|
బ్రిజ్ బిహారీ హత్య కేసు: మాజీ ఎంపీకి జైలుశిక్షబ్రిజ్ బిహారీ హత్య కేసులో పాట్నా సెషన్స్ కోర్టు బుధవారం సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న మాజీ మంత్రి, సూరజ్‌భాన్ సింగ్‌ను దోషిగా తేల్చి, జీవిత కారాగార శిక్ష విధించింది.Source: Yahoo! Telugu: News | 12 Aug 2009 | 9:37 am నష్టాల్లోనే పయనిస్తున్న సెన్సెక్స్స్టాక్ మార్కెట్ ప్రస్తుతం నష్టాల్లో పయనిస్తుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 79 పాయింట్లు కోల్పోయి 14,996 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 20 పాయింట్లు నష్టపోయి 4,452 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.52 శాతం, నిఫ్టీ 0.44 శాతం మేరకు క్షీణించాయి.Source: Yahoo! Telugu: News | 12 Aug 2009 | 9:29 am స్వైన్ ఫ్లూ మరణాలు 1462: డబ్ల్యూహెచ్ఓప్రపంచవ్యాప్తంగా స్వైన్ ఫ్లూ బారినపడి మృతి చెందినవారి సంఖ్య 1462కి చేరుకుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తెలిపింది. భూమిపై దక్షిణార్ధగోళంలో ఉన్న దేశాల్లో స్వైన్ ఫ్లూ తీవ్రత తగ్గుముఖం పడుతోందని, అయితే భారత్‌తోపాటు, ఆసియా ఖండంలోని అనేక దేశాల్లో వ్యాధి తీవ్రరూపం దాలుస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.Source: Yahoo! Telugu: News | 12 Aug 2009 | 9:27 am 174 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్స్టాక్ మార్కెట్ 174 పాయింట్ల నష్టంతో పయనించడంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 14,901 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 54 పాయింట్లు కోల్పోయి 4,417 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 1.15 శాతం, నిఫ్టీ 1.21 శాతం మేరకు క్షీణించాయిSource: Yahoo! Telugu: News | 12 Aug 2009 | 8:51 am నష్టాల్లో పయనిస్తున్న సెన్సెక్స్స్టాక్ మార్కెట్ ప్రస్తుతం నష్టాల్లో పయనిస్తుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 249 పాయింట్లు నష్టపోయి 14,825 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 81 పాయింట్లు నష్టపోయి 4,390 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 1.78 శాతం, నిఫ్టీ 1.82 శాతం మేరకు క్షీణించాయి.Source: Yahoo! Telugu: News | 12 Aug 2009 | 8:12 am హెచ్1ఎన్1పై ఆందోళన వద్దు: నిపుణులుప్రపంచాన్ని వణికిస్తున్న హెచ్1ఎన్1 వైరస్‌పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు అంటున్నారు. ఈ వైరస్ సోకిన రోగుల్లో ఇప్పటికే 55 శాతం మందికి వ్యాధిని నయం చేసినట్టు వారు పేర్కొంటున్నారు.Source: Yahoo! Telugu: News | 12 Aug 2009 | 8:01 am మెహసూద్ బతికే ఉంటే నిరూపించండి: పాక్తాలిబాన్ చీఫ్ బైతుల్లా మెహసూద్ బతికే ఉన్నాడని ఆ తీవ్రవాద సంస్థ చేస్తున్న ప్రకటనలను పాకిస్థాన్ ప్రభుత్వం తోసిపుచ్చింది. తెహ్రీక్ ఎ తాలిబాన్ పాకిస్థాన్ తీవ్రవాద గ్రూపు అధిపతి బైతుల్లా మెహసూద్ గత బుధవారం అమెరికా డ్రోన్ (మానవరహిత యుద్ధ విమానం) జరిపిన క్షిపణి దాడిలో మృతి చెందాడని పాక్ అధికారిక వర్గాలు ధృవీకరించిన సంగతి తెలిసిందే.Source: Yahoo! Telugu: News | 12 Aug 2009 | 7:56 am ఎఫ్ఐఏ వెబ్‌సైట్ ప్రారంభించిన ఐఓఏభారత్లో ఫెన్సింగ్ క్రీడను వృద్ధి చేసేందు కోసం భారత ఫెన్సింగ్ అసోసియేషన్ (ఎఫ్ఐఏ).. ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఫెన్సింగ్‌కు సంబంధించిన చరిత్రతో పాటు ఈ క్రీడకు చెందిన అన్ని రకాల సమాచారాన్ని ఈ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. అలాగే భారత ఆటగాళ్ల ప్రొఫైళ్లు తదితర విషయాలు కూడా ఉంటాయి.Source: Yahoo! Telugu: News | 12 Aug 2009 | 7:32 am రుణాలిచ్చే కంపెనీలతో జాగ్రత్తగా ఉండండి: ఆర్బీఐరుణాలిస్తాం అని ముందుకు వచ్చే పలు కంపెనీలతో దేశ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ సూచిస్తోంది. పలు కంపెనీలు ప్రజలనుంచి ప్రోసెసింగ్ ఫీజును వసూలు చేసి చేతులెత్తేసిన సంఘటనలు తమ దృష్టికి వచ్చిందని ఆర్‌బీఐ తెలిపింది.Source: Yahoo! Telugu: News | 12 Aug 2009 | 7:25 am "మగధీర"పై ఎందుకింత కక్ష!?ఆది నుంచి 'మగధీర' చిత్రం వివాదాస్పదమవుతూ వచ్చింది. ఇది కావాలనే చేస్తున్నారో.. పరిస్థితులు అలా జరుగుతున్నాయో ఎవరికీ అంతుచిక్కడం లేదు. అసలు ఈ చిత్రంపై ప్రతి ఒక్కరికీ ఎందుకింత కక్ష? ఇదే అంశంపై లోతుగా విశ్లేషిస్తే.. ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తున్నాయి.Source: Yahoo! Telugu: News | 12 Aug 2009 | 7:22 am "రామ్‌దేవ్" నిర్మాత జిమ్మిక్కులు ఫలించేనా?అబ్బాస్, గ్రేసీ సింగ్ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న"రామ్‌దేవ్" చిత్రాన్ని వ్యాపారపరంగా వసూలు చేయడానికి నిర్మాత బషీద్ రకరకాలుగా జిమ్మిక్కులు చేస్తున్నారు. ఈ చిత్రానికి ఆయనే దర్శకుడు కావడం విశేషం. గతంలో రాజశేఖర్ హీరోగా నటించిన "ఎవడైతే నాకేంటి" చిత్రానికి కూడా బషీద్ నిర్మాణ సారథ్యం వహించారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే బషీద్‌పై జూబ్లీహిల్స్‌లో లాండ్ మాఫియా, బెదిరింపులు కేసులు నమోదయ్యాయి. తాజాగా రామ్‌దేవ్ చిత్రాన్ని బిజినెస్ చేయడానికి హీరోయిన్లు, హీరోలు కలిసి ఉన్న సన్నివేశాలను మార్ఫింగ్ చేస్తూ ఫోటోలు రిలీజ్ చేశారు. ఈ విషయం తెలిసిన డిస్ట్రిబ్యూటర్లు ఆయన్ను వ్యతిరేకించారు. అంతేకాదు.. సినిమా రేటును కూడా రామ్‌దేవ్ నిర్మాత డిస్ట్రిబ్యూషన్ కోసం తగ్గించినట్లు సమాచారం.Source: Yahoo! Telugu: Entertainment | 12 Aug 2009 | 6:06 am ఆగస్టు 15న తెరపైకి వస్తోన్న "లైఫ్‌స్టైల్"ముప్పలనేని శివ దర్శకత్వంలో కోగంటి రామకృష్ణ, మాధవ్ పట్నాయక్ నిర్మించిన చిత్రం ' లైఫ్‌స్టైల్'. నిశ్చల్, కార్తీక్, అనన్య, మీనాక్షి దీక్షిత్ తదితరులు నటించిన ఈ చిత్రం ఈనెల 15న విడుదల కానుందని దర్శకుడు ముప్పలనేని శివ తెలియజేశారు. మంగళవారం రాత్రి సంస్థ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో శివ మాట్లాడుతూ, తాను గతంలో నిర్మించిన తాజ్‌మహల్, అమ్మాయికోసం వంటి చిత్రాల తరహాలో ఈ చిత్రముంటుందని చెప్పారు.Source: Yahoo! Telugu: Entertainment | 12 Aug 2009 | 5:57 am "కాస్కో" అంటోన్న వైభవ్, శ్వేతబసు ప్రసాద్'గొడవ' ఫేమ్ హీరో కోదండరామిరెడ్డి తనయుడు వైభవ్ తాజాగా నటిస్తోన్న చిత్రానికి 'కాస్కో' అనే పేరును ఖరారు చేశారు. కె.ఫిలింస్ పతాకంపై జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఎ. భారతి నిర్మిస్తున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 12 Aug 2009 | 5:17 am బ్రిజ్ బిహారీ హత్య కేసు: మాజీ ఎంపీకి జైలుశిక్షబ్రిజ్ బిహారీ హత్య కేసులో పాట్నా సెషన్స్ కోర్టు బుధవారం సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న మాజీ మంత్రి, సూరజ్‌భాన్ సింగ్‌ను దోషిగా తేల్చి, జీవిత కారాగార శిక్ష విధించింది.Source: జాతీయ | 12 Aug 2009 | 4:08 am హెచ్1ఎన్1పై ఆందోళన వద్దు: నిపుణులుప్రపంచాన్ని వణికిస్తున్న హెచ్1ఎన్1 వైరస్‌పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు అంటున్నారు. ఈ వైరస్ సోకిన రోగుల్లో ఇప్పటికే 55 శాతం మందికి వ్యాధిని నయం చేసినట్టు వారు పేర్కొంటున్నారు.Source: జాతీయ | 12 Aug 2009 | 2:31 am "తెలుగుతల్లి" ఫ్లైఓవర్‌ను ఎందుకు మూసేశారు?రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ట్రాఫిక్ నియంత్రణకు ఏర్పాటుచేసిన ఫ్లై ఓవర్‌పై పెద్ద చర్చ జరుగుతోంది. "తెలుగుతల్లి" ఫ్లై ఓవర్ అనేది సెక్రటేరియట్‌కు సమీపంలో... ఇందిరాపార్క్‌నుంచి లకడీకాపూల్‌కు వెళ్ళే మార్గంలో ప్రయాణీకులకు సౌలభ్యంగా ఉండేది. కానీ హఠాత్తుగా గత రెండు రోజులుగా దాన్ని మూసేశారు. మంగళవారం మధ్యాహ్నం ట్రాఫిక్ ఎక్కువగా ఉండడంలో కొందరు అక్కడి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేయగా... పోలీసు అధికారులు తమకేమీ తెలియదనీ... ప్రభుత్వం ఏం చేయమంటే? తాము అది చేస్తామనీ..? బ్రిడ్జిపై ఎటువంటి మరమ్మత్తులు చేయడంలేదని తేల్చిచెప్పారు. సో... ఇదంతా ప్రభుత్వం ప్రజలతో ఆడుకుంటున్న ఆటన్నమాట. ఇది నిజం.Source: ఏపీ న్యూస్ | 12 Aug 2009 | 1:10 am మహారాష్ట్రలో స్వైన్ ఫ్లూ వైరస్ స్వైర విహారంస్వైన్ ఫ్లూ వైరస్ మహారాష్ట్రలో స్వైర విహారం చేస్తోంది. ఈ వైరస్‌కు మరో బాలిక మృత్యువాత పడింది. పూణెలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆరేళ్ళ బాలిక బుధవారం మధ్యాహ్నం కన్నుమూసింది. దీంతో దేశ వ్యాప్తంగా స్వైన్ ఫ్లూకు మరణించిన వారి సంఖ్య 15కు చేరుకుంది.Source: జాతీయ | 12 Aug 2009 | 1:02 am శాసన సభ సభ్యత్వానికి ఎర్రబెల్లి రాజీనామాతెలుగుదేశం పార్టీకి చెందిన పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు తన శాసనసభ సభ్యత్వానికి బుధవారం రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని స్పీకర్‌కు అందజేశారు.Source: ఏపీ న్యూస్ | 12 Aug 2009 | 12:34 am ఊరుకోవయ్యా.. అసెంబ్లీ రౌడీలా ఉన్నావ్: వైఎస్రాష్ట్రానికి నాయకత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి అసెంబ్లీ సభలో నిగ్రహం కోల్పోయారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన సభ్యుడుని రౌడీగా సంబోధించారు. దీంతో ఆ సభ్యుడు మనస్తాపానికి లోనే తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు.Source: ఏపీ న్యూస్ | 12 Aug 2009 | 12:25 am పరభాషా వివాదం: కష్టాలధీరగా.. "మగధీర"వెండితెర అరంగేట్రం చేసిన రెండో చిత్రంతోనే జూనియర్ మెగాస్టార్ రేంజ్‌కు చేరుకున్న చిరంజీవి పుత్రరత్నం రాంచరణ్ తేజ్‌ను ఆరంభంలోనే అడ్డుకట్ట వేసేందుకు తెలుగు చిత్ర పరిశ్రమలో కుట్రజరుగుతున్నట్టు తేటతెల్లమవుతోంది.Source: ఏపీ న్యూస్ | 11 Aug 2009 | 11:49 pm నేడు మాపింగ్ సేవలు ప్రారంభించనున్న ఇస్రోభారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) బుధవారం మాపింగ్ సేవలు ప్రారంభించనుంది. సాధారణ పౌరులు భారత ఉపఖండంలోని ఏ ప్రాంతాన్నైనా కంప్యూటర్‌లో చూసేందుకు ఈ సేవలు ఉపయోగపడతాయి. "గూగూల్ ఎర్త్" పేరుతో ఇటువంటి సేవలు ఇప్పటికే ఇంటర్నెట్ వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. గూగుల్ ఎర్త్ ప్రపంచంలోని అన్ని ప్రాంతాలను కంప్యూటర్‌లో చూపిస్తుంది.Source: జాతీయ | 11 Aug 2009 | 10:19 pm స్వైన్ ఫ్లూ మరణాలు 13: కేసులు వెయ్యికిపైగాదేశవ్యాప్తంగా స్వైన్ ఫ్లూ కారణంగా మృతి చెందినవారి సంఖ్య 13కి చేరుకుంది. తాజాగా పూణేలో మరో మహిళ స్వైన్ ఫ్లూ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం స్వైన్ ఫ్లూ మృతుల సంఖ్య 13కి పెరిగింది. పూణే నగరంలో స్వైన్ ఫ్లూ కారణంగా ఇది ఏడో మరణమని అధికారిక వర్గాలు తెలిపాయి.Source: జాతీయ | 11 Aug 2009 | 9:43 pm తుది మెరుగుల్లో అర్చన "శివంగి"అర్చన ప్రథానపాత్రగా 'సివంగి' అనే చిత్రం షూటింగ్ పూర్తయి పోస్ట్‌ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. 'ఎవరిమాట వినదు' అనేకాప్షన్ కూడా జోడించారు. ఇందులో ఆమె ద్విపాత్రాభినయం చేస్తోంది. తెలుగు క్రియేషన్స్ పతాకంపై కృష్ణతోట దర్శకత్వంలో వి.ఆర్.బాబు నిర్మిస్తున్నారు. థ్రిల్లర్‌మంజు, అర్చన ప్రధాన తారాగణం. కృష్ణతోట మాట్లాడుతూ, "ఇంతవరకు తొమ్మిది సినిమాలకు దర్శకత్వం వహించాను. ఈ చిత్రానికి ముందు సందేశాత్మక చిత్రమైన మహాయజ్ఞం చేశాను. వృత్తిపరంగా తృప్తినిచ్చింది. ఈ చిత్రం రొమాంటిక్ ఓరియెంటెడ్ చిత్రమైనా అన్ని కమర్షియల్ హంగులూ ఉన్నాయి. సబ్జెక్ట్ బాగా రావడంతో స్క్రిప్ట్‌కు ఎక్కువ సమాయాన్ని కేటాయించాము" అన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 11 Aug 2009 | 3:20 pm టీనేజ్ నేపథ్యంతో సాగే 'యుగళ గీతం'టీనేజ్‌లో ఆవేశంకంటే ఆలోచనతో ముందడుగువేయాలనే చెప్పే పాయింట్‌తో 'యుగళగీతం' రూపొందుతోంది. జీవీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై శివాజీ దర్శకత్వంలో కవిత ఇంజేటి నిర్మిస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్‌లోని పబ్‌లో ఆర్తీపూరీతో మూడురోజులపాటు ఐటంసాగ్ చిత్రించారు. సోమవారంనుంచి అరకులో రెండు పాటల చిత్రీకరణ ప్రారంభించారు. శ్రీకర్, అభిషేక్, చందు, శివ ముప్పాళ్ళ, సోనిచరిష్టా, సబ్రినాహస్మి, లక్ష్మీచంద్రిక, అనూషలపై ఆ పాటలను స్వర్ణ మాస్టర్ నేతృత్వంలో చిత్రీకరించనున్నారు. ఈనెల 20వరకు జరిగే షూటింగ్‌తో పాటల చిత్రీకరణ పూర్తవుతుంది. 24న ఆడియోను విడుదలచేసి దసరా నాటికి సినిమాను విడుదలచేయాలనే ఆలోచనలో ఉన్నట్లు నిర్మాత తెలిపారు.Source: Yahoo! Telugu: Entertainment | 11 Aug 2009 | 11:36 am 'యు అండ్ ఐ' ఆడియో విడుదలరోహన్, అదితి జంటగా రంజిత్ బెల్లూరి దర్శకుడిగా పరిచయం చేస్తూ యశోదేవి సమర్పణలో తోట రవీందర్‌కుమార్ నిర్మిస్తున్న 'యు అండ్ ఐ' చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం సోమవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ముఖ్య అతిథి మధుయాస్కీ సీడీని విడుదలచేసి సంగీతదర్శకుడు చక్రికి అందించారు. యాస్కీ మాట్లాడుతూ, "నిర్మాత నాకు మంచి మిత్రుడు. యు.ఎస్.లో ఆయన కంపెనీకి లాయర్‌గా పనిచేశాను. అతను చేస్తున్న తొలి చిత్రం పాటలను చూశాను. ఈనాటి యూత్‌కు తగినట్లున్నాయి" అన్నారు. చక్రి మాట్లాడుతూ, "ఈ పాటలను నేను అమెరికాలో ఉన్నప్పుడు రవీందర్‌గారు విన్పించారు. చాలా బాగున్నాయి. రవీందర్‌గారు మాకు దూరపు బంధువు కూడా. నా దగ్గరకు వస్తే సంగీతదర్శకుడిగా పెట్టుకుంటారనుకున్నా. అన్నీ మాట్లాడిన తర్వాత నిర్మాణ కార్యక్రమంలో నాకు సాయం చేయండి అని అడిగారు. సంగీతంకూడా వేరే అతన్ని పెట్టుకున్నాం అని అన్నారు. ఈ చిత్ర సంగీత దర్శకుడు కార్తీక్ పాటలు విన్నాను. బావున్నాయి" అని చెప్పారు.Source: Yahoo! Telugu: Entertainment | 11 Aug 2009 | 11:20 am "ఆంజనేయులు" చిత్రానికి బొత్స ఫైనాన్షియర్!రవితేజ, నయనతార హీరో హీరోయిన్లుగా నటిస్తున్న 'ఆంజనేయులు' చిత్రానికి మంత్రి బొత్స సత్యనారాయణ ఫైనాన్షియర్‌గా వ్యవహిస్తున్నట్టు రాజధాని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఈ చిత్రం ఆగస్టు 12వ తేదీన విడుదల కానుంది.Source: ఏపీ న్యూస్ | 11 Aug 2009 | 8:35 am స్వైన్ ఫ్లూను యోగా నయం చేస్తుంది: రామ్దేవ్దేశంలో స్వైన్ ఫ్లూ మహమ్మారి వీరవిహారం చేస్తోంది. ఈ వైరస్ బారిన పడి మృత్యువాత పడిన వారి సంఖ్య మంగళవారానికి పదికి చేరింది. దీంతో దేశ ప్రజలందరూ ఆందోళన చెందుతున్నారు. అయితే.. ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్ మాత్రం.. స్వైన్ ఫ్లూను యోగా ద్వారా నయమవుతుందని చెపుతున్నారు.Source: జాతీయ | 11 Aug 2009 | 8:06 am కాయలున్న చెట్టుకు దెబ్బలు సహజం: అల్లుసాధారణంగా.. కాయలున్న చెట్టుకు దెబ్బలు తగలడం సహజమని 'మగధీర' చిత్ర నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. అంతర్జాతీయ సాంకేతిక పరిజ్ఞానంతో హాలీవుడ్ స్థాయిలో నిర్మించిన ఈ చిత్రానికి ఆది నుంచి అడ్డంకులు ఎదురవుతున్నాయని ఆయన మంగళవారం అన్నారు.Source: ఏపీ న్యూస్ | 11 Aug 2009 | 7:15 am అమెరికాలో ఏంజిలీనా జోలీ నిలువెత్తు నగ్న విగ్రహంహాలీవుడ్ నటీమణులు నగ్నంగా నటించడం కొత్తేమీ కాదు. అయితే ఆ నటీమణుల తాలూకు నగ్న విగ్రహాలను ప్రతిష్టించడం మాత్రం కొత్త ప్రక్రియే. తాజాగా అమెరికాలోని ఓక్లహోమా సిటీలో ఏంజిలీనా జోలీ నిలువెత్తు నగ్న విగ్రహం త్వరలో అమెరికాలో దర్శనమివ్వబోతోంది. కంచుతో తయారు చేస్తున్న ఏంజీలీనా నగ్న విగ్రహాన్ని శిశువుకు పాలిస్తున్నట్లుగా ఉంటుందట. న్యూయార్క్‌కు చెందిన డానియల్ ఎడ్వార్డ్ మాట్లాడుతూ, శిశువుగా పాలిస్తున్నట్లుగా తాను మలుస్తున్న ఏంజిలీనా నగ్న విగ్రహం తల్లుల్లో చైతన్యం తీసుకు వస్తుందని చెప్పాడు. ముఖ్యంగా చంటి పిల్లలకు తల్లిపాలు ఎంత ముఖ్యమో ఈ విగ్రహం తెలియజేస్తుంటున్నాడు. కాగా గత ఏడాది ఏంజిలీనా తన ఇద్దరి కవలలకు పాలిస్తున్నప్పుడు తన బాయ్‌ఫ్రెండ్ బ్రాడ్ పిట్ ఫోటో తీశాడు. ఆ ఫోటో ఆధారంగా ఈ నగ్న విగ్రహాన్ని తయారు చేస్తున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 11 Aug 2009 | 6:29 am అక్కినేని అఖిల్ సరసన శ్రీదేవి పెద్ద కూతురుఅలనాటి అతిలోక సుందరి శ్రీదేవి బాలనటిగా వెండితెర అరంగేట్రం చేసి అటు తమిళ ఇటు తెలుగు సినీ పరిశ్రమలో సుమారు రెండున్నర దశాబ్దాలపాటు సక్సస్‌ఫుల్ నటిగా రాణించింది. ఇప్పుడు తన పెద్ద కుమార్తె జాన్వీని తెలుగుతెరకు పరిచయం చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇటీవల రాధ కుమార్తె అక్కినేని నాగార్జున కుమారుడు నాగచైతన్య సరసన "జోష్" చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అక్కినేని నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ సరసన శ్రీదేవి కుమార్తె జాన్వీని నటింపజేయనున్నట్లు సమాచారం. అయితే జాన్వీ ఇంకా చిన్నపిల్లలానే ఉండటంతో మరో సంవత్సరం ఆగి అఖిల్‌తో నటింపజేయాలని శ్రీదేవి- నాగార్జున నిర్ణయించారట.Source: Yahoo! Telugu: Entertainment | 11 Aug 2009 | 5:58 am ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం: చిరంజీవిప్రజా సమస్యలపై నిరంతర పోరాటం చేసేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ప్రకటించారు. నీళ్ళు లేకుండా ప్రాజెక్టులు కట్టి ఏం లాభమని ఆయన ప్రశ్నించారు.Source: ఏపీ న్యూస్ | 11 Aug 2009 | 5:12 am దేశంలో పదికి చేరిన స్వైన్ ఫ్లూ మరణాలుదేశంలో స్వైన్ ఫ్లూ మరణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గత రెండు రోజుల్లో స్వైన్ ఫ్లూ సోకిన రోగులు ఆరు మంది మృత్యువాత పడ్డారు. అదేసమయంలో ఈ వ్యాధి మరింత వేగంగా విస్తరిస్తోంది. దేశంలో ఇప్పటి వరకు స్వైన్ ఫ్లూ బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య పదికి చేరుకుంది.Source: జాతీయ | 11 Aug 2009 | 4:56 am గ్రేటర్ పిటీషన్: 21కు వాయిదా వేసిన సుప్రీంగ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల వ్యహారంపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్‌ను సుప్రీం కోర్టు ఈనెల 21వ తేదీకి వాయిదా వేసింది. ఈ ఎన్నికలపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించిన విషయం తెల్సిందే. ఈ స్టేను తొలగించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.Source: ఏపీ న్యూస్ | 11 Aug 2009 | 4:48 am ఈ శతాబ్దపు అతిపెద్ద కరువు: ప్రణబ్ ముఖర్జీవర్షాభావ పరిస్థితుల కారణంగా దేశంలో ఎన్నడూ లేని విధంగా కరువు పరిస్థితులు నెలకొన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. ఒక విధంగా చెప్పాలంటే.. ఈ శతాబ్దపు అతిపెద్ద కరువు ఇదేనని ఆయన అభిప్రాయపడ్డారు.Source: జాతీయ | 11 Aug 2009 | 3:26 am
|