49 పాయింట్ల లాభంతో సెన్సెక్స్

స్టాక మార్కెట్ ప్రస్తుతం 49 పాయింట్లు లాభంతో పయనిస్తుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 15,059 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 35 పాయింట్లు లాభపడి 4,473 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.33 శాతం, నిఫ్టీ 0.79 శాతం మేరకు వృద్ధి చెందాయి.
Source: Yahoo! Telugu: News | 11 Aug 2009 | 9:42 am

మూడుసార్లు పాక్ అణు కేంద్రాలపై దాడులు

పాకిస్థాన్‌లోని అణు కేంద్రాలపై తీవ్రవాదులు గత రెండేళ్లలో మూడుసార్లు దాడులు చేశారు. పాక్ వద్ద ఉన్న అణ్వాయుధాలను తాము ఆధీనంలోకి తీసుకుంటామని తాలిబాన్, అల్ ఖైదా తీవ్రవాద సంస్థలు గతంలో పలుమార్లు బెదిరించిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్ అణ్వాయుధాలు తీవ్రవాదుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు కూడా వ్యక్తమయ్యాయి.
Source: Yahoo! Telugu: News | 11 Aug 2009 | 9:19 am

ఈ శతాబ్దపు అతిపెద్ద కరువు: ప్రణబ్ ముఖర్జీ

వర్షాభావ పరిస్థితుల కారణంగా దేశంలో ఎన్నడూ లేని విధంగా కరువు పరిస్థితులు నెలకొన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. ఒక విధంగా చెప్పాలంటే.. ఈ శతాబ్దపు అతిపెద్ద కరువు ఇదేనని ఆయన అభిప్రాయపడ్డారు.
Source: Yahoo! Telugu: News | 11 Aug 2009 | 8:54 am

లాభాలతో కొనసాగుతున్న సెన్సెక్స్

స్టాక్ మార్కెట్ ప్రస్తుతం లాభాలతో కొనసాగుతుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 160 పాయింట్లు పుంజుకుని 15,170 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 43 పాయింట్లు లాభపడి 4,480 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.60 శాతం, నిఫ్టీ 0.96 శాతం మేరకు వృద్ధి చెందాయి.
Source: Yahoo! Telugu: News | 11 Aug 2009 | 8:35 am

4.7 శాతం తగ్గనున్న వ్యవసాయ ఉత్పత్తి!

రుతుపవనాలు ప్రభావవంతంగా లేకపోవడంతో 2009-10 సంవత్సరంలో దేశంలో వ్యవసాయ ఉత్పత్తి 4.7 శాతం మేరకు క్షీణించనున్నట్లు భారత ఆర్థిక వ్యవస్థ పర్యవేక్షణ కేంద్రం (సీఎంఐఈ) అంచనా వేస్తోంది. అలాగే ఇదే సంవత్సరంలో ఆహారధాన్యాలు 5.6 శాతం మేరకు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వెల్లడించింది.
Source: Yahoo! Telugu: News | 11 Aug 2009 | 8:01 am

అమెరికాపై దాడికి 9/11 కుట్రదారుల ప్రణాళికలు

అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉన్న వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై సెప్టెంబరు 11, 2001న జరిగిన దాడికి కుట్రపన్నినవారు తమ దేశంపై మళ్లీ దాడి చేసేందుకు వ్యూహరచన చేస్తూనే ఉన్నారని ఆ దేశ అధ్యక్ష భవన ప్రతినిధులు పేర్కొన్నారు. వైట్‌హోస్ ప్రతినిధులు సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ఈ అనుమానం వెలిబుచ్చారు.
Source: Yahoo! Telugu: News | 11 Aug 2009 | 7:27 am

లాభాల్లో పయనిస్తున్న స్టాక్ మార్కెట్

స్టాక్ మార్కెట్ ప్రస్తుతం లాభాల్లో పయనిస్తుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 140 పాయింట్లు పుంజుకుని 15,150 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 50 పాయింట్లు నష్టపోయి 4,488 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.93 శాతం, నిఫ్టీ 1.13 శాతం మేరకు వృద్ధి చెందాయి.
Source: Yahoo! Telugu: News | 11 Aug 2009 | 7:25 am

విజయనగరంలో "మగధీర" ప్రదర్శనపై బ్యాన్

విజయనగరం జిల్లాలో 'మగధీర' చిత్ర ప్రదర్శనను నిలిపి వేశారు. థియేటర్లలో భద్రతా, రక్షణ ప్రమాణాలు సరిగా లేవని చిత్ర ప్రదర్శనను జిల్లా వ్యాప్తంగా నిషేధిస్తున్నట్టు రాష్ట్ర పంచాయతీ రాజ్‌శాఖామంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఈ విషయంపై ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు.
Source: Yahoo! Telugu: News | 11 Aug 2009 | 7:23 am

అమెరికా, ఆసియా స్టాక్ మార్కెట్లు

అమెరికా స్టాక్ మార్కెట్లు.. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ ఇండెక్స్ - 0.54 శాతంతో 50.56 పాయింట్లు బలహీనపడి 9,319.51 వద్దకు చేరుకుంది. స్టాండార్డ్ అండ్ పూర్ 400 ఇండెక్స్ - 0.58 శాతంతో 5.88 పాయింట్లు నష్టపోయి 1,004.60 వద్దకు చేరుకుంది. నాస్‌డాక్ కంపోజిట్ ఇండెక్స్ - 0.63 శాతంతో 12.65 పాయింట్లు కోల్పోయి 1,987.60 వద్దకు చేరుకుంది. ఆసియా స్టాక్ మార్కెట్లు.. ఆసియా స్టాక్ మార్కెట్లు లాభాల్లో పయనిస్తున్నాయి. హాంగ్ సెంగ్ - 86 పాయింట్లు లాభపడి 21,016 వద్దకు చేరుకుంది. నిక్కీ - 25 పాయింట్లు పుంజుకుని 10,549 వద్దకు చేరుకుంది. షాంఘై - 12 పాయింట్లు బలపడి 3,261 వద్దకు చేరుకుంది. సియోల్ కంపోజిట్ - 1,577 వద్ద స్థిరంగా పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 11 Aug 2009 | 6:58 am

తైవాన్‌లో వరదలు: వందలాది మంది మృతి

దక్షిణ తైవాన్‌లో తపాను కారణంగా ఏర్పడిన వరదలు భీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ గ్రామంపై కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనలో వందలాది మంది పౌరులు సజీవ సమాధి అయ్యారు. వరదల కారణంగా అనేక ఇళ్లు, పాఠశాలలు నేలమట్టమయ్యాయని పోలీసులు చెప్పారు. శిథిలాల కింద వందలాది పౌరులు ఇరుక్కుపోయారని వెల్లడించారు.
Source: Yahoo! Telugu: News | 11 Aug 2009 | 6:57 am

అమెరికాలో ఏంజిలీనా జోలీ నిలువెత్తు నగ్న విగ్రహం

హాలీవుడ్ నటీమణులు నగ్నంగా నటించడం కొత్తేమీ కాదు. అయితే ఆ నటీమణుల తాలూకు నగ్న విగ్రహాలను ప్రతిష్టించడం మాత్రం కొత్త ప్రక్రియే. తాజాగా అమెరికాలోని ఓక్లహోమా సిటీలో ఏంజిలీనా జోలీ నిలువెత్తు నగ్న విగ్రహం త్వరలో అమెరికాలో దర్శనమివ్వబోతోంది. కంచుతో తయారు చేస్తున్న ఏంజీలీనా నగ్న విగ్రహాన్ని శిశువుకు పాలిస్తున్నట్లుగా ఉంటుందట. న్యూయార్క్‌కు చెందిన డానియల్ ఎడ్వార్డ్ మాట్లాడుతూ, శిశువుగా పాలిస్తున్నట్లుగా తాను మలుస్తున్న ఏంజిలీనా నగ్న విగ్రహం తల్లుల్లో చైతన్యం తీసుకు వస్తుందని చెప్పాడు. ముఖ్యంగా చంటి పిల్లలకు తల్లిపాలు ఎంత ముఖ్యమో ఈ విగ్రహం తెలియజేస్తుంటున్నాడు. కాగా గత ఏడాది ఏంజిలీనా తన ఇద్దరి కవలలకు పాలిస్తున్నప్పుడు తన బాయ్‌ఫ్రెండ్ బ్రాడ్ పిట్ ఫోటో తీశాడు. ఆ ఫోటో ఆధారంగా ఈ నగ్న విగ్రహాన్ని తయారు చేస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 11 Aug 2009 | 6:29 am

అక్కినేని అఖిల్ సరసన శ్రీదేవి పెద్ద కూతురు

అలనాటి అతిలోక సుందరి శ్రీదేవి బాలనటిగా వెండితెర అరంగేట్రం చేసి అటు తమిళ ఇటు తెలుగు సినీ పరిశ్రమలో సుమారు రెండున్నర దశాబ్దాలపాటు సక్సస్‌ఫుల్ నటిగా రాణించింది. ఇప్పుడు తన పెద్ద కుమార్తె జాన్వీని తెలుగుతెరకు పరిచయం చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇటీవల రాధ కుమార్తె అక్కినేని నాగార్జున కుమారుడు నాగచైతన్య సరసన "జోష్" చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అక్కినేని నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ సరసన శ్రీదేవి కుమార్తె జాన్వీని నటింపజేయనున్నట్లు సమాచారం. అయితే జాన్వీ ఇంకా చిన్నపిల్లలానే ఉండటంతో మరో సంవత్సరం ఆగి అఖిల్‌తో నటింపజేయాలని శ్రీదేవి- నాగార్జున నిర్ణయించారట.
Source: Yahoo! Telugu: Entertainment | 11 Aug 2009 | 5:58 am

ఈ శతాబ్దపు అతిపెద్ద కరువు: ప్రణబ్ ముఖర్జీ

వర్షాభావ పరిస్థితుల కారణంగా దేశంలో ఎన్నడూ లేని విధంగా కరువు పరిస్థితులు నెలకొన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. ఒక విధంగా చెప్పాలంటే.. ఈ శతాబ్దపు అతిపెద్ద కరువు ఇదేనని ఆయన అభిప్రాయపడ్డారు.
Source: జాతీయ | 11 Aug 2009 | 3:26 am

విజయనగరంలో "మగధీర" ప్రదర్శనపై బ్యాన్

విజయనగరం జిల్లాలో 'మగధీర' చిత్ర ప్రదర్శనను నిలిపి వేశారు. థియేటర్లలో భద్రతా, రక్షణ ప్రమాణాలు సరిగా లేవని చిత్ర ప్రదర్శనను జిల్లా వ్యాప్తంగా నిషేధిస్తున్నట్టు రాష్ట్ర పంచాయతీ రాజ్‌శాఖామంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఈ విషయంపై ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు.
Source: ఏపీ న్యూస్ | 11 Aug 2009 | 1:55 am

జమ్మూలో నలుగురు మిలిటెంట్ల ఎన్‌కౌంటర్

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో మంగళవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మిలిటెంట్లు హతమయ్యారు. జమ్మూకు 110 కిలోమీటర్ల దూరంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. రేసీ జిల్లాలోని మోరా-లుథెర్ సెక్టార్‌లో భద్రతా బలగాలకు చెందిన ప్రత్యేక బృందం గాలింపు చర్యలు చేపట్టింది.
Source: జాతీయ | 11 Aug 2009 | 1:15 am

నేడు కరీంనగర్‌లో ప్రరాపా ఆధ్వర్యంలో ధర్నా

గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణాన్ని నిరశిస్తూ ప్రజారాజ్యం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా జరుగనుంది. కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జరిగే ఈ ధర్నాకు ఆ పార్టీ అధినేత చిరంజీవి హాజరవుతున్నారు.
Source: ఏపీ న్యూస్ | 11 Aug 2009 | 12:58 am

అండమాన్‌‌లో భూకంపం: భయం భీతిలో ప్రజలు

అండమాన్‌, నీకోబార్‌ దీవుల్లో భూకంపం సంభవించింది. సుమారు 20 నుంచి 30 సెకన్ల పాటు భూమి కంపించటంతో ప్రజలు భయంతో అల్లాడిపోయారు. ప్రాణాలను అరచేతిలో పట్టుకుని నివాసలను వదిలిపెట్టి బయటకు పరుగులు తీశారు. భూకంప తీవ్రత 7.6గా నమోదైంది.
Source: జాతీయ | 11 Aug 2009 | 12:47 am

హర్యానాలోనూ అంటువ్యాధుల చట్టం ప్రవేశం

దేశంలో భయాందోళనలు సృష్టిస్తున్న స్వైన్ ఫ్లూ వ్యాధిని అడ్డుకునేందుకు హర్యానా రాష్ట్ర ప్రభుత్వం అంటువ్యాధుల చట్టం 1897ని అమల్లోకి తెచ్చింది. దేశంలో ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చిన మూడో రాష్ట్రం పర్యానా. ఇప్పటికే ఢిల్లీ, మహారాష్ట్ర ప్రభుత్వాలు ప్రమాదకర స్వైన్ ఫ్లూ వ్యాధిపై పోరాడేందుకు ఈ చట్టాన్ని ఆశ్రయించాయి.
Source: జాతీయ | 11 Aug 2009 | 12:24 am

మూడు రోజుల్లోగా గ్రూపు- 2 తుది జాబితా

కిందటేడాది నిర్వహించిన గ్రూప్‌-2 రాతపరీక్ష తుది ఫలితాలు మరో మూడు రోజుల్లోగా విడుదల కానున్నాయి. తుది ఫలితాలు రెండు, మూడు రోజుల్లోగా ప్రకటించేందుకు ఎపీపీఎస్‌సీ సన్నాహాలు చేస్తోంది. ఈ జాబితా ఇప్పటికే ఆలస్యమైన సంగతి తెలిసిందే. దీని ద్వారా నిరుద్యోగులలో సహనం నశిస్తోంది.
Source: ఏపీ న్యూస్ | 10 Aug 2009 | 11:59 pm

మావోలపై నిషేధం మరో ఏడాది పొడిగింపు

మావోయిస్టులపై నిషేధాన్ని మరో ఏడాదిపాటు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ తిరుగుబాటు సంస్థలపై నిషేధాన్ని మరో ఏడాది పొడిగిస్తూ ప్రభుత్వం సోమవారం నిర్ణయం తీసుకుంది. మావోయిస్టులతో పాటు వారి అనుబంధంగా పనిచేస్తున్న 6 ప్రధాన సంస్థలపై నిషేధాన్ని పొడిగించారు.
Source: ఏపీ న్యూస్ | 10 Aug 2009 | 11:51 pm

అసెంబ్లీ సమావేశాలు: తెదేపా సభ్యుల సస్పెన్షన్

అసెంబ్లీ శాసనసభ సమావేశాల్లో భాగంగా మంగళవారం జరిగిన కార్యకలాపాలకు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ సభ్యులు అడ్డుకున్నారు. దీంతో ఆ పార్టీకి చెందిన 44 మంది సభ్యులను స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి సస్పెండ్ చేశారు.
Source: ఏపీ న్యూస్ | 10 Aug 2009 | 11:23 pm

ప్రాంతీయ పార్టీలతో కాంగ్రెస్‌కు పొత్తులుండవు

ఆర్జేడీ, ఎల్జేపీ వంటి ప్రాంతీయ పార్టీలతో కాంగ్రెస్‌కు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు ఉండవని బీహార్ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌ఛార్జి జగదీష్ టైట్లర్ స్పష్టం చేశారు. బీహార్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ప్రతిపక్షంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు ఆర్జేడీ, ఎల్జేపీలతో తాము ఈ ఎన్నికల కోసం పొత్తులు పెట్టుకోమని టైట్లర్ స్పష్టం చేశారు.
Source: జాతీయ | 10 Aug 2009 | 10:39 pm

స్వైన్ ఫ్లూతో మహారాష్ట్రలో మరో బాలిక మృతి

దేశంలో స్వైన్ ఫ్లూ మరో ప్రాణాన్ని బలిగొంది. తాజాగా ఓ 13 ఏళ్ల బాలిక స్వైన్ ఫ్లూ బారినపడి ప్రాణాలు కోల్పోయింది. ఆమె మరణంతో దేశవ్యాప్తంగా స్వైన్ ఫ్లూ మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. పూణేలోని అహల్యాదేవి పాఠశాలలో చదువుతున్న శృతి గవాడే అనే బాలికకు స్వైన్ ఫ్లూ సోకింది. ఈ ప్రమాదకర వ్యాధి మంగళవారం వేకువజామున ఆమె ప్రాణాలు తీసింది.
Source: జాతీయ | 10 Aug 2009 | 9:51 pm

రామ్ గోపాల్ వర్మ"అడవి"లో కలెక్షన్ల వర్షం..!

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన "అడవి" చిత్రాన్ని తెలుగులో నిర్మించిన నిర్మాత నట్టికుమార్, వర్మ తదుపరి చిత్రమైన "రక్తచరిత్ర"ను కూడా తానే తెలుగులోకి అనువదిస్తున్నట్లు చెప్పారు. సెప్టెంబర్ పదోతేదీన ఈ చిత్రం షూటింగ్ లాంఛనంగా ప్రారంభమవుతుందని నట్టి కుమార్ అన్నారు. ఇప్పటికే మహిళా సంఘాలకు వర్మ "రక్తచరిత్ర"పై కన్ను పడిందని, దీనికి ఈ చిత్రాన్ని బ్యాన్ చేయాలని ఆ సంఘాలు స్టేట్‌మెంట్ ఇవ్వడం హేయమైందని నిర్మాత వెల్లడించారు. ఇప్పటికే విడుదలై థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తోన్న వర్మ "అడవి" కలెక్షన్ల వర్షం కురిపిస్తుందని నట్టి కుమార్ అన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 10 Aug 2009 | 1:32 pm

ఎన్టీఆర్‌కు ఆ యాక్సిడెంట్ సమీరాతోనే అయ్యిందట!

ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేసి ఎన్టీఆర్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. గాయాల నుంచి పూర్తిగా కోలుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం సినిమా షూటింగ్‌లలో బిజీబిజీగా ఉన్నారు. తాజాగా ఎన్టీఆర్‌తో పలువురు అగ్రనిర్మాతలు సినిమాలు తీయడానికి ముందుకు వచ్చారు. తాజాగా అశ్వనీదత్‌ చిత్రంలో తనతో నటించేందుకు సమీరారెడ్డి పేరును ఎన్‌.టి.ఆర్‌. ప్రపోజ్‌చేసినట్లు తెలిసింది. "నరసింహుడు" చిత్రంలో వీరిద్దరిపై రకరకాలు రూమర్స్‌ వచ్చాయి. ఆ తర్వాత సమీరా ముంబై వెళ్ళిపోవడం జరిగింది. కానీ అక్కడ సమీరాకు సరైన సినిమాలు లేకపోవడంతో మళ్ళీ ఎన్టీఆర్‌ను ఆశ్రయించడం జరిగిందని సమాచారం. ఇందులో ట్విస్ట్‌ ఏమంటే.... ఎన్నికల సమయంలో ఎన్‌.టి.ఆర్‌. మందుకొట్టి కారుడ్రైవర్‌చేసి యాక్సిడెంట్‌కు గురికాలేదనీ, సమీరారెడ్డి విమానంలో వేరే దేశం వెళుతూ.. హైదరాబాద్‌లో కాసేపు ఆగతుందని చెప్పడంతో.. ఆమె కోసమే ఎన్‌.టి.ఆర్‌. కారును స్పీడ్‌గా డ్రైవ్‌చేసి చెట్టుకు ఢీకొని తీవ్రగాయాలకు గురైనట్లు ఫిలింనగర్‌ వర్గాల గుసగుసలాడుకుంటున్నాయి. మరి సమీరాకు కొడాలి నాని సినిమాలో ఎన్టీఆర్ ఛాన్స్ ఇప్పిస్తారో? లేదో? వేచి చూడాల్సిందే..!.
Source: Yahoo! Telugu: Entertainment | 10 Aug 2009 | 1:08 pm

"మగధీర" పాటపై అల్లు అరవింద్ ఇంటి ముందు వంగపండు

తాను రాసిన 'ఏ పిల్లో ఎల్దమొస్తవా...' అనే పాటను మగధీర చిత్రంలో అసభ్యకర సన్నివేశంలో వాడడంపై విప్లవ రచయిత వంగపండు ప్రసాదరావు ఆక్షేపించారు. ఆ సన్నివేశంలో ఉన్న పాటను వెంటనే తొలగించాలనీ చిత్ర నిర్మాత అల్లుఅరవింద్‌ను డిమాండ్‌ చేశారు. సోమవారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్‌లోని అల్లు అరవింద్‌ ఇంటిముందు తన కళాకారులతో ప్రదర్శనగావచ్చి తన నిరసన తెలిపారు. తన డిమాండ్‌ను అమలు చేయకపోతే హైకోర్టును ఆశ్రయిస్తానని ఆయన తేల్చిచెప్పారు.
Source: Yahoo! Telugu: Entertainment | 10 Aug 2009 | 12:30 pm

అక్షరం మారితే.. అదృష్టం వస్తుందా..?

కాలం కలిసి రాకపోతే పేర్లను మార్పు చేసుకుని ట్రై చేసిన నటీనటులు, దర్శకులు, నిర్మాతలు సినీ పరిశ్రమలో బోలెడు మంది కన్పిస్తారు. అసలు పేరును మార్చేసి కొసరి పేరుతో తెలుగు ఇండస్ట్రీలో మెలిగేవాళ్లూ చాలామంది ఉన్నారు. తాజాగా కథానాయిక ఆషాషైనీ విషయానికొస్తే.. ఫ్లోరా శైనీగా తన పేరును మార్చుకుని, ఆ తర్వాత అదీ కలసి రాకపోవడంతో 'మయూరి'గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా "మనసంతా నువ్వే" ఫేమ్‌ రీమాసేన్‌ తన పేరులోని ఇంగ్లీషు అక్షరాల్లో ఇంకో 'ఎమ్‌'ని అదనంగా చేర్చేసుకుంది. ఈ పేరు మార్చుకున్న తర్వాత ఇటీవలే ఓ ఫంక్షన్‌కు రీమాసేన్ హాజరైందట. ఆ ఫంక్షన్‌లో స్లీవ్‌లెస్‌ అందాల్ని ప్రదర్శించి అందరిచేత 'వావ్‌' అనిపించేలా చేసిందట. మరి రీమాసేన్‌కు ఈ రకంగా పేరు వచ్చిందన్నమాట..!
Source: Yahoo! Telugu: Entertainment | 10 Aug 2009 | 8:15 am

స్వైన్ ఫ్లూ విజృంభణ: పూణెలో రెడ్ అలెర్ట్

స్వైన్ ఫ్లూ వైరస్ విజృంభణ కారణంగా పూణెలో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. ఈ మహమ్మారిని నివారించడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టిన విషయం తెల్సిందే. దేశంలోని నగరాల్లో కంటే.. పూణెలోనే స్వైన్ ఫ్లూ రోగుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ వ్యాధి బారిన పడిన రోగుల్లో నలుగురు ఇప్పటికే మరణించారు
Source: జాతీయ | 10 Aug 2009 | 7:33 am

బాలీవుడ్‌ సినిమాలో మాజీ రాష్ట్రపతి...!

భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ తాజాగా బాలీవుడ్ చిత్రంలో నటించనున్నారు. ఆయన "మై కలామ్ హూఁ ". అన్న పేరుగల సినిమాలో నటించనున్నారు. దేశంలో ప్రముఖ శాస్త్రజ్ఞులలో డాక్టర్ కలామ్ ఒకరు. తన పాత్రను తానే పోషించడం ఈ చిత్రంలోని విశేషం.
Source: Yahoo! Telugu: Entertainment | 10 Aug 2009 | 5:31 am

ప్రకృతి కోక కుచ్చిళ్ల మడతల్లాంటి సౌందర్యం...!

అక్కడ ప్రకృతి పచ్చంచు కోక కట్టిన కొండపడుచులా కనిపిస్తుంటుంది. అక్కడి కొండల ముడుతలన్నీ ఆ పచ్చంచు కోక కుచ్చిళ్ల మడతల్లాగా అనిపిస్తుంటాయి. సమస్త మానవాళికి వెలుగును ప్రసాదించే సూర్యభగవానుడి లేలేత కిరణాలు పరచుకున్న ఇక్కడి పచ్చటి ఆకుల స్పర్శను, వాటిపైనుంచి వీచే కొండగాలిని ఆస్వాదించాలంటే... మహారాష్ట్రలోని మహాబలేశ్వర్‌కు వెళ్లాల్సిందే...!!
Source: వినోదం | 10 Aug 2009 | 5:24 am

ప్రరాపా రాజకీయ వ్యవహారాల కమిటీ వెల్లడి

ప్రజారాజ్యం పార్టీ రాజకీయ వ్యవహారాలను చూసేందుకు కొత్త కమిటీని సోమవారం ప్రకటించింది. ఎన్నికల ఫలితాల అనంతరం ఆ పార్టీ అన్ని రకాల అనుబంధ కమిటీలను రద్దు చేసిన విషయం తెల్సిందే. ఆ తర్వాత పార్టీ నేతలతో కూలకుషంగా చర్చలు జరిపి, ఒక్కో కమిటీని ఏర్పాటు చేస్తోంది.
Source: ఏపీ న్యూస్ | 10 Aug 2009 | 5:23 am

నయనతో ముద్దు.. త్రిషతో డేటింగ్...‌!!?

"వల్లభ" సినిమా ద్వారా అందాల ముద్దుగుమ్మ నయనతారను "శింబు" వాడుకుని వదిలేశాడని సినీ జనం గుసగుసలాడుకుంటే.. తాజాగా "వల్లభ" రూటు మార్చాడట. ప్రముఖ దర్శకుడు గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఓ తమిళ చిత్రంలో శింబు, త్రిష జంటగా నటిస్తున్నారు. ఈ షూటింగ్‌లో ఇద్దరి మధ్య అవగాహన కుదిరిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. వీరిద్దరు ప్రేమలో పడ్డారని కూడా సినీజనం అనుకుంటున్నారు. గతంలో నయనతారను ఇలాగే ముద్దు వ్యవహరంలో దించి, ఆ తర్వాత శింబు వదిలేశాడని ఇండస్ట్రీలో టాక్. ఈ నేపథ్యంలో నీకు కూడా అదే గతి పడుతుందేమో? జాగ్రత్త అని త్రిషకు ఆమె సన్నిహితులు చెప్పారట. కానీ శింబుచాలా మంచివాడని త్రిష సమర్థించిందట.
Source: Yahoo! Telugu: Entertainment | 10 Aug 2009 | 5:18 am

కేసీఆర్ అనుమతి అక్కర్లేదు: విజయశాంతి

తన నియోజకవర్గం ప్రజలను కలుసుకునేందుకు తెరాస అధినేత కె.చంద్రశేఖర రావు అనుమతి అక్కర్లేదని ఆ పార్టీ రెబల్ నేత, మెదక్ ఎంపీ విజయశాంతి స్పష్టం చేశారు. దేవుడు కరుణించినప్పుడే తెలంగాణ వస్తుందని ఆమె ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
Source: ఏపీ న్యూస్ | 10 Aug 2009 | 5:07 am

బీహార్: కరువు కోరల్లో చిక్కుకున్న 26 జిల్లాలు

బీహార్ ప్రభుత్వం 26 జిల్లాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. రాష్ట్రంలోని మొత్తం 38 జిల్లాల్లో సగానికిపైగా జిల్లాలు కరువు కోరల్లో చిక్కుకున్నాయని ప్రభుత్వం వెల్లడించింది. సోమవారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అనంతరం ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.
Source: జాతీయ | 10 Aug 2009 | 4:29 am

అక్షరం మారితే.. అదృష్టం వస్తుందా..?

కాలం కలిసి రాకపోతే పేర్లను మార్పు చేసుకుని ట్రై చేసిన నటీనటులు, దర్శకులు, నిర్మాతలు సినీ పరిశ్రమలో బోలెడు మంది కన్పిస్తారు. అసలు పేరును మార్చేసి కొసరి పేరుతో తెలుగు ఇండస్ట్రీలో మెలిగేవాళ్లూ చాలామంది ఉన్నారు. తాజాగా కథానాయిక ఆషాషైనీ విషయానికొస్తే.. ఫ్లోరా శైనీగా తన పేరును మార్చుకుని, ఆ తర్వాత అదీ కలసి రాకపోవడంతో 'మయూరి'గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా "మనసంతా నువ్వే" ఫేమ్‌ రీమాసేన్‌ తన పేరులోని ఇంగ్లీషు అక్షరాల్లో ఇంకో 'ఎమ్‌'ని అదనంగా చేర్చేసుకుంది. ఈ పేరు మార్చుకున్న తర్వాత ఇటీవలే ఓ ఫంక్షన్‌కు రీమాసేన్ హాజరైందట. ఆ ఫంక్షన్‌లో స్లీవ్‌లెస్‌ అందాల్ని ప్రదర్శించి అందరిచేత 'వావ్‌' అనిపించేలా చేసిందట. మరి రీమాసేన్‌కు ఈ రకంగా పేరు వచ్చిందన్నమాట..!
Source: వినోదం | 10 Aug 2009 | 2:49 am

చెన్నయ్‌లో బాలుడు.. పూణెలో డాక్టరు మృతి

దేశంలో స్వైన్ మరణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. సోమవారం ఉదయం మరో ఇద్దరు రోగులు మరణించారు. వీరిలో ఒకరు 35 సంవత్సరాల ఆయుర్వేద డాక్టరు కాగా, మరొకరు నాలుగేళ్ళ బాలుడు ఉన్నాడు.
Source: జాతీయ | 10 Aug 2009 | 2:47 am

కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్: ముగ్గురు తీవ్రవాదుల హతం

జమ్ము- కాశ్మీర్ రాష్ట్రంలోని రెయాసి జిల్లాలో భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు తీవ్రవాదులు హతమయ్యారు. సోమవారం ఇక్కడ భద్రతా దళాలకు, తీవ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయని పోలీసులు చెప్పారు.
Source: జాతీయ | 10 Aug 2009 | 2:43 am