|
ఎయిర్ ఇండియాను ఆదుకుంటాం: ప్రధానిప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థికమాంద్యం కారణంగా దేశీయ ప్రభుత్వ విమానయాన రంగం మాంద్యంతో కొట్టుమిట్టాడుతోంది. ఈ నేపధ్యంలో దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాను కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుందని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తెలిపారు.Source: Yahoo! Telugu: News | 15 Aug 2009 | 9:56 am ప్రతిష్టాత్మకమైన కంపెనీ ఇన్ఫోసిస్: వాల్స్ట్రీట్ఐటీ రంగంలో అగ్రగామిగానున్న ప్రముఖ కంపెనీ ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ భారతదేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీల్లో ప్రతిష్టాత్మకమైన కంపెనీ అని అమెరికాకు చెందిన వాల్‌స్ట్రీట్ జర్నల్ పత్రిక వెల్లడించింది.Source: Yahoo! Telugu: News | 15 Aug 2009 | 9:17 am ముఖ్యమంత్రితో భేటీ అయిన రాములమ్మరాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో మెదక్ ఎంపీ, టీఆర్‌ఎస్ నాయకురాలు విజయశాంతి శనివారం భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో విజయశాంతి ముఖ్యమంత్రిని కలిశారు.Source: Yahoo! Telugu: News | 15 Aug 2009 | 8:32 am రజియాను పరామర్శించిన ఎమ్మెల్యేగుంటూరుజిల్లా పొన్నూరు టౌన్ ఎస్‌ఐ రంగనాధ్ గౌడ్ చేతిలో మోసగించబడిన రజియా సుల్తానాను పొన్నూరు ఎమ్మెల్యే శనివారం పరామర్శించారు.Source: Yahoo! Telugu: News | 15 Aug 2009 | 8:02 am అమెరికాలో అవమానం : కింగ్ ఖాన్ప్రముఖ బాలీవుడ్ నటుడు కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్‌కు అమెరికాలో అవమానం జరిగింది. అమెరికాలోని నేవార్క్ విమానాశ్రయంలో షారూఖ్ ఖాన్‌ని విమానాశ్రయాధికారులు దాదాపు రెండు గంటలకు పైగా నిర్బంధించారు.Source: Yahoo! Telugu: News | 15 Aug 2009 | 7:44 am పేలుళ్ళతో దద్దరిల్లిన కాబూల్...ముగ్గురి మృతిఆఫ్గనిస్థాన్ రాజధాని కాబూల్‌లో శనివారం ఉదయం భారీ పేలుళ్ళు సంభవించాయి. రాజధానిలోని విదేశీ రాయబార కార్యాలయాలు, నాటో ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ పేలుళ్ళు జరిగాయి.Source: Yahoo! Telugu: News | 15 Aug 2009 | 6:30 am అమెరికాకు భారత్ మంచి దోస్త్ : సెనేటర్ జాన్అమెరికా దేశానికి భారత దేశం మంచి దోస్త్ అని ఆ దేశ సెనేటర్, సెనేట్ ఇండియా కాకస్ కో ఛైర్మన్ జాన్ కార్నన్ చెప్పారు. భారతదేశం 63వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా అమెరికాలోని ప్రవాస భారతీయులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.Source: Yahoo! Telugu: News | 15 Aug 2009 | 6:09 am రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలుదేశభక్తులు తమ ఆస్తులను, ప్రాణాలను ఫణంగా పెట్టి సంపాదించిన స్వాతంత్ర్య దినోత్సవం (ఆగస్టు 15వ తేదీని) పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. 63వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పేరేడ్ గ్రౌండ్స్‌లో రాష్ట్ర ప్రజలనుద్దేశించి వైఎస్సార్ ప్రసంగించారు. ఆర్థికమాద్యం ప్రభావం ఉన్నా ప్రాజెక్టులు, గృహ నిర్మాణాలు ఆగవని సీఎం హామీ ఇచ్చారు.Source: Yahoo! Telugu: News | 15 Aug 2009 | 5:59 am చమురు బిడ్డింగ్‌నుంచి తప్పుకున్న రిలయన్స్వెనిజులా చమురు క్షేత్రం బిడ్డింగ్‌నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ తప్పుకుంది. 16-18 బిలియన్ల విలువైన ఈ బిడ్‌లో తొలుత ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కమిషన్ (ఓఎన్‌జీసీ), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) రిలయన్స్ ఇండస్ట్రీస్ సంయుక్తంగా ఈ బిడ్‌లో పాల్గొనాలని నిశ్చ యించుకున్నాయిSource: Yahoo! Telugu: News | 15 Aug 2009 | 5:08 am మార్కెట్‌లో విదేశీ కరెన్సీ రేట్లుస్వదేశీ మార్కెట్‌లో విదేశీ కరెన్సీ రేట్లు కింది విధంగా ఉన్నాయి. అమెరికా డాలరు కొనుగోలు రేటు (థామస్ కుక్) 45.45 అమ్మకపు రేటు (రూ.లలో) రూ.50.80. యూరో కరెన్సీ కొనుగోలు రేటు (థామస్ కుక్) 64.70 అమ్మకపు రేటు (రూ.లలో) రూ. 72.15. సింగపూర్ డాలర్ కొనుగోలు రేటు (థామస్ కుక్) 30.65, అమ్మకపు రేటు రూ. 35.90. సౌదీ రియాల్ కొనుగోలు రేటు (థామస్ కుక్) 12.00, అమ్మకపు రేటు రూ.13.75గా ఉంది.Source: Yahoo! Telugu: News | 15 Aug 2009 | 5:00 am "ఆంజనేయులు"ని ట్రైలర్లో వీక్షించండిక్రేజీస్టార్ రవితేజ, సెక్సీతార నయనతార జంటగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ చిత్రం "ఆంజనేయులు". పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై నటుడు గణేష్ బాబు నిర్మించిన ఈ చిత్రం థియేటర్లలో మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా నిర్మాత గణేష్ బాబు మాట్లాడుతూ... "రవితేజ కెరీర్‌లో మరో బిగ్గెస్ట్ చిత్రంగా "ఆంజనేయులు" సంచలనం క్రియేట్ చేస్తోందని అన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 14 Aug 2009 | 11:45 am "కలవరమాయే మదిలో" ట్రైలర్‌ను చూడండి."ఆవకాయ్ బిర్యాని" ఫేమ్ కమల్ కామరాజు హీరోగా, అష్టాచమ్మా ఫేమ్ కలర్స్ స్వాతి హీరోయిన్‌గా నటించిన చిత్రం "కలవరమాయే మదిలో". మోహన్ మీడియా క్రియేషన్స్ పతాకంపై రూపుదిద్దుకున్న ఈ సినిమా ఇటీవలే విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.Source: Yahoo! Telugu: Entertainment | 14 Aug 2009 | 11:31 am ప్రేమ "జల్లు"ను ట్రైలర్లో తిలకించండి"రేచర్ల మూవీ క్రియేషన్స్" పతాకంపై రేచర్ల సుభాష్ నాయుడు నిర్మించిన తొలి చిత్రం ‘జల్లు’. వి.వి.నారాయణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ద్వారా చికాగోలో "సిఎమ్ ఇ గ్రూఫ్" సాప్ట్‌వేర్ ఉద్యోగి "జయంత్ పృథ్వీరాజ్" కథానాయకుడిగా పరిచయమయ్యారు.Source: Yahoo! Telugu: Entertainment | 14 Aug 2009 | 11:16 am నేను "ముదురు" పాపనంటున్న హాన్సిక"దేశముదురు" భామ నిజంగానే తాను ముదురు అంటోంది. అన్ని విషయాల్లోనూ తగిన నిర్ణయం తీసుకునే స్థాయికి తాను ఎదిగానని హన్సిక అంటోంది. నిర్ణయాలు తీసుకోవడానికి క్షణం చాలు. వాటిని ఆచరణలో పెట్టడంలో ఆంక్షలుండకూడదని దేశముదురు సుందరి అంటోంది. ఈ సందర్భంగా ఆమెను కదిలిస్తే ఏమంటుందో తెలుసా? "ఒక్కో సంవత్సరం వయస్సు పెరిగేకొద్దీ బాధ్యతలు పెరుగుతాయి. నేను మేజర్‌ని. నాకు సంబంధించి కీలక నిర్ణయాలను తీసుకునే విషయాన్ని అమ్మ నాకే వదిలేస్తుంది" అని హన్సిక చెబుతోంది. అలాగని నేను విచ్చలవిడిగా ప్రవర్తించే దాన్ని కాదని హన్సిక తేల్చి చెప్పేస్తుంది.Source: Yahoo! Telugu: Entertainment | 14 Aug 2009 | 10:33 am కష్టాల్ని ఇష్టంగా చేశాను: రియల్ స్టార్ శ్రీహరి"బ్రహ్మనాయుడు" చిత్రంలో సినీ కెరీర్‌ను ప్రారంభించి, విలన్ నుంచి హీరోగా మారిన నటుడు శ్రీహరి. అందరిచేత మనవాడుగా అనిపించుకున్న రియల్ స్టార్‌కు ఈ నెల ఆగస్టు 15 పుట్టినరోజు. ఈ సందర్భంగా శ్రీహరితో ముచ్చటించిన విశేషాలు మీకోసం.ప్రశ్న: మీ పుట్టినరోజునాడు మీకేమి గుర్తుకువస్తుంది?జ: మనకు స్వాతంత్య్రం వచ్చిననాడే నేను పుట్టడం గర్వంగా ఫీలవుతున్నాను. అదే నాకు తీపిగుర్తుగా ఉంటుంది. ప్రశ్న: మగధీర సక్సెస్‌ను ఎలా ఎంజాయ్ చేస్తున్నారు?జ: చాలా సంతోషంగా ఉంది. అందులో షేర్‌ఖాన్ పాత్రను నా బర్త్‌డేగిఫ్ట్‌గా భావిస్తున్నాను. ప్రశ్న: ప్రత్యేక పాత్రలు చేయడానికి కారణం?జ: కేవలం కథ, క్యారెక్టర్ ఈ రెండూ నచ్చడమే. ప్రశ్న: హీరో, ప్రత్యేకపాత్రల్లో దేనికీ మంచి రెస్పాన్స్ వస్తోంది?జ: దేని స్పందన దానిదే. ఒకరకంగా చెప్పాలంటే ప్రత్యేక పాత్రలు చేయడం వల్లనే మంచి పేరు కెరీర్ ఉంది. ప్రశ్న: ఇంకా చేయాల్సిన డ్రీమ్ రోల్స్ ఉన్నాయా?జ: అంజనీపుత్రుడు లాంటి పాత్రను ఎప్పటికైనా చేయాలాని డ్రీమ్. ప్రశ్న: కొత్త చిత్రాలు..?జ: తమిళంలో ఎ.వి.ఎం. సంస్థ విజయ్‌తో నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్నా.Source: Yahoo! Telugu: Entertainment | 14 Aug 2009 | 8:39 am "ఆంజనేయులు"ని ట్రైలర్లో వీక్షించండిక్రేజీస్టార్ రవితేజ, సెక్సీతార నయనతార జంటగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ చిత్రం "ఆంజనేయులు". పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై నటుడు గణేష్ బాబు నిర్మించిన ఈ చిత్రం థియేటర్లలో మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా నిర్మాత గణేష్ బాబు మాట్లాడుతూ... "రవితేజ కెరీర్‌లో మరో బిగ్గెస్ట్ చిత్రంగా "ఆంజనేయులు" సంచలనం క్రియేట్ చేస్తోందని అన్నారు.Source: వినోదం | 14 Aug 2009 | 7:25 am "కలవరమాయే మదిలో" ట్రైలర్‌ను చూడండి."ఆవకాయ్ బిర్యాని" ఫేమ్ కమల్ కామరాజు హీరోగా, అష్టాచమ్మా ఫేమ్ కలర్స్ స్వాతి హీరోయిన్‌గా నటించిన చిత్రం "కలవరమాయే మదిలో". మోహన్ మీడియా క్రియేషన్స్ పతాకంపై రూపుదిద్దుకున్న ఈ సినిమా ఇటీవలే విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.Source: వినోదం | 14 Aug 2009 | 7:23 am ప్రేమ "జల్లు"ను ట్రైలర్లో తిలకించండి"రేచర్ల మూవీ క్రియేషన్స్" పతాకంపై రేచర్ల సుభాష్ నాయుడు నిర్మించిన తొలి చిత్రం ‘జల్లు’. వి.వి.నారాయణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ద్వారా చికాగోలో "సిఎమ్ ఇ గ్రూఫ్" సాప్ట్‌వేర్ ఉద్యోగి "జయంత్ పృథ్వీరాజ్" కథానాయకుడిగా పరిచయమయ్యారు.Source: వినోదం | 14 Aug 2009 | 7:21 am కష్టాల్ని ఇష్టంగా చేశాను: రియల్ స్టార్ శ్రీహరి"బ్రహ్మనాయుడు" చిత్రంలో సినీ కెరీర్‌ను ప్రారంభించి, విలన్ నుంచి హీరోగా మారిన నటుడు శ్రీహరి. అందరిచేత మనవాడుగా అనిపించుకున్న రియల్ స్టార్‌కు ఈ నెల ఆగస్టు 15 పుట్టినరోజు. ఈ సందర్భంగా శ్రీహరితో ముచ్చటించిన విశేషాలు మీకోసం. ప్రశ్న: మీ పుట్టినరోజునాడు మీకేమి గుర్తుకువస్తుంది? జ: మనకు స్వాతంత్య్రం వచ్చిననాడే నేను పుట్టడం గర్వంగా ఫీలవుతున్నాను. అదే నాకు తీపిగుర్తుగా ఉంటుంది. ప్రశ్న: మగధీర సక్సెస్‌ను ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? జ: చాలా సంతోషంగా ఉంది. అందులో షేర్‌ఖాన్ పాత్రను నా బర్త్‌డేగిఫ్ట్‌గా భావిస్తున్నాను. ప్రశ్న: ప్రత్యేక పాత్రలు చేయడానికి కారణం? జ: కేవలం కథ, క్యారెక్టర్ ఈ రెండూ నచ్చడమే. ప్రశ్న: హీరో, ప్రత్యేకపాత్రల్లో దేనికీ మంచి రెస్పాన్స్ వస్తోంది? జ: దేని స్పందన దానిదే. ఒకరకంగా చెప్పాలంటే ప్రత్యేక పాత్రలు చేయడం వల్లనే మంచి పేరు కెరీర్ ఉంది. ప్రశ్న: ఇంకా చేయాల్సిన డ్రీమ్ రోల్స్ ఉన్నాయా? జ: అంజనీపుత్రుడు లాంటి పాత్రను ఎప్పటికైనా చేయాలాని డ్రీమ్. ప్రశ్న: కొత్త చిత్రాలు..? జ: తమిళంలో ఎ.వి.ఎం. సంస్థ విజయ్‌తో నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్నా.Source: వినోదం | 14 Aug 2009 | 7:18 am రంభకు పెళ్లికొడుకు కావలెను!!దక్షిణాది చిత్రాల్లో అగ్రశ్రేణి హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ సినీ నటి రంభ.. ఐటంగర్ల్ రాఖీ సావంత్ బాటలో పయనించేందుకు సై అంటోంది. రాఖీ సావంత్ లాగానే స్వయంవరం ద్వారా వరుడిని ఎంపిక చేసుకోనుందని కోడంబాక్కం వర్గాలు కోడైకూస్తున్నాయి. దీంతో వరుడి కోసం రంభ కుటుంబీకులు అన్వేషణ మొదలు పెట్టినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో టీవీ షోలో స్వయంవరం నిర్వహించి వరుడిని ఎంపిక చేసుకోవాలని రంభ భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే రంభ స్వయంవరంకు సంబంధించి ఓ ప్రముఖ తమిళ ఛానెల్ ఆమెతో చర్చలు జరుపుతున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి.Source: Yahoo! Telugu: Entertainment | 14 Aug 2009 | 6:45 am దసరాకు తెరపైకి వస్తోన్న "బెండు అప్పారావు"సురేష్ ప్రొడక్షన్ పతాకంపై డా. డి. రామానాయుడు నిర్మిస్తున్న తాజా చిత్రం 'బెండు అప్పారావు ఆర్.ఎం.పి.' ప్రస్తుతం ఈ సినిమా ఎడిటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. రెండురోజుల్లో డబ్బింగ్ ప్రారంభించి ఈ నెలలోనే ఆడియోను, దసరానాటికి సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని రామానాయుడు వెల్లడించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, ఆస్ట్రియాల్లో మూడు పాటలను చిత్రీకరించాం. టాకీ కోనసీమలోని రాజమండ్రి, కోరుమామిడి, దోసకాయలపల్లి, ధవళేశ్వరం, దొమ్మేరు తదితర ప్రాంతాల్లో షూట్ చేశామని చెప్పారు. ఆర్.ఎం.పి. డాక్టర్‌కు అనుకూలమైన ప్రాంతాలవని, అక్కడివారిలోని భౌతికరోగాలతోపాటు, మానసికరోగాలను బెండు అప్పారావు ఎలా నయం చేశాడన్నదే విషయాన్ని ఆసక్తికరంగా తెరకెక్కించామని రామానాయుడు తెలిపారు.Source: Yahoo! Telugu: Entertainment | 14 Aug 2009 | 5:12 am నేను "ముదురు" పాపనంటున్న హాన్సిక"దేశముదురు" భామ నిజంగానే తాను ముదురు అంటోంది. అన్ని విషయాల్లోనూ తగిన నిర్ణయం తీసుకునే స్థాయికి తాను ఎదిగానని హన్సిక అంటోంది. నిర్ణయాలు తీసుకోవడానికి క్షణం చాలు. వాటిని ఆచరణలో పెట్టడంలో ఆంక్షలుండకూడదని దేశముదురు సుందరి అంటోంది. ఈ సందర్భంగా ఆమెను కదిలిస్తే ఏమంటుందో తెలుసా? "ఒక్కో సంవత్సరం వయస్సు పెరిగేకొద్దీ బాధ్యతలు పెరుగుతాయి. నేను మేజర్‌ని.Source: వినోదం | 14 Aug 2009 | 5:11 am మళ్ళీ తెరపైకి గోపీచంద్, బొమ్మాళీ కాంబినేషన్!'లక్ష్యం' సినిమాతో యూత్ హీరో గోపీచంద్, బొమ్మాళీ అనుష్క సక్సెస్ కాంబినేషన్‌గా నిలిచారు. తాజాగా వీరి కాంబినేషన్‌లో ఆర్.ఆర్.మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం కథాచర్చలు ముగింపు దశలో ఉన్నాయి. దసరానాడు చిత్రాన్ని ప్రారంభిస్తామని చిత్ర సమర్పకుడు అచ్చిరెడ్డి గురువారంనాడు తెలియజేశారు.Source: Yahoo! Telugu: Entertainment | 14 Aug 2009 | 5:00 am
|