|
నష్టాల్లోనే నడుస్తున్న స్టాక్ మార్కెట్స్టాక్ మార్కెట్ ప్రస్తుతం నష్టాల్లోనే నడుస్తుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 69 పాయింట్లు కోల్పోయి 15,450 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 18 పాయింట్లు నష్టపోయి 4,587 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.44 శాతం, నిఫ్టీ 0.39 శాతం మేరకు క్షీణించాయి.Source: Yahoo! Telugu: News | 14 Aug 2009 | 9:27 am గృహరుణాలు ఇక చౌక: పీఎన్బీదేశీయ బ్యాంకింగ్ రంగంలో అగ్రగామిగానున్న భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ) తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) ఇకపై గృహ రుణాలు, కార్ల రుణాలను పొందేవారికి వడ్డీ రేట్లను తగ్గించింది.Source: Yahoo! Telugu: News | 14 Aug 2009 | 9:06 am నష్టాల్లో పయనిస్తున్న సెన్సెక్స్స్టాక్ మార్కెట్ ప్రస్తుతం నష్టాల్లో పయనిస్తుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 75 పాయింట్లు కోల్పోయి 15,444 వద్ద పయనిస్తోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 20 పాయింట్లు నష్టపోయి 4,585 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.48 శాతం, నిఫ్టీ 0.28 శాతం మేరకు క్షీణించాయి.Source: Yahoo! Telugu: News | 14 Aug 2009 | 8:24 am పాక్ అణు కేంద్రాల భద్రతపై అమెరికా సంతృప్తిపాకిస్థాన్ అణు కేంద్రాలపై గత రెండేళ్లలో మూడుసార్లు తాలిబాన్, అల్ ఖైదా తీవ్రవాదులు దాడులు చేశారని మీడియాలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. అమెరికా అధికారిక యంత్రాంగం పాక్ భూభాగంలోని అణ్వాయుధ కేంద్రాల భద్రతపై దృష్టిసారించింది.Source: Yahoo! Telugu: News | 14 Aug 2009 | 8:02 am రాజ్‌నాథ్ సింగ్‌తో రాజస్థాన్ ఎమ్మెల్యేల భేటిరాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే మద్దతుదారులైన 45 మంది బీజేపీ ఎమ్మెల్యేలు శుక్రవారం న్యూఢిల్లీలో పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌ను కలుసుకున్నారు. గత లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరాజయాలకు బాధ్యత వహిస్తూ ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేయాలని పార్టీ అధిష్టానం వసుంధరా రాజేను కోరినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.Source: Yahoo! Telugu: News | 14 Aug 2009 | 7:51 am ఈ నెలలో తస్లిమా నస్రీన్ అమెరికా పయనంవివాదాస్పద రచయిత్ర తస్లిమా నస్రీన్ వచ్చే ఏడాది జనవరిలో భారత్ తిరిగిరానున్నారు. బంగ్లాదేశ్‌కు చెందిన తస్లిమా నస్రీన్ ఈ నెలలో అమెరికా పయమవుతున్నారు. భారత్‌లో ఉండేందుకు ఆమె వీసాను మరో ఆరు నెలలు పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే న్యూయార్క్ విశ్వవిద్యాలయంలో రీసెర్చ్ స్కాలర్‌గా పని చేసేందుకు తస్లిమా అమెరికా వెళ్లాలని నిర్ణయించుకున్నారు.Source: Yahoo! Telugu: News | 14 Aug 2009 | 7:40 am ఒడిదుడుకుల మధ్య పయనిస్తున్న సెన్సెక్స్స్టాక్ మార్కెట్ ప్రస్తుతం ఒడిదుడుకల మధ్య పయనిస్తుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 58 పాయింట్లు కోల్పోయి 15,460 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 14 పాయింట్లు నష్టపోయి 4,598 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.17 శాతం, నిఫ్టీ 0.15 శాతం మేరకు క్షీణించాయి.Source: Yahoo! Telugu: News | 14 Aug 2009 | 7:35 am మళ్ళీ పల్లెబాట ప్రారంభం: వైఎస్రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మళ్ళీ పల్లెబాట నిర్వహించనున్నారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే పల్లెబాట కార్యక్రమం ప్రారంభమౌతుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.Source: Yahoo! Telugu: News | 14 Aug 2009 | 7:30 am "పులి"తో నా తదుపరి చిత్రం: బొత్సవిజయనగరంలో "మగధీర" సినిమాను బ్యాన్ చేసి కలకలం సృష్టించిన రాష్ట్రమంత్రి బొత్స సత్యనారాయణ మెగాస్టార్‌తో ప్యాచప్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గురువారం చిరంజీవిని ఆయన కార్యాలయంలో కలిసి మాట్లాడారు. అయితే వాళ్లిద్దరూ ఏం మాట్లాడుకున్నారనే విషయం తెలియరాలేదు.Source: Yahoo! Telugu: News | 14 Aug 2009 | 7:29 am మాంద్యంనుంచి తేరుకుంటున్న ఆరు దేశాలుఆర్థికమాంద్యంనుంచి కొన్ని దేశాలు త్వరితగతిన కోలుకుంటున్నట్లు వచ్చిన వార్తలు వ్యాపార వర్గాల్లో ఉత్సుకత రేపుతున్నాయి. ప్రపంచంలో ఆర్థికంగా బలమైన 10 దేశాల్లో ఆరు దేశాలు ఆర్థికమాంద్యం నుంచి తేరుకుని జీడీపీలో 0.3 శాతం వృద్ధిని నమోదుచేశాయని అధికారిక లెక్కలు చెపుతున్నాయి.Source: Yahoo! Telugu: News | 14 Aug 2009 | 7:16 am రంభకు పెళ్లికొడుకు కావలెను!!దక్షిణాది చిత్రాల్లో అగ్రశ్రేణి హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ సినీ నటి రంభ.. ఐటంగర్ల్ రాఖీ సావంత్ బాటలో పయనించేందుకు సై అంటోంది. రాఖీ సావంత్ లాగానే స్వయంవరం ద్వారా వరుడిని ఎంపిక చేసుకోనుందని కోడంబాక్కం వర్గాలు కోడైకూస్తున్నాయి. దీంతో వరుడి కోసం రంభ కుటుంబీకులు అన్వేషణ మొదలు పెట్టినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో టీవీ షోలో స్వయంవరం నిర్వహించి వరుడిని ఎంపిక చేసుకోవాలని రంభ భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే రంభ స్వయంవరంకు సంబంధించి ఓ ప్రముఖ తమిళ ఛానెల్ ఆమెతో చర్చలు జరుపుతున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి.Source: Yahoo! Telugu: Entertainment | 14 Aug 2009 | 6:45 am దసరాకు తెరపైకి వస్తోన్న "బెండు అప్పారావు"సురేష్ ప్రొడక్షన్ పతాకంపై డా. డి. రామానాయుడు నిర్మిస్తున్న తాజా చిత్రం 'బెండు అప్పారావు ఆర్.ఎం.పి.' ప్రస్తుతం ఈ సినిమా ఎడిటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. రెండురోజుల్లో డబ్బింగ్ ప్రారంభించి ఈ నెలలోనే ఆడియోను, దసరానాటికి సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని రామానాయుడు వెల్లడించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, ఆస్ట్రియాల్లో మూడు పాటలను చిత్రీకరించాం. టాకీ కోనసీమలోని రాజమండ్రి, కోరుమామిడి, దోసకాయలపల్లి, ధవళేశ్వరం, దొమ్మేరు తదితర ప్రాంతాల్లో షూట్ చేశామని చెప్పారు. ఆర్.ఎం.పి. డాక్టర్‌కు అనుకూలమైన ప్రాంతాలవని, అక్కడివారిలోని భౌతికరోగాలతోపాటు, మానసికరోగాలను బెండు అప్పారావు ఎలా నయం చేశాడన్నదే విషయాన్ని ఆసక్తికరంగా తెరకెక్కించామని రామానాయుడు తెలిపారు.Source: Yahoo! Telugu: Entertainment | 14 Aug 2009 | 5:12 am మళ్ళీ తెరపైకి గోపీచంద్, బొమ్మాళీ కాంబినేషన్!'లక్ష్యం' సినిమాతో యూత్ హీరో గోపీచంద్, బొమ్మాళీ అనుష్క సక్సెస్ కాంబినేషన్‌గా నిలిచారు. తాజాగా వీరి కాంబినేషన్‌లో ఆర్.ఆర్.మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం కథాచర్చలు ముగింపు దశలో ఉన్నాయి. దసరానాడు చిత్రాన్ని ప్రారంభిస్తామని చిత్ర సమర్పకుడు అచ్చిరెడ్డి గురువారంనాడు తెలియజేశారు.Source: Yahoo! Telugu: Entertainment | 14 Aug 2009 | 5:00 am "పులి"తో నా తదుపరి చిత్రం: బొత్సవిజయనగరంలో "మగధీర" సినిమాను బ్యాన్ చేసి కలకలం సృష్టించిన రాష్ట్రమంత్రి బొత్స సత్యనారాయణ మెగాస్టార్‌తో ప్యాచప్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గురువారం చిరంజీవిని ఆయన కార్యాలయంలో కలిసి మాట్లాడారు. అయితే వాళ్లిద్దరూ ఏం మాట్లాడుకున్నారనే విషయం తెలియరాలేదు.Source: ఏపీ న్యూస్ | 14 Aug 2009 | 3:33 am రాజ్‌నాథ్ సింగ్‌తో రాజస్థాన్ ఎమ్మెల్యేల భేటిరాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే మద్దతుదారులైన 45 మంది బీజేపీ ఎమ్మెల్యేలు శుక్రవారం న్యూఢిల్లీలో పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌ను కలుసుకున్నారు. గత లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరాజయాలకు బాధ్యత వహిస్తూ ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేయాలని పార్టీ అధిష్టానం వసుంధరా రాజేను కోరినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.Source: జాతీయ | 14 Aug 2009 | 2:22 am ఈ నెలలో తస్లిమా నస్రీన్ అమెరికా పయనంవివాదాస్పద రచయిత్ర తస్లిమా నస్రీన్ వచ్చే ఏడాది జనవరిలో భారత్ తిరిగిరానున్నారు. బంగ్లాదేశ్‌కు చెందిన తస్లిమా నస్రీన్ ఈ నెలలో అమెరికా పయమవుతున్నారు. భారత్‌లో ఉండేందుకు ఆమె వీసాను మరో ఆరు నెలలు పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే న్యూయార్క్ విశ్వవిద్యాలయంలో రీసెర్చ్ స్కాలర్‌గా పని చేసేందుకు తస్లిమా అమెరికా వెళ్లాలని నిర్ణయించుకున్నారు.Source: జాతీయ | 14 Aug 2009 | 2:11 am మళ్ళీ పల్లెబాట ప్రారంభం: వైఎస్రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మళ్ళీ పల్లెబాట నిర్వహించనున్నారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే పల్లెబాట కార్యక్రమం ప్రారంభమౌతుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.Source: ఏపీ న్యూస్ | 14 Aug 2009 | 2:02 am రాష్ట్ర ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలుజగన్నాటక సూత్రధారి, శ్రీ కృష్ణ భగవానుడు జన్మించిన పవిత్ర దినం శ్రీ కృష్ణాష్టమి పర్వదిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా రాష్ట్ర ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 14 Aug 2009 | 12:53 am బీజేపీ వివాదం: ఢిల్లీకి రాజే మద్దతుదారులురాజస్థాన్ బీజేపీలో నెలకొన్న వివాదాన్ని పరిష్కరించేందుకు రాష్ట్ర పార్టీకి నేతృత్వం వహిస్తున్న వసుంధరా రాజే మద్దతుదారులు శుక్రవారం ఢిల్లీ వచ్చారు. రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేయాలని బీజేపీ అధిష్టానం మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజేను కోరినట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. ఆమె మద్దతుదారులు ఢిల్లీ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.Source: జాతీయ | 14 Aug 2009 | 12:50 am ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కళ్లు తెరవాలి..!రాష్ట్ర ప్రభుత్లానికి ముందస్తు ఆలోచన లేకపోవడం వల్లే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కళ్లు తెరవాలని ఆయన మండిపడ్డారు.Source: ఏపీ న్యూస్ | 13 Aug 2009 | 11:59 pm చక్ర అవార్డులు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వంస్వాతంత్ర్య దినోత్సం రోజున రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చేతుల మీదగా చక్ర అవార్డులు అందుకోబోయే పౌరుల పేర్లను కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. ఈసారి అత్యున్నత అశోక చక్ర పురస్కారాలను కూడా అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అశోక చక్ర అవార్డులను ఈసారి మేజర్ మోహిత్ శర్మ, మేజర్ డి.శ్రీకుమార్‌లకు అందించనున్నట్లు తెలుస్తోంది.Source: జాతీయ | 13 Aug 2009 | 11:56 pm రాజ్ బీజేపీలో ముసలం: రాజేకి ఎసరు పెట్టారా?రాజస్థాన్ బీజేపీ శాఖలో ముసలం బయలుదేరినట్లు తెలుస్తోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజేను ప్రతిపక్ష నేత హోదా నుంచి తొలగించేందుకు రంగం సిద్ధమైనట్లు మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే వసుంధరా రాజే ప్రతిపక్ష నేత హోదా నుంచి తప్పుకునేందుకు సుముఖంగా లేరు. అంతేకాకుండా ఆమెకు ఎమ్మెల్యేల బలం కూడా కావాల్సినంత ఉంది.Source: జాతీయ | 13 Aug 2009 | 10:11 pm దేశవ్యాప్తంగా 23కి చేరిన స్వైన్ ఫ్లూ మృతులుదేశవ్యాప్తంగా స్వైన్ ఫ్లూ మృతుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ముఖ్యంగా పూణే పౌరులు ఈ స్వైన్ ఫ్లూ వ్యాధి కారణంగా తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఒక్క పూణేలోని ఈ ప్రమాదకర వ్యాధి 14 మంది ప్రాణాలు బలితీసుకుంది. పూణేలో గురువారం పారుభాయ్ షిండే అనే 70 ఏళ్ల మహిళ కూడా ఈ వ్యాధితో ప్రాణాలు కోల్పోయారు.Source: జాతీయ | 13 Aug 2009 | 9:24 pm లేడికళ్ల త్రిష.. ఎక్కడివక్కడే వదిలేస్తుందట..నీ మనసు నాకు తెలుసు, అతడు, సైనికుడు, ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే, స్టాలిన్, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి హిట్ సినిమాల్లో నటించిన అందాల ముద్దుగుమ్మ త్రిష ఈ మధ్య తెగ వేదాంతం మాట్లాడేస్తోందట. ఇందులో భాగంగానే.. భవిష్యత్ గురించి ఆలోచిస్తూ.. వర్తమానాన్ని వదిలేసే వాళ్ళంటే త్రిషకు భలే చిరాకట. పుకార్లకు ఆమడ దూరంలో ఉండాలనుకుంటూనే ఎప్పుడూ వార్తల్లోకెక్కే ఈ భామ ఇటీవలే శింబుకు చాలా క్లోజ్ అయ్యిందనే వార్తలు ఫిలిమ్ నగర్ వర్గాల్లో షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. హైదరాబాద్‌కు షూటింగ్ కోసం వచ్చిన త్రిషను ఈ సందర్భంగా మెల్లగా కదిలిస్తే.. తానెప్పుడూ షూటింగ్‌లో పలు జాగ్రత్తలు తీసుకుంటానని చెప్పింది. ఎంత అలసిపోయినా.. ముఖంలో దాని తాలూకు ఛాయలు కన్పించకుండా జాగ్రత్తలు తీసుకుంటానని త్రిష వెల్లడించింది. అంతకంటే చాలా ముఖ్యం.. మనసులో లేనిపోని ఆందోళనలు, చికాకులు ఉంచుకోనని త్రిష తేల్చి చెప్పేసింది. అంతేకాదు.. ఎక్కడి విషయాలను అక్కడే వదిలేస్తూ ఉంటే ఏ బెడదా ఉండదని ఈ పొడవుకాళ్ల సుందరి అంటోంది.Source: Yahoo! Telugu: Entertainment | 13 Aug 2009 | 10:56 am "పదహారేళ్ల వయసు" కథానాయిక 'శ్రీదేవి' పర్సనల్ టచ్తమిళనాడు రాష్ట్రంలోని శివకాశిలో జన్మించి బాలనటిగా తన నటనా జీవితాన్ని ప్రారంభించి అగ్రహీరోయిన్ స్థాయికి ఎదిగిన అందాల తార శ్రీదేవి. దక్షిణ, ఉత్తరాది భాషల్లో కథానాయికగా ఓ వెలుగు వెలిగిన శ్రీదేవి బంగారక్క (1977) అనే చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. తెలుగులో శ్రీదేవి నటించిన పలు తెలుగు చిత్రాలకు కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. అలాగే టాలీవుడ్ టాప్ హీరో ఎన్.టి. రామారావుతో కొండవీటి సింహం, వేటగాడు, బొబ్బిలి పులి, సర్దార్ పాపానాయుడు వంటి చిత్రాల్లో శ్రీదేవి నటించింది. అదేవిధంగా టాలీవుడ్ మరో టాప్ హీరో అక్కినేని నాగేశ్వరరావుతో ముద్దుల కొడుకు, ప్రేమాభిషేకం, బంగారు కానుక, ప్రేమకానుక వంటి చిత్రాల్లో శ్రీదేవి కథానాయిక పాత్రను పోషించింది. ఇదేవిధంగా సూపర్ స్టార్ కృష్ణతో కలవారి సంసారం, కృష్ణావతారం, బురిపాలెం బుల్లోడు వంటి సినిమాల్లోనూ శ్రీదేవి నటించింది. పలు నంది అవార్డులు, ఫిల్మ్ ఫేర్ అవార్డులను సొంతం చేసుకున్న శ్రీదేవికి నేడే పుట్టినరోజు: ఆగస్టు 13-08-1963. జన్మస్థలం: శివకాశి (తమిళనాడు రాష్ట్రం). ఇంకేముంది? తన అందచందాలతో భారతీయ వెండితెరలో మెరిసిన శ్రీ దేవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు..!Source: Yahoo! Telugu: Entertainment | 13 Aug 2009 | 10:02 am దేశంలో 21కి చేరిన స్వైన్ ఫ్లూ మృతుల సంఖ్యప్రమాదకర స్వైన్ ఫ్లూ వ్యాధి బారినపడి పూణేలోని ససూన్ ఆస్పత్రిలో గురువారం మధ్యాహ్నం 37 ఏళ్ల అర్చనా కొల్హే మృతి చెందారు. ఈమె మరణంతో దేశవ్యాప్తంగా స్వైన్ ఫ్లూ వైరస్ బలితీసుకున్న ప్రాణాల సంఖ్య 21కి చేరుకుంది. ప్రమాదకర వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేపడుతున్నప్పటికీ, దేశంలో ఇప్పటికీ పౌర మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి.Source: జాతీయ | 13 Aug 2009 | 9:15 am "గట్స్" సినిమా ట్రైలర్‌ను చూడండిరాష్ట్రాన్ని గడగడలాడించే ఓ గూండా ప్రేమలో పడితే ఎలా వుంటుందనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘గట్స్’. సత్యప్రకాష్, దినేష్, పాకీహెగ్డే ఇందులో హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇకపోతే.. గోసంగి సుబ్బారావు దర్శకత్వంలో లక్ష్మీదుర్గా ప్రొడక్షన్స్ పతాకంపై సాయిరాం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 13 Aug 2009 | 9:06 am ఇష్రాత్ జహాన్ ఎన్‌కౌంటర్‌పై దర్యాప్తుకు కమిటీ2004నాటి సంచలనాత్మక ఇష్రాత్ జహాన్ ఎన్‌కౌంటర్ కేసుపై తదుపరి దర్యాప్తు జరిపేందుకు గుజరాత్ హైకోర్టు గురువారం ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఐజీ స్థాయి సీనియర్ పోలీసు అధికారి ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారు. కమిటీలో మిగిలిన ఇద్దరు డీఐజీ, అడిషన్ డీఐజీ స్థాయి అధికారులు ఉంటారని తెలుస్తోంది.Source: జాతీయ | 13 Aug 2009 | 9:04 am సమీరా రెడ్డిని ఎత్తి పడేసిన సెక్యూరిటీ గార్డులుబాలీవుడ్ నటి సమీరారెడ్డి నటిస్తున్న తమిళ చిత్రం షూటింగ్ మలేసియాలోని కౌలా లంపూర్‌లో జరుగుతోంది. ఈ షూటింగ్‌లో పాల్గొన్న సమీరకు ఆ దేశంలో ఓ చేదు అనుభవం ఎదురైందట. మలేసియా ప్రధానమంత్రికి రక్షణగా ఉండే సెక్యూరిటీ గార్డులు సమీరా రెడ్డిని దాదాపు కొట్టినంత పనిచేశారట. వివరాలలోకి వెళితే.. సమీరా రెడ్డి షూటింగ్ ముగించుకుని తన హోటల్ గదికి లిఫ్ట్‌లో వెళుతుండగా పదిమంది సెక్యూరిటీ గార్డులు ఇనుప చైన్లతో ప్రవేశించారట. వారు ప్రయాణిస్తున్న లిఫ్ట్ లాబీ ఫ్లోర్‌లోకి ప్రవేశిస్తుండగా ఓ సెక్యూరిటీ గార్డు సమీర చేయిని గట్టిగా పట్టుకున్నాడట. ఈ హఠత్పరిమాణానికి బెదిరిపోయిన సమీర అతడి చేయిని గట్టిగా విదిలించుకుని తిట్ల దండకం అందుకున్నదట. దీంతో రెచ్చిపోయిన సెక్యూరిటీ గార్డులు మలయ్ భాషలో పెద్ద పెద్దగా అరిచి ఆమెను అమాంతం పైకెత్తి లిఫ్ట్ నుంచి బయటకు విసిరి పడేశారట. దీంతో కోపోద్రిక్తురాలైన సమీర హోటల్ యాజమాన్యంపై తోక తొక్కిని పాములా బుసలు కొట్టిందట.Source: Yahoo! Telugu: Entertainment | 13 Aug 2009 | 8:12 am బోటు ఇంజన్ జపాన్ నుంచి దిగుమతి: సాక్షిదేశ వాణిజ్య రాజధాని ముంబైపై దాడి చేసే నిమిత్తం కరాచీ నుంచి ముంబైకు చేరుకునేందుకు తీవ్రవాదులు ఉపయోగించిన బోటుకు అమర్చిన ఇంజన్ జపాన్‌ను దిగుమతి చేసుకున్నట్టు తాజాగా వెల్లడైంది. జపాన్‌కు చెందిన యమహా కంపెనీ ఈ ఇంజన్‌ను తయారు చేసి, పాక్‌లోని ఒక ఇంజనీరింగ్ కంపెనీకి సరఫరా చేసింది.Source: జాతీయ | 13 Aug 2009 | 8:09 am "అడుగు" సినిమా ట్రైలర్‌ను వీక్షించండిసమరేంద్ర, రీచాసోనీ జంటగా నటించి తెరకెక్కిన చిత్రం "అడుగు". మాధవి ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై బొమ్మకంటి మాధవి ఈ చిత్రాన్ని నిర్మించగా, వీరప్రసాద్ నీలం దర్శకత్వం వహించారు. ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ.. తాను దాసరి, శ్రీనువైట్ల దగ్గర పనిచేశానని, చక్కని సెంటిమెంట్‌తో కూడిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటోందని చెప్పారు.Source: Yahoo! Telugu: Entertainment | 13 Aug 2009 | 7:45 am రేపు స్వైన్ ప్లూ నిర్ధారణ కేంద్రం ప్రారంభం: సీఎంరాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో స్వైన్ ప్లూ నిర్ధారణ పరీక్షా కేంద్రాన్ని ప్రారంభించనున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి తెలిపారు. అదే సమయంలో స్వైన్ ఫ్లూపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవరం లేదని ఆయన విజ్ఞప్తి చేశారు.Source: ఏపీ న్యూస్ | 13 Aug 2009 | 7:43 am "గట్స్" సినిమా ట్రైలర్‌ను చూడండిరాష్ట్రాన్ని గడగడలాడించే ఓ గూండా ప్రేమలో పడితే ఎలా వుంటుందనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘గట్స్’. సత్యప్రకాష్, దినేష్, పాకీహెగ్డే ఇందులో హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇకపోతే.. గోసంగి సుబ్బారావు దర్శకత్వంలో లక్ష్మీదుర్గా ప్రొడక్షన్స్ పతాకంపై సాయిరాం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.Source: వినోదం | 13 Aug 2009 | 7:37 am అలాంటి వాళ్ళంటే "త్రిష"కు భలే చిరాకట..!నీ మనసు నాకు తెలుసు, అతడు, సైనికుడు, ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే, స్టాలిన్, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి హిట్ సినిమాల్లో నటించిన అందాల ముద్దుగుమ్మ త్రిష ఈ మధ్య తెగ వేదాంతం మాట్లాడేస్తోందట. ఇందులో భాగంగానే.. భవిష్యత్ గురించి ఆలోచిస్తూ.. వర్తమానాన్ని వదిలేసే వాళ్ళంటే త్రిషకు భలే చిరాకట. పుకార్లకు ఆమడ దూరంలో ఉండాలనుకుంటూనే ఎప్పుడూ వార్తల్లోకెక్కే ఈ భామ ఇటీవలే శింబుకు చాలా క్లోజ్ అయ్యిందనే వార్తలు ఫిలిమ్ నగర్ వర్గాల్లో షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. హైదరాబాద్‌కు షూటింగ్ కోసం వచ్చిన త్రిషను ఈ సందర్భంగా మెల్లగా కదిలిస్తే.. తానెప్పుడూ షూటింగ్‌లో పలు జాగ్రత్తలు తీసుకుంటానని చెప్పింది. ఎంత అలసిపోయినా.. ముఖంలో దాని తాలూకు ఛాయలు కన్పించకుండా జాగ్రత్తలు తీసుకుంటానని త్రిష వెల్లడించింది. అంతకంటే చాలా ముఖ్యం.. మనసులో లేనిపోని ఆందోళనలు, చికాకులు ఉంచుకోనని త్రిష తేల్చి చెప్పేసింది. అంతేకాదు.. ఎక్కడి విషయాలను అక్కడే వదిలేస్తూ ఉంటే ఏ బెడదా ఉండదని ఈ పొడవుకాళ్ల సుందరి అంటోంది.Source: వినోదం | 13 Aug 2009 | 7:35 am 'శ్రీదేవి' పర్సనల్ టచ్తమిళనాడు రాష్ట్రంలోని శివకాశిలో జన్మించి బాలనటిగా తన నటనా జీవితాన్ని ప్రారంభించి అగ్రహీరోయిన్ స్థాయికి ఎదిగిన అందాల తార శ్రీదేవి. దక్షిణ, ఉత్తరాది భాషల్లో కథానాయికగా ఓ వెలుగు వెలిగిన శ్రీదేవి బంగారక్క (1977) అనే చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. తెలుగులో శ్రీదేవి నటించిన పలు తెలుగు చిత్రాలకు కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. అలాగే టాలీవుడ్ టాప్ హీరో ఎన్.టి. రామారావుతో కొండవీటి సింహం, వేటగాడు, బొబ్బిలి పులి, సర్దార్ పాపానాయుడు వంటి చిత్రాల్లో శ్రీదేవి నటించింది. అదేవిధంగా టాలీవుడ్ మరో టాప్ హీరో అక్కినేని నాగేశ్వరరావుతో ముద్దుల కొడుకు, ప్రేమాభిషేకం, బంగారు కానుక, ప్రేమకానుక వంటి చిత్రాల్లో శ్రీదేవి కథానాయిక పాత్రను పోషించింది. ఇదేవిధంగా సూపర్ స్టార్ కృష్ణతో కలవారి సంసారం, కృష్ణావతారం, బురిపాలెం బుల్లోడు వంటి సినిమాల్లోనూ శ్రీదేవి నటించింది. పలు నంది అవార్డులు, ఫిల్మ్ ఫేర్ అవార్డులను సొంతం చేసుకున్న శ్రీదేవికి నేడే పుట్టినరోజు: ఆగస్టు 13-08-1963. జన్మస్థలం: శివకాశి (తమిళనాడు రాష్ట్రం). ఇంకేముంది? తన అందచందాలతో భారతీయ వెండితెరలో మెరిసిన శ్రీ దేవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు..!Source: వినోదం | 13 Aug 2009 | 7:35 am వన్యప్రాణులకూ తప్పని "కరువు" తిప్పలు...!ప్రకృతి ఒడిలో సేదతీరుతూ అడవుల్లో హాయిగా సంచరిస్తూ.. అడవులకే వన్నె తెస్తున్న వన్యప్రాణులకు సైతం కరువు తిప్పలు తప్పటం లేదు. వర్షాల లేమి మానవులకేకాక, వన్యప్రాణుల మనుగడకు కూడా శాపంగా మారిందనే చెప్పవచ్చు. నీటికోసం పరితపిస్తూ అటవీ సమీప గ్రామాలకు, నీరు లభ్యమయ్యే ప్రాంతాలకు వస్తున్న వన్యప్రాణులు వేటగాళ్ల ఉచ్చుల్లో పడి ప్రాణాలు కోల్పోతున్నాయి.Source: వినోదం | 13 Aug 2009 | 7:03 am కరువు నివారణపై అలసత్వం లేదు: రోశయ్యరాష్ట్రంలో నెలకొన్న కరువు నివారణ చర్యలపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, ఎలాంటి అలసత్వం ప్రదర్శించడం లేదని రాష్ట్ర ఆర్థిక మంత్రి రోశయ్య స్పష్టం చేశారు. బుధవారం సభలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కరువుపై తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి రోశయ్య కల్పించుకుని మాట్లాడారు.Source: ఏపీ న్యూస్ | 13 Aug 2009 | 7:01 am "కరెంట్" సినిమా ట్రైలర్‌ను తిలకించండినాగార్జున మేనల్లుడు, కాళిదాసు ఫేమ్ "సుశాంత్" హీరోగా నటించిన చిత్రం 'కరెంట్'. "ఉల్లాసంగా.. ఉత్సాహంగా" ఫేమ్ స్నేహా ఉల్లాల్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.Source: Yahoo! Telugu: Entertainment | 13 Aug 2009 | 6:27 am భయాందోళనలు సృష్టించవద్దు: ప్రధాని మన్మోహన్స్వైన్ ఫ్లూ వైరస్ పట్ల దేశ ప్రజల్లో భయాందోళనలు సృష్టించ వద్దని ప్రధాని మన్మోహన్ సింగ్ విజ్ఞప్తి చేశారు. ఈ వ్యాధికి అవసరమైన మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పుకొచ్చారు. కాగా, దేశంలో స్వైన్ ఫ్లూ మృతుల సంఖ్య బుధవారం సాయంత్రానికి 21కు చేరుకుంది.Source: జాతీయ | 13 Aug 2009 | 6:19 am హారర్ మూవీ "ఆ ఇంట్లో" ట్రైలర్ మీ కోసం..ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ చిత్రం 'శివ'తో నటునిగా కెరీర్‌ను ప్రారంభించిన "చిన్నా" ఆయన అడుగుజాడల్లోనే దర్శకునిగా మారి 'ఆ ఇంట్లో' అనే చిత్రాన్ని రూపొందించారు. జితేందర్‌రెడ్డి అనే తన ఒరిజినల్ పేరును నిర్మాతల్లో ఒకరిగా వేసుకున్నాడు. మొత్తం ఐదుగురు స్నేహితులు కలిసి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.Source: Yahoo! Telugu: Entertainment | 13 Aug 2009 | 6:10 am కేజీ బేసిన్ వాటా కోసం ప్రజారాజ్యం ధర్నాకేజీ బేసిన్‌లో రాష్ట్ర వాటాను కేటాయించాలన్న ప్రధాన డిమాండ్‌తో ఈనెల 18వ తేదీన ప్రజారాజ్యం పార్టీ ధర్నా నిర్వహించనుంది. ఈ విషయంపై ఆ పార్టీ ప్రతినిధులు వాసిరెడ్డి పద్మ, శ్రావణ్‌లు బుధవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కేజీ బేసిన్ గ్యాస్‌ను జాతీయం చేయాలని తమ పార్టీ డిమాండ్ చేస్తున్నట్టు చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 13 Aug 2009 | 5:11 am హైదరాబాద్‌లో ఎవరూ చనిపోలేదు: ఛాతి ఆస్పత్రిరాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో స్వైన్ ఫ్లూ బారిన పడిన రోగుల్లో ఏ ఒక్కరూ మృతి చెందలేదని ఎర్రగడ్డలోని ఛాతి ఆస్పత్రి వైద్యులు శుభకర్ స్పష్టం చేశారు. ఛాతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగుల్లో ఒకరు బుధవారం మరణించినట్టు టీవీల్లో వార్తలు వచ్చాయి.Source: ఏపీ న్యూస్ | 13 Aug 2009 | 4:56 am సమీరా రెడ్డిని ఎత్తి పడేసిన సెక్యూరిటీ గార్డులుబాలీవుడ్ నటి సమీరారెడ్డి నటిస్తున్న తమిళ చిత్రం షూటింగ్ మలేసియాలోని కౌలా లంపూర్‌లో జరుగుతోంది. ఈ షూటింగ్‌లో పాల్గొన్న సమీరకు ఆ దేశంలో ఓ చేదు అనుభవం ఎదురైందట. మలేసియా ప్రధానమంత్రికి రక్షణగా ఉండే సెక్యూరిటీ గార్డులు సమీరా రెడ్డిని దాదాపు కొట్టినంత పనిచేశారట. వివరాలలోకి వెళితే.. సమీరా రెడ్డి షూటింగ్ ముగించుకుని తన హోటల్ గదికి లిఫ్ట్‌లో వెళుతుండగా పదిమంది సెక్యూరిటీ గార్డులు ఇనుప చైన్లతో ప్రవేశించారట.Source: వినోదం | 13 Aug 2009 | 2:48 am
|