251 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్

స్టాక్ మార్కెట్ 251 పాయింట్లు లాభపడటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 15,036 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 71 పాయింట్లు బలపడి 4,459 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 1.70 శాతం, నిఫ్టీ 1.62 శాతం మేరకు వృద్ధి చెందాయి.
Source: Yahoo! Telugu: News | 18 Aug 2009 | 9:28 am

స్కూటర్ మార్కెట్లో సత్తా చాటుతాం: టీవీఎస్

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్కూటర్ మరియు ఉన్నత సెగ్మెంట్లలో బైక్‌లను మార్కెట్లోకి విడుద ల చేసేందుకు తమ కంపెనీ సిద్ధంగా ఉందని టీవీఎస్ సంస్థకు చెందిన కంపెనీ ఛైర్మెన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ వేణు శ్రీనివాసన్ చెన్నైలో తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 18 Aug 2009 | 9:22 am

ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్ష భవనంపై రాకెట్ దాడి

ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో మంగళవారం రాకెట్ దాడులు జరిగాయి. మరో రెండు రోజుల్లో ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్ష ఎన్నికలు జరగనుండగా, రెండు కీలకమైన భవనాలపై తీవ్రవాదులు రాకెట్ దాడులు జరిపారు. మొదటి రాకెట్ దాడి కాబూల్‌లోని అధ్యక్ష భవనంపై జరగ్గా, రెండో రాకెట్ పోలీసు ప్రధాన కార్యాలయానికి సమీపంలోకి చొచ్చుకొచ్చింది.
Source: Yahoo! Telugu: News | 18 Aug 2009 | 9:01 am

" కమీనే " ను చూసి స్వైన్ ఫ్లూ భయపడింది...!

" కమీనే " ను చూసి స్వైన్ ఫ్లూ భయపడింది. నిజమండీ...యూటీవీ సంస్థ నిర్మించిన ఈ చిత్రం పూనా మరియు ముంబై ప్రాంతాలలో స్వైన్ ఫ్లూ భయంతో విడుదలకు నోచుకోలేదు. కాని గత వారపు చివరి మూడు రోజులలో ఈ చిత్రానికి చెందిన కలెక్షన్లు భారీగానే నమోదైనట్లు బాలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి
Source: Yahoo! Telugu: Entertainment | 18 Aug 2009 | 8:59 am

బీహార్‌లో చెలరేగిన విద్యార్థులు: రైలుకు నిప్పు

బీహార్‌‌ రాష్ట్రంలో విద్యార్థులు మరోమారు రెచ్చిపోయారు. రైల్వే భద్రతా సిబ్బంది (ఆర్పీఎఫ్) ప్రయాణపు టిక్కెట్లను చూపించమని అడిగినందుకు విద్యార్థులు విధ్వంసం సృష్టించారు. అంతటితో శాంతించని వారు ఓ రైలుకు చెందిన నాలుగు బోగీలకు నిప్పంటించారు.
Source: Yahoo! Telugu: News | 18 Aug 2009 | 8:59 am

భాజపాకు నాయకత్వ మార్పు అవసరం: ఆర్ఎస్ఎస్

భారతీయ జనతా పార్టీ నాయకత్వ మార్పిడిపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మనస్సులోని మాటను బయటపెట్టారు. భాజపా పగ్గాలను యువతకు అప్పగించాలని మోహన్ భగవత్ అభిప్రాయపడ్డారు. ఆయన మంగళవారం ఒక ప్రైవేట్ టీవీ ఛానల్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
Source: Yahoo! Telugu: News | 18 Aug 2009 | 8:44 am

లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్

స్టాక్ మార్కెట్ ప్రస్తుతం లాభాల్లో కొనసాగుతుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 186 పాయింట్లు పుంజుకుని 14,971 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 44 పాయింట్లు బలపడి 4,432 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 1.26 శాతం, నిఫ్టీ 1.01 శాతం మేరకు వృద్ధి చెందాయి.
Source: Yahoo! Telugu: News | 18 Aug 2009 | 8:16 am

లాభాల్లో పయనిస్తున్న స్టాక్ మార్కెట్

స్టాక్ మార్కెట్ ప్రస్తుతం లాభాల్లో పయనిస్తుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 251 పాయింట్లు పెరిగి 15,036 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 70 పాయింట్లు లాభపడి... 4,458 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 1.70 శాతం, నిఫ్టీ 1.59 శాతం మేరకు వృద్ధి చెందాయి.
Source: Yahoo! Telugu: News | 18 Aug 2009 | 7:57 am

రూ.4వేల కోట్లను సమకూర్చనున్న హెచ్‌డీఎఫ్‌సీ

దేశీయ ప్రైవేట్ బ్యాంకింగ్ రంగంలో అగ్రగామిగానున్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్యూఐపీ ద్వారా దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలను సమకూర్చనుంది.
Source: Yahoo! Telugu: News | 18 Aug 2009 | 7:57 am

అమెరికా, ఆసియా స్టాక్ మార్కెట్లు

అమెరికా స్టాక్ మార్కెట్లు.. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ ఇండెక్స్ - 1.7 శాతంతో 155.83 పాయింట్లు కోల్పోయి 9,165.87 వద్దకు చేరుకుంది. స్టాండార్డ్ అండ్ పూర్ 500 ఇండెక్స్ - 2.1 శాతంతో21.25 పాయింట్లు నష్టపోయి 982.94 వద్దకు చేరుకుంది. నాస్‌డాక్ కంపోజిట్ ఇండెక్స్ - 2.5 శాతంతో 49.16 పాయింట్లు బలహీనపడి 1,936.36 వద్దకు చేరుకుంది. ఆసియా మార్కెట్లు... చైనా మార్కెట్లు నుంచి ఎదురవుతున్న ఒత్తిడి ప్రభావాన ఆసియా మార్కెట్లు నష్టాల్లో పయనిస్తున్నాయి. హాంగ్ సెంగ్ - 62 పాయింట్లు కోల్పోయి 20,076 వద్దకు చేరుకుంది. నిక్కీ - 39 పాయింట్లు తగ్గి 10,230 వద్దకు చేరుకుంది. షాంఘై - రికవరీ దిశగా పయనిస్తూ.. 2,876 వద్దకు చేరుకుంది. సియోల్ కంపోజిట్ - 1,538 వద్దకు చేరుకుంది.
Source: Yahoo! Telugu: News | 18 Aug 2009 | 7:28 am

పాకిస్థాన్‌లో బైతుల్లా మెహసూద్ ప్రతినిధి అరెస్ట్

పాకిస్థాన్ తాలిబాన్ గ్రూపుకు చెందిన కీలక నేతను భద్రతా సిబ్బంది అరెస్టు చేసినట్లు ఆ దేశ నిఘా అధికారులు మంగళవారం వెల్లడించారు. ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులకు సమీపంలోని ఓ గ్రామంలో సోమవారం రాత్రి తాలిబాన్ చీఫ్ బైతుల్లా మెహసూద్ ముఖ్య ప్రతినిధి మౌల్వీ ఒమర్‌ను అదుపులోకి తీసుకున్న ముగ్గురు పాకిస్థాన్ నిఘా అధికారులు తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 18 Aug 2009 | 7:16 am

మైఖేల్ జాక్సన్‌ అంత్యక్రియలు ఇంకా జరగలేదు!

పాప్ కింగ్, మైఖేల్ జాక్సన్ అంత్యక్రియలు ఇంకా జరగలేదని ఆయన కుటుంబ సభ్యులు అంటున్నారు. దీంతో జాక్సన్ అంత్యక్రియలు ఇప్పటికీ వీడని మిస్టరీగానే మిగిలి ఉంది. పదిరోజుల క్రితమే హాలీవుడ్ హిల్స్‌లోని శ్మశానవాటికలో అత్యంత రహస్యంగా మైఖేల్ జాక్సన్ అంత్యక్రియలు జరిగాయని వార్తలొచ్చాయి. కానీ ఈ వార్తలను జాక్సన్ తండ్రి కొట్టిపారేశారు. ఇంకా అనువైన స్థలం కోసం అన్వేషిస్తూనే ఉన్నామని చెప్పారు. జాక్సన్ తల్లి కూడా ఇదే మాటే అంటోంది. తన కుమారుని అంత్యక్రియలు ఇంకా జరగలేదని స్పష్టం చేసింది.
Source: Yahoo! Telugu: Entertainment | 18 Aug 2009 | 7:11 am

ఐశ్వర్యకు స్వైన్ ఫ్లూ లేదు: మీడియా రభసపై అమితాబ్ గుస్స

బాలీవుడ్ ప్రముఖ నటి, అందాల తార ఐశ్వర్యరాయ్ బచ్చన్‌కు స్వైన్ ఫ్లూ సోకలేదని, కేవలం జ్వరంతోకూడుకున్న జలుబని బిగ్ బీ మీడియాకు మంగళవారం స్పష్టం చేశారు.
Source: Yahoo! Telugu: Entertainment | 18 Aug 2009 | 6:42 am

"జబ్ వి మెట్" తమిళ రీమేక్‌లో నటించడం అదృష్టం..!

"హ్యాపీడేస్" చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అందాల ముద్దుగుమ్మ, తెల్లపిల్ల తమన్నా. ప్రస్తుతం కోలీవుడ్‌లో బిజీబిజీగా ఉంటోన్న తమన్నా.. టాలీవుడ్‌లోనూ మంచి ఛాన్సులు కొట్టేస్తుందని సినీ వర్గాల సమాచారం. కాళిదాసు, సూర్య హీరోగా నటించిన "వీడొక్కడే" చిత్రంలో కథానాయికగా నటించిన తమన్నా.. తాజాగా తెలుగు "వ్యాపారి" ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. ఈ సందర్భంగా ఆమెను కదిలిస్తే.. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాలీవుడ్ మూవీ "టైటానిక్‌" సినిమాను ఎన్నిసార్లు చూశానో తెలియదు. 'జబ్‌ వి మెట్‌' కూడా తనకు ఇష్టమైన సినిమా. ఈ చిత్రం తమిళ రీమేక్‌లో తాను నటిస్తున్నట్లు తమన్నా వెల్లడించింది. చాలా రోజులుగా ఎదురుచూస్తున్న పాత్ర తనకు లభించడం ఎంతో ఆనందంగా ఉందని ఆమె చెప్పింది.
Source: Yahoo! Telugu: Entertainment | 18 Aug 2009 | 5:35 am

బీహార్‌లో చెలరేగిన విద్యార్థులు: రైలుకు నిప్పు

బీహార్‌‌ రాష్ట్రంలో విద్యార్థులు మరోమారు రెచ్చిపోయారు. రైల్వే భద్రతా సిబ్బంది (ఆర్పీఎఫ్) ప్రయాణపు టిక్కెట్లను చూపించమని అడిగినందుకు విద్యార్థులు విధ్వంసం సృష్టించారు. అంతటితో శాంతించని వారు ఓ రైలుకు చెందిన నాలుగు బోగీలకు నిప్పంటించారు.
Source: జాతీయ | 18 Aug 2009 | 3:30 am

భాజపాకు నాయకత్వ మార్పు అవసరం: ఆర్ఎస్ఎస్

భారతీయ జనతా పార్టీ నాయకత్వ మార్పిడిపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మనస్సులోని మాటను బయటపెట్టారు. భాజపా పగ్గాలను యువతకు అప్పగించాలని మోహన్ భగవత్ అభిప్రాయపడ్డారు. ఆయన మంగళవారం ఒక ప్రైవేట్ టీవీ ఛానల్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
Source: జాతీయ | 18 Aug 2009 | 3:15 am

శాసన సభ్యులకు నేడు 'మగధీర' ప్రత్యేక షో!

రాష్ట్ర శాసన సభ్యుల కోసం ప్రత్యేకంగా 'మగధీర' స్పెషల్ షోను రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ప్రదర్శించనున్నారు. ఈ మేరకు ప్రజరాజ్యం పార్టీ అధినేత, హీరో రాంచరణ్ తేజ్ తండ్రి చిరంజీవి అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. మంగళవారం రాత్రి మొదటి, రెండో ఆటలను ఎమ్మెల్యేల కోసం ప్రదర్శిస్తున్నారు.
Source: ఏపీ న్యూస్ | 18 Aug 2009 | 12:51 am

టెక్కలి ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ జారీ

అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే హఠాన్మరణంతో అనివార్యమైన టెక్కలి ఉప ఎన్నిక కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ విషయాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారి పి.అరుణ్‌బాబు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికైన రేవతీపతి గుండెపోటుతో మరణించిన విషయం తెల్సిందే.
Source: ఏపీ న్యూస్ | 18 Aug 2009 | 12:40 am

షారూక్ వ్యవహారంలో అమెరికా అతి: చిదంబరం

బాలీవుడ్ సూపర్‌స్టార్ షారూక్ ఖాన్‌ వ్యవహారంలో అమెరికా అతిగానే నడుచుకుందని కేంద్ర హోంమంత్రి చిదంబరం అభిప్రాయపడ్డారు. ఆయా దేశాలకు వెళ్లే విమాన ప్రయాణికులను తనిఖీ చేసేందుకు పది నిమిషాలు సరిపోతుందని, మహా అయితే 20 నిమిషాలకు మంచి పట్టదన్నారు.
Source: జాతీయ | 18 Aug 2009 | 12:34 am

ఈనెల 19న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ

దేశంలో నెలకొన్న కరువు పరిస్థితులపై చర్చించేందుకు కాంగ్రెస్ అత్యున్నత విధాయక మండలి (కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ) ఈనెల 19వ తేదీ బుధవారం దేశ రాజధానిలో భేటీ కానుంది.
Source: జాతీయ | 17 Aug 2009 | 11:36 pm

ప్రజారాజ్యంతో కాంగ్రెస్‌కు నష్టం: నేదురుమల్లి

అధికార కాంగ్రెస్ ‌పార్టీకి సినీ నటుడు చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యంతో ముప్పు పొంచివుందని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ సభ్యుడు నేదురుమల్లి జనార్థన్ రెడ్డి అన్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ వల్ల కాంగ్రెస్‌ పార్టీయే ఎక్కువగా నష్టపోయిందన్నారు.
Source: ఏపీ న్యూస్ | 17 Aug 2009 | 11:27 pm

భాజపా జాతీయ పగ్గాలు వెంకయ్యకు!?

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ముప్పవరపు వెంకయ్య నాయుడు మరోమారు నియమితులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ పదవీ కాలం వచ్చే అక్టోబరుతో ముగుస్తుంది. అనంతరం ఆ బాధ్యతలను వెంకయ్యకు అప్పగించాలని భాజపా అధిష్టానం భావిస్తున్నట్టు సమాచారం.
Source: ఏపీ న్యూస్ | 17 Aug 2009 | 11:09 pm

హిమాచల్‌లో ర్యాగింగ్‌కు మూడేళ్ల జైలుశిక్ష

హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో ర్యాగింగ్‌ను నిరోధించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఐదు నెలల క్రితం హిమాచల్‌లో ర్యాగింగ్ కారణంగా ఓ కళాశాల విద్యార్థి మృతి చెందిన సంగతి తెలిసిందే. ర్యాగింగ్ కారణంగా విద్యార్థి ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
Source: జాతీయ | 17 Aug 2009 | 10:33 pm

పాఠశాలల్లో ఉదయం అసెంబ్లీలు వద్దు: కేంద్రం

దేశంలో స్వైన్ ఫ్లూ వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ త్వరలో జారీ చేయనున్న మార్గదర్శకాల్లో పాఠశాలల్లో ఉదయంపూట నిర్వహించే అసెంబ్లీలను నిలిపివేసే అంశాన్ని కూడా చేర్చింది. పాఠశాలల్లో సాధారణంగా రోజూ ఉదయంపూట జరిగే అసెంబ్లీలను వ్యాధి తీవ్రత తగ్గే వరకు ఆపివేయాలని కేంద్రం కొత్త మార్గదర్శకాల్లో సూచించబోతుంది.
Source: జాతీయ | 17 Aug 2009 | 9:40 pm

మెనారిటీలకు మరో జాతీయ కమిషన్: ఖుర్షీద్

కేంద్ర ప్రభుత్వం అతి త్వరలో మైనారిటీలకోసం సమాన హక్కుల కమిషన్‌ను ఏర్పాటు చేయబోతోందని కేంద్ర మైనారిటీల శాఖామంత్రి సల్మాన్ ఖుర్షీద్ అన్నారు.
Source: జాతీయ | 17 Aug 2009 | 10:09 am

జలమయమైన రాష్ట్ర రాజధాని

భాగ్యనగరంలో సోమవారం కుండపోతగా కురిసిన భారీ వర్షంతో రాష్ట్ర రాజధాని జలమయమైంది. ప్రధాన కూడళ్ళ వద్ద ట్రాఫిక్ స్తంభించింది. దీంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
Source: ఏపీ న్యూస్ | 17 Aug 2009 | 9:59 am

చివరి షెడ్యూల్‌లో కళ్యాణ్‌ రామ్, హన్సికల చిత్రం

ఎనర్జిటిక్ స్టార్ నందమూరి కళ్యాణ్‌ రామ్ హీరోగా నటిస్తూ.. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెం.3 చిత్రం చివరి షెడ్యూల్ హైదరాబాదులో జరుగుతోంది. "అతనొక్కడే", "హరేరామ్" వంటి హిట్ చిత్రాల తర్వాత ఎన్టీఆర్ ఆర్ట్స్ బేనర్‌పై వస్తోన్న ఈ హ్యాట్రిక్ ఫిలిమ్‌లో నందమూరి కళ్యాణ్ రామ్ సరసన "దేశముదురు" ఫేమ్ హన్సిక హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం ద్వారా నరేన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 17 Aug 2009 | 9:13 am

ఐశ్వర్యకు స్వైన్ ఫ్లూ: అంతా రావణ బ్రహ్మ ఎఫెక్ట్

రావణాసురుని పాత్రను కానీ, ఆ పేరుతో సినిమాను కానీ రూపొందిస్తే.. అది ఒక పట్టాన పూర్తి కాదని పాతతరం సినిమా కాలం నుంచే ఒక సెంటిమెంట్ ఉంది. అంతేకాదు ఆ చిత్రంలో పాల్గొనే టీమ్ సభ్యులను అనుకోని సమస్యలు చుట్టుముడతాయట. మణిరత్నం కొత్త "రావణ"లో తలెత్తుతున్న కష్టాలను చూస్తే అది నిజమేనేమో అనిపిస్తోంది. ఎన్టీఆర్, ఏఎన్నార్ కలిసి నటించిన చిత్రం "భూకైలాస్"లో ఎన్టీఆర్ రావణాసురుని పాత్రను పోషించారు. ఆ సమయంలో ఆయన సంతానం తీవ్రమైన అనారోగ్యం పాలైందట. అప్పట్లో ఆయన ఓ జ్యోతిష్కుని కలిసి.. విషయమేమిటని ఆరాతీశారట. తను రావణాసురుని పాత్రను పోషించడం వల్లనే ఈ దుష్పరిమాణాలు తలెత్తుతున్నాయని సదరు జ్యోతిష్కుడు చెప్పారట. అంతే.. అప్పటి నుంచి రావణుని పాత్ర వేయాలంటే ఎన్టీఆర్‌తో పాటు అప్పటి తరం నటులందరూ వెనుకంజ వేసేవారట. ఇక తాజాగా మణిరత్నం కొత్త "రావణ" విషయానికి వస్తే... ఈ సినిమా ఆరంభం నుంచే ఎన్నో కష్టాలను ఎదుర్కొంటోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 17 Aug 2009 | 9:07 am

జంట నగరాల్లో స్వైన్ ఫ్లూ స్క్రీనింగ్ కేంద్రాలు

ప్రజలను భ్రాంతులకు గురి చేస్తున్న స్వైన్ ఫ్లూ వైరస్ స్క్రీనింగ్ సెంటర్లను జంట నగరాల్లో ఎనిమిది చోట్ల నెలకొల్పాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. రాజధానికి వచ్చే విదేశీయులతో పాటు.. ఇతర రాష్ట్రాల నుంచి తరలివస్తున్న రోగుల సంఖ్య ఎక్కువ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ చెస్ట్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎస్‌.వి.ప్రసాద్‌ సోమవారం వెల్లడించారు.
Source: ఏపీ న్యూస్ | 17 Aug 2009 | 7:35 am

స్వలింగ సంపర్కం కేసు: కేంద్రానికి నోటీసులు

స్వలింగ సంపర్కం కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. గతంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ప్రముఖ యోగా గురువు రామ్‌దేవ్ బాబా సుప్రీం కోర్టులో ఒక పిటీషన్ దాఖలు చేశారు.
Source: జాతీయ | 17 Aug 2009 | 7:19 am

కేంద్ర వైఖరిపై గుజరాత్ సీఎం మోడీ మండిపాటు

తీవ్రవాద చర్యలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపేందుకు రూపొందించిన గుజరాత్ వ్యవస్థీకృత నేరాల నిరోధక చట్టానికి (గుజరాత్ కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్‌డ్ క్రైమ్.. జీయూజేసీఓసీ) కేంద్ర ప్రభుత్వం ఆమోదించకుండా మోకాలడ్డు వేయడం పట్ల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Source: జాతీయ | 17 Aug 2009 | 6:30 am

రజియా ప్రియుడు అరెస్టుకు రంగం సిద్ధం

రజియా సుల్తానా అనే యువతిని ప్రేమించినట్లు నమ్మించి మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గుంటూరు జిల్లా పొన్నూరు టౌన్‌ ఎస్‌ఐ రంగనాథ్‌గౌడ్‌ పిటీషన్‌ను హైకోర్టు సస్పెండ్‌ చేసింది. దీంతో అతని అరెస్టుకు రంగం సిద్ధం చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి
Source: ఏపీ న్యూస్ | 17 Aug 2009 | 6:06 am

ఐశ్వర్యారాయ్‌కు స్వైన్ ఫ్లూ!?

ప్రపంచ ప్రజలను వణికిస్తున్న స్వైన్ ఫ్లూ మహమ్మారి.. బాలీవుడ్ అందాలనటి ఐశ్వర్యారాయ్‌కు సోకినట్టు సమాచారం. దీంతో 'రావణ' చిత్రం షూటింగ్ నిలిచి పోయింది. ఈ విషయాన్ని ఆమె మామ, బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ తన బ్లాగులో వెల్లడించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 17 Aug 2009 | 5:42 am

"అరుంధతి" బొమ్మాళీతో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం!

"అరుంధతి"గా సంచలన విజయాన్ని సాధించిన అనుష్క ప్రధాన పాత్రలో ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం డిసెంబర్ 11న ప్రారంభమవుతోంది. "కింగ్" నాగార్జున పర్సనల్ మేకప్‌మేన్ చంద్ర నిర్మాతగా మారి సాయిరత్న క్రియేషన్స్ పతాకంపై ఈ ప్రెస్టీజియస్ మూవీని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఉత్తమ రూపశిల్పిగా సీతారామరాజు, అన్నమయ్య, శ్రీరామదాసు చిత్రాలకు రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డులు అందుకున్న చంద్ర నిర్మాతగా సెన్సేషనల్ హిట్ ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 17 Aug 2009 | 5:31 am

సర్ క్రీక్‌లో 9 మంది పాక్ జాతీయుల అరెస్టు

గుజరాత్ కోస్తా తీరంలోని సర్‌క్రీక్ ప్రాంతంలో తొమ్మిది మంది పాక్ జాతుయులను సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) సోమవారం అరెస్టు చేసింది. వీరు పాక్ జాలర్లా లేదా భారత్‌పై మరోమారు దాడి చేసేందుకు వస్తున్న తీవ్రవాదులా అనే అంశంపై ఆరా తీసేందుకు బీఎస్ఎఫ్ అధికారులు విచారణ జరుపుతున్నారు.
Source: జాతీయ | 17 Aug 2009 | 5:04 am

సమయం వస్తే తెరాసపై స్పందిస్తా: రాములమ్మ

తెలంగాణా రాష్ట్ర సమితి (తెరాస) అధిష్టానంపై సమయం వచ్చినపుడు స్పందిస్తానని ఆ పార్టీ తిరుగుబాటు మహిళా నేత, ఎంపీ విజయశాంతి తెలిపారు. మెదక్ లోక్‌సభ సభ్యురాలైన విజయశాంతి కాంగ్రెస్‌ పార్టీకి చెందిన గజ్వేల్ ఎమ్మెల్యే నర్సారెడ్డితో కలిసి నియోజకవర్గంలో పర్యటన చేస్తున్నారు.
Source: ఏపీ న్యూస్ | 17 Aug 2009 | 4:02 am

పథకాల అమలులో చిత్తశుద్ధి లేదు: జేపీ

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అమలులో చిత్తశుద్ధి లేకపోవడమే కాకుండా దీర్ఘ దృష్టి కూడా లోపించిందని లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్ ఆరోపించారు. కేవలం ప్రజల మన్నలు పొందేందుకే ఇబ్బడి ముబ్బడిగా పథకాలు ప్రవేశపెడుతోందని దుయ్యబట్టారు.
Source: ఏపీ న్యూస్ | 17 Aug 2009 | 3:41 am

దర్శకుడు రాంగోపాల్ వర్మపై కేసు పెట్టాలి: సీపీఐ

స్త్రీలను అసభ్యంగా చూపిస్తూ.. చిత్రాలు నిర్మిస్తున్న దర్శకుడు రాంగోపాల్ వర్మపై కేసు నమోదు చేయాలని సీపీఐ రాష్ట్ర శాఖ డిమాండ్ చేసింది. తాను తీసే ప్రతి చిత్రంలో హీరోయిన్లను అశ్లీలంగా, అసభ్యకర సన్నివేశాలను తన చిత్రాల్లో చిత్రీకరిస్తున్నారని ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 17 Aug 2009 | 3:28 am