జకార్తా పేలుళ్లు: హోటల్ సిబ్బందికి ప్రమేయం

జకార్తాలో గత నెల 17న రెండు లగ్జరీ హోటళ్లలో జరిగిన బాంబు పేలుళ్లతో ఆ హోటల్‌లో పూల అలంకరణ విభాగంలో పని చేసిన వ్యక్తికి ప్రమేయం ఉందని పోలీసులు భావిస్తున్నారు. హోటల్‌లో ప్లోరిస్ట్‌గా పనిచేస్తున్న ఆండీ సుహాందితో అతని స్నేహితుడు ఇబ్రహీం ముహరం పూలాలంకరణ పని చేశాడు. బాంబు పేలుళ్లు జరిగిన రోజు తరువాత నుంచి ఇబ్రహీం కనిపించకుండా పోయాడు.
Source: Yahoo! Telugu: News | 13 Aug 2009 | 9:58 am

520 పాయింట్లు పుంజుకున్న సెన్సెక్స్

స్టాక మార్కెట్ 520 పాయింట్లు పుంజుకోవడంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 15,540 వద్దకు చేరుకంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 155 పాయింట్లు లాభపడి 4,613 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 3.46 శాతం, నిఫ్టీ 3.48 శాతం మేరకు వృద్ధి చెందాయి.
Source: Yahoo! Telugu: News | 13 Aug 2009 | 9:43 am

తస్లీమా నస్రీన్ వీసా గడువు పొడగించిన కేంద్రం

బంగ్లాదేశ్‌కు చెందిన వివాదాస్పద రచయిత్రి తస్లీమా నస్రీన్‌ వీసా గడువును కేంద్రం పొడగించింది. ఆ ప్రకారంగా నస్రీన్ వీసా గుడువు వచ్చే యేడాది ఫిబ్రవరి 16వ తేదీ వరకు పొడగించినట్టు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు.
Source: Yahoo! Telugu: News | 13 Aug 2009 | 9:29 am

లాభాలతో కళకళలాడుతున్న స్టాక్ మార్కెట్

స్టాక్ మార్కెట్ ప్రస్తుతం లాభాలతో మరింతగా దూసుకెళుతుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 454 పాయింట్లు పుంజుకుని 15,474 పాయింట్లు వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 132 పాయింట్లు లాభపడి 4,589 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 3.02 శాతం, నిఫ్టీ 2.96 శాతం మేరకు పుంజుకున్నాయి.
Source: Yahoo! Telugu: News | 13 Aug 2009 | 8:57 am

మారుతి ఏ-స్టార్ లక్షవ కారు విడుదల

దేశీయ కార్ల నిర్మాణ రంగంలో అగ్రగామిగానున్న మారుతి కార్ల కంపెనీ తన ఏ-స్టార్ మోడల్‌కు చెందిన లక్షవ కారును మారుతీ సుజుకీ ఇండియా మార్కెట్లోకి విడుదల చేసింది.
Source: Yahoo! Telugu: News | 13 Aug 2009 | 8:56 am

సమీరా రెడ్డిని ఎత్తి పడేసిన సెక్యూరిటీ గార్డులు

బాలీవుడ్ నటి సమీరారెడ్డి నటిస్తున్న తమిళ చిత్రం షూటింగ్ మలేసియాలోని కౌలా లంపూర్‌లో జరుగుతోంది. ఈ షూటింగ్‌లో పాల్గొన్న సమీరకు ఆ దేశంలో ఓ చేదు అనుభవం ఎదురైందట. మలేసియా ప్రధానమంత్రికి రక్షణగా ఉండే సెక్యూరిటీ గార్డులు సమీరా రెడ్డిని దాదాపు కొట్టినంత పనిచేశారట. వివరాలలోకి వెళితే.. సమీరా రెడ్డి షూటింగ్ ముగించుకుని తన హోటల్ గదికి లిఫ్ట్‌లో వెళుతుండగా పదిమంది సెక్యూరిటీ గార్డులు ఇనుప చైన్లతో ప్రవేశించారట. వారు ప్రయాణిస్తున్న లిఫ్ట్ లాబీ ఫ్లోర్‌లోకి ప్రవేశిస్తుండగా ఓ సెక్యూరిటీ గార్డు సమీర చేయిని గట్టిగా పట్టుకున్నాడట. ఈ హఠత్పరిమాణానికి బెదిరిపోయిన సమీర అతడి చేయిని గట్టిగా విదిలించుకుని తిట్ల దండకం అందుకున్నదట. దీంతో రెచ్చిపోయిన సెక్యూరిటీ గార్డులు మలయ్ భాషలో పెద్ద పెద్దగా అరిచి ఆమెను అమాంతం పైకెత్తి లిఫ్ట్‌ నుంచి బయటకు విసిరి పడేశారట. దీంతో కోపోద్రిక్తురాలైన సమీర హోటల్ యాజమాన్యంపై తోక తొక్కిని పాములా బుసలు కొట్టిందట.
Source: Yahoo! Telugu: Entertainment | 13 Aug 2009 | 8:12 am

జంప్ జిలానీలు: వెర్రి వెంగళప్పలుగా అనుచరులు

రాష్ట్ర రాజకీయాల్లో జంప్ జిలానీల శంక నడుస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి ప్రకటించిన 'ఆపరేషన్ ఆకర్ష్'.. ప్రతిపక్ష నేత ఎన్.చంద్రబాబు నాయుడు ఇచ్చిన 'ఆపరేషన్ స్వగృహ్' పిలుపుల పుణ్యమాని నేతల జంపింగ్స్ జోరుగా సాగుతోంది.
Source: Yahoo! Telugu: News | 13 Aug 2009 | 8:01 am

లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్

స్టాక్ మార్కెట్ ప్రస్తుతం లాభాల్లో కొనసాగుతుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 319 పాయింట్లు పుంజుకుని 15,339 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 94 పాయింట్లు లాభపడి 4,551 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 2.12 శాతం, నిఫ్టీ 2.10 శాతం మేరకు వృద్ధి చెందాయి.
Source: Yahoo! Telugu: News | 13 Aug 2009 | 7:55 am

"అడుగు" సినిమా ట్రైలర్‌ను వీక్షించండి

సమరేంద్ర, రీచాసోనీ జంటగా నటించి తెరకెక్కిన చిత్రం "అడుగు". మాధవి ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై బొమ్మకంటి మాధవి ఈ చిత్రాన్ని నిర్మించగా, వీరప్రసాద్ నీలం దర్శకత్వం వహించారు. ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ.. తాను దాసరి, శ్రీనువైట్ల దగ్గర పనిచేశానని, చక్కని సెంటిమెంట్‌తో కూడిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటోందని చెప్పారు.
Source: Yahoo! Telugu: Entertainment | 13 Aug 2009 | 7:45 am

ప్యాకేజీతో నిలిచిన లక్షల ఉద్యోగాలు

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థికమాంద్యం కారణంగా పలు దేశాలలో ఉద్యోగులు, కార్మికులు వీధినపడ్డారు. కాని బ్రిటన్ ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీని ప్రకటించడంతో దాదాపు ఐదు లక్షల మంది ఉద్యోగులు కాపాడబడ్డారు.
Source: Yahoo! Telugu: News | 13 Aug 2009 | 7:13 am

దేవేందర్‌ను దగ్గరకు చేరదీయడం తప్పే: చిరు

మరికొన్ని రోజుల్లో తొలి ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోనున్న ప్రజారాజ్యం పార్టీ... ఈ మధ్య కాలంలో చేసిన తప్పులను గుర్తుకు నెమరువేసుకోంటోంది. ముఖ్యంగా పార్టీ అధినేత చిరంజీవికి చేసిన తప్పులు ఒక్కొక్కటిగా గుర్తుకు వస్తున్నట్టు ఉన్నాయి.
Source: Yahoo! Telugu: News | 13 Aug 2009 | 7:12 am

అమెరికా, ఆసియా స్టాక్ మార్కెట్లు

అమెరికా స్టాక్ మార్కెట్లు... డౌ జోన్స్ ఇండస్ట్రియల్ ఇండెక్స్ - 1.30 శాతంతో 120.16 పాయింట్లు లాభపడి 9,361.61 వద్దకు చేరుకుంది. స్టాండార్డ్ అండు పూర్ 500 ఇండెక్స్ - 1.15 శాతంతో 11.46 పాయింట్లు పుంజుకుని 1,005.81 వద్దకు చేరుకుంది. నాస్‌డాక్ కంపోజిట్ ఇండెక్స్ - 1.47 శాతంతో 28.99 పాయింట్లు బలపడి 1,998.72 వద్దకు చేరుకుంది. ఆసియా మార్కెట్లు.. అంతర్జాతీయ మార్కెట్లు, ఫెడ్ సమావేశం వెరసి ఆసియా మార్కెట్లపై ప్రభావం చూపాయి. దీంతో ప్రస్తుతం ఆసియా మార్కెట్ల లాభాల బాటలో నడుస్తున్నాయి. హాంగ్ సెంగ్ - 2 శాతంతో 400 పాయింట్లు బలపడి 20,836 వద్దకు చేరుకుంది. నిక్కీ - 103 పాయింట్లు పెరిగి 10,538 వద్దకు చేరుకుంది. షాంఘై - స్థిరంగా 3,113 వద్ద పయనిస్తోంది. సియోల్ కంపోజిట్ - స్వల్పంగా పెరిగి 1,579 వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 13 Aug 2009 | 7:12 am

"కరెంట్" సినిమా ట్రైలర్‌ను తిలకించండి

నాగార్జున మేనల్లుడు, కాళిదాసు ఫేమ్ "సుశాంత్‌" హీరోగా నటించిన చిత్రం 'కరెంట్‌'. "ఉల్లాసంగా.. ఉత్సాహంగా" ఫేమ్ స్నేహా ఉల్లాల్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 13 Aug 2009 | 6:27 am

హారర్ మూవీ "ఆ ఇంట్లో" ట్రైలర్ మీ కోసం..

ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ చిత్రం 'శివ'తో నటునిగా కెరీర్‌ను ప్రారంభించిన "చిన్నా" ఆయన అడుగుజాడల్లోనే దర్శకునిగా మారి 'ఆ ఇంట్లో' అనే చిత్రాన్ని రూపొందించారు. జితేందర్‌రెడ్డి అనే తన ఒరిజినల్‌ పేరును నిర్మాతల్లో ఒకరిగా వేసుకున్నాడు. మొత్తం ఐదుగురు స్నేహితులు కలిసి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 13 Aug 2009 | 6:10 am

14న ప్రేక్షకుల ముందుకు వస్తోన్న 'ద్రోహి'

తమిళంలో ఘనవిజయం సాధించిన చిత్రాలు తెలుగులోకి అనువదించడం మామూలే. ఆ కోవలోనే 'పచైకిలి ముత్తుచ్చెరం' చిత్రాన్ని ఎస్‌.వి.ఆర్‌. పతాకంపై నిర్మాతలు రమణ, నీరజ్‌లు "ద్రోహి" పేరుతో తెలుగులోకి అనువదించారు. ఈ చిత్రంలో శరత్‌కుమార్‌, జ్యోతిక ప్రధాన పాత్రలు పోషించారు. గతంలో శరత్‌కుమార్‌ నటించిన మండేసూర్యుడు, దండయాత్ర, మరో యుద్ధకాండ చిత్రాలు అఖండ విజయం సాధించాయి. భార్యాభర్తల మధ్య ఉండే సంబంధాలు, అనురాగాలను ఈ చిత్రం ద్వారా దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారని నిర్మాతల్లో ఒకరైన నీరజ్ చెప్పారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ సినిమాను ఈ నెల 14న (శుక్రవారం) విడుదల చేయనున్నట్లు మరో నిర్మాత రమణ తెలిపారు.
Source: Yahoo! Telugu: Entertainment | 13 Aug 2009 | 4:45 am

'రాజా'తో "సొంత ఊరు" నిర్మాత మరో చిత్రం!

రాజాతో 'సొంతఊరు' చిత్రాన్ని నిర్మించిన సునీల్‌కుమార్‌ రెడ్డి స్వీయదర్శకత్వంలో మరో చిత్రాన్ని తీసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. శ్రావ్య ఫిలింస్‌ పతాకంపై రూపొందనున్న ఈ చిత్రంలో రిచా హీరోయిన్‌గా నటిస్తుందని ఆయన తెలియజేశారు. "సొంత ఊరు" అనేది రాజాను దృష్టిలో పెట్టుకుని చేశామని, ఆ సినిమా షూటింగ్‌లో రాజా చెప్పిన ఓ పాయింట్‌‌ను ఆధారంగా కథను తయారుచేశానని నిర్మాత సునీల్‌కుమార్ రెడ్డి తెలిపారు.
Source: Yahoo! Telugu: Entertainment | 13 Aug 2009 | 4:40 am

ప్లాస్టిక్ సర్జరీకి నో చెప్పిన జెన్నీఫర్ లోపెజ్

ఇటీవల 40 ఏళ్ల మార్కు దాటిన పాప్ గాయని జెన్నీఫర్ లోపెజ్ యవ్వనాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నించడం లేదని తెలుస్తోంది. సాధారణంగా పాప్ గాయినీగాయకులు, హాలీవుడ్ హీరోయిన్లు, హీరోలు, ఇతర సెలెబ్రిటీలు తమ రూపం మారకుండా, నిత్య యవ్వనం తొణికిసలాడేందుకు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటారనే విషయం అందరికీ తెలిసిందే.అయితే జెన్నీఫర్ లోపెజ్ కొంచెం వింతగా ప్రవర్తిస్తోంది. తన రూపం మారకుండా ఉండేందుకు ప్లాస్టిక్ సర్జరీని ఆశ్రయించనని లోపెజ్ స్పష్టం చేసింది. ఇప్పుడే కాదు.. ఇకపై కూడా తాను ప్లాస్టిక్ సర్జరీ జోలికి వెళ్లనని తేల్చిచెప్పింది.
Source: Yahoo! Telugu: Entertainment | 13 Aug 2009 | 4:34 am

వాల్ స్ట్రీట్ సీక్వెల్‌లో ఫ్రాంక్ లాంజెల్లా

వివాదాస్పద అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ ఎం నిక్సాన్ పాత్రలో నటించి మెప్పించిన ఫ్రాంక్ లాంజెల్లా ఇప్పుడు వాల్ స్ట్రీట్ సీక్వెల్‌లో నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. "ఫ్రోస్ట్ నిక్సాన్"కు ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు కూడా లభించిన సంగతి తెలిసిందే.ఇప్పుడు ఫ్రాంక్ లాంజెల్లా "వాల్ స్ట్రీట్- 2: మనీ నెవర్ స్లీప్స్" చిత్రంలో నటించబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. వాల్ స్ట్రీట్ సీక్వెల్‌లో లెవీస్ జబెల్ పాత్రను ప్రాంక్ లాంజెల్లా (71) చేత చేయించాలని నిర్మాతలు కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. వాల్ స్ట్రీట్- 2లో బాగా అనుభవజ్ఞుడైన స్టాక్ బ్రోకర్ పాత్ర పేరే లెవీస్ జబెల్.
Source: Yahoo! Telugu: Entertainment | 13 Aug 2009 | 4:32 am

తస్లీమా నస్రీన్ వీసా గడువు పొడగించిన కేంద్రం

బంగ్లాదేశ్‌కు చెందిన వివాదాస్పద రచయిత్రి తస్లీమా నస్రీన్‌ వీసా గడువును కేంద్రం పొడగించింది. ఆ ప్రకారంగా నస్రీన్ వీసా గుడువు వచ్చే యేడాది ఫిబ్రవరి 16వ తేదీ వరకు పొడగించినట్టు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు.
Source: జాతీయ | 13 Aug 2009 | 4:00 am

దేవేందర్‌ను దగ్గరకు చేరదీయడం తప్పే: చిరు

మరికొన్ని రోజుల్లో తొలి ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోనున్న ప్రజారాజ్యం పార్టీ... ఈ మధ్య కాలంలో చేసిన తప్పులను గుర్తుకు నెమరువేసుకోంటోంది. ముఖ్యంగా పార్టీ అధినేత చిరంజీవికి చేసిన తప్పులు ఒక్కొక్కటిగా గుర్తుకు వస్తున్నట్టు ఉన్నాయి.
Source: ఏపీ న్యూస్ | 13 Aug 2009 | 1:48 am

పార్టీకి పట్టిన శని వదిలిపోయింది: వాసిరెడ్డి

ప్రజారాజ్యం పార్టీకి తమ్మినేని సీతారాం రాజీనామా చేయడం వల్ల పార్టీకి పట్టిన శని పోయిందని ప్రరాపా అధికార ప్రతినిధులు ఆరోపించారు. ప్రరాపాకు రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్టు తమ్మినేని సీతారాం బుధవారం ప్రకటించారు.
Source: ఏపీ న్యూస్ | 13 Aug 2009 | 1:23 am

స్వైన్ ఫ్లూ మృతులు 19: భాగ్యనగరిలో తొలికేసు

దేశంలో స్వైన్ ఫ్లూ వైరస్ మహమ్మారికి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 19కు చేరింది. మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని ఛాతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఒక రోగి ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ విషయాన్ని ఆస్పత్రి ఉన్నతస్థాయి వర్గాలు మాత్రం ధృవీకరించలేదు.
Source: జాతీయ | 13 Aug 2009 | 1:07 am

ఆ అర్హత 16 థియేటర్లకే ఉంది: మంత్రి గీతారెడ్డి

రాష్ట్ర వ్యాప్తంగా 2158 థియేటర్లు ఉన్నప్పటికీ.. పూర్తిస్థాయి భద్రతా చర్యలు ఉన్న థియేటర్లు కేవలం 16 మాత్రమే ఉన్నాయని రాష్ట్ర సమాచార, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి డాక్టర్ గీతారెడ్డి అన్నారు. ఈ థియేటర్లకు మాత్రమే ప్రభుత్వం లైసెన్సు మంజూరు చేసే పరిస్థితి ఉందన్నారు.
Source: ఏపీ న్యూస్ | 13 Aug 2009 | 12:51 am

మరో ఏడాదిలో మహిళా బిల్లు: మంత్రి చిదంబరం

చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే మహిళా బిల్లుకు మరో ఏడాదిలో మోక్షం కల్పిస్తామని కేంద్ర హోంమంత్రి పి.చిదంబరం తెలిపారు. అయితే, ఈ బిల్లుపై అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయ సేకరణ జరిపి ఒక నిర్ణయానికి వస్తామని ఆయన తెలిపారు.
Source: జాతీయ | 13 Aug 2009 | 12:27 am

వైజాగ్‌లో ఆరుగురికి స్వైన్ ఫ్లూ

విశాఖపట్నంలో ఆరుగురికి స్వైన్ ఫ్లూ లక్షణాలు ఉన్నట్టు నిర్థారణ అయింది. నైజీరియా నుంచి వైజాగ్ వచ్చిన ఇద్దరు దంపతులతో సహా నలుగురిలో ఈ లక్షణాలు ఉన్నట్టు డాక్టర్లు ధృవీకరించారు. ఈ ఆరుగురు ప్రయాణికులకు సంబంధించి రక్తం, సంబంధిత ఇతర నమూనాలను పరీక్షల నిమిత్తం ఢిల్లీకి పంపినట్టు చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 13 Aug 2009 | 12:22 am

తెలంగాణా రాష్ట్ర ద్రోహి రాములమ్మ: తెరాస

ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ద్రోహులతో చేతులు కలిపిన తమ పార్టీ మహిళా, మెదక్ ఎంపీ విజయశాంతి కూడా ద్రోహిలాంటిదేనని తెలంగాణా రాష్ట్ర సమితి ఆరోపించింది. అందువల్ల ఆమె తక్షణం ఎంపీ పదవికి రాజీనామా చేయాలని తెరాస డిమాండ్ చేసింది.
Source: ఏపీ న్యూస్ | 13 Aug 2009 | 12:06 am

రాష్ట్రంలో రైతుల తిరుగుబాటు తప్పదేమో: బాబు

రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల నెలకొన్నప్పటికీ.. ప్రభుత్వం మాత్రం కఠిన నిబంధనలను పాటిస్తోందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో తమను తాము కాపాడుకునేందుకు రైతులు తిరుగుబాటు చేయకతప్పదేమో అని ఆయన సందేహం వ్యక్తం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 13 Aug 2009 | 12:03 am

ఖైదీల క్షమాభిక్షకు అభ్యంతరం లేదు: సుప్రీం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించడాన్ని సుప్రీంకోర్టు అభ్యంతరం చెప్పలేదు. ఖైదీల విడుదలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన 338 జీవోను నిలిపేయాలని గల్లా సతీష్ అనే న్యాయవాది చేసిన విజ్ఞప్తిని సర్వోన్నత న్యాయస్థానం బుధవారం తిరస్కరించింది.
Source: జాతీయ | 12 Aug 2009 | 9:33 pm

చైనాతో సంబంధాలు మరింత పటిష్టం: భారత్

ప్రస్తుతం చైనా దేశంతో సరిహద్దు సమస్య కొనసాగుతున్నా, సానుకూలమైన వాతావరణంలోనే ఆ దేశంతో సంబంధాలు పటిష్టం చేసుకోవాలనుకుంటున్నట్లు భారత్‌ వెల్లడించింది.
Source: జాతీయ | 12 Aug 2009 | 9:04 pm

రవితేజ, నయనల "ఆంజనేయులు" ట్రైలర్ మీకోసం..

క్రేజీస్టార్ రవితేజ, అందాలతార నయనతార జంటగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ చిత్రం "ఆంజనేయులు". పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై నటుడు గణేష్ బాబు నిర్మించిన ఈ చిత్రం నేడు (ఆగస్టు 12న) విడుదలై మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా నిర్మాత గణేష్ బాబు మాట్లాడుతూ... "రవితేజ కెరీర్‌లో మరో బిగ్గెస్ట్ చిత్రంగా "ఆంజనేయులు" సంచలనం క్రియేట్ చేస్తోందని అన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 12 Aug 2009 | 12:29 pm

మాస్.. మాస్... "ఆంజనేయులు"

రవితేజ చిత్రాలంటేనే ఎనర్జిటిక్‌గా ఎంటర్‌టైన్‌మెంట్‌‌గా సాగుతూ వెటకారపు మాటల్తో ప్రేక్షకుల్ని మైమరిపిస్తాడు. అదే కోవలోనే ఆంజనేయులు ప్రయత్నించాడు. కిక్‌ సినిమా తర్వాత వెంటనే అదే తరహాలో చేసిన ఆంజనేయులులో రవితేజ నటన రొటీన్‌గానే ఉన్నా తల్లిదండ్రుల సెంటిమెంట్‌ను తగిలించాడు. బహుశా ఈ చిత్రంలోనే తొలిసారిగా రవితేజ ఏడ్చిన సన్నివేశాలున్నాయోమో. ఇది పూర్తిగా హీరోబేస్డ్‌ సినిమా. ప్రతి చిత్రంలోనూ అల్లరిగా ఆటపట్టించే వ్యక్తిత్వంగల రవితేజ క్యారెక్టర్‌ ఆంజనేయుల్లోనూ ఉంటుంది. ఆంజనేయులు (రవితేజ) హెచ్‌.ఎం.టీవీ ఛానల్‌లో రిపోర్టర్‌. కెమెరామెన్‌గా బ్రహ్మాజీ. క్రియేటివ్‌ హెడ్‌ బ్రహ్మానందం. మొబైల్‌ కంపెనీలో అంజలి (నయనతార) పనిచేస్తుంది. ఓ సందర్భంలో పరిచయమై మొదటిచూపులోనే ఆమె ప్రేమలో పడతాడు ఆంజనేయులు.
Source: Yahoo! Telugu: Entertainment | 12 Aug 2009 | 12:13 pm

17కి చేరిన స్వైన్ ఫ్లూ మృతుల సంఖ్య

దేశంలో స్వైన్ ఫ్లూ మహమ్మారి పంజా విసిరింది. కేవం ఒక్క రోజు వ్యవధిలోనే స్వైన్ ఫ్లూ మృతుల సంఖ్య ఎనిమిది నుంచి 17కి పెరిగింది.
Source: జాతీయ | 12 Aug 2009 | 10:21 am

పోలీసులు అదుపులో శ్రీలంక తమిళులు...!

శ్రీలంక తమిళులతో కూడిన ఓ బోటును బుధవారంనాడు తూర్పు నావికాదళం కోస్ట్‌గార్డు సిబ్బంది పట్టుకున్నారు. కోస్ట్‌గార్డ్ సిబ్బంది పట్టుకున్న బోటులో ఐదుగురు శ్రీలంకకు చెందిన తమిళ యువకులు ఉన్నారు.
Source: ఏపీ న్యూస్ | 12 Aug 2009 | 10:02 am

కఠిన చర్యలు తీసుకోవాల్సిందే: శశి థరూర్

దేశ వాణిజ్య రాజధాని ముంబైపై జరిగిన దాడికి ప్రధాన సూత్రధారులైన లష్కర్ ఇ తోయిబా తీవ్రవాద సంస్థ చీఫ్ హఫీజ్ సయీద్‌పై పాకిస్థాన్ కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి శశి థరూర్ గట్టిగా డిమాండ్ చేశారు.
Source: జాతీయ | 12 Aug 2009 | 7:06 am

ప్రజారాజ్యం పార్టీకి తమ్మినేని సీతారాం గుడ్‌బై

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన 'ఆపరేషన్ స్వగృహ్' పిలుపు బాగానే పని చేస్తోంది. గత ఎన్నికల్లో తెదేపాకు గుడ్‌బై చెప్పి ప్రజారాజ్యం పార్టీలో చేరిన పలువురు నేతలు ఒక్కొక్కరుగా తిరిగి సొంత గూటికి చేరుకుంటున్నారు.
Source: ఏపీ న్యూస్ | 12 Aug 2009 | 6:41 am

ఉత్తర భారతంలో అలుముకోనున్న చీకట్లు!

రానున్న 24 గంటల్లో ఉత్తర భారతదేశంలో చీకటి ఆవరించనుంది. ఉత్తర భారత దేశంలో విద్యుత్‌ను సరఫరా చేసే సప్లై ఛానల్ నార్తన్ గ్రిడ్ ఫెయిల్ అయ్యే అవకాశాలున్నాయని నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Source: జాతీయ | 12 Aug 2009 | 6:22 am

సెప్టెంబరు 10న టెక్కలి ఉప ఎన్నిక

శ్రీకాకుళం జిల్లా టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గానికి సెప్టెంబరు 10వ తేదీన ఉప ఎన్నిక జరుగనుంది. ఈ మేరకు రాష్ట్ర ఉప ఎన్నికల కమిషన్ బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన రేవతీపతి గుండెపోటు కారణంగా మృతి చెందిన విషయం తెల్సిందే.
Source: ఏపీ న్యూస్ | 12 Aug 2009 | 6:11 am

ఎర్రబెల్లిపై సస్పెన్షన్ ఏకపక్షం: చిరంజీవి

తెలుగుదేశం పార్టీ సభ్యుడు ఎర్రబెల్లి దయాకర్ రావును శాసనసభ నుంచి రెండు రోజుల పాటు సస్పెండ్ చేయడం ఏకపక్ష నిర్ణయంగా ఉందని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి అభిప్రాయపడ్డారు. శాసనసభలో బుధవారం జరిగిన పరిణామాలపై చిరు మాట్లాడారు.
Source: ఏపీ న్యూస్ | 12 Aug 2009 | 5:20 am

'మహా' అసెంబ్లీలో కాంగ్రెస్-ఎన్సీపీ పొత్తు: దిగ్విజయ్

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు కేంద్ర మంత్రి శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీతో ముందస్తు ఎన్నికల పొత్తును కాంగ్రెస్ పెట్టుకుంటుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ వెల్లడించారు.
Source: జాతీయ | 12 Aug 2009 | 4:45 am

బ్రిజ్ బిహారీ హత్య కేసు: మాజీ ఎంపీకి జైలుశిక్ష

బ్రిజ్ బిహారీ హత్య కేసులో పాట్నా సెషన్స్ కోర్టు బుధవారం సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న మాజీ మంత్రి, సూరజ్‌భాన్ సింగ్‌‌ను దోషిగా తేల్చి, జీవిత కారాగార శిక్ష విధించింది.
Source: జాతీయ | 12 Aug 2009 | 4:08 am