|
నష్టాల్లో స్టాక్ మార్కెట్: 661 పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్బాంబే స్టాక్ మార్కెట్‌కు సోమవారం చుక్కెదురైంది. ట్రేడింగ్ ప్రారంభంలోనే భారీ నష్టాల్లో కూరుకుపోయిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ 623 పాయింట్లు భారీగా క్షీణించి, 14,787 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 192 పాయింట్లు పతనమై 4,387 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది.Source: Yahoo! Telugu: News | 17 Aug 2009 | 9:53 am సమయం వస్తే తెరాసపై స్పందిస్తా: రాములమ్మతెలంగాణా రాష్ట్ర సమితి (తెరాస) అధిష్టానంపై సమయం వచ్చినపుడు స్పందిస్తానని ఆ పార్టీ తిరుగుబాటు మహిళా నేత, ఎంపీ విజయశాంతి తెలిపారు. మెదక్ లోక్‌సభ సభ్యురాలైన విజయశాంతి కాంగ్రెస్ పార్టీకి చెందిన గజ్వేల్ ఎమ్మెల్యే నర్సారెడ్డితో కలిసి నియోజకవర్గంలో పర్యటన చేస్తున్నారు.Source: Yahoo! Telugu: News | 17 Aug 2009 | 9:31 am చివరి షెడ్యూల్‌లో కళ్యాణ్ రామ్, హన్సికల చిత్రంఎనర్జిటిక్ స్టార్ నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తూ.. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెం.3 చిత్రం చివరి షెడ్యూల్ హైదరాబాదులో జరుగుతోంది. "అతనొక్కడే", "హరేరామ్" వంటి హిట్ చిత్రాల తర్వాత ఎన్టీఆర్ ఆర్ట్స్ బేనర్‌పై వస్తోన్న ఈ హ్యాట్రిక్ ఫిలిమ్‌లో నందమూరి కళ్యాణ్ రామ్ సరసన "దేశముదురు" ఫేమ్ హన్సిక హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం ద్వారా నరేన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 17 Aug 2009 | 9:13 am పథకాల అమలులో చిత్తశుద్ధి లేదు: జేపీరాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అమలులో చిత్తశుద్ధి లేకపోవడమే కాకుండా దీర్ఘ దృష్టి కూడా లోపించిందని లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్ ఆరోపించారు. కేవలం ప్రజల మన్నలు పొందేందుకే ఇబ్బడి ముబ్బడిగా పథకాలు ప్రవేశపెడుతోందని దుయ్యబట్టారు.Source: Yahoo! Telugu: News | 17 Aug 2009 | 9:10 am ఐశ్వర్యకు స్వైన్ ఫ్లూ: అంతా రావణ బ్రహ్మ ఎఫెక్ట్రావణాసురుని పాత్రను కానీ, ఆ పేరుతో సినిమాను కానీ రూపొందిస్తే.. అది ఒక పట్టాన పూర్తి కాదని పాతతరం సినిమా కాలం నుంచే ఒక సెంటిమెంట్ ఉంది. అంతేకాదు ఆ చిత్రంలో పాల్గొనే టీమ్ సభ్యులను అనుకోని సమస్యలు చుట్టుముడతాయట. మణిరత్నం కొత్త "రావణ"లో తలెత్తుతున్న కష్టాలను చూస్తే అది నిజమేనేమో అనిపిస్తోంది. ఎన్టీఆర్, ఏఎన్నార్ కలిసి నటించిన చిత్రం "భూకైలాస్"లో ఎన్టీఆర్ రావణాసురుని పాత్రను పోషించారు. ఆ సమయంలో ఆయన సంతానం తీవ్రమైన అనారోగ్యం పాలైందట. అప్పట్లో ఆయన ఓ జ్యోతిష్కుని కలిసి.. విషయమేమిటని ఆరాతీశారట. తను రావణాసురుని పాత్రను పోషించడం వల్లనే ఈ దుష్పరిమాణాలు తలెత్తుతున్నాయని సదరు జ్యోతిష్కుడు చెప్పారట. అంతే.. అప్పటి నుంచి రావణుని పాత్ర వేయాలంటే ఎన్టీఆర్‌తో పాటు అప్పటి తరం నటులందరూ వెనుకంజ వేసేవారట. ఇక తాజాగా మణిరత్నం కొత్త "రావణ" విషయానికి వస్తే... ఈ సినిమా ఆరంభం నుంచే ఎన్నో కష్టాలను ఎదుర్కొంటోంది.Source: Yahoo! Telugu: Entertainment | 17 Aug 2009 | 9:07 am టిక్కెట్లలో 47శాతం రాయితీ: మలేషియా ఎయిర్లైన్స్మలేషియా ఎయిర్‌లైన్స్ సంస్థ తమ విమానంలో భారతదేశంనుంచి మలేషియాకు ప్రయాణించే ప్రయాణీకులకు టిక్కెట్టుపై 47 శాతం రాయితీనిచ్చినట్లు ఆ సంస్థ ప్రాంతీయ మేనేజర్ (దక్షిణాసియా) అజహర్ హమీద్ తెలిపారు.Source: Yahoo! Telugu: News | 17 Aug 2009 | 8:57 am దర్శకుడు రాంగోపాల్ వర్మపై కేసు పెట్టాలి: సీపీఐస్త్రీలను అసభ్యంగా చూపిస్తూ.. చిత్రాలు నిర్మిస్తున్న దర్శకుడు రాంగోపాల్ వర్మపై కేసు నమోదు చేయాలని సీపీఐ రాష్ట్ర శాఖ డిమాండ్ చేసింది. తాను తీసే ప్రతి చిత్రంలో హీరోయిన్లను అశ్లీలంగా, అసభ్యకర సన్నివేశాలను తన చిత్రాల్లో చిత్రీకరిస్తున్నారని ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.Source: Yahoo! Telugu: News | 17 Aug 2009 | 8:56 am ధరలపై భాజపా రాష్ట్ర శాఖ నిరసన గళంరోజురోజుకు పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలపై భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ నిరసన గళమెత్తింది. ఈ అంశంపై సోమవారం తలపెట్టిన ఛలో అసెంబ్లీ ర్యాలీని రాజధాని పోలీసులు అడ్డుకున్నారు.Source: Yahoo! Telugu: News | 17 Aug 2009 | 8:47 am నష్టాల్లోనే స్టాక్ మార్కెట్: సెన్సెక్స్ భారీ పతనంఆసియా సంస్థలకు చెందిన వాటాలు నష్టాలను నమోదు చేసుకోవడంతో ఆ ప్రభావం బాంబే స్టాక్ మార్కెట్‌పై పడింది. దీంతో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ 437 పాయింట్లు భారీగా క్షీణించి, 14,974 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 138 పాయింట్లు పతనమై 4,439 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది.Source: Yahoo! Telugu: News | 17 Aug 2009 | 8:21 am తైవాన్‌లో ముమ్మరంగా సహాయ కార్యక్రమాలుమొరకోత్ తుపాను సృష్టించిన భీభత్సం నుంచి తైవాన్ క్రమక్రమంగా కోలుకుంటోంది. తుపాను బాధితులను ఆదుకునేందుకు తైవాన్ అధికారిక యంత్రాంగం ముమ్మర చర్యలు చేపట్టింది. మొరకోత్ తుపాను తైవాన్‌లో భీభత్సం సృష్టించి తొమ్మిది రోజులు గడిచాయి. తుపాను బాధిత ప్రాంతాల్లో సైనికులు రంగంలోకి సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.Source: Yahoo! Telugu: News | 17 Aug 2009 | 7:39 am ఆ మూడింటితో దేశ భద్రతకు ముప్పు: చిదంబరందేశ అంతర్గత భద్రతకు తీవ్రవాదం, నక్సలిజం, ఈశాన్య భారతంలోని చొరబాట్లు ప్రధాన ముప్పు కారకాలుగా ఉన్నాయని కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం ఆందోళన వ్యక్తం చేశారు. వీటిపై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన విజ్ఞప్తి చేశారు.Source: Yahoo! Telugu: News | 17 Aug 2009 | 7:38 am అమ్మకపు ఒత్తిడి: నష్టాల్లో స్టాక్ మార్కెట్సోమవారం ట్రేడింగ్ ప్రారంభంలోనే భారీ నష్టాలను చవిచూసిన బాంబే స్టాక్ మార్కెట్ యధావిధిగా తిరోగమనంవైపే పయనిస్తోంది. దీంతో మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ 413 పాయింట్లు భారీగా నష్టపోయి, 14,997 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 135 పాయింట్లు కోల్పోయి, 4,444 పాయింట్ల వద్ద పయనిస్తోంది.Source: Yahoo! Telugu: News | 17 Aug 2009 | 7:34 am ఐశ్వర్యారాయ్‌కు స్వైన్ ఫ్లూ!?ప్రపంచ ప్రజలను వణికిస్తున్న స్వైన్ ఫ్లూ మహమ్మారి.. బాలీవుడ్ అందాలనటి ఐశ్వర్యారాయ్‌కు సోకినట్టు సమాచారం. దీంతో 'రావణ' చిత్రం షూటింగ్ నిలిచి పోయింది. ఈ విషయాన్ని ఆమె మామ, బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ తన బ్లాగులో వెల్లడించారు.Source: Yahoo! Telugu: Entertainment | 17 Aug 2009 | 5:42 am "అరుంధతి" బొమ్మాళీతో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం!"అరుంధతి"గా సంచలన విజయాన్ని సాధించిన అనుష్క ప్రధాన పాత్రలో ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం డిసెంబర్ 11న ప్రారంభమవుతోంది. "కింగ్" నాగార్జున పర్సనల్ మేకప్‌మేన్ చంద్ర నిర్మాతగా మారి సాయిరత్న క్రియేషన్స్ పతాకంపై ఈ ప్రెస్టీజియస్ మూవీని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఉత్తమ రూపశిల్పిగా సీతారామరాజు, అన్నమయ్య, శ్రీరామదాసు చిత్రాలకు రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డులు అందుకున్న చంద్ర నిర్మాతగా సెన్సేషనల్ హిట్ ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 17 Aug 2009 | 5:31 am సమయం వస్తే తెరాసపై స్పందిస్తా: రాములమ్మతెలంగాణా రాష్ట్ర సమితి (తెరాస) అధిష్టానంపై సమయం వచ్చినపుడు స్పందిస్తానని ఆ పార్టీ తిరుగుబాటు మహిళా నేత, ఎంపీ విజయశాంతి తెలిపారు. మెదక్ లోక్‌సభ సభ్యురాలైన విజయశాంతి కాంగ్రెస్ పార్టీకి చెందిన గజ్వేల్ ఎమ్మెల్యే నర్సారెడ్డితో కలిసి నియోజకవర్గంలో పర్యటన చేస్తున్నారు.Source: ఏపీ న్యూస్ | 17 Aug 2009 | 4:02 am పథకాల అమలులో చిత్తశుద్ధి లేదు: జేపీరాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అమలులో చిత్తశుద్ధి లేకపోవడమే కాకుండా దీర్ఘ దృష్టి కూడా లోపించిందని లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్ ఆరోపించారు. కేవలం ప్రజల మన్నలు పొందేందుకే ఇబ్బడి ముబ్బడిగా పథకాలు ప్రవేశపెడుతోందని దుయ్యబట్టారు.Source: ఏపీ న్యూస్ | 17 Aug 2009 | 3:41 am దర్శకుడు రాంగోపాల్ వర్మపై కేసు పెట్టాలి: సీపీఐస్త్రీలను అసభ్యంగా చూపిస్తూ.. చిత్రాలు నిర్మిస్తున్న దర్శకుడు రాంగోపాల్ వర్మపై కేసు నమోదు చేయాలని సీపీఐ రాష్ట్ర శాఖ డిమాండ్ చేసింది. తాను తీసే ప్రతి చిత్రంలో హీరోయిన్లను అశ్లీలంగా, అసభ్యకర సన్నివేశాలను తన చిత్రాల్లో చిత్రీకరిస్తున్నారని ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.Source: ఏపీ న్యూస్ | 17 Aug 2009 | 3:28 am ధరలపై భాజపా రాష్ట్ర శాఖ నిరసన గళంరోజురోజుకు పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలపై భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ నిరసన గళమెత్తింది. ఈ అంశంపై సోమవారం తలపెట్టిన ఛలో అసెంబ్లీ ర్యాలీని రాజధాని పోలీసులు అడ్డుకున్నారు.Source: ఏపీ న్యూస్ | 17 Aug 2009 | 3:18 am ఆ మూడింటితో దేశ భద్రతకు ముప్పు: చిదంబరందేశ అంతర్గత భద్రతకు తీవ్రవాదం, నక్సలిజం, ఈశాన్య భారతంలోని చొరబాట్లు ప్రధాన ముప్పు కారకాలుగా ఉన్నాయని కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం ఆందోళన వ్యక్తం చేశారు. వీటిపై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన విజ్ఞప్తి చేశారు.Source: జాతీయ | 17 Aug 2009 | 2:10 am మరో దాడికి పాక్ ముష్కర మూకల కుట్ర: పీఎందేశంపై మరో మారు దాడి చేసేందుకు పాకిస్థాన్ కేంద్రంగా సాగుతున్న ముష్కర మూకలు కుట్రపన్నుతున్నాయని ప్రధాని మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి నిఘా వర్గాలు స్పష్టమైన సమాచారం అందించాయని తెలిపారు.Source: జాతీయ | 17 Aug 2009 | 1:55 am నేడు ప్రజారాజ్యం పార్టీ పీఏసీ భేటీప్రజారాజ్యం పార్టీ అధిష్టానం కొత్తగా ఏర్పాటు చేసిన రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సోమవారం సమావేశం కానుంది. ఆ పార్టీ అధ్యక్షుడు చిరంజీవి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి కొత్తగా నియమితులైన పీఏసీ సభ్యులందరూ పాల్గొననున్నారు.Source: ఏపీ న్యూస్ | 17 Aug 2009 | 1:54 am అంతర్గత భద్రతపై సీఎంలతో ప్రధాని కీలక భేటీదేశ అంతర్గత భద్రతపై చర్చించేందుకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మన్మోహన్ సింగ్ సోమవారం కీలక భేటీ జరుపుతున్నారు. ఈ సమావేశంలో జమ్మూకాశ్మీర్‌లో ప్రస్తుత పరిస్థితులు, ఈశాన్య ప్రాంతంలో భద్రత, ప్రజ్వరిల్లుతున్న మావోయిస్టుల హింస, దేశంలో దాడులకు తెగబడుతున్న ఉగ్రవాద సంస్థలు తదితర అంశాలపై ఇందులో కీలకంగా చర్చించనున్నారు.Source: జాతీయ | 16 Aug 2009 | 11:58 pm అక్రమ ప్రాజెక్టులపై న్యాయపరంగా చర్యలు: పొన్నాలరాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలింగించే విధంగా పొరుగు రాష్ట్రాలు నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖామంత్రి పొన్నాల లక్ష్మయ్య స్పష్టం చేశారు.Source: ఏపీ న్యూస్ | 16 Aug 2009 | 11:50 pm నేటితో చిరు రాజకీయ ప్రకటనకు ఏడాదిరాష్ట్రంలో మూడు దశాబ్దాల పాటు తెలుగు చిత్ర రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని కల్పించుకున్న మెగాస్టార్ చిరంజీవి.. సినీ జీవితం నుంచి రాజకీయ రంగంలోకి ప్రవేశం చేయాలని ప్రకటన చేసి నేటితో సరిగ్గా ఏడాది పూర్తయింది.Source: ఏపీ న్యూస్ | 16 Aug 2009 | 11:37 pm దేశంలో 28కి చేరుకున్న స్వైన్ ఫ్లూ మరణాలుదేశవ్యాప్తంగా ప్రమాదకర స్వైన్ ఫ్లూ వ్యాధి బారినపడి మృతి చెందినవారి సంఖ్య ఆదివారం 28కి చేరుకుంది. తాజాగా బెంగళూరులో ఇద్దరు, పూణే ఒకరు స్వైన్ ఫ్లూతో ప్రాణాలు కోల్పోయారు. చివరి ముగ్గురు మహిళలే కావడం గమనార్హం.Source: జాతీయ | 16 Aug 2009 | 10:25 pm లగేజీ రాకపోవడంతోనే షారుఖ్ ఖాన్ నిర్బంధంబాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్‌ను నెవార్క్ విమానాశ్రయంలో అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు రెండు గంటలపాటు నిర్బంధించడంపై నెలకొన్న వివాదం తాజాగా మరో మలుపు తిరిగింది. అమెరికా అధికారులు జాతివివక్షతో షారుఖ్ ఖాన్‌ను నిర్బంధించలేదని ఆ దేశ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటక్షన్ విభాగం తెలిపింది.Source: జాతీయ | 16 Aug 2009 | 9:37 pm అమెరికా దృష్టికి షారుఖ్ వివాదం: భారత్బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్‌కు అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో ఉన్న నెవార్క్ విమానాశ్రయంలో జరిగిన అవమానాన్ని నేరుగా ఆ దేశ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని భారత్ నిర్ణయించింది. భారత ప్రముఖులకు అమెరికా యంత్రాంగం ఇటీవల కాలంలో తరుచుగా ఇటువంటి అవమానాలు చేస్తున్న సంగతి తెలిసిందే.Source: జాతీయ | 16 Aug 2009 | 6:50 am బాధితులకు 10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలిమహబూబ్నగర్ జిల్లాలోని పాలమూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కళాకారుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ప్రజాగాయకుడు గద్దర్ డిమాండు చేశారు. ఈ ప్రమాదంపై సీఎం వెంటనే స్పందించి విచారణ చేపట్టాలని కోరారు. ఇదిలా ఉంటే రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కళాకారుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది.Source: ఏపీ న్యూస్ | 16 Aug 2009 | 6:24 am తిరుపతికి త్వరలో కొత్త రైళ్లు: మంత్రి వెల్లడితిరుపతికి త్వరలో కొత్త రైళ్లు ప్రవేశపెట్టబోతున్నట్లు కేంద్ర రైల్వే శాఖ సహాయమంత్రి మునియప్ప ఆదివారం వెల్లడించారు. హైదరాబాద్ నుంచి తిరుపతికి వారాంతపు రైలును ప్రారంభించనున్నట్లు చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 16 Aug 2009 | 6:05 am పేరుకుపోయిన కోర్టు కేసులపై ప్రధాని ఆందోళనదేశంలోని కోర్టుల్లో భారీ సంఖ్యలో అపరిష్కృతంగా మిగిలివున్న కేసులపై ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కేసుల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని హామీ ఇచ్చారు. పేరుకపోయిన కేసులను పరిష్కరించడానికి సాగించే యుద్ధంలో సుప్రీంకోర్టు కీలకపాత్ర పోషించాల్సి ఉందన్నారు.Source: జాతీయ | 16 Aug 2009 | 5:19 am ఈశాన్యంలో స్వైన్ ఫ్లూ: 26కి చేరిన మృతులుదేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల ప్రజలను భయకంపితులను చేస్తున్న ప్రమాదకర స్వైన్ ఫ్లూ వ్యాధి ఈశాన్య రాష్ట్రాలకు కూడా వ్యాపించింది. అసోం, మిజోరాం రాష్ట్రాల్లో తాజాగా స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా స్వైన్ ఫ్లూ కారణంగా మృతి చెందినవారి సంఖ్య 26కి చేరుకుంది.Source: జాతీయ | 16 Aug 2009 | 4:46 am
|