చింది. మరో ఇద్దరికి పదేళ్ల పాటు జైలుశిక్ష విధించింది.
Source: జాతీయ | 22 Aug 2009 | 6:32 am

60 కేజీల అందాల బొమ్మ తమన్నా పర్సనల్ టచ్

తమన్నా.. ఇప్పుడు కోలీవుడ్‌కు కోవా అయింది. ఆమె కాల్షీట్స్ కోసం తమిళ నిర్మాతలు క్యూకడుతున్నారు. ఇక మన టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్ల లిస్టులో తమన్నా పేరు ఉంది. కనుక వీలున్నప్పుడల్లా ఇటువైపు కన్నేస్తోంది తమన్నా. ఈ హ్యాపీ భామ మినీ టచ్ మీ కోసం... అసలు పేరు: తమన్నా భాటియా
Source: Yahoo! Telugu: Entertainment | 22 Aug 2009 | 6:18 am

జైపూర్‌లో చిన్నారుల నుంచి బలవంతపు రక్తదానం

నిండా పద్దెనిమిదేళ్లు పూర్తిగాని చిన్నారులతో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే బలవంతంగా రక్తదానం చేయించిన ఘటన శనివారం వెలుగుచూసింది. రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్‌కు సమీపంలో మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ జన్మదినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
Source: జాతీయ | 22 Aug 2009 | 4:25 am

టెక్కలి ఉప ఎన్నికల్లో ప్రచారం సందేహమే: పవన్

టెక్కలి ఉప ఎన్నిక ప్రచారంలో తాను పాల్గొనడం సందేహమేనని యువరాజ్యం అధినేత పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. చిరంజీవి 54వ పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఆయన శనివారం రాజధానిలోని చిరంజీవి బ్లడ్ బ్యాంకులో రక్తదానం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 22 Aug 2009 | 4:02 am